నితిన్ గడ్కరీ... నన్ను క్షమించు | Manish Tiwari apologises to Nitin Gadkari | Sakshi
Sakshi News home page

నితిన్ గడ్కరీ... నన్ను క్షమించు

Published Wed, Apr 30 2014 3:50 PM | Last Updated on Fri, Jul 26 2019 5:53 PM

నితిన్ గడ్కరీ... నన్ను క్షమించు - Sakshi

నితిన్ గడ్కరీ... నన్ను క్షమించు

కాంగ్రెస్ కు హై ప్రొఫైల్ నేతలు తలనొప్పులుగా మారారు. ఒక వైపు దిగ్విజయ్ వివాహేతతర సంబంధం చికాకు పెడుతూండగానే, మరో సీనియర్ నేత మనీష్ తివారీ దాదాపు ముక్కు నేలకు రాసినంత పనిచేయాల్సి వచ్చింది.  కార్గిల్ అమరవీరులకోసం ఇచ్చిన ఆదర్శ్ ఫ్లాట్లలో బిజెపి మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరికి కూడ ఆబేనామీ ఫ్లాట్ ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ ఆరోపించారు. అయితే ఇది నిరాధారమైన, దురుద్దేశంతో కూడుకున్న ఆరోపణ అని నితిన్ గడ్కరీ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసును ఆయన 2010 లో వేశారు.


ఈ కేసు విచారణ వేగం పుంజుకున్న నేపథ్యంలో మనీష్ తివారీపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయింది. దీనితో మనీష్ తివారీ తప్పుడు ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు కోరారు. వివాదాన్ని ఇంతటితో ఆపేందుకు మనీష్ క్షమాపణలు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement