ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కొడాలి నాని జోస్యం | Kodali Nani Slams On Opposition Leaders In Gudivada | Sakshi
Sakshi News home page

ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కొడాలి నాని జోస్యం

Published Fri, Mar 1 2024 10:15 AM | Last Updated on Fri, Mar 1 2024 2:17 PM

Kodali Nani Slams On Opposition Leaders In Gudivada - Sakshi

సాక్షి, కృష్ణా: సూర్యుడు పడమర ఉదయించిన సరే సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డినే ప్రమాణస్వీకారం చేస్తారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. శుక్రవారం ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కొడాలి నాని జోస్యం చెప్పారు.

‘మే నెలాఖరున సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేయకుండా ఆపగలిగేవారు రాష్ట్రంలో లేరు. చంద్రబాబు.. పవన్‌.. సోనియా ఎంతమంది కలిసి వచ్చినా సరే. సీఎం జగన్‌ను అధికారం నుండి దింపగలిగే శక్తి సామర్థ్యాలు ఎవరికి లేవు. నవ్వుతూ జైలుకెళ్ళిన సీఎం జగన్. 16 నెలల తర్వాత కూడా అదే చిరునవ్వుతో బయటకు వచ్చాడు. 

...సీఎం జగన్ ముఖంలో నవ్వు తప్ప మరొకటి కనిపించదు. మాడు ముఖం, చించుకోవడం, ఫ్రస్టేషన్, గంతులు వేయడం ఇది ప్రతిపక్షాల తిరు. ఇలాంటి సైకోలందరూ కలిసి సీఎం జగన్‌ను వేధిస్తున్నారు. 58 నెలల పాలనలో ఆర్థిక సమస్యలు తలెత్తినా.. కరోనా ఇబ్బందులు వచ్చినా. ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా జగన్ పాలించాడు. అదే చంద్రబాబు అయితే ఇంట్లో పడుకొని.. కరోనా కష్టాలతో ప్రజలను పస్తులుంచేవాడు’ అని కొడాలి నాని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement