
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ బీజేపీ కండువా కప్పుకుంటారని, ఆ పార్టీ తరఫున పంజాబ్‌లోని లూధియానా లోక్‌సభ స్థానం బరిలో దిగుతారని ఆదివారం వార్తలొచ్చాయి. అయితే ఇవన్నీ పుకార్లంటూ తివారీ కార్యాలయం ఖండించింది.
కాంగ్రెస్ సీనియర్ నాయకుౖడు కమల్‌నాథ్ తన కుమారుడు, ఎంపీ నకుల్‌తో పాటు బీజేపీ గూటికి చేరనున్నారంటూ కూడా వార్తలొస్తుండటం తెలిసిందే. ఆయన తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఆదివారం ఢిల్లీ చేరుకున్నారు. పార్టీ మారుతున్నారన్న ప్రచారంపై ప్రశ్నించగా ‘ఏమైనా ఉంటే మీకే మొదట చెబుతా’నంటూ దాటవేశారు!
Comments
Please login to add a commentAdd a comment