manish tiwari
-
బీజేపీ గూటికి మనీశ్ తివారీ?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ బీజేపీ కండువా కప్పుకుంటారని, ఆ పార్టీ తరఫున పంజాబ్‌లోని లూధియానా లోక్‌సభ స్థానం బరిలో దిగుతారని ఆదివారం వార్తలొచ్చాయి. అయితే ఇవన్నీ పుకార్లంటూ తివారీ కార్యాలయం ఖండించింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుౖడు కమల్‌నాథ్ తన కుమారుడు, ఎంపీ నకుల్‌తో పాటు బీజేపీ గూటికి చేరనున్నారంటూ కూడా వార్తలొస్తుండటం తెలిసిందే. ఆయన తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఆదివారం ఢిల్లీ చేరుకున్నారు. పార్టీ మారుతున్నారన్న ప్రచారంపై ప్రశ్నించగా ‘ఏమైనా ఉంటే మీకే మొదట చెబుతా’నంటూ దాటవేశారు! -
కమల్‌నాథ్ బాటలో ఎంపీ మనీష్ తీవారీ?
కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ పార్టీ మారబోతున్నారని వర్తాలు వెలువడ్డాయి. ఆయన కాంగ్రెస్‌కు రాజానామా చేసి.. బీజేపీలో చేరుబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఎంపీ మనీష్ తివారీపై జరుగుతున్న ప్రచారం అసత్యమని ఆయన ఆఫీసు వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఎంపీ మనీష్ తివారీపై జరుగుతున్న పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండించింది. అదంతా అసత్య ప్రచారమని స్పష్టం చేసింది. బీజేపీలో చేరి.. లూథియానా స్థానంలో పోటీ చేయనున్నట్లు ప్రచారం జరిగింది. ‘మనీష్ పార్టీ మారి బీజేపీలో చేరుతారనేది నిరధారమైన విషయం. ఆయన తన నియోజకవర్గంలో పూర్తి దృష్టి పెట్టారు. గత రాత్రి మనీష్ తివారీ తన నివాసంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు’ అని ఎంపీ కార్యాలయం పేర్కొంది. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, ఆయన కుమారుడు నకుల్, ఇతర ఎంపీలు కూడా లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ కూడా పార్టీ మారుతున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. మధ్య ప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ మీద వచ్చిన ప్రచారాన్ని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ జితూ పట్వారీ ఖండించారు. కమల్‌నాథ్‌పై జరుగుతున్న ప్రచారం నిరాధారమైందని స్పష్టం చేశారు. కనీసం కలలో కూడా కమల్‌నాథ్ బీజేపీలో చేరరని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ నేత కమల్ నాథ్, తన కొడుకు నకుల్‌తో శనివారం ఢిల్లీకి వెళ్లిన సందర్భంగా బీజేపీలో చేరుతారని పెద్ద ఎత్తున జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు బీజేపీ పార్టీలో చేరటం కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. ఇక.. కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరితే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ‘ఇండియా కూటమి’ లోక్‌సభ ఎన్నికల్లో తగిన ప్రభావం చూపలేకపోతుందని రాజకీయా విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
‘అవిశ్వాసం’ పూర్తయ్యేదాకా సభలో బిల్లులు ఆమోదించొద్దు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత ఇతర బిల్లులను ఆమోదించడం సరైంది కాదని కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మనీశ్ తివారీ అభిప్రాయపడ్డారు. అవిశ్వాసంపై చర్చ, ఓటింగ్ జరిగి ఫలితం తేలిన తర్వాతే ఇతర బిల్లును ప్రవేశపెట్టడం లేదా ఆమోదించడం చేయాలని అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంపై లోక్‌సభలో విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం దీనిపై 10 రోజుల్లోగా చర్చ, ఓటింగ్ నిర్వహించాల్సి ఉంది. బిల్లులను ఇష్టారాజ్యంగా ఆమోదింపజేసుకోవడానికి ఈ గడువును వాడుకోవద్దని మనీశ్ తివారీ హితవు పలికారు. అలా చేయడం పార్లమెంటరీ సంప్రదాయాలకు, నైతిక విలువలకు విరుద్ధమన్నారు. -
కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది.. సోనియాకు షాకిచ్చిన ఐదుగురు ఎంపీలు!
దేశంలో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం నడుస్తోంది. ఇటీవల కాలంలో సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. ఇటీవలే సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి విషయంలో అధిష్టానం వైఖరిపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికీ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా, అక్టోబర్ 17వ తేదీన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష ఎన్నిక నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు.. ఏఐసీసీ ఎన్నికల చీఫ్ మధుసూధన్ మిస్త్రీకి లేఖ రాయడం పొలిటికల్‌గా హాట్‌టాపిక్‌గా మారింది. అయితే, కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎంపీలు శశిథరూర్, మనీష్ తివారీ, కార్తి చిదంబరం, ప్రద్యూత్ బోర్డోలై, అబ్దుల్ ఖలీక్‌లు లేఖను రాశారు. సదరు లేఖలో పార్టీ అధ్యక్ష ఎన్నికను పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. ఎలక్టోరల్ బాండ్లకు చెందిన అంశంపై తప్పుడు సమాచారం వెళ్లడం దురదృష్టకరమని ఎంపీలు ఆ లేఖలో పేర్కొన్నారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీని రిలీజ్ చేయాలని ఎంపీలు తమ లేఖలో డిమాండ్ చేశారు. ఇక, సొంత పార్టీ నేతలే ఇలా లేఖ రాయడంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు మరోసారి షాక్ తగిలినట్టు అయ్యింది. Questions on fairness in election of Congress President these 5 MPs including Shashi Tharoor expressed concern written letter - India Hindi News - कांग्रेस अध्यक्ष के चुनाव में निष्पक्षता पर सवाल, शशि थरूर समेत इन 5 सांसदों ने जताई चिंता; लिखी चिट्ठी https://t.co/GwirzlVAJW — Sandeep Choudhury (@Sandeep71121431) September 10, 2022 -
కాంగ్రెస్‌లో భారీ ప్రక్షాళన.. సోనియా సంచలన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లోని జీ–23 గ్రూప్ నాయకుడు గులాం నబీ ఆజాద్‌తో సోనియా గాంధీ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏఐసీసీలో భారీ ప్రక్షాళన, పలు అంశాలపై వీరి మధ్య పరస్పర అంగీకారం కుదిరింది. దీంతో కాంగ్రెస్‌లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ చర్చల్లో ఆజాద్ సూచనలకు సోనియా గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే ఏడాది మే నెలలో కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో కర్నాటలో పార్టీ బాధ్యతలను ఆజాద్‌కు అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న కర్నాటకలో పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేసే బాధ్యతలు తీసుకోవాలని ఆజాద్‌ను సోనియా కోరినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఏడాది చివరలోనే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. కర్నాటక ఎన్నికల తర్వాత ఆజాద్‌కు అక్కడి నుంచే రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించేలా సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, మరో అసమ్మతి నేత ఆనంద శర్మను కూడా రాజ్యసభకు పంపాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో అసమ్మతి నేత, ప్రస్తుతం లోకసభ సభ్యుడుగా ఉన్న మనీష్ తివారీకి ఏఐసీసీలో సముచిత బాధ్యతలు అప్పగించేందుకు సోనియా సుముఖత చూపించారు. కొత్తగా అసమ్మతి నేతల బృందంలో చేరిన భూపేందర్ సింగ్ హుడాకు హర్యానా పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. కాగా, హుడా.. ప్రస్తుత హర్యానా పీసీసీ అధ్యక్షురాలు షెల్జా కుమారిపై పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. ఇక, గాంధీ కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ పై ఆగ్రహంతో ఉన్న సోనియా.. సిబల్‌కు పార్టీలో బాధ్యతలు అప్పగించే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన ఇరువురు నేతలు.. కాంగ్రెస్ “అసమ్మతి నేతల” అభిప్రాయాలను, మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటానని ఆజాద్‌కు సోనియా గాంధీ హామీ ఇచ్చినట్లు సమాచారం. -
రావత్, తివారీ ట్వీట్లు; కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో అధినాయకత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న సీనియర్ నాయకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. హైకమాండ్ వైఖరిని తప్పుబడుతూ తాజాగా మనీష్ తివారీ ట్వీట్ చేయడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. ఉత్తరాఖండ్ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన సంక్షోభానికి కేంద్ర నాయకత్వ విధానాలే కారణమన్నట్టుగా ఆయన ట్వీట్ చేశారు. ‘మొదట అసోం, తర్వాత పంజాబ్, ఇప్పుడు ఉత్తరాఖండ్.. ’ అంటూ ట్విటర్లో రాసుకొచ్చారు. ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ సొంత పార్టీ నాయకులపై అసంతృప్తి వ్యక్తం చేసిన మరుసటిరోజే మనీష్ తివారీ గళం విప్పడం గమనార్హం. సొంత పార్టీలోనే సహాయ నిరాకరణ: రావత్ డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడి రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార చీఫ్, రాష్ట్ర మాజీ సీఎం హరీశ్ రావత్ సొంత పార్టీ నాయకుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ‘ఎన్నికల్లో కష్టపడి పార్టీని విజయతీరాలకు చేర్చే పనిలో చేదోడువాదోడుగా ఉండాల్సిందిపోయి కాంగ్రెస్ నేతలే మొండిచేయి చూపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలను మొసళ్లుగా వదిలింది. అయినాసరే పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఎన్నికల సంద్రాన్ని ఈదుతున్నాను. ఎన్నికల సాగరంలో నాకు సాయం చేయకపోగా కొందరు నా కాళ్లు చేతులూ కట్టేస్తున్నారు. ఇక రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలని పిస్తోంది’ అని రావత్ ట్వీట్ చేశారు. (చదవండి: మహిళా వివాహ వయసు పెంపు.. వాళ్లని బాధిస్తోంది) కాంగ్రెస్‌లో ఉంటూ బీజేపీ కోసం పనిచేస్తూ.. ట్వీట్లపై రావత్ మీడియా సలహాదారు సురేంద్ర స్పందించారు. ‘కొన్ని శక్తులు కాంగ్రెస్‌లో ఉంటూ బీజేపీ కోసం పనిచేస్తూ కాంగ్రెస్ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తున్నాయి’ అని అన్నారు. రావత్ నేతృత్వంలోకాకుండా ఉమ్మడి నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లాలని ఏఐసీసీ ఉత్తరాఖండ్ ఇన్చార్జ్ దేవేంద్ర యాదవ్ పట్టుబడుతుండటం గమనార్హం. కాగా, తాను చేసిన ట్వీట్‌పై వివరణ ఇచ్చేందుకు హరీశ్ రావత్ నిరాకరించారు. సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని విలేకరులతో అన్నారు. (చదవండి: జియా ఉల్ హక్ హయాం.. మోదీ పాలన ఒక్కటే) -
‘అప్పుడే పాక్‌కి గట్టిగా సమాధానం చెప్పుండాల్సింది’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ సీనియర్ నేత మనీష్ తివారి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ఓటమితో పాటు కాంగ్రెస్ పలు చోట్ల గెలుపొంది తిరిగి పుంజుకుంటోందన్న సమయంలో తివారీ ట్వీట్ దుమారేన్ని రేపాయి. ఆయన రాసిన కొత్త పుస్తకం ‘10 ఫ్లాష్ పాయింట్స్, 20 ఇయర్స్.. నేషనల్ సెక్యూర్టీ సిచ్యువేషన్స్ దట్ ఇంపాక్టెడ్ ఇండియా’ త్వరలో మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ పుస్తకాన్ని రూపా బుక్స్ ప్రచురిస్తోంది. ఆ పుస్తకంలో.. ముంబై ఉగ్రదాడులు గురించి ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. 2008, సెప్టెంబర్ 26న ముంబైలో ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడులు జరిగిన వెంటనే పాక్ చర్యలకు భారత ధీటుగా బదులిచ్చుంటే బాగుండేదని తివారి అభిప్రాయపడ్డారు. కిరాతకంగా ఉగ్రవాదులు అమాయక ప్రజలను హతమార్చారు. అలాంటి పరిస్థితుల్లో మన్మోహన్ ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదని, ఆ సమయంలో కేవలం మాటలకే పరిమితం అయ్యిందని, తివారి తన పుస్తకంలో తెలిపారు. గత రెండు దశాబ్దాల్లో భారత్ ఎదుర్కొన్న జాతీయ భద్రతా అంశాలను కూడా తన పుస్తకంలో వెల్లడించారు మనీష్ తివారి. Happy to announce that my Fourth Book will be in the market shortly - '10 Flash Points; 20 Years - National Security Situations that Impacted India'. The book objectively delves into every salient National Security Challenge India has faced in the past two decades.@Rupa_Books pic.twitter.com/3N0ef7cUad — Manish Tewari (@ManishTewari) November 23, 2021 చదవండి: Viral Video:ట్రైన్లో సీట్ దొరకలేదు.. ‘ఓరి నీ తెలివి తగలెయ్య’ -
స్మార్ట్ఫోన్లు, భారీ ఉపకరణాలకు డిమాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో (జీఐఎఫ్) స్మార్ట్ఫోన్లు, భారీ ఉపకరణాలు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు గణనీయంగా డిమాండ్ నెలకొందని ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ వెల్లడించారు. వన్‌ప్లస్, శాంసంగ్, యాపిల్, షావోమీ తదితర సంస్థల ఉత్పత్తులు భారీగా అమ్ముడయ్యాయని పేర్కొన్నారు. ఈసారి జీఐఎఫ్‌కు మరింత స్పందన లభిస్తోందని, ప్రారంభమైన తొలి 48 గంటల్లో రికార్డు స్థాయిలో విక్రయాలు జరిగాయని ఆయన తెలిపారు. చిన్న, మధ్య తరహా సంస్థలకు సంబంధించి 5,000 పైచిలుకు విక్రేతలు పాల్గొన్నారని తివారీ చెప్పారు. గతేడాది ఫెస్టివల్ సేల్ మొత్తం మీద అమ్ముడైన ఐఫోన్లకు మించి ఈసారి ఒక్కరోజులోనే అమ్ముడవడం గమనార్హమని తివారీ తెలిపారు. నవంబర్ 13 దాకా జరిగే ‘ఫినాలే డేస్’ సందర్భంగా భారీ ఉపకరణాలు, టీవీలపై 75 శాతం దాకా, గృహోపకరణాలపై 80 శాతం దాకా, స్మార్ట్ఫోన్లపై 40 శాతం దాకా డిస్కౌంట్లు ఇస్తున్నట్లు వివరించారు. అలాగే, కనీస ఆర్డర్ పరిమితికి లోబడి ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై 10 శాతం బ్యాంక్ డిస్కౌంటు ఉంటుందని తెలిపారు. పెరిగిన విక్రేతలు.. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో గతంతో పోలిస్తే కొత్త విక్రేతల రిజిస్ట్రేషన్ల సంఖ్య 50 శాతం పెరిగిందని తివారీ వివరించారు. వ్యక్తిగత గ్రూమింగ్ ఉత్పత్తులు, స్టడీ ఫ్రం హోమ్‌కి అవసరమైన ఉత్పత్తులు, గృహోపకరణాలు మొదలైన వాటికి ఆర్డర్లు గణనీయంగా వస్తున్నాయన్నారు. కరోనా నేపథ్యంలో డిమాండ్‌కి అనుగుణంగా వేగవంతంగా, సురక్షితంగా ఉత్పత్తులను డెలివర్ చేయడానికి అమెజాన్ భారీ సన్నాహాలు చేసిందని తివారీ చెప్పారు. కొత్తగా దాదాపు 200 డెలివరీ స్టేషన్లు, వేలకొద్దీ డెలివరీ పార్ట్నర్స్ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతమున్న 8 స్టోర్ సెంటర్లను విస్తరించడంతో పాటు మరో అయిదింటిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. పండుగ సీజన్ నేపథ్యంలో సుమారు 1,00,000 పైచిలుకు సీజనల్ ఉపాధి అవకాశాలు కల్పించగలిగామని చెప్పారు. -
చైనాను టార్గెట్ చేయలేక మాపై వేధింపులా!
సాక్షి, న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దు వివాదాన్ని సరైన రీతిలో పరిష్కరించలేని కేంద్ర ప్రభుత్వం తమపై కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. మనీల్యాండరింగ్ కేసులో తమ పార్టీ నేత అహ్మద్ పటేల్‌ను ప్రశ్నించిన ఘటన వేధింపు రాజకీయాలకు తాజా ఉదాహరణని ఆ పార్టీ పేర్కొంది. కేంద్రం చైనాను టార్గెట్ చేసేందుకు బదులు కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుంటోందని, తమ పార్టీ నేత అహ్మద్ పటేల్‌ను వేధింపులకు గురిచేయడం ఇందుకు తాజా ఉదంతమని ఆ పార్టీ నేత మనీష్ తివారీ ఆదివారం ట్వీట్ చేశారు. కాగా గుజరాత్‌కు చెందిన ఫార్మా కంపెనీ స్టెర్లింగ్ బయోటెక్‌పై మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ అహ్మద్ పటేల్‌ను ప్రశ్నిస్తున్న నేపథ్యంలో మనీష్ తివారీ మోదీ సర్కార్‌ను ఆక్షేపిస్తూ ట్వీట్ చేశారు. ఈ కేసులో అహ్మద్ పటేల్‌తో పాటు ఆయన కుమారుడు ఫైజల్ పటేల్, అల్లుడు ఇర్ఫాన్ సిద్ధిఖిలను కూడా ఈడీ ప్రశ్నిస్తోంది. గల్వాన్ ఘటనపై ప్రజల దృష్టిని మరల్చేందుకే మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఇక చైనా దళాల చేతిలో గల్వాన్ లోయలో 20 మంది భారత జవాన్లు మరణించిన ఘటన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత భూభాగాన్ని చైనాకు దారాదత్తం చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇప్పటికే విమర్శలు గుప్పించారు. చదవండి : ఇంధన ధరలతో కేంద్రం దగా -
కరోనా వెనుక అసలు కథ.. ఇదేనా!
ప్రస్తుతం కోవిడ్-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులోనూ చైనా దేశంలో ఇప్పటివరకు దాదాపు 1700 మంది వైరస్ బారిన పడి చనిపోగా, 65వేలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే ఈ వూహాన్ వైరస్ గురించి 40 ఏళ్ల క్రితమే ఓ నవలా రచయిత ఊహించాడు. 1981లో అమెరికా రచయిత డీన్ కూంట్జ్ తన థ్రిల్లర్ నవల ‘ది ఐస్ ఆఫ్ డార్క్నెస్’లో వూహాన్ సిటీలో కొత్త వైరస్ ప్రస్థావన ఉంది. ఆయన తన ఫిక్షన్ స్టోరీలోని ఓ పేజీలో దీని గురించి రాశారు. చదవండి: ఆరోగ్య శత్రువు కోవిడ్–19 వూహాన్ సిటీలోని మిలటరీ ల్యాబ్‌లో చైనా కావాలని బయో వెపన్ కోసం ఈ వైరస్‌ను సృష్టించినట్లు ఆ బుక్‌లో ఉంది. వుహాన్-400 అనే పేరుతో చైనా శాస్త్రవేత్తలు ఈ వైరస్‌ను క్రియేట్ చేసినట్లు ఆ ఫిక్షన్ స్టోరీలో రాశారు. ఈ వైరస్ శత్రుదేశాలపై పోరాటానికి చైనా తయారుచేస్తుందని, ఇది మనుషులపై మాత్రమే ప్రభావం చూపుతుందని అందులో ఉంది. దీని ద్వారా కొన్ని ప్రాంతాలను లేదా దేశాలనే నాశనం చేయవచ్చని అందులో పేర్కొన్నారు. చదవండి: కరోనా ముందు ఏ ప్రేమైనా భారమే.. దారెన్ ప్లెమౌత్ అనే ఓ నెటిజన్ ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. దానికి సంబంధించిన బుక్ కవర్ ఫోటో, ఆ బుక్‌లో వైరస్ గురించి ప్రస్తావించిన పేజీని ట్విటర్లో షేర్ చేశారు. కాగా ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా దీనిపై కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి మనీష్ తివారీ కూడా ట్విటర్లో స్పందించారు. కరోనా వైరస్ వూహాన్-400 పేరుతో చైనా అభివృద్ధి చేసిన బయోలాజికల్ ఆయుధమా..? అంటూ 1981లో పబ్లిష్ అయిన ఓ బుక్ కాపీని జత చేస్తూ మనీష్ తివారీ ట్వీట్ చేశారు. చదవండి: 'వీరి ప్రేమ ముందు ఏ వైరస్ నిలబడలేదు' It's a strange world we live in.#coronavirus #COVID19 #Wuhan pic.twitter.com/WkjbK4zGaW — Darren of Plymouth 🇬🇧 (@DarrenPlymouth) February 16, 2020 Is Coranavirus a biological Weapon developed by the Chinese called Wuhan -400? This book was published in 1981. Do read the excerpt. pic.twitter.com/Qdep1rczBe — Manish Tewari (@ManishTewari) February 16, 2020 -
ఆ ముగ్గురికి భారతరత్న ఇవ్వండి
న్యూఢిల్లీ: భారత స్వాతంత్య్ర సమరయోధులు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేయాలని కాంగ్రెస్ నేత, ఆనంద్‌పుర్ సాహెబ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న మనీశ్ తివారీ కోరారు. అంతకన్నా ముందు వారిని ‘షహీద్ ఎ ఆజమ్’బిరుదుతో సత్కరించాలని, మొహాలిలోని చండీగఢ్ విమానాశ్రయానికి భగత్‌సింగ్ పేరు పెట్టాలని ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తీవ్రంగా ప్రతిఘటించడం ద్వారా ఈ ముగ్గురు వారి కాలంలో ప్రజల్లో దేశభక్తిని ప్రేరేపించారని, ఆ క్రమంలోనే 1931 మార్చి 23వ తేదీన దేశంకోసం ప్రాణాలు అర్పించారని మనీశ్ తివారీ తెలిపారు. -
ఏపీ విభజన ఏకపక్షమే
సాక్షి, న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను ఏకపక్షంగా విభజించిందని, ఏపీ చట్టసభల అభిప్రాయాన్ని పరిగణనలోకితీసుకోలేదని వైఎస్సార్సీపీ ఎంపీలు మండిపడ్డారు. జమ్మూకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై జరిగిన చర్చలో కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ చేసిన ప్రసంగాన్ని వైఎస్సార్సీపీ ఎంపీలు తిప్పికొట్టారు. మనీష్ తివారీ ప్రసంగిస్తూ ఆర్టికల్ 3 అంటే మీకు మీరే చర్చించుకుని వచ్చి ఒక రాష్ట్ర సరిహద్దులు మార్చడమో, రెండుగా విభజించడమో కాదని, శాసనసభ, శాసనమండలిలో చర్చించి వాటి అభిప్రాయం తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంలో వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్ లేచి ఆంధ్రప్రదేశ్ చట్టసభల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా యూపీఏ ఏపీని ఏకపక్షంగా విభజించిందని మండిపడ్డారు. దీనిపై మనీష్ తివారీ స్పందిస్తూ ‘విభజన బిల్లు తెచ్చే ముందు అనేక చర్చలు జరిగాయి. ఏపీ చట్టసభల్లోనూ చర్చ జరిగిన తరువాతే తెలంగాణ ఏర్పాటు చేశాం’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎంపీలు అందరూ లేచి ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ చట్టసభల్లో మూడింట రెండొంతుల మెజారిటీతో విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేశారని గుర్తుచేశారు. అసెంబ్లీ ఆమోదించిందనడం వాస్తవ విరుద్ధం ఆంధ్రప్రదేశ్ విభజనను ఏపీ అసెంబ్లీ సమర్థించిందంటూ ఓ సభ్యుడు మాట్లాడారని, ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. జమ్మూకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ విభజనను ఉమ్మడి శాసనసభ మూడింట రెండొంతుల మెజారిటీతో తిరస్కరించిందని గుర్తుచేశారు. విభజనపై సంప్రదింపులకు జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్‌ను ఏర్పాటుచేసినప్పటికీ నివేదికను తప్పుగా అన్వయించి, రాష్ట్రాన్ని విభజించారని అన్నారు. ఈ విషయంపై తనకు సాధికారత ఉందని, తానే విభజనపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేసినట్టు తెలిపారు. ఇప్పటికీ ఆ కేసు పెండింగ్‌లో ఉందని వివరించారు. -
అసెంబ్లీ అనుమతి లేకుండా ఎలా రద్దు చేస్తారు?
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, ఆర్టికల్ 370 రద్దు అంశంపై లోక్‌సభలో వాడీవేడీ చర్చ జరుగుతోంది. అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. సభలో చర్చలో భాగంగా బిల్లుపై మాట్లాడిన కాంగ్రెస్ సభ్యుడు మనీష్ తివారి.. కశ్మీర్ విభజించిన తీరు సరిగా లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజనపై ఆ రాష్ట్ర అసెంబ్లీని సంప్రదించినట్లు ఆయన గుర్తుచేశారు. అలాగే కశ్మీర్‌ను విడగొట్టాలి అనుకున్నప్పుడు రాష్ట్ర శాసనసభ అనుమతి ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. చట్టబద్ధమైన ఎలాంటి విధానాలను కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పాటించలేదని విమర్శించారు. రాష్ట్రాల ఏర్పాటులో యూపీయే ప్రభుత్వం ఏకాభిప్రాయం మేరకు నడుకుందని, బీజేపీ ప్రభుత్వం చట్టాలను దుర్వినియోగిస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కొన్ని సంస్థానాలు స్వతంత్రగా ఉన్నాయని, నాటి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ చొరవతోనే అవన్ని దేశంలో విలీనమయ్యాయని తివారి చెప్పుకొచ్చారు. అయితే జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ అనుమతి లేకుండా ఆర్టికల్ 370ని తీసివేయడం సరికాదన్నారు. రాష్ట్రపతి పాలనలో ఉన్న సమయంలో ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఈశాన్య రాష్ట్రాల్లో అమల్లో ఉన్న చట్టాలను కూడా ఇలానే తీసేస్తారా అనే ప్రశ్నను సభలో లేవనెత్తారు. మనీష్ తివారీ వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఆయన వ్యక్తం చేసిన అభ్యంతరాలను షా తోసిపుచ్చారు. ఆర్టికల్ 370 రద్దుకు కాంగ్రెస్ అనుకూలమా? వ్యతిరేకమా చెప్పాలని డిమాండ్ చేశారు. చట్ట ప్రకారమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని షా స్పష్టం చేశారు.. చదవండి: మోదీ వల్లే కశ్మీర్ సమస్యకు పరిష్కారం!! అయితే ఆంధ్రప్రదేశ్‌ను చట్ట ప్రకారమే విభజించామన్న కాంగ్రెస్ వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ ఇప్పుడు కశ్మీర్‌పై మాట్లాడం సరికాదని హితవుపలికింది. చదవండి: కశ్మీర్ వ్యూహం వెనుక ఆ ముగ్గురు -
‘మెరుపు దాడులకు రాజకీయ మరక’
సాక్షి, న్యూఢిల్లీ : ఉగ్ర సంస్థ జైషే మహ్మద్‌పై భారత వైమానిక దాడులను బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని మాజీ కేంద్ర మంత్రి మనీష్ తివారీ ఆరోపించారు. మెరుపు దాడుల్లో 250 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని బీజేపీ చీఫ్ అమిత్ షా చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మన యుద్ధవిమానాలు నిర్ధేశిత లక్ష్యాలను ఛేదించాయని, అయితే ఎంతమంది దాడుల్లో మరణించారని ఇప్పుడే వెల్లడించడం తొందరపాటు అవుతుందని వాయుసేన పేర్కొంది. వాయుసేన వివరణను ప్రస్తావిస్తూ అమిత్ షా ప్రకటనను మనీష్ తివారీ తప్పుపట్టారు. అమిత్ షా వ్యాఖ్యలు మెరుపుదాడులను రాజకీయం చేయడం కాదా అని ఆయన నిలదీశారు. వాయుసేన ప్రకటనకు భిన్నంగా 250 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని చెప్పడం రాజకీయ ప్రయోజనాలతో ముడిపెట్టడమేనని అన్నారు. మరోవైపు బాలాకోట్‌లో ఉగ్రవాదుల మరణంపై ఎలాంటి ఆధారాలు లేవని విదేశీ మీడియా కథనాలు ప్రచురించిందని మరో కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా పీఓకేలో భారత్ చేపట్టిన వైమానిక దాడుల్లో 300 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని పాలక బీజేపీ శ్రేణులే ప్రచారంలో పెట్టాయని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం వ్యాఖ్యానించారు. బాధ్యతకలిగిన పౌరుడిగా, ప్రభుత్వం వెల్లడించే సమాచారాన్ని తాను విశ్వసిస్తానని,అయితే ప్రపంచాన్ని మనం నమ్మించాలంటే విపక్షాలను నిందించడం మానేసి ఆ దిశగా చర్యలు చేపట్టాలని హితవు పలుకుతూ చిదంబరం ట్వీట్ చేశారు. -
‘అప్పటివరకూ పాక్‌తో క్రికెట్ బంద్’
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రతిస్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పాకిస్తాన్లో కూర్చుని భారత్‌లో ఉగ్ర దాడులను ప్రేరేపించే ఉగ్రవాద సంస్థలు, వాటి అధినేతల ఆగడాలకు అడ్డుకట్ట పడేవరకూ ఆ దేశంతో క్రికెట్ మ్యాచ్‌లు ఆడరాదని ఆ పార్టీ ప్రతినిధి మనీష్ తివారీ డిమాండ్ చేశారు. ఉగ్రదాడిపై విపక్షాలను మౌనం దాల్చేలా పాలక మోదీ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తమ వైఫల్యాలను ప్రశ్నించిన వారికి బదులివ్వకుండా వారిని పాక్ సానుభూతిపరులుగా ముద్ర వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాము గట్టి ప్రశ్నలు వేయడం జాతీయ భద్రతను బలోపేతం చేస్తుందని తాము పాక్ వాదనను వినిపిస్తున్నామన్న కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ గుర్తెరగాలన్నారు. ఉగ్రదాడి జరిగిన సమయంలో ప్రధాని ఓ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతున్న వీడియో క్లిప్‌ను మనీష్ తివారీ ప్రదర్శించారు. అత్యంత విషాద ఘటన చోటుచేసుకున్న సమయంలో రెండు గంటల పాటు ప్రధానికి ఆ సమాచారం చేరవేయలేదా అని సందేహం వ్యక్తం చేశారు. ప్రధానికి దాడి విషయం తెలిస్తే దాని గురించి తన ప్రసంగంలో ఎలాంటి ప్రస్తావనా లేకుండా ముగించడం అనుమానాలు రేకెత్తిస్తోందన్నారు. ప్రధానికి, పీఎంఓకు మధ్య సమాచార లోపం సర్కార్ అసమర్ధతకు సంకతేమన్నారు. -
‘ముందుగానే బడ్జెట్ లీక్’
న్యూఢిల్లీ: కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే అందులోని కీలకాంశాలు బయటకు పొక్కాయని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి మనీష్ తివారి తెలిపారు. ప్రభుత్వ వర్గాలే ఈ వివరాలను మీడియాకు లీక్ చేశాయని ఆయన ఆరోపించారు. వీటికి సంబంధించిన ఫొటోలను ట్విటర్లో షేర్ చేశారు. ఇవే అంశాలు మధ్యంతర్ బడ్జెట్లో ఉన్నాయని వెల్లడించారు. బడ్జెట్‌ను ముందుగానే బయటకు లీక్ చేయడం చాలా సీరియస్ విషయమని, గోప్యత ఉల్లంఘనకు కిందకు వస్తుందని చెప్పారు. మోసకారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన దగా బడ్జెట్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ వర్ణించారు. గత నాలుగేళ్లలో వీటికి ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటర్లకు గాలం వేసేందుకే బడ్జెట్లో తాయిలాలు ప్రకటించారని ఆరోపించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని అన్నారు. (ఆ రెండు అంశాలు లేవు: చిదంబరం) -
గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం..
సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్లో రాజకీయ సంక్షోభం న్యాయపోరాటం దిశగా సాగుతోంది. జమ్ము కశ్మీర్ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని సీనియర్ కాంగ్రెస్ నేత మనీష్ తివారీ ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కోరినందునే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. గవర్నర్ నిర్ణయాన్ని న్యాయస్ధానంలో సవాల్ చేస్తామన్నారు. జమ్ము కశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చే భిన్న సిద్ధాంతాలతో కూడిన పార్టీల ఆధ్వర్యంలో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యమని అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అధికారాన్ని దక్కించుకునేందుకే ఆయా పార్టీలు కలుస్తున్నాయని, బాధ్యతాయుత ప్రభుత్వాన్ని అందించేందుకు కాదన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు ఊపందుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే గవర్నర్ నిర్ణయాన్ని పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. -
అప్పుడు దెయ్యం.. ఇప్పుడు ధర్మ సంస్థగా కనిపిస్తోందా..?
సాక్షి, న్యూఢిల్లీ : నాగపూర్ వేదికగా ఆరెస్సెస్ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగాన్ని కాంగ్రెస్ నేతలు ప్రశంసిస్తున్నా ఆయన ఆ కార్యక్రమానికి వెళ్లడంపై పలువురు నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రణబ్ హాజరుకావడాన్ని సీనియర్ కాంగ్రెస్ నేత మనీష్ తివారీ తప్పుపట్టారు. ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయాలనికి వెళ్లి జాతీయవాదంపై ప్రసంగం ఎందుకు ఇవ్వదలుచుకున్నారన్న తమ ప్రశ్నకు మీరు ఇంతవరకూ సమాధానం ఇవ్వకపోవడం లక్షలాది లౌకికవాదులను ఆందోళనకు గురిచేస్తున్నదని తివారీ పేర్కొన్నారు. ఆరెస్సెస్ కార్యకలాపాలను నిరసిస్తూ గతంలో తమకు శిక్షణ ఇచ్చిన పాతతరం కాంగ్రెస్ నేతగా ప్రణబ్ ఆ కార్యక్రమానికి ఎందుకు వెళ్లారో చెప్పాలని నిలదీశారు. గతంలో దెయ్యంలా కనిపించిన ఆరెస్సెస్ ఇప్పుడు ధర్మసంస్థలా మారిందా అని ప్రణబ్‌ను ఆయన ప్రశ్నించారు. కాగా ఆరెస్సెస్ కార్యక్రమంలో ప్రణబ్ ప్రసంగాన్ని పలువురు కాంగ్రెస్ నేతలు స్వాగతించారు. ఆరెస్సెస్ వేదికగా ప్రణబ్ కాంగ్రెస్ సిద్ధాంతాల గురించి వివరించారని, ఆరెస్సెస్ భావజాలం తప్పని పరోక్షంగా సూచించారని సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం ట్వీట్ చేశారు. పార్టీ నేతలు ఆనంద్ శర్మ, రణదీప్ సుర్జీవాలాలు సైతం ప్రణబ్ ప్రసంగాన్ని స్వాగతించారు. -
‘బ్యాంకింగ్ వ్యవస్థపై శ్వేతపత్రం’
సాక్షి, న్యూఢిల్లీ : భారీ కుంభకోణాలు వెలుగుచూస్తున్న బ్యాంకింగ్ వ్యవస్థలో వాస్తవ పరిస్థితి ప్రతిబింబిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ సర్కార్‌ను కోరింది. గత ఐదేళ్లుగా బ్యాంకింగ్ రంగంలో రూ 61,000 కోట్ల విలువైన స్కామ్‌లు చోటుచేసుకున్నాయని ఆ పార్టీ పేర్కొంది. బ్యాంకులను మోసం చేస్తున్న వారికి బీజేపీ సర్కార్ అండదండలున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం బ్యాంకింగ్ వ్యవస్థపై శ్వేతపత్రాన్ని ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనీష్ తివారీ డిమాండ్ చేశారు. బిలియనీర్ జ్యూవెలరీ నీరవ్ మోదీ పీఎన్బీని రూ 17,000 కోట్లకు ముంచిన కుంభకోణం వెలుగుచూడగా, తాజాగా రొటోమాక్ అధినేత విక్రమ్ కొఠారీ భారత బ్యాంకులకు రూ 800 కోట్లు ఎగవేసిన మరో స్కాం బయటపడిందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకుల్లో రోజుకో కుంభకోణం వెలుగుచూస్తోందన్నారు. బ్యాంకులను మోసం చేసిన అక్రమార్కులు, ఎన్పీఏలకు సంబంధించిన వివరాలన్నింటినీ ప్రచురించి, వారి పేర్లను వెల్లడించాల్సిందిగా అన్ని బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించాలని తివారీ డిమాండ్ చేశారు. -
మోదీపై మనీశ్ తివారి దుర్భాషలు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ట్విటర్లో అసభ్య పదజాలాన్ని ఉపయోగించి కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ తివారి వివాదానికి తెరతీశారు. మోదీ విదేశీ పర్యటనలో ఉండగా జాతీయగీతం ప్రసారమవుతుండగానే నడచుకుంటూ వెళ్లారు. ఈ తప్పును ఎత్తిచూపుతూ ఓ వీడియోను తివారి పోస్ట్ చేశారు. ఓ మోదీ అభిమాని ఈ వీడియోపై స్పందిస్తూ దేశభక్తి మోదీ డీఎన్ఏలో ఉందనీ, మహాత్మా గాంధీ కూడా మోదీకి దేశభక్తి గురించి చెప్పేంతటివాడు కాదని అన్నాడు. దీనిపై తివారి మరో ట్వీట్ చేస్తూ మోదీ ప్రజలను పిచ్చోళ్లను చేసి ఆడిస్తున్నారనీ, నిజంగానే మహాత్మ కూడా ఆయనకు దేశభక్తి గురించి బోధించలేరంటూ అసభ్య పదాలను వాడారు. కాంగ్రెస్ నిరాశలో ఇలా దుర్భాషలాడుతోందని కేంద్ర మంత్రి నఖ్వీ ఎదురుదాడి చేశారు. -
అబేను గుజరాత్‌కే ఎందుకు తీసుకెళ్లారు? : కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ: జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే రెండు రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ రాష్ట్రంలో కాలు మోపిన విషయం తెలిసిందే. అయితే ఓ దేశ ప్రధాని స్థాయి వ్యక్తిని.. పైగా మన దేశంతో కీలక ఒప్పందాలు చేసుకునేందుకు వచ్చిన తరుణంలో దేశ రాజధానిలో కాకుండా.. ఓ రాష్టంలో బస ఎందుకు ఏర్పాటు చేశారు? అన్న ప్రశ్నను లేవనెత్తుతోంది ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ. కేవలం రాజకీయ కారణాలతోనే జపాన్ ప్రధానిని మోదీ గుజరాత్‌కు తీసుకెళ్లారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ ఆరోపించారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా విచిత్రంగా ఉంది. వచ్చే ఏడాది గుజరాత్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ తరుణంలోనే కేవలం రాజకీయ ప్రయోజనం పొందేందుకే మోదీ, అబేను కావాలనే అక్కడికి(గుజరాత్) తీసుకెళ్లారు. కీలక ఒప్పందాలు చేసుకోవటానికి వచ్చిన ఒక అతిథిని గౌరవించే తీరు ఇదేనా? అని మనీశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాగా, నేడు జపాన్ ప్రధాని అబె ఇండియా తొలి బుల్లెట్ రైలుకు శంకుస్థాపన చేయనున్నారు. ముంబై, అహ్మదాబాద్ మధ్య పరుగులు తీయనుంది. అదే సమయంలో జపాన్ ప్రధాని సతీమణి అకి అబే అహ్మదాబాద్‌లోని బ్లైండ్ పీపుల్స్ అసోషియేషన్ను సందర్శించనున్నారు. -
‘మోదీ పర్యటనతో ఒరిగిందేమీ లేదు’
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటనతో ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్ విమర్శించింది. ఆ పార్టీ సినియర్ నేత మనీష్ తివారి మోదీ, ట్రంప్ మీటింగ్‌పై స్పందించారు. మనీష్ తివారి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 'మోదీ, ట్రంప్‌ల జాయింట్ స్టేట్మెంట్ నిరాశపరిచింది. అందులో కొత్త విషయం ఏమీ లేదు' అన్నారు. ఓ ప్రైవేట్ ఇండియన్ ఏవియేషన్ కంపెనీ అమెరికాలో ఉద్యోగాలు సృష్టించేందుకు తోడ్పడుతున్నందునే ట్రంప్ ప్రశంసలు కురింపించారు అని మనీష్ తివారి పేర్కొన్నారు. Absolutely nothing has come out of the visit. Joint statement disappointing as there is nothing new in it: Manish Tewari,Cong #ModiTrumpMeet pic.twitter.com/5VfEa7WfIJ — ANI (@ANI_news) 27 June 2017 -
100 కోట్ల ఉత్పత్తుల్ని విక్రయిస్తాం: అమెజాన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్త ఉత్పత్తుల నమోదులో ఈ–కామర్స్ కంపెనీ అమెజాన్ జోష్‌మీద ఉంది. ప్రస్తుతం కంపెనీ 10 కోట్ల ప్రొడక్టులను భారత్‌లో విక్రయిస్తోంది. రోజుకు 2 లక్షల ఉత్పత్తులు తన వెబ్సైట్లో నమోదు చేస్తోంది. రానున్న రోజుల్లో 100 కోట్ల ప్రొడక్టుల నమోదుకు ఆస్కారం ఉందని కంపెనీ కేటగిరీ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ మీడియాకు తెలిపారు. బీపీఎల్, వన్ ప్లస్, టీసీఎల్, సాన్యో వంటి కంపెనీలు భారత్‌లో కేవలం అమెజాన్ ద్వారానే మార్కెట్లో విస్తరిస్తున్నాయని చెప్పారు. 1,80,000కుపైగా విక్రేతలు అమెజాన్‌తో చేతులు కలిపారు. విక్రేతలు, తయారీ కంపెనీలు దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ఆన్లైన్ సులువైన మార్గం. మారుమూల ప్రాంతాల్లోనూ ఖరీదైన డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు, పెద్ద టీవీలకు డిమాండ్ ఉంది. డెలివరీతోపాటు ఎక్సే్ఛంజ్ బాధ్యతలనూ తీసుకుంటున్నాం. ఈఎంఐ ఆఫర్ చేస్తున్నాం. ఇలాంటి సౌకర్యాలతో అన్ని కంపెనీల వ్యాపారాలు వృద్ధిలో ఉన్నాయి. మే 11–14 తేదీల్లో గ్రేట్ ఇండియన్ సేల్‌ను నిర్వహిస్తున్నాం. సాధారణ రోజుతో పోలిస్తే సేల్ సమయంలో రెండు రెట్ల అమ్మకాలు నమోదు చేస్తున్నాం’ అని వివరించారు. -
ఆమిర్ మరోసారి మ్యాజిక్ చేశాడు
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మరోసారి తన విలక్షణతను ప్రూవ్ చేసుకున్నాడు. సినిమా కోసం శారీరకంగా మానసికంగా ఎంత శ్రమకైనా రెడీ అయ్యే ఆమిర్.. క్వాలిటీ సినిమాను అందించటం కోసం ఎంత సమయాన్నైనా కేటాయిస్తాడు. తనకున్న స్టార్ డమ్‌ను క్యాష్ చేసుకోని ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయటం ఆమిర్‌కు నచ్చదు. ఒక్క సినిమా చేసినా అది అభిమానులు గొప్పగా చెప్పుకునేది అయి ఉండాలి అన్నదే ఆమిర్ ఫిలాసఫీ. ఆ బాటలో ఆమిర్ ఖాన్ నుంచి వచ్చిన మరో అద్భుత చిత్రం దంగల్. హీరోగా సూపర్ స్టార్ ఇమేజ్‌తో ఉన్న ఆమిర్. 50 ఏళ్ల వ్యక్తిగా నలుగురు అమ్మాయిలకు తండ్రిగా నటించటం అంటే సాహసం అనే చెప్పాలి. ప్రముఖ భారత రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన దంగల్ సినిమాతో ఆ సాహసం చేశాడు ఆమిర్. రెజ్లర్‌గా ఎంతో సాధించిన ఫోగట్ తన వారసులుగా కూతుళ్లనే బరిలో దించటం అందుకు వారిని ఎలా సిద్ధం చేశాడన్నదే దంగల్ కథ. నితీష్ తివారి దర్శకత్వంలో ఆమిర్ ఖాన్ స్వయంగా నిర్మించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కథ విషయానికి వస్తే హరియాణాలోని భివానీ జిల్లాలో ఓ మారుమూల గ్రామానికి చెందిన కుస్తీ వీరుడు మహావీర్ సింగ్ ఫోగట్. రెజ్లింగ్‌లో భారత్ కు బంగారు పతకం అంధించాలన్నదే అతని కల. ఆ కలను తాను సాకారం చేసుకోలేకపోవటంతో తన వారాసుల ద్వారా అయినా అది సాధించాలనుకుంటాడు. కానీ తనకు నలుగురు కూతుళ్లే పుట్టడంతో నిరుత్సాహపడతాడు. అయితే ఒక రోజు స్కూల్లో జరిగిన గొడవలో తన కూతుళ్లు గీతా ఫోగట్, బబితా కుమారీలను చూసిన మహావీర్, తన కూతుళ్లు ఏ మగాడికన్నా తక్కువ కాదని భావిస్తాడు. తాను సాధించలేని బంగారు పతకాన్ని కూతుళ్ల ద్వారా భారత్‌కు అందించాలని నిశ్చయించుకుంటాడు. తానే శిక్షకుడిగా మారి కూతుళ్లను దేశకీర్తి పతాకాన్ని ఎగురవేసే రెజ్లర్లుగా తయారు చేస్తాడు. చిల్లర్ పార్టీ, భూత్నాథ్ రిటర్న్స్ లాంటి కామెడీ చిత్రాలను తెరకెక్కించిన నితీష్ తివారీ, తొలిసారిగా ఓ ఎమోషనల్ డ్రామాను తెరకెక్కించాడు. సినిమా తొలి సీన్ నుంచే ప్రేక్షకున్ని కథలో లీనం చేసిన దర్శకుడు, పర్ఫెక్ట్ స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకున్నాడు. ప్రీతమ్ అందించిన సంగీతం సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్. సినిమాలో భావోద్వేగాలను తన సంగీతంతో మరింత రక్తికట్టించాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్నింటికీ మించి ఆమిర్ నిర్మాణ విలువలు సినిమాను ఓ అంతర్జాతీయ స్థాయి సినిమాగా ప్రేక్షకులముందుంచాయి. అందుకే ఈ అద్భుత చిత్రానికి ప్రేక్షకులు భాషా బేదాలను మరిచి బ్రహ్మరథం పడుతున్నారు. -
నితిన్ గడ్కరీ... నన్ను క్షమించు
కాంగ్రెస్ కు హై ప్రొఫైల్ నేతలు తలనొప్పులుగా మారారు. ఒక వైపు దిగ్విజయ్ వివాహేతతర సంబంధం చికాకు పెడుతూండగానే, మరో సీనియర్ నేత మనీష్ తివారీ దాదాపు ముక్కు నేలకు రాసినంత పనిచేయాల్సి వచ్చింది. కార్గిల్ అమరవీరులకోసం ఇచ్చిన ఆదర్శ్ ఫ్లాట్లలో బిజెపి మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరికి కూడ ఆబేనామీ ఫ్లాట్ ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ ఆరోపించారు. అయితే ఇది నిరాధారమైన, దురుద్దేశంతో కూడుకున్న ఆరోపణ అని నితిన్ గడ్కరీ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసును ఆయన 2010 లో వేశారు. ఈ కేసు విచారణ వేగం పుంజుకున్న నేపథ్యంలో మనీష్ తివారీపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయింది. దీనితో మనీష్ తివారీ తప్పుడు ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు కోరారు. వివాదాన్ని ఇంతటితో ఆపేందుకు మనీష్ క్షమాపణలు కోరారు.