
‘మోదీ పర్యటనతో ఒరిగిందేమీ లేదు’
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటనతో ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్ విమర్శించింది. ఆ పార్టీ సినియర్ నేత మనీష్ తివారి మోదీ, ట్రంప్ మీటింగ్‌పై స్పందించారు.
మనీష్ తివారి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 'మోదీ, ట్రంప్‌ల జాయింట్ స్టేట్‌మెంట్ నిరాశపరిచింది. అందులో కొత్త విషయం ఏమీ లేదు' అన్నారు. ఓ ప్రైవేట్ ఇండియన్ ఏవియేషన్ కంపెనీ అమెరికాలో ఉద్యోగాలు సృష్టించేందుకు తోడ్పడుతున్నందునే ట్రంప్ ప్రశంసలు కురింపించారు అని మనీష్ తివారి పేర్కొన్నారు.
Absolutely nothing has come out of the visit. Joint statement disappointing as there is nothing new in it: Manish Tewari,Cong #ModiTrumpMeet pic.twitter.com/5VfEa7WfIJ
— ANI (@ANI_news) 27 June 2017