ashok chavan
-
మామా అల్లుళ్ల సవాల్, నువ్వా..నేనా? అంటూ కూతురు, చివరికి!
మహారాష్ట్రలో ఇటీవల 288 అసెంబ్లీ నియోజక వర్గాలకు జరిగిన ఎన్నికల్లో అనేక చోట్ల వివిధ రాజకీయ పార్టీలకు చెందిన బడా నాయకులు తమ కుటుంబ సభ్యులను బరిలోకి దింపారు. వార్డుల పునర్విభజన తరువాత తమకు ఓటు బ్యాంకు ఉన్న నియోజక వర్గాలు పక్కనున్న నియోజక వర్గాల్లోకి వెళ్లిపోవడం, కొన్ని నియోజక వర్గాలు వివిధ కులాలకు, మహిళలకు రిజర్వుడు కావడంతో రాజకీయ అనుభమున్న సీనియర్ నేతలకు పోటీచేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో గత్యంతరం లేక అనేక మంది నేతలు, మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ భార్యలను లేదా కుటుంబ సభ్యులను బరిలోకి దింపాల్సి వచ్చింది. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన పలువురు అభ్యర్ధులు విజయ ఢంకా మోగించారు.అనేక చోట్ల భార్యలు, కూతుళ్లు, సొంత సోదరులు, సోదరీమణులు, మామా, అల్లుడు, కోడళ్లు ఇలా దగ్గరి బంధువులు వివిధ పార్టీల టికెట్లపై లేదా ఇండి పెండెంట్లుగా బరిలోకి దిగారు. కొన్ని చోట్ల ఓడిపోయినప్పటికీ అనేక చోట్ల గెలిచారు. ఓటమి బాధించినా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఎమ్మెల్యే కావడం వారిలో సంతోషాన్ని నింపింది. మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత జరిగే మంత్రివర్గ విస్తరణలో వీరిలో కొంతమందికి చోటు దక్కే అవకాశముండటంతో తమ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ప్రభుత్వంలో కొనసాగుతారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బారామతిలో మామా అల్లుళ్ల పోటీకాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన ఇద్దరు అన్నదమ్ముల్లో అమిత్ దేశ్‌ముఖ్ విజయం సాధించగా, లాతూర్ రూరల్ నియోజక వర్గంలో పోటీచేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ధీరజ్ దేశ్‌ముఖ్ ఓటమి పాలయ్యారు. అదేవిధంగా ముంబై రీజియన్ బీజేపీ అధ్యక్షుడు ఆశీష్ శేలార్ పశ్చిమమ బాంద్రా నియోజక వర్గంలో గెలిచారు. కానీ ఆయన సోదరుడు వినోద్ శేలార్ పశ్చిమ మలాడ్ నియోజక వర్గంలో ఓడిపోయారు. మాజీ మంత్రి అనీల్ దేశ్‌ముఖ్ తనయుడు సలిల్ దేశ్‌ముఖ్ కాటోల్ నియోజక వర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. కానీ ఆయన సోదరుడి కొడుకు ఆశీష్ దేశ్‌ముఖ్ సావనేర్ నియోజక వర్గంలో గెలిచారు. అనీల్ దేశ్‌ముఖ్ సొంత మేనల్లుడు, ఎంపీ అమర్ కాళే సతీమణి మయురా కాళే ఆర్వీ నియోజక వర్గంలో ఓటమిని చవిచూశారు. మంత్రి ఛగన్ భుజబల్ యేవలాలో గెలిచారు. కానీ ఆయన మేనల్లుడు సమీర్ భుజబల్ నాంద్గావ్లో పరాజయం పాలయ్యారు. బహుజన్ వికాస్ ఆఘాడి నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే హితేంద్ర ఠాకూర్ వసాయ్‌లో, ఆయన తనయుడు క్షితిజ్ ఠాకూర్ నాలాసోపారాలో ఓడిపోయారు. అదేవిధంగా అజిత్ పవార్ వర్గానికి చెందిన ఇంద్రనీల్ నాయిక్ పుసద్ నియోజక వర్గంలో గెలిచారు. కానీ ఆయన సోదరుడు యయాతీ (ఇండిపెండెంట్) కారంజాలో ఓడిపోయారు. ఇక బారామతిలో మేనమామ, మేనల్లుడు మధ్య పోరు జరిగింది. వీరిలో మామ అజిత్ పవార్ గెలుపొందగా, మేనల్లుడు యుగేంద్ర పరాజయం పాలయ్యారు. న్యూ ముంబైలోని ఏరోలీలో తండ్రి, కొడుకుల మధ్య పోరు జరిగింది. వీరిలో తండ్రి, మాజీ మంత్రి గణేశ్ నాయిక్ (బీజేపీ) గెలుపొందగా, తనయుడు సందీప్ నాయిక్ బేలాపూర్‌లో ఎస్పీ వర్గం టికెట్‌పై పోటీచేసి ఓడిపోయారు. ఆయన్ని బీజేపీ అభ్యర్ధి మందా మాత్రే ఓడించారు. బోకర్‌లో తండ్రిపై కుమార్తె విజయంగడ్చిరోలీ జిల్లా అహేరీ నియోజక వర్గం ఎన్సీపీ(ఏపీ) అభ్యర్థి, మంత్రి ధర్మరావ్బాబా ఆత్రం తన సొంత కూతురు భాగ్యశ్రీ ఆత్రంను ఓడించారు. భాగ్యశ్రీ ఇండిపెండెంట్‌గా, తండ్రికి ప్రత్యర్ధిగా పోటీ చేశారు. భాగశ్రీతోపాటు ఆయన మేనల్లుడైన అంబరీష్ రాజే ఆత్రం కూడా ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓడిపోయారు. అయినప్పటికీ కుటుంబంలో ఒకరు ఎమ్మెల్యే కావడం విశేషం. మరోవైపు నాందేడ్ జిల్లా లోహా నియోజక వర్గం నుంచి ఎన్సీపీ(ఏపీ) తరపున పోటీచేసిన మాజీ ఎంపీ ప్రతాప్‌రావ్ పాటిల్ చిఖిలీకర్ స్వయాన తన సోదరి ఆశా శిందేను ఓడించారు. మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌ను ఆయన సొంత కూతురు శ్రీజయ బోకర్ నియోజక వర్గంలో ఓడించారు. ఆమె బీజేపీ టికెట్‌పై పోటీ చేశారు. బోకర్ నియోజక వర్గం అశోక్ చవాన్‌కు గట్టిపట్టున్న ప్రాంతంగా పేరు పొందింది. పారంపర్యంగా వస్తున్న గెలుపును మళ్లీ చేజిక్కించుకునేందుకు ఆయన ఎంతో ప్రయత్నం చేశారు. కానీ కూతురు చేతిలో చవాన్ ఓడిపోక తప్పలేదు. అయినప్పటికీ కుటుంబంలో ఒకరు ఎమ్మెల్యే అయ్యారు. ఎన్సీపీ(ఏపీ) ప్రదేశ్ అధ్యక్షుడు, ఎంపీ సునీల్ తట్కరే కుమార్తై, రాష్ట్ర క్యాబినెట్ మంత్రి అదితీ తట్కరే శ్రీవర్ధన్ నియోజక వర్గంలో ఆయన్ని ఓడించారు. చదవండి: ఈవీఎంలపై కట్టలు తెంచుకున్న జనాగ్రహం.. కరెక్టేనా?కాగా బోకర్, శ్రీవర్ధన్ రెండు చోట్ల కుమార్తైలు తండ్రులను ఓడించడం విశేషం. మరోవైపు ఆదివాసి సంక్షేమ శాఖ మంత్రి విజయ్‌కుమార్ గావిత్ నందుర్బార్ నియోజక వర్గంలో భారీ మెజారిటీతో గెలిచారు. కాని ఆయన ఇద్దరు సొంత సోదరులైన రాజేంద్రకుమార్ గావిత్ (కాంగ్రెస్) శహదా నియోజక వర్గంలో, శరద్ గావిత్ (ఇండిపెండెంట్) నవాపూర్ నియోజక వర్గంలో ఓడిపోయారు. అదేవిధంగా విజయ్‌కుమార్ గావిత్ కుమార్తై హినా గావిత్ అక్కల్కువా నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో గావిత్ కుటుంబంలో ఒక్కరికే ఎమ్మెల్యే అయ్యే అవకాశం దక్కింది. ఇక మాజీ కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రావ్‌సాహెబ్ దానవే తనయుడు సంతోష్ దానవే బోకర్ నియోజక వర్గంలో మరోసారి గెలిచారు. కన్నడ్ నియోజక వర్గం నుంచి శివసేన ఏక్నాథ్ శిందే వర్గం టికెట్‌పై పోటీచేసిన రావ్‌సాహెబ్ కుమార్తై సంజనా విజయకేతనం ఎగురవేశారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో స్వయంగా రావ్‌సాహెబ్ ఓటమి పాలయ్యారు. కానీ పిల్లలిద్దరూ ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో ఆయనకు డబుల్ గిఫ్ట్ లభించినట్లైంది. లాతూర్‌లో మాజీ ముఖ్యమంత్రి దివంగత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ఇద్దరు తనయుల్లో ఒకరు ఓడిపోయారు.తండ్రి ఎంపీ.. కుమారులిద్దరూ ఎమ్మెల్యేలుగా ఎన్నిక మహారాష్ట్ర చరిత్రలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కొడుకులు, తండ్రి ఇలా ముగ్గురూ అధికారంలో కొనసాగడం చర్చనీయాంశమైంది. మాజీ కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ఇద్దరు కొడుకుల్లో ఒకరైన నితేష్ రాణే కంకావలి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి, రెండో కొడుకు నిలేష్ రాణే కుడాల్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి భారీ మెజారీ్టతో గెలిచారు. దీంతో వారిద్దరూ శాసనసభలో అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే నారాయణ్ రాణే ఎంపీగా కొనసాగుతున్నారు. అదేవిధంగా పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సామంత్ రత్నగిరి నియోజక వర్గం నుంచి పోటీచేసి గెలిచారు. ఆయన సోదరుడు కిరణ్ సామంత్ రత్నగిరి జిల్లా రాజాపూర్ నియోజక వర్గం నుంచి గెలిచారు. ఇరువురూ ఏక్నాథ్ శిందే వర్గం తరపున పోటీ చేశారు. అలాగే తూర్పుబాంద్రా నియోజక వర్గంలో వరుణ్ సర్దేశాయ్ విజయఢంకా మోగించారు. వరుణ్ సర్దేశాయ్, ఉద్ధవ్ ఠాక్రే సతీమణీ రష్మీ ఠాక్రేకు స్వయానా చెల్లెలి కుమారుడు. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే వర్లీ నియోజక వర్గం నుంచి గెలిచారు. దీంతో వరుస సోదరులిద్దరూ అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. అదేవిధంగా రాష్ట్ర సహకార శాఖ మంత్రి దిలీప్ వల్సే పాటిల్ ఎన్సీపీ(ఏపీ) తరపున పుణేలోని అంబేగావ్ నియోజక వర్గం నుంచి పోటీచేసి గెలిచారు. ఆయన సోదరి సాయితాయి డహాకే కరాంజ నియోజక వర్గంలో బీజేపీ టికెట్‌పై పోటీ చేసి గెలిచారు. దీంతో ఒకే కుటుంబానికి చెందిన సోదరుడు, సోదరి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. -
అశోక్ చవాన్‌లా దొరికావు: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ట్వీట్
సాక్షి,హైదరాబాద్:‘బావమరిదితో లీగల్ నోటీసు పంపితే నీ అక్రమ దందాల గురించి మాట్లాడుడు బంద్ చేస్తా అనుకుంటున్నావా?’అని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు కేటీఆర్ ఆదివారం(సెప్టెంబర్29) ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.‘ఆదర్శ్ కుంభకోణంలో మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్లాా నువ్వు దొరికావు. నీ రాజీనామా తప్పదు.బావమరిదికి అమృతం పంచి, పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకోం.సీఎం ఆధ్వర్యంలో ఉన్న శాఖలోనే ఆయన బావమరిది శోద కంపెనీకి రూ.1,137 కోట్ల టెండర్ కట్టబెట్టింది నిజం.అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్స్ 7,11,13ని సీఎం ఉల్లంఘించారు.శోద కంపెనీ గత రెండు సంవత్సారాలుగా రెండు కోట్లు మాత్రమే లాభం ఆర్జించిన ఒక చిన్న కంపెనీ.ఈ కుంభకోణంలో ఢిల్లీలో ఉన్న నీ బీజేపీ దోస్తులు కూడా నిన్ను కాపాడడం కష్టమే.ఈ దేశంలో న్యాయవ్యవస్థ బలంగా,నిజాయితీగా ఉన్నది’అని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు.ఇదీ చదవండి: హైడ్రా కూల్చివేతలు..మంత్రి శ్రీధర్‌బాబు కీలక ప్రకటన -
Lok sabha elections 2024: వారే వీరయ్యారు!
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడిని మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి నిరూపించాయి. గతంలో ప్రత్యర్థులుగా ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుని, ఎత్తుకు పై ఎత్తులు వేసిన నేతలు ఇప్పుడు హఠాత్తుగా మిత్రులైపోయారు. కొత్త మిత్రుల గెలుపు కోసం లోక్‌సభ సమరాంగణంలో సర్వశక్తులు ఒడ్డుతున్నారు. గతంలో స్నేహితులుగా ఉన్నవారు కాస్తా ఇప్పుడు శత్రువులుగా మారి రాజకీయ చదరంగంలో కొత్త గెలుపు ఎత్తులు వేస్తున్నారు. అజిత్ వర్సెస్ కోల్హే 2019 లోక్‌సభ ఎన్నికల్లో శిరూర్ శివసేన సిట్టింగ్ ఎంపీ శివాజీరావ్ అథాల్‌రావ్ పాటిల్‌ను ఎలాగైనా ఓడించాలని అజిత్ కంకణం కట్టుకున్నారు. టీవీ, సినీ రంగ ప్రముఖుడు అమోల్ రాంసింగ్ కోల్హేను శివసేన నుంచి ఎన్సీపీలో చేర్చుకుని మరీ శివాజీరావ్పై పోటీకి దింపారు. విస్తృత ప్రచారం చేసి కోల్హేను గెలిపించారు. కానీ ఎన్సీపీ చీలిక ఎపిసోడ్లో కోల్హే అజిత్‌ను కాదని శరద్ పవార్‌కు మద్దతుగా నిలవడంతో వారిద్దరికీ చెడింది. బీజేపీ, శివసేనతో సీట్ల సర్దుబాటులో భాగంగా షిరూర్‌లో సొంత అభ్యరి్థని నిలబెట్టే అవకాశం అజిత్‌కు లభించింది. దాంతో కోల్హేను ఎలాగైనా ఓడించాలని పట్టుదలగా ఉన్నారు. అందుకోసం గత ఎన్నికల్లో తానోడించిన అథాల్‌రావ్ పాటిల్‌నే కోల్హేపై పోటీకి నిలబెట్టారు! ఆయన తరఫున విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నారు. వదినా మరదళ్ల వార్ బారామతిలో చాన్నాళ్లుగా శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే పోటీచేస్తున్నారు. ఎన్సీపీలో చీలిక తర్వాత ఈ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు అజిత్ తన భార్య సునేత్రను బరిలో దింపారు. దీంతో వదినా మరదళ్లు ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. పైగా అజిత్ తమ్ముడు శ్రీనివాస్, ఆయన కుటుంబీకులు సూలేకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు! ఇది అజిత్ కుటుంబంలో మరో చీలికకు కారణమవుతోంది. నాడు వేర్వేరు సభలు.. ఇప్పుడు ఒకే స్థానం కోసం పోరు రాహుల్ రమేశ్ షేవలే, అనిల్ దేశాయ్ అవిభాజ్య శివసేనలో సన్నిహిత మిత్రులుగా మెలిగారు. రాహుల్ రెండుసార్లు సౌత్ సెంట్రల్ ముంబై ఎంపీగా గెలవగా అనిల్ రాజ్య సభ సభ్యునిగా ఉండేవారు. శివసేన చీలాక రాహుల్ షిండే వర్గంలో చేరగా అనిల్ ఉద్ధవ్ వర్గంలోనే కొనసాగారు. ఈసారి ఇద్దరూ సౌత్ సెంట్రల్ ముంబై నుంచి ప్రత్యర్థులుగా బరిలో దిగారు. అనిల్‌కు ముంబై కాంగ్రెస్ చీఫ్ వర్షా గైక్వాడ్ మద్దతు పలికారు. వర్ష తండ్రి ఏక్నాథ్ను 2014 లోక్‌సభ ఎన్నికల్లో షేవలే ఓడించడమే అందుకు కారణం. ‘‘దేవేంద్ర ఫడ్నవిస్ చాణిక్యంతో చీలికలు తేనంతవరకూ శివసేన, ఎస్సీపీ కుటుంబ పారీ్టలుగా నిక్షేపంగా ఉండేవి. వాటిలో చీలి కతో లోక్‌సభ ఎన్నికలు మహాభారత యుద్ధా న్నే తలపిస్తున్నాయి. కుటుంబసభ్యులే పరస్పరం పోటీపడుతూ ప్రత్యర్థులకు సాయం చేస్తున్నారు’’ అని సీనియర్ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకులు ప్రకాశ్ అకోల్కర్ అభిప్రాయపడ్డారు. చిఖ్లీకర్ కోసం చవాన్ ప్రచారం గురువారం నాందేడ్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ర్యాలీలో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, బీజేపీ అభ్యర్థి ప్రతాప్ పాటిల్ చిఖ్లీకర్ ఒకే వేదికను పంచుకున్నారు. గత ఫిబ్రవరి దాకా వారిద్దరూ బద్ధ శత్రువులు. చిక్లీకర్ లోహా నుంచి శివసేన ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో బీజేపీలో చేరి లోక్‌సభ ఎన్నికల్లో నాందేడ్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ అశోక్ చవాన్‌ను మట్టికరిపించారు. చవాన్ కూడా తాజాగా బీజేపీలో చేరడంతో వారి మధ్య వైరం మటుమాయమైంది. ఫిబ్రవరిలో బీజేపీలో చేరి రాజ్యసభకు ఎన్నికైన చవాన్ ఇప్పుడు చిక్లీకర్కు స్నేహహస్తం అందించారు. చిక్లీకర్ గెలుపు కోసం మరఠ్వాడాలో తెగ ప్రచారం చేస్తున్నారు. బరనే కోసం అజిత్... గత లోక్‌సభ ఎన్నికల్లో మావల్ నుంచి ఎన్సీపీ నేత అజిత్ పవార్ కుమారుడు పార్థపై శివసేన నేత శ్రీరంగ్ బరనే గెలిచారు. నాటినుంచి అజిత్, బరనే మధ్య వైరం పెరిగింది. కానీ తాజా పరిణామాలతో వారి మధ్య స్నేహం చిగురించింది. శివసేనను ఏక్నాథ్ షిండే, ఎన్సీపీని అజిత్ చీల్చి బీజేపీతో జట్టుకట్టడం తెలిసిందే. బరనే కూడా షిండే వెంట నడిచారు. దాంతో అజిత్‌తో ఆయన శత్రుత్వం సమసిపోయింది. ఈ నేపథ్యంలో అజిత్ ఈసారి బరనే కోసం ప్రచారం చేస్తున్నారు. నాడు ఓడించి నేడు ప్రచారం చేస్తూ.. బీజేపీ అధిష్టానం ఈసారి బీడ్ నుంచి సిట్టింగ్ ఎంపీ ప్రీతం ముండే స్థానంలో ఆమె సోదరి, మాజీ మంత్రి పంకజా ముండేను ఎంపిక చేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పంకజ తన బంధువైన ఎన్సీపీ నేత ధనంజయ్ ముండే చేతిలో ఓడారు. ఇప్పుడాయన అజిత్ ఎన్సీపీలో ఉన్నారు. బీజేపీతో ఎన్సీపీ చెలిమి నేపథ్యంలో పంకజ తరపున ధనంజయ్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. –సాక్షి, న్యూఢిల్లీ -
సోనియా గాంధీని కలిసిన అశోక్ చవాన్?.. స్పందించిన మాజీ సీఎం
ముంబై: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీని తాను అసలు కలవనేలేదని ఇటీవల బీజేపీలో చేరిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ అన్నారు. ఆయన సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ‘ఒకవేళ రాహుల్ గాంధీ నా గురించే మాట్లాడి ఉంటే. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆధారంలేని అసత్యాలు. నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం నిజం. నేను ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశా. అయితే నేను రాజీనామా చేశానని కొంతమందికి తెలియదు’ అని అశోక్ చవాన్ అన్నారు. ‘నేను కాంగ్రెస్ నాయకులురాలు సోనియా గాంధీని అసలు కలవలేదు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరూపితం కాని అసత్యాల. నేను సోనియా గాంధీ వద్ద ఎటువంటి భావాలు వ్యక్తం చేయలేదు. ఇటువంటి వ్యాఖ్యలు కేవలం ఎన్నికల సందర్భంగా చేసే రాజకీయ స్టేట్మెంట్లు మాత్రమే’ అని అశోక్ చవాన్ స్పష్టం చేశారు. అయితే నిన్న(ఆదివారం) రాహుల్‌గాంధీ తాను చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ముగింపు సందర్భంగా పేరు ప్రస్తావించకుండా కాంగ్రెస్ పార్టీ వీడిన ఓ సీనియర్ నేత తన తల్లి సోనియా గాంధీ వద్దకు వచ్చి పార్టీ వీడే పరిస్థతి వచ్చినందుకు కన్నీటిపర్యంతమయ్యారని అన్నారు. అయితే ఆయన పరోక్షంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన మాజీ సీఎం అశోక్ చవాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించటం గమనార్హం. ‘తాను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోవడానికి చాలా సిగ్గుపడుతున్నా. వారితో పోరాడటానికి నాకు శక్తి లేదు. నాకు జైలుకు వెళ్లటం ఇష్టం లేదు. అందుకే పార్టీ మారుతున్నాని నా తల్లి సోనియా గాంధీ వద్దకు వచ్చి సదరు సీనియర్ నేత కన్నిటీపర్యంతమయ్యారు’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. ఇక.. మహారాష్ట్ర కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న అశోక్ చవాన్ గత నెలలో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. -
బీజేపీలో చేరిన అశోక్ చవాన్
ముంబై: కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌చవాన్ బీజేపీలో చేరారు. ముంబైలో ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో మంగళవారం ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా చవాన్‌ను ఫడ్నవిస్ పార్టీలోకి ఆహ్వానించారు. అందరూ ఊహించినట్లుగానే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మరుసటి రోజే బీజేపీలో చేరిన చవాన్‌ను కాషాయ పార్టీ రాజ్యసభకు నామినేట్ చేయడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికలకు ఈ నెల 15 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇదీ చదవండి.. ఎన్సీపీ నాదే.. సుప్రీంకోర్టుకు శరద్‌పవార్ -
చవాన్‌కు బీజేపీ రాజ్యసభ సీటు! ఉద్ధవ్ కీలక వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌చవాన్ కాంగ్రెస్ పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఆయన త్వరలో బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీలో చేరితే బీజేపీ ఆయనకు రాజ్యసభ సీటు కూడా ఆఫర్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్దవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ చవాన్‌కు రాజ్యసభ సీటిస్తే బీజేపీ సైనికులను అవమానపరిచినట్లేనన్నారు. గతంలో ఆదర్శ్ హౌజింగ్ సొసైటీ కుంభకోణంలో చవాన్‌పై ఆరోపణలు వచ్చినపుడు ప్రధాని మోదీ, ప్రస్తుత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సైనికులను చవాన్ అవమానపరిచారని చేసిన విమర్శలను ఉద్ధవ్ థాక్రే గుర్తు చేశారు. భారతరత్న అవార్డులపైనా థాక్రే స్పందించారు. బీజేపీ భారతరత్న దుకాణం పెట్టిందని, ఓట్ల కోసం పలు వర్గాలకు చెందిన వారికి ఆ పురస్కారం ఇస్తోందని విమర్శించారు. స్వామినాథన్కకు భారతరత్న ఇస్తే సరిపోదని వ్యవసాయ రంగంలో ఆయన చేసిన సిఫారసులను అమలు చేయాలని కేంద్రానికి సూచించారు. ఇదీ చదవండి.. దీదీకి మద్దతుగా ప్రధానికి రాహుల్ లేఖ -
కాంగ్రెస్‌కు మరో షాక్.. మాజీ సీఎం రాజీనామా
ముంబై: లోక్‌సభ ఎన్నికలు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కాంగ్రెస్‌కు సోమవారం రాజీనామా ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామాను రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ చీఫ్ నానా పటోల్‌కు పంపించారు. అందులో కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు సింగిల్ లైన్ సమాధానం ఇచ్చారు. అలాగే అసెంబ్లీలో భోకర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న చవాన్.. స్పీకర్ రాహుల్ నార్వేకర్‌ను కలుసుకొని తన రాజీనామాను అందజేశారు. అయితే అశోక్ త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఆ పార్టీతో సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. చవాన్‌కు బీజేపీ రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్లు వినికిడి. ఇక ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలతోపాటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే జనవరి 14న రాహుల్ సన్నిహితుడు, కాంగ్రెస్ నేత మిలింద్ దేవరా పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. ఇక మాజీ మంత్రి బాబా సిద్ధిఖ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, శరద్ పవరా్కు చెందిన ఎన్సీపీ తీర్థం పుచ్చుకున్నారు.. తాజాగా మరో సీనియర్ నేత పార్టీని వీడటం కాంగ్రెస్ తీరని దెబ్బగానే చెప్పవచ్చు. చదవండి: డిప్యూటీ సీఎం పదవులు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు -
కాంగ్రెస్‌లో కీలక మార్పులు.. పటోలే, జగ్తాప్ ఔట్?.. చవాన్ ఇన్!
సాక్షి, ముంబై: జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాల్లో కూడా సమీకరణాలు మారనున్నట్లు వార్తలు రావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ బీజేపీలో చేరుతుండవచ్చనే వదంతులు వస్తున్నాయి. దీంతో ఆయన అసంతృప్తిని తొలగించేందుకు ప్రస్తుతం మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న నానా పటోలేను తొలగించి ఆ స్ధానంలో అశోక్ చవాన్‌ను నియమించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే నానా పటోలేకు మొండిచేయి, పీసీసీ అధ్యక్ష పదవి అశోక్ చవాన్‌కు దక్కడం ఖాయమని స్పష్టమవుతోంది. శివసేనపై తిరుగుబాటు చేసిన ఏక్నాథ్ శిందే దేవేంద్ర ఫడ్నవీస్‌తో జతకట్టి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అసంతృప్తులందరు శిందే, దేవేంద్ర ఫడ్నవీస్‌తో కాంటాక్ట్‌లో ఉన్నారు. అందులో అశోక్ చవాన్ కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. గణేశోత్సవాల సమయంలో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో కూడా అశోక్ చవాన్ భేటీ అయ్యారు. దీంతో కొద్ది రోజులుగా వస్తున్న వార్తల్లో వాస్తవముందని పలువురు నేతలు గుర్తించారు. దీంతో ఆయన పార్టీ మారక ముందే అసంతృప్తిని తొలగించి పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టాలని రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఇదిలాఉండగా చవాన్ బీజేపీలో చేరకుండా నిరోధించాలన్నా, శాశ్వతంగా పార్టీలో కొనసాగాలన్నా, లేదా పార్టీని బలోపేతం చేయాలన్నా ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఈ కోణంలో సీనియర్ పార్టీ శ్రేణులు ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల ముంబైలోని తిలక్ భవన్ పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రదేశ్ ప్రతినిధుల సమావేశానికి మహారాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి హెచ్.కె.పాటిల్, ప్రదేశ్ ఎన్నికల అధికారి పల్లం రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు నానా పటోలేకు వ్యతిరేకంగా అనేక మంది నేతలు, పదాధికారులు ఫిర్యాదులు చేశారు. ఆయన పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన్ని మార్చే అధికారం కాంగ్రెస్ అధ్యక్షునికి అప్పగించారు. దీంతో నానా పటోలేను మార్చాలని అప్పుడు ప్రాథమికంగా నిర్ణయానికొచ్చారు. కానీ సమయం కోసం వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అశోక్ చవాన్ అసంతృప్తి వ్యవహారం బయటపడింది. ఆయన బీజేపీలో చేరనున్నట్లు వదంతులు రావడంతో దీన్ని అదనుగా చేసుకుని పటోలేను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి అశోక్ చవాన్‌ను నియమించాలనే అంశం తెరమీదకు వచ్చింది. పీసీసీతోపాటు ముంబై రీజియన్ కాంగ్రెస్ కమిటీ (ఎమ్మార్సీసీ) అధ్యక్ష పదవి నుంచి భాయి జగ్తాప్ను కూడా తొలగించే అవకాశాలున్నాయి. జగ్తాప్ పనితీరుపై కూడా కొందరు అసంతృప్తితో ఉన్నారు. త్వరలో బీఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకు ముంబైలో ఓ పట్టిష్టమైన నాయకత్వం కావాలి. దీంతో జగ్తాప్ను కూడా ఆ పదవి నుంచి తొలగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ స్ధానంలో ఎవరిని నియమిస్తారనే దానిపై ఇంతవరకు స్పష్టత రాలేదు. కానీ ఈ పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై అందరు దృష్టి సారించారు. -
పరిమితిని తొలగిస్తేనే మరాఠా రిజర్వేషన్లు
ముంబై: రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగిస్తే తప్ప మరాఠా కోటా రిజర్వేషన్లను అమలు చేయలేమని శివసేన ఎంపీ సంజయ్ రావుత్ వ్యాఖ్యానించారు. ఆదివారం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మరాఠా కోటా గురించే తాను సీఎంతో చర్చించినట్లు తెలిపారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో జరిగిన భేటీకి సంబంధించిన వివరాలను సీఎంకు వివరించానన్నారు. మరాఠా కోటా అంశానికి సంబంధించి ప్రజాపనుల శాఖ మంత్రి అశోక్ చవాన్ అఖిలపక్ష నాయకులతో వర్చువల్‌గా భేటీ అవుతారని వెల్లడించారు. రాష్ట్రాలు ఓబీసీ జాబితా రూపొందించుకునేలా అధికారం కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెడితే చర్చకు పట్టుబడతానని పేర్కొన్నారు. వచ్చే ఫిబ్రవరిలో జరగనున్న బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ, ఎమ్మెన్నెస్‌ల పొత్తు గురించి మాట్లాడేందుకు సంజయ్ రావుత్ నిరాకరించారు. డిసెంబర్ 28వ తేదీన రాహుల్ గాంధీ ముంబై పర్యటనకు వచ్చినప్పుడు సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసానికి వస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు డిసెంబర్ నెల ఇంకా చాలా దూరంలో ఉందని, అప్పటివరకు ఏం జరుగుతుందో చూద్దామని సమాధానమిచ్చారు. -
సీఎం సంతకం చేశాక ఫైల్లో మార్పులు
సాక్షి, ముంబై: ఓ కీలక ఫైల్లో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సంతకం చేసిన అనంతరం మా ర్పులు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మంత్రాలయ కార్యాలయంలో పనిచేస్తున్న కార్యదర్శులు, అధికారులు, సిబ్బంది వర్గాల్లో కలకలం రేపింది. ఈ ఘటనపై స్థానిక మెరైన్‌డ్రైవ్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. ప్రజా పనుల విభాగానికి చెందిన ఓ సూపరింటెండెంట్ ఇంజినీర్ నానా పవార్‌పై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి అదేశించారు. అందుకు సంబంధించిన ఫైల్లో సీఎం సంతకం చేశారు. కానీ, సంతకం చేసిన తరువాత అందులో మార్పులు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి సంతకం చేసిన చోట పైన విచారణ నిలిపివేయాలని రెడ్ పెన్నుతో రిమార్క్ రాసి ఉంది. అయితే విచారణ నిమిత్తం ఈ ఫైల్‌ను పరిశీలించిన మంత్రి అశోక్ చవాన్‌కు అనుమానం వచ్చింది. సీఎం ఉద్ధవ్ సంతకం చేసిన చోట స్థలం లేదు. అయినప్పటికీ సంతకంపైన చిన్న అక్షరాలతో విచారణ నిలిపివేయాలని రాసి ఉంది. ఒకవేళ ఉద్ధవ్ విచారణ నిలిపివేయాలని రిమార్కు రాస్తే స్థలం ఉండేది. కానీ, అక్కడ ఇరుకైన చోట చిన్న అక్షరాలతో రిమార్కు రాయడంపై చవాన్‌కు అనుమానం వచ్చింది. వెంటనే ఈ ఫైల్‌ను ముఖ్యమంత్రి చాంబర్‌కు పంపించారు. ముఖ్యమంత్రి సంతకం చేసిన ప్రతీ ఫైలు స్కాన్ చేస్తారు. అక్కడ పరిశీలించగా స్కాన్ చేసిన పత్రాలపై రెడ్ పెన్నుతో రాసిన ఎలాంటి రిమార్కు లేదు. దీన్ని బట్టి సంతకం చేసిన తరువాతే ఈ మార్పులు జరిగినట్లు స్పష్టమైంది. దీంతో మంత్రాలయలో ఎవరో ఈ పనిచేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై మెరైన్‌డ్రైవ్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
‘జాదూకీ జప్పీ’.. హ్యాట్సాఫ్ డాక్టర్!
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని ఔరంగాబాద్కి చెందిన యూరాలజిస్ట్ దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుడి తల్లికి ఉచిత చికిత్స చేసినందుకు గానూ రాజకీయ నాయకులతో సహా వివిధ ప్రాంతాల ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. చికిత్స తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయే సమయంలో వృద్ధురాలిని పట్టుకుని కంటతడి పెట్టుకుంటూ ఓదార్చిన డాక్టర్ అల్తాఫ్ షేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ నాయకుడు, మహారాష్ట్ర ప్రజా వ్యవహారాలశాఖ మంత్రి అశోక్ చవాన్.. డాక్టర్‌ను స్వయంగా పిలిపించుకొని ప్రశంసించారు. కిడ్నీ సమస్యతో బాధపడుతూ తన దగ్గరికి వైద్యం కోసం వచ్చిన శాంతాబాయ్ సూరద్ అనే వృద్దురాలికి డాక్టర్ అల్తాఫ్ ఉచితంగా వైద్యం అందించారు. తన ఇద్దరు కుమారులను పొగొట్టుకుని నిరుపేదరాలిగా మారిన ఆమె కన్నీటిగాథ గురించి తెలుసుకుని డాక్టర్ అల్తాఫ్ కరిగిపోయారు. శాంతాబాయ్ ఇద్దరు కుమారుల్లో ఒకరు గుండెపోటు మరణించగా, మరొక కొడుకు ఏడు సంవత్సరాల క్రితం దేశం కోసం ప్రాణాలర్పించాడు. ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడి ఆమెకు ఉచితంగా శస్త్రచికిత్స చేశారు డాక్టర్ అల్తాఫ్. ఆస్పత్రి నుంచి ఆమెను పంపించే సమయంలో డాక్టర్ అల్తాఫ్ భావోద్వేగానికి గురయ్యారు. శాంతాబాయ్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని, కన్నీళ్లు తుడిచారు. ఈ వీడియో సోషల్ వైరల్ కావడంతో మంత్రి అశోక్ చవాన్ దృష్టిలో పడింది. డాక్టర్ అల్తాఫ్‌ను వ్యక్తిగతంగా పిలిపించుకొని ప్రశంసించారు. ఈ వీడియోను చూసినవారంతా ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ సినిమాలోని ‘జాదూకీ జప్పీ’ సన్నివేశాలను గుర్తు చేసుకుంటున్నారు. డాక్టర్ అల్తాఫ్‌కు సలాం చెబుతున్నారు. -
మహా సర్కార్‌లో విభేదాలు నిజమే
ముంబై : మహారాష్ట్రలో కాంగ్రెస్-శివసేన-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీల మధ్య అభిప్రాయ బేధాలు ఉన్నాయని సీనియర్ కాంగ్రెస్ నేత, మంత్రి అశోక్ చవాన్ అంగీకరించారు. విభేదాల పరిష్కారానికి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం కావాలని కాంగ్రెస్ కోరుతోందని చెప్పారు. మరో రెండు రోజుల్లో సీఎం కాంగ్రెస్ నేతలతో సమావేశమవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మహావికాస్ అగడి భాగస్వామ్య పార్టీల మధ్య కొన్ని అంశాలున్నాయని, అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు తాము సీఎంతో రెండు రోజుల్లో భేటీ అవుతామని అశోక్ చవాన్ చెప్పారు. కీలక సమావేశాలకు హాజరయ్యేందుకు తమకు ఆహ్వానం అందడం లేదని కొంతకాలంగా కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్-19 వ్యాప్తి సహా పలు అంశాలపై చర్చించేందుకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే పలుమార్లు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో సమావేశమవుతుండగా ఈ భేటీలకు కాంగ్రెస్ నేతలను పిలవకపోవడంపై ఆ పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ అంశంతో పాటు గవర్నర్ కోటాలో శాసనమండలికి నామినేషన్లు, నామినేటెడ్ పోస్టుల వ్యవహారంపై మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ బాలాసాహెబ్ థోరట్, అశోక్ చవాన్‌లు సోమవారం ఉద్ధవ్ ఠాక్రేతో సంప్రదింపులు జరుపుతారని సమాచారం. చదవండి : మరో న్యూయార్క్‌గా మహారాష్ట్ర -
మాజీ సీఎంకు కరోనా పాజిటివ్..
ముంబై : మహారాష్ట్రలో కరోనా విజృంభణ ఆగడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 50 వేలు దాటింది. అయితే లక్షణాలు లేకుండానే పలువురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పీడబ్ల్యూడీ మంత్రి అశోక్ చవాన్ కూడా కరోనా సోకింది. ఎటువంటి లక్షణాలు లేకపోయినప్పటికీ.. కరోనా నిర్ధారణ కావడంతో ప్రస్తుతం తన స్వస్థలం నాందేడ్‌లో చవాన్ చికిత్స పొందుతున్నారు. ఇంతకుముందు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవాద్‌కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ముంబైలోని ఓ ఆస్పత్రిలో రెండు వారాలకు పైగా చికిత్స అనంతరం ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, ఆదివారం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. ఇకపై కరోనాపై పోరాటం మరింత కఠినంగా ఉండబోతుందని అన్నారు. కరోనాను ఎదుర్కొవడానికి అవసరమైన అదనపు వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. కాగా, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకునిగా ఉన్న అశోక్ చవాన్.. 2008 డిసెంబర్ 8 నుంచి 2010 నవంబర్ 9 వరకు సీఎంగా కొనసాగారు. ఆదర్శ కుంభకోణం వ్యవహారంలో ఆయనపై ఆరోపణలు రావడంతో.. అధిష్టానం ఒత్తిడి మేరకు సీఎం పదవికి రాజీనామా చేశారు. తాజాగా కూటమి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. -
సోనియాకు అశోక్ చవాన్ లేఖాస్త్రం
సాక్షి, ముంబై : మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్ష పదవి తనకే కట్టబెట్టాలని ప్రజా పనుల శాఖ మంత్రి అశోక్ చవాన్ డిమాండ్ చేశారు. రెవెన్యూ శాఖ మంత్రి, మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు బాలాసాహెబ్ థొరాత్ పనితీరు సక్రమంగా లేదని చవాన్ లేఖలో ఆరోపించారు. థోరాత్ కారణంగానే గత సంవత్సరం అక్టోబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ స్థానాలు వచ్చాయని ఆరోపిస్తూ నేరుగా కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. అందులో పీసీసీ పదవీ బాధ్యతలు తనకే కట్టబెట్టాలని కోరారు. గత సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పీసీసీ అధ్యక్ష పదవి నుంచి అశోక్ చవాన్‌ను తొలగించారు. ఆ తర్వాత ఆ పదవిలో థోరాత్‌ను నియమించారు. కానీ, మళ్లీ ఆ పదవిలో కొనసాగాలని చవాన్ ఉవ్వీళ్లూరుతున్నారు. దీంతో ఆ పదవి తనకే కట్టబెట్టాలని సోనియాకు రాసిన లేఖలో డిమాండ్ చేశారు. ముంబై రీజియన్‌లో కూడా... రాష్ట్రంలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ నేతృత్వంలో మహాకూటమి ఆఘాడి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని మరింత పటిష్టంగా ముందుకు నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంత్రి మండలిలో మంత్రుల పదవులు పంపకం తర్వాత తమ పార్టీలు మరింత సంఘటితం చేసే ప్రయత్నాలు జోరుగా చేస్తున్నాయి. అందులో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన కాంగ్రెస్ ముంబై రీజియన్ అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు ఆ పార్టీలో పోటీ తీవ్రమైంది. వచ్చే బీఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముంబై అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు ఇప్పటి నుంచి పోటీ మొదలైంది. అందుకు పార్టీ సీనియర్ నేతలతో పైరవీలు, సిఫార్సులు చేయడం ప్రారంభించారు. ముంబై అధ్యక్ష పదవి తమకే కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అమర్జిత్ సింగ్ మన్హాస్, మాజీ అధ్యక్షుడు మిలింద్ దేవరా పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మాజీ మంత్రి సురేశ్ వెట్టి, నసీం ఖాన్, ఎమ్మెల్యే భాయి జగ్తాప్, చరణ్‌జీత్ సింగ్ సప్రా తదితరులు కూడా ఈ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పైరవీలు షురూ! అత్యంత కీలకమైన ముంబై రీజియన్ అధ్యక్ష పదవి కోసం మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేల మద్ధతుదారులు పార్టీ సీనియర్ నాయకులతో పైరవీలు చేస్తున్నారు. మరోపక్క పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ తరచూ చర్చల్లోకి వస్తున్న అమర్జిత్ సింగ్‌కు ఆ బాధ్యతలు అప్పగించాలని కొందరు పట్టుబడుతున్నారు. గతంలో కూడా అమర్జిత్ సింగ్‌కు ముంబై రీజియన్ అధ్యక్ష పదవి కట్టబెట్టాలని మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మల్లికార్జున్ ఖర్గేతో సీనియర్ నేతలు భేటీ అయ్యారు. ఆ పదవికి అమర్జిత్ సమర్ధుడని, దీంతో ఆ పదవి ఆయనకే కట్టబెట్టాలని ఈ భేటీలో డిమాండ్ చేశారు. అయితే, ఇప్పుడు అమర్‌జిత్‌కు పోటీగా మిలింద్ దేవరాతో పాటు మరో అరడజను పేర్లు తెరమీదకు రావడంతో పేచీ మొదలయ్యే ప్రమాదం ఉంది. దీంతో ఇద్దరిలో ఎవరికి ఈ పదవి దక్కుతుందనే దానిపై పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అందరి సమ్మతితోనే ఈ క్లిష్టమైన సమస్యను పరిష్కరించి ఒకరికి ఈ పదవి బాధ్యతలు కట్టబెట్టనున్నారు. -
మంత్రిగా ప్రమాణం చేసిన మాజీ సీఎం
సాక్షి, ముంబై : ముఖ్యమంత్రి ప్రమాణం చేసిన నెల అనంతరం మహారాష్ట్రలో పూర్తిస్థాయి ప్రభుత్వం కొలువుదీరింది. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని కేబినెట్లో కొత్తగా 36 మంది మంత్రులకు చోటుదక్కింది. ఆ రాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ సోమవారం వీరిచేత ప్రమాణ స్వీకారం చేయించారు. అందరూ ఊహించినట్టుగానే ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎం పదవి దక్కింది. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి కేంద్రబిందువైన అజిత్.. రెండు నెలల్లో రెండోసారి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడం గమనార్హం. గతంలో దేవేంద్ర ఫడ్నవిస్‌తో చేతులు కలిపి ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఎన్సీపీ నేతల పిలుపు మేరకు రాజీనామా చేసి సొంత గూటికి చేరుకున్నారు. అలాగే ఊహాగానాలను నిజం చేస్తూ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదిత్య ఠాక్రే సైతంగా తండ్రి ప్రభుత్వంలో చోటు దక్కించున్నారు. దీంతో ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి ఎన్నికల్లో పోటీచేసి మంత్రిగా ఎన్నికైన వ్యక్తిగా ఆదిత్య నిలిచారు. కాంగ్రెస్ నుంచి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ మంత్రిగా ప్రమాణం చేశారు. త్వరలోనే వీరికి శాఖలు అప్పగించనున్నారు. ముఖ్యమంత్రి నుంచి మంత్రిగా.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన అశోక్ చవాన్.. గతంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తాజాగా మంత్రిగా ఎన్నికయ్యారు. మహారాష్ట్ర 16వ ముఖ్యమంత్రిగా 2008 డిసెంబర్ 8 నుంచి 2010 నవంబర్ 9 వరకు ఆయన పదవిలో ఉన్నారు. అయితే ఆదర్శ కుంభకోణం వ్యవహారంలో ఆయన పేరు స్పష్టంగా వినిపించడంతో పార్టీ ఆధిష్టానం ఒత్తిడి మేరకు సీఎం పదవికి రాజీనామా చేశారు. తరువాతి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమిని చవిచూసింది. దీంతో 2014 లోక్‌సభ ఎన్నికల్లో నాందేడ్ స్థానం నుంచి గెలుపొందారు. 2015లో పార్టీ రాష్ట్ర చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ పీసీసీ పదవికి రాజీనామా చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన కూడా ఓటమి చెందారు. తాజాగా ఉద్ధవ్ ప్రభుత్వంలో మంత్రిగా చోటు దక్కించున్నారు. -
'రెండు చక్రాల కన్నా మూడు చక్రాలే ఉత్తమం'
ముంబై: మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ స్పందిస్తూ.. 'ఆటోరిక్షా కూడా మూడు చక్రాలపై నడుస్తుంది. అయితే.. మూడు చక్రాలు కూడా ఒకే దిశలో కాకుండా తలో దిశలో వెళ్తే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. ప్రస్తుతం శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వంలోనూ అదే పరిస్థితి నెలకొంటుందని' వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ ఆయనకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. 'రెండు చక్రాల కన్నా మూడు చక్రాలే ఉత్తమం' అని వ్యాఖ్యానించారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ఉమ్మడి కార్యాచరణ విషయంపై చవాన్‌ను విలేకరులు ప్రశ్నించగా బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అత్యల్పకాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన వ్యక్తి నేతగా దేవేంద్ర ఫడ్నవిస్ రికార్డుల కెక్కారు. గతంలో 1963లో ముఖ్యమంత్రి మారోతరావ్ కన్నంవార్ మరణానంతరం 1963 నవంబరు 25వ తేదీ సావంత్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. కాగా సావంత్ కూడా కేవలం తొమ్మిది రోజుల్లోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మరోవైపు మరోసారి నవంబర్ నెలలోనే 23వ తేదీన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన దేవేంద్ర ఫడ్నవిస్ అత్యల్పంగా కేవలం మూడున్నర రోజులలోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. -
అసెంబ్లీ ఎన్నికలు.. ఆ పార్టీకి కఠిన పరీక్షే..!
సాక్షి, ముంబై: ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయంపాలైన కాంగ్రెస్ పార్టీకి.. మరో కఠిన పరీక్ష సవాలు విసురుతోంది. ఆ పార్టీకి కీలకమైన మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కీలక నేతల రాజీనామాలతో హస్తం పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సార్వత్రిక ఎన్నికల వైఫల్యం అనంతరం.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయనకు మద్దతుగా దేశ వ్యాప్తంగా పీసీసీలు, కీలక పదవుల్లో ఉన్న సీనియర్లు కూడా పదవులకు రాజీనామా చేశారు. ఈ పరిణామం పార్టీ శ్రేణులకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది. ముఖ్యంగా ఏడాది చివరన అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మహారాష్ట్రలో ఆ పార్టీ సీనియర్ నేత అశోక్ చవాన్ తన పదవికి రాజీనామా చేయడం.. మరికొంత మంది కీలక నేతలు పార్టీని వీడి అధికార బీజేపీలో చేరడం ఆ పార్టీ నేతలను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. దశాబ్దాల పాటు మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన రాష్ట్ర ప్రతిపక్ష నేత రాధాకృష్ణ ఊకే పాటీల్ ఇటీవల బీజేపీ చేరి.. ఏకంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆయనతో పాటు పలువురు కీలక నేతలు కూడా ఆయన వెంట వెళ్లారు. లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన విజయం స్ఫూర్తితోనే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలుపొందాలని ఆపార్టీ కేంద్ర నాయకత్వం భావిస్తోంది. దీని కోసం కేంద్ర హోంశాఖ మంత్రి, ఆ పార్టీ అధ్యక్షడు అమిత్ షా ప్రత్యేక వ్యూహాలను రచిస్తున్నారు. కాంగ్రెస్, ఎన్సీపీకి చెందిన కీలక నేతలను బీజేపీలోకి ఆహ్వానించాలని రాష్ట్ర శాఖను షా ఆదేశించారు. లోక్‌సభ ఎన్నికల ఓటమితో కుదేలయిన ఆపార్టీని ఫిరాయింపులతో మరింత దెబ్బతీయాలని కమళ దళం భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్సీపీ, కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలు తమ పార్టీలో చేరనున్నారని మంత్రి గిరీష్ మహజన్ ఇటీవల స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగానే ఇతర పార్టీ నేతలతో మంతనాలు చేస్తున్నాట్లు ఆయన తెలిపారు. అలాగే కీలకమైన ఎన్నికల ముందు రాష్ట్రానికి కొత్త సారథిని నియమించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా 48 లోక్‌సభ స్థానాలు గల మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమి 41 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఎన్సీపీ 4 సీట్లను కైవసం చేసుకోగా.. కాంగ్రెస్ కేవలం ఒకే స్థానానికి పరిమితమైంది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అమిత్ షా ఇటీవల ప్రారంభించిన విషయం విధితమే. -
సీఎం ‘వికాస్ యాత్ర’.. మరి వారిది ఏ యాత్ర..!
ముంబై : సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవం నుంచి కాంగ్రెస్ బయటపడినట్టు లేదు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. ఆయన బాటలోనే ముంబై కాంగ్రెస్ చీఫ్ మిలింద్ డియోరా, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేశారు. ఇక ఎన్నికల ముందే రాజీనామా చేస్తానని బెదిరింపులకు దిగిన మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కూడా అదే బాటలో నడిచారు. అయితే, లోక్‌సభ ఎన్నికల సమయంలో సీట్ల పంపకంలో తన మాట చెల్లుబాటు కావడం లేదనే అసహనంతో కాకుండా రాహుల్ రాజీనామా అనంతరం ఆయన పదవికి గుడ్‌బై చెప్పడం గమనార్హం. అయితే, ఈయేడు చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతల వైఖరి బీజేపీకి మరింత బలం చేకూర్చేదిగా తయారైంది. బీజేపీని ఎదుర్కొంటుందా..! అంతర్గత కుమ్ములాటలతో కునారిల్లుతున్న మహారాష్ట్ర కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో తేలిపోయిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 48 సీట్లలో కాంగ్రెస్ 1 చోట మాత్రమే విజయం సాధించగా ఎన్డీయే కూటమి 41 సీట్లను కైవసం చేసుకుంది. ఇక ఈయేడు చివరల్లో అసెంబ్లీ జరుగనుండటంతో అధికార బీజేపీ దూకుడు పెంచింది. సభ్యత్వ నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఆ పార్టీ లక్ష్యం దిశగా దూసుకుపోతోంది. లోక్‌సభ ఎన్నికల విజయంతో ఆగిపోవద్దని, మరింత కష్టపడి పార్టీని వరుసగా రెండోసారి అధికారంలోకి తెద్దామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ‘వికాస్ యాత్ర’ పేరుతో ఆయన త్వరలో జిల్లాల్లో పర్యటించనున్నారు. మరోవైపు అటు జాతీయస్థాయిలో, ఇటు రాష్ట్రంలోనూ నాయకత్వ కొరతను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పరిస్థితి జిల్లాల్లో మరింత గందగోళంగా తయారైంది. మంత్రి పదవి ఇచ్చి లాగేసుకున్నారు.. ఇక రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రతిపక్ష నేతగా ఉన్న సీనియర్ లీడర్ రాధాకృష్ణ విఖే పాటిల్‌ను బీజేపీ లాగేసుకుంది. ఆయనకు మంత్రిపదవి కూడా కట్టబెట్టింది. బీజేపీలో చేరేందుకు కాంగ్రెస్ కీలక నేతలు క్యూ కట్టారని రాష్ట్ర మంత్రి గిరిష్ మహాజన్ వంతి నేతలు చెప్తుండటం గమనార్హం. మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా మాజీమంత్రి బాలాసాహెబ్ థారోట్ బాధ్యతలు చేపట్టనున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే, చవాన్ రాజీనామామై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోలేనట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌తో పొత్తుకు ఎన్సీపీ సై..! అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జట్టుకట్టేందుకు ఎన్సీపీ సిద్ధమైంది. ఈ విషయమై రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మల్లిఖార్జున ఖర్గేతో చర్చలు జరుపేందుకు సుముఖంగా ఉంది. అయితే, సీట్ల పంపకానికి సంబంధించి కాంగ్రెస్ ఎవరిని రంగంలోకి దించుతుందో, జాతీయ, రాష్ట్ర స్థాయిలో నాయకుడు కరువైనవేళ ఏమేరకు బీజేపీతో ఢీకొంటుందో చూడాలి..!! -
‘నా మాట లెక్క చేయడం లేదు.. రాజీనామా చేస్తా’
ముంబై : సార్వత్రిక ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. చేరికలు, అలకలు, రాజీనామాలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అభ్యర్థులు పార్టీలు మారుతూ.. అధిష్టానాలకు షాక్‌ల మీద షాకులిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఓ ఆడియో టేపు మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో గుబులు పుట్టిస్తోంది. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ సీఎం అశోక్ శంకర్రావ్ చవాన్ ఓ కార్యకర్తతో తన రాజీనామ విషయం గురించి మాట్లాడుతున్నట్లుగా చెప్పబడుతున్న ఓ ఆడియో టేప్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. చంద్రపూర్ లోక్‌సభ స్థానానికి గాను కాంగ్రెస్ పార్టీ వినాయక్ బాగ్దేను బరిలో నిలిపింది. దీని గురించి జరిగిన చర్చనే ప్రస్తుతం ఆడియో టేప్‌లో ఉంది. దీనిలో అశోక్‌గా చెప్పబడుతున్న వ్యక్తి చంద్రపూర్ సీటు విషయంలో పార్టీ నిర్ణయం తనకు ఎంతో బాధ కల్గించిందని వాపోయారు. పైగా ప్రస్తుతం పార్టీలో ఎవరూ తన మాట వినడం లేదని.. అందుకే రాజీనమా చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ ఫోన్ కాల్ సంభాషణను అశోక్ చవాన్ ఖండించారు. ఎవరో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణలో తన పేరును ఇరికించాలనుకోవడం భావ్యం కాదని తెలిపారు. అంతేకాక ఏ విషయంలోనైనా పార్టీ నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. అయితే చంద్రపూర్ సీటు విషయంలో ఫిర్యాదులు ఉన్న మాట వాస్తవమే కానీ.. దాని గురించి బహిరంగంగా చర్చించేందుకు తాను సిద్ధంగా లేనని అశోక్ తెలిపారు. -
దేశంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే
స్టేషన్ మహబూబ్‌నగర్: దేశంలో కాంగ్రెస్ పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని.. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం పంచదేవపాడ్‌లోని దత్త పీఠాన్ని సందర్శించేందుకు వెళ్తున్న ఆయన జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల 3 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపించారు. తాజాగా ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో రైతులకు ఏడాదికి రూ.6 వేల ఆర్థిక సాయం ప్రకటించారని.. అంటే రోజుకూ కేవలం రూ.17 ఇచ్చి రైతులను అవమానించారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోదీ ప్రభుత్వం ఈ బడ్జెట్‌ను రూపొందించిందన్నారు. ప్రధాని మోదీ పాలనపై వ్యతిరేకతతో ఉన్న ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌ను ఆదరిస్తారని పేర్కొన్నారు. అశోక్ చవాన్‌ను డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ తదితరులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి ఎన్పీ.వెంకటేశ్, నేతలు సంజీవ్ ముదిరాజ్, సీజే.బెనహర్, కట్టా రవికిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌యాదవ్, అనంతరెడ్డి, సిరాజ్‌ఖాద్రీ, గంజి ఆంజనేయులు, బాలస్వామి, సుభాష్‌ఖత్రి తదితరులు పాల్గొన్నారు. -
ఆదర్శ్’ కేసులో చవాన్‌కు ఊరట
ముంబై: 2జీ కేసులో తీర్పు కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చిన మరుసటి రోజే ఆ పార్టీకి మరో కేసులోనూ ఊరట లభించింది. ఆదర్శ్ గృహ సముదాయం కుంభకోణం కేసులో మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత అశోక్ చవాన్‌పై విచారణ జరిపేందుకు ఆరాష్ట్ర గవర్నర్ ఇచ్చిన అనుమతిని కొట్టేస్తూ బాంబే హైకోర్టు శుక్రవారం ఆదేశాలిచ్చింది. విచారణలో సాక్ష్యంగా నిలవదగ్గ ఆధారాలను చూపడంలో సీబీఐ విఫలమైందని, అందుకే ఉత్తర్వులను కొట్టేస్తున్నామని స్పష్టం చేసింది. గవర్నర్‌గా శంకర నారాయణ ఉండగానే చవాన్‌ను విచారించేందుకు సీబీఐ అప్పట్లో అనుమతి కోరగా ఆయన తిరస్కరించారు. ఆ తర్వాత విద్యాసాగర్ గవర్నర్ అయ్యాక కేసులో తమకు కొన్ని కొత్త ఆధారాలు లభించాయని, చవాన్‌పై విచారణ జరిపేందుకు అనుమతించాలని సీబీఐ కోరడంతో ఆయన 2016లో ఆ మేరకు ఉత్తర్వులిచ్చారు. దీనిని చవాన్ సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించడంతో ఆ పిటిషన్‌ను కోర్టు విచారించింది. ‘కొత్త ఆధారాలు లభించాయని సీబీఐ చెప్పడంతో పాత గవర్నర్ నిర్ణయానికి భిన్నంగా చవాన్‌పై విచారణ జరిపేందుకు ప్రస్తుత గవర్నర్ అనుమతించారు. కానీ కోర్టుల్లో విచారణ సమయంలో సాక్ష్యంగా నిలవదగ్గ కొత్త ఆధారాలను సీబీఐ సమర్పించలేక పోయింది. కాబట్టి గవర్నర్ ఉత్తర్వులు చెల్లవు. వాటిని కొట్టేస్తున్నాం’ అని బెంచ్ స్పష్టం చేసింది. చవాన్‌పై ఆరోపణలివే దక్షిణ ముంబైలో రక్షణ శాఖ ఉద్యోగులకు, సైనికులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనేదే ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ పథకం. ఆ స్థలంలో ముందుగా అనుకున్న దానికన్నా అదనంగా భవంతులు నిర్మించేందుకు చవాన్ అనుమతులిచ్చి అందుకు ప్రతిఫలంగా వాటిలో రెండు ఫ్లాట్లను తమ బంధువులకు బదలాయించారనేది ఆరోపణ. సైనికులకు, రక్షణ శాఖ ఉద్యోగులకు మాత్రమే నిర్మిస్తున్న ఈ సొసైటీలో 40 శాతం ఫ్లాట్లను సాధారణ పౌరులకు కూడా చవాన్ (అప్పటికి ఈయన రెవెన్యూ మంత్రి) అక్రమంగా కేటాయించారని ఆరోపణలున్నాయి. -
ఆదర్శ్ స్కాం.. మాజీ సీఎంకు భారీ ఊరట
సాక్షి, ముంబై : ఆదర్శ్ కుంభకోణంలో మాజీ ముఖ్యమత్రి అశోక్ చవన్‌కు భారీ ఊరట లభించింది. ఆయన్ని ప్రాసెక్యూట్ చేయాలన్న రద్దు చేస్తూ బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది. దర్యాప్తులో సీబీఐ సాక్ష్యాలు సమర్పించకపోవటంతో ఆయన్ని తిరిగి విచారించేందుకు అనుమతి ఇస్తూ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ చవన్ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు శుక్రవారం ఆ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మాజీ సీఎం తరహా వ్యక్తులను విచారణ చేపట్టాలంటే అందుకు సంబంధించి ఉత్తర్వులు ప్రత్యేకంగా జారీ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో చర్చించాకే గవర్నర్ ఈ ఉత్తర్వులను వెలువరించారు. అయినా న్యాయస్థానం మాత్రం అందుకు అంగీకరించకపోవటం విశేషం. కాగా, 2010లో ఆదర్శ్ హౌజింగ్ సోసైటీ స్కాం వెలుగులోకి రాగా.. చవన్ రాజీనామా చేసి ఆ స్థానంలో పృథ్వీరాజ్ సీఎంగా పగ్గాలు చేపట్టాడు. ఆపై జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం విదితమే. -
మాజీ సీఎంపై ఇంకు దాడి
నాగ్ పూర్: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పై ఓ వ్యక్తి ఇంకు దాడికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న చవాన్ బహిరంగ సభలో మాట్లాడటానికి నిల్చొని ఉండగా ఓ కాంగ్రెస్ కార్యకర్త ఆయన ముఖంపై నల్ల ఇంకు చల్లాడు. చవాన్ పై ఇంకు దాడిని ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ ఖండించారు. ప్రజాస్వామ్యం వ్యతిరేకత తెలియజేసే విధానం ఇది కాదని అన్నారు. ఇంకు చల్లిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. -
‘ఆదర్శ్’ కేసులో కొత్త మలుపు
ముంబై: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆదర్శ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం కేసులో నిందితుడైన మాజీ సీఎం, కాంగ్రెస్ నేత అశోక్ చవాన్‌ను విచారించేందుకు గవర్నర్ విద్యాసాగర్‌రావు సీబీఐకి అనుమతిచ్చారు. విచారణ విషయమై రాష్ట్ర కేబినెట్ గవర్నర్‌కు తమ అభిప్రాయం తెలిపిన తర్వాత గురువారం గవర్నర్ నుంచి సీబీఐకి అనుమతి లభించింది. కేసుకు సంబంధించి చవాన్‌కు వ్యతిరేకంగా ఆధారాలు లభించాయని, ఆయన్ను విచారించేందుకు అనుమతివ్వాలని కోరుతూ 2015, అక్టోబర్ 8న గవర్నర్‌కు సీబీఐ లేఖ రాసింది. ఈ విషయమై ప్రభుత్వ అభిప్రాయాన్ని గవర్నర్ కోరగా విచారణ కొనసాగించాలని రాష్ట్ర కేబినెట్.. గవర్నర్‌కు తెలిపింది. -
మాజీ సీఎంకు ఎదురుదెబ్బ!
ముంబై: మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి మరో దెబ్బ తగలనుంది. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణానికి సంబంధించిన కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. కేసు విచారణను ఆ రాష్ట్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేసినట్లు కనిపిస్తోంది. ఆదర్శ్ కేసులో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌పై విచారణ చేపట్టేందుకు గవర్నర్ విద్యాసాగర్ రావు సీబీఐ అధికారులకు గురువారం అనుమతి ఇచ్చారు. దీంతో ఈ కేసును ఆ రాష్ట్ర ప్రభుత్వం మరింత సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆదర్శ్ కుంభకోణానికి పాల్పడ్డవారి పేర్లను సీబీఐ కచ్చితంగా బయటపెట్టాలంటూ శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఇటీవలే డిమాండ్ చేశారు. ఈ కేసు విచారణ సవ్యదిశలో సాగడం లేదని ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే. కొంతమంది పెద్దలు నేరాలకు పాల్పడిన అనంతరం వారికి వారే క్లీన్ చిట్ పొందడం పరిపాటిగా మారిందని ఇటీవలే మండిపడగా.. తాజాగా మాజీ సీఎం చవాన్ పై విచారణ చేపట్టాలని సీబీఐకి కేసు అప్పగించారు. ఆదర్శ్ కుంభకోణం ఇదీ.. అమరులైన జవాన్ల కుటుంబాల కోసం ముంబైలోని కొలాబా ప్రాంతంలో ఆదర్శ్ సొసైటీ భవనాన్ని నిర్మించారు. అప్పటి ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తన బంధువులకు ఇళ్లు ఇప్పించడంతో ఈ కేసులో ఇరుక్కుని పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. 2010లో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన అనంతరం అశోక్ చవాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన ఈ కుంభకోణంలో నిందితుడిగా పలు కేసులను ఎదుర్కొంటున్నారు. అది కేవలం బీజేపీ ప్రతీకారేచ్ఛ చర్య: చవాన్ తనపై సీబీఐ విచారణకు గవర్నర్ ఆదేశించడం బీజేపీ ప్రతీకారేచ్చను సూచిస్తుందని అశోక్ చవాన్ పేర్కొన్నారు. బీజేపీ ప్రోద్బలంతోనే తనపై విచారణ చర్యలకు దిగుతున్నారని వ్యాఖ్యానించారు. ఆర్మీ అధికారుల కుటుంబాలకు కేటాయించినట్లు ఎక్కడా పేర్కొనలేదని... అది కేవలం మహారాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోని ప్లేస్ అని వివరించారు. జస్టిస్ పాటిల్ కమిటీ రిపోర్టులో ఈ విషయం స్పష్టంగానే ఉందని.. కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నంత మాత్రాన ఆదర్శ్ కుంభకోణం అంశంలో గవర్నర్ తన నిర్ణయాన్ని ఏ విధంగా మార్చుకుంటారని మాజీ సీఎం చవాన్ మండిపడ్డారు. -
రుణమాఫీపై రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
♦ ఈ నెల 9,10 తేదీల్లో చేపడతాం: అశోక్ చవాన్ ♦ మాఫీపై ప్రభుత్వం ఎందుకు కినుక వహిస్తోందని వ్యాఖ్య సాక్షి, ముంబై : రైతుల రుణ మాఫీ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 9, 10వ తేదీల్లో కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టనున్నట్లు ఎంపీసీసీ అధ్యక్షుడు అశోక్ చవాన్ వెల్లడించారు. ముంబైలోని గాంధీభవన్‌లో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది మొదటి అయిదు నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 1059 రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ప్రభుత్వం ప్రకటించిందని, ప్రత్యక్షంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశముందన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో ఎక్కువ మంది అప్పుల బాధతోనే తనువు చాలించినట్లు తెలిసిందన్నారు. రైతులతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రైతులకు రుణాల మాఫీ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రకటన చేయడం లేదని నిలదీశారు. రైతుల రుణమాఫీ విషయమై ఈ నెల తొమ్మిది, 10వ తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేపడతామని చవాన్ పేర్కొన్నారు. ఈ బాధ్యతలను జిల్లా కాంగ్రెస్ నాయకులు అప్పగించామన్నారు. సతారా జిల్లాలో మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ నేతృత్వంలో జరుగుతాయని, సింధుదుర్గా, ర త్నగిరి జిల్లాలలో జరిగే ఆందోళనకు మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణే నేతృత్వం వహించనున్నారని చెప్పారు. అహ్మద్‌నగర్-ఔరంగాబాద్ జిల్లాల్లో ప్రతిపక్ష నాయకుడైన రాధకృష్ణ విఖేపాటిల్ నేతృత్వంలో ప్రదర్శనలు నిర్వహిస్తామని వెల్లడించారు. -
‘సహకార’లో మిశ్రమ ఫలితాలు
- ముంబై బ్యాంక్‌లో, పుణేలో ఎన్సీపీ విజయం - సింధుదుర్ గలో టచ్‌లోకి వచ్చిన రాణే - నాందేడ్‌లో ఓటమి పాలైన అశోక్ చవాన్ ప్యానెల్ - కనిపించని శివసేన ప్రభావం సాక్షి, ముంబై: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని సహకార బ్యాంకులకు జరిగిన ఎన్నికల్లో ప్రధాన పార్టీల నాయకులు తమ ప్రాబల్యాన్ని మరోమారు నిరూపించుకున్నారు. నగర్ జిల్లాలో రాధాకృష్ణ విఖే పాటిల్, పుణేలో అజీత్ పవార్, బీడ్ జిల్లాలో పంకజా ముండే-పాలవే, జల్గావ్లో ఏక్నాథ్ ఖడ్సే, లాతూర్‌లో దిలీప్ దేశ్‌ముఖ్, ముంబై బ్యాంక్‌లో ప్రవీణ్ దరేకర్, సింధుదుర్గ్ జిల్లాలో నారాయణ్ రాణే తదితర వర్గాల ఆధీనంలోకి బ్యాంకు అధికారాలు వెళ్లాయి. కాగా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రదేశ్ అధ్యక్షుడిగా నియమితుడైన అశోక్ చవాన్‌కు తన సొంత జిల్లా నాందేడ్‌లో గట్టి దెబ్బ తగిలింది. చవాన్ స్థానిక ఎంపీ అయినప్పటికీ బ్యాంకు ఎన్నికల్లో మాత్రం ఆయన ప్రాబల్యం కనిపించలేదు. ముంబైలో బీజేపీ ప్యానెల్ జోరు.. ముంబై బ్యాంక్ ఎన్నికల్లో ఇటీవల ఎమ్మెన్నెస్ నుంచి బీజేపీలో చేరిన ప్రవీణ్ దరేకర్‌కు చెందిన సహకార్ ప్యానెల్ చేతిలో శివప్రేరణ (శివ సేన) ప్యానెల్ ఓటమిపాలైంది. మొత్తం 21 స్థానాలుండగా, 15 స్థానాలకు ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో సహకార్ ప్యానెల్‌కు 13 స్థానాలు, శివసేన కేవలం రెండు స్థానాలు దక్కాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలోని ముంబై బ్యాంక్‌లో ఆధిపత్యం చెలాయించాలని శివసేన చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. శివసేన ఎంపీ సంజయ్ రావుత్ సోదరుడు, ఎమ్మెల్యే సునీల్ రావుత్‌కు ఎన్నికల బాధ్యతలు అప్పగించినా ఫలితం మాత్రం దక్కలేదు. పుణేలో ఎన్సీపీ వర్గం విజయ దుందుభి: పుణే జిల్లా సహకార బ్యాంకు ఎన్నికల్లో అజీత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ప్యానెల్ ఘన విజయం సాధించింది. మొత్తం 21 స్థానాల్లో 17 ఎన్సీపీ ప్యానెల్ దక్కించుకుంది. అందులో ఆరు స్థానాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగిలిన 15 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 13 ఎన్సీపీ దక్కించుకుంది. ఏకగ్రీవం అయిన వాటిలో నాలుగు స్థానాలు ఎన్సీపీవి ఉన్నాయి. కాంగ్రెస్, ఇండిపెండెంట్లు ఇద్దరు చొప్పున గెలిచారు. సింధుదుర్గ్‌లో రాణే ‘కమ్ బ్యాక్’: సింధుదుర్గ్ జిల్లా బ్యాంకు ఎన్నికల్లో రాణేకు ‘కమ్ బ్యాక్’ లభించినట్లయింది. కాంగ్రెస్‌కు చెందిన సంకల్ప సిద్ధి ప్యానెల్‌కు 12 స్థానాలు లభించాయి. పోటీ ప్యానల్ శివసేనకు చెందిన సహకార్ వైభవ్ ప్యానెల్‌కు కేవలం రెండు స్థానాలు మాత్రమే లభించాయి. బీడ్‌లో ముండే పైచేయి: బీడ్ జిల్లా బ్యాంక్‌లో పంకజా ముండే-పాలవే వర్గం పైచేయి సాధించింది. మొత్తం 19 స్థానాల్లో 16 ముండే వర్గానికి దక్కాయి. ఎన్సీపీ కేవలం మూడు స్థానాలతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. జల్గావ్లో ఖడ్సే వర్గం విజయం: జల్గావ్ జిల్లాలో రెవెన్యూ శాఖ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే వర్గం విజయ ఢంకా మోగించింది. ఇక్కడ ఒక ఎంపీ, ఇద్దరు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలు తదితర హేమాహేమీలు బరిలో దిగారు. మొత్తం 21 స్థానాల్లో ఖడ్సే వర్గం 17 స్థానాలు దక్కించుకుని అగ్రస్థానంలో నిలిచింది. నగర్లో బాలాసాహెబ్ థోరాత్: నగర్లో రాధాకృష్ణ విఖే పాటిల్, బాలాసాహెబ్ థోరాత్ ప్యానల్ మధ్య గట్టి పోటీ ఎదురైంది. మొత్తం 21 స్థానాల్లో 11 స్థానాలు థోరాత్ వర్గానికి రాగా 10 స్థానాలు విఖే పాటిల్ వర్గానికి వచ్చాయి. సాతారాలో ఎన్సీపీ హవా: సాతారా జిల్లాలో ఎన్సీపీ ప్యానెల్ విజయ కేతనం ఎగురవేసింది. మొత్తం 21 స్థానాల్లో ఏకంగా 19 స్థానాలు ఎన్సీపీ వర్గం కైవసం చేసుకుంది. రెండు స్థానాలు ఇండిపెండెంట్లకు లభించాయి. కాగా, ఈ ఎన్నికల్లో ఇండిపెండెంటుగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే విలాస్‌కాకా పాటిల్ కూడా గెలిచారు. లాతూర్‌లో దేశ్‌ముఖ్ ప్యానెల్ పైచేయి: లాతూర్ జిల్లాలో దిలీప్రావ్ దేశ్‌ముఖ్ ప్యానెల్ అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 19 స్థానాల్లో 17 దేశ్‌ముఖ్ వర్గం దక్కించుకుంది. మిగతా రెండు రమేశ్ కరాడ్(బీజేపీ) వర్గానికి వచ్చాయి. నాందేడ్‌లో చవాన్‌కు ఎదురు దెబ్బ నాందేడ్ జిల్లాలో అశోక్ చవాన్‌కు చెందిన కిసాన్ సమృద్ధి ప్యానెల్‌ను శేత్కరి వికాస్ ప్యానెల్ (శివసేన, బీజేపీ, ఎన్సీపీ కూటమి) ఓడించింది. మొత్తం 21 స్థానాల్లో శేత్కారికి 16 వచ్చాయి. చవాన్ వర్గం కేవలం ఐదు స్థానాలతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. బాంద్రా తూర్పు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పరాజయమైన తరువాత జరుగుతున్న ఈ ఎన్నికలను చవాన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గెలుపు కోసం ఆయన శాయశక్తులా ప్రయత్నించారు. కాషాయ కూటమితో పాత మిత్రపక్షం ఎన్సీపీ జత కట్టడంతో ఓటమి తప్పలేదు. -
మాజీ సీఎం అశోక్ చవాన్‌కు ఎదురుదెబ్బ
ముంబయి : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో నిందితుల జాబితా నుంచి చవాన్ పేరును తొలగించాలన్న సీబీఐ అభ్యర్థనను హైకోర్టు బుధవారం తిరస్కరించింది. ఈ కుంభకోణానికి సంబంధించిన చార్జిషీట్లో పేర్కొన్న 13 మంది నిందితుల పేర్ల నుంచి అశోక్ చవాన్ పేరును తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. అభియోగాల ఉపసంహరణ చర్యలపై ముంబయి హైకోర్టు స్టే విధించింది. కాగా అమర జవాన్ల కుటుంబాల కోసం ముంబైలోని కొలాబా ప్రాంతంలో ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ 31 అంతస్తుల భవన సముదాయం నిర్మించింది. అప్పటి ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఈ భవనంలో తన బంధువులకు ఫ్లాట్లు ఇప్పించడంతో ఈ కేసులో ఇరుక్కున్నారు. 2010లో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన అనంతరం అశోక్ చవాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దాంతో సిబిఐ ఈ కుంభకోణంలో నిందితుడిగా చవాన్‌ను పేర్కొంది. ఈ కుంభకోణంపై దర్యాప్తు జరిపిన జ్యుడీషియల్ కమిటీ హౌసింగ్ సొసైటీ ఇళ్ల కేటాయింపుల్లో అశోక్ చవాన్, ఈ కేటాయింపుల ద్వారా లబ్ధి పొందిన ఆయన సమీప బంధువులు కుమ్మక్కుకు పాల్పడ్డారని తేల్చి చెప్పింది. -
మహారాష్ట్రను ముక్కలు కానివ్వం
సాక్షి, ముంబై: మహారాష్ట్రను ముక్కలు చేయాలని కంటున్న కలలు ఎన్నటికీ నెరవేరనివ్వబోమని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కుండబద్దలు కొట్టారు. అధికార పత్రికైన సామ్నాలో బుధవారం రాసిన సంపాదకీయంలో బుధవారం మిత్రపక్షమైన బీజేపీని లక్ష్యంగా చేసుకుని పరోక్షంగా అనేక హెచ్చరికలు చేశారు. ‘రాష్ట్రాన్ని విభజించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ రెండు రోజుల కిందట హుతాత్మ చౌక్‌వద్ద అన్నారు. ఆవిధంగా చెప్పినందుకు ఆయనను మేము అభినందిస్తున్నాం. బీజేపీగానీ మరే పార్టీగానీ రాష్ట్రాన్ని విడదీయాలని చూస్తే సహించం’ అని స్పష్టం చేశారు. ఇదిలాఉంచితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై మహాకూటమి భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, శివసేన మధ్య వాగ్వాదం జరుగుతోంది. దీనికి తోడు సామ్నా సంపాదకీయంలో బీజేపీని లక్ష్యంగా చేసుకుని పరోక్షంగా హెచ్చరించడంతో భవిష్యత్తులో ఇరు పార్టీల మధ్య విభేదాలు తలెత్తే ప్రమాదం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరు పార్టీల మధ్య పొత్తు దెబ్బతినే ప్రమాదం కూడా లేకపోలేదని వారు పేర్కొంటున్నారు. -
ఎన్నికలకు సన్నద్ధం
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్టానం పార్టీని సమాయత్తం చేస్తోంది. రాష్ట్రంలో పార్టీ ప్రచార, సమన్వయ కమిటీలకు నారాయణ్ రాణే, అశోక్ చవాన్ పేర్లను ప్రకటించింది. అలాగే కేంద్ర మాజీ హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేను మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌గా నియమించింది. పై అన్ని కమిటీల్లోనూ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, పీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే సభ్యులుగా ఉంటారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ బాగా దెబ్బతినడంతో కాంగ్రెస్ కార్యకర్తలు డీలాపడిపోయారు. దీనికి తోడు అంతర్గత కుమ్ములాటలతో పార్టీ ప్రతిష్ట రోజురోజుకూ దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో డీలాపడిన కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపేందుకు, తద్వారా అసెంబ్లీ ఎన్నికల సమయానికి పార్టీని పటిష్టపరిచేందుకు అధిష్టానం కార్యాచరణ చేపట్టింది. అందులో భాగంగానే రాణే, అశోక్ చవాన్ వంటి అసంతృప్తివాదులను బుజ్జగించి వారికి సముచిత పదవులు ఇవ్వడం ద్వారా పార్టీలో అసంతృప్తిని తగ్గించేందుకు యత్నిస్తోందని పరిశీలకులు అంటున్నారు. రాణే, అశోక్చవాన్లకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తో సత్సంబంధాలు లేవనే విషయం అందరికీ తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ ఘోరపరాజయం తర్వాత ముఖ్యమంత్రిని మార్చాలన్న డిమాండ్‌కు వీరిద్దరూ వంతపాడారు. అలాగే నెల రోజుల కిందట నారాయణ్ రాణే సీఎం పనితీరుపై ఆరోపణలు చేస్తూ తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. పార్టీని సైతం విడుస్తున్నట్లు ప్రకటనలు ఇచ్చారు. అయితే అధిష్టానం అతడిని బుజ్జగించి పార్టీని గాడిలో పెట్టే బాధ్యత అప్పగించడం గమనార్హం. కాగా, కాంగ్రెస్ ప్రచార కమిటీలో 33 మంది సభ్యులుంటారు. వీరిలో మాజీ మంత్రులు అనంత్‌రావ్ థోప్డే, రోహిదాస్ పాటిల్, ఎంపీలు రజ్నీ పాటిల్, అవినాష్ పాండే, మాజీ ఎంపీ మిలింద్ దేవరా వంటివారు ఉన్నారు. ఇదిలా ఉండగా, సమన్వయ కమిటీలో షిండే, ముకుల్ వాషిక్, రాణే, మురళీ దేవరా, గురుదాస్ కామత్, జనార్ధన్ చందూర్కర్, పతంగ్‌రావ్ కదమ్, హుస్సేన్ దల్వాయీ, కమల్‌తాయి వ్యవహరే, శరద్ రన్పిసే వంటి వారు సభ్యులుగా ఉన్నారు. అలాగే 39 మంది సభ్యులతో మ్యానిఫెస్టో కమిటీని ఏర్పాటుచేసింది. ఇందులో రాష్ట్ర మంత్రులు బాలా సాహెబ్ థరోట్, హర్షవర్ధన్ పాటిల్, రాధాకృష్ణ విఖే పాటిల్, నితిన్ రావుత్, పార్టీ ఎంపీ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ సతవ్, పార్టీ అధికారి ప్రతినిధి అనంత్ గాడ్గిల్ తదితరులున్నారు. పీసీసీ అధ్యక్షుడి నాయకత్వంలో ప్రదేశ్ ఎన్నికల కమిటీని ఏర్పాటుచేశారు. ఇందులో ముఖ్యమంత్రితోపాటు సీనియర్ నాయకులు షిండే, వాస్నిక్, కామత్, అశోక్ చవాన్, రాణే, విలాస్ ముత్తెంవార్ సతావ్, ప్రియాదత్ సభ్యులుగా ఉంటారు. అలాగే మీడియా, ప్రచార కమిటీకి హర్షవర్ధన్ పాటిల్ చైర్మన్‌గా ఉంటారు. ఇందులో సభ్యులుగా కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ శుక్లా, సంజయ్ నిరుపమ్, అమిత్ దేశ్‌ముఖ్, రాష్ట్ర హోం సహాయ మంత్రి సతేజ్ పాటిల్ ఉంటారు. కాగా ఈ కమిటీకి సంజయ్ దత్, సచిన్ సావంత్, ఆశిష్ కులకర్ణి సమన్వయ కర్తలుగా వ్యవహరిస్తారు. -
చవాన్ విషయంలో జోక్యం చేసుకోం: సుప్రీం
న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కు ఎన్నికల సంఘం(ఈసీ) ఆయనకు జారీ చేసిన షోకాజ్ నోటీసుపై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చిన వ్యహారంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 15 రోజుల్లో ఈ వ్యవహారం తేల్చాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. చట్టప్రకారమే ఈ విషయంలో హైకోర్టు ముందుకెళుతుందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. బీజేపీ నాయకులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కిరిట్ సోమయ్యలతో పాటు మరో స్వతంత్ర సభ్యుడు చవాన్ వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. -
ప్రచార పగ్గాలు..అశోకుడికే?
సాక్షి, ముంబై: త్వరలో జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచార బాధ్యతలను మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌కు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోందా? ఢిల్లీ నుంచి వెలువడుతున్న సంకేతాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆదర్శ్ కుంభకోణం కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చవాన్‌కు బాంబే హైకోర్టు గురువారం వెలువరించిన తీర్పు కొంతమేర ఊరటనిచ్చింది. చవాన్‌ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ పిటిషన్‌పై కోర్టు స్టే విధించింది. కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా వారిని ముందు విచారించాలని కోర్టు సీబీఐకి సూచించడంతో ప్రస్తుతానికి చవాన్‌కు ముప్పు తప్పినట్లేనని చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా ప్రచార బాధ్యలను చవాన్‌కు అప్పగించాలని భావిస్తున్నట్లు సీనియర్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. చవాన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించడం ద్వారా అసంతృప్తులను తృప్తి పర్చొచ్చనే అభిప్రాయంలో అధిష్టానం ఉందంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరువు కాపాడిన నేతగానే కాకుండా మాస్ లీడర్‌గా కూడా చవాన్ మంచి పేరుందని, ఆయనకు బాధ్యతలు అప్పగిస్తేనే ఎన్నికల్లో గట్టెక్కుతామనే నిర్ణయానికి అధిష్టానం వచ్చిందంటున్నారు. ముఖ్యమంత్రిని మార్చాలనే సందర్భంలో కూడా అధిష్టానం అశోక్‌చవాన్ పేరును పరిశీలించిందని, అయితే పెయిడ్ న్యూస్ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నందున తీర్పు వెలువడే వరకు వేచి చూద్దామనే ధోరణిలో ఉన్న అధిష్టానం సీఎం మార్పు విషయంలో పృథ్వీరాజ్‌ను కొనసాగించాలని నిర్ణయించిందని, దీంతో అశోక్ చవాన్‌కు ఎన్నికల బాధ్యతలు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చిందని చెబుతున్నారు. పైగా చవాన్‌కు బాధ్యలు అప్పగించడం ద్వారా రాణే వంటి నాయకులకు కూడా చెక్ పెట్టినట్లవుతుందంటున్నారు. ఎందుకంటే సీఎంతోపాటు మాణిక్‌రావ్‌పై కూడా రాణే విమర్శలు చేశారు. అయితే రాణే, అశోక్‌చవాన్ జోలికి వెళ్లలేదు. వీరిద్దరి మధ్య కొంతమేర సత్సంబంధాలే ఉన్నాయని చెబుతున్నారు. దీంతో అశోక్‌చవాన్‌కు బాధ్యలు అప్పగిస్తే రాణే వంటి నాయకుల నుంచి కూడా ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం కాదని చెబుతున్నారు. ఎన్సీపీ ఆగడాలకూ అడ్డుకట్ట.. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత పార్టీని పటిష్టం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశించిన స్థానాల్లో విజయం సాధించాలంటే మాస్బేస్ నాయకుడి అవసరం ఉందని భావిస్తోంది. మాస్లో మంచి పేరున్న విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మరణం తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేసే నాయకుడిగా అశోక్‌చవాన్‌కే పేరు దక్కింది. ఎన్సీపీలో అజిత్‌పవార్ వంటి మాస్ నేతలకు చెక్ పెట్టాలంటే అంతటి దూకుడును ప్రదర్శించే నేతకు ఎన్నికల ప్రచార బాధ్యలు అప్పగించాలనే డిమాండ్ కార్యకర్తల నుంచి వినిపిస్తుండడంతో అశోక్‌చవాన్ పాత్ర కీలకమైంది. కొత్త చిక్కులు.. ఆదర్శ్ సోసైటీ కుంభకోణం కేసులో చవాన్‌కు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. చవాన్‌ను విచారించాలని కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన కేతన్ తిరోదార్ తాజాగా మరిన్ని ఆరోపణలు చేశారు. సొసైటీలో అక్రమంగా ఫ్లాట్లు పొందిన మరో నలుగురు పెద్దమనుషుల పేర్లను సీబీఐ పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు. తిరోదార్ పేర్కొన్న ఆ నలుగురు చవాన్‌కు సన్నిహితులే కావడం ఆయనకు కొత్త తిప్పలు తెచ్చిపెట్టే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. -
అశోక్ చవాన్ కు ఊరట
న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కు ఊరట లభించింది. ఎన్నికల సంఘం(ఈసీ) ఆయనకు జారీ చేసిన షోకాజ్ నోటీసుపై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. బీజేపీ నాయకులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కిరిట్ సోమయ్యలతో పాటు మరో స్వతంత్ర సభ్యుడికి కోర్టు నోటీసులు జారీ చేసింది. చవాన్ వ్యతిరేకంగా ఎన్నికల సంఘానికి వీరు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధనలకు అనుగుణంగా తన ఎన్నికల ప్రచార వ్యయం వివరాలను ఇవ్వడంలో ఆయన విఫలమయ్యారని పేర్కొంటూ ఎన్నికల సంఘం జూలై 13న చవాన్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. జవాబిచ్చేందుకు 20 రోజుల గడువిచ్చింది. -
అశోక్ చవాన్‌కు ఈసీ నోటీసు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ చిక్కుల్లో పడ్డారు. చెల్లింపు వార్తల వ్యవహారంలో ఎన్నికల సంఘం(ఈసీ) ఆదివారం ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. జవాబిచ్చేందుకు 20 రోజుల గడువిచ్చింది. ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధనలకు అనుగుణంగా తన ఎన్నికల ప్రచార వ్యయం వివరాలను ఇవ్వడంలో ఆయన విఫలమయ్యారని పేర్కొంది. ఆయనపై అనర్హత వేటు ఎందుకు వేయరాదో చెప్పాలంది. 2009లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చవాన్ సీఎంగా ఘనతలను ప్రస్తావిస్తూ వార్తాపత్రికల్లో వాణిజ్య ప్రకటనలు ఇచ్చారు. ఇవి చెల్లింపు వార్తల కింద పరిగణించి ఇందుకైన మొత్తాన్ని ఆయన ఎన్నికల వ్యయంలో కలపాలన్న ఫిర్యాదుకు సంబంధించి చవాన్ ఇచ్చిన వివరణపై ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఒకవేళ ఈసీ కనుక చవాన్‌పై అనర్హత వేటు వేస్తే ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దయ్యే అవకాశముంది. కాగా, చెల్లింపు వార్తలకు మీడియా జాగ్రత్తగా ఉండాలని ఈసీ హెచ్చరించింది. -
మరాఠ్వాడా బాధ్యతలు అశోక్‌చవాన్‌కు
ముంబై: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడానికి కాంగ్రెస్ కసరత్తుల జోరు పెంచింది. మరాఠ్వాడా ప్రాంతానికి సంబంధించి ఎన్నికల వ్యూహాలను రూపొందించే బాధ్యతను మాజీ ముఖ్యమంత్రి, నాందేడ్ ఎంపీ అశోక్‌రావ్ చవాన్‌కు శుక్రవారం అప్పగించారు. మధుకర్ చవాన్, రాజేంద్ర దర్డా, అమిత్ దేశ్‌ముఖ్, అబ్దుల్ సత్తార్, డీపీ సావంత్‌లతో కూడిన మరాఠ్వాడా నేతల బృందానికి చవాన్ నేతృత్వం వహిస్తారు. 2010లో ఆదర్శ్ కుంభకోణంలో చవాన్‌పై కూడా ఆరోపణలు వెల్లువెత్తడంతో ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన వైదొలిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నాందేడ్ ఎంపీగా పోటీ చేసిన చవాన్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోటీచేసిన 26 స్థానాల్లో కాంగ్రెస్ కేవలం రెండు నియోజకవర్గాల్లో మాత్రమే గెలిచింది. అందులో ఒకటి అశోక్‌చవాన్ బరిలో నిలిచిన నాందేడ్ కాగా మరొకటి రాజీవ్ సతావ్ బరిలో నిలిచిన హింగోళి. గెలిచిన రెండు స్థానాలు కూడా మరాఠ్వాడా ప్రాంతంలోనివే కావడం గమనార్హం. అంతటి మోడీ ప్రభంజనంలో కూడా ఇక్కడి ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలిచారని చెప్పేందుకు ఈ రెండు నియోజకవర్గాల్లో విజయమే ఉదాహరణ. దీంతో ఈ ప్రాంతంలోని కాంగ్రెస్ కార్యకర్తలను అసెంబ్లీ ఎన్నికలనాటికి పూర్తి సమాయత్తం చేయాలని భావించిన అధిష్టానం ఇక్కడి ప్రజల సమస్యలు, కులాల వారీగా రిజర్వేషన్లు, రహదారుల సమస్యలు, రైతుల సమస్యలను గుర్తించి, ఎన్నికల వ్యూహాలను రూపొందించే బాధ్యత అశోక్‌చవాన్ నేతృత్వంలోని బృందానికి అప్పగించింది. అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తీసుకున్న మొదటి నిర్ణయం దాదాపుగా ఇదేనని చెప్పవచ్చు. ఈ రీజియన్‌లో 46 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2009లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడి 18 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. ఇదిలాఉండగా ఈ ప్రాంత సమస్యల విషయమై సీఎం చవాన్, ఎంసీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మోహన్ ప్రకాశ్ తదితరులు అశోక్‌చవాన్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇక్కడి సమస్యలను చవాన్ వారికి వెల్లడించినట్లు సమాచారం. వాటిలో స్థానిక సమస్యలతోపాటు మరిన్ని కులాలకు రిజర్వేషన్ కల్పించడం, ఆలయాలు, ప్రార్థనా స్థలాలకు నిధులను పెంచడం, రైతుల సమస్యలు తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. -
నేడే విస్తరణ
సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో దారుణ పరాజయం అనంతరం అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారించిన ఎన్సీపీ, కాంగ్రెస్‌లు ముందుగా రాష్ట్ర మంత్రి మండలిని విస్తరించాలని నిర్ణయం తీసుకున్నాయి. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం మంత్రిమండలిని విస్తరించి, గురువారం ఉదయం కొత్త మంత్రులతో రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిసిన అనంతరం మంత్రిమండలిని విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైద్యవిద్యాశాఖ మంత్రి విజయ్‌కుమార్ గావిత్‌ను పార్టీ నుంచి తొలగించడంతో ఆయన స్థానం, ఎన్సీపీ కోటాలోని ఓ కేబినెట్ పదవి ఖాళీగా ఉన్నాయి. దీంతోపాటు ఆరోగ్య, సాంస్కృతికశాఖ మంత్రి ఫౌజియాఖాన్ (ఎమ్మెల్సీ) పదవీకాలం కూడా ముగిసింది. దీంతో వీటిని భర్తీ చేయడం కోసం మంత్రిమండలిని విస్తరించనున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ అభ్యర్థికి ఫౌజియాఖాన్ సహకరించలేదన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెకు మరోసారి మంత్రిపదవి దక్కే అవకాశాలు సన్నగిల్లాయి. గావిత్ స్థానంలో మహారాష్ట్ర ఎన్సీపీ కార్యాధ్యక్షులు జితేంద్ర అవాడ్‌కు వైద్యవిద్యాశాఖ మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. ఈ పదవి కోసం రేసులో శరద్గావిత్ పేరు కూడా వినిపిస్తోంది. ఫౌజియాఖాన్ స్థానం కోసం జితేంద్ర అవాడ్తోపాటు ప్రకాష్ సోలంకే, ధనంజయ్ ముండే, సమీర్ భుజ్‌బల్, పంకజ్ భుజ్బల్లతోపాటు పలువురు రేసులో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ కోటాలోని మూడు మంత్రి పదవులను కూడా భర్తీ చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది. దీంతో కాంగ్రెస్‌లో కూడా మంత్రి పదవులపై ఆసక్తికనబరుస్తున్న నాయకులలో ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్‌రావ్ ఠాక్రేతోపాటు వసంత్ పురకే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసమే... అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగైదు నెలల్లో జరగనున్నాయి. ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రజాస్వామ్య కూటమికి చెందిన కాంగ్రెస్, ఎన్సీపీలు ఘోరపరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. సుశీల్‌కుమార్ షిండే, మిలింద్ దేవరా, ప్రియాదత్ ఇలా అనేక మంది దిగ్గజ నాయకులు ఓటమి పాలయ్యారు. దీంతో కాంగ్రెస్‌కు మరాఠ్వాడాలోని కేవలం రెండు స్థానాలు లభించగా ఎన్సీపీకి పశ్చిమ మహారాష్ట్రలోని నాలుగు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నంలో భాగంగానే ఈ మంత్రి మండలి విస్తరణ జరుగుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో పాత ముఖాలే.. మంత్రివర్గ విస్తరణలో ఎన్సీపీ నుంచి కేబినెట్ పదవిని కొత్త వ్యక్తికి కట్టబెట్టాలని చూస్తుండగా కాంగ్రెస్ మాత్రం పాతవారితోనే విస్తరణ తంతు ముగించాలనుకుంటున్నట్లు సమాచారం. -
నేతృత్వ బాధ్యతలపై రాణే, అశోక్ చవాన్ దృష్టి
సాక్షి, ముంబై: రాష్ట్ర కాంగ్రెస్‌లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో చావుదెబ్బ తినడంతో రాబోయే రోజుల్లో పలు కీలక మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం ఇప్పటికే మంత్రులు నారాయణ రాణే, విజయ్ రావుత్ రాజీనామాలు చేశారు. ఈ ఎన్నికల్లో ఓటమిపై ఇప్పటికే జరుగుతున్న సమీక్ష సమావేశాల్లో పదాధికారులు, కార్యకర్తల అభిప్రాయాలు స్వీకరిస్తున్న ఎంపీసీసీ నేతలు తదనుగుణంగా పార్టీని పటిష్టపరిచేందుకు మార్పులు చేసే అవకాశముందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ లోక్‌సభ ఎన్నికలలో పరాజయానికి నైతికబాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించినప్పటికీ రాజీనామాకు మాత్రం ససేమిరా అన్నారు. ఆయన రాజీనామాపై పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని ఎంపీసీసీ తీర్మానించిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు పృథ్వీరాజ్ చవాన్‌ను తప్పించే అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని మళ్లీ రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించేందుకు ఇద్దరు మాజీ సీఎంలు సిద్ధమవుతున్నారు. నారాయణ రాణే, అశోక్ చవాన్ ఎవరికి వారుగా తమ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ నేతృత్వ బాధ్యతలు అప్పగించాలని నేరుగా ఎలాంటి ప్రకటనలు చేయకున్నా, తెరవెనుక తమ పనులు చకచకా చేసుకుంటూ వెళుతున్నారని పార్టీ వర్గాల్లో వినబడుతోంది. మళ్లీ సీఎం పీఠం దక్కించుకునేందుకు ఎవరికివారుగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. రాణే దూకుడు... కొంకణ్‌లో తన కుమారుడైన నీలేష్ రాణే పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసిన నారాయణ రాణే తనదైన శైలిలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తప్పుకోవాలని పార్టీపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇది నిజమేననట్టుగా కాంగ్రెస్ నేతృత్వ బాధ్యతలు నారాయణ రాణేకు అప్పగించాలని సింధుదుర్గా జిల్లా కాంగ్రెస్ తీర్మానించింది. దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలు మార్పులు జరిగే అవకాశాలున్నాయనే వాదనకు బలం చేకూర్చినట్టైంది. లోక్‌సభ ఎన్నికల పరాజయంపై సమీక్ష సమావేశంలో కూడా నారాయణ రాణే పొల్గొనలేదు. ఇలాచేసి పృథ్వీరాజ్ చవాన్ కూడా నైతిక బాధ్యత వహిస్త్తూ తనలాగే రాజీనామా చేయాలని సంకేతాలు ఇచ్చారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత సమయంలో ఓ ప్రణాళిక ప్రకారం దూకుడుగా ముందుకువెళ్లి పార్టీ పగ్గాలు చేజిక్కించుకోవాలనుకుంటున్న రాణే అందుకు తగ్గట్టుగానే చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గట్టెక్కించాలంటే దూకుడుగా ఉండే నాయకుడు అవసరమని అందరికీ తెలియజేసేలా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ విషయాలపై మాత్రం అటు పార్టీ, ఇటు రాణే ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. మళ్లీ కీలకపాత్రపై అశోక్ దృష్టి... ఆదర్శ్ కుంభకోణం కేసు కారణంగా ముఖ్యమంత్రి పదవిని కోల్పోయి దాదాపు అజ్ఞాతంలోకి వెళ్లిన అశోక్ చవాన్‌కు లోక్‌సభ ఎన్నికలు ఊపిరిని పోశాయి. ఆదర్శ్‌తోపాటు పేయిడ్ న్యూస్ అంశం ఇంకా ఆయనను వెంబడిస్తున్నా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అశోక్‌చవాన్ వర్గీయుల్లో మాత్రం ఓ కొత్త ఆశ చిగురించేలా చేశాయి. తన పరిధిలోని నాగపూర్, హింగోలి ఎంపీ స్థానాలు కాంగ్రెస్ దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించిన అశోక్ చవాన్ మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో దూకుడు పెంచాలనుకుంటున్నారు. ఆదర్శ్ కుంభకోణం దర్యాప్తు నివేదికను మంత్రి మండలి తోసిపుచ్చడంతో ఆయన కీలకంగా వ్యవహరించేందుకు ఆస్కారాలున్నాయని అందరూ భావించారు. ఇందుకు తగ్గట్టుగానే లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్‌లో కూడా పరిస్థితులు మారాయి. ఇప్పటివరకు పృథ్వీరాజ్ చవాన్, మాణిక్‌రావ్ ఠాక్రేలకు అభయమిస్తు వస్తున్న అధిష్టానం కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నేతృత్వాన్ని మార్చాలా? అనే దిశగా ఆలోచిస్తున్నట్టు తెలిసింది. కాగా, మరో ఐదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు విజయం లభించేందుకు మాస్‌ను ఆకర్షించడంతో పాటు అందరినీ కలుపుకుపోయే నేత అవసరం ఉందని భావిస్తున్నారు. మరాఠ్వాడా నాయకుడు, దివంగత మాజీ సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ అనంతరం ఆయన స్థానాన్ని భర్తీ చేసే నాయకులెవరూ కాంగ్రెస్‌కు లభించలేదని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి పథ్వీరాజ్ చవాన్ పరిపాలన క్లీన్‌గా ఉన్నప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించలేకపోయారు. మరోవైపు అశోక్ చవాన్‌కు బాధ్యతలు అప్పగించిన రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. రాష్ట్రంలో మోడీ ప్రభంజనం లేదని, సరైన నేతృత్వం లేకపోవడంతోనే మిగతా ప్రాంతాల్లో పరాజయం పాలైందని అశోక్ చవాన్ పేర్కొంటున్నారు. దీన్నిబట్టి ఆయన మళ్లీ రాష్ట్రంలో పార్టీ పగ్గాలు అప్పగిస్తే చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. -
డీఎఫ్ ఢమాల్!
సాక్షి, ముంబై: కాంగ్రెస్, ఎన్సీపీ నేతృత్వంలోని ప్రజాస్వామ్య కూటమికి ఓటరు చావుదెబ్బ కొట్టాడు. ఈ దెబ్బతో కాంగ్రెస్ దాదాపు కోమాలోకి వెళ్లిపోగా ఎన్సీపీ తీవ్ర గాయాలతో ఐసీయూలో చేరిందని చెప్పుకుంటున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో 48 స్థానాలకుగాను 25 స్థానాలను దక్కించుకున్న కాంగ్రెస్, ఎన్సీపీలు ఈసారి కనీసం రెండంకెల సంఖ్యను కూడా చేరలేకపోయాయి. ఈసారి ఓటరు హస్తానికి మొండిచేయి చూపగా రాష్ట్రవాది కాంగ్రెస్‌ను కాస్త కనిక రించాడు. రెండు పార్టీలు కలిసి కేవలం 5 స్థానాలను మాత్రమే కైవసం చేసుకోగా మిగతా అన్ని స్థానాల్లోనూ మహాకూటమి స్పష్టమైన ఆధిక్యతను కనబర్చింది. గతంలో 17 స్థానాలను దక్కించుకున్న కాంగ్రెస్ ఈసారి కేవలం ఒకేఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పరాజయం పాలైన దిగ్గజాలు...: మహారాష్ట్రలోని అనేక మంది దిగ్గజ నాయకులు పరాజయం పాలయ్యారు. ఊహించనిరీతిలో ఓటమిపాలైనవారిలో కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, సహాయక మంత్రులు ఉండడం విశేషం. షోలాపూర్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే బీజేపీకి చెందిన శరద్ బన్సోడే చేతిలో ఘోరపరాజయాన్ని రుచిచూశారు. ఇక కేంద్ర విమానయానశాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ బండారా-గోండియా నియోజకవర్గం నుంచి పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి నానాబహూ పటోలే చేతిలో పరాజయంపాలయ్యారు. మరోవైపు నాసిక్‌లో ఎన్సీపీ సీనియర్ నాయకులైన ప్రజాపనులశాఖ మంత్రి ఛగన్ భుజ్‌బల్‌పై మహాకూటమి అభ్యర్థి హేమంత్ గోడ్సే గెలుపొందారు. రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి సునీల్ తట్కరేతోపాటు ముకుల్ వాస్నిక్ కూడా ప్రత్యర్థుల చేతిలో పరాజయంపాలవక తప్పలేదు. ముంబైలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అయిదుగురు దిగ్గజాలు మిలింద్ దేవరా, ప్రియాదత్, గురుదాస్ కామాత్, సంజయ్ నిరుపమ్, ఏక్నాథ్ గైక్వాడ్‌లు కూడా ఓటమిని ఎదుర్కొనక తప్పలేదు. కాంగ్రెస్, ఎన్సీపీలకు చెందిన వారే కాకుండా ఎమ్మెన్నెస్, ఆప్ నాయకులు పరాజయం పాలైనవారిలో ఉన్నారు. కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి: మిలింద్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయంపాలైన విషయాన్ని ఆ పార్టీ నేత మిలింద్ దేవరావద్ద మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు ఆయన మాట్లాడుతూ... ‘బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి నా శుభాకాంక్షలు. ఓటమిపై కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. బలోపేతమవ్వాలి. మద్దతుదారులకు నా ధన్యవాదాలు. విజేత మోడీకి నా శుభాకాంక్షలు. దేశం ముందుకు పోతుందని అకాంక్షిస్తున్నాన’న్నారు. -
పెయిడ్ న్యూస్ కేసులో అశోక్‌చవాన్‌కు చుక్కెదురు
సాక్షి, ముంబై: పెయిడ్ న్యూస్ కేసులో మాజీ ముఖ్యమంత్రి అశోక్‌రావ్ చవాన్‌కు చుక్కెదురైంది. తనపై ఎన్నికల కమిషన్ ప్రారంభించిన దర్యాప్తును నిలిపివేయాల్సిందిగా కోరుతూ చవాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం కొట్టివేసింది. దీంతో ఆయనపై దర్యాప్తు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో చవాన్‌కు అనుకూలంగా అనేక వార్తలు వివిధ వార్తా పత్రికల్లో ప్రచురితమయ్యాయి. దీంతో చవాన్ ఎన్నికల ఖర్చు పరిమితి దాటిందని ఆరోపిస్తూ ఆయన ప్రత్యర్థి మాధవ్ కిన్వల్కర్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ కూడా ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఎన్నికల కమిషన్ దర్యాప్తు అధికారులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దర్యాప్తును నిలిపివేయాలని అశోక్ చవాన్ ముందుగా హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టులో కూడా ఊరట లభించకపోవడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టులో కూడా అదే తీర్పు పునరావృతం కావడం, ఎన్నికల కమిషన్‌కు అనుకూలంగా తీర్పు వెలువడింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి వార్తపత్రికల్లో ఇచ్చే ప్రకటనల ఖర్చులు చూపించనట్టయితే ఎన్నికల కమిషన్‌కు దర్యాప్తు చేసేందుకు పూర్తి అధికారాలున్నాయని సుప్రీం కోర్టు పేర్కొంది. దీంతో చవాన్ దర్యాప్తును ఎదుర్కొనక తప్పని పరిస్థితి నెలకొంది. -
ఐదో విడతలో 65% పోలింగ్
*అతి పెద్ద విడత లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతం *12 రాష్ట్రాల్లోని 121 స్థానాలకు ఎన్నికలు న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఐదో, అతిపెద్ద విడత పోలింగ్ గురువారం చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 12 రాష్ట్రాల్లోని 121 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్ సగటున 65 శాతం నమోదైంది. ఇది 2009 నాటి పోలింగ్‌కంటే ఎక్కువ. ప్రభుత్వ వ్యతిరేక ఓటు వల్ల ఈసారి పోలింగ్ పెరిగిందని భావిస్తున్నారు. తాజా విడతలో పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 78.89 శాతం, మధ్యప్రదేశ్‌లో అతి తక్కువగా 54.41 శాతం రికార్డయింది. అయితే మధ్యప్రదేశ్‌లో గత ఎన్నికల నాటి 46.2 శాతం కంటే ఇది మెరుగ్గా ఉండడం విశేషం. తాజా పోలింగ్‌లో జార్ఖండ్‌లో స్వల్పహింస చోటు చేసుకుంది. మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. నక్సల్స్ ఓ రైల్వే ట్రాక్‌ను పేలుడు పదార్థాలతో ధ్వంసం చేశారు. బాంబులూ పేల్చారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ ఎన్నికల బృందం లక్ష్యంగా దాడి చేసినా ఎవరూ గాయపడలేదు. 1,769 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఐదో విడత ముగింపుతో మొత్తం తొమ్మిది విడతల ఎన్నికల్లో సగం ప్రక్రియ పూర్తయింది. తొలి నాలుగు విడతల్లో 111 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.16 కోట్ల మందికిపైగా ఓటర్లున్న ఐదో విడతలోని 121 స్థానాల్లో ప్రస్తుతం 46 బీజేపీ దాని మిత్రపక్షాల ఖాతాలో, 46 కాంగ్రెస్, దాని మిత్రపక్షాల ఖాతాలో ఉన్నాయి. దీంతో ఎన్నికల ఫలితాల్లో ఈ పోలింగ్ కీలకం కానుంది. ఈ విడతలో బీహార్‌లోని 7 స్థానాలు, ఛత్తీస్‌గఢ్‌లోని 3, జమ్మూకాశ్మీర్‌లో 1(ఉధంపూర్), జార్ఖండ్‌లోని 6, కర్ణాటకలోని మొత్తం 28, మధ్యప్రదేశ్‌లోని 10, మహారాష్ట్రలోని 19, మణిపూర్‌లో 1(మణిపూర్ ఇన్నర్), ఒడిశాలోని 11, రాజస్థాన్‌లోని 20, ఉత్తరప్రదేశ్‌లోని 11, పశ్చిమ బెంగాల్‌లోని 4 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఒడిశాలో 77 అసెంబ్లీ స్థానాలకూ ఎన్నికలు జరిపి రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగించారు. ఇక్కడ మూడో విడతలో 70 అసెంబ్లీ, 10 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. పోలింగ్ ఇలా.. : దేశంలో బీజేపీ గాలి వీస్తోందని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ఆసక్తికరంగా మారిన కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో 68 శాతం పోలింగ్ నమోదైంది. కాంగ్రెస్ బీజేపీకి చెక్ పెట్టేందుకు ఇది తోడ్పడొచ్చని భావిస్తున్నారు. 2009 ఎన్నికల్లో ఇక్కడ 59 శాతం పోలింగ్ జరిగింది. నాటి ఎన్నికల్లో 18 స్థానాలు దక్కించుకున్న బీజేపీ ఈ సారి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. - మరో కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో 61.7, బీహార్‌లో 56 శాతం పోలింగ్ జరిగింది. గత ఎన్నికల్లో బీహార్ పోలింగ్ 39.3 శాతమే. తాజా ఎన్నికలను బహిష్కరించాలని నక్సల్స్ పిలుపునిచ్చినప్పటికీ జార్ఖండ్‌లో 62, ఛత్తీస్‌గఢ్‌లో 65, ఉత్తరప్రదేశ్‌లో 62.62, ఒడిశాలో 70 శాతం నమోదైంది. రాజస్థాన్‌లో గత ఎన్నికలకంటే 15 శాతం పెరిగి 63.4కు చేరింది. - మణిపూర్‌లో 74, జమ్మూకాశ్మీర్‌లో 69 శాతం రికార్డయింది. కాశ్మీర్ పోలింగ్ గత ఎన్నికలకంటే 24 శాతం ఎక్కువ. - ఒడిశాలోని నక్సల్స్ ప్రభావమున్న చిత్రకొండ అసెంబ్లీ స్థానంలో రీపోలింగ్ కోసం 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 8 కేంద్రాల్లో ఒక్కరు కూడా ఓటేయలేదు. బరిలోని ప్రముఖులు.. ఈ విడతలో తలపడిన అభ్యర్థుల్లో.. నందన్ నీలేకని, మాజీ ప్రధాని దేవెగౌడ, బీజేపీ నేతలు మేనకా గాంధీ, గోపీనాథ్ ముండే, కేంద్ర మంత్రులు సుశీల్‌కుమార్ షిండే, వీరప్ప మొయిలీ, గులాం నబీ ఆజాద్, సుప్రియా సూలే, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్, కాంగ్రెస్ నేత అజిత్ జోగీ తదితర ప్రముఖులు ఉన్నారు. బీహార్‌లోని పాటలీపుత్ర నుంచి పోటీ చేస్తున్న ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి తనకు ఓటు లేని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడంతో ఆమెపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. ఈ ఘటన తర్వాత 50 మంది బూత్‌లోకి వెళ్లి గొడవ చేసి, ఈవీఎంను ధ్వంసం చేశారు. -
‘నాందేడ్’పైనే నజర్!
నాందేడ్: మరాఠ్వాడా ప్రాంతంలో ఏప్రిల్ 17న జరగనున్న లోక్‌సభ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఆదర్శ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఇక్కడ నుంచే లోక్‌సభ బరిలో ఉండటం ఉత్కంఠకు దారితీసింది. నాందేడ్ నియోజకవర్గం నుంచి చవాన్ లోక్‌సభకు కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నారు. కాగా, ఇక్కడ బీజేపీకి చెందిన డీబీ పాటిల్ పోటీచేస్తున్నారు. 17వ తేదీన రాష్ట్రం మొత్తం మీద 23 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఈ నియోజకవర్గంపైనే అందరి దృష్టి నిలుస్తోంది. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఆరు అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటన్నింటిలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇదే నియోజకవర్గంలోని భోకర్ అసెంబ్లీ స్థానం నుంచి చవాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, ఆదర్శ్ కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న చవాన్ అభ్యర్థిత్వంపై మల్లగుల్లాలు పడిన అధిష్టానం చివరకు లోక్‌సభ బరిలో అతడినే దింపేందుకు నిర్ణయించింది. చవాన్ లోక్‌సభకు పోటీచేయడం ఇది మొదటిసారి కాదు. ఆయన 1987లో నాందేడ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. అయితే 1989లో జరిగిన ఎన్నికల్లో జనతాదళ్ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. అశోక్ చవాన్ తండ్రి ఎస్.బి.చవాన్ రెండుసార్లు ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేసి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. కాగా, బీజేపీ అభ్యర్థి పాటిల్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. నాందేడ్‌లో మోడీ అనుకూల పవనాలు, చవాన్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. మోడీ ప్రభంజనంలో చవాన్ కొట్టుకుపోవడం ఖాయమని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు. పాటిల్ 2004లో ఇక్కడ నుంచి గెలిచి తర్వాత ఎన్సీపీలో చేరారు. అనంతరం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలా ఉండగా, నియోజకవర్గంలో 13 శాతం ఓట్లు ఉన్న ముస్లిం వర్గం నుంచి ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాగా, ఆదర్శ్ కుంభకోణంలో తన ప్రమేయం ఉందన్న ప్రతిపక్షాల ఆరోపణలను అశోక్ చవాన్ తీవ్రంగా ఖండించారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే విపక్షాలు ‘ఆదర్శ్’ అంశాన్ని లేవదీస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. వాస్తవానికి ఆదర్శ్ అంశం తెరమీదకు రాగానే నాందేడ్ అభ్యర్థిగా చవాన్‌కు బదులు అతడి భార్య అమీతను నిలబెట్టాలని పార్టీ అధిష్టానం మొదట యోచించింది. అయితే అది పార్టీపైన ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశముందని భావించి తన యోచనను విరమించుకుంది. రాజకీయ నాయకులు, రాష్ట్ర అధికారులు, ఆర్మీ అధికారుల నిమిత్తం దక్షిణ ముంబైలో అప్పట్లో ‘ఆదర్శ్’ బహుళ అంతస్తుల భవనం నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే వాటిలో చాలా ఫ్లాట్లను అప్పటి సీఎం అశోక్‌చవాన్, అతడి మంత్రివర్గ సభ్యులు కొందరు అనధికారికంగా బంధువులకు, అస్మదీయులకు కేటాయించారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. కొన్ని కోట్ల రూపాయల విలువచేసే ఈ ఫ్లాట్లలో మూడింటిని అశోక్ చవాన్ తన బంధువులకు అక్రమంగా బదలాయించారని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. దీంతో 2010లో అశోక్‌చవాన్ సీఎం పదవికి బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం చవాన్‌తోపాటు అతడి మంత్రివర్గంలోని సభ్యులైన విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, సుశీల్‌కుమార్ షిండే తదితరులపై జరిగిన న్యాయవిచారణలో సైతం ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే ఆ నివేదికను పృథ్వీరాజ్ చవాన్ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఈ కుంభకోణంలో అశోక్ చవాన్ పాత్రపై సీబీఐ విచారణకు గవర్నర్ శంకర్నారాయణన్ తిరస్కరించడంతో తన ప్రాథమిక చార్జిషీట్లో చవాన్ పేరును సీబీఐ చేర్చలేదు. నాందేడ్ సిట్టింగ్ ఎంపీ, చవాన్ బావమరిది అయిన భాస్కర్‌రావ్ పాటిల్ ఖాట్గోంకర్ ప్రస్తుతం తిరిగి పోటీచేయనని ప్రకటించి పాటిల్‌కు మార్గం సుగమం చేశారు. నాందేడ్ జిల్లాలో చవాన్ కుటుంబానికి ఉన్న పట్టు నేపథ్యంలో మోడీ ప్రభావం ఈ నియోజకవర్గంపై అంతగా ఉండకపోవచ్చని, ప్రస్తుత ఎన్నికల్లో అతడి గెలుపు నల్లేరుమీద నడకేనని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఊపందుకున్న ప్రచారం
పింప్రి, న్యూస్‌లైన్: ఎన్నికలు సమీపిస్తుండడంతో వివిధ రాజకీయ పార్టీల నాయకుల ప్రచారం జోరందుకుంటుంది. పుణేలో వరుస ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి గోఖలేనగర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆమ్ఆద్మీ పార్టీ తరఫున ప్రముఖ సామాజిక కార్యకర్త మేధాపాట్కర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలోని కొందరు శ్రీమంతులను మరింత శ్రీమంతులుగా చేయడమే అభివృద్ధి కాదన్నారు. మోడీ తయారుచేసిన అభివృద్ధి అనే గాలిబుడగ పేలిందని అందులో అభివృద్ధి చెందిన వారెవరో దేశ ప్రజలందరూ చూడగలిగారని ఆమె ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ , బీజేపీ రెండూ అవినీతి బురదలో ఉన్న పార్టీలే అన్నారు. మహారాష్ట్రలో అశోక్ చవాన్, కర్ణాటకలో యడ్యూరప్పలను ఆయా పార్టీలు తిరిగి అభ్యర్థులుగా చేయడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. దేశంలో అవినీతిపై పోరాటానికై పుట్టిన పార్టీ ఆమ్ఆద్మీపార్టీ అని పేర్కొన్నారు. దేశంలోని పేద కుటుంబాలకు నిలయమైన మురికివాడల నుంచి ఐటి పార్కులో పనిచేసే వారి వరకు ఆమ్ఆద్మీ పార్టీకి పునాదులు లాంటివారనీ, వారే పార్టీకి నాయకులని, దేశంలో పెచ్చిరిల్లిపోతున్న అవినీతిని ప్రశ్నించడానికి అందరినీ కలుపుకుపోతున్న పార్టీ ఆప్ అని వివరించారు. ఈ సభకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఇదిలా వుండగా పుణే కాంగ్రెస్ అభ్యర్థి విశ్వజిత్ కదమ్ బుధవారం రాత్రి వాన్వాడిలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్-ఎన్సీపీలకు చెందిన అభ్యర్థులకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి దేశంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు. బీజేపీ కలలు కనాల్సిందే తప్ప ప్రజల్లో విశ్వాసాన్ని పొందలేదని ఎద్దేవా చేశారు. జస్వంత్సింగ్లాంటి సీనియర్ నేతలు ఆ పార్టీపై చేసిన విమర్శలను గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. అభివృద్ధి అంటే కాంగ్రెస్ అని, అరచేతిలో అభివృద్ధి చూపించే మోడీ మాటలు నమ్మవద్దని పిలుపునిచ్చారు. శిరూర్ ఎమ్మెన్నెస్ అభ్యర్థి అశోక్‌రావ్ ఖండే బరాడ్‌ను గెలిపించాలని కోరుతూ ప్రస్తుత ఎంపీ గజానన్ బాబర్ చిఖిలో ఏర్పాటు చేసిన సభలో కోరారు. శిరూర్ పార్లమెంట్ సభ్యుడు శివాజీరావు ఆడల్రావు రాజకీయాలలో ఫిక్సింగ్‌కు పాల్పడే వ్యక్తి అని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులను రాజకీయాల నుంచి పారదోలాలని పిలుపునిచ్చారు. శివసేన పార్టీని నడిపించే సత్తా ఉద్ధవ్‌కు లేదని ఆయన దుయ్యబట్టారు. ఎమ్మెన్నెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న అశోక్‌ను గెలిపించాలని కోరారు. కాగా ప్రచారంలో దూసుకుపోతున్న అశోక్.. శిరూర్‌లో తనను గెలిపించాలని కోరుతున్నారు. ఇన్నాళ్లూ ఈ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అడల్‌రావ్ పాటిల్ చేసింది శూన్యమని ఆరోపించారు. ఇదిలా ఉండగా, శిరూర్‌లో శివసేన సిట్టింగ్ అభ్యర్థి ఆడల్రావు పాటిల్ గ్రామగ్రామాన ఓటర్లను కలసి వారి సమస్యలను వింటున్నారు. తాము అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోనే హవేలిలో యశ్వంత్ సహకారంతో చక్కర ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని పాటిల్ నగర ప్రజలకు వాగ్దానం చేశారు. కాగా 2జీ స్పెక్ట్రమ్, బొగ్గు, రాష్ట్రంలో జలాలపై కూడా అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ ఆదర్శ్ కుంభకోణంలో మరింతగా బురద పూసుకుందని, ఇలాంటి పార్టీలను శాశ్వతంగా భూస్థాపితం చేయాలని లోణి-కాల్బోరేలో పిలుపునిచ్చారు. తన నియోజక వర్గంలో రూ.4,500 కోట్లతో అభివృద్ధి పనులను చేశానని, తన అభివృద్ధి పనులపై ప్రశ్నించేందుకు ఏమీలేకనే ప్రతిపక్షాలు కువిమర్శలకు దిగుతున్నాయని దుయ్యబట్టారు. కాగా పాటిల్‌కు మద్దతుగా బీజేపీ, ఆర్పీఐ, స్వాభిమాని శెత్కారీ సంఘటన్, ఆర్ఎస్పీలు ప్రచారం చేస్తుండగా, ఎమ్మెన్నెస్ అభ్యర్థిని నిలపడంతో ఇక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది. -
గెలుపు నాదే
సాక్షి, ముంబై: కాంగ్రెస్ పార్టీ తనపై నమ్మకముంచి కేటాయించిన నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గంలో విజయం సాధిస్తానని వంద శాతం కచ్చితంగా చెప్పగలనని మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ అన్నారు. ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణంలో వివాదం చుట్టుముట్టడంతో ముఖ్యమంత్రి పదవీకి రాజీనామా చేసిన చవాన్, మద్దతుదారులు, పార్టీ కార్యకర్తల సమక్షంలో బుధవారం ఈసీ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం చవాన్ మీడియాతో మాట్లాడుతూ ఆదర్శ్ కుంభకోణంలో అవినీతికి పాల్పడలేదని తన మనస్సాక్షికి తెలుసని అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. అవినీతిని వ్యతిరేకించే రాహుల్ గాంధీకి నిజం తెలుసు కాబట్టే ఈరోజు తనకు టికెట్ దక్కిందని చవాన్ వివరించారు. ఆదర్శ్ విషయంలో అవినీతి ఎక్కడుందని, సంబంధంలేని విషయాల గురించి మాట్లాడనని తెలిపారు. ప్రతిపక్ష నాయకులే రాజకీయ లబ్ధి పొందేందుకు అవినీతి ఆరోపణలు చేస్తారని అన్నారు. ఈ విషయాల గురించి మాట్లాడే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదన్నారు. మైనింగ్ కుంభకోణంలో ప్రమేయముందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యాడ్యూరప్ప, గాలి సోదరులపై బీజేపీ విధానమేంటో అందరికీ తెలిసిందేనని అన్నారు. ఆదర్శ్ కుంభకోణం చార్జిషీట్లో తన పేరు చేర్చారు కానీ, తనను దోషిగా పేర్కొనలేదని తెలిపారు. ఎన్నికల్లో స్వేచ్ఛగా తాను పోటీ చేయవచ్చని, న్యాయ విధానాలు, నిబంధనల ప్రకారం అది సాధ్యమేనని అన్నారు. ఏ ఎన్నిక నుంచి పోటీ చేసేందుకు తనను దూరం చేయలేరని వ్యాఖ్యానించారు. కామన్వెల్త్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న సురేశ్ కల్మాడీని తప్పించారు కదా, మీ కేసు కూడా అలాంటిదే కదా అని మీడియా అడిగిన ప్రశ్నకు చవాన్ తానేమీ మాట్లాడనని అన్నారు. నాందేడ్ నుంచి పోటీ చేయాలని అధిష్టానం నిర్ణయించి ందని, ఆ బాటలోనే ముందుకెళతానని తెలిపారు. ఆదర్శ్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన సమయంలో సీఎంగా మిమ్మల్ని తప్పించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇప్పుడు అవినీతి విషయంలో రాజీపడుతున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు చవాన్ మాట్లాడుతూ అసలు అవినీతి ఎక్కడుంది? ఈ విషయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీని లాగడమెందుకు? దీంతో వారికి ఏమి సంబంధమని మీడియాను ఎదురు ప్రశ్నించారు. అందరిలో ఉత్కంఠ... మాజీ సీఎం అశోక్ చవాన్‌కు ఆఖరి క్షణంలో ఊరట లభించింది. బుధవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి ఆఖరు రోజు కావడంతో పార్టీ పదాధికారులు, కార్యకర్తల్లో నాందేడ్ సీటు ఎవరికి వస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. మంగళ వారం రాత్రి ఎనిమిది గంటల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చవాన్ పేరు ప్రకటించి సస్పెన్షన్‌కు తెరదించింది. అంతలోనే సిట్టింగ్ ఎంపీ భాస్కర్‌రావ్ ఖత్గావ్కర్ కూడా నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇప్పటికే బీజేపీ నుంచి మాజీ ఎంపీ డి.బి.పాటిల్, ఆప్ తరఫున నరేంద్రసింగ్ గ్రంథి నామినేషన్లు దాఖలు చేశారు. ఒకవైపు నామినేషన్లు దాఖలు చేయడానికి సమయం దగ్గరపడుతోంది. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి పేరు ఖరారు చేయకపోవడంతో కార్యకర్తలో మరింత ఉత్కంఠ మొదలైంది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా అశోక్ చవాన్ సతీమణి అమితా చవాన్, జిల్లా ఇన్చార్జి మంత్రి డి.పి.సావంత్ నామినేషన్ ఫారాలు నింపి సిద్ధంగా ఉంచారు. ఇంతలో మంగళవారం రాత్రి కాంగ్రెస్ చవాన్ పేరును ప్రకటించింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు భారీ ఊరేగింపు, మోటార్ సైకిళ్ల ర్యాలీతో బయలుదేరిన మాజీ సీఎం ఆశోక్ చవాన్ జనాలకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ‘మాజీ సీఎం పేరు తొలగించండి’ ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణంలో దాఖలైన ఎఫ్ఐఆర్ నుంచి మాజీ సీఎం ఆశోక్ చవాన్ పేరును తొలగించాలని బాంబే హైకోర్టును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆశ్రయించింది. ఈ ఏడాది జనవరిలో ప్రత్యేక సీబీఐ కోర్టు ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నుంచి చవాన్ పేరును తొలగించేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. సీబీఐ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ గురువారం విచారణకు రానుంది. -
ఆరోపణలున్నా.. టికెట్లిస్తాం: సోనియా
ఆదర్శ్ హౌసింగ్ స్కాంలో పాత్రధారి, ఆ కుంభకోణానికి సూత్రధారి అని యావత్ ప్రపంచం గగ్గోలు పెట్టిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చేసింది. మహారాష్ట్రలోని నాందేడ్ స్థానం నుంచి ఆయన లోక్‌సభకు పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే నామినేషన్లు కూడా దాఖలు చేసేశారు. చవాన్‌కు టికెట్ ఇవ్వాలన్న నిర్ణయాన్ని సోనియాగాంధీ నిస్సిగ్గుగా సమర్థించుకున్నారు. ''మాకు తెలిసున్నంత వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఏ చట్టమూ చవాన్‌ను నిషేధించలేదే'' అని ఆమె విలేకరులను ఎదురు ప్రశ్నించారు. -
‘పోటీనుంచి నేనే తప్పుకున్నా’
నాందేడ్, న్యూస్‌లైన్: నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గం బరి నుంచి సిట్టింగ్ ఎంపి భాస్కరరావ్ ఖతగావ్కర్ తప్పుకున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన స్వయంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనపై ఎవరి ఒత్తిడీ లేదన్నారు. తానే స్వయంగా పోటీ నుంచి త ప్పుకోవాలని నిర్ణయించుకున్నానన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కొంత బలహీనంగా ఉందన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోపాటు మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌ల నాయకత్వంలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. కాగా మాజీ ముఖ్యమంత్రి అశోక్‌చవాన్ నాందేడ్పై తన పట్టును నిలుపుకుని మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అశోక్ ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ తనకు టికెట్ రానట్టయితే కనీసం భార్య అనితకైనా దక్కేవిధంగా చేసేందుకు యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టికెట్ కోసం రేసులో ప్రధాన పోటీదారుగా భావిస్తున్న భాస్కరరావ్ ఖతగావ్కర్ తప్పుకోవడం చవాన్‌కు కొంత ఊరట కలిగించే విషయం. -
నాందేడ్ సీటుపై కాంగ్రెస్‌లో ఉత్కంఠ
సాక్షి, ముంబై: నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటివరకు మూడు జాబితాలను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ, నాందేడ్ అభ్యర్థిత్వంపై ఇంకా తేల్చలేదు. ఆదర్శ్ సోసైటీ అవినీతి కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, లేదంటే ఆయన సతీమణి అమితా చవాన్‌కు కాంగ్రెస్ టికెటిస్తుందా అన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ భాస్కర్‌రావ్ ఖతగావ్కర్ విజయంపై నమ్మకం లేకపోవడంతో చవాన్ తనకైనా టికెటివ్వండి? లేకపోతే నా సతీమణికైనా సీటు కేటాయించండని కాంగ్రెస్ అధిష్టానానికి విన్నవించినట్టు తెలుస్తోంది. కామన్వెల్త్ గేమ్స్‌లో కుంభకోణంలో ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చిన సీనియర్ నేత సురేశ్ కల్మాడీని కాదని, పుణే లోక్‌సభ నియోజకవర్గం నుంచి విశ్వజీత్ కదంకు అవకాశమివ్వడంతో ఇక్కడ కూడా అలాంటిదేమైనా జరుగుతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. బరిలో అశోక్‌చవాన్, లేదంటే ఆయన భార్య? నాసిక్‌లో పట్టున్న మాజీ సీఎం అశోక్ చవాన్, లేకుంటే ఆయన సతీమణికే టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఆయన మద్దతుదారులు కూడా ఇదే చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ భాస్కర్‌రావ్ ఖతగావ్కర్ను తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అశోక్ చవాన్‌కు భాస్కర్‌రావ్ ఖతగావ్కర్ తోడల్లుడు కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. దీంతో ఆయన విజయంపై అశోక్ చవాన్‌కు నమ్మకం లేకపోవడంతోనే భాస్కర్‌రావ్‌ను తప్పించాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ విషయమై అశోక్ చవాన్ మాత్రం ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. గత ఎన్నికలను పరిశీలిస్తే కాంగ్రెస్ అభ్యర్థిగా భాస్కర్‌రావ్ విజయం సాధించినా, బీజేపీ అభ్యర్థి సంభాజీ పవార్‌కు 2.75 లక్షల ఓట్లు వచ్చాయి. అశోక్ చవాన్ సీఎంగా ఉన్న సమయంలోనే ప్రత్యర్థికి అన్ని ఓట్లు పోలవడం విశేషం. మరోవైపు ఈసారి గుజరాత్ ముఖ్యమంత్రి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రభావం ఉండే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు చెందిన ఈ స్థానంలో పరాజయం ఎదురైతే రాష్ట్ర రాజకీయాల్లో అశోక్ చవాన్ ప్రతిష్టకు భంగం వాటిల్లే అవకాశాలున్నాయి. దీంతోనే అశోక్ చవాన్ స్వయంగా ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్నారని తెలిసింది. ఒకవేళ టికెట్ ఇవ్వకుంటే ఆయన భార్య అనితా చవాన్‌ను బరిలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. తనకు టికెట్ ఇవ్వడంలేదని తెలిసిన భాస్కర్‌రావ్ ఖతగావ్కర్ టికెట్ కోసం తనదైన శైలిలో ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన విజయంపై నమ్మకం లేకపోవడంతోనే టికెట్ ప్రకటించడంపై జాప్యం జరుగుతుందని తెలుస్తోంది. అశోక్ చవాన్‌కు అగ్నిపరీక్ష...? మాజీ సీఎం అశోక్ చవాన్‌కు నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గం అగ్నిపరీక్షగా మారింది. ఈసారి ముఖ్యమంత్రిగా కూడా లేకపోవడం, ఆదర్శ్ కుంభకోణంలో వస్తున్న ఆరోపణలతో సతమతమవుతున్న అశోక్ చవాన్‌ను ఎదుర్కొనేందుకు ఇదే సరైన సమయంగా బీజేపీ భావిస్తోంది. ప్రణాళిక ప్రకారం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా బీజేపీ నుంచి ఎన్సీపీలో చేరిన మాజీ ఎంపీ డీబీ పాటిల్‌ను మళ్లీ బీజేపీలో చేర్చుకుంది. నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక్కడ బీజేపీతోపాటు ఈసారి ఎంఐఎం కూడా తన శక్తిని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ముస్లిం ఓటర్లను దృష్టిలో ఉంచుకుని పావులు కదుపుతోంది. -
గవర్నర్‌ను రీకాల్ చేయాలి : బీజేపీ డిమాండ్
ముంబై: ఆదర్శ్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు సీబీఐ పెట్టుకున్న దరఖాస్తును గవర్నర్ శంకర నారాయణన్ తిరస్కరించడంపై బీజేపీ మండిపడింది. అతడిని వెంటనే రీకాల్ చేయాలని ఆ పార్టీ రాష్ట్ర శాఖ శనివారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అసలు సీబీఐ అభ్యర్థనను గవర్నర్ ఎందుకు తిరస్కరించారో బహిర్గతపరచాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. యూపీఏ సర్కారు పాలనలో బయటపడిన పలు కుంభకోణాలపై చర్చించేందుకు బీజేపీ చార్జిషీట్ కమిటీ నిర్వహిస్తున్న రెండు రోజుల సమావేశానికి ఆయన శనివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేసేందుకు సీబీఐకి అనుమతి ఇవ్వకపోవడం వెనుక గవర్నర్‌పై ఒత్తిడి ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆదర్శ్ కుంభకోణంపై జ్యుడీషియల్ కమిషన్ నివేదికలో చవాన్‌పై స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ సీబీఐ విచారణకు గవర్నర్ ఒప్పుకోకపోవడంలో ఔచిత్యమేమిటని ఆయన ప్రశ్నించారు. తాము ఈ విషయమై త్వరలోనే రాష్ట్రపతిని కలిసి మాజీ ముఖ్యమంత్రిపై విచారణకు గవర్నర్ ఆమోదించేలా విజ్ఞప్తి చేస్తామన్నారు. అలాగే గవర్నర్‌ను వెనక్కి పిలవాలని డిమాండ్ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ కుంభకోణంలో ఉన్న సంబంధాలను బహిర్గతపరుస్తామని ఆయన నొక్కిచెప్పారు. కాగా, కుంభకోణంలో మాజీ సీఎం పాత్రపై ఆధారాలను చూపడంలో సీబీఐ విఫలమవ్వడంతో గవర్నర్ అతడిపై విచారణకు తిరస్కరించారు. అంతకుముందు చవాన్ పేరును నిందితుల చిట్టా నుంచి తొలగించేందుకు సీబీఐ చేసిన అభ్యర్థనను ప్రత్యేక కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. కాగా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అధికారంలో ఉన్న అన్ని ప్రభుత్వాల కంటే యూపీఏదే అత్యంత అవినీతిమయ పాలన అని ప్రసాద్ విమర్శించారు. కాగా, ప్రసాద్‌తోపాటు సమావేశానికి హాజరైన వారిలో లోక్‌సభలో బీజేపీ డిప్యూటీ నాయకుడు గోపీనాథ్ ముండే, మీనాక్షి లేఖి తదితరులు ఉన్నారు. -
‘సాక్ష్యాలు లేనందునే నిరాకరించా’
న్యూఢిల్లీ: ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో మాజీ సీఎం ఆశోక్ చవాన్ పాత్ర ఉన్నట్టు ఎలాంటి ఆధారాలను సీబీఐ చూపించలేకపోయిందని రాష్ట్ర గవర్నర్ కె.శంకర నారాయణన్ అన్నారు. ఈ సొసైటీలో రాజకీయ నాయకులకు కూడా అవకాశం కల్పించేలా రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి హోదాలో అశోక్ చవాన్ ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలపై సాక్ష్యాన్ని సీబీఐ సేకరించలేకపోయిందని న్యూఢిల్లీలో బుధవారం విలేకరులతో అన్నారు. దీన్ని ఆధారంగానే చేసుకునే చవాన్‌ను విచారించేందుకు సీబీఐకి అనుమతించలేదని వివరించారు. 2000వ సంవత్సరంలో ఫ్లాట్ల కేటాయింపులో చవాన్ క్రిడ్ ప్రో కోకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయని, అయితే 2004లో జూన్ 18న చవాన్ వదిన చేసుకున్న దరఖాస్తును తిరస్కరణకు గురైందన్నారు. 2000 సమావేశానికి, 2004 దరఖాస్తుకు చాలా కాలం వ్యత్యాసముందన్నారు. చివరగా 2008, నవంబర్ 10న ఆమెకు సభ్యత్వం ఇచ్చారని తెలిపారు. అయితే ఆ సమయంలో చవాన్ రెవెన్యూ శాఖ మంత్రి కానీ, సీఎం హోదాలో కానీ లేరని తెలిపారు. సీఆర్పీసీ 197 సెక్షన్ కింద మాత్రమే చవాన్‌ను విచారించేందుకు సీబీఐ అనుమతి కోరిందని, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 19 కింద కాదని చెప్పారు. తన వద్దకు వచ్చిన అన్ని పత్రాలను పరిశీలించాకే సీబీఐ విచారణకు అనుమతించలేదని వివరించారు. గతంలో ఆదర్శ్ కుంభకోణంలో ఆరోపణలు రావడంతో సీఎం పదవికి అశోక్ చవాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ కుంభకోణం నుంచి చవాన్ పేరును తప్పించాలంటూ ఇటీవల బాంబే హైకోర్టుకు వెళ్లిన సీబీఐకి చుక్కెదురైంది. -
అశోక్ చవాన్ పేరు తొలగించవద్దన్న కోర్టు
ముంబై: ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో నిందితుల జాబితా నుంచి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పేరును తొలగించాలన్న సీబీఐ అభ్యర్థనను సిబిఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఈ కుంభకోణానికి సంబంధించిన చార్జిషీట్లో పేర్కొన్న 13 మంది నిందితుల పేర్ల నుంచి అశోక్ చవాన్ పేరును తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని ఈ నెల 15న సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. అమర జవాన్ల కుటుంబాల కోసం ముంబైలోని కొలాబా ప్రాంతంలో ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ 31 అంతస్తుల భవన సముదాయం నిర్మించింది. అప్పటి ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఈ భవనంలో తన బంధువులకు ఫ్లాట్లు ఇప్పించడంతో ఈ కేసులో ఇరుక్కున్నారు. 2010లో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన అనంతరం అశోక్ చవాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దాంతో సిబిఐ ఈ కుంభకోణంలో నిందితుడిగా చవాన్‌ను పేర్కొంది. ఈ కుంభకోణంపై దర్యాప్తు జరిపిన జ్యుడీషియల్ కమిటీ హౌసింగ్ సొసైటీ ఇళ్ల కేటాయింపుల్లో అశోక్ చవాన్, ఈ కేటాయింపుల ద్వారా లబ్ధి పొందిన ఆయన సమీప బంధువులు కుమ్మక్కుకు పాల్పడ్డారని తేల్చి చెప్పింది. -
‘ఆదర్శ్’పై సీఎంకు మాజీ లేఖ
సాక్షి, ముంబై: ఆదర్శ్ కుంభకోణంపై నియమించిన విచారణ కమిషన్ వల్ల తనకు న్యాయం జరగలేదని మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తోపాటు ప్రభుత్వ కార్యదర్శికి మంగళవారం లేఖ రాశారు. ద్విసభ్య కమిషన్ నివేదిక సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉందన్నారు. ‘నివేదిక సరిగా లేదు. నాకు బాగా అన్యాయం జరిగింది. నా వాదనను ఆలకిస్తానంటూ ఇచ్చిన హామీని ఈ కమిషన్ ఏమాత్రం నిలబెట్టుకోలేకపోయింది’ అని చవాన్ తన లేఖలో రాశారని ఆయన సన్నిహితవర్గాలు వెల్లడించాయి. అభియోగం మోపాలని భావించినప్పుడు తన వాదనను వినిపించుకోవాల్సిందని ఆ లేఖద్వారా అశోక్ చవాన్... ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ దృష్టికి తీసుకొచ్చారు. నివేదిక కారణంగా ఒకరి ప్రతిష్టకు భంగం వాటిల్లేఅవకాశం ఉన్నప్పుడు ఆ వ్యక్తి వాదనను వినాల్సిందన్నారు. ప్రభుత్వం పరిశీలిస్తుంది ఆదర్శ్ వ్యవహారంలో తనకు జరిగిన అన్యాయంపై మాజీ ముఖ్యమంత్రి అశోక్చ వాన్ రాసిన లేఖను ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రాలయకు చెందిన ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కాగా ఆదర్శ్ సొసైటీలో పౌరులకు సభ్యత్వం కల్పించారని, అం దువల్ల తాను ఆ సంస్థకు లాభం చేకూర్చేవిధంగా వ్యవహరించలేదంటూ మాజీ ముఖ్యమంత్రి చెప్పలేరని అశోక్ చెప్పలేరని ద్విసభ్య కమిషన్ తన నివేదికలో పేర్కొంది. అదనపు ఎఫ్ఎస్ఐ కేటాయింపు అమాయక చర్యగా భావించలేమంది. ఆ చర్య చట్టబద్ధమా కాదా అనే విషయంలో తమకు ఎటువంటి బాధా లేదని, అయితే ఈ నిర్ణయంద్వారా తన సన్నిహితులైన బంధువులకు ఫ్లాట్లు మంజూరయ్యేవిధంగా చేశారని, అది క్విడ్ ప్రోకోనే అవుతుందని పేర్కొంది. -
‘ఆదర్శ్’లో చవాన్ కుమ్మక్కు
షిండే, దేశ్‌ముఖ్, నీలంగేకర్ కూడా తప్పులు చేశారు జ్యుడీషియల్ దర్యాప్తు కమిటీ నివేదికలో వెల్లడి ‘ఆదర్శ్’ హౌసింగ్ సొసైటీ కేటాయింపుల్లో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, ఈ కేటాయింపుల ద్వారా లబ్ధి పొందిన ఆయన సమీప బంధువులు కుమ్మక్కుకు పాల్పడ్డారని ఈ కుంభకోణంపై దర్యాప్తు జరిపిన జ్యుడీషియల్ కమిటీ తేల్చి చెప్పింది. ‘ఆదర్శ్’ కుంభకోణంపై దర్యాప్తు కోసం 2011లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇద్దరు సభ్యుల జ్యుడీషియల్ కమిటీ, 891 పేజీల నివేదికను సమర్పించింది. ఈ నివేదిక శుక్రవారం మహారాష్ట్ర శాసనసభ ముందుకురాగా, మహారాష్ట్ర కేబినెట్ దీనిని తోసిపుచ్చింది. కాగా, ఈ వ్యవహారంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, సుశీల్‌కుమార్ షిండే, శివాజీరావు నీలంగేకర్ పాటిల్‌ల చర్యలను కూడా జ్యుడీషియల్ కమిటీ తప్పుపట్టింది. దక్షిణ ముంబై లో ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ చేపట్టిన 31 అంతస్తుల భవన సముదాయం నిర్మాణం పారదర్శకంగా జరగలేదని, దీనికి అనుమతుల మంజూరులో ‘క్విడ్ ప్రో కో’ జరిగిందని వెల్లడించింది. చవాన్ హయాంలో (2008 డిసెంబర్-2010 నవంబర్) ఆయన సన్నిహిత బంధువులు ముగ్గురికి ఆదర్శ్ హౌసింగ్ సొసైటీలో సభ్యత్వం లభించినట్లు తెలిపింది. జ్యుడీషియల్ కమిటీ వెల్లడించిన వివరాల ప్రకారం... చవాన్ రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు 2002లో ‘ఆదర్శ్’ సొసైటీలో 40 శాతం మంది సాధారణ పౌరులకు కూడా సభ్యత్వం కల్పించాలని సొసైటీని కోరారు. నిజానికి ఇది పూర్తిగా మాజీ సైనికోద్యోగుల కోసం ఏర్పడింది. ఇందులోని సభ్యత్వ ప్రక్రియను, చవాన్ మంజూరు చేసిన అనుమతులను పరిశీలిస్తే ‘క్విడ్ ప్రో కో’ జరిగినట్లు తేటతెల్లమవుతోంది. ‘ఆదర్శ్’ సొసైటీలో సభ్యత్వం సాధారణ ప్రజలకు అందుబాటులో లేకుండా, మాజీ ఎమ్మెల్సీ దివంగత కన్హయ్యాలాల్ గిద్వానీ, రక్షణశాఖ అధికారి ఆర్.సి.ఠాకూర్ వంటి కొద్దిమంది బడా వ్యక్తుల కోటరీ చేతుల్లోనే ఉంది. సొసైటీకి కొత్త సభ్యులను ప్రతిపాదించడంలో వారు కీలకమైన, ప్రభావవంతమైన పాత్ర పోషించారు. సభ్యుల పేర్ల ప్రతిపాదనలో వారి మాటే చలామణీ అయ్యేది. మాజీ ముఖ్యమంత్రి దివంగత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కూడా ఈ వ్యవహారంలో తప్పటడుగులు వేశారు. ‘ఆదర్శ్’ నిర్మాణానికి దేశ్‌ముఖ్ అదనపు ఎఫ్ఎస్ఐకి (ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్-నిర్మాణ హక్కు) అనుమతి మంజూరు చేశారు. అయితే, దేశ్‌ముఖ్‌కు ముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన సుశీల్‌కుమార్ షిండే (ప్రస్తుత కేంద్ర హోంమంత్రి) ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశ్‌ముఖ్ సొసైటీ ప్రమోటర్లకు రాసిన లేఖ (లెటర్ ఆఫ్ ఇంటెంట్) కూడా విమర్శలకు దారితీసింది. అదనపు ఎఫ్ఎస్ఐకి అనుమతి మంజూరులో దేశ్‌ముఖ్ హేతుబద్ధతను గాలికొదిలేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆయన నిర్ణయం పూర్తిగా అసమంజసమని జ్యుడీషియల్ కమిటీ తప్పుపట్టింది. మాజీ ముఖ్యమంత్రి నీలంగేకర్ పాటిల్ (1985-86లో పది నెలలు సీఎంగా పనిచేశారు), గత దశాబ్దంలో కొద్దికాలం రెవెన్యూ మంత్రిగా కూడా పనిచేశారు. నీలంగేకర్తో పాటు షిండే ‘ఆదర్శ్’ సొసైటీ గృహ సముదాయం కోసం స్థలం కేటాయింపులో పొరపాట్లు చేసినట్లు జ్యుడీషియల్ కమిటీ స్పష్టం చేసింది. భూమి విలువపై ఆర్థికశాఖ చేసిన సూచనలను షిండే ఏమాత్రం పట్టించుకోలేదని, స్థలం కేటాయింపు కోసం కేబినెట్ ఆమోదం పొందడంలోనూ ఆయన విఫలమయ్యారని తెలిపింది. ‘ఆదర్శ్’ నిర్మాణానికి అనుమతులు మంజూరైన కాలంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన నీలంగేకర్ పాటిల్ సొసైటీకి స్థలం కేటాయింపు అనుమతి మంజూరు విషయంలో అనవసర ఆత్రాన్ని ప్రదర్శించారని ఎత్తిచూపింది. అదో చేదు ఘట్టం: మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ ‘ఆదర్శ్’ కుంభకోణాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఒక చేదు ఘట్టంగా అభివర్ణించారు. అయితే, దీనిపై జ్యుడీషియల్ కమిటీ నివేదికను తోసిపుచ్చాలన్నది కేబినెట్ నిర్ణయమని ఆయన చెప్పారు. కుంభకోణం చోటు చేసుకున్నప్పటి నుంచి... నాయకత్వ మార్పునకు దారి తీసేంత వరకు... మొత్తం వ్యవహారమంతా చేదు ఘట్టమేనని ఆయన అన్నారు. అయితే, నలుగురు మాజీ ముఖ్యమంత్రులను అభిశంసించిన జ్యుడీషియల్ కమిటీ నివేదికను ఎందుకు తిరస్కరించారని ప్రశ్నించగా, బదులిచ్చేందుకు నిరాకరించారు. జ్యుడీషియల్ కమిటీ నివేదికను తిరస్కరించడం వల్ల ఎలాంటి పరిణామాలు తలెత్తగలవని ప్రశ్నించగా, అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తనకు తెలియదని, జరిగిందేదో జరిగిపోయిందని బదులిచ్చారు. ఇదిలా ఉండగా, ‘ఆదర్శ్’ దోషులపై చర్యలు తీసుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా నివేదికను రూపొందించగా, రాష్ట్ర కేబినెట్ దానిని తోసిపుచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి. దానికి బదులుగా, జ్యుడీషియల్ కమిటీ నివేదికలోను తొలి రెండు అంశాలను ఆమోదిస్తూ, మిగిలిన వాటిని తిరస్కరిస్తున్నట్లు ముసాయిదా నివేదికను రూపొందించినట్లు వెల్లడించాయి. కాగా, మాజీ సీఎం అశోక్ చవాన్‌పై సీబీఐ దర్యాప్తుకు గవర్నర్ తన విచక్షణాధికారాలతోనే అనుమతి నిరాకరించారని అధికార వర్గాలు చెప్పాయి. -
అశోక్‌కు కీలక బాధ్యతలు
సాక్షి, ముంబై: ఆదర్శ్ కుంభకోణం కేసులో ఊరట లభించడంతో నేపథ్యంలో అశోక్‌చవాన్‌కు కీలక బాధ్యతలను అప్పగించే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టిసారించింది. మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షుడిగాగానీ లేదా ఎన్నికల ప్రచార ప్రముఖుడి బాధ్యతలుగానీ అప్పగించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే ఏ పదవి అప్పగిస్తారనేది త్వరలోనే తేలనుంది. నాలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన సంగతి విదితమే. దేశ రాజధాని నగరం ఢిల్లీలో కాంగ్రెస్‌కు ఘోర పరాజయం ఎదురైంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం పార్టీలో మార్పులుచేర్పులు చేస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కొంతమేర అనుకూలంగానే ఉన్నప్పటికీ పార్టీని మరింత బలోపేతం చేయడంపైనే అధిష్టానం దృష్టిసారించింది. పార్టీని విజయపథంలో నడిపించే నాయకుడికోసం అన్వేషిస్తోంది. మరాఠ్వాడా ప్రాంతానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మరణానంతరం ఆయన స్థానాన్ని భర్తీ చేసే నాయకులెవరూ కాంగ్రెస్‌కు లభించలేదని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌చవాన్... మచ్చ లేని నాయకుడిగా పేరు పొందినప్పటికీ ఆయన సారథ్యంలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం కష్టమేననే భావన ఉంది. ఆదర్శ్ కుంభకోణం కేసులో ఊరట లభించడంతో మరోసారి అశోక్ చవాన్‌కు రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు మార్గం సుగమమైంది. ఎన్సీపీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే అశోక్ చవాన్లాంటి నాయకుడి నేతృత్వం అవసరమని భావిస్తున్నట్టు సమాచారం. -
అశోక్ చవాన్‌కు ఊరట
ముంబై/న్యూఢిల్లీ : ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం కేసులో చిక్కుకున్న మాజీ ముఖ్యమంత్రి అశోక్‌చవాన్‌ను విచారించేందుకు అనుమతించాలంటూ సీబీఐ చేసిన విన్నపాన్ని గవర్నర్ శంకర నారాయణన్ బుధవారం తిరస్కరించారు. దీంతో ఆయనపై కేసు మూసివేయడం తప్ప సీబీఐకి మరో మార్గం లేకుండా పోయింది. ఈ కుంభకోణం వెలుగులోకి రావడంతో అప్పట్లో ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వరిస్తున్న అశోక్ చవాన్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే.ఈ కుంభకోణానికి సంబంధించి సీబీఐ మొత్తం 12 మందిపై కోర్టులో అభియోగాలు నమోదుచేసింది. అయితే తన పేరును నిందితుల జాబితాలో చేర్చడాన్ని అశోక్ కోర్టులో సవాలుచేశారు. తనను విచారించేందుకు గవర్నర్ వద్ద నుంచి సీబీఐ అనుమతి పొందలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ వాదనను సీబీఐ తోసిపుచ్చింది. అభియోగాలు మోపిన సమయంలో ఆయన సీఎంగా లేరని వాదించింది. ఈ వాదనను కోర్టు తోసిపుచ్చింది. అనుమతి పొందాల్సిందేనంటూ సీబీఐని ఆదేశించింది. దీంతో అశోక్‌చవాన్‌ను విచారించేందుకు అనుమతించాలని గవర్నర్‌ను సీబీఐ అభ్యర్థించింది. అయితే అందుకు ఆయన నిరాకరించారు. మరో మార్గమేమీ లేదు ఈ విషయమై సీబీఐ డెరైక్టర్ రంజిత్‌సిన్హా బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘ఇందుకు సంబంధించి గవర్నర్‌కు అన్ని విషయాలను సమగ్రంగా నివేదించాం. అయితే ప్రస్తుతం తమకు న్యాయపరంగా మరో మార్గమేమీ లేదు. అందువల్ల కోర్టు మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.’ అని అన్నారు. తొలిసారేమీ కాదు సంబంధిత యంత్రాంగం అనుమతి లభించని కారణంగా శక్తిమంతులైన మంత్రులపై మోపిన కేసులు వీగిపోవడం ఇది తొలిసారేమీ కాదని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో తాజ్ కారిడార్ ప్రాజెక్టు కుంభకోణం కేసుకు సంబంధించి మాయావతిపై కేసు నమోదు చేశామని, అయితే అప్పటి ఆ రాష్ట్ర గవర్నర్ టి.వి.రాజేశ్వర్ అనుమతించలేదని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. దీంతో కేసు మూసేయక తప్పలేదన్నారు. ఇక అసోం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ కుమార్ మహంతా పై లెటర్ ఆఫ్ క్రెడిట్ స్కాం (ఎల్ఓసీ) కేసునమోదైందని, ఆనాటి ఆ రాష్ట్ర గవర్నర్ మహంతను విచారించేందుకు నిరాకరించారని తెలిపారు. -
చవాన్‌కు మరిన్నిచిక్కులు
సాక్షి, ముంబై: ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో చిక్కుకున్న మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పరిస్థితి దారుణంగా మారుతోంది. ఈ కుంభకోణంపై విచారణకు నియమించిన కమిటీ నివేదికను అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు మంగళవారం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. అమర జవాన్ల కుటుంబాల కోసం ముంబైలోని కొలాబా ప్రాంతంలో ఆదర్శ్ సొసైటీ భవనాన్ని నిర్మించారు. అప్పటి ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తన బంధువులకు ఇళ్లు ఇప్పించడంతో ఈ కేసులో ఇరుక్కొని పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఆయన ఈ కుంభకోణంలో నిందితుడిగా కేసులను ఎదుర్కొంటున్నారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ అశోక్ చవాన్‌పై కేసు నమోదు చేయడానికి గవర్నల్ కె.శంకర్ నారాయణన్ అనుమతి కోరింది. ఈ పరిణామం అశోక్ చవాన్‌కు మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టవచ్చని భావిస్తున్నారు. 2010లో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన అనంతరం అశోక్ చవాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ వ్యవహారంపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. కానీ ఇది ఇంత వరకు నివేదికను అసెంబ్లీకు సమర్పించలేదు. దీనిపై బీజేపీ, శివసేన ఎమ్మెల్యేలు కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రారంభించారు. చివరికి బీజేపీ ముంబై నాయకులు ఆదర్శ్ సొసైటీ కుంభకోణంపై చర్యలు కోరుతూ బాంబే హైకోర్టుకు వెళ్లారు. ఈ కుంభకోణంపై విచారణ నివేదికను అసెంబ్లీ సమావేశంలో ఎప్పుడు చర్చకు తీసుకొస్తారో రాతపూర్వకంగా తెలియజేయాలని పృథ్వీరాజ్ చవాన్ సర్కారును ఆదేశించింది. ప్రస్తుతం నాగ్‌పూర్‌లో జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే ఆదర్శ్ కుంభకోణం విచారణ నివేదికపై చర్చిస్తామని ప్రభుత్వం రాతపూర్వకంగా హైకోర్టుకు విన్నవించింది.