roumours
-
ఇన్సూరెన్స్ పాలసీదారుల డేటా లీక్
న్యూఢిల్లీ: జీవిత బీమా దిగ్గజం హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్‌కి సంబంధించిన ఐటీ సిస్టమ్స్‌లో డేటా లీక్ ఉదంతాలు చోటు చేసుకున్నాయి. ఈ ఉల్లంఘనల తీవ్రత, ప్రభావాలపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు సంస్థ వెల్లడించింది. కస్టమర్లకు సంబంధించిన నిర్దిష్ట వివరాలు ఒక గుర్తు తెలియని సోర్స్ నుంచి వచ్చినట్లు, ఎవరో దురుద్దేశంతోనే ఇదంతా చేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. వీటికి మూలకారణాలను తెలుసుకునేందుకు, దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ నిపుణులను సంప్రదించినట్లు వివరించింది. పాలసీదారుల డేటా లీక్ ఉదంతాల నేపథ్యంలో బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ ఇటీవలే ఐటీ సిస్టమ్‌లను ఆడిట్ చేయించాల్సిందిగా రెండు బీమా సంస్థలను ఆదేశించిన నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ లైఫ్ ఉదంతం ప్రాధాన్యం సంతరించుకుంది. -
విడాకులకు సిద్ధమవుతున్న హీరోయిన్? క్లారిటీ ఇచ్చిన భర్త
టీ-సిరీస్ అధినేత, ఆదిపురుష్ నిర్మాత భూషణ్ కుమార్,నటి దివ్య ఖోస్లా కుమార్ జంట విడాకులకు సిద్ధమతున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. లవ్ టుడేతో టాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయమైన దివ్యా ఖోస్లా ఇన్‌స్టా ఐడీలో ‘కుమార్’ అనే ఇంటిపేరును తొలగించడంతో విడాకుల పుకార్లకు తెర లేచింది. అంతేకాదు పేరుకు ముందు 's' ని కూడా జోడించడంతో మరిన్నిసందేహాలు వెల్లువెత్తాయి. అంతేకాదు భర్త భూషణ్ కుమార్ మ్యూజిక్ సంస్థ టీ-సిరీస్ సోషల్ మీడియా ఖాతాను కూడా అన్‌ఫాలో చేసింది. అయితే ఇవన్నీ పుకార్లేనని భరత్‌భూషణ్ టి-సిరీస్ టీం క్లారిటీ ఇచ్చింది. దివ్య ఖోస్లా తన ఇంటిపేరు తొలగింపునకు కారణం జ్యోతిష్య శాస్త్రం, ఇది వ్యక్తిగత నిర్ణయమని దీన్ని గౌరవించాలని టీ సిరీస్‌కి ప్రతినిధి వెల్లడించారు. పేరు ముందు 's' చేర్చడం వెనకాల కూడా ఇదే కారణమని స్పష్టతనిచ్చారు. ఈ జంట చాలా హ్యాపీగా ఉన్నారని తెలిపారు. 90ల నాటి పాప్ సంగీతంలో తళుక్కున మెరిసిన ముద్దుగుయ్యే దివ్యా ఖోసలా. ఫల్గుణి పాఠక్ మ్యూజిక్ వీడియో ‘అయ్యో రామ’ పెద్ద సంచలనమే సృష్టించింది.తన గ్లామర్‌తో అందర్నీ ఇట్టే ఆకట్టుకుంది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ సరసన జిద్ నా కరో యే దిల్ కాతో సహా అనేక మ్యూజిక్ వీడియోలో కనిపించింది. చాలా రోజుల గ్యాప్ తర్వాత దివ్య ఖోస్లా కుమార్ ప్రధాన పాత్రలో ‘హీరో హీరోయిన్’ మూవీ,తెలుగు, హిందీలో విడుదల కానుంది. సినిమాకు సురేష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రేరణ అరోరా నిర్మిస్తున్న ఈ సినిమాఫస్ట్ లుక్ పోస్టర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. View this post on Instagram A post shared by Divyakhossla (@divyakhossla) 2005 ఫిబ్రవరి 13న భూషణ్ కుమార్‌ను పెళ్లాడింది. 19 ఏళ్ల వైవాహిక జీవితంలో ఒక బాబు కూడా ఉన్నాడు. పెళ్లి తర్వాత సినిమాలకు ద బ్రేక్ తీసుకున్న దివ్య 2016లో సనమ్ రే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. చివరిగా మీజాన్ జాఫ్రీ , పెరల్ వి పూరితో కలిసి రొమాంటిక్ డ్రామా 'యారియన్ 2'లో కనిపించింది. నటిగానే కాదు నిర్మాతగా కూడా అవతరించింది. -
బీజేపీ గూటికి మనీశ్ తివారీ?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ బీజేపీ కండువా కప్పుకుంటారని, ఆ పార్టీ తరఫున పంజాబ్‌లోని లూధియానా లోక్‌సభ స్థానం బరిలో దిగుతారని ఆదివారం వార్తలొచ్చాయి. అయితే ఇవన్నీ పుకార్లంటూ తివారీ కార్యాలయం ఖండించింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుౖడు కమల్‌నాథ్ తన కుమారుడు, ఎంపీ నకుల్‌తో పాటు బీజేపీ గూటికి చేరనున్నారంటూ కూడా వార్తలొస్తుండటం తెలిసిందే. ఆయన తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఆదివారం ఢిల్లీ చేరుకున్నారు. పార్టీ మారుతున్నారన్న ప్రచారంపై ప్రశ్నించగా ‘ఏమైనా ఉంటే మీకే మొదట చెబుతా’నంటూ దాటవేశారు! -
చైనా విదేశాంగ మంత్రి అదృశ్యం.. హత్యా? ఆత్మహత్యా?
వాషింగ్టన్: ఒకప్పుడు అమెరికాలో చైనా రాయబారిగా పనిచేసి వెంటనే అత్యున్నత పదవి పొంది చైనా విదేశాంగ మంత్రిగా సేవలందించిన క్విన్ గాంగ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారనే విషయంపై అంతర్జాతీయ మీడియా కొత్త అంశాలను మోసుకొచి్చంది. చివరిసారిగా జూన్ నెలలో కనిపించిన ఆయన ప్రస్తుతం జీవించి లేరని మీడియాలో వార్తలొచ్చాయి. ఆత్మహత్య చేసుకున్నారని కొన్ని పత్రికల్లో, చైనా ప్రభుత్వమే హింసించి చంపిందని మరి కొన్నింటిలో భిన్న కథనాలు వెలువడ్డాయి. ఈ ఏడాది జూన్‌లో చివరిసారిగా కనిపించి అప్పటి నుంచి కనిపించకుండా పోయిన క్విన్‌గాంగ్ ఉదంతం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. జూలై నెలలో బీజింగ్‌లోని మిలటరీ ఆస్పత్రిలో ఆయన కన్నుమూశారని చైనా ప్రభుత్వంలోని ఇద్దరు అత్యున్నత స్థాయి అధికారులు చెప్పినట్లు ‘పొలిటికో’ వార్తాసంస్థ ఒక కథనం వెలువరిచింది. క్విన్ అమెరికాలో చైనా రాయబారిగా కొనసాగిన కాలంలో ఆయన నెరిపిన ఒక వివాహేతర సంబంధమే ఈ అదృశ్యం ఘటనకు అసలు కారణమని గతంలో వాల్‌స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. ఈ విషయంలో చైనా ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తునకు ఆయన సహకరించారట. ‘‘అమెరికా పౌరసత్వమున్న చైనా అధికారిక ఫీనిక్స్ టీవీ మహిళా రిపోర్టర్ ఫ్యూ గ్జియోíÙయాన్‌తో వివాహేతర సంబంధం కారణంగా చైనా జాతీయ భద్రత ప్రమాదంలో పడిందని జిన్‌పింగ్ సర్కార్ బలంగా నమ్మింది. ఆ మహిళ సరోగసీ పద్ధతిలో ఒక బిడ్డకు జన్మనిచి్చంది. ఇప్పుడా తల్లీబిడ్డల ఆచూకీ సైతం గల్లంతైంది. క్విన్‌గాంగ్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని జిన్‌పింగ్ వెంటనే ఆయనను జూన్‌లో చైనా విదేశాంగ శాఖ మంత్రి పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో మాజీ దౌత్యవేత్త వాంగ్ యీను పదవిలో కూర్చోబెట్టారు’’ అని ఆ కథనం పేర్కొంది. కేవలం ఆరునెలలు పదవిలో ఉన్న క్విన్‌గాంగ్ ఆ తర్వాత కనిపించకుండా పోయారు. 2014–2018 కాలంలో దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌కు చీఫ్ ప్రోటోకాల్ ఆఫీసర్‌గా పనిచేసి క్విన్ ఆయనకు అత్యంత ఆప్తుడయ్యాడు. అందుకే అత్యంత నమ్మకస్తులకు మాత్రమే దక్కే ‘అమెరికాలో చైనా రాయబారి’ పదవిని క్విన్‌కు జిన్‌పింగ్ కట్టబెట్టారు. వివాహేతర బంధమే క్విన్‌గాంగ్ మరణానికి కారణమన్న అంతర్జాతీయ మీడియా -
కొడాలి నాని ఆరోగ్యంపై వైఎస్సార్సీపీ నాయకుల క్లారిటీ
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: మాజీమంత్రి కొడాలి నాని ఆరోగ్యంపై వస్తున్న వార్తలను గుడివాడ వైఎస్సార్సీపీ నాయకులు ఖండించారు. కొడాలి నాని అనారోగ్యానికి గురయ్యారని రెండు రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. కొడాలి నానిని రాజకీయంగా ఎదుర్కోలేకే ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎన్టీఆర్ స్టేడియం వైస్ ఛైర్మన్ పాలేటి చందు విమర్శించారు. ఆయన్ను మానసికంగా దెబ్బతీయడానికే సోషల్ మీడియా, కొన్ని శాలిలైట్ ఛానల్స్‌లో ఇలాంటి ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. జులై 8న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా మంత్రి విడదల రజనీతోపాటు కొడాలి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. జులై 9న స్వర్గీయ అడపా బాబ్జి జయంతిలో పాల్గొన్నారు. కొండాలమ్మ అమ్మవారికి ఆషాడం సారెను కూడా సమర్పించారని పేర్కొన్నారు. కొడాలి నానిని రాజకీయంగా ఏమీ చేయలేకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడాలి నానిని ఏదైనా చెయ్యాలంటే 2 లక్షల మంది గుడివాడ ప్రజలను దాటుకుని రావాలని తెలిపారు. కొడాలి నానిని ఓడించడానికి పచ్చ మీడియా, తెలుగుదేశం పార్టీ చాలా కష్టపడుతోందని అన్నారు. వాళ్లు ఎంత ప్రయత్నించినా గుడివాడ ప్రజలు ఆయనకు వలయంగా ఉంటారని చెప్పారు. రెండు దశాబ్ధాలుగా గుడివాడ ప్రజల గుండెల్లో కొడాలి నాని స్థానం సంపాదించుకున్నారని, ఇప్పటికైనా ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. చదవండి: బాబు నుంచి పవన్‌కు రిపోర్టు వచ్చిందేమో: కొట్టు సత్యనారాయణ సెటైర్లు -
రాఘవ్ చద్దా, పరిణితిచోప్రా పెళ్లి సాధ్యమేనా? నటి స్టేట్మెంట్ వైరల్
బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణితీ చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ యువనేత రాఘవ్ చద్దాల వివాహంపై కొద్ది రోజులుగా రూమర్స్ జోరుగా వ్యాప్తి చెందుతున్నాయి. వీరిద్దరు ప్రేమలో మునిగితేలుతున్నారని, త్వరలోనే ఒక్కటి కాబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవల ఓ కార్యక్రమానికి ఈ జోడీ కలిసివెళ్లడం కూడా ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. కానీ ఇప్పటివరకు వీరిద్దరు ఈ విషయంపై నోరుమెదపలేదు. ఈ వార్తలను ఖండించనూ లేదు ఖరారూ చేయలేదు. అయితే తాజాగా పరిణితీ చోప్రా గతంలో ఇచ్చిన ఓ స్మేట్మెంట్కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన పరిణితి.. తాను రాజకీయ నాయకులను మాత్రం పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. స్వయంగాపైకి వచ్చినవారు అంటే తనకు ఇష్టమని, తనకు గౌరవం ఇచ్చేవారినే ఇష్టపడతానని పేర్కొంది. పొలిటిషియన్‌ను తప్ప ఏ రంగానికి చెందినవారినైనా పెళ్లి చేసుకునేందుకు సిద్ధమని తెలిపింది. ఈ అమ్మడు గతంలో ఎప్పుడో చెప్పిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. యువ నాయకుడు రాఘవ్ చద్దాతో ఈమె సన్నితంగా మెలగడే ఇందుకు కారణం. ఈమె కొత్త సినిమాలో సహ నటుడు హార్డీ సంధు కూడా.. పరిణితి త్వరలో పెళ్లి చేసుకోబోతుందని, ఎట్టకేలకు తనకు కావాల్సిన భాగస్వామి దొరికాడని వెల్లడించాడు. ఆమెకు అడ్వాన్స్‌గా.. ఆల్‌ది బెస్ట్ కూడా చెప్పాడు. దీంతో రాఘవ్ చద్దాతోనే పరిణితి వివాహానికి సిద్ధం అవుతోందని నెటిజన్లు భావిస్తున్నారు. వీరి పెళ్లి సాధ్యాసాధ్యాల గురించి జోరుగా చర్చిస్తున్నారు. ఒకప్పుడు రాజకీయ నాయకుడ్ని పెళ్లి చేసుకోనని చెప్పిన పరిణితి ఇప్పుడు మనసు మార్చుకుని ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. ప్రేమలో ఏదైనా సాధ్యమే అని అంటున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ అటు రాఘవ్‌కు ఇటు అభిమానులకు షాక్ ఇస్తుందా..? లేదంటే పెళ్లికి రెడీ అవుతుందా చూడాలి! చదవండి: సొంత అంతరిక్ష విమానం.. కల సాకారానికి అడుగు దూరంలో భారత్.. -
'కేజీఎఫ్ 3' ఉందా ? లేదా ?.. మరో నిర్మాత ఏమన్నాడంటే ?
Hombale Films Producer Karthik Gowda About KGF 3: యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చి బాక్సాఫీస్ వద్ద తుఫాన్ సృష్టించిన చిత్రం 'కేజీఎఫ్ 2'. ఓ పక్క కలెక్షన్లు మరోపక్క ప్రేక్షకుల మౌత్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇక బాలీవుడ్లో అయితే రూ. 400 కోట్లకుపైగా వసూళ్లను కొల్లగొట్టింది. అంతేకాకుండా ఇటీవలే వెయ్యి కోట్ల క్లబ్లో కూడా చేరింది ఈ మూవీ. ఇండియాలోని అన్ని భాషల్లో కలుపుకుని రూ. 900 కోట్లు దాటగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 1170 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ మూవీకి సీక్వెల్‌గా 'కేజీఎఫ్ 3' రానుందని శనివారం ఉదయం నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కేజీఎఫ్ 3 మూవీని మార్వెల్ తరహాలో తెరకెక్కించనున్నట్లు, అక్టోబర్ తర్వాత షూటింగ్ ప్రారంభం కానున్నట్లు హోంబలే సంస్థ నిర్మాత విజయ్ కిరంగదూర్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలపై హోంబలో సంస్థకు చెందిన మరో నిర్మాత కార్తిక్ గౌడ స్పందించారు. 'సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం మా వద్ద చాలా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిపైనే మా దృష్టి ఉంది. కాబట్టి ఇప్పట్లో హోంబలే సంస్థ 'కేజీఎఫ్ 3'ని తెరకెక్కించలేదు. ఒకవేళ షూటింగ్ ప్రారంభిస్తే తప్పకుండా అధికారిక ప్రకటన ఇస్తాం.' అని కార్తిక్ గౌడ ట్వీట్ చేశారు. చదవండి: 'కేజీఎఫ్ 3'పై క్లారిటీ.. మార్వెల్ ఫ్రాంచైజీ తరహాలో సినిమా The news doing the rounds are all speculation. With a lot of exciting projects ahead of us , we @hombalefilms will not be starting #KGF3 anytime soon. We will let you know with a bang when we start the work towards it. — Karthik Gowda (@Karthik1423) May 14, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కశ్మీర్లో టెన్షన్.. టెన్షన్!
శ్రీనగర్/జమ్మూ/న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణం ఆదివారం నాటికి మరింత ముదిరింది. ఉగ్రవాదులు దాడిచేయొచ్చన్న వార్తల నేపథ్యంలో శ్రీనగర్‌ను వీడాలని రాష్ట్ర క్రికెట్ జట్టు కోచ్ ఇర్ఫాన్ పఠాన్‌ను అధికారులు ఆదేశించారు. అదే సమయంలో జమ్మూలోని పూంఛ్, రాజౌరీ, దొడ, కిష్త్వర్ జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం భారీగా బలగాలను మోహరించింది. ఈ సందర్భంగా నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఇంట్లో సమావేశమైన అఖిలపక్ష నేతలు పరిస్థితిని మరింత దిగజార్చేలా వ్యవహరించవద్దని భారత్, పాకిస్తాన్లకు విజ్ఞప్తి చేశారు. కశ్మీర్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వం చేసేందుకు ఇదే సరైన సమయమని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వ్యాఖ్యానించారు. నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం కానున్న కేబినెట్ కశ్మీర్‌పై ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని విశ్వసనీయ వర్గాలుచెప్పాయి. కలసికట్టుగా పోరాడుతాం: అఖిలపక్షం కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆందోళనల నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధినేత ఫరూక్ అబ్దుల్లా ఇంటిలో ఆదివారం అఖిలపక్ష భేటీ జరిగింది. మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అధ్యక్షతన ఈ సమావేశానికి కాంగ్రెస్, పీడీపీ, పీపుల్స్ కాన్ఫరెన్స్, జేఅండ్‌కే మూవ్మెంట్, ఎన్సీ, సీపీఎం నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అనిశ్చితిని రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీలకు వివరించేందుకు వీలుగా ఓ ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి పంపాలని నేతలు నిర్ణయించారు. ఈ విషయమై ఫరూక్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ..‘జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగ నిబంధనల్ని కాపాడేందుకు, రాష్ట్రాన్ని ముక్కలుగా చేయాలన్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు కలసికట్టుగా పోరాడాలని అఖిలపక్ష భేటీలో నిర్ణయించాం. ఆర్టికల్ 35 ఏ, ఆర్టికల్ 370లను రాజ్యాంగవిరుద్ధంగా రద్దుచేయడమంటే జమ్మూ, కశ్మీర్, లడఖ్ ప్రజలపై దాడిచేయడమే. ఈ విషయంలో పరిస్థితులు మరింత దిగజారేలా వ్యవహరించవద్దని భారత్, పాకిస్తాన్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని కోరుతున్నాం’ అని చెప్పారు. మరోవైపు పీడీపీ అధినేత్రి, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీకి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) నోటీసులు జారీచేసింది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జమ్మూకశ్మీర్ బ్యాంకులో ఉద్యోగాల కోసం ఎవరి పేరునైనా మౌఖికంగా లేదా ఇతర మార్గాల్లో సిఫార్సు చేశారో, లేదో చెప్పాలని కోరింది. దీంతో ప్రజల్ని ఏకంచేయకుండా ప్రధాన రాజకీయ నేతల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారనీ, ఇలాంటి ప్రయత్నాలు ఫలించబోవని ముఫ్తీ స్పష్టంచేశారు. మరోవైపు రాష్ట్రంలో కర్ఫ్యూ విధించనున్న నేపథ్యంలో మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు ఇంట్లోంచి బయటకు రాకూడదని పోలీసులు ఆదేశించారు. కాంగ్రెస్ నేత ఉస్మాన్ మాజిద్, సీపీఎం ఎమ్మెల్యే ఎంవై తరిగామిలను అరెస్ట్ చేశారు. జమ్మూలోనూ బలగాల మోహరింపు.. జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాల మోహరింపుతో ఏర్పడిన అనిశ్చితి కొనసాగుతోంది. ఉగ్రముప్పు నేపథ్యంలో కశ్మీర్‌లోని ఆర్మీ స్థావరాలు, పోలీస్ ప్రధాన కార్యాలయం, విమానాశ్రయాలు, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను ఆదివారం కట్టుదిట్టం చేశారు. అలాగే జమ్మూలోని పూంఛ్, రాజౌరీ, దొడ, కిష్త్వర్ జిల్లాల్లో ముందు జాగ్రత్తగా బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను భారీగా మోహరించారు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, జమ్మూకశ్మీర్ క్రికెట్ జట్టు కోచ్ ఇర్ఫాన్ పఠాన్‌ను రాష్ట్రం విడిచిపెట్టి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. కశ్మీర్లో పరిస్థితులు మరింత దిగజారవచ్చన్న భయంతో స్థానికులు నిత్యావసర సరుకులు, పెట్రోల్ కొనేందుకు షాపుల ముందు భారీ సంఖ్యలో బారులుతీరారు. మరోవైపు పుల్వామా తరహాలో ఉగ్రవాదులు వాహనాలతో ఆత్మాహుతిదాడికి పాల్పడకుండా ఉండేందుకు భద్రతాబలగాలు రోడ్లపై చాలాచోట్ల బారికేడ్లను ఏర్పాటుచేశాయి. యాజమాన్యం ఆదేశాలతో నిట్–శ్రీనగర్ విద్యార్థులు స్వస్థలాలకు బయలుదేరారు. అమిత్ షా–దోవల్ కీలక భేటీ.. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కశ్మీర్లో నెలకొన్న అనిశ్చితి, భారత్‌లో చొరబాటుకు యత్నించిన 5–7 మంది పాక్ బ్యాట్ కమాండోలను ఆర్మీ హతమార్చడం తదితర అంశాలపై దాదాపు గంటపాటు చర్చలుజరిపారు. మరోవైపు జమ్మూ, ఉధమ్‌పూర్, కర్తా ప్రాంతాల నుంచి బయలుదేరే రైళ్లలో రాబోయే 48 గంటలపాటు టికెట్ల తనిఖీ చేయబోమని రైల్వేశాఖ ప్రకటించింది. భారీ సంఖ్యలో ఉన్న అమర్నాథ్ యాత్రికులు రిజర్వేషన్ లేకపోయినా ఇబ్బంది లేకుండా రాష్ట్రాన్ని వీడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అధికారులు, వైద్య సిబ్బంది సెలవులపై వెళ్లరాదనీ, ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయరాదని కార్గిల్ కలెక్టర్ ఆదేశించారు. దీటుగా బదులిస్తాం: పాక్ భారత్ ఎలాంటి దుస్సాహసానికి, దురాక్రమణకు పాల్పడినా దీటుగా బదులిస్తామని పాకిస్తాన్ హెచ్చరించింది. కశ్మీరీలకు తమ దౌత్య, నైతిక, రాజకీయ మద్దతును కొనసాగిస్తామని ప్రకటించింది. ఇస్లామాబాద్‌లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన ఆదివారం జరిగిన జాతీయ భద్రతా కమిటీ సమావేశానికి రక్షణ మంత్రి పర్వేజ్ ఖట్టక్, విదేశాంగమంత్రి ఖురేషీ, త్రివిధ దళాధిపతులు, ఐఎస్ఐ చీఫ్ జనరల్ ఫైజ్ హమీద్ హాజరయ్యారు. ఈ భేటీ అనంతరం పాక్ స్పందిస్తూ..‘భారత్ చర్యల కారణంగా ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతికి విఘాతం కలుగుతుంది. కశ్మీర్ అన్నది సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యే. కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దీన్ని పరిష్కరించాలని భారత్‌ను కోరుతున్నాం. తాజాగా బలగాల మోహరింపుతో కశ్మీర్లో పరిస్థితి అగ్నికి ఆజ్యం పోసినట్లే అవుతుంది’ అని హెచ్చరించింది. ట్రంప్ కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధమని చెప్పారనీ, అందుకు ఇదే సరైన సమయమని వ్యాఖ్యానించారు. జమ్మూలో హైదరాబాద్ రైలు ఎక్కుతున్న విద్యార్థులు -
నివురుగప్పిన నిప్పులా జమ్మూకశ్మీర్!
శ్రీనగర్/జమ్మూ/న్యూఢిల్లీ : ఓవైపు భారీగా బలగాల మోహరింపు.. మరోవైపు కేంద్రం మౌనంతో జమ్మూకశ్మీర్‌లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా తయారైంది. జమ్మూకశ్మీర్‌లో శాశ్వతనివాసం, స్వయంప్రతిపత్తికి సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 35ఏ, ఆర్టికల్ 370లను కేంద్రం రద్దుచేయబోతోందన్న వదంతుల నేపథ్యంలో ప్రతిపక్షాలు గవర్నర్ సత్యపాల్ మాలిక్‌తో శనివారం భేటీ అయ్యాయి. ఉగ్రముప్పు ఉన్నప్పటికీ పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తన భద్రతాసిబ్బంది కళ్లుగప్పి నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఇంటికి వెళ్లారు. కేంద్రం తీసుకునే ఎలాంటి చర్యనైనా కలసికట్టుగా ఎదుర్కొందామని కోరారు. అనంతరం ఇతర కశ్మీరీ నేతలతో కలిసి గవర్నర్ సత్యపాల్ మాలిక్‌తో భేటీ అయ్యారు. దీంతో జమ్మూకశ్మీర్‌కు సంబంధించి ఎలాంటి రాజ్యాంగ నిబంధనల్ని సవరించడం లేదనీ, వదంతుల్ని నమ్మవద్దని మాలిక్ రాజకీయ నేతలు, మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు. జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న అనిశ్చితిపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయగా, ఈ విషయంలో కశ్మీరీ ప్రజలకు పార్లమెంటు హామీ ఇవ్వాలని ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా కోరారు. రంగంలోకి ఐఏఎఫ్ విమానాలు.. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి జరగొచ్చన్న ఆర్మీ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర పాలనా యంత్రాంగం అప్రమత్తమయ్యాయి. పలువురు పర్యాటకుల్ని, అమర్నాథ్ యాత్రికులను ప్రత్యేక వాహనాల్లో శ్రీనగర్ విమానాశ్రయానికి తరలించాయి. జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం నాటికి 20,000 నుంచి 22,000 మంది పర్యాటకులు ఉన్నారు. అయితే ఉగ్రహెచ్చరికల నేపథ్యంలో గుల్మార్గ్, పెహల్గామ్ వంటి పర్యాటక ప్రాంతాల నుంచి 6,126 మంది పర్యాటకులను శ్రీనగర్‌కు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా 5,829 మందిని 32 విమానాల్లో శనివారం తమ స్వస్థలాలకు తరలించారు. భారత వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన విమానాల్లో మరో 387 మందిని గమ్యస్థానాలకు చేర్చారు. ఈ సందర్భంగా పలు విమానయాన సంస్థలు టికెట్ల రీషెడ్యూల్, రద్దుపై విధించే అదనపు చార్జీలను ఆగస్టు 15 వరకూ ఎత్తివేశాయి. టికెట్లను రద్దుచేసుకుంటే అదనపు చార్జీలు విధించబోమని రైల్వేశాఖ చెప్పింది. మరోవైపు భారత పర్యటనలో భాగంగా జమ్మూకశ్మీర్‌కు వెళ్లవద్దని తమ పౌరులను బ్రిటన్, జర్మనీ దేశాలు హెచ్చరించాయి. భద్రతా సిబ్బందిని సంప్రదించాకే కశ్మీర్లో పర్యటించాలనీ, ప్రస్తుతం అక్కడి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఆస్ట్రేలియా తమ పౌరులకు స్పష్టం చేసింది. అవన్నీ వదంతులే.. నమ్మొద్దు: గవర్నర్ మాలిక్ జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ప్రతినిధుల బృందం శనివారం గవర్నర్ సత్యపాల్ మాలిక్‌తో సమావేశమైంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 35ఏ, ఆర్టికల్ 370లను రద్దు చేయబోతోందని చెలరేగుతున్న వదంతులపై స్పష్టత ఇవ్వాల్సిందిగా కోరింది. దీంతో గవర్నర్ స్పందిస్తూ..‘ఆర్మీ హెచ్చరికల తీవ్రతను దృష్టిలో ఉంచుకునే అమర్నాథ్ యాత్రను తక్షణం నిలిపివేయాల్సి వచ్చింది. ఇక నాకు తెలిసినంతవరకూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనల్ని సవరించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయడంలేదు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం తీసుకున్న చర్యలకు కొందరు ఇతర కారణాలను ఆపాదిస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో అనవసరంగా భయాందోళన చెలరేగుతుంది’ అని తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై వచ్చే వదంతుల్ని, పుకార్లను నమ్మవద్దనీ, ప్రశాంతంగా ఉండాలని రాజకీయ నేతలు, వారి మద్దతుదారులకు గవర్నర్ సత్యపాల్ మాలిక్ విజ్ఞప్తి చేశారు. ‘బుద్ధ అమర్నాథ్ యాత్ర’ రద్దు: వీహెచ్‌పీ ఉగ్రదాడి హెచ్చరికల నేపథ్యంలో పూంఛ్ జిల్లాలో ఈ నెల 6 నుంచి పది రోజుల పాటు సాగనున్న ‘బుద్ధ అమర్నాథ్ యాత్ర’ను రద్దు చేసుకుంటున్నట్లు విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ప్రకటించింది. ఈ విషయమై వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు లీలాకరణ్ శర్మ మాట్లాడుతూ..‘అమర్నాథ్ యాత్రామార్గంలో అమెరికా తయారీ స్నైపర్ తుపాకీ, మందుపాతర లభ్యంకావడం, మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భక్తుల భద్రత రీత్యా బుద్ధ అమర్నాథ్ యాత్రను నిలిపివేస్తున్నాం. అలాగే కుల్గామ్ జిల్లాలో కౌశర్నాగ్ యాత్ర, కిష్త్వర్ జిల్లాలో మచైల్ యాత్రను నిలిపివేస్తున్నట్లు కూడా ఆపేస్తున్నాం’ అని చెప్పారు. మోదీ ప్రకటన చేయాలి: ప్రతిపక్షాలు అమర్నాథ్ యాత్రను కేంద్ర ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేయడంతో దేశ ప్రజల్లో తీవ్రమైన ఆందోళన నెలకొందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ తెలిపారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితిపై ప్రధాని మోదీ ఉభయసభలను ఉద్దేశించి ఓ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏల కొనసాగింపు విషయంలో తమకు పార్లమెంటు నుంచి హామీ కావాలని ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా చెప్పారు. భారత్‌లో విలీనం సందర్భంగా జమ్మూకశ్మీర్‌కు ఇచ్చిన హామీలు కాలాతీతమైనవని వ్యాఖ్యానించారు. ప్రజలను భయపెడుతున్నారు: బీజేపీ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేందుకు కాంగ్రెస్, పీడీపీ, ఎన్సీ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ విమర్శించింది. ఈ విషయమై రాష్ట్ర బీజేపీ చీఫ్ రవీంద్ర రైనా మాట్లాడుతూ..‘రాజకీయ నేతలు ప్రజలను భయాందోళనకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ పార్టీలన్నీ కేంద్రానికి సహకరించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 ఏ కారణంగా రాష్ట్రంలో ప్రశాంతత అనేది కరువైంది. ఆగస్టు 15న లోయలోని అన్ని పంచాయతీల్లో మువన్నెల జెండాను ఎగురవేస్తాం’ అని ప్రకటించారు. భద్రతా సిబ్బందికి ముఫ్తీ షాక్ పీడీపీ అధినేత్రి, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ భద్రతా సిబ్బందికి షాక్ ఇచ్చారు. ఉగ్రముప్పు ఉన్నందున ఇంటి నుంచి బయటకు వెళ్లరాదని హెచ్చరించినప్పటికీ ఆమె శుక్రవారం రాత్రి సిబ్బంది కళ్లు కప్పి గుప్కార్ రోడ్డులోని ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఇంటికి చేరుకున్నారు. కశ్మీరీల హక్కుల్ని కాపాడుకునేందుకు చేతులు కలుపుదామని కోరారు. అయితే తన ఆరోగ్యం బాగోలేనందున కుమారుడు ఒమర్ అబ్దుల్లాతో ఈ విషయాన్ని చర్చించాలని ఫరూక్ సూచించారు. ఒమర్ ఆదివారం నిర్వహించే అఖిలపక్ష భేటీకి రావాలని కోరారు. దీంతో ముఫ్తీ పీపుల్స్ కాన్ఫరెన్స్ అధినేత సజ్జద్ లోనే, జేకేపీఎం అధినేత, మాజీ ఐఏఎస్ అధికారి షా ఫైజల్‌తో భేటీ అయ్యారు. అనంతరం వీరంతా రాజ్‌భవన్‌కు వెళ్లారు. రాజ్యాంగం ఏం చెబుతోంది? జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ, కశ్మీర్, లడఖ్ పేరిట మూడు ముక్కలుగా చేయడం అసాధ్యం కాదని కొందరు రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. రాజ్యాంగంలోని కొన్ని నిబంధనల మేరకు పాకిస్తాన్ పక్కనే ఉన్న రాష్ట్రాల సరిహద్దులు మార్చవచ్చని అంటున్నారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను మరో అధికరణ 368(1) ద్వారా సవరించవచ్చు. ఇందుకోసం తొలుత లోక్‌సభ, ఆ తర్వాత రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కనీసం సగం రాష్ట్రాలు ఇందుకు ఆమోదం తెలిపితే, ఆర్టికల్ 370 రద్దవుతుంది. ఇది జరిగిన వెంటనే జమ్మూకశ్మీర్ సరిహద్దుల్ని నిర్ణయించే అధికారం పార్లమెంటుకు లభిస్తుంది. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ఇప్పటికే ఉన్న రాష్ట్రాలకు సరికొత్తగా సరిహద్దుల్ని ఏర్పాటు చేయడంతో పాటు కొత్త రాష్ట్రాలకు సరిహద్దుల్ని నిర్ణయించవచ్చు. కానీ దీనికి ఆర్టికల్ 370 అడ్డుపడుతున్న నేపథ్యంలో ఈ అధికరణాన్ని తొలగించడం తప్ప మరో మార్గం లేదని నిపుణులు అంటున్నారు. ఈ విషయమై లోక్‌సభ మాజీ కార్యదర్శి సుభాష్ కశ్యప్ మాట్లాడుతూ..‘ఆర్టికల్ 370 అన్నది తాత్కాలిక నిబంధనే తప్ప ప్రత్యేకమైన నిబంధన కాదు. మన రాజ్యాంగంలో తాత్కాలిక, పరివర్తన, ప్రత్యేకమైన అనే నిబంధనలున్నాయి. వీటిలో తాత్కాలికమన్నది అత్యంత బలహీనమైనది’ అని తెలిపారు. 35ఏ ఎందుకంత ప్రాముఖ్యం? ► జమ్మూకశ్మీర్ సంస్థానాధీశుడు మహారాజా హరి సింగ్ 1927, 1932లో జారీ చేసిన ఉత్తర్వుల్లో రాష్ట్ర పరిధిలోని అంశాలు, ప్రజల హక్కులను నిర్వచించారు. ఇదే చట్టాన్ని వలస వచ్చిన వారికీ వర్తింపజేశారు. ► కశ్మీర్ పగ్గాలు చేపట్టిన షేక్ అబ్దుల్లా 1949లో భారత ప్రభుత్వంతో జరిపిన చర్చల ఫలి తంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 370 చేరింది. దీంతో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి లభించింది. ఆ రాష్ట్రంపై భారత ప్రభుత్వ అధికారాలు.. రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాచార రంగాలకే పరిమితమయ్యాయి. ► షేక్ అబ్దుల్లా, నెహ్రూ మధ్య కుదిరిన ఢిల్లీ ఒప్పందం ప్రకారం 1954లో రాష్ట్రపతి ఉత్త ర్వుల మేరకు జమ్మూకశ్మీర్‌కు సంబంధించి 35ఏతోపాటు మరికొన్ని ఆర్టికల్స్‌ను రాజ్యాంగంలో చేర్చారు. ►1956లో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం రూపుదిద్దుకుంది. దాని ప్రకారం.. 1911కు పూర్వం అక్కడ జన్మించిన, వలస వచ్చిన వారే కశ్మీర్ పౌరులు. అంతేకాకుండా, 1911కు ముందు పదేళ్లకు తక్కువ కాకుండా అక్కడ ఉంటున్న వారికే స్థిరాస్తులపై హక్కుంటుంది. జమ్మూకశ్మీర్ నుంచి వలసవెళ్లిన వారు, ఇంకా పాకిస్తాన్ వెళ్లిన వారు కూడా రాష్ట్ర పౌరులుగానే పరిగణిస్తారు. శ్రీనగర్–నిట్ క్లాసులు బంద్ శ్రీనగర్‌లోని ప్రఖ్యాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో తరగతుల్ని నిరవధికంగా సస్పెండ్ చేస్తున్నట్లు సంస్థ రిజిస్టార్ తెలిపారు. తరగతులు ప్రారంభమయ్యే విషయమై తాము త్వరలోనే సమాచారం అందజేస్తామని వెల్లడించారు. శ్రీనగర్ జిల్లా యంత్రాంగం నుంచి అందిన ఆదేశాల నేపథ్యంలోనే ఈ ఉత్తర్వులు జారీచేస్తున్నామని చెప్పారు. అయితే ఈ ప్రకటనను జిల్లా కలెక్టర్ షాíß ద్ ఖండించారు. ‘శ్రీనగర్–నిట్‌ను మూసివేయాల్సిందిగా మేం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో రకరకాల వదంతులు చెలరేగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని మాత్రమే సూచించాం’ అని కలెక్టర్ షాహిద్ అన్నారు. నిత్యావసర దుకాణాలు, పెట్రోల్ బంకులు, ఏటీఎంల ముందు ప్రజలు క్యూకట్టారు. శ్రీనగర్‌లో పెట్రోల్‌బంక్ వద్ద స్థానికుల పడిగాపులు -
రోహిత్‌తో విభేదాలు.. అబద్ధపు ప్రచారమని కోహ్లి ఆవేదన
అవకాశం వచ్చినప్పుడల్లా రోహిత్ శర్మను ప్రశంసలతో ముంచెత్తాను. నాలో అభద్రతాభావం ఉంటే ఇలా చేసేవాడినా? భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందన ఇది. ఇటీవల తనకు, రోహిత్‌కు పడటం లేదంటూ గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి అతను తెర దించే ప్రయత్నం చేశాడు. ఎక్కడా దాటవేత ధోరణి లేకుండా ఈ అంశంపై కోహ్లి పూర్తి స్పష్టతనిచ్చాడు. పేరుకు వెస్టిండీస్‌తో సిరీస్‌కు బయల్దేరడానికి ముందు జరుగుతున్న అధికారిక మీడియా సమావేశమే అయినా రోహిత్‌తో సంబంధాల గురించే కోహ్లి వివరణ సుదీర్ఘంగా సాగింది. కోచ్ రవిశాస్త్రి కూడా కెప్టెన్‌తో జత కలిసి జట్టు ప్రయోజనాల కోసమే ఎవరైనా ఆడతారని, జట్టుకంటే ఎవరూ ఎక్కువ కాదంటూ ‘గాలివార్తలను’ కొట్టిపారేశాడు. కోహ్లి తాజా సమాధానాలతోనైనా విభేదాల వార్తలకు ఫుల్స్టాప్ పడుతుందో లేదో వేచి చూడాలి. ముంబై: భారత కెప్టెన్ కోహ్లి తన డిప్యూటీ రోహిత్ శర్మతో విభేదాల వార్తలపై పెదవి విప్పాడు. జట్టులో అంతా బాగుందని, ఎవరో కావాలని ఇలాంటివి పుట్టిస్తున్నారని ఒకింత అసహనాన్ని ప్రదర్శించాడు. టి20, వన్డే, టెస్టు సిరీస్‌లు ఆడేందుకు సోమవారం రాత్రి టీమిండియా సభ్యులు విండీస్ బయల్దేరారు. దానికి ముందు కోహ్లి, కోచ్ రవిశాస్త్రి మీడియాతో సంభాషించారు. విశేషాలు కోహ్లి మాటల్లోనే... రోహిత్‌తో విభేదాల గురించి వాస్తవాలేమిటి? నేను కూడా బయటి నుంచి కొన్ని రోజులుగా ఎన్నో విషయాలు వింటున్నాను. నిజంగా జట్టు సభ్యుల మధ్య సుహృద్భావ వాతావరణం లేకపోతే నాకు తెలిసి ఇంతటి విజయాలు సాధ్యం కావు. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో జట్టు ప్రదర్శనలో డ్రెస్సింగ్ రూమ్‌లో మంచి సంబంధాలు, నమ్మకం కూడా కీలక పాత్ర పోషిస్తాయి. గత 2–3 ఏళ్లలో మేం ఎన్నో గొప్ప ఘనతలు సాధించాం. వన్డేల్లో ఏడో స్థానం నుంచి నంబర్‌వన్‌కు చేరుకున్నాం. ఒకరిపై మరొకరికి పరస్పర విశ్వాసం, సమన్వయం, తగిన గౌరవం లేకపోతే ఇదంతా జరగకపోయేది. నిజంగా సంబంధాలు బాగా లేకపోతే అది మైదానంలో ప్రతిఫలిస్తుంది. ప్రచారంలో ఉన్న వార్తలపై స్పందన ఏమిటి? ఇవన్నీ చాలా చికాకు పరుస్తాయి. మేం జనంలోకి వెళితే మీరు వరల్డ్ కప్‌లో చాలా బాగా ఆడారంటూ ప్రశంసలు వినిపిస్తుంటే మరోవైపు ఇలాంటి హాస్యాస్పద మాటలు వినాల్సి రావడం దురదృష్టకరం. పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మన మెదళ్లలోకి వాటిని నింపి నిజమని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. జట్టుకు సంబంధించిన విజయాలు, సానుకూలాంశాల గురించి అసలేమీ తెలియనట్లుగా నటిస్తున్నారు. వ్యక్తిగత అంశాలను ఆటలోకి తీసుకురావడం అందరినీ అగౌరవపర్చడమే. నేను చాలా కాలంగా ఇలాంటివి అనుభవిస్తూనే ఉన్నాను. మా జట్టు డ్రెస్సింగ్ రూమ్ ఎంత బాగుంటుందో వచ్చి చూడండి. కుల్దీప్తో ఎలా మాట్లాడతాం, ధోనిలాంటి సీనియర్‌ను ఎలా ఆటపట్టిస్తామో వీడియో తీసి చూపించలేను కదా? రోహిత్‌తో అంతా బాగున్నట్లేనా! నా గురించి ఒక్క మాట చెబుతాను. నిజంగా నాకు ఎవరిపైనైనా కోపం ఉంటే అది నా ముఖంలో కనిపిస్తుంది. నాకు ఎలాంటి అభద్రతాభావం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా రోహిత్ శర్మను ప్రశంసించేందుకు ఎప్పుడూ వెనుకాడలేదు. ఎందుకంటే అతనిపై నాకు నమ్మకముంది. రోహిత్ దానికి అర్హుడు. నేను 10 ఏళ్లుగా, రోహిత్ 11 ఏళ్లుగా ఆడుతున్నాం. జట్టును ఈ స్థాయికి తెచ్చేందుకు నాలుగేళ్లుగా కలిసి ఎంతో కష్టపడ్డాం. ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తోంది. మేం బతికేది, శ్వాసించేది, ఏం చేసినా భారత క్రికెట్ బాగు కోసమే. మా మధ్య ఎలాంటి సమస్య లేదు. ఇలాంటివి పుట్టించి ఎవరు లాభపడుతున్నారో అర్థం కావడం లేదు. మిడిలార్డర్ సమస్యను ఎలా పరిష్కరిస్తారు? దీనిపై కచ్చితంగా ఇలాగే చేయాలంటూ పరిష్కారం ఏమీ లేదు. పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడమే. టాపార్డర్ బాగుందంటూ ప్రశంసించిన వారే మిడిలార్డర్‌కు బ్యాటింగ్ అవకాశం రాలేదంటారు. రాక రాక ఒక మ్యాచ్‌లో అవకాశం వచ్చి వారు విఫలమైతే 1–2 మ్యాచ్‌లతోనే వారి ప్రదర్శనను ఎలా అంచనా వేస్తాం! నాలుగో స్థానం గురించి బెంగ ఏమీ లేదు. ప్రపంచ కప్‌లో ఓడినంత మాత్రాన ఏదో ప్రమాదం జరిగినపోయినట్లు కాదు. రవిశాస్త్రికే నా ఓటు... కోచ్ రవిశాస్త్రితో తనకున్న అనుబంధాన్ని కోహ్లి మరోసారి ప్రదర్శించాడు. ఒకవైపు క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) హెడ్ కోచ్ ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానించి ఆ ప్రక్రియ కొనసాగుతుండగానే తన ఓటు మాత్రం శాస్త్రికేనని బహిరంగంగా మద్దతిచ్చేశాడు. ‘కోచ్ ఎంపిక విషయంపై సీఏసీ ఇప్పటి వరకైతే నన్ను ఏమీ అడగలేదు. అయితే నాకు, శాస్త్రికి మధ్య మంచి సమన్వయం ఉంది. ఆయన కోచ్‌గా కొనసాగాలని కోరుకుంటున్నా. నన్ను అభిప్రాయం అడిగితే మాత్రం ఇదే చెబుతా’ అని కోహ్లి స్పష్టం చేసేశాడు. రాబోయే విండీస్ పర్యటన ఎలా ఉండబోతోంది? మంచి ఆటకు, వినోదానికి అనువైన దేశం వెస్టిండీస్. ఈ టూర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ముందుగా టి20ల్లో కొత్త కుర్రాళ్లకు అవకాశం కల్పించి ప్రయత్నించాలని భావిస్తున్నాం. అయితే టెస్టు చాంపియన్‌షిప్ నేపథ్యంలో ఈ సారి టెస్టు సిరీస్ కూడా ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్న సాధారణ ద్వైపాక్షిక సిరీస్‌లతో పోలిస్తే ఇకపై ప్రతీ టెస్టులో సవాళ్లు, తీవ్రత ఎక్కువ ఉంటాయి. టెస్టులు బతికేందుకు ఇది చాలా అవసరం. నా దృష్టిలో కూడా మొదటి ప్రాధాన్యత, నేను ఇష్టపడేది కూడా సుదీర్ఘ ఫార్మాట్‌నే. -
వదంతులపై స్పందించిన డీజీపీ మహేందర్‌రెడ్డి
-
సింగిల్‌గా ఉన్నవాళ్లను లింక్ చేసేస్తారు!
ప్లేస్ మారినా గాసిప్ మారేట్లు లేదు. ఒకచోట వేసిన రికార్డ్‌నే మరో చోట వేయాల్సి వస్తోంది. సినిమా రికార్డులతో ఆనందపడే సెలబ్రిటీలకు ఇలా.. గాసిప్పుల విషయంలో వేసిన రికార్డునే మళ్లీ మళ్లీ వేయడం చిరాకే. కానీ ఆ చిరాకుని బయటపెట్టకుండా చక్కగా సమాధానం చెప్పాలి. లేకపోతే ‘తెగ పోజు’ అని ట్యాగ్ వేసేస్తారు. ఇవన్నీ రకుల్ ప్రీత్‌సింగ్‌కి తెలియదా? ఏంటి. అందుకే హైదరాబాద్‌లో అడిగిన అదే ప్రశ్నను.. ముంబైలో అడిగితే.. ఇక్కడ చెప్పినట్లే నవ్వుతూ సమాధానం చెప్పారు. ‘రానాతో డేటింగ్ అట’ అన్నదే ఆ ప్రశ్న. ‘అలాంటిదేం లేదు’ అని ముంబై మీడియాతో అన్నారు రకుల్. ఇంకా వివరంగా చెబుతూ –‘‘మా గ్రూప్‌లో మేం మొత్తం 15 నుంచి 20 మంది ఉంటాం. వాళ్లల్లో రానా కూడా ఉన్నారు. కానీ మా ఇద్దరి గురించి చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. రానా, నేను మంచి ఫ్రెండ్స్. నేను హైదరాబాద్‌లో ఉంటాను. అమ్మానాన్న ఢిల్లీలో ఉంటారు. ఇక్కడ నాకంతా ఫ్రెండ్సే. మేమంతా ఎప్పుడూ కలుస్తుంటాం. మా గ్రూప్‌లో ఇద్దరు ముగ్గురు మాత్రమే పెళ్లి కానివాళ్లు. దాంతో సింగిల్‌గా ఉన్న మాలాంటివాళ్లను లింక్ చేసి వార్తలు పుట్టిస్తారనుకుంటున్నా’’ అన్నారు రకుల్. -
అది కడుపు కాదయ్యో!
వార్నీ... ఒక్క ఫొటో ఎంత పని చేసేసింది. పాప్ సింగర్ మైలీ సైరస్‌ని ఏకంగా ప్రెగ్నెంట్ చేసేసింది. దాంతో పాతికేళ్ల ఈ అమ్మాయిగారు ‘అది కడుపు కాదయ్యో...’ అని తన కడుపు చించుకుని మరీ చెప్పుకోవలసి వచ్చింది. దీనంతటికీ కారణం ఇన్సెట్లో ఓ ఫొటో ఉంది చూశారూ... అదే! మొన్న 23వ తేదీన ఆ ఫొటో దిగారు. 23న మైలీ సైరస్ బర్త్‌డే. అదే విధంగా అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ డే. రెండూ కలసి రావడంతో ఇంట్లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పెద్ద పార్టీ ఇచ్చారు. డైటింగ్... గీటింగ్... వంటివన్నీ పక్కన పెట్టేసి మిలీ కూడా ఫుల్లుగా లాగించేశారు. అప్పుడు... పార్టీ చివర్లో ఫొటో దిగి ట్విట్టర్లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. కడుపులో లోడ్ ఎక్కువ అయ్యిందేమో... పొట్ట కొంచెం పెద్దగా, చిన్న సైజ్ బేబీ బంప్ టైపులో వచ్చింది. అంతే... అక్కడి మీడియా జనాలకు డౌటొచ్చింది! ఇంకేముంది? వెంటనే ‘మైలీ సైరస్ ప్రెగ్నెంట్. కావాలంటే ఈ బేబీ బంప్ చూడండి’ అని వార్తలు రాసేశారు. అవన్నీ చూసిన తర్వాత అమ్మాయిగారికి కోపం రావడం కామనే కదా! కోపంలోనే ‘‘కొంచెం కూడా సభ్యత లేదా? నేను ప్రెగ్నెంట్ కాదు. కొంచెం ఎక్కువ తిన్నానంతే’’ అని క్లారిటీ ఇచ్చారు. అదండీ సంగతి. అన్నట్టు... మైలీ సైరస్ ఎవరితో డేటింగ్ చేస్తున్నారో? చెప్పలేదు కదూ! ‘ది హంగర్ గేమ్స్’ ఫేమ్ లియామ్ హేమ్స్‌వర్త్‌తో!! -
'తిరుమల ఆలయం మూసేయలేదు'
తిరుమల: భారీ వర్షాలతో శ్రీవారి ఆలయం మూసి వేసినట్టు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం అవాస్తవమని జేఈవో నివాసరాజు తెలిపారు. 20 రోజులు కింద 5 శాతం ఉన్న నీరు వర్షాలతో ఇప్పుడు 100 శాతానికి చేరిందన్నారు. ఏటా కురవాల్సిన 136 సెంటీమీటర్ల వర్షపాతం కంటే ఈ ఏడు ఇప్పటివరకు మొత్తం 193 సెంటీమీటర్లు కురిసిందన్నారు. నవంబరు మాసంలో ఇప్పటి వరకు మొత్తం 139 సెంటీమీటర్లు కురిసిందని, దీనివల్ల అన్ని జలాశయాలు నిండాయని తెలిపారు. శ్రీవారి ఆలయంలో చిన్నపాటి నీరు నిలిచినా వాటిని తక్షణం తొలగించే యంత్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. వర్షాలకు రెండోఘాట్లో మట్టి కరిగిపోవడంతో రాళ్లు కూలిన మాట వాస్తవమేనన్నారు. దీనిపై టీటీడీ ఇంజినీరింగ్ విభాగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ రేయింబవళ్లు మరమ్మతులు చేస్తోందని అన్నారు. రెండు రోజుల్లో ఘాట్ రోడ్డులో మరమ్మతులు పూర్తి చేసి వాహనాలను అనుమతిస్తామని నివాసరాజు చెప్పారు.