
సాక్షి, ముంబై : ఆదర్శ్ కుంభకోణంలో మాజీ ముఖ్యమత్రి అశోక్ చవన్‌కు భారీ ఊరట లభించింది. ఆయన్ని ప్రాసెక్యూట్ చేయాలన్న రద్దు చేస్తూ బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది.
దర్యాప్తులో సీబీఐ సాక్ష‍్యాలు సమర్పించకపోవటంతో ఆయన్ని తిరిగి విచారించేందుకు అనుమతి ఇస్తూ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ చవన్ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు శుక్రవారం ఆ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
మాజీ సీఎం తరహా వ్యక్తులను విచారణ చేపట్టాలంటే అందుకు సంబంధించి ఉత్తర్వులు ప్రత్యేకంగా జారీ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో చర్చించాకే గవర్నర్ ఈ ఉత్తర్వులను వెలువరించారు. అయినా న్యాయస్థానం మాత్రం అందుకు అంగీకరించకపోవటం విశేషం.
కాగా, 2010లో ఆదర్శ్ హౌజింగ్ సోసైటీ స్కాం వెలుగులోకి రాగా.. చవన్ రాజీనామా చేసి ఆ స్థానంలో పృథ్వీరాజ్ సీఎంగా పగ్గాలు చేపట్టాడు. ఆపై జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment