![Kodali Nani Fires On Chandrababu And Tdp Leaders - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/28/kodali-nani-02.jpg.webp?itok=3WBjItNV)
సాక్షి, కృష్ణా జిల్లా: స్క్రాప్ బ్యాచ్ అంతా రాజమండ్రిలో మహానాడు సభ పెట్టుకున్నారంటూ మాజీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. గుడివాడలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన.. నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎన్టీఆర్ పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచేందుకు బాబు సిద్ధమయ్యారని, చంద్రబాబు కుక్క బతుక్కి వచ్చే ఎన్నికల్లో చెప్పుదెబ్బ తప్పదని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్‌కు దుమ్ముంటే గన్నవరంలో పోటీ చేయాలని సవాల్ విసిరారు.
‘‘ఎన్టీఆర్ ఉంటే పార్టీ, రాష్ట్రం నాశనం అవుతుందన్న చంద్రబాబు.. గతిలేక రాజకీయంగా బతకడానికి తిరిగి ఎన్టీఆర్ పేరు వాడుకుంటున్నాడు. రాజకీయాలంటే బట్టల వ్యాపారమా.. ఆకర్షణీయమైన మేనిఫెస్టో పెట్టడానికి.. చంద్రబాబు ఆకర్షణీయమైన అబద్ధాలు, వెన్నుపోట్లు ప్రజలందరికీ తెలుసు. దేశమంతా తిరిగినా చంద్రబాబు లాంటి నీచ రాజకీయ నాయకుడు మరొకరు ఉండరు’’ అంటూ కొడాలి నాని నిప్పులు చెరిగారు.
చదవండి: NTR ఫ్యామిలీలో ఒకే ఒక్క మగాడు తారక్: ఆర్జీవీ
Comments
Please login to add a commentAdd a comment