
మోదీపై మనీశ్ తివారి దుర్భాషలు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ట్విటర్‌లో అసభ్య పదజాలాన్ని ఉపయోగించి కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ తివారి వివాదానికి తెరతీశారు. మోదీ విదేశీ పర్యటనలో ఉండగా జాతీయగీతం ప్రసారమవుతుండగానే నడచుకుంటూ వెళ్లారు. ఈ తప్పును ఎత్తిచూపుతూ ఓ వీడియోను తివారి పోస్ట్ చేశారు. ఓ మోదీ అభిమాని ఈ వీడియోపై స్పందిస్తూ దేశభక్తి మోదీ డీఎన్‌ఏలో ఉందనీ, మహాత్మా గాంధీ కూడా మోదీకి దేశభక్తి గురించి చెప్పేంతటివాడు కాదని అన్నాడు. దీనిపై తివారి మరో ట్వీట్ చేస్తూ మోదీ ప్రజలను పిచ్చోళ్లను చేసి ఆడిస్తున్నారనీ, నిజంగానే మహాత్మ కూడా ఆయనకు దేశభక్తి గురించి బోధించలేరంటూ అసభ్య పదాలను వాడారు. కాంగ్రెస్ నిరాశలో ఇలా దుర్భాషలాడుతోందని కేంద్ర మంత్రి నఖ్వీ ఎదురుదాడి చేశారు.