కరోనా వెనుక అసలు కథ.. ఇదేనా! | Novel Predicted Wuhan Virus 40 Years Before Corona virus Outbreak | Sakshi
Sakshi News home page

‘కరోనా’ అసలు కథ.. 40 ఏళ్ల క్రితమే ఆ బుక్‌లో!

Published Mon, Feb 17 2020 6:56 PM | Last Updated on Mon, Feb 17 2020 7:15 PM

Novel Predicted Wuhan Virus 40 Years Before Corona virus Outbreak - Sakshi

ప్రస్తుతం కోవిడ్‌-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులోనూ చైనా దేశంలో ఇప్పటివరకు దాదాపు 1700 మంది వైరస్‌ బారిన పడి చనిపోగా, 65వేలకు పైగా కోవిడ్‌ పాజిటివ్‌ కేసులున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే ఈ వూహాన్‌ వైరస్‌ గురించి 40 ఏళ్ల క్రితమే ఓ నవలా రచయిత ఊహించాడు. 1981లో అమెరికా రచయిత డీన్ కూంట్జ్‌ తన థ్రిల్లర్ నవల ‘ది ఐస్ ఆఫ్ డార్క్‌నెస్’లో వూహాన్‌ సిటీలో కొత్త వైరస్‌ ప్రస్థావన ఉంది. ఆయన తన ఫిక్షన్ స్టోరీలోని ఓ పేజీలో దీని గురించి రాశారు.    చదవండి: ఆరోగ్య శత్రువు కోవిడ్‌–19

వూహాన్‌ సిటీలోని మిలటరీ ల్యాబ్‌లో చైనా కావాలని బయో వెపన్‌ కోసం ఈ వైరస్‌ను సృష్టించినట్లు ఆ బుక్‌లో ఉంది. వుహాన్-400 అనే పేరుతో చైనా శాస్త్రవేత్తలు ఈ వైరస్‌ను క్రియేట్ చేసినట్లు ఆ ఫిక్షన్ స్టోరీలో రాశారు. ఈ వైరస్‌ శత్రుదేశాలపై పోరాటానికి చైనా తయారుచేస్తుందని, ఇది మనుషులపై మాత్రమే ప్రభావం చూపుతుందని అందులో ఉంది. దీని ద్వారా కొన్ని ప్రాంతాలను లేదా దేశాలనే నాశనం చేయవచ్చని అందులో పేర్కొన్నారు.  చదవండి:  కరోనా ముందు ఏ ప్రేమైనా భారమే..

దారెన్‌ ప్లెమౌత్‌ అనే ఓ నెటిజన్‌ ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. దానికి సంబంధించిన బుక్‌ కవర్‌ ఫోటో, ఆ బుక్‌లో వైరస్‌ గురించి ప్రస్తావించిన పేజీని ట్విటర్‌లో షేర్‌ చేశారు. కాగా ఈ ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా దీనిపై కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ మంత్రి మనీష్‌ తివారీ కూడా ట్విటర్‌లో స్పందించారు. కరోనా వైరస్‌ వూహాన్‌-400 పేరుతో చైనా అభివృద్ధి చేసిన బయోలాజికల్‌ ఆయుధమా..? అంటూ 1981లో పబ్లిష్‌ అయిన ఓ బుక్‌ కాపీని జత చేస్తూ మనీష్‌ తివారీ ట్వీట్‌ చేశారు.  చదవండి: 'వీరి ప్రేమ ముందు ఏ వైరస్‌ నిలబడలేదు'

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement