కీవ్: ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యాకు బుధవారం భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒక కమాండర్ రాక కోసం శిక్షణాప్రాంతం వద్ద గుమిగూడిన సైనికులపై రెండు క్షిపణిలు వచ్చి పడ్డాయి. దీంతో 60 మంది రష్యా సైనికులు మరణించారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అయితే ఈ ఘటనపై రష్యా రక్షణ మంత్రి సెర్గియో షొయిగూ నోరు మెదపలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీకి కొద్దిసేపటికి ముందే ఈ దాడి జరగడం గమనార్హం.
ఇతర ప్రాంతాల్లో రష్యా సైన్యం విజయాలను పుతిన్‌కు వివరించిన సెర్గియో ఈ దాడి వివరాలను మాత్రం వెల్లడించలేదు. రష్యా ఆక్రమణలో ఉన్న ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం డొనెట్కŠస్ రీజియన్‌లో ఈ దాడి ఘటన చోటుచేసుకుంది. సెర్బియా ప్రాంతంలో ఉండే 36వ రైఫిల్ బ్రిగేడ్ ట్రుడోవ్‌స్కే గ్రామంలో ఒక మేజర్ జనరల్ రాకకోసం వేచి చూస్తుండగా ఈ దాడి జరిగింది. ఒకే చోట డజన్లకొద్దీ జవాన్లు విగతజీవులుగా పడి ఉన్న వీడియో ఒకటి అంతర్జాతీయ మీడియాలో ప్రసారమైంది.
అమెరికా తయారీ హై మొబిలిటీ ఆరి్టలరీ రాకెట్ సిస్టమ్(హిమార్స్) నుంచి దూసుకొచి్చన మిస్సైళ్లే ఈ విధ్వంసం సృష్టించాయని రష్యా చెబుతోంది. మరోవైపు రష్యా వ్యతిరేకంగా సైనిక వార్తలు రాసే బ్లాగర్ ఆండ్రీ మొరజోవ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈయన టెలిగ్రామ్ చానెల్‌కు లక్ష మంది చందాదారులు ఉన్నారు.
ఉక్రెయిన్ యుద్ధంలో చాలా ప్రాంతాల్లో రష్యా తోకముడిచిందంటూ, వేల మంది సైనికులు చనిపోయారని తాను రాసిన విశ్లేషణాత్మక కథనాలను వెంటనే తొలగించాలంటూ రష్యా సైన్యం నుంచి ఈయన చాన్నాళ్లుగా ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాడు. ఇంకెవరో వచ్చి చంపే బదులు తానే కాల్చుకుని చస్తానని తన బ్లాగ్‌లో రాశాడని వార్తలొచ్చాయి. ఇప్పటిదాకా యుద్ధంలో రష్యా 45వేలకుపైగా సైన్యాన్ని కోల్పోయిందని ‘బీబీసీ రష్యా’ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment