Adarsh Co-operative Housing Society
-
ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది
‘‘ఒక యాడ్ ఫిల్మ్ షూటింగ్ సమయంలో దర్శకుడు విజయ్‌ని కలిసినప్పుడు అతను చెప్పిన కథ నచ్చింది. ఆ కథలో దీక్ష పాత్ర బాగా నచ్చడంతో ఈ సినిమా చేశా. విజయ్ వర్కింగ్ స్టైల్ వండర్ఫుల్. ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచుతుందనే నమ్మకం ఉంది’’ అని మంచు లక్ష్మీ అన్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, లక్ష్మీ మంచు నిర్మించిన చిత్రం ‘వైఫ్ ఆఫ్ రామ్’. విజయ్ యెలకంటి దర్శకుడు. నేడు ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ మాట్లాడుతూ – ‘‘దీక్ష పాత్రకు లక్ష్మీ మంచు పూర్తి న్యాయం చేశారు. ఇందులో ఏ సీన్ కూడా సినిమేటిక్గా ఉండదు. సహజంగా జరుగుతున్నట్లే ఉంటుంది. రఘు దీక్షిత్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఓ హైలైట్. సామల భాస్కర్ కెమెరా, తమ్మిరాజు ఎడిటింగ్ అద్భుతం’’ అన్నారు. ‘‘బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక వచ్చిన మొదటి అవకాశం ఇది. ఈ సినిమాలో చేసిన పాత్ర నా కెరీర్‌కి మంచి మలుపు అవుతుందనే నమ్మకం ఉంది’’ అని ఆదర్శ్ అన్నారు. ‘‘పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో 27 రోజుల్లో షూటింగ్ పూర్త చేశాం. ఈ కథతో నేను చేసిన ప్రయాణాన్ని మరచిపోలేను’’ అని సామల భాస్కర్ అన్నారు. -
ఆదర్శ్’ కేసులో చవాన్‌కు ఊరట
ముంబై: 2జీ కేసులో తీర్పు కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చిన మరుసటి రోజే ఆ పార్టీకి మరో కేసులోనూ ఊరట లభించింది. ఆదర్శ్ గృహ సముదాయం కుంభకోణం కేసులో మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత అశోక్ చవాన్‌పై విచారణ జరిపేందుకు ఆరాష్ట్ర గవర్నర్ ఇచ్చిన అనుమతిని కొట్టేస్తూ బాంబే హైకోర్టు శుక్రవారం ఆదేశాలిచ్చింది. విచారణలో సాక్ష్యంగా నిలవదగ్గ ఆధారాలను చూపడంలో సీబీఐ విఫలమైందని, అందుకే ఉత్తర్వులను కొట్టేస్తున్నామని స్పష్టం చేసింది. గవర్నర్‌గా శంకర నారాయణ ఉండగానే చవాన్‌ను విచారించేందుకు సీబీఐ అప్పట్లో అనుమతి కోరగా ఆయన తిరస్కరించారు. ఆ తర్వాత విద్యాసాగర్ గవర్నర్ అయ్యాక కేసులో తమకు కొన్ని కొత్త ఆధారాలు లభించాయని, చవాన్‌పై విచారణ జరిపేందుకు అనుమతించాలని సీబీఐ కోరడంతో ఆయన 2016లో ఆ మేరకు ఉత్తర్వులిచ్చారు. దీనిని చవాన్ సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించడంతో ఆ పిటిషన్‌ను కోర్టు విచారించింది. ‘కొత్త ఆధారాలు లభించాయని సీబీఐ చెప్పడంతో పాత గవర్నర్ నిర్ణయానికి భిన్నంగా చవాన్‌పై విచారణ జరిపేందుకు ప్రస్తుత గవర్నర్ అనుమతించారు. కానీ కోర్టుల్లో విచారణ సమయంలో సాక్ష్యంగా నిలవదగ్గ కొత్త ఆధారాలను సీబీఐ సమర్పించలేక పోయింది. కాబట్టి గవర్నర్ ఉత్తర్వులు చెల్లవు. వాటిని కొట్టేస్తున్నాం’ అని బెంచ్ స్పష్టం చేసింది. చవాన్‌పై ఆరోపణలివే దక్షిణ ముంబైలో రక్షణ శాఖ ఉద్యోగులకు, సైనికులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనేదే ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ పథకం. ఆ స్థలంలో ముందుగా అనుకున్న దానికన్నా అదనంగా భవంతులు నిర్మించేందుకు చవాన్ అనుమతులిచ్చి అందుకు ప్రతిఫలంగా వాటిలో రెండు ఫ్లాట్లను తమ బంధువులకు బదలాయించారనేది ఆరోపణ. సైనికులకు, రక్షణ శాఖ ఉద్యోగులకు మాత్రమే నిర్మిస్తున్న ఈ సొసైటీలో 40 శాతం ఫ్లాట్లను సాధారణ పౌరులకు కూడా చవాన్ (అప్పటికి ఈయన రెవెన్యూ మంత్రి) అక్రమంగా కేటాయించారని ఆరోపణలున్నాయి. -
ఆదర్శ్ స్కాం.. మాజీ సీఎంకు భారీ ఊరట
సాక్షి, ముంబై : ఆదర్శ్ కుంభకోణంలో మాజీ ముఖ్యమత్రి అశోక్ చవన్‌కు భారీ ఊరట లభించింది. ఆయన్ని ప్రాసెక్యూట్ చేయాలన్న రద్దు చేస్తూ బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది. దర్యాప్తులో సీబీఐ సాక్ష్యాలు సమర్పించకపోవటంతో ఆయన్ని తిరిగి విచారించేందుకు అనుమతి ఇస్తూ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ చవన్ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు శుక్రవారం ఆ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మాజీ సీఎం తరహా వ్యక్తులను విచారణ చేపట్టాలంటే అందుకు సంబంధించి ఉత్తర్వులు ప్రత్యేకంగా జారీ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో చర్చించాకే గవర్నర్ ఈ ఉత్తర్వులను వెలువరించారు. అయినా న్యాయస్థానం మాత్రం అందుకు అంగీకరించకపోవటం విశేషం. కాగా, 2010లో ఆదర్శ్ హౌజింగ్ సోసైటీ స్కాం వెలుగులోకి రాగా.. చవన్ రాజీనామా చేసి ఆ స్థానంలో పృథ్వీరాజ్ సీఎంగా పగ్గాలు చేపట్టాడు. ఆపై జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం విదితమే. -
బిగ్‌బాస్: ఫైనల్‌కు ఆదర్శ్, హరితేజ
సాక్షి, హైదరాబాద్: తెలుగు బిగ్‌బాస్ షో చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే తొమ్మిది వారాలు పూర్తి చేసుకున్న పదో వారంలోకి అడుగుపెట్టబోతోంది. టైటిల్ పోరులో కంటెస్టంట్లు అందరూ నువ్వా నేనా అనే రేంజ్లో పోటీపడుతున్నారు. గతవారంలో ఎలిమినేషన్స్‌కి నామినేట్ అయిన ఆదర్శ్, హరితేజ, అర్చన, దీక్షలలో ఆదర్శ్, హరితేజలు సేఫ్ జోన్లో ఉన్నారంటూ బిగ్‌బాస్ వాళ్లకు రిలీఫ్ ఇచ్చారు. దీంతో వారు వారిద్దరూ ఫైనల్‌కి చేరారు. ఇక మిగిలిన అర్చన, దీక్షలలో ఎవరు ఫైనల్‌కు చేరేది ఆదివారం ఎపిసోడ్లో తేలనుంది. ఇక బిగ్‌బాస్ హౌస్‌లో ‘జై లవకుశ’ హీరోయిన్లు నివేదా థామస్, రాశీఖన్నాలు సందడి చేశారు. బ్యూటీ నివేదా థామస్ శివబాలాజీ తో ఆమ్లెట్ చేయించుకుంది. ఇది ఇలా ఉండగా నందమూరి కళ్యాణ్ రామ్ సర్ప్రైస్ ఎంట్రీ ఇచ్చారు. వచ్చీ రావడంతోటే నాక్కూడా ఆమ్లెట్ కావాలంటూ రుచి చూసి సూపర్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చేశారు. బిగ్‌బాస్ సీజన్ 1 టైటిల్‌ను శివబాలాజీ, హరితేజ, నవదీప్‌లలో ఎవరో ఒకరు టైటిల్ విన్నర్ అవుతారని అర్చన తెలిపింది. అనంతరం ఎన్టీఆర్కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఫుల్ జోష్ ఫుల్ గా మారింది. ఎన్టీఆర్ వచ్చీ రావడంతోటే పంచ్‌లు పేలుస్తూ హౌస్ మేట్స్ కోసం ‘జై లవ కుశ’ అనే వెరైటీ టాస్క్ ఇచ్చారు. కంటెస్టంట్లతో పాటు నివేదా థామస్, రాశీఖన్నాలు కూడా ఈ టాస్క్‌లో పాల్గొన్నారు. టాస్క్ ముగిసిన తరువాత గెస్ట్ లుగా వచ్చిన కళ్యాణ్ రామ్, నివేదా, రాశీ ఖన్నాలు కంటెస్టంట్ల ఫెర్ఫామెన్స్‌ని బట్టి మార్క్ కేటాయించారు. ఇందులో అత్యధికంగా ఆమ్లెట్ వేసి ‘జై’ క్యారెక్టర్ చేసిన శివబాలాజీ ఎక్కువ పాయింట్స్ రాగా.. అర్చన అందరికంటే లీస్ట్ ప్లేస్‌లో నిలిచింది. -
అందరూ చూస్తుండగా అమ్మాయిపై ఘోరం
కేరళలోని కొట్టాయంలో ఘోరం జరిగింది. 20 ఏళ్ల వైద్య విద్యార్థినిపై క్లాసులో అందరూ చూస్తుండగానే ఓ అబ్బాయి పెట్రోలు పోసి తగలబెట్టేశాడు. ఆ తర్వాత తాను కూడా పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అమ్మాయిని కాపాడేందుకు ప్రయత్నించిన ఇద్దరు విద్యార్థులకు కూడా కొద్దిగా కాలిన గాయాలై ఆస్పత్రిలో చేరారు. ఎస్ఎంఇ మెడికల్ కాలేజిలో సమ్మె జరుగుతున్నా కొంతమంది విద్యార్థులు ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆదర్శ్ అనే యువకుడు అదే కాలేజి మాజీ విద్యార్థి. బుధవారం మధ్యాహ్నం అతడు క్లాసులోకి నడుచుకుంటూ వచ్చి ఆ అమ్మాయిపై పెట్రోలు పోసి నిప్పంటించేశాడు. తర్వాత తాను కూడా నిప్పంటించుకున్నాడు. ఆ అమ్మాయి బయటకు పరుగులు తీస్తుండగా వెంటపడి పట్టుకుని మరీ తన వద్ద ఉన్న లైటర్‌తో ఆమె దుస్తులకు నిప్పంటించినట్లు విద్యార్థులు చెప్పారు. తర్వాత అతడు తన దుస్తులకు కూడా అదే లైటర్‌తో నిప్పంటించుకున్నాడన్నారు. కొట్టాయంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో భాగంగానే స్కూల్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (ఎస్ఎంఇ) ఉంది. -
'ఆదర్శ్' కేసు వాయిదా..
ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కేసులో తదుపరి విచారణను సుప్రీంకోర్టు అక్టోబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. ఆదర్శ్ భవనం కూల్చివేతపై నిర్ణయం తీసుకునేంతవరకూ ఆ భవనాన్ని సురక్షితంగా ఉంచాలని జూలైలో రక్షణమంత్రిత్వశాఖకు సుప్రీం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం విచారణకు వచ్చిన కేసును సుప్రీం అక్టోబర్ 6నాటికి వాయిదా వేసింది. ముంబైలో నిర్మించిన బహుళ అంతస్తుల భవనాన్ని కూల్చొద్దని జూలై నెల్లో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. మొత్తం 31 అంతస్తులున్నభవనాన్ని స్వాధీనం చేసుకోవాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఈ బిల్డింగ్ ను కూల్చేయాలంటూ గత ఏప్రిల్ నెలలో బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆదర్శ్ సొసైటీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనికి తోడు ఆదర్శ్ సొసైటీ వాసులు భారీ మొత్తంలో పిటిషన్లు దాఖలు చేశారు. కేసులో వాదోపవాదాలు విన్న సుప్రీం నిర్ణయం తీసుకునే వరకూ భవనం కూల్చివేతను నిలిపివేసి, భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని కేంద్ర రక్షణమంత్రిత్వ శాఖకు ఆదేశాలను జారీ చేసింది. అనంతరం రక్షణ మంత్రిత్వ శాఖలోని అధికారులు ఆదర్శ్ సొసైటీలో ప్లాట్లను స్వాధీనం చేసుకున్నారు. వెటరన్ ఆర్మీ అధికారులకు కేటాయించిన ఈ భారీ భవనం దక్షిణ ముంబైలోని కొలాబాలో ఉంది. అయితే వీటిలో అధికశాతం ప్లాట్లు రాజకీయనాయకులు ఆక్రమించుకున్నారన్న కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి అశోక్ చవాన్ రాజీనామా కూడా చేయాల్సి వచ్చింది. -
ఆదర్శ్ సొసైటీని స్వాధీనం చేసుకోండి: సుప్రీం
న్యూఢిల్లీ: ఆదర్శ్ సొసైటీ పేరుతో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన 31 అంతస్తుల భవంతిని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. బిల్డింగ్ ను కూల్చకుండా కాపాడుతామని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ కోర్టుకు తెలిపారు. ఈ ప్రక్రియను ముంబై హైకోర్టు రిజష్టర్ జనరల్ పర్యవేక్షిస్తారని కోర్టు పేర్కొంది. 2016,ఏప్రిల్ 26 వ తేదీన ఆదర్శ్ హౌసింస్ సొసైటీ భవంతిని కూల్చేయాల్సిందిగా బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్ల కుటుంబాలకు కేటాయించిన స్థలంలో అక్రమంగా ఈ నిర్మాణం చేపట్టారని న్యాయస్థానం పేర్కొంది. ఈ భవనంలో అమరవీరుల కుటుంబాలకు కాకుండా రాజకీయ నేతలు, వారి బంధువులకు ప్లాట్లు కేటాయించారని స్పష్టం చేసింది. -
బాంబే హైకోర్టు సంచలన తీర్పు
ముంబై: ఆదర్శ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం కేసులో బాంబే హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ముంబైలోని 31 అంతస్తుల ఈ భవనాన్ని కూల్చివేయాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. తమ ఆదేశాలపై సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి 12 వారాల గడువు ఇచ్చింది. ఈ కుంభకోణంతో సంబంధమున్న నాయకులు, మంత్రులు, అధికారులపై దర్యాప్తు చేపట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బాంబే హైకోర్టు ఆదేశించింది. బాంబే హైకోర్టు తీర్పుపై కామెంట్ చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ నిరాకరించారు. ఈ స్కామ్ లో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ లో అశోక్ చవాన్‌తో పాటు మరో 14 మంది పేర్లను చేర్చిన సంగతి తెలిసిందే. కార్గిల్ వితంతువులతో పాటు రక్షణ సిబ్బంది కోసం నిర్మించాలనుకున్న ఫ్లాట్లను అశోక్ చవాన్ బంధువులకు కేటాయించారని అభియోగాలు మోపారు. ఈ కుంభకోణంలో అశోక్‌చవాన్‌తో పాటు మాజీ ముఖ్యమంత్రులు సుశీల్ కుమార్ షిండే, విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌లను అప్పట్లో సీబీఐ అధికారులు ప్రశ్నించారు. తప్పంతా దేశ్ముఖ్దేనని, ఆయన హయాంలోనే అన్ని నిర్ణయాలు తీసుకున్నారని చవాన్, షిండేలు సీబీఐ ఎదుట ఆరోపించారు. -
‘ఆదర్శ్’ కేసులో కొత్త మలుపు
ముంబై: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆదర్శ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం కేసులో నిందితుడైన మాజీ సీఎం, కాంగ్రెస్ నేత అశోక్ చవాన్‌ను విచారించేందుకు గవర్నర్ విద్యాసాగర్‌రావు సీబీఐకి అనుమతిచ్చారు. విచారణ విషయమై రాష్ట్ర కేబినెట్ గవర్నర్‌కు తమ అభిప్రాయం తెలిపిన తర్వాత గురువారం గవర్నర్ నుంచి సీబీఐకి అనుమతి లభించింది. కేసుకు సంబంధించి చవాన్‌కు వ్యతిరేకంగా ఆధారాలు లభించాయని, ఆయన్ను విచారించేందుకు అనుమతివ్వాలని కోరుతూ 2015, అక్టోబర్ 8న గవర్నర్‌కు సీబీఐ లేఖ రాసింది. ఈ విషయమై ప్రభుత్వ అభిప్రాయాన్ని గవర్నర్ కోరగా విచారణ కొనసాగించాలని రాష్ట్ర కేబినెట్.. గవర్నర్‌కు తెలిపింది. -
మాజీ సీఎంకు ఎదురుదెబ్బ!
ముంబై: మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి మరో దెబ్బ తగలనుంది. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణానికి సంబంధించిన కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. కేసు విచారణను ఆ రాష్ట్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేసినట్లు కనిపిస్తోంది. ఆదర్శ్ కేసులో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌పై విచారణ చేపట్టేందుకు గవర్నర్ విద్యాసాగర్ రావు సీబీఐ అధికారులకు గురువారం అనుమతి ఇచ్చారు. దీంతో ఈ కేసును ఆ రాష్ట్ర ప్రభుత్వం మరింత సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆదర్శ్ కుంభకోణానికి పాల్పడ్డవారి పేర్లను సీబీఐ కచ్చితంగా బయటపెట్టాలంటూ శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఇటీవలే డిమాండ్ చేశారు. ఈ కేసు విచారణ సవ్యదిశలో సాగడం లేదని ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే. కొంతమంది పెద్దలు నేరాలకు పాల్పడిన అనంతరం వారికి వారే క్లీన్ చిట్ పొందడం పరిపాటిగా మారిందని ఇటీవలే మండిపడగా.. తాజాగా మాజీ సీఎం చవాన్ పై విచారణ చేపట్టాలని సీబీఐకి కేసు అప్పగించారు. ఆదర్శ్ కుంభకోణం ఇదీ.. అమరులైన జవాన్ల కుటుంబాల కోసం ముంబైలోని కొలాబా ప్రాంతంలో ఆదర్శ్ సొసైటీ భవనాన్ని నిర్మించారు. అప్పటి ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తన బంధువులకు ఇళ్లు ఇప్పించడంతో ఈ కేసులో ఇరుక్కుని పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. 2010లో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన అనంతరం అశోక్ చవాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన ఈ కుంభకోణంలో నిందితుడిగా పలు కేసులను ఎదుర్కొంటున్నారు. అది కేవలం బీజేపీ ప్రతీకారేచ్ఛ చర్య: చవాన్ తనపై సీబీఐ విచారణకు గవర్నర్ ఆదేశించడం బీజేపీ ప్రతీకారేచ్చను సూచిస్తుందని అశోక్ చవాన్ పేర్కొన్నారు. బీజేపీ ప్రోద్బలంతోనే తనపై విచారణ చర్యలకు దిగుతున్నారని వ్యాఖ్యానించారు. ఆర్మీ అధికారుల కుటుంబాలకు కేటాయించినట్లు ఎక్కడా పేర్కొనలేదని... అది కేవలం మహారాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోని ప్లేస్ అని వివరించారు. జస్టిస్ పాటిల్ కమిటీ రిపోర్టులో ఈ విషయం స్పష్టంగానే ఉందని.. కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నంత మాత్రాన ఆదర్శ్ కుంభకోణం అంశంలో గవర్నర్ తన నిర్ణయాన్ని ఏ విధంగా మార్చుకుంటారని మాజీ సీఎం చవాన్ మండిపడ్డారు. -
సమాజీ ఆర్మీ చీఫ్ వల్లే వివాదం
ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ సభ్యుల ఆరోపణ ముంబై: మాజీ ఆర్మీచీఫ్ వీకే సింగ్ వల్లే ‘ఆదర్శ్’ వివాదం చెలరేగిందని, నిజానికి అక్కడ స్థలవివాదం ఏమీ లేదని ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ సభ్యులు ఆరోపించారు. వారు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 31 అంతస్తుల భవనం నిర్మించిన స్థలం నిజానికి రక్షణ శాఖకు చెందినది కాదని, ఆ స్థలం రాష్ట్ర ప్రభుత్వానికి చెందినదని తెలిపారు. భవనం నిర్మాణంలో ఎటువంటి అవకతవకలు జరగలేదని వారు వివరించారు. ఈ సందర్భంగా వారు తాము సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వం పొందిన డాక్యుమెంట్లను చూపించారు. సంబంధిత స్థలం రక్షణ శాఖకు చెందినది కాదని తేలడంతో సీబీఐ తమపై పెట్టిన క్రిమినల్ కేసు వీగిపోయిందన్నారు. ఇదిలా ఉండగా, కార్గిల్ యుద్ధ వీరుల నిమిత్తం మొదట ఇక్కడ ఆరు అంతస్తుల భవనం నిర్మించాలని భావించారు. కాని తర్వాత ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా అక్కడ 31 అంతస్తుల భవనసముదాయాన్ని నిర్మించారు. దీంతో అది వివాదంగా మారింది. కాగా మాజీ ఆర్మీచీఫ్, ప్రస్తుత కేంద్ర మంత్రి వీకే సింగ్ అప్పటి కేంద్ర రక్షణ మంత్రి ఏకే ఆంథోనీని ఈ విషయమై తప్పుదోవ పట్టించారని సొసైటీ అడ్‌హక్ చైర్మన్, రిటైర్డ్ బ్రిగేడియర్ టి.కె.సిన్హా ఆరోపించారు. -
మాజీ సీఎం అశోక్ చవాన్‌కు ఎదురుదెబ్బ
ముంబయి : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో నిందితుల జాబితా నుంచి చవాన్ పేరును తొలగించాలన్న సీబీఐ అభ్యర్థనను హైకోర్టు బుధవారం తిరస్కరించింది. ఈ కుంభకోణానికి సంబంధించిన చార్జిషీట్లో పేర్కొన్న 13 మంది నిందితుల పేర్ల నుంచి అశోక్ చవాన్ పేరును తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. అభియోగాల ఉపసంహరణ చర్యలపై ముంబయి హైకోర్టు స్టే విధించింది. కాగా అమర జవాన్ల కుటుంబాల కోసం ముంబైలోని కొలాబా ప్రాంతంలో ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ 31 అంతస్తుల భవన సముదాయం నిర్మించింది. అప్పటి ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఈ భవనంలో తన బంధువులకు ఫ్లాట్లు ఇప్పించడంతో ఈ కేసులో ఇరుక్కున్నారు. 2010లో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన అనంతరం అశోక్ చవాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దాంతో సిబిఐ ఈ కుంభకోణంలో నిందితుడిగా చవాన్‌ను పేర్కొంది. ఈ కుంభకోణంపై దర్యాప్తు జరిపిన జ్యుడీషియల్ కమిటీ హౌసింగ్ సొసైటీ ఇళ్ల కేటాయింపుల్లో అశోక్ చవాన్, ఈ కేటాయింపుల ద్వారా లబ్ధి పొందిన ఆయన సమీప బంధువులు కుమ్మక్కుకు పాల్పడ్డారని తేల్చి చెప్పింది. -
'ఆ వ్యాఖ్యలు చేసినందుకు చింతిస్తున్నా'
పుణే: తన కంటే ముందు పనిచేసిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంపై తాను చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర తాజా మాజీ సీఎం పృథ్విరాజ్ చవాన్ విచారం వ్యక్తం చేశారు. తాను కావాలని ఈ వ్యాఖ్యలు చేయలేదని, ఏమరుపాటుగా జరిగిన పొరబాటని ఆయన వివరణయిచ్చారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ పతనమైతే... ఆదర్శ్ కేసులో మాజీ ముఖ్యమంత్రులు విలాస్ రావ్ దేశ్‌ముఖ్, సుశీల్ కుమార్ షిండే, అశోక్ చవాన్ లపై చర్యలు తీసుకుంటానని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్విరాజ్ పేర్కొన్నారు. జరిగిన తప్పిదానికి చింతిస్తున్నానని ఆయన తెలిపారు. తన చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని కూడా ఆయన అన్నారు. -
నేడే విస్తరణ
సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో దారుణ పరాజయం అనంతరం అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారించిన ఎన్సీపీ, కాంగ్రెస్‌లు ముందుగా రాష్ట్ర మంత్రి మండలిని విస్తరించాలని నిర్ణయం తీసుకున్నాయి. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం మంత్రిమండలిని విస్తరించి, గురువారం ఉదయం కొత్త మంత్రులతో రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిసిన అనంతరం మంత్రిమండలిని విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైద్యవిద్యాశాఖ మంత్రి విజయ్‌కుమార్ గావిత్‌ను పార్టీ నుంచి తొలగించడంతో ఆయన స్థానం, ఎన్సీపీ కోటాలోని ఓ కేబినెట్ పదవి ఖాళీగా ఉన్నాయి. దీంతోపాటు ఆరోగ్య, సాంస్కృతికశాఖ మంత్రి ఫౌజియాఖాన్ (ఎమ్మెల్సీ) పదవీకాలం కూడా ముగిసింది. దీంతో వీటిని భర్తీ చేయడం కోసం మంత్రిమండలిని విస్తరించనున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ అభ్యర్థికి ఫౌజియాఖాన్ సహకరించలేదన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెకు మరోసారి మంత్రిపదవి దక్కే అవకాశాలు సన్నగిల్లాయి. గావిత్ స్థానంలో మహారాష్ట్ర ఎన్సీపీ కార్యాధ్యక్షులు జితేంద్ర అవాడ్‌కు వైద్యవిద్యాశాఖ మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. ఈ పదవి కోసం రేసులో శరద్గావిత్ పేరు కూడా వినిపిస్తోంది. ఫౌజియాఖాన్ స్థానం కోసం జితేంద్ర అవాడ్తోపాటు ప్రకాష్ సోలంకే, ధనంజయ్ ముండే, సమీర్ భుజ్‌బల్, పంకజ్ భుజ్బల్లతోపాటు పలువురు రేసులో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ కోటాలోని మూడు మంత్రి పదవులను కూడా భర్తీ చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది. దీంతో కాంగ్రెస్‌లో కూడా మంత్రి పదవులపై ఆసక్తికనబరుస్తున్న నాయకులలో ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్‌రావ్ ఠాక్రేతోపాటు వసంత్ పురకే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసమే... అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగైదు నెలల్లో జరగనున్నాయి. ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రజాస్వామ్య కూటమికి చెందిన కాంగ్రెస్, ఎన్సీపీలు ఘోరపరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. సుశీల్‌కుమార్ షిండే, మిలింద్ దేవరా, ప్రియాదత్ ఇలా అనేక మంది దిగ్గజ నాయకులు ఓటమి పాలయ్యారు. దీంతో కాంగ్రెస్‌కు మరాఠ్వాడాలోని కేవలం రెండు స్థానాలు లభించగా ఎన్సీపీకి పశ్చిమ మహారాష్ట్రలోని నాలుగు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నంలో భాగంగానే ఈ మంత్రి మండలి విస్తరణ జరుగుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో పాత ముఖాలే.. మంత్రివర్గ విస్తరణలో ఎన్సీపీ నుంచి కేబినెట్ పదవిని కొత్త వ్యక్తికి కట్టబెట్టాలని చూస్తుండగా కాంగ్రెస్ మాత్రం పాతవారితోనే విస్తరణ తంతు ముగించాలనుకుంటున్నట్లు సమాచారం. -
నితిన్ గడ్కరీ... నన్ను క్షమించు
కాంగ్రెస్ కు హై ప్రొఫైల్ నేతలు తలనొప్పులుగా మారారు. ఒక వైపు దిగ్విజయ్ వివాహేతతర సంబంధం చికాకు పెడుతూండగానే, మరో సీనియర్ నేత మనీష్ తివారీ దాదాపు ముక్కు నేలకు రాసినంత పనిచేయాల్సి వచ్చింది. కార్గిల్ అమరవీరులకోసం ఇచ్చిన ఆదర్శ్ ఫ్లాట్లలో బిజెపి మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరికి కూడ ఆబేనామీ ఫ్లాట్ ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ ఆరోపించారు. అయితే ఇది నిరాధారమైన, దురుద్దేశంతో కూడుకున్న ఆరోపణ అని నితిన్ గడ్కరీ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసును ఆయన 2010 లో వేశారు. ఈ కేసు విచారణ వేగం పుంజుకున్న నేపథ్యంలో మనీష్ తివారీపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయింది. దీనితో మనీష్ తివారీ తప్పుడు ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు కోరారు. వివాదాన్ని ఇంతటితో ఆపేందుకు మనీష్ క్షమాపణలు కోరారు. -
‘నాందేడ్’పైనే నజర్!
నాందేడ్: మరాఠ్వాడా ప్రాంతంలో ఏప్రిల్ 17న జరగనున్న లోక్‌సభ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఆదర్శ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఇక్కడ నుంచే లోక్‌సభ బరిలో ఉండటం ఉత్కంఠకు దారితీసింది. నాందేడ్ నియోజకవర్గం నుంచి చవాన్ లోక్‌సభకు కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నారు. కాగా, ఇక్కడ బీజేపీకి చెందిన డీబీ పాటిల్ పోటీచేస్తున్నారు. 17వ తేదీన రాష్ట్రం మొత్తం మీద 23 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఈ నియోజకవర్గంపైనే అందరి దృష్టి నిలుస్తోంది. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఆరు అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటన్నింటిలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇదే నియోజకవర్గంలోని భోకర్ అసెంబ్లీ స్థానం నుంచి చవాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, ఆదర్శ్ కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న చవాన్ అభ్యర్థిత్వంపై మల్లగుల్లాలు పడిన అధిష్టానం చివరకు లోక్‌సభ బరిలో అతడినే దింపేందుకు నిర్ణయించింది. చవాన్ లోక్‌సభకు పోటీచేయడం ఇది మొదటిసారి కాదు. ఆయన 1987లో నాందేడ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. అయితే 1989లో జరిగిన ఎన్నికల్లో జనతాదళ్ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. అశోక్ చవాన్ తండ్రి ఎస్.బి.చవాన్ రెండుసార్లు ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేసి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. కాగా, బీజేపీ అభ్యర్థి పాటిల్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. నాందేడ్‌లో మోడీ అనుకూల పవనాలు, చవాన్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. మోడీ ప్రభంజనంలో చవాన్ కొట్టుకుపోవడం ఖాయమని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు. పాటిల్ 2004లో ఇక్కడ నుంచి గెలిచి తర్వాత ఎన్సీపీలో చేరారు. అనంతరం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలా ఉండగా, నియోజకవర్గంలో 13 శాతం ఓట్లు ఉన్న ముస్లిం వర్గం నుంచి ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాగా, ఆదర్శ్ కుంభకోణంలో తన ప్రమేయం ఉందన్న ప్రతిపక్షాల ఆరోపణలను అశోక్ చవాన్ తీవ్రంగా ఖండించారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే విపక్షాలు ‘ఆదర్శ్’ అంశాన్ని లేవదీస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. వాస్తవానికి ఆదర్శ్ అంశం తెరమీదకు రాగానే నాందేడ్ అభ్యర్థిగా చవాన్‌కు బదులు అతడి భార్య అమీతను నిలబెట్టాలని పార్టీ అధిష్టానం మొదట యోచించింది. అయితే అది పార్టీపైన ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశముందని భావించి తన యోచనను విరమించుకుంది. రాజకీయ నాయకులు, రాష్ట్ర అధికారులు, ఆర్మీ అధికారుల నిమిత్తం దక్షిణ ముంబైలో అప్పట్లో ‘ఆదర్శ్’ బహుళ అంతస్తుల భవనం నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే వాటిలో చాలా ఫ్లాట్లను అప్పటి సీఎం అశోక్‌చవాన్, అతడి మంత్రివర్గ సభ్యులు కొందరు అనధికారికంగా బంధువులకు, అస్మదీయులకు కేటాయించారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. కొన్ని కోట్ల రూపాయల విలువచేసే ఈ ఫ్లాట్లలో మూడింటిని అశోక్ చవాన్ తన బంధువులకు అక్రమంగా బదలాయించారని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. దీంతో 2010లో అశోక్‌చవాన్ సీఎం పదవికి బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం చవాన్‌తోపాటు అతడి మంత్రివర్గంలోని సభ్యులైన విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, సుశీల్‌కుమార్ షిండే తదితరులపై జరిగిన న్యాయవిచారణలో సైతం ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే ఆ నివేదికను పృథ్వీరాజ్ చవాన్ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఈ కుంభకోణంలో అశోక్ చవాన్ పాత్రపై సీబీఐ విచారణకు గవర్నర్ శంకర్నారాయణన్ తిరస్కరించడంతో తన ప్రాథమిక చార్జిషీట్లో చవాన్ పేరును సీబీఐ చేర్చలేదు. నాందేడ్ సిట్టింగ్ ఎంపీ, చవాన్ బావమరిది అయిన భాస్కర్‌రావ్ పాటిల్ ఖాట్గోంకర్ ప్రస్తుతం తిరిగి పోటీచేయనని ప్రకటించి పాటిల్‌కు మార్గం సుగమం చేశారు. నాందేడ్ జిల్లాలో చవాన్ కుటుంబానికి ఉన్న పట్టు నేపథ్యంలో మోడీ ప్రభావం ఈ నియోజకవర్గంపై అంతగా ఉండకపోవచ్చని, ప్రస్తుత ఎన్నికల్లో అతడి గెలుపు నల్లేరుమీద నడకేనని విశ్లేషకులు భావిస్తున్నారు. -
మనీష్ తివారీకి బెయిల్ మంజూరు
బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరి దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కేంద్రమంత్రి మనీష్ తివారీకి ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎస్ఎస్ గులానే ఎదుట స్వయంగా హాజరై బెయిల్ పత్రాలను దాఖలు చేశారు. బెయిల్ పత్రాలను పరిశీలించిన మేజిస్టేట్.. 10 వేల రూపాయల వ్యక్తిగత పూచికత్తుతో తివారీకి బెయిల్ మంజూరు చేశారు. తివారీకి బెయిల్ ఇవ్వడంపై గడ్కరీ తరపు న్యాయవాది తీవ్రంగా వ్యతిరేకించారు. తన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా మార్చి 7 తేదిన తివారీ వ్యాఖ్యలు చేశారని గడ్కరీ చేసిన ఫిర్యాదును కోర్టు పరిగణనలోకి తీసుకుని నోటిసులు జారీ చేశారు. ఆదర్శ్ సొసైటీలో గడ్కరీకి బినామీ ఫ్లాట్ ఉందని తివారీ వ్యాఖ్యలు చేశారు. తీవారీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని.. లేకపోతే రుజువు చేయాలని గడ్కరీ డిమాండ్ చేశారు. తివారీ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఆయనపై గడ్కరీ ఫిర్యాదు చేశారు. -
గెలుపు నాదే
సాక్షి, ముంబై: కాంగ్రెస్ పార్టీ తనపై నమ్మకముంచి కేటాయించిన నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గంలో విజయం సాధిస్తానని వంద శాతం కచ్చితంగా చెప్పగలనని మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ అన్నారు. ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణంలో వివాదం చుట్టుముట్టడంతో ముఖ్యమంత్రి పదవీకి రాజీనామా చేసిన చవాన్, మద్దతుదారులు, పార్టీ కార్యకర్తల సమక్షంలో బుధవారం ఈసీ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం చవాన్ మీడియాతో మాట్లాడుతూ ఆదర్శ్ కుంభకోణంలో అవినీతికి పాల్పడలేదని తన మనస్సాక్షికి తెలుసని అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. అవినీతిని వ్యతిరేకించే రాహుల్ గాంధీకి నిజం తెలుసు కాబట్టే ఈరోజు తనకు టికెట్ దక్కిందని చవాన్ వివరించారు. ఆదర్శ్ విషయంలో అవినీతి ఎక్కడుందని, సంబంధంలేని విషయాల గురించి మాట్లాడనని తెలిపారు. ప్రతిపక్ష నాయకులే రాజకీయ లబ్ధి పొందేందుకు అవినీతి ఆరోపణలు చేస్తారని అన్నారు. ఈ విషయాల గురించి మాట్లాడే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదన్నారు. మైనింగ్ కుంభకోణంలో ప్రమేయముందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యాడ్యూరప్ప, గాలి సోదరులపై బీజేపీ విధానమేంటో అందరికీ తెలిసిందేనని అన్నారు. ఆదర్శ్ కుంభకోణం చార్జిషీట్లో తన పేరు చేర్చారు కానీ, తనను దోషిగా పేర్కొనలేదని తెలిపారు. ఎన్నికల్లో స్వేచ్ఛగా తాను పోటీ చేయవచ్చని, న్యాయ విధానాలు, నిబంధనల ప్రకారం అది సాధ్యమేనని అన్నారు. ఏ ఎన్నిక నుంచి పోటీ చేసేందుకు తనను దూరం చేయలేరని వ్యాఖ్యానించారు. కామన్వెల్త్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న సురేశ్ కల్మాడీని తప్పించారు కదా, మీ కేసు కూడా అలాంటిదే కదా అని మీడియా అడిగిన ప్రశ్నకు చవాన్ తానేమీ మాట్లాడనని అన్నారు. నాందేడ్ నుంచి పోటీ చేయాలని అధిష్టానం నిర్ణయించి ందని, ఆ బాటలోనే ముందుకెళతానని తెలిపారు. ఆదర్శ్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన సమయంలో సీఎంగా మిమ్మల్ని తప్పించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇప్పుడు అవినీతి విషయంలో రాజీపడుతున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు చవాన్ మాట్లాడుతూ అసలు అవినీతి ఎక్కడుంది? ఈ విషయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీని లాగడమెందుకు? దీంతో వారికి ఏమి సంబంధమని మీడియాను ఎదురు ప్రశ్నించారు. అందరిలో ఉత్కంఠ... మాజీ సీఎం అశోక్ చవాన్‌కు ఆఖరి క్షణంలో ఊరట లభించింది. బుధవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి ఆఖరు రోజు కావడంతో పార్టీ పదాధికారులు, కార్యకర్తల్లో నాందేడ్ సీటు ఎవరికి వస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. మంగళ వారం రాత్రి ఎనిమిది గంటల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చవాన్ పేరు ప్రకటించి సస్పెన్షన్‌కు తెరదించింది. అంతలోనే సిట్టింగ్ ఎంపీ భాస్కర్‌రావ్ ఖత్గావ్కర్ కూడా నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇప్పటికే బీజేపీ నుంచి మాజీ ఎంపీ డి.బి.పాటిల్, ఆప్ తరఫున నరేంద్రసింగ్ గ్రంథి నామినేషన్లు దాఖలు చేశారు. ఒకవైపు నామినేషన్లు దాఖలు చేయడానికి సమయం దగ్గరపడుతోంది. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి పేరు ఖరారు చేయకపోవడంతో కార్యకర్తలో మరింత ఉత్కంఠ మొదలైంది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా అశోక్ చవాన్ సతీమణి అమితా చవాన్, జిల్లా ఇన్చార్జి మంత్రి డి.పి.సావంత్ నామినేషన్ ఫారాలు నింపి సిద్ధంగా ఉంచారు. ఇంతలో మంగళవారం రాత్రి కాంగ్రెస్ చవాన్ పేరును ప్రకటించింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు భారీ ఊరేగింపు, మోటార్ సైకిళ్ల ర్యాలీతో బయలుదేరిన మాజీ సీఎం ఆశోక్ చవాన్ జనాలకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ‘మాజీ సీఎం పేరు తొలగించండి’ ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణంలో దాఖలైన ఎఫ్ఐఆర్ నుంచి మాజీ సీఎం ఆశోక్ చవాన్ పేరును తొలగించాలని బాంబే హైకోర్టును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆశ్రయించింది. ఈ ఏడాది జనవరిలో ప్రత్యేక సీబీఐ కోర్టు ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నుంచి చవాన్ పేరును తొలగించేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. సీబీఐ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ గురువారం విచారణకు రానుంది. -
ఆరోపణలున్నా.. టికెట్లిస్తాం: సోనియా
ఆదర్శ్ హౌసింగ్ స్కాంలో పాత్రధారి, ఆ కుంభకోణానికి సూత్రధారి అని యావత్ ప్రపంచం గగ్గోలు పెట్టిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చేసింది. మహారాష్ట్రలోని నాందేడ్ స్థానం నుంచి ఆయన లోక్‌సభకు పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే నామినేషన్లు కూడా దాఖలు చేసేశారు. చవాన్‌కు టికెట్ ఇవ్వాలన్న నిర్ణయాన్ని సోనియాగాంధీ నిస్సిగ్గుగా సమర్థించుకున్నారు. ''మాకు తెలిసున్నంత వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఏ చట్టమూ చవాన్‌ను నిషేధించలేదే'' అని ఆమె విలేకరులను ఎదురు ప్రశ్నించారు. -
అందరికీ ‘ఆదర్శ్’
రేగోడ్, న్యూస్‌లైన్: వీఆర్ఓ ఫలితా ల్లో జిల్లా టాపర్‌గా నిలిచిన ఆదర్శ్ లక్ష్యం చేరుకునే యువతకు ఆదర్శం గా నిలిచాడు. విద్యకు పేద, ధనిక తేడా లేదని చాటాడు. ప్రభుత్వ పాఠశాలలో చదివినా పైకి రావచ్చని నిరూపించాడు. రేగోడ్తు బిజిలిపురం వీరప్పకు ముగ్గురు కుమారులు, వీరిలో మొదటి కుమారుడు ఆదర్శ్. ఇతను రేగోడ్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి వరకు చదివాడు. పదిలో 548 మార్కులు సాధించి మం డలంలో రెండోస్థానంలో నిలిచాడు. మియాపూర్‌లోని ఎంఎన్ఆర్ విద్యాల యంలో ఇంటర్ చదివి 975 మార్కు లు సాధించాడు. ఆ తర్వాతఎంసెట్ రాసి పులివెందులలోని జేఎన్టీయూ లో ఇంజనీరింగ్(సీఎస్సీ) పూర్తి చేశా డు. ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే వీఆర్ఓ పరీక్ష రాసి 100కు 98 మార్లు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచాడు. ఆదర్శ్ తమ్ముడు శ్రీకాంత్ బీటెక్ చదువుతున్నాడు. మరో తమ్ముడు వంశీ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. -
‘సాక్ష్యాలు లేనందునే నిరాకరించా’
న్యూఢిల్లీ: ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో మాజీ సీఎం ఆశోక్ చవాన్ పాత్ర ఉన్నట్టు ఎలాంటి ఆధారాలను సీబీఐ చూపించలేకపోయిందని రాష్ట్ర గవర్నర్ కె.శంకర నారాయణన్ అన్నారు. ఈ సొసైటీలో రాజకీయ నాయకులకు కూడా అవకాశం కల్పించేలా రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి హోదాలో అశోక్ చవాన్ ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలపై సాక్ష్యాన్ని సీబీఐ సేకరించలేకపోయిందని న్యూఢిల్లీలో బుధవారం విలేకరులతో అన్నారు. దీన్ని ఆధారంగానే చేసుకునే చవాన్‌ను విచారించేందుకు సీబీఐకి అనుమతించలేదని వివరించారు. 2000వ సంవత్సరంలో ఫ్లాట్ల కేటాయింపులో చవాన్ క్రిడ్ ప్రో కోకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయని, అయితే 2004లో జూన్ 18న చవాన్ వదిన చేసుకున్న దరఖాస్తును తిరస్కరణకు గురైందన్నారు. 2000 సమావేశానికి, 2004 దరఖాస్తుకు చాలా కాలం వ్యత్యాసముందన్నారు. చివరగా 2008, నవంబర్ 10న ఆమెకు సభ్యత్వం ఇచ్చారని తెలిపారు. అయితే ఆ సమయంలో చవాన్ రెవెన్యూ శాఖ మంత్రి కానీ, సీఎం హోదాలో కానీ లేరని తెలిపారు. సీఆర్పీసీ 197 సెక్షన్ కింద మాత్రమే చవాన్‌ను విచారించేందుకు సీబీఐ అనుమతి కోరిందని, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 19 కింద కాదని చెప్పారు. తన వద్దకు వచ్చిన అన్ని పత్రాలను పరిశీలించాకే సీబీఐ విచారణకు అనుమతించలేదని వివరించారు. గతంలో ఆదర్శ్ కుంభకోణంలో ఆరోపణలు రావడంతో సీఎం పదవికి అశోక్ చవాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ కుంభకోణం నుంచి చవాన్ పేరును తప్పించాలంటూ ఇటీవల బాంబే హైకోర్టుకు వెళ్లిన సీబీఐకి చుక్కెదురైంది. -
అశోక్ చవాన్ పేరు తొలగించవద్దన్న కోర్టు
ముంబై: ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో నిందితుల జాబితా నుంచి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పేరును తొలగించాలన్న సీబీఐ అభ్యర్థనను సిబిఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఈ కుంభకోణానికి సంబంధించిన చార్జిషీట్లో పేర్కొన్న 13 మంది నిందితుల పేర్ల నుంచి అశోక్ చవాన్ పేరును తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని ఈ నెల 15న సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. అమర జవాన్ల కుటుంబాల కోసం ముంబైలోని కొలాబా ప్రాంతంలో ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ 31 అంతస్తుల భవన సముదాయం నిర్మించింది. అప్పటి ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఈ భవనంలో తన బంధువులకు ఫ్లాట్లు ఇప్పించడంతో ఈ కేసులో ఇరుక్కున్నారు. 2010లో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన అనంతరం అశోక్ చవాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దాంతో సిబిఐ ఈ కుంభకోణంలో నిందితుడిగా చవాన్‌ను పేర్కొంది. ఈ కుంభకోణంపై దర్యాప్తు జరిపిన జ్యుడీషియల్ కమిటీ హౌసింగ్ సొసైటీ ఇళ్ల కేటాయింపుల్లో అశోక్ చవాన్, ఈ కేటాయింపుల ద్వారా లబ్ధి పొందిన ఆయన సమీప బంధువులు కుమ్మక్కుకు పాల్పడ్డారని తేల్చి చెప్పింది. -
'ఆదర్శ్' నిందితుల పేర్లను ఎందుకు దాస్తున్నారు: ఉద్ధవ్ ఠాక్రే
ముంబై: ఆదర్శ్ కుంభకోణంకు సంబంధించిన దర్యాప్తును వేగవంతం చేయాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ఆదర్శ్ కేసులో మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ విచారించిన సీబీఐ తర్వాత అసలు నిందితుల పేర్లను బయటకు వెల్లడించకపోవడాన్ని ఠాక్రే తప్పుబట్టారు. ఈ కేసు విచారణ సవ్యమైనదిశలో సాగడం లేదని ఆయన పేర్కొన్నారు. కొంతమంది పెద్దలు నేరాలకు పాల్పడిన అనంతరం వారికి వారే క్లీన్ చిట్ పొందడం పరిపాటిగా మారిందన్నారు. ఆదర్శ్ స్కాం దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ ఘటనలో అభియోగాలు మోపడ్డ వారి పేర్లను దాచడాన్నిఠాక్రే ప్రశ్నించారు. కాగా, అశోక్ చవాన్ ఆదర్శ్ కుంభకోణానికి పాల్పడ్డారని తాను వ్యాఖ్యానించడం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
‘ఆదర్శ్’పై సీఎంకు మాజీ లేఖ
సాక్షి, ముంబై: ఆదర్శ్ కుంభకోణంపై నియమించిన విచారణ కమిషన్ వల్ల తనకు న్యాయం జరగలేదని మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తోపాటు ప్రభుత్వ కార్యదర్శికి మంగళవారం లేఖ రాశారు. ద్విసభ్య కమిషన్ నివేదిక సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉందన్నారు. ‘నివేదిక సరిగా లేదు. నాకు బాగా అన్యాయం జరిగింది. నా వాదనను ఆలకిస్తానంటూ ఇచ్చిన హామీని ఈ కమిషన్ ఏమాత్రం నిలబెట్టుకోలేకపోయింది’ అని చవాన్ తన లేఖలో రాశారని ఆయన సన్నిహితవర్గాలు వెల్లడించాయి. అభియోగం మోపాలని భావించినప్పుడు తన వాదనను వినిపించుకోవాల్సిందని ఆ లేఖద్వారా అశోక్ చవాన్... ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ దృష్టికి తీసుకొచ్చారు. నివేదిక కారణంగా ఒకరి ప్రతిష్టకు భంగం వాటిల్లేఅవకాశం ఉన్నప్పుడు ఆ వ్యక్తి వాదనను వినాల్సిందన్నారు. ప్రభుత్వం పరిశీలిస్తుంది ఆదర్శ్ వ్యవహారంలో తనకు జరిగిన అన్యాయంపై మాజీ ముఖ్యమంత్రి అశోక్చ వాన్ రాసిన లేఖను ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రాలయకు చెందిన ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కాగా ఆదర్శ్ సొసైటీలో పౌరులకు సభ్యత్వం కల్పించారని, అం దువల్ల తాను ఆ సంస్థకు లాభం చేకూర్చేవిధంగా వ్యవహరించలేదంటూ మాజీ ముఖ్యమంత్రి చెప్పలేరని అశోక్ చెప్పలేరని ద్విసభ్య కమిషన్ తన నివేదికలో పేర్కొంది. అదనపు ఎఫ్ఎస్ఐ కేటాయింపు అమాయక చర్యగా భావించలేమంది. ఆ చర్య చట్టబద్ధమా కాదా అనే విషయంలో తమకు ఎటువంటి బాధా లేదని, అయితే ఈ నిర్ణయంద్వారా తన సన్నిహితులైన బంధువులకు ఫ్లాట్లు మంజూరయ్యేవిధంగా చేశారని, అది క్విడ్ ప్రోకోనే అవుతుందని పేర్కొంది. -
ఆమోదం కొన్నింటికే
సాక్షి, ముంబై: ఆదర్శ్ కుంభకోణంపై విచారణ కోసం నియమించిన ద్విసభ్య సంఘం సమర్పించిన నివేదికలోని కొన్ని అంశాలను మాత్రమే ఆమోదిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గురువారం నాటి రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నివేదిక పేర్లు ఉన్న బడా రాజకీయ నాయకులపై చర్యలను చేపట్టేందుకు ప్రభుత్వం తిరస్కరించింది. ‘నివేదికలో కొంతమంది రాజకీయ నాయకులు పేర్లు ఉన్నప్పటికీ వారు నేరాలకు పాల్పడ్డట్టు కమిటీ నిర్ధారించలేదు. ఈ కుంభకోణంలో సీబీఐ ఇది వరకే అధికారులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. మేం వారిపై కొత్తగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అనుమతుల జారీలో నిబంధనలను ఉల్లంఘించిన కొందరు అధికారులపై మాత్రం చర్యలు తీసుకుంటాం. నివేదికలోని మిగతా అంశాలపైనా మరికొన్ని రోజులపై నిర్ణయం ఉంటుంది’ అని ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. ఆదర్శ్ నివేదికపై శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో చర్చ నిర్వహించాలన్న ప్రతిపాదనను తోసిపుచ్చడంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అసంతృప్తి వ్యక్తం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. నివేదికను పునఃసమీక్షించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన కేబినేట్ సమావేశాల్లో ఆదర్శ్ అంశం చర్చకు వచ్చింది. ఆదర్శ్ వ్యవహారంపై విచారణకు రిటైర్డ్ న్యాయమూర్తి పాటిల్ నేతృత్వంలో ద్విసభ్య కమిటీని నియమించడం తెలిసిందే. కమిటీ నివేదికలో 13 అంశాలపై సిఫార్సులు ఇచ్చింది. వీటిలో కొన్ని అంశాలను మాత్రమే స్వీకరిస్తూ మిగతావాటిపై రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని మంత్రి మండలి నిర్ణయింది. ఈ కుంభకోణంలో రాష్ట్రంలోని ఆరుగురు రాజకీయ నాయకుల పేర్లను కమిటీ ప్రస్తావించింది. అయినప్పటికీ వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయాల్సిన అవసరం లేదని పేర్కొందని ముఖ్యమంత్రి చవాన్ అన్నారు. కాంగ్రెస్ నాయకులందరికీ ఊరటనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విపక్షాలు అంటున్నాయి. ఈ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రులు అశోక్ చవాన్, సుశీల్‌కుమార్ షిండే, దివంగత సీఎం విలాస్‌రావ్ దేశ్ముఖ్లతోపాటు శివాజీరావ్ నిలంగేకర్ పాటిల్, రాజేష్ టోపే, సునీల్ తట్కరేకు ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. మరోవైపు ఆదర్శ్ భవనానికి అనుమతులు ఇప్పించే సమయంలో 12 మంది అధికారులు నియమాలను ఉల్లంఘించారని చవాన్ అన్నారు. వారిపై మాత్రం చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. వీరందరిపై ఇప్పటికే 2011 జనవరి 29న సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. అనర్హులుగా గుర్తించిన 25 మంది సభ్వత్వాన్ని ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ నుంచి తొలగిస్తామని చవాన్ ప్రకటించారు. నకిలీ పేర్లతో ఫ్లాట్లు పొందిన వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రత్యేక సమావేశం నిర్వహించడం : తావ్డే ఆదర్శ్ కుంభకోణంలో పలువురు మాజీ ముఖ్యమంత్రులకు ప్రమేయం ఉన్నట్టు పాటిల్ నివేదిక వెల్లడించినందున, దీనిపై చర్చ కోసం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చాలని సభలో విపక్ష నాయకుడు వినోద్ తావ్డే డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించడం రాజ్యాంగ విరుద్ధమని, ఈ మేరకు తాను గవర్నర్‌కు లేఖ రాశానని ఈ బీజేపీ నాయకుడు విలేకరులకు తెలిపారు. దీనిపై ఏ నిర్ణయమైనా అసెంబ్లీలోనే తీసుకోవాలని డిమాండ్ చేశారు. హర్షం వ్యక్తం చేసిన ఎన్సీపీ ఆదర్శ్ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ఎన్సీపీ ప్రకటిచింది. నివేదికలోని కొన్ని అంశాలను మాత్రమే ఆమోదించినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, మొత్తం 13 అంశాలనూ స్వీకరించిందని పేర్కొంది. మరోవైపు ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటనేది కార్యాచరణ నివేదికలో స్పష్టం చేసినట్టు తెలిపింది. -
రాహుల్ వాదనకు ఎన్సీపీ సమర్థన
న్యూఢిల్లీ: ఆదర్శ్ కుంభకోణంపై విచారణకు నియమించిన ద్విసభ్య కమిటీని నివేదిక తిరస్కరించడంపై మహారాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఎన్సీపీ సమర్థించింది. నివేదికను సమీక్షించాలని ఎవరు వాదించినా తాము మద్దతు తెలుపుతామని, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తొందరపాటని ఎన్సీపీ ఎంపీ తారిఖ్ అన్వర్ సోమవారం అన్నారు. చవాన్ ప్రభుత్వం ఈ విషయంలో తన నిర్ణయాన్ని పునఃపరిశీలించే అవకాశాలున్నాయని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సైతం శనివారం పేర్కొన్నారు. పలువురు రాష్ట్ర మంత్రులు, అధికారులకు ఈ కుంభకోణంతో ప్రమేయముందని న్యాయవిచారణ సంఘం నివేదికలో పేర్కొంది. -
బయటపెట్టండి!
ముంబై: ఆదర్శ్ కుంభకోణంపై జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చిన నివేదికను బయటపెట్టాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఢిల్లీలో శనివారం చేసిన వ్యాఖ్యలతో ఈ డిమాండ్లు మరింత ఊపందుకున్నాయి. దిసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్టును ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టాలని సమాచార హక్కు కార్యకర్త అనిల్ గల్గాలీ ఆదివారం డిమాండ్ చేశారు. అప్పుడే కుంభకోణంలో నిందితులుగా ఉన్నవారి ముఖాలు ప్రజలకు తెలుస్తాయన్నారు. నివేదిక సిద్ధమై నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా దానిని మరాఠీలోకి మార్చుకోలేకపోవడంపై గల్గాలీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్ర అసెంబ్లీ నిబంధనల ప్రకారం నివేదికను మరాఠీలోకి మార్చుకోవాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకో నిర్లక్ష్యం చేసిందన్నారు. ఆదర్శ్ కుంభకోణంలో నిందితులెవరో నిగ్గు తేల్చేందుకు కమిషన్‌ను వేసి, రూ. 7.04 కోట్లు ఖర్చుచేసిందని, దానిని అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చి చర్చ జరిపేందుకు నిరాకరించడమెందుకని ప్రశ్నించారు. కుంభకోణానికి పాల్పడిన రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వమే కవచంలా ఉండి కాపాడుతోందని ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చవాన్ కార్యదర్శి భగవాన్ సాహేకు లేఖ రాశారు. ‘రాష్ట్ర అసెంబ్లీ నిబంధనల ప్రకారం ప్రతి నివేదికను ఆంగ్లంతోపాటు మరాఠీలోకి అనువదించుకోవాలి. ముంబై ఉగ్రదాడిపై నియమించిన రామ్‌ప్రధాన్ కమిటీ నివేదికను రెండు భాషల్లో సిద్ధం చేసుకున్నారు. అయితే ఆదర్శ్ కుంభకోణం నివేదిక విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను తుంగ లో తొక్కుతోంద’ని లేఖలో పేర్కొన్నారు. -
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లోక్ పాల్ బిల్లు: రాహుల్
న్యూఢిల్లీ: అన్నికాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లోక్‌పాల్ బిల్లును ఫిబ్రవరి 28 తేదిలోగా అమల్లోకి తీసుకువస్తాం అని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలతో కలిసి రాహుల్ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ...అమల్లో భాగంగా లోకాయుక్తల నియామకాలు చేపడుతాం అని తెలిపారు. అధిక ధరలను నియంత్రించేందుకు సీఎంల సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం అని ఆయన మీడియాకు వెల్లడించారు. పళ్లు, కూరగాయల ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పేద ప్రజలకు అందుబాటులోకి రావడం అన్ని రాష్ట్రాల్లో బ్లాక్‌మార్కెటింగ్‌ను అరికట్టేందుకు నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో సంస్కరణలను వెంటనే అమలు చేస్తాం. ఆహార భద్రతా బిల్లుకు అనుగుణంగా చర్చలు తీసుకునేలా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ దుకాణాలు లేదా స్వయం సహాయ సంఘాల ద్వారా చౌక ధరలకే నిత్యావసర సరుకులివ్వాలని నిర్ణయం తీసుకున్నాం అని రాహుల్ తెలిపారు. నేటి సమావేశంలో ధరలు, అవినీతి అంశాలపై చర్చించాం. లోక్‌పాల్ బిల్లు కార్యాచరణపై ప్రభుత్వం దృష్టిపెట్టింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని రాహుల్‌గాంధీ అన్నారు. లోకపాల్ బిల్లు కార్యాచరణపై మేం మాట్లాడేసరికి మిగతాపార్టీలన్నీ మౌనం వహించాయి అని ప్రతిపక్షాల తీరును రాహుల్ తప్పుపట్టారు. లోక్‌పాల్ బిల్లును మేం చాలా సీరియస్‌గా తీసుకున్నాం, ఆదర్శ్ కుంభకోణం వ్యవహారంలో ఏ ఒక్కరినీ ఉపేక్షించం అని రాహుల్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఆర్టీఐని తీసుకువచ్చిన తామే, లోక్‌పాల్ బిల్లునూ కూడా తెచ్చాం అని రాహుల్ అన్నారు. మీడియా ప్రతినిధులు అడిగిన మరికొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా రాహుల్ వెళ్లిపోవడం కొసమెరుపు. దేశ రాజధాని లో శుక్రవారం నిర్వహించిన సీఎంల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు అజయ్‌మాకెన్ వెల్లడించారు. -
ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంపై పెరుగుతున్న విమర్శల తీవ్రత
సాక్షి, ముంబై: రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ఆదర్శ హౌసింగ్ సొసైటీ కుంభకోణ దర్యాప్తు నివేదికను ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తోసిపుచ్చడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై సొంత పార్టీకి చెందిన నేత, కేంద్ర మంత్రి మిలింద్ దేవరా ట్విట్టర్ స్పందిస్తూ ఆదర్శ్ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని పోస్టు చేయడం ఆ పార్టీలో కలకలానికి దారి తీసింది. ఇదే బాటలో మరికొందరు నాయకులు కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే పరిస్థితి ఏంటా అని అగ్రనాయకులు కలవరపడుతున్నారు. దీనికి తోడు ఆదర్శ్ నివేదికను సీఎం పృథ్వీరాజ్ చవాన్ నిరాకరించాడని, తమకేమీ సంబంధం లేదని మిత్రపక్ష పార్టీ ఎన్సీపీ నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వ్యాఖ్యానించడం కాంగ్రెస్‌ను మరింత ఇరకాటంలోకి నెట్టినట్లయ్యింది. పెరుగుతున్న విమర్శల తీవ్రత దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్నే రేపుతోంది. ఈ కేసులో కాంగ్రెస్‌కు చెందిన ‘ముఖ్య’నేతల పేర్లు ఉండటంతో అగ్నికి అజ్యం పోసినట్టైంది. ఇదేనా ‘ఆదర్శ’వంతమైన పాలనా అంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. రూ.కోట్లలో విలువచేసే ప్లాట్లను అధికార దుర్వినియోగంతో తక్కువ రేట్లకే బంధువులకు దోచిపెట్టడమేనా అని మన ‘ముఖ్య’నేతల సంస్కృతి అన్న విమర్శల దాడి పెరుగుతోంది. ఆదర్శ్ కుంభకోణంలో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు దివంగత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, ఆశోక్ చవాన్, సుశీల్ కుమార్ షిండేలతో పాటు పలువురు మంత్రుల ప్రమేయంపై రూపొందించిన ద్విసభ్య కమిషన్ విచారణ నివేదికను గవర్నర్ కె.శంకర్ నారాయణన్‌తో పాటు శాసనసభలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తోసిపుచ్చడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ కేసులో మాజీ సీఎం ఆశోక్ చవాన్‌ను సీబీఐ విచారించేందుకు గవర్నర్ కె.శంకర్ నారాయణన్ నిరాకరించడంతో ఇక ఈ కేసు నీరుగారినట్టేనని అందరూ భావించారు. అయితే నాగపూర్‌లో జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఆదర్శ్ నివేదికను ప్రవేశపెట్టాల్సిందేనని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశాయి. తప్పనిసరి పరిస్థితుల్లో శాసనసభలో సర్కార్ ప్రవేశపెట్టింది. ప్రజాహితం దృష్ట్యా ఈ నివేదికను తిరస్కరిస్తున్నామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రకటించారు. దీనిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. మిస్టర్ క్లీన్ అని పేరున్న చవాన్ ఈ ప్రకటనతో అవినీతి బురదను తనకు అంటించుకునే సాహసం చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడే ఇదే విషయమై సొంత పార్టీ నాయకుల నుంచే విమర్శలు వస్తుండటం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని కలవరపరుస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి పృ థ్వీరాజ్ చవాన్‌కు రాబోయే రోజుల్లో ఆదర్శ్ మరింత తలనొప్పిగా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకుడైన మిలింద్ దేవరా ఆదర్శ్ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని సూచించారు.రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడుగా ముద్రపడిన మిలింద్ దేవరా ఇలా సొంత పార్టీకి ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించడంపై కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. మరోవైపు మిలింద్ వ్యాఖ్యలు ప్రతిపక్షాల వాదనలను మరింత బలం చేకూర్చాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆదర్శ్ నివేదకను తోసిపుచ్చడంపై నిరసన వ్యక్తం చేస్తూనే చర్చలు జరపాల్సిన అవసరం ఉందని మిలింద్ తన ట్వీట్లో అభిప్రాయపడ్డారు. తోసిపుచ్చింది ముఖ్యమంత్రే: అజిత్ పవార్ ఆదర్శ్ నివేదికను సభలో తోసిపుచ్చాలన్న నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవానేనని, ఆ నిర్ణయంతో తనకు ఎలాంటి సంబంధంలేదని ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఆదర్శ్ అంశం ప్రతిపక్షాలకు బ్రహ్మాస్త్రంగా మారే అవకాశాలున్నాయి. ఆదర్శ్ దర్యాప్తు నివేదికను తోసిపుచ్చిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న నిరసనల నేపథ్యంలో ఈ వ్యవహారంలో ఎన్సీపీ తమకు సంబంధంలేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక నుంచి ఈ అంశంపై ఎన్సీపీ ఆచితూచి అడుగు ముందుకువేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మళ్లీ పరిశీలిస్తే మద్దతిస్తాం ఆదర్శ్ విచారణ నివేదికను తిరస్కరించిన నిర్ణయాన్ని మళ్లీ పరిశీలిస్తే సీఎం చవాన్‌కు మద్దతిస్తామని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ గురువారం మీడియాకు తెలిపారు. హౌసింగ్ కుంభకోణంలో ఎన్సీపీ మంత్రులు సునీల్ తట్కరే, రాజేశ్ తోపేల పాత్ర ఏమీ లేదన్నారు. -
ఆదర్శ్ కుంభకోణంపై బీజేవైఎం ఆందోళన
ఢిల్లీ: ఆదర్శ్ కుంభకోణంలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన వైఖరి చెప్పాలంటూ భారతీయ జనతా యువ మోర్చా ఆందోళన చేపట్టింది. కుంభకోణం అంశానికి సంబంధించి రాహుల్ తన వైఖరి తెలియజేయాలని ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయం నుంచి ర్యాలీ చేపట్టారు.ఆయన నివాసం వైపునకు ర్యాలీగా దూసుకువెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఆదర్శ్ కుంభకోణం దెబ్బ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ప్రక్షాళనకు అడుగులు వేస్తోంది. అవినీతి ఆరోపణలతో మకిలపడుతున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను పునరుద్ధరించడంపై అధిష్టానం దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లోపు ప్రజల్లో పార్టీకి ఆదరణ పెంచే దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతమున్న రాష్ట్ర మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరించి అవినీతి రహిత పాలన అందించాలని వడివడిగా అడుగులు వేస్తోంది. దీంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ సైతం ఆదర్శ్ కుంభ కోణంపై రాహుల్ వైఖరి చెప్పాలంటూ డిమాండ్ చేస్తోంది. -
చర్చకు నో చాన్స్
సాక్షి, ముంబై: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం కేసుకు సంబంధించి విచారణ కమిషన్ అందజేసిన 700 పేజీల దర్యాప్తు నివేదికను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టింది. విశ్రాంత న్యాయమూర్తి జేఏ పాటిల్ నేతృత్వంలోనిఇద్దరు సభ్యుల నేతృత్వంలోని విచారణ బృందం సమర్పించిన నివేదికతోపాటు చర్యల నివేదిక (ఏటీఆర్)ను ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సభలో ప్రవేశపెట్టారు. సదరు నివేదికపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు చేసిన డిమాండ్‌ను స్పీకర్ తోసిపుచ్చారు. దీంతో చాలాసేపు సభలో గందరగోళం నెలకొంది. మాజీ ముఖ్యమంత్రులతోపాటు ఇతర మంత్రులను రక్షించుకునేందుకే ప్రభుత్వం చర్చలను తోసిపుచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కాగా సదరు నివేదికలో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే, మాజీ కేంద్ర మంత్రి దివంగత విలాస్‌రావ్‌దేశ్‌ముఖ్, ఉన్నత సాంకేతిక విద్యాశాఖ మంత్రి రాజేష్ టోపే, నీటివనరుల శాఖ మంత్రి సునీల్ తట్కరేలకు ద్విసభ్య కమిషన్ అక్షింతలు వేసిన విషయం తెలిసిందే. వాస్తవాల్ని పాతిపెడుతోంది ద్విసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను మహారాష్ర్ట మంత్రిమండలి తిరస్కరించడంద్వారా ఆదర్శ్ కుంభకోణంలో వాస్తవాలనుమరుగుపరిచేందుకు యత్నిస్తోందని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు అరుణ్‌జైట్లీ ఆరోపించారు. గతంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఇచ్చిన నివేదికను తనకు అనుకూలంగా మార్చుకోవడంద్వారా 2జీ కుంభకోణాన్ని పాతిపెట్టిందని ఆయన శుక్రవారం ట్విటర్లో పేర్కొన్నారు.‘2జీ కుంభకోణాన్ని జేపీసీ పాతిపెట్టింది. ఆదర్శ్ కుంభకోణాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం పూడ్చిపెడుతోంది. అయితే ఏనాటికీ సత్యాన్ని పాతిపెట్టలేరు’ అని ఆయన అందులో పేర్కొన్నారు. అవినీతి బాగోతం బయటపడింది ద్విసభ్య కమిషన్ నివేదికను ప్రభుత్వం తోసిపుచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్, ఎన్సీపీల అవినీతి బాగోతం బయటపడిందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ ఆరోపించారు. శాసనసభా ప్రాంగణం వద్ద శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నివేదికను తిరస్కరించడంద్వారా మచ్చలేని నాయకుడిగా రాష్ట్రానికి వచ్చిన ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్... తాను కూడా అవినీతిలో భాగస్వామినేనని నిరూపించారన్నారు. ఆదర్శ్ కుంభకోణం విషయంలో ప్రభుత్వాన్ని ఏవిధంగా ఎదుర్కొంటారని మీడియా ప్రశ్నించగా న్యాయపరంగా అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. తిరస్కృతికి కారణాలేమిటో ప్రజలందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీల బాగోతాన్ని ప్రజల ముందుంచుతామన్నారు. ఈ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయన్నారు. -
అశోక్ చవాన్‌కు ఊరట
ముంబై/న్యూఢిల్లీ : ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం కేసులో చిక్కుకున్న మాజీ ముఖ్యమంత్రి అశోక్‌చవాన్‌ను విచారించేందుకు అనుమతించాలంటూ సీబీఐ చేసిన విన్నపాన్ని గవర్నర్ శంకర నారాయణన్ బుధవారం తిరస్కరించారు. దీంతో ఆయనపై కేసు మూసివేయడం తప్ప సీబీఐకి మరో మార్గం లేకుండా పోయింది. ఈ కుంభకోణం వెలుగులోకి రావడంతో అప్పట్లో ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వరిస్తున్న అశోక్ చవాన్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే.ఈ కుంభకోణానికి సంబంధించి సీబీఐ మొత్తం 12 మందిపై కోర్టులో అభియోగాలు నమోదుచేసింది. అయితే తన పేరును నిందితుల జాబితాలో చేర్చడాన్ని అశోక్ కోర్టులో సవాలుచేశారు. తనను విచారించేందుకు గవర్నర్ వద్ద నుంచి సీబీఐ అనుమతి పొందలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ వాదనను సీబీఐ తోసిపుచ్చింది. అభియోగాలు మోపిన సమయంలో ఆయన సీఎంగా లేరని వాదించింది. ఈ వాదనను కోర్టు తోసిపుచ్చింది. అనుమతి పొందాల్సిందేనంటూ సీబీఐని ఆదేశించింది. దీంతో అశోక్‌చవాన్‌ను విచారించేందుకు అనుమతించాలని గవర్నర్‌ను సీబీఐ అభ్యర్థించింది. అయితే అందుకు ఆయన నిరాకరించారు. మరో మార్గమేమీ లేదు ఈ విషయమై సీబీఐ డెరైక్టర్ రంజిత్‌సిన్హా బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘ఇందుకు సంబంధించి గవర్నర్‌కు అన్ని విషయాలను సమగ్రంగా నివేదించాం. అయితే ప్రస్తుతం తమకు న్యాయపరంగా మరో మార్గమేమీ లేదు. అందువల్ల కోర్టు మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.’ అని అన్నారు. తొలిసారేమీ కాదు సంబంధిత యంత్రాంగం అనుమతి లభించని కారణంగా శక్తిమంతులైన మంత్రులపై మోపిన కేసులు వీగిపోవడం ఇది తొలిసారేమీ కాదని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో తాజ్ కారిడార్ ప్రాజెక్టు కుంభకోణం కేసుకు సంబంధించి మాయావతిపై కేసు నమోదు చేశామని, అయితే అప్పటి ఆ రాష్ట్ర గవర్నర్ టి.వి.రాజేశ్వర్ అనుమతించలేదని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. దీంతో కేసు మూసేయక తప్పలేదన్నారు. ఇక అసోం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ కుమార్ మహంతా పై లెటర్ ఆఫ్ క్రెడిట్ స్కాం (ఎల్ఓసీ) కేసునమోదైందని, ఆనాటి ఆ రాష్ట్ర గవర్నర్ మహంతను విచారించేందుకు నిరాకరించారని తెలిపారు. -
చవాన్‌కు మరిన్నిచిక్కులు
సాక్షి, ముంబై: ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో చిక్కుకున్న మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పరిస్థితి దారుణంగా మారుతోంది. ఈ కుంభకోణంపై విచారణకు నియమించిన కమిటీ నివేదికను అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు మంగళవారం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. అమర జవాన్ల కుటుంబాల కోసం ముంబైలోని కొలాబా ప్రాంతంలో ఆదర్శ్ సొసైటీ భవనాన్ని నిర్మించారు. అప్పటి ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తన బంధువులకు ఇళ్లు ఇప్పించడంతో ఈ కేసులో ఇరుక్కొని పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఆయన ఈ కుంభకోణంలో నిందితుడిగా కేసులను ఎదుర్కొంటున్నారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ అశోక్ చవాన్‌పై కేసు నమోదు చేయడానికి గవర్నల్ కె.శంకర్ నారాయణన్ అనుమతి కోరింది. ఈ పరిణామం అశోక్ చవాన్‌కు మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టవచ్చని భావిస్తున్నారు. 2010లో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన అనంతరం అశోక్ చవాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ వ్యవహారంపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. కానీ ఇది ఇంత వరకు నివేదికను అసెంబ్లీకు సమర్పించలేదు. దీనిపై బీజేపీ, శివసేన ఎమ్మెల్యేలు కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రారంభించారు. చివరికి బీజేపీ ముంబై నాయకులు ఆదర్శ్ సొసైటీ కుంభకోణంపై చర్యలు కోరుతూ బాంబే హైకోర్టుకు వెళ్లారు. ఈ కుంభకోణంపై విచారణ నివేదికను అసెంబ్లీ సమావేశంలో ఎప్పుడు చర్చకు తీసుకొస్తారో రాతపూర్వకంగా తెలియజేయాలని పృథ్వీరాజ్ చవాన్ సర్కారును ఆదేశించింది. ప్రస్తుతం నాగ్‌పూర్‌లో జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే ఆదర్శ్ కుంభకోణం విచారణ నివేదికపై చర్చిస్తామని ప్రభుత్వం రాతపూర్వకంగా హైకోర్టుకు విన్నవించింది. -
షిండేపై పిటిషన్‌ను విచారించనున్న ముంబై హైకోర్టు
మహారాష్ట్రను కుదిపేసిన ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం.. కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేను వెంటాడుతోంది. షిండేను నిందితుడిగా చేర్చాలంటూ ఓ సామాజిక ఉద్యమకర్త దాఖలు చేసిన పిటిషన్‌ను ముంబై హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో షిండే ప్రమేయముందంటూ ప్రవీణ్ వాటెగాన్కర్ అనే వ్యక్తి న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఆదర్శ్ బిల్డింగ్‌లో షిండే బినామీ పేర్లతో ప్లాట్లను పొందారని ఆరోపించారు. దీనిపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని ఫిర్యాదు దారు కోరారు. కాగా బినామీ దారులపై సీబీఐ దర్యాప్తు చేస్తోందని సీబీఐ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇందులో షిండే పాత్ర లేదని తేలినట్టు కోర్టుకు తెలిపారు. కాగా కేసు విచారణ పూర్తయిన అనంతరం పిటిషన్‌ను విచారించనున్నట్టు హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. విచారణకు వచ్చే నెల 26కు వాయిదా వేసింది. -
కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు సీబీఐ క్లీన్ చిట్!
ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే కు పెద్ద ఊరట లభించింది. ఈకేసులో షిండేకు దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ క్లీన్ చిట్ ఇచ్చింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఆదర్శ్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన వ్యవహారంలో ఎలాంటి తప్పిదాలు చేయలేదని హైకోర్టుకు సీబీఐ ఓ అఫిడవిట్ ఇచ్చింది. సీబీఐ చేస్తున్న దర్యాప్తులో సుశీల్ కుమార్ షిండే పేరును ఉంచాల్సిన అవసరం లేదని అఫిడవిట్ లో పేర్కొంది. పీఎన్ హరిదాస్, జస్టిస్ పీఎన్ దేశ్ ముఖ్ లతో కూడిన బాంబే హైకోర్టు బెంచ్ తదుపరి విచారణను సెప్టెంబర్ 26 తేదికి వాయిదా వేసింది. దక్షిణ ముంబైలోని కొలాబాలో వివాదస్పద 31 అంతస్తుల టవర్ లో షిండే బినామీ పేరుతో ఫ్లాట్లను కొనుగోలు చేసాడంటూ సామాజిక కార్యకర్త ప్రవీణ్ వాటేగావంకర్ దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం విచారణ చేపట్టారు.