international media
-
రష్యాకు ఎదురుదెబ్బ
కీవ్: ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యాకు బుధవారం భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒక కమాండర్ రాక కోసం శిక్షణాప్రాంతం వద్ద గుమిగూడిన సైనికులపై రెండు క్షిపణిలు వచ్చి పడ్డాయి. దీంతో 60 మంది రష్యా సైనికులు మరణించారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అయితే ఈ ఘటనపై రష్యా రక్షణ మంత్రి సెర్గియో షొయిగూ నోరు మెదపలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీకి కొద్దిసేపటికి ముందే ఈ దాడి జరగడం గమనార్హం. ఇతర ప్రాంతాల్లో రష్యా సైన్యం విజయాలను పుతిన్‌కు వివరించిన సెర్గియో ఈ దాడి వివరాలను మాత్రం వెల్లడించలేదు. రష్యా ఆక్రమణలో ఉన్న ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం డొనెట్కŠస్ రీజియన్‌లో ఈ దాడి ఘటన చోటుచేసుకుంది. సెర్బియా ప్రాంతంలో ఉండే 36వ రైఫిల్ బ్రిగేడ్ ట్రుడోవ్స్కే గ్రామంలో ఒక మేజర్ జనరల్ రాకకోసం వేచి చూస్తుండగా ఈ దాడి జరిగింది. ఒకే చోట డజన్లకొద్దీ జవాన్లు విగతజీవులుగా పడి ఉన్న వీడియో ఒకటి అంతర్జాతీయ మీడియాలో ప్రసారమైంది. అమెరికా తయారీ హై మొబిలిటీ ఆరి్టలరీ రాకెట్ సిస్టమ్(హిమార్స్) నుంచి దూసుకొచి్చన మిస్సైళ్లే ఈ విధ్వంసం సృష్టించాయని రష్యా చెబుతోంది. మరోవైపు రష్యా వ్యతిరేకంగా సైనిక వార్తలు రాసే బ్లాగర్ ఆండ్రీ మొరజోవ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈయన టెలిగ్రామ్ చానెల్‌కు లక్ష మంది చందాదారులు ఉన్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో చాలా ప్రాంతాల్లో రష్యా తోకముడిచిందంటూ, వేల మంది సైనికులు చనిపోయారని తాను రాసిన విశ్లేషణాత్మక కథనాలను వెంటనే తొలగించాలంటూ రష్యా సైన్యం నుంచి ఈయన చాన్నాళ్లుగా ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాడు. ఇంకెవరో వచ్చి చంపే బదులు తానే కాల్చుకుని చస్తానని తన బ్లాగ్‌లో రాశాడని వార్తలొచ్చాయి. ఇప్పటిదాకా యుద్ధంలో రష్యా 45వేలకుపైగా సైన్యాన్ని కోల్పోయిందని ‘బీబీసీ రష్యా’ తెలిపింది. -
చైనా విదేశాంగ మంత్రి అదృశ్యం.. హత్యా? ఆత్మహత్యా?
వాషింగ్టన్: ఒకప్పుడు అమెరికాలో చైనా రాయబారిగా పనిచేసి వెంటనే అత్యున్నత పదవి పొంది చైనా విదేశాంగ మంత్రిగా సేవలందించిన క్విన్ గాంగ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారనే విషయంపై అంతర్జాతీయ మీడియా కొత్త అంశాలను మోసుకొచి్చంది. చివరిసారిగా జూన్ నెలలో కనిపించిన ఆయన ప్రస్తుతం జీవించి లేరని మీడియాలో వార్తలొచ్చాయి. ఆత్మహత్య చేసుకున్నారని కొన్ని పత్రికల్లో, చైనా ప్రభుత్వమే హింసించి చంపిందని మరి కొన్నింటిలో భిన్న కథనాలు వెలువడ్డాయి. ఈ ఏడాది జూన్‌లో చివరిసారిగా కనిపించి అప్పటి నుంచి కనిపించకుండా పోయిన క్విన్‌గాంగ్ ఉదంతం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. జూలై నెలలో బీజింగ్‌లోని మిలటరీ ఆస్పత్రిలో ఆయన కన్నుమూశారని చైనా ప్రభుత్వంలోని ఇద్దరు అత్యున్నత స్థాయి అధికారులు చెప్పినట్లు ‘పొలిటికో’ వార్తాసంస్థ ఒక కథనం వెలువరిచింది. క్విన్ అమెరికాలో చైనా రాయబారిగా కొనసాగిన కాలంలో ఆయన నెరిపిన ఒక వివాహేతర సంబంధమే ఈ అదృశ్యం ఘటనకు అసలు కారణమని గతంలో వాల్‌స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. ఈ విషయంలో చైనా ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తునకు ఆయన సహకరించారట. ‘‘అమెరికా పౌరసత్వమున్న చైనా అధికారిక ఫీనిక్స్ టీవీ మహిళా రిపోర్టర్ ఫ్యూ గ్జియోíÙయాన్‌తో వివాహేతర సంబంధం కారణంగా చైనా జాతీయ భద్రత ప్రమాదంలో పడిందని జిన్‌పింగ్ సర్కార్ బలంగా నమ్మింది. ఆ మహిళ సరోగసీ పద్ధతిలో ఒక బిడ్డకు జన్మనిచి్చంది. ఇప్పుడా తల్లీబిడ్డల ఆచూకీ సైతం గల్లంతైంది. క్విన్‌గాంగ్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని జిన్‌పింగ్ వెంటనే ఆయనను జూన్‌లో చైనా విదేశాంగ శాఖ మంత్రి పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో మాజీ దౌత్యవేత్త వాంగ్ యీను పదవిలో కూర్చోబెట్టారు’’ అని ఆ కథనం పేర్కొంది. కేవలం ఆరునెలలు పదవిలో ఉన్న క్విన్‌గాంగ్ ఆ తర్వాత కనిపించకుండా పోయారు. 2014–2018 కాలంలో దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌కు చీఫ్ ప్రోటోకాల్ ఆఫీసర్‌గా పనిచేసి క్విన్ ఆయనకు అత్యంత ఆప్తుడయ్యాడు. అందుకే అత్యంత నమ్మకస్తులకు మాత్రమే దక్కే ‘అమెరికాలో చైనా రాయబారి’ పదవిని క్విన్‌కు జిన్‌పింగ్ కట్టబెట్టారు. వివాహేతర బంధమే క్విన్‌గాంగ్ మరణానికి కారణమన్న అంతర్జాతీయ మీడియా -
వివిధ దేశాల మీడియాలను లొంగదీసుకుంటున్న చైనా!
...వివిధ దేశాల మీడియాలను లొంగదీసుకుంటున్న చైనా! -
బీజేపీ భారీ విజయం.. ఫలితాలపై అంతర్జాతీయ మీడియా స్పందన ఇదే
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నాలుగు స్టేట్స్లో భారీ విజయాన్ని అందుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్నఈ ఎన్నికలను కేంద్రంలోని బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో ప్రచారంపై ఫుల్ ఫోకస్ పెట్టి భారీ మెజార్టీతో కాషాయ జెండాను ఎగురవేసింది. కాగా, ఈ ఎన్నికల ఫలితాలు ప్రజాస్వామ్య విజయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దేశంలో హోలీ పండుగ ముందుగానే వచ్చిందని అన్నారు. బీజేపీ నిర్ణయాలు, విధానాలపై నమ్మకం పెరిగిందని, బీజేపీ స్థానాల సంఖ్య పెరిగిందని తెలిపారు. మహిళలు, యువత బీజేపీకి అండగా నిలిచారని, తొలిసారి ఓటేసిన యువకులు బీజేపీకి పట్టం కట్టారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా దేశంలో అసెంబ్లీ ఎన్నికలపై అంతర్జాతీయ మీడియా సైతం స్పందించింది. ప్రముఖ పత్రిక DAWN ఎన్నికల ఫలితాలపై ఓ కథనాన్ని రాసింది. దీనిలో బీజేపీ భారీ విజయాన్ని అందుకుందని పేర్కొంది. బీజేపీపై వ్యతిరేకత ఉన్నప్పటికీ విజయం సాధించిందని తెలిపింది. కోవిడ్ కట్టడి, ఉద్యోగాల కొరత, వ్యవసాయ చట్టాల అమలుపై ఒకానొక సమయంలో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉన్నా.. ఎన్నికలపై ఆ ప్రభావం కనిపించలేదని వెల్లడించింది. మరోవైపు కరోనా సమయంలో పేదలకు ఉచిత రేషన్, అయోధ్య రామమందిర నిర్మాణం వంటి అంశాలు బీజేపీకి పాజిటివ్‌గా మారాయని రాసుకొచ్చింది. కొన్ని పథకాలు ప్రజలకు ఆకర్షించాయని పేర్కొంది. దీంతో ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకున్నట్టు తెలిపింది. అలాగే.. ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపుపై కూడా కీలక కామెంట్స్ చేసింది. పంజాబ్‌లో ఆప్ ఘన విజయం సాధించిందని తెలిపింది. 2012 లో అవినీతి వ్యతిరేక ఉద్యమం నుండి ఉద్భవించిన కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ తక్కువ కాలంలో ప్రజల ఆదరణను పొందినట్టు పేర్కొంది. ఢిల్లీ, పంజాబ్‌లో విజయాలు సాధించినట్టు రాసుకొచ్చింది. మరోవైపు Al Jazeera కూడా ఫలితాలపై స్పందించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీపార్టీలు ఘన విజయాన్నిఅందుకున్నాయని తెలిపింది. బీజేపీ, ఆప్ పార్టీలు ప్రజల ఆదరణతో గెలుపొందినట్టు వివరించింది. -
షరియా.. ఉల్లంఘిస్తే ఉరే
కాబూల్: అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు మళ్లీ హస్తగతం చేసుకోవడంతోపాటు తమ పాలనను ప్రజలపై రుద్దడానికి ప్రయత్నాలు ప్రారంభించిన నేపథ్యంలో షరియా చట్టంపై ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది. అఫ్గాన్‌లో తాలిబన్లు షరియా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తారని, మహిళలకు ఇక కష్టాలు తప్పవని, వారు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కోల్పోతారని, మగవాళ్ల కింద బానిసలుగా మారిపోతారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ చట్టానికి తాలిబన్లు తమదైన సొంత భాష్యం చెబుతున్నారు. నిజానికి షరియా అనేది ఇస్లాం లో ఒక చట్టబద్ధమైన వ్యవస్థ అంటున్నారు. షరియా చట్టం కింద అఫ్గానిస్తాన్‌లోని మహిళలు వారి హక్కులను సంపూర్ణంగా అనుభవించవచ్చని భరోసా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్ల పాలనలో ఈ చట్టం కింద మహిళల స్థితిగతులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.. ► మహిళలు మార్కెట్‌కు వెళ్లొచ్చా? వెళ్లొచ్చు. అయితే, వారి కుటుంబానికే చెందిన ఒక పురుషుడు తప్పనిసరిగా తోడుగా ఉండాలి. ఒంటరిగా బయట అడుగు పెట్టడానికి వీల్లేదు. ► బయటకు వెళ్లి స్నేహితులతో సరదాగా గడపొచ్చా? ఎంతమాత్రం కుదరదు. మహిళల సరదాలు, సంతోషాలు ఇంటికే పరిమితం. బయటకు వెళ్లి దొరికిపోతే కఠిన శిక్షలుంటాయి. ► మగ స్నేహితులను కలవొచ్చా? 12 ఏళ్ల వయసు దాటిన పరాయి పురుషులతో, కుటుంబ సభ్యులు కాని మగవాళ్లతో మాట్లాడటానికి అనుమతి లేదు. ► చదువుకోవచ్చా? మహిళలు చదువుకోవచ్చు. కానీ, బయట స్కూల్, కాలేజీల్లో కాదు. ఇళ్లల్లోనే చదువు నేర్చుకోవాలి. స్కూళ్లు, కాలేజీలు, మదర్సాలు కేవలం మగవాళ్ల కోసమే. ► మేకప్ వేసుకోవచ్చా? మహిళలు కనీసం గోళ్ల రంగుతో సహా ఎలాంటి మేకప్ వేసుకోవడానికి తాలిబన్లు అనుమతించరు. ► సంగీతం, నృత్యం నేర్చుకోవచ్చా? షరియా కింద సంగీతం చట్టవిరుద్ధం. డ్యాన్స్ కూడా నేర్చుకోవద్దు. వేడుకల్లో పాటలు పాడిన వారిని, నృత్యాలు చేసిన వారిని తాలిబన్లు గతంలో శిక్షించారు. ► కార్యాలయాల్లో పని చేయవచ్చా? చేసుకోవచ్చు. బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేసే మహిళలు ఇళ్లకు తిరిగి వెళ్లేటప్పుడు తాలిబన్లు ఎస్కార్టుగా వస్తుంటారట. మహిళల బదులు వారి కుటుంబాల్లోని మగవాళ్లను ఉద్యోగాలకు పంపించాలని సూచిస్తుంటారట. ► బుర్ఖా తప్పనిసరిగా ధరించాలా? అవును ధరించాల్సిందే. షరియా చట్టం ప్రకారం మహిళలు తమ అందాన్ని బహిర్గతం చేయకూడదు. 8 ఏళ్లు దాటిన ప్రతి బాలిక బయటకు వెళ్లి నప్పుడల్లా బుర్ఖా ధరించాలి. బయటకు వెళ్లి ఎవరితోనైనా మాట్లాడాల్సి వస్తే కుటుంబ సభ్యుల్లోని మగవారిని తోడుగా తీసుకెళ్లాలి. ► బిగ్గరగా మాట్లాడొచ్చా? అలా మాట్లాడొద్దు. మహిళలు అందరికీ వినిపించేలా గట్టిగా మాట్లాడడం నేరం. ► హై హీల్స్ సంగతేంటి? ఎత్తు మడమల చెప్పులు, బూట్లను తాలిబన్లు నిషేధించారు. మహిళలు నడిచేటప్పుడు శబ్దం రాకూడదు. ► ఇంటి బాల్కనీలో కూర్చోవచ్చా? తాలిబన్ల పాలనలో బాల్కనీల్లో మహిళలు కనిపించకూడదు. ఇంటి లోపలే ఉండాలి. ► సినిమాల్లో నటించవచ్చా? మహిళలు సినిమాల్లో నటించడం, వారి ఫొటోలను వార్తా పత్రికల్లో, పుస్తకాల్లో, పోస్టర్లలో ప్రచురించడం నిషిద్ధం. మోడలింగ్ చేయరాదు. ► షరియా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏమవుతుంది? ఈ చట్టాన్ని ఉల్లంఘించడాన్ని తాలిబన్లు సీరియస్‌గా తీసుకుంటారు. కొరడాలతో కొట్టడం, రాళ్లతో కొట్టి చంపడం, బహిరంగంగా ఉరి తీయడం వంటి కఠినమైన శిక్షలు విధిస్తారు. -
జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలే లక్ష్యం
బోస్టన్: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పెగసస్ స్పైవేర్ ప్రధాన లక్ష్యం జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు, రాజకీయ నేతలేనని అంతర్జాతీయ మీడియా పరిశోధనలో తేలింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ రూపొందించిన ఈ సాఫ్ట్వేర్ పలువురు ప్రముఖుల వ్యక్తిగత సమాచారాన్ని హ్యాక్ చేసిందన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. స్పైవేర్‌తో సంపాదించిన 50వేలకు పైగా ఫోన్ నెంబర్ల జాబితా ఫొరిబిడెన్ స్టోరీస్ అనే ఎన్జీఓకు, అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు దొరికింది. ఈ జాబితాను ప్రముఖ మీడియా గ్రూపులు విశ్లేషించాయి. 50 దేశాల్లో వెయ్యికి పైగా కీలక వ్యక్తులు నెంబర్లను ఇందులో గుర్తించారు. వీరిలో 189 మంది జర్నలిస్టులు, 600మంది రాజకీయవేత్తలు, 65మంది వ్యాపారులు, 85మంది మానవహక్కుల కార్యకర్తల నెంబర్లు ఇందులో ఉన్నాయని వాషింగ్టన్ పోస్టు ప్రకటించింది. సీఎన్ఎన్, అసోసియేటెడ్ ప్రెస్, రాయిటర్స్, వాల్‌స్ట్రీట్ జర్నల్, ఫైనాన్షియల్ టైమ్స్ తదితర దిగ్గజ సంస్థల జర్నలిస్టుల నెంబర్లు ఈ జాబితాలో ఉన్నాయని తెలిపింది. ప్రముఖ జర్నలిస్టు ఖషోగ్గి హత్యకు నాలుగు రోజుల ముందు ఆయనకు కాబోయే భార్య ఫోనులో ఈ స్పైవేర్ ఇన్‌స్టాలైందని అమ్నెస్టీ తెలిపింది. ఈ ఆరోపణలన్నింటినీ ఎన్ఎస్ఓ కొట్టిపారేసింది. తాము ఎప్పుడూ ఎలాంటి టార్గెట్ల జాబితాను ఉంచుకోవమని తెలిపింది. తమపై వచ్చిన కథనాలు నిరాధారాలని నిందించింది. అయితే ఈ వివరణలను విమర్శకులు తోసిపుచ్చుతున్నారు. కాగా, తమకు లభించిన జాబితాలో 15వేలకు పైగా నంబర్లు మెక్సికోకు చెందినవని మీడియా వర్గాలు తెలిపాయి. తర్వాత అధిక సంఖ్యలో మధ్యప్రాచ్యానికి చెందిన ఫోన్లున్నట్లు తెలిపాయి. నిఘా స్పైవేర్‌కు సంబంధించి ఎన్ఎస్ఓ గ్రూప్‌పై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గతేడాది ఇజ్రాయిల్ కోర్టులో దావా వేసింది. అయితే సరైన ఆధారాలు లేవని కోర్టు ఈ పిటిషన్ కొట్టేసింది. ఆటంకవాదుల నివేదిక: షా పెగసస్ స్పైవేర్ అంశంపై కాంగ్రెస్, అంతర్జాతీయ సంస్థలపై హోంమంత్రి అమిత్‌షా ఎదురుదాడి చేశారు. ప్రముఖుల ఫోన్లపై నిఘా పెట్టారన్న నివేదికను భారత ప్రగతిని అడ్డుకునేందుకు కుట్రతో ఆటంకవాదులు రూపొందించిన అవాంతరాల నివేదికగా అభివర్ణించారు. పార్లమెంట్ సమావేశాల తరుణంలోనే ఎంపిక చేసినట్లు లీకేజీలు బయటకు రావడాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ నుంచి ఇలాంటి దాడులు ఊహించినవేనని షా విమర్శించారు. వారి పార్టీని వారు సరిదిద్దుకోలేని వారు పార్లమెంట్లో అభివృద్ధికర అంశాలను అడ్డుకునే యత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ సమయంలో ప్రజాసంక్షేమాన్ని వదిలి ఇలాంటి అసత్య నివేదికలతో సభా సమయం వృధా చేయడం మంచిది కాదని హితవు చెప్పారు. జాబితాలో రాహుల్, ప్రశాంత్ నంబర్లు! కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బీజేపీ మంత్రులు అశ్విన్ వైష్ణవ్, ప్రహ్లాద్ సింగ్ పాటిల్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా ఫోన్ నంబర్లు పెగసస్ హ్యాకింగ్ జాబితాలో ఉన్నాయని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. పెగసస్‌తో లక్ష్యంగా చేసుకున్నవారి జాబితాలో 300 మందికిపైగా భారతీయులున్నట్లు ‘ది వైర్’ వార్తా సంస్థ పేర్కొంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, మాజీ సీజేఐ రంజన్ గొగోయ్‌పై ఆరోపణలు చేసిన సుప్రీంకోర్టు ఉద్యోగి, ఆమె చుట్టాల నంబర్లు ..ప్రముఖ వైరాలజిస్టు గగన్‌దీప్ కాంగ్, వసుంధరరాజే పర్సనల్ సెక్రటరీ తదితరులున్నారు. భారత్‌పై బురద జల్లేందుకే...! పెగాసస్ అనే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి పలువురు ప్రముఖులపై నిఘా పెట్టారన్న వార్తలను కేంద్రం ఐటీ మంత్రి అశ్విన్ వైష్ణవ్ కొట్టిపారేశారు. పార్లమెంట్ సమావేశాలు ఆరంభమవుతున్నవేళ దేశ ప్రజాస్వామ్యానికి అపత్రిçష్ట అంటించేందుకే ఈ కథనాలను వండివారుస్తున్నారని విమర్శించారు. దేశంలో ఎంతో పటిçష్టమైన వ్యవస్థలున్నాయని, అందువల్ల భారత్‌లో అక్రమ, అనైతిక నిఘా అసాధ్యమని చెప్పారు. ఈఅంశాన్ని పార్లమెంట్లో ప్రతిపక్షాలు లేవనెత్తడంతో మంత్రి లోక్‌సభలో ఈ వివరణ ఇచ్చారు. మీడియా జాబితాలో ఫోన్ నెంబరున్నంతమాత్రాన హ్యాకింగ్ జరిగినట్లు కాదని ఐటీ మంత్రి వ్యాఖ్యానించారు. పెగాసస్‌ను ప్రభుత్వం వాడుతున్నదీ లేనిదీ తెలపలేదు. అమిత్‌షా తొలగింపునకు కాంగ్రెస్ డిమాండ్ జాతీయ భద్రతను ప్రమాదంలోకి నెట్టిన పెగసస్ స్పైవేర్ అంశంలో హోంమంత్రి అమిత్‌షాను పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ అంశంలో ప్రధాని మోదీ పాత్రపై లోతైన విచారణ జరపాలని కోరింది. పెగసస్ అంశానికి షానే బాధ్యత వహించాలని, ఆయన్ను తొలగించాలన్నదే తమ ప్రధాన డిమాండని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా ఇతర పార్టీల నేతలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ విషయంపై న్యాయ లేదా పార్లమెంటరీ విచారణ కోరే అంశమై అన్ని పార్టీలతో కాంగ్రెస్ చర్చిస్తుందన్నారు. హోంమంత్రి పదవికి షా అనర్హుడని రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే విమర్శించారు. డిజిటల్ ఇండియా అని మోదీ చెబుతుంటారని, కానీ నిజానికి ఇది నిఘా ఇండియా అని లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ దుయ్యబట్టారు. షాను వెంటనే ఎందుకు తొలగించరని ప్రశ్నించారు. ఈ నిఘా వ్యవహారం మొత్తం మోదీ ప్రభుత్వ కన్నుసన్నులోనే జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మోదీ, అమిత్‌షా స్పందించాలి పెగసస్‌తో ప్రముఖుల సమాచారం హ్యాక్ అయిందన్న వార్తలపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా స్పందించాలని శివసేన డిమాండ్ చేసింది. దేశంలో ప్రభుత్వం, యంత్రాంగం బలహీనంగా ఉన్నాయని ఈ ఘటన చెబుతోందని సేన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. ప్రజలకు ప్రధాని, హోంమంత్రి ఈ అంశంపై స్పష్టతనివ్వాలని ఆయన కోరారు. -
ఢిల్లీ అల్లర్లు: అంతర్జాతీయ మీడియా ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల్లో చురుగ్గా పర్యటిస్తూ భారత దేశ ప్రతిష్టను మరింత పెంచేందుకు కృషి చేస్తుండగా, ఢిల్లీలో జరిగిన అల్లర్లు ఆయన ప్రభుత్వ పరువును, దేశ ప్రతిష్టను ఒక్కసారిగా దెబ్బతీశాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య గత ఆదివారం నుంచి మూడు రోజులపాటు కొనసాగిన అల్లర్లలో 42 మంది మరణించిన విషయం తెల్సిందే. వీటిపై ప్రపంచ పత్రికలు తమదైన రీతిలో దాడి చేశాయి. బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా చేసిన విద్వేష పూరిత వ్యాఖ్యలే అల్లర్లకు దారి తీశాయని పలు అంతర్జాతీయ పత్రికలు దూషించాయి. అల్లర్లను నిలువరించాల్సిన పోలీసులే ఓ వర్గానికి వ్యతిరేకంగా అల్లర్లను ప్రోత్సహించడం దారుణంగా ఉందని కొన్ని పత్రికలు ఆరోపించాయి. అల్లర్ల పట్ల ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహించడం వల్లనే ‘2002లో గుజరాత్’ తరహా అల్లర్లు పునరావృతం అయ్యాయని ఆ పత్రికలు వ్యాఖ్యానించాయి. (పేరు అడిగి.. కొట్టి చంపారు.. కిందకు దూకేశాం..) ‘మోదీ స్టోక్డ్ దిస్ ఫైర్’ అనే శీర్షికతో ‘ది గార్డియన్’ పత్రిక వార్తను ప్రచురించింది. ‘పోలిటిషియన్స్ స్టోక్డ్ ఢిల్లీ రైట్స్’ అని ‘ది ఖలీజ్ టైమ్స్’ వార్తను ప్రచురించగా, ‘మోదీ సైలెన్స్ యాజ్ డెత్ టాల్ మౌంటెడ్’ అనే శీర్షికతో లండన్ నుంచి వెలువడుతున్న ‘ది టైమ్స్’ పత్రిక వార్తను ప్రచురించింది. ‘శాంతి, సహనమే మన సంస్కృతి’ అంటూ అల్లర్లు చెలరేగిన మూడో రోజు ప్రధాని మోదీ ట్విటర్ ద్వారా స్పందించిన విషయం తెల్సిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలసి మోదీ భుజం భుజం రాసుకుంటూ ఢిల్లీ రోడ్డుపై తిరుగుతుంటే అక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే అల్లర్లు చెలరేగాయంటూ జర్మనీ వార్తా పత్రిక ‘డర్ స్పీజల్’ వార్తను ప్రచురించింది. ఈ అల్లర్లు మోదీ ప్రభుత్వానికి అంతర్గతంగా ఉపయోగ పడవచ్చేమోగానీ అంతర్జాతీయంగా భారత్ పరువు తీస్తున్నాయంటూ ‘అవుట్‌సైడ్ షో ఆఫ్, ఇన్సైడ్ ప్రొటెస్ట్’ శీర్షికన ఆ పత్రిక వార్తను ప్రచురించింది. (చదవండి: ఢిల్లీ హైకోర్టు జస్టిస్ బదిలీ ఓ శేష ప్రశ్న!) మోదీ హిందూత్వ పాలనలో సెక్యులరిజమ్ చనిపోయిందంటూ ‘వై ఇండియా స్టూడెంట్స్ ఆర్ ఆంగ్రీ, ఇట్స్ ముస్లిం ఆర్ వర్రీడ్’ శీర్షికతో ‘ది వాషింగ్టన్ పోస్ట్’ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈశాన్య ఢిల్లీలో అక్బారీ అనే 85 ఏళ్ల వృద్ధురాలిని సజీవంగా తగులబెట్టడం ఏ నాగరికతను సూచిస్తోందని ‘ఏ గల్ఫ్ న్యూస్ పీస్’ ప్రశ్నించింది. బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా విద్వేషపూరిత ఉపన్యాసమే అల్లర్లకు దారితీసిందని, ముస్లిం పౌరులను హిందూ శక్తులు చంపుతుంటే పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ప్రేక్షక పాత్ర వహించాయంటూ ‘ది రూట్స్ ఆఫ్ ది ఢిల్లీ రైట్స్, ఏ ఫియరీ స్పీచ్ అండ్ యాన్ అల్టిమేటమ్’ పేరిట ‘న్యూయార్క్ టైమ్స్’ వార్తను ప్రచురించింది. ప్రభుత్వం చేసిన చట్టాన్ని ప్రశ్నించే మేధోవారసత్వంతోపాటు నైతిక, ప్రజాస్వామిక హక్కులు తమకున్నాయంటూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ముస్లింలపై దాడి చేయడం ఆశను ఆర్పేసిందంటూ ‘అల్ జజీరా’ వ్యాఖ్యానించింది. విభిన్న కుల, మతాల సమ్మేళనంతో సహజీవనం సాగించడం భారత్‌కున్న ఓ గొప్ప సంస్కృతి అన్న పేరు నేటి ఢిల్లీ అల్లర్లతో మసకబారిందంటూ ‘గల్ఫ్ న్యూస్’ సంపాదకీయం రాసింది. (చదవండి: ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ) -
తొలిదశ ఎన్నికల వేళ పాక్ అనూహ్య నిర్ణయం
ఇస్లామాబాద్ : పుల్వామాలో భారత్ సీఆర్పీఎఫ్ జవాన్ల మీద జరిగిన దాడికి ప్రతీకారంగా.. బాలాకోట్‌లోని జైషే ఉగ్ర స్థావరాలపై భారత్ వైమనిక దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారని భారత్ ఆరోపిస్తుండగా.. పాక్ మాత్రం ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో పాక్ తొలిసారి భారత్ వైమానిక దాడులు జరిపిన బాలాకోట్ పరిసర ప్రాంతంలో సందర్శించడానికి అంతర్జాతీయ మీడియాను అనుమతించింది. భారత్ వైమనిక దాడి చేసిన 43 రోజుల తర్వాత.. భారత్‌లో తొలి దశ ఎన్నికల పోలింగ్‌కు ముందు పాక్ ఈ పర్యటనకు అనుమతించడం పట్లా సర్వత్రా ఉత్కంఠతకు తెర తీసింది. పలు అంతర్జాతీయ మీడియా సంస్థలకు చెందిన వ్యక్తులతో పాటు.. వివిధ దేశాల దౌత్యవేత్తలు.. భద్రతా బలగాలకు చెందిన దాదాపు 24 మంది పర్యటనలో పాల్గొన్నారని సమాచారం. పాక్ అధికారులు వీరందరిని దాడి జరిగినట్లుగా చెప్పబడుతున్న ప్రాంతానికి తీసుకెళ్లారు. భారత వైమానకి దళం దాడి జరపిన ప్రాంతం ఉగ్రవాద శిబిరం కాదని.. అది ఒక మదర్సా అని పాక్ ప్రభుత్వం పేర్కొంది. ఈ మదర్సాలో దాదాపు 130 దాకా విద్యార్థులున్నట్లు సమాచారం. అంతేకాక ఈ దాడిలో ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో పాక్ ఆర్మీ అధికారి ఒకరు.. ‘అంతర్జాతీయ మీడియాతో పాటు భారత్‌కు చెందిన జర్నలిస్టులు.. దౌత్యవేత్తలు, భద్రతా సిబ్బంది బాలాకోట్ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం ఇక్కడ దాడులకు పాల్పడింది. భారత్ చెప్పుకున్నట్లుగా ఇక్కడ ఎలాంటి ఉగ్ర సంస్థలు లేవు. భారత్ నియమాలను ఉల్లఘించి వైమానిక దాడి జరిపింది ఓ మదర్సా మీద. వాస్తవ పరిస్థితులను తెలుసుకొండి. భారత్ చేస్తున్న అబద్దపు ప్రచారాన్ని నమ్మకండి’ అంటూ ట్వీట్ చేశారు. A group of international media journalists mostly India based and Ambassadors & Defence Attachés of various countries in Pakistan visited impact site of 26 February Indian air violation near Jabba, Balakot. Saw the ground realities anti to Indian claims for themselves. pic.twitter.com/XsONflGGVP — Maj Gen Asif Ghafoor (@OfficialDGISPR) April 10, 2019 -
నోట్ల రద్దుపై పాశ్చాత్య మీడియా ఏమంటోందంటే..
రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన నాటి నుంచి స్ధానిక మీడియా దానిపై విస్తృతంగా రిపోర్టింగ్ చేస్తోంది. పాకిస్తాన్ కు చెందిన కొన్ని న్యూస్ ఏజెన్సీలు కూడా మోదీ తీసుకున్న నిర్ణయాన్ని పొగుడుతూ చర్చిస్తున్నాయి. దీంతో నోట్ల రద్దు విషయంపై విదేశీ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కాలమ్స్ ప్రచురితమయ్యాయి. ది వాషింగ్టన్ పోస్టు నల్లధనంపై పోరులో భాగంగానే భారత ప్రధానమంత్రి పెద్ద నోట్లను రద్దు చేశారని వాషింగ్టన్ పోస్టు పేర్కొంది. దేశం ఆర్ధికంగా ఎదగడానికి, విదేశీ పెట్టుబడులను పెద్ద ఎత్తున రాబట్టడానికే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. గతంలో నల్లధనాన్ని తమంతట తామే వెల్లడించాలని ప్రజలను భారత ప్రభుత్వం కోరింది. దీని ద్వారా 19 బిలియన్ డాలర్లు నల్లధనాన్ని భారతీయులు వెల్లడించారు. భారత్ లో మొత్తం 1 ట్రిలియన్ డాలర్ల నల్లధనం ఉందని వాషింగ్టన్ పోస్టు తెలిపింది. సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పన్ను ఎగవేత దారులపై చర్యలు తీసుకుంటామని తన ఎన్నికల ప్రచారంలో చెప్పిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అందులో భాగంగానే పెద్ద నోట్లను రద్దు చేశారని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పేర్కొంది. నల్లధన ప్రవాహాలను అడ్డుకునేందుకు యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు 500 యూరోనోట్లను రద్దు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. ది ఇండిపెండెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం ఆయనకు ప్రజల్లో ఉన్న గౌరవాన్ని మరింత పెంచిందని నాయకులు ఫీలవుతున్నారని చెప్పింది. భారత ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్ అధికారి మోదీని సింగపూర్ మొదటి ప్రధానమంత్రి లీ కువాన్ యేవ్ తో పోల్చారని పేర్కొంది. గత ఏడాది లీ మరణానంతరం ఆయనపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. నాయకుల్లో లీ కువాన్ యేవ్ సింహంలాంటి వారని ఆయన అన్నారు. న్యూయార్క్ టైమ్స్ నోట్ల రద్దు విషయాన్ని మోదీ ప్రకటించే వరకూ రహస్యంగా ఉంచారని పేర్కొంది. మోదీ చారిత్రాత్మక నిర్ణయంతో భారత్ దశ, దిశలు మారిపోతాయని ఆర్ధిక రంగ నిపుణులు అంటున్నారని చెప్పింది. వాల్ స్ట్రీట్ జర్నల్ మోదీ తీసుకున్న నిర్ణయం విజయవంతమైతే ప్రభుత్వ ట్యాక్స్ చెల్లింపులు భారీగా పెరుగుతాయని చెప్పింది. మోదీ నిర్ణయం తర్వాత పెద్ద సంఖ్యలో పెట్టుబడిదారులు భారతీయ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. ఇది మోదీ తీసుకున్న నిర్ణయం సఫలీకృతమౌతోందన్న విషయాన్ని సూచిస్తోందని పేర్కొంది. -
బ్రిటన్ ప్రధానిగా థెరిసా మే
- రెండో మహిళా ప్రధానిగా పగ్గాలు - కామెరాన్ రాజీనామాకు రాణి ఆమోదం లండన్ : బ్రిటన్ రెండో మహిళా ప్రధానమంత్రిగా థెరిసా మే బుధవారం పగ్గాలు చేపట్టారు. కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక థెరిసా భర్త ఫిలిప్‌తో కలసి అధికారిక నివాసమైన 10 డౌన్స్ట్రీట్లోకి అడుగుపెట్టారు. అక్కడ అప్పటికే వేచిఉన్న అంతర్జాతీయ మీడియానుద్దేశించి ప్రసంగించారు. యూరోపియన్ యూనియన్ నుంచి బయటికొచ్చిన బ్రిటన్ను మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దడమే తన కర్తవ్యమని కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలైన 59 ఏళ్ల థెరిసా చెప్పారు. బ్రెగ్జిట్ రెఫరెండం తీర్పుతో ప్రధాని పదవికి రాజీనామా ప్రకటించిన డేవిడ్ కామెరాన్ బుధవారం సాయంత్రం తన భార్య సమంతా, ముగ్గురు పిల్లలతో కలసి బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు వెళ్లారు. అక్కడ రాణి రెండో ఎలిజబెత్‌కు రాజీనామా లేఖను సమర్పించారు. ఆమె ఆమోదం తెలిపారు. తర్వాత థెరిసాను ప్రధానిగా పగ్గాలు చేపట్టాలని రాణి ఆహ్వానించారు. కామెరాన్ కేబినెట్లో హోంమంత్రిగా చేసిన థెరిసా.. రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లో పనిచేశారు. గత 50 ఏళ్లలో బ్రిటన్ హోం మంత్రిగా ఎక్కువ కాలం చేసిన ఘనత ఆమెకే దక్కుతుంది. కెరిసా ఇక కేబినెట్‌పై తనదైన ముద్ర వేయనున్నారు. కామెరాన్ మంత్రివర్గంలో ఉద్యోగకల్పన మంత్రిగా పనిచేసిన భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్‌కు థెరిసా కీలక శాఖను అప్పగించే అవకాశముంది. గుజరాత్‌కు చెందిన 44 ఏళ్ల ప్రీతి బ్రెగ్జిట్‌కు అనుకూలంగా గళమెత్తారు. మార్గరెట్ థాచర్ బ్రిటన్ తొలి మహిళా ప్రధాని (1979-1990)గా పనిచేశారు. కామెరాన్ భారతీయ విందు.. ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకుంటున్న సందర్భంగా కామెరూన్ తన సహచర మంత్రులకు, సన్నిహితులకు 10 డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయంలో వీడ్కోలు విందు ఇచ్చారు. హైదరాబాదీ శాఫ్రాన్ చికెన్, కశ్మీరీ రోగన్ జోష్, సమోసాలు, సాగ్ ఆలూ, శాగ్ పన్నీర్, పాలక్ గోస్ట్, రైస్ వంటి రుచికరమైన భారతీయ వంటకాలను ఏర్పాటు చేశారు. ఆరేళ్ల తర్వాత ప్రధానిగా ఆఖరి రోజును పూర్తి చేసుకున్న అనంతరం కామెరాన్ పార్లమెంటునుద్దేశించి ప్రసంగించారు. ఈయూ నుంచి బ్రిటన్ విడిపోతున్నప్పటికీ తాము ఈయూతో సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నిస్తామన్నారు. -
ఇరాక్‌పై ముసుగు యుద్ధం
‘‘మీడియా ఎవరినైనా వెర్రివాళ్లను చేయగలదు- సాధారణంగా ఉద్దేశపూరితంగా, అప్పుడప్పుడు మరెవరి చేతిలోనో వెర్రిదిగా మారి.’’ ఇరాక్ పరిణామాలపై అంతర్జాతీయ మీడియా వడ్డిస్తున్న మూసపోత కథనాలను చూస్తే రెండూ ఒకేసారి జరుగుతున్నట్టుంది. పదిహేను వందల మంది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఇలా దాడి చేశారో లేదో 20 లక్షల జనాభాగల మొసుల్ నగరంలోని 50 వేల భద్రతా సిబ్బంది తుపాకులు పారేసి పరుగు లంకించుకున్నారని అది చెప్పింది. నోళ్లు తెరుచుకు విన్నాం. ఐఎస్ఐఎస్ ఎంతటి అరి వీర భయంకరమైనది కాకపోతే దాని ధాటికి వారం గడవక ముందే ఉత్తర ఇరాక్‌లోని పట్టణాలు, నగరాలు, చమురు కేంద్రాలు వారి వశమైపోతాయి? శ్వేత సౌధాధీశుడు బరాక్ ఒబామా ఐఎస్ఐఎస్ ఉత్పాతం అమెరికా ప్రయోజనాలకు సైతం ప్రమాదకరమని కలవరపడతారు? ఇరాక్‌ను ఆదుకోడానికి ఇవిగో ద్రోన్లు, అవిగో వైమానిక దాడులు, అల్లదిగో సైన్యం అంటూ కాకి గోలే తప్ప కదలడం లేదెందుకు? సీఐఏ ఏం చేస్తున్నట్టు? పేపరు చూస్తేగానీ అధ్యక్షుల వారికి మొసుల్ పతనం సంగతి తెలియలేదు! సీఐఏని మూసేసి, కాంట్రాక్టు కూలీలకు పేపర్లను తిరిగేసే పనిని అప్పగించి ఉంటే ఈ ‘హఠాత్పరిణామానికి’ ‘దిగ్భ్రాంతి’ చెం దాల్సి వచ్చేది కాదు. సిరియాలోని లతాకియా, ఇద్లిబ్ రాష్ట్రాలలోని తన ఉగ్రమూకలను ఐఎస్ఐస్ సిరియాకు తూర్పున ఉన్న ఇరాక్ సరిహద్దుల్లో మోహరిస్తోందని లెబనాన్ డైలీ మార్చిలో తెలిపింది. అయినా ప్రపంచ నేతకు తెలియలేదంటే నమ్మాల్సిందే, చెప్పేవాడికి వినేవాడు ఎప్పుడూ లోకువే. సద్దాం పునరుత్థానం వారం రోజుల పాటూ మొసుల్, తదితర పట్టణాలను సందర్శించి వివిధ వర్గాల ప్రజలతో చర్చించి వచ్చిన జూడెన్ టోడెన్హాఫర్ 2,70,000 ఆధునిక సైన్యంపై ఐఎస్ఐఎస్ సాధించిన ‘అత్యద్భుత విజయాన్ని’ ఒక్క ముక్కలో చెప్పారు... ఈ యుద్ధంలో ఐఎస్ఐఎస్ ‘జూనియర్ పార్టనర్’ మాత్రమే. అసలు పాత్రధారి ఎవరు? మొసుల్‌లో ఇప్పుడు ఇంటింటా వేలాడుతున్న సైనిక దుస్తుల పెద్ద మనిషి... ఇజ్జత్ ఇబ్రహీం అల్-దౌరీ. ఆయన 2003లో అమెరికా సైనిక దురాక్రమణతో హతమార్చిన సద్దాం హుస్సేన్‌కు కుడి భుజం, బాత్ పార్టీ ప్రధాన సిద్ధాంత కర్త, మొసుల్‌లో పుట్టి పెరిగినవాడు. ఐఎస్ఐఎస్ వీరాధివీరులు కనిపించగానే ఇరాక్ సేనలు ‘మటుమాయమైపోవడం’ (మెల్టెడ్ ఎవే) అనే అద్భుతం ఎలా సాధ్యమో ఇప్పుడు తేలిగ్గానే అం తుబడుతుంది. తూర్పున ఉన్న కుర్దు ప్రాంతాల్లో, ఉత్తరాదిన షియా ప్రాం తాల్లో మాత్రం సంకుల సమరం జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న సున్నీ బాతిస్టు పార్టీ రహస్య నిర్మాణానికి తిరుగులేని నేత దౌరీయే. 2003 నుంచి అమెరికా సేనలకు వ్యతిరేకంగానూ, నేడు షియా నౌరి అల్ మలికి ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ సైనిక ప్రతిఘటనకు నేతృత్వం వహిస్తున్నాడు. ఆయన నేతృత్వంలో కనీసం 20,000 బలగాలు ఉన్నట్టు అంచనా. ఇక సద్దాం హయాంలో ఉన్నతోద్యోగాల్లో, పదవుల్లో వెలగిన సున్నీలు షియా మలికి ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యారు. ఈ పరిస్థితిలో ఐఎస్ఐఎస్ ముసుగుతో ప్రారంభమైన దాడికి సున్నీ ప్రజల మద్దతు లభిస్తోంది. శతాబ్దాల షియా, సున్నీ శత్రుత్వం మిథ్య అంతర్జాతీయ మీడియా వ్యాపింపజేసిన మరో కట్టుకథ.. 1400 ఏళ్ల షియా, సున్నీ వైరం. ఇస్లాంలోని రెండు ప్రధాన శాఖల మధ్య విభేదాలు, కొంత సంఘర్షణ ఉన్నమాట నిజమే. కానీ నేడు ఐఎస్ఐఎస్ సాగిస్తున్న షియా ఊచకోత స్థాయికి అది చేరిన వైనం చరిత్రలో ఎక్కడా లేదు. సద్దాం పాలనలో సున్నీల పట్ల పక్షపాతం ఉన్నా... షియాలపై దాడులు, విద్వేషం ఎరుగరు. 2003లో సైనిక దురాక్రమణ తదుపరి అమెరికాయే మొట్టమొదటిసారిగా ఈ విద్వేషాలను రగిల్చింది. సున్నీలంతా, సద్దాం అనుయాయులేనని బావించి వారికి స్థానమే లేని షియా ప్రభుత్వాన్ని మాలికి నేతృత్వంలో ఏర్పాటు చేసింది. బాతిస్టు సైనిక నేతలు అమెరికా ఏర్పరిచే ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి సిద్ధపడినా అమెరికా వారిని వేటాడి చంపింది. (విమర్శకుల ప్రశంసలందుకుని, బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డ ‘గ్రీన్ జోన్’ (2010) చూడండి). సున్నీల పట్ల అమెరికా అనుసరించిన ఈ విద్వేషపూరిత వైఖరే ఇస్లామిక్ తీవ్రవాదం, అల్‌కాయిదాలకు ఊపిరులూదింది. బాతిస్టు పార్టీ, ఇతర సున్నీ మిలీషియాల ప్రతిఘటన తారస్థాయికి చేరడంతో అమెరికా పలాయనం చిత్తగించింది. కానీ అది రగిల్చిన మత విద్వేషాల కార్చిచ్చు రగులుతూనే ఉంది. 2003 ఇరాక్ దురాక్రమణ నుంచి నేటి వరకు మధ్య ప్రాచ్యంలో అమెరికా సాధించిన ఏకైక ఘనకార్యం ఏమిటి? ఇరాక్, లిబియా, సిరియాల్లో లౌకికవాదం సమాధులపై మతోన్మాద రక్కసులను ఆవిష్కరించడమే. ఇరాక్‌లోని బాతిస్టు పార్టీ లౌకికతత్వానికి కట్టుబడ్డ పార్టీ. సద్దాం హయంలో సైతం బాగ్దాద్‌లో కుర్దులు సురక్షితంగా ఉండగలిగారు! అలాంటి లౌకికవాద బాతిస్టు పార్టీకి. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంత్ (ఐఎస్ఐఎల్) వంటి సున్నీ ఉగ్రవాద సంస్థకు మధ్య అపవిత్ర కూటమి ఎలా సాధ్యమైంది? ఆ సూత్రధారి ఎవరో తెలియాలంటే... జోర్డాన్‌లోని సఫావీలో ఐఎస్ఐఎస్, జబాత్ అల్ నస్రా తదితర సిరియా ఉగ్రవాద మూకలకు సీఐఏ అధికారులు, సైనిక నేతలు శిక్షణ శిబిరాలను నిర్వహించారని జర్మన్ పత్రిక ‘దెర్ స్పెగెల్’ గత మార్చిలో వెల్లడించింది. అంతర్జాతీయ మీడియా వినిపిస్తున్న కథనాల ప్రకా రం ఇప్పుడు ఐఎస్ఐఎస్ వెనుక ఉన్న శక్తులు సౌదీ అరేబియా, ఖతార్‌లు. సౌదీకి, బాతిస్టులకు బద్ద వైరం. అంటే సౌదీ, దాని బద్ధ శత్రువైన బాతిస్టులు కూడా ఐఎస్ఐఎస్తో కుమ్మక్కయ్యారని అర్థమా? ఇరాక్‌లోని మలికి ప్రభుత్వానికి నమ్మకమైన మిత్రునిగా ఉన్న టర్కీ ప్రధాని ఎర్డోగాన్ మిత్ర ద్రోహా? అదృశ్య సూత్రధారి ఎవరు? ఐఎస్ఐఎస్ 2003లో అది పుట్టినప్పుడు ఉత్త ఐఎస్ఐ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్). దానికి సౌదీ, ఖతార్‌ల అండదండలున్నమాట నిజమే. షియా మలికి ప్రభుత్వాన్ని కూల్చడమే దాని లక్ష్యం. 2012లో జోర్డాన్, టర్కీలలోని సీఐఏ శిక్షణ శిబిరాల్లో అది శిక్షణను పొందినది మాత్రం సిరియాలోని అసద్ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం. అందుకే అది ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ సిరియా అండ్ ఇరాక్)గా మారింది. అప్పటికి అది సౌదీ, ఖతార్, టర్కీ, సీఐఏలకు ఉగ్రవాద సేన. ఒబామా సిరియా సమస్యపై రష్యాతో ఘర్షణకు సిద్ధపడక వెనకడుగు వేయడంతో కథ ఊహించని మలుపు తిరిగింది. ఐఎస్ఐఎస్ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంత్ అంటూ ఇరాక్ సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్, పాలస్తీనా, జోర్డాన్, సైప్రస్, దక్షిణ టర్కీలతో కూడిన ఖిలాఫత్ రాజ్యాన్ని ఏర్పాటు చేసే లక్ష్యాన్ని ప్రకటించింది. దీంతో టర్కీ దానితో తెగతెంపులు చేసుకుంది. అప్పటికే ఎర్డోగాన్ సహాయంతో దౌరీ ఐఎస్ఐఎస్తో సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఈ విషయాన్ని గ్రహించి సౌదీ దానితో సంబంధాలు పెంచుకుంది. అంతర్జాతీయ మీడియా ఆ విషయాన్ని మరచిపోయినట్టు నటిస్తోంది. సౌదీ, ఖతార్‌ల వైపు వేలెత్తి చూపుతోంది. ఎందుకు?దొంగే దొంగ అని అరిచేదెందుకో అందుకే? మలికి ప్రభుత్వం తప్పుకోవాలని, సున్నీలు, షియాలు, కుర్దులకు ప్రాతినిధ్యం ఉండే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తప్ప సహాయం అందించేది లేదని బుధవారం శ్వేత సౌధం చేసిన ప్రకటనను చూడండి. అమెరికా ఇప్పుడు సిరియాలోలా ప్రభుత్వం మార్పును కోరుతోంది. ఈ పాచిక తప్పక పారుతుందనే భావి స్తోంది. ఇరాక్‌లో అమెరికా సేనలు నిలిపి ఉంచనిచ్చేది లేదని, చమురు నిల్వలను ప్రైవేటు పరం చేసే బిల్లుపై సంతకం చేయనని నిరాకరించిన మలికి అందుకు అంగీకరించవచ్చు. లేకపోతే సున్నీ, షియా, కుర్దుల మధ్య ఇరాక్ మూడు ముక్కలవుతుంది. రెండు దశాబ్దాలుగా కలలుగంటున్న ఇరాక్, సిరియా, ఇరాన్‌లను ఒక్కొక్కదాన్ని మూడు ముక్కలుగా చేయాలన్న కలకు సిరియాలో పడాల్సిన నాంది ఇరాక్‌లో పడుతుంది. కొసమెరుపు ఏమిటంటే మలికితో సన్నిహిత సంబంధాలున్న ఇరాన్‌ను ఏకాకిని చే యాలనే ప్రధాన లక్ష్యంతో కదలుతున్న అమెరికా ఇరాక్ సంక్షోభ పరిష్కారం కోసం అదే ఇరాన్‌కు స్నేహ హస్తాన్ని చాస్తున్నట్టు నటించడం. - పిళ్లా వెంకటేశ్వరరావు -
ముసుగు ‘యుద్ధం’
‘ఉద్రిక్తతలు లేని ప్రపంచం’ ఆదర్శం మంచిదే. కానీ అదే నిజమైతే అంతర్జాతీయ మీడియా ‘ఆకలి’కి మాడక తప్పదు. ‘సిరియా,’ ‘ఇరాన్’ చప్పగా చల్లారాయన్న దిగులు లేకుండా తాజాగా ‘గగనతల రక్షణ ప్రాంతాల (ఏడీఐజెడ్) యుద్ధం’ వచ్చిపడింది. ప్రపంచ మీడియా కథనాల ప్రకారం జపాన్‌పై చైనా నవంబర్ 23న ప్రారంభించిన ఈ ‘యుద్ధం’లోకి డిసెంబర్ 8న దక్షిణ కొరియా ప్రవేశించింది. అది తన గగనతల రక్షణ ప్రాంతాన్ని 66, 500 చదరపు కిలోమీటర్లకు విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. గగలతల ప్రకటనలు , ఏర్పాట్లు సర్వసాధారణమైనవే. ఆ ప్రాంతంలో ప్రవేశించే విమానాలు ఆ దేశానికి తమ గుర్తిం పును, ప్రయాణ పథకాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ పయనించాల్సి ఉంటుంది. కాకపోతే చైనా, దక్షిణ కొరి యాల ఏడీఐజెడ్ ప్రకటనలు అసాధారణమైనవి. దక్షిణ కొరియా ఏడీఐజెడ్ చైనా ప్రకటించిన ‘నూతన ఏడీఐజెడ్’ లోకి విస్తరించింది. అంటే చైనా తనదిగా ప్రకటించిన ప్రాంతంలో కొంత భాగం తనదేనని దక్షిణ కొరియా బరి లోకి దిగింది. చైనా ‘నూతన ఏడీఐజెడ్’లో... దక్షిణ కొరి యా తనదంటున్న సముద్రంలో మునిగి ఉన్న ఒక పెద్ద రాయితో పాటూ జపాన్ తనవంటున్న సెనెకాకు లేదా దియోయు దీవులు కూడా ఉన్నాయి. చైనాతో స్నేహసంబంధాలను బలోపేతం చేసుకునే లక్ష్యంతో గత వారం చైనాలో పర్యటించిన అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్... చైనా ‘ఏకపక్షంగా కవ్వింపు చర్యకు పాల్పడింది’ అని రూలింగ్ ఇచ్చారు. బీజింగ్‌లో అధ్యక్షుడు క్సీ జిన్‌పింగ్‌తో జో రాయబారం కంటే ముందే... గత నెల 24న అంటే చైనా నూతన ఏడీఐజెడ్ను ప్రకటించిన మరుసటి రోజే అమెరికా ఆ వివాదాస్పద దీవులపైకి యుద్ధ విమానాలను పంపి దానికి సవాలు విసిరింది. ఈ రభసంతా తూర్పు, దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని అపార చమురు నిక్షేపాల కోసం ఆ ప్రాంత దేశాలకు, చైనాకు మధ్య తలెత్తుతు న్న వివాదాలుగానే కనిపిస్తాయి. కానీ కావు. ఇంతవరకు సాగిన ‘యుద్ధం’ అంతా చదరంగపు తొలి ఎత్తుల్లాగా అందరికీ తెలిసిన ఎత్తులు పైఎత్తులే. కాకపోతే తెల్ల పావులతో ఆడుతున్న ఆటగాడిలా తొలి ఎత్తు వేసినది చైనా. అసలు ఆటంతా అమెరికా నావికా దళ యుద్ధ కళాశాలలో హాట్ టాపిక్‌గా ఉన్న ‘రివర్స్ గ్రేట్ వాల్’ వ్యూహం చెబుతుంది. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన చైనా గోడను ఒకప్పుడు ఆ దేశ రక్షణ కోసం నిర్మించారు. దానికి విరుద్ధమైన సముద్రపు చైనా గోడను నిర్మించాలని అమెరికా రక్షణశాఖ కలగంటోంది. దానికి ‘అదృశ్య వ్యతిరిక్త చైనా కుడ్యం’ అని నామకరణం కూడా చేసింది. జపాన్, కొరియా ద్వీపకల్పాల మీదుగా ఉత్తరాన ఉన్న హాంకాంగ్, ఫిలిప్పీన్స్, ఇండోైచె నాల వరకు, అక్కడి నుంచి ఆస్ట్రేలియా ఖండం వరకు అది విస్తరిస్తుంది. ఈ అదృశ్య కుడ్యం కల నిజమైతే చైనా సముద్ర వాణిజ్యం దాదాపు మొత్తం నిలి చిపోతుంది. అలాగే దాని నావికా బలం కాళ్లు కట్టేసిన ట్టే అవుతుంది. అందుకే ‘చైనా డెయిలీ’ పత్రిక సంపాదకీయం ఈ వ్యూహాన్ని పీడ కలగా అభివర్ణించింది. అమెరికా ఆడుతున్న ఈ కనిపించని క్రీడ లక్ష్యం చైనా ను ఆర్థికంగా, సైనికంగా దిగ్బంధం చేయడం. ఈ ఆటలో ప్రధాన క్రీడాకారుడు జపాన్ ప్రధాని షింజే అబే. రెండవ ప్రపంచ యుద్ధ నేరస్త దేశంగా జపాన్‌పై ఉన్న ఆంక్షలను ధిక్కరించి ఆయన దేశాన్ని వేగంగా సైనికీకరిస్తున్నారు. ఒక్కసారిగా రక్షణ వ్యయాన్ని పదకొండు రెట్లు పెంచి చైనాతో కయ్యానికి కాలుదువ్వడం ప్రారంభించారు. అమెరికా తన ‘ట్రాన్స్ పసిఫిక్ భాగస్వామ్య (టీపీపీ) వాణిజ్య ఒప్పందాన్ని’ సాకారం చేసే బాధ్యతను కూడా ఆయనకే అప్పగించింది. నాలుగు ఖండాలకు విస్తరించిన టీపీపీ బృహత్తర వాణిజ్య కూటమితో... ప్రపంచ వాణిజ్యంలో చైనా ఆధిక్యతను దెబ్బతీయడంతో పాటూ ఆ ప్రాంత దేశాల సార్వభౌమత్వ హక్కులను సైతం గుప్పిట పట్టే అవకాశం అమెరికా దాని మిత్ర దేశాలకు లభిస్తుంది. జో బిడెన్ అంటున్నట్టుగా ఏకపక్షంగా కవ్వింపు చర్యలకు దిగుతున్నది చైనా కాదు... అమెరికా, జపాన్‌లే. జపాన్ తనవంటున్న సెనెకాకు దీవులు చైనావేనని జపాన్ చరిత్రకారులు 16వ శతాబ్ది నుంచి చెబుతున్నారు. 1895లో జపాన్ వాటిని ఆక్రమించింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వాటిని చైనాకు అప్పగించడానికి అది లిఖితపూర్వకంగా అంగీకరించింది కూడా. ఆ దీవుల నుంచే నేడు అమెరికా తన చైనా వ్యతిరేక అదృశ్య వ్యతిరిక్త మహాకుడ్య నిర్మాణా న్ని ప్రారంభించింది. దానికి వ్యతిరేకంగానే చైనా తొలి ఎత్తును వేసింది. తాజాగా అమెరికా దక్షిణ కొరియా పావు ను కదిపింది. చైనా ఆటకు ముందే బాగా కసరత్తు చేసిన ఆటగాడిలా నిశ్చింతగా పావులు కదుపుతోంది. పి. గౌతమ్