వాషింగ్టన్: ఒకప్పుడు అమెరికాలో చైనా రాయబారిగా పనిచేసి వెంటనే అత్యున్నత పదవి పొంది చైనా విదేశాంగ మంత్రిగా సేవలందించిన క్విన్ గాంగ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారనే విషయంపై అంతర్జాతీయ మీడియా కొత్త అంశాలను మోసుకొచి్చంది. చివరిసారిగా జూన్ నెలలో కనిపించిన ఆయన ప్రస్తుతం జీవించి లేరని మీడియాలో వార్తలొచ్చాయి. ఆత్మహత్య చేసుకున్నారని కొన్ని పత్రికల్లో, చైనా ప్రభుత్వమే హింసించి చంపిందని మరి కొన్నింటిలో భిన్న కథనాలు వెలువడ్డాయి.
ఈ ఏడాది జూన్‌లో చివరిసారిగా కనిపించి అప్పటి నుంచి కనిపించకుండా పోయిన క్విన్‌గాంగ్ ఉదంతం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. జూలై నెలలో బీజింగ్‌లోని మిలటరీ ఆస్పత్రిలో ఆయన కన్నుమూశారని చైనా ప్రభుత్వంలోని ఇద్దరు అత్యున్నత స్థాయి అధికారులు చెప్పినట్లు ‘పొలిటికో’ వార్తాసంస్థ ఒక కథనం వెలువరిచింది. క్విన్ అమెరికాలో చైనా రాయబారిగా కొనసాగిన కాలంలో ఆయన నెరిపిన ఒక వివాహేతర సంబంధమే ఈ అదృశ్యం ఘటనకు అసలు కారణమని గతంలో వాల్‌స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది.
ఈ విషయంలో చైనా ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తునకు ఆయన సహకరించారట. ‘‘అమెరికా పౌరసత్వమున్న చైనా అధికారిక ఫీనిక్స్ టీవీ మహిళా రిపోర్టర్ ఫ్యూ గ్జియోíÙయాన్‌తో వివాహేతర సంబంధం కారణంగా చైనా జాతీయ భద్రత ప్రమాదంలో పడిందని జిన్‌పింగ్ సర్కార్ బలంగా నమ్మింది. ఆ మహిళ సరోగసీ పద్ధతిలో ఒక బిడ్డకు జన్మనిచి్చంది. ఇప్పుడా తల్లీబిడ్డల ఆచూకీ సైతం గల్లంతైంది.
క్విన్‌గాంగ్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని జిన్‌పింగ్ వెంటనే ఆయనను జూన్‌లో చైనా విదేశాంగ శాఖ మంత్రి పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో మాజీ దౌత్యవేత్త వాంగ్ యీను పదవిలో కూర్చోబెట్టారు’’ అని ఆ కథనం పేర్కొంది. కేవలం ఆరునెలలు పదవిలో ఉన్న క్విన్‌గాంగ్ ఆ తర్వాత కనిపించకుండా పోయారు. 2014–2018 కాలంలో దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌కు చీఫ్ ప్రోటోకాల్ ఆఫీసర్‌గా పనిచేసి క్విన్ ఆయనకు అత్యంత ఆప్తుడయ్యాడు. అందుకే అత్యంత నమ్మకస్తులకు మాత్రమే దక్కే ‘అమెరికాలో చైనా రాయబారి’ పదవిని క్విన్‌కు జిన్‌పింగ్ కట్టబెట్టారు.
వివాహేతర బంధమే క్విన్‌గాంగ్ మరణానికి కారణమన్న అంతర్జాతీయ మీడియా
Comments
Please login to add a commentAdd a comment