సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: మాజీమంత్రి కొడాలి నాని ఆరోగ్యంపై వస్తున్న వార్తలను గుడివాడ వైఎస్సార్‌సీపీ నాయకులు ఖండించారు. కొడాలి నాని అనారోగ్యానికి గురయ్యారని రెండు రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు.
కొడాలి నానిని రాజకీయంగా ఎదుర్కోలేకే ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎన్టీఆర్ స్టేడియం వైస్ ఛైర్మన్ పాలేటి చందు విమర్శించారు. ఆయన్ను మానసికంగా దెబ్బతీయడానికే సోషల్ మీడియా, కొన్ని శాలిలైట్ ఛానల్స్‌లో ఇలాంటి ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. జులై 8న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా మంత్రి విడదల రజనీతోపాటు కొడాలి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు.
జులై 9న స్వర్గీయ అడపా బాబ్జి జయంతిలో పాల్గొన్నారు. కొండాలమ్మ అమ్మవారికి ఆషాడం సారెను కూడా సమర్పించారని పేర్కొన్నారు. కొడాలి నానిని రాజకీయంగా ఏమీ చేయలేకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడాలి నానిని ఏదైనా చెయ్యాలంటే 2 లక్షల మంది గుడివాడ ప్రజలను దాటుకుని రావాలని తెలిపారు.
కొడాలి నానిని ఓడించడానికి పచ్చ మీడియా, తెలుగుదేశం పార్టీ చాలా కష్టపడుతోందని అన్నారు. వాళ్లు ఎంత ప్రయత్నించినా గుడివాడ ప్రజలు ఆయనకు వలయంగా ఉంటారని చెప్పారు. రెండు దశాబ్ధాలుగా గుడివాడ ప్రజల గుండెల్లో కొడాలి నాని స్థానం సంపాదించుకున్నారని, ఇప్పటికైనా ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.
చదవండి: బాబు నుంచి పవన్‌కు రిపోర్టు వచ్చిందేమో: కొట్టు సత్యనారాయణ సెటైర్లు
Comments
Please login to add a commentAdd a comment