Eastern Ukraine
-
రష్యాకు ఎదురుదెబ్బ
కీవ్: ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యాకు బుధవారం భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒక కమాండర్ రాక కోసం శిక్షణాప్రాంతం వద్ద గుమిగూడిన సైనికులపై రెండు క్షిపణిలు వచ్చి పడ్డాయి. దీంతో 60 మంది రష్యా సైనికులు మరణించారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అయితే ఈ ఘటనపై రష్యా రక్షణ మంత్రి సెర్గియో షొయిగూ నోరు మెదపలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీకి కొద్దిసేపటికి ముందే ఈ దాడి జరగడం గమనార్హం. ఇతర ప్రాంతాల్లో రష్యా సైన్యం విజయాలను పుతిన్‌కు వివరించిన సెర్గియో ఈ దాడి వివరాలను మాత్రం వెల్లడించలేదు. రష్యా ఆక్రమణలో ఉన్న ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం డొనెట్కŠస్ రీజియన్‌లో ఈ దాడి ఘటన చోటుచేసుకుంది. సెర్బియా ప్రాంతంలో ఉండే 36వ రైఫిల్ బ్రిగేడ్ ట్రుడోవ్స్కే గ్రామంలో ఒక మేజర్ జనరల్ రాకకోసం వేచి చూస్తుండగా ఈ దాడి జరిగింది. ఒకే చోట డజన్లకొద్దీ జవాన్లు విగతజీవులుగా పడి ఉన్న వీడియో ఒకటి అంతర్జాతీయ మీడియాలో ప్రసారమైంది. అమెరికా తయారీ హై మొబిలిటీ ఆరి్టలరీ రాకెట్ సిస్టమ్(హిమార్స్) నుంచి దూసుకొచి్చన మిస్సైళ్లే ఈ విధ్వంసం సృష్టించాయని రష్యా చెబుతోంది. మరోవైపు రష్యా వ్యతిరేకంగా సైనిక వార్తలు రాసే బ్లాగర్ ఆండ్రీ మొరజోవ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈయన టెలిగ్రామ్ చానెల్‌కు లక్ష మంది చందాదారులు ఉన్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో చాలా ప్రాంతాల్లో రష్యా తోకముడిచిందంటూ, వేల మంది సైనికులు చనిపోయారని తాను రాసిన విశ్లేషణాత్మక కథనాలను వెంటనే తొలగించాలంటూ రష్యా సైన్యం నుంచి ఈయన చాన్నాళ్లుగా ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాడు. ఇంకెవరో వచ్చి చంపే బదులు తానే కాల్చుకుని చస్తానని తన బ్లాగ్‌లో రాశాడని వార్తలొచ్చాయి. ఇప్పటిదాకా యుద్ధంలో రష్యా 45వేలకుపైగా సైన్యాన్ని కోల్పోయిందని ‘బీబీసీ రష్యా’ తెలిపింది. -
20 వేలమందిని బఖ్‌ముత్‌లో కోల్పోయాం
కీవ్: తూర్పు ఉక్రెయిన్‌లోని బఖ్ముత్ నగరంలో తమకు భారీ నష్టం వాటిల్లిందని రష్యా ప్రైవేట్ సైన్యమైన ‘వాగ్నర్’ చీఫ్ యెవ్గెనీ ప్రిగోజిన్ వెల్లడించారు. ఉక్రెయిన్ సేనలతో జరిగిన పోరాటంలో 20,000 మందికిపైగా సైనికులను కోల్పోయామని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రష్యా ప్రభుత్వం ఖైదీలకు, వివిధ కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్నవారికి కొంత శిక్షణ ఇచ్చి, ప్రైవేట్ సైన్యంగా మార్చి, ఉక్రెయిన్‌లో యుద్ధ రంగానికి పంపిస్తున్న సంగతి తెలిసిందే. బఖ్‌ముత్‌లో గత తొమ్మిది నెలలుగా సాగుతున్న హోరాహోరీ యుద్ధంలో ఉక్రెయిన్ జవాన్లు ఎంతమంది మరణించారన్నది తెలియరాలేదు. దీనిపై ఉక్రెయిన్ సైన్యం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. పది వేల మందికిపైగానే ఉక్రెయిన్ సైనికులు మరణించి ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
రష్యా రాకెట్ దాడుల్లో... 600 మంది సైనికులు మృతి!
మాస్కో: తూర్పు ఉక్రెయిన్‌లో సైనికుల తాత్కాలిక నివాసాలపై తాము జరిపిన రాకెట్ దాడుల్లో 600 మంది మరణించారని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. రష్యా అధీనంలో ఉన్న డాన్‌టెస్క్ ప్రాంతంపై ఉక్రెయిన్ దాడుల్లో 89 మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ప్రతీకార చర్యగానే తాము క్రమటోర్క్‌స్‌పై ప్రాంతంలో సైనికుల ఇళ్లపై దాడులు చేసినట్టు పేర్కొంది. సైనికులు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న ఇళ్లకు సంబంధించిన కచ్చితమైన సమాచారం అందడంతో తాము రాకెట్ దాడులు చేశామని ఒక ప్రకటనలో తెలిపింది. ఒక ఇంట్లో 700 మంది సైనికులు ఉంటే, మరొక ఇంట్లో 600 మంది ఉన్నారని తాము చేసిన రాకెట్ దాడుల్లో 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ఇదే నిజమైతే గత ఫిబ్రవరి 24న యుద్ధం మొదలు పెట్టినప్పట్నుంచి ఉక్రెయిన్‌కు భారీగా ప్రాణనష్టం జరిగిన ఘటన ఇదే. -
Russia-Ukraine War: లుహాన్స్క్లో జెండా పాతేశాం: పుతిన్
పొక్రోవ్స్క్: తూర్పు ఉక్రెయిన్‌లోని అత్యంత కీలకమైన డోన్బాస్లో భాగమైన లుహాన్స్క్ ప్రావిన్స్‌లో రష్యా విజయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం ఖరారు చేశారు. లుహాన్స్క్లో జెండా పాతేశామని అన్నారు. ఈ ప్రాంతంపై రష్యా సైన్యం పూర్తిస్థాయిలో పట్టుబిగించడంతో ఉక్రెయిన్ సేనలు ఆదివారం వెనుదిరిగాయి. లుహాన్స్క్ను మన దళాలు పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నాయని రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గీ షోయిగు అధ్యక్షుడు పుతిన్‌కు తెలియజేశారు. లుహాన్స్క్ ప్రావిన్స్‌లో పెద్ద నగరమైన లీసిచాన్స్క్ రష్యా వశమయ్యిందని, అక్కడ ఆపరేషన్ పూర్తయ్యిందని పేర్కొన్నారు. కీలక ప్రాంతంలో విజయం దక్కడం పట్ల పుతిన్ హర్షం వ్యక్తం చేశారు. రష్యా సైన్యానికి లక్ష్యంగా మారకుండా లుహాన్స్క్ నుంచి ఉక్రెయిన్ సేనలు వెనక్కి మళ్లాయని స్థానిక గవర్నర్ సెర్హియి హైడై తెలిపారు. మరికొంత కాలం అక్కడే ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. దానికి అధిక మూల్యం చెల్లించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. లుహాన్స్క్లో దక్కిన విజయంతో రష్యా సైన్యం ఇక డొనెట్స్క్లోని సివీరెస్క్, ఫెడోరివ్కా, బఖ్ముత్ వైపు కదిలేందుకు సన్నద్ధమవుతోందని ఉక్రెయిన్ సైనిక వర్గాలు తెలిపాయి. డొనెట్స్క్లో సగం భూభాగం ఇప్పటికే రష్యా నియంత్రణలో ఉంది. స్లొవియాన్స్క్, క్రామటోర్స్క్లో రష్యా వైమానిక దాడులు నానాటికీ ఉధృతమవుతున్నాయి. స్లొవియాన్స్క్లో తాజాగా రష్యా దాడుల్లో తొమ్మిదేళ్ల బాలిక సహా ఆరుగురు మరణించారు. 19 మంది క్షతగాత్రులయ్యారు. క్రామటోర్‌స్క్‌లోనూ రష్యా నిప్పుల వర్షం కురిపించింది. రష్యా దృష్టి మొత్తం ఇప్పుడు డొనెట్స్క్పైనే ఉందని బ్రిటిష్ రక్షణ శాఖ పేర్కొంది. పునర్నిర్మాణం.. ప్రపంచ బాధ్యత: జెలెన్స్కీ లుహాన్స్క్ నుంచి తమ దళాలు వెనుదిరగడం నిజమేనని అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఆయుధాలు సమకూర్చుకొని, బలం పుంజుకుని పోరాటం కొనసాగిస్తామన్నారు. ఉక్రెయిన్ పునర్నిర్మాణం ప్రజాస్వామ్య ప్రపంచ ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. స్విట్జర్లాండ్‌లో సోమవారం ‘ఉక్రెయిన్ రికవరీ కాన్ఫరెన్స్’లో ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు. రష్యా దాడుల్లో దెబ్బతిన్న తమ దేశ పునర్నిర్మాణం అనేది స్థానిక ప్రాజక్టు లేదా ఒక దేశ ప్రాజెక్టు కాదని అన్నారు. ప్రజాస్వామ్య ప్రపంచంలో నాగరిక దేశాల ఉమ్మడి కార్యాచరణ అని వెల్లడించారు. రష్యాతో యుద్ధం ముగిసి తర్వాత తమ దేశ పునర్నిర్మాణానికి 750 బిలియన్ డాలర్లు అవసరమని ఉక్రెయిన్ ప్రధానమంత్రి అంచనా వేశారు. ఈ మేరకు రికవరీ ప్లాన్ రూపొందించారు. -
Russia-Ukraine War: లుహాన్స్క్ రష్యా వశం!
కీవ్: తూర్పు ఉక్రెయిన్‌లో డోన్బాస్ ప్రాంతంలోని లుహాన్స్క్ ప్రావిన్స్ రష్యా వశమైనట్టు సమాచారం. అక్కడి చివరి ముఖ్య నగరం లీసిచాన్స్క్ను ఆక్రమించినట్టు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగూ ఆదివారం ప్రకటించారు. దీనివల్ల డోన్బాస్లో జెండా పాతాలన్న లక్ష్యానికి రష్యా చేరువగా వచ్చినట్లయ్యింది. అక్కడి ప్రధాని నగరం సెవెరోడొనెటెస్క్ను రష్యా సేనలు ఇటీవలే స్వాధీనం చేసుకున్నాయి. లీసిచాన్‌స్క్‌లో ఉక్రెయిన్ హోరాహోరీగా పోరాడినా లాభం లేకపోయింది. లీసిచాన్స్క్ సిటీ నిజంగా రష్యా ఆధీనంలో వెళ్లిందా, లేదా అనేదానిపై ఉక్రెయిన్ అధికారులు ఇంకా స్పందించలేదు. అయితే, లుహాన్స్క్పై రష్యా జవాన్లు భీకర స్థాయిలో విరుచుకుపడుతున్నట్లు ఆదివారం ఉదయం లుహాన్స్క్ గవర్నర్ సెర్హియి హైడై వెల్లడించారు. ఉక్రెయిన్ ప్రతిదాడుల్లో రష్యా సైన్యానికి భారీ నష్టం వాటిల్లుతోందని తెలిపారు. అయినప్పటికీ రష్యా సేనలు మున్ముందుకు దూసుకొస్తున్నాయని పేర్కొన్నారు. లీసిచాన్స్క్ ఆక్రమణతో ఇక డోంటెస్క్ ప్రావిన్స్‌లోకి అడుగు పెట్టడం రష్యాకు సులభతరంగా మారనుంది. మరోవైపు స్లొవ్యాన్స్క్లో రష్యా వైమానిక దాడుల్లో పెద్ద సంఖ్యలో జనం మరణించారని స్థానిక మేయర్ ప్రకటించారు. ఇక మెలిటోపోల్‌లో రష్యాకు ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ ఉక్రెయిన్ దాడుల్లో రష్యాకు చెందిన ఒక సైనిక స్థావరం ధ్వంసమయ్యింది. రష్యా భూభాగంలో ఉక్రెయిన్ దాడులు మరోవైపు ఉక్రెయిన్ సైన్యం రష్యా భూభాగంలోకి చొచ్చుకొచ్చి దాడులు చేయడం ఆసక్తికరంగా మారింది. పశ్చిమ రష్యాలో ఆదివారం ఉక్రెయిన్ క్షిపణి దాడుల్లో నలుగురు మృతిచెందారు. కుర్స్క్లో రెండు ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశామని రష్యా పేర్కొంది. సరిహద్దులోని టెట్కినో పట్టణంలో ఉక్రెయిన్ జవాన్లు మోర్టార్లతో దాడికి దిగారు. బెలారస్‌లోనూ ఉక్రెయిన్ వైమానిక దాడులు సాగించింది. రష్యాలోని బెల్గరోడ్ నగరంలో భారీ ఎత్తున జరిగిన బాంబు దాడుల్లో తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. ముగ్గురు మరణించారు. ఇది ఉక్రెయిన్ పనేనని రష్యా ఆరోపించింది. ఉక్రెయిన్‌లో ఆస్ట్రేలియా ప్రధాని పర్యటన ఉక్రెయిన్‌లో దెబ్బతిన్న పట్టణాలను ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బేనీస్ సందర్శించారు. ఉక్రెయిన్ రష్యా దారుణమైన అకృత్యాలకు తగిన శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. -
Russia Ukraine War: ముట్టడిలో లీసిచాన్స్క్
కీవ్/లండన్: తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్లో రష్యా సైన్యంగురువారం క్షిపణుల మోత మోగించింది. లీసిచాన్‌స్క్‌లో భీకర స్థాయిలో వైమానిక దాడులు సాగించింది. అలాగే లుహాన్స్క్లో 95 శాతం, డోంటెస్క్‌లో 50 శాతం భూభాగాన్ని రష్యా సైన్యం, రష్యా అనుకూల వేర్పాటువాద శక్తులు ఇప్పటికే ఆక్రమించాయి. లీసిచాన్స్క్లోకి ప్రవేశించేందుకు రష్యా సేనలు ప్రయత్నించగా ఉక్రెయిన్ జవాన్లు సమర్థంగా తిప్పికొట్టారని లుహాన్స్క్ గవర్నర్ సెర్హియి హైడై చెప్పారు. లీసిచాన్స్క్ చుట్టూ రష్యా సైన్యం మోహరించించి ఉందని వెల్లడించారు. క్రెమెన్‌చుక్‌లోని భారీ షాపింగ్ మాల్లో రష్యా వైమానిక దాడుల్లో చనిపోయిన 18 మంది మృతదేహాలకు గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. షాపింగ్ మాల్లో అదృశ్యమైన 20 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. స్నేక్ ఐలాండ్ నుంచి రష్యా వెనక్కి ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. నల్ల సముద్రంలోని స్నేక్ ఐలాండ్ నుంచి రష్యా సేనలు ఖాళీ చేస్తున్నాయి. తూర్పు ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాయి. కీలక పారిశ్రామిక ప్రాంతం డోన్బాస్ను హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా దాడులను ఉధృతం చేస్తున్నాయి. సరైన వ్యూహంతోనే స్నేక్ ఐలాండ్ నుంచి వెనక్కి మళ్లినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించగా, తమ దాడులను తట్టుకోలేకే రష్యా సేనలు పారిపోయాయమని ఉక్రెయిన్ అధికార వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్ నుంచి ఆహార ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి వీలుగా ఐక్యరాజ్యసమితి ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేస్తోందని, ఆ ప్రయత్నాలకు ఆటంకం కలగకుండా ఉండడానికే స్నేక్ ఐలాండ్ నుంచి తమ సేనలను వెనక్కి రప్పించామని రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కొనాషెంకోవ్ వెల్లడించారు. ఉక్రెయిన్‌లోని ఓడరేవులను రష్యా దిగ్బంధించిందని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. డోన్బాస్ విముక్తి పోరాటం: పుతిన్ ఉక్రెయిన్ విషయంలో తమ లక్ష్యాల్లో ఎలాంటి మార్పు లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తేల్చిచెప్పారు. ఆయన గురువారం తుర్క్మెనిస్తాన్లో పర్యటించారు. డోన్బాస్ విముక్తి కోసం, అక్కడి ప్రజల రక్షణ కోసం పోరాడుతున్నామని చెప్పారు. రష్యా భద్రతకు హామీనిచ్చే పరిస్థితులను సృష్టించుకోవాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. కీవ్‌ను స్వాధీనం చేసుకోవడంలో రష్యా విఫలమైందంటూ వస్తున్న విమర్శలను పుతిన్ ఖండించారు. ప్రణాళిక ప్రకారమే తమ సైన్యం పోరాటం కొనసాగిస్తోందని పేర్కొన్నారు. తుర్క్మెనిస్తాన్లోని అష్గాబాట్‌లో కాస్పియన్ సీ లిటోరల్ స్టేట్స్ శిఖరాగ్ర సదస్సులో పుతిన్ పాల్గొన్నారు. ఉక్రెయిన్‌కు అదనపు సైనిక సాయం ఉక్రెయిన్‌కు మరో బిలియన్ పౌండ్ల విలువైన సైనిక సాయం అందజేస్తామని బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రకటించారు. స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో గురువారం నాటో నేతల శిఖరాగ్ర సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సాయం కింద అత్యాధునిక ఆయుధాలు ఇస్తామన్నారు. పౌరుల ప్రాణాలను బలిగొంటున్న రక్కసి పుతిన్ అని దుయ్యబట్టారు. యూరప్ భద్రత, శాంతికి రష్యా పెనుముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. -
Russia-Ukraine war: చొచ్చుకెళ్తున్న రష్యా
కీవ్: తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్లోకి రష్యా సైన్యం మరింతగా చొచ్చుకుపోతోంది. గురువారం ఆ ప్రాంతంలో పలు గ్రామాలతో పాటు భారీ పరిమాణంలో భూభాగాన్ని ఆక్రమించి కీలకమైన హైవేను చేజిక్కించుకునే దిశగా సాగుతోంది. అదే జరిగితే ముందుండి పోరాడుతున్న ఉక్రెయిన్ దళాలకు సరఫరా మార్గాలన్నీ మూసుకుపోతాయి. రష్యా సైన్యానికి నానాటికీ అదనపు బలగాలు వచ్చి పడుతుండటంతో లిసిచాన్స్క్ నగరాన్ని అన్నివైపుల నుంచీ ముట్టడించేందుకు సిద్ధమవుతోంది. అందులో చిక్కే ప్రమాదాన్ని తప్పించుకునేందుకు నగరం, పరిసర ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ దళాలు వెనుదిరుగుతున్నాయి. లెహాన్స్‌క్ ప్రాంత పాలనా కేంద్రమైన సెవెరోడొనెట్స్క్ నగర సమీపంలోని పలు ఇతర పట్టణాలు, గ్రామాలపై రష్యా సైన్యం ఇప్పటికే అదుపు సాధించిందని ఉక్రెయిన్ వర్గాలు చెబుతున్నాయి. సెవరోడొనెట్స్క్ను కూడా పూర్తిగా ఆక్రమించేందుకు రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అక్కడ ఉక్రెయిన్ ప్రతిఘటన అజోట్ కెమికల్ ప్లాంటుకే పరిమితమైంది. కొద్దిపాటి సైనికులు పౌరులతో పాటు వారాలుగా ప్లాంటులో చిక్కుబడి ఉన్నారు. డోన్బాస్లో సగం మేరకు విస్తరించిన లుహాన్స్క్ ప్రాంతం ఇప్పటికే 95 శాతానికి పైగా రష్యా అధీనంలోకి వెళ్లిపోయింది. మరోవైపు ఉక్రెయిన్‌కు యూరోపియన్ యూనియన్ సభ్యత్వం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. బ్రెసెల్స్‌లో జరగనున్న ఈయూ శిఖరాగ్రంలో ఉక్రెయిన్‌కు అభ్యర్థి హోదా ఇస్తారని తెలుస్తోంది. తద్వారా ఉక్రెయిన్ను ఈయూలో చేర్చుకోవడంపై సభ్య దేశాలు అధికారికంగా చర్చలు జరుపుకోవడం వీలు పడుతుంది. ఈయూ పూర్తి సభ్యత్వ ప్రక్రియలో అభ్యర్థి హోదా తొలి అడుగు. అంతకుముందు ఈయూ ప్రశ్నావళికి ఉక్రెయిన్ ఇచ్చిన సమాధానాలను ఈయూ ఎగ్జిక్యూటివ్ బాడీ ఆమోదించింది. ఇక అమెరికాలోని భారతీయులు గురువారం ఉక్రెయిన్‌కు సంఘీభావం తెలిపారు. రష్యా తక్షణం నరమేధాన్ని ఆపాలంటూ నినదించారు. ఉక్రెయిన్‌పై దాడిని అమెరికాలోని భారతీయులంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు రష్యా నుంచి పూర్తిగా వైదొలగుతున్నట్టు ప్రపంచంలో అతి పెద్ద క్రీడా ఉపకరణాల తయారీ సంస్థ నైక్ పేర్కొంది. దేశంలో అమ్మకాలను అదిప్పటికే నిలిపేసింది. వందలాది టాప్ కంపెనీలు ఇప్పటికే రష్యాకు గుడ్‌బై చెప్పడం తెలిసిందే. -
Russia-Ukraine War: తూర్పు ఉక్రెయిన్‌లో భీకర పోరు
కీవ్: తూర్పు ఉక్రెయిన్‌లో భీకర పోరు కొనసాగుతోంది. డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను పూర్తిగా ఆక్రమించడమే లక్ష్యంగా రష్యా సేనలు భారీ స్థాయిలో బాంబు దాడులు చేస్తున్నాయి. వాటిలో పలు నగరాల్లో భవనాలు తదితరాలు నేలమట్టం కావడంతో పాటు పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించినట్టు ఉక్రెయిన్ వర్గాలు చెబుతున్నాయి. రష్యా దాడుల తీవ్రతను పెంచిన నేపథ్యంలో సెవెరోడొనెట్స్క్లో కెమికల్ ప్లాంటులో చిక్కుకున్న వందలాది పౌరులు, ఉక్రెయిన్ సైనికుల పరిస్థితిపై ఆందోళన నెలకొంది. తనను యూరోపియన్ యూనియన్‌లో చేర్చుకోవడంపై సభ్య దేశాలు ఏకాభిప్రాయానికి వస్తాయని ఉక్రెయిన్ ఆశాభావం వెలిబుచ్చింది. ఈ మేరకు త్వరలో నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నట్టు దేశ ఉప ప్రధాని ఓలా స్టెఫానిష్నా అన్నారు. మరోవైపు యుద్ధం మొదలైన తొలినాళ్లలో మరణించిన ఉక్రెయిన్ ఫొటో జర్నలిస్టును రష్యా సేనలు సజీవంగా పట్టుకుని దారుణంగా హతమార్చినట్టు తాజాగా వెలుగు చూసింది. రష్యా తరఫున గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలపై ఓ ఉక్రెయిన్ అధికారిని, మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
Russia-Ukraine war: శరణమో, మరణమో
కీవ్/మాస్కో: తూర్పు ఉక్రెయిన్‌లోని సెవెరోడొనెట్స్క్ నగరంలో మారియూపోల్ దృశ్యమే పునరావృతం అవుతోంది. నగరంపై రష్యా సేనలు పట్టు బిగించాయి. 800 మందికిపైగా పౌరులు ఓ కెమికల్ ప్లాంట్‌లో తలదాచుకుంటున్నారు. వారికి, నగరంలోని వారికి లొంగిపోవడం లేదా మరణించడం ఏదో ఒక్క అవకాశమే మిగిలి ఉందని సమాచారం. డోన్బాస్లో భారీ సంఖ్యలో ఉక్రెయిన్ ఆయుధాలను, సైనిక సామగ్రిని ధ్వంసం చేశామని రష్యా సోమవారం తెలియజేసింది. వుహ్లెదర్ థర్మల్ పవర్ ప్లాంట్‌పై ఉక్రెయిన్ వైమానిక దాడులు జరిపినట్లు సమాచారం. 40,000 మంది రష్యా జవాన్లు బలి! జూన్ ఆఖరు నాటికి రష్యా సైన్యం 40,000 మంది జవాన్లను కోల్పోనుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. డోన్బాస్లోకి రిజర్వు బలగాలను దించేందుకు రష్యా ప్రయత్నిస్తోందన్నారు. యుద్ధం మరో రెండేళ్లపాటు కొనసాగుతుందని రష్యా మాజీ ప్రధాని కాస్యనోవ్ అంచనా వేశారు. 20 మంది మహిళలపై వేధింపులు: అధ్యక్షుడు పుతిన్‌కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారన్న ఆనుమానంతో రష్యా పోలీసులు 20 మంది మహిళలను అదుపులోకి తీసుకొని, అమానవీయంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమ రష్యాలోని నిజ్నీ నొవోగొరోడ్లో ఈ దారుణం జరిగిందని బాధితుల తరపు న్యాయవాది చెప్పారు. రష్యా పోలీసులు 18 నుంచి 27 ఏళ్ల వయసున్న 20 మంది మహిళలను వివస్త్రలను చేసి, ఐదుసార్లు స్క్వాట్స్ చేయించారని తెలిపారు. అంతేకాకుండా ఈ దారుణాన్ని ఫోన్లలో వీడియో తీశారని పేర్కొన్నారు. -
Russia-Ukraine war: వీధుల్లో హోరాహోరీ
కీవ్: తూర్పు ఉక్రెయిన్‌లోని పారిశ్రామిక ప్రాంతం డోన్బాస్లో ఒక భాగమైన సీవిరోడోంటెస్క్‌ను పూర్తిస్థాయిలో చేజిక్కించుకునేందుకు రష్యా దళాలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఉక్రెయిన్–రష్యా సైనికుల మధ్య వీధి పోరాటాలు జరుగుతున్నాయి. ప్రత్యర్థులతో తమ సైనికులు వీరోచితంగా తలపడుతున్నారని లుహాన్స్క్ గవర్నర్ సెర్హివ్ హైడై గురువారం ప్రకటించారు. ప్రతి వీధిని, ప్రతి ఇంటిని కాపాడుకోవాలన్న లక్ష్యంతో రష్యా సేనలను ఢీకొంటున్నారని తెలిపారు. విలువైన బొగ్గు గనులు, పరిశ్రమలతో కూడిన డోన్బాస్‌పై రష్యా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇక్కడ రష్యా అనుకూల వేర్పాటువాదులు చాలాకాలంగా ఉక్రెయిన్ దళాలపై పోరాడుతున్నారు. సీవిరోడోంటెస్క్ కోసం రష్యా సైన్యం–ఉక్రెయిన్ సైన్యం వీధి పోరాటాలకు దిగుతుండడం ఆసక్తికరంగా మారింది. యుద్ధంలో ఇలాటి పరిణామం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మరోవైపు పశ్చిమ ఉక్రెయిన్‌లో జైటోమైర్‌లోని సైనిక శిక్షణ కేంద్రంపై క్షిపణి దాడులు నిర్వహించామని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ఇక్కడ కిరాయి సైనికులకు ఉక్రెయిన్ శిక్షణ ఇస్తోందని పేర్కొంది. సీవిరోడోంటెస్క్ సమీపంలోని లీసిచాన్స్క్పైనా రష్యా దాడులు ఉధృతమయ్యాయి. రాత్రి పగలు అనే తేడా లేకుండా నిరంతరాయంగా రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. డోన్బాస్ గతిని సీవిరోడోంటెస్క్ నిర్ణయిస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. రష్యాపై ఆంక్షలు మరింత కఠినతరం చేయాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. రష్యాను బలహీనం చేసేందుకు అందరూ ముందుకు రావాలన్నారు. నిత్యం 100 మంది ఉక్రెయిన్ జవాన్లు బలి రష్యా సైన్యం దాడుల్లో నిత్యం 100 మంది దాకా తమ సైనికులు మరణిస్తున్నారని ఉక్రెయిన్ రక్షణ శాఖ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ తెలిపారు. ఈ మేరకు ఫేస్బుక్లో పోస్టు చేశారు. రక్తపాతం బాధాకరమని పేర్కొన్నారు. తమ బిడ్డలను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ముగ్గురు విదేశీయులకు మరణ శిక్ష యుద్ధంలో ఉక్రెయిన్ తరపున పోరాడినందుకు గాను ఇద్దరు బ్రిటిష్ పౌరులు, ఒక మొరాకో పౌరుడికి రష్యా అనుకూల వేర్పాటువాదులు మరణశిక్ష ఖరారు చేశారు. ఉక్రెయిన్‌లో తమ చేతికి చిక్కిన ఈ ముగ్గురిపై కిరాయి సైనిక కార్యకలాపాలు, ఉగ్రవాదం అనే అభియోగాలు మోపారు. తూర్పు ఉక్రెయిన్‌లో ‘డోంటెస్క్ పీపుల్స్ రిపబ్లిక్’ పేరిట తామే సొంతంగా ఏర్పాటు చేసుకున్న దేశంలోని కోర్టు ద్వారా విచారణ జరిపారు. నేరం రుజువైందని పేర్కొంటూ ముగ్గురికి గురువారం మరణ శిక్ష విధించారు. తమను అధికారం నుంచి కూలదోసేందుకు ఈ మగ్గురూ కుట్ర పన్నారని వేర్పాటువాదులు ఆరోపించారు. నిజానికి ‘డోంటెస్క్ పీపుల్స్ రిపబ్లిక్’కు అధికారికంగా ఎలాంటి గుర్తింపు లేదు. ముగ్గురు బాధితులను ఐడెన్ అస్లిన్, షౌన్ పిన్నర్, సౌదున్ బ్రహీమ్గా గుర్తించినట్లు రష్యా వార్తా సంస్థ వెల్లడించింది. మరణశిక్షపై న్యాయస్థానంలో అప్పీలు చేసుకొనేందుకు వారికి నెల గడువిచ్చినట్లు తెలిపింది. ఈ ముగ్గురూ ఉక్రెయిన్‌లో కిరాయి సైనికులుగా పని చేస్తున్నారని వేర్పాటువాదులు చెబుతున్నారు. పిన్నర్, అస్లిన్ ఏప్రిల్‌లో మారియూపోల్‌లో, బ్రహీమ్ మార్చిలో వోల్నోవాఖాలో రష్యా అనుకూల వేర్పాటువాదుల చేతికి చిక్కారు. -
Russia Ukraine war: రష్యాపై ఆంక్షలకు ఈయూ ఆమోదం
కీవ్/మాస్కో: రష్యా నుంచి చమురు దిగుమతిపై నిషేధంతో సహా పలు ఆంక్షలను యూరోపియన్ యూనియన్(ఈయూ) శుక్రవారం అధికారికంగా ఆమోదముద్ర వేసింది. రాబోయే ఆరు నెలల్లో రష్యా నుంచి చమురు దిగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని ఈయూ ప్రధాన కార్యాలయం వెల్లడించింది. ఇతర పెట్రోలియం ఉత్పత్తులపై నిషేధాన్ని వచ్చే ఎనిమిది నెలల్లో పూర్తిగా నిషేధిస్తామని పేర్కొంది. హంగేరి, చెక్ రిపబ్లిక్, స్లొవేకియా, బల్గేరియా, క్రొయేషియా తదితర దేశాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని తాత్కాలికంగా కొన్ని మినహాయింపులు ఇచ్చినట్లు తెలిపింది. ఈ ఏడాది ఆఖరు నాటికి రష్యా నుంచి చమురు దిగుమతులను 90 శాతం నిలిపేస్తామని ఈయూ నేతలు ప్రకటించారు. అంతర్జాతీయ బ్యాంకు లావాదేవీలకు వేదిక అయిన ‘స్విఫ్ట్’ వ్యవస్థను రష్యా ఉపయోగించుకోకుండా ఈయూ ఇప్పటికే కట్టడి చేసింది. రష్యా టీవీ చానళ్లను కూడా ఈయూ నిషేధించింది. రష్యా క్రూర దాడులు: జెలెన్స్కీ తూర్పు డోన్బాస్లో భీకర యుద్ధం కొనసాగుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. రష్యా క్రూరంగా దాడులు చేస్తోందని ఆరోపించారు. సీవిరోడోంటెస్క్‌లో రష్యా దాడులను తిప్పికొట్టడంలో తాము కొంత పురోగతి సాధించామని అన్నారు. సమీపంలోని లీసిచాన్స్క్, బఖ్‌ముత్‌లో పరిస్థితి సంక్లిష్టంగానే ఉందని తెలిపారు. పలు నగరాలు, పట్టణాలపై రష్యా సేనలు క్షిపణి దాడులు కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. డోన్బాస్లో రష్యా అనుకూల వేర్పాటువాదుల ఆధీనంలో ఉన్న ప్రాంతాల నుంచి జనాన్ని సమీకరించి, యుద్ధ రంగంలోకి దించుతున్నారని జెలెన్స్కీ ఆరోపించారు. సాధారణ ప్రజలను ముందు వరుసలో ఉంచి, వారి వెనుక రష్యా సైనికులు వస్తున్నారని వెల్లడించారు. మున్ముందు మరింత సిగ్గుమాలిన, హేయమైన పరిణామాలను చూడబోతున్నామని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌కు అత్యాధునిక రాకెట్ సిస్టమ్స్ ఇచ్చేందుకు అంగీకరించిన అమెరికాకు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. లీసిచాన్స్క్.. 60 శాతం ధ్వంసం తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు ప్రధాన నగరాల్లో ఒకటైన లీసిచాన్‌స్క్‌లో రష్యా సేనలు క్షిపణుల మోత మోగిస్తున్నాయి. సిటీలో 60 శాతం మౌలిక సదుపాయాలు, నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. రష్యా నిరంతర దాడుల వల్ల విద్యుత్, సహజ వాయువు, టెలిఫోన్; ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోయినట్లు స్థానిక అధికారి ఒలెగ్జాండ్రా జైకా చెప్పారు. బఖ్ముత్–లీసిచాన్స్క్ రహదారిపై రాకపోకలకు అంతరాయం కలుగుతోందన్నారు. లీసిచాన్స్క్ నుంచి ఇప్పటిదాకా 20,000 మంది పౌరులకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. గతంలో ఇక్కడ 97,000 జనాభా ఉండేది. షోల్జ్‌తో ఉక్రెయిన్ పార్లమెంట్ స్పీకర్ భేటీ ఉక్రెయిన్ పార్లమెంట్ స్పీకర్ రుస్లాన్ స్టెఫాన్చుక్ జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ షోల్జ్‌తో బెర్లిన్‌లో సమావేశమయ్యారు. తమ పార్లమెంట్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడాలని కోరారు. జర్మనీ పార్లమెంట్ సమావేశంలో స్టెఫాన్చుక్ పాల్గొన్నారు. జర్మనీ పార్లమెంట్ స్పీకర్ బెయిర్బెల్ బాస్ ఆయనకు స్వాగతం పలికారు. ఉక్రెయిన్‌లో పౌర మరణాలు 4,945: ఐరాస రష్యా దాడుల వల్ల ఉక్రెయిన్‌లో 9,094 మంది సాధారణ పౌరులు బాధితులుగా మారారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం తాజా నివేదికలో వెల్లడించింది. 4,149 మంది ప్రాణాలు కోల్పోయారని, 4,945 మంది క్షతగాత్రులయ్యారని తెలియజేసింది. బలమైన పేలుడు సంభవించే ఆయుధాల వల్లే ఎక్కువ మంది మరణించారని, గాయపడ్డారని పేర్కొంది. ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం భారీ వైమానిక దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. రష్యా ప్రారంభించిన యుద్ధంలో తమ దేశంలో 243 మంది చిన్నారులు బలయ్యారని, 446 మంది గాయాలపాలయ్యారని ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం వివరించింది. -
Russia Ukraine war: డోన్బాస్‌పై రష్యా పిడికిలి
కీవ్/మాస్కో/వాషింగ్టన్: తూర్పు ఉక్రెయిన్‌లో పారిశ్రామికప్రాంతమైన డోన్బాస్‌పై రష్యా పట్టు బిగుస్తోంది. ఈ ప్రాంతంలో కీలకమైన సీవిరోడోంటెస్క్ శివార్లలోకి రష్యా దళాలు సోమవారం అడుగుపెట్టాయి. లీసిచాన్స్క్ దిశగా దూసుకెళ్తున్నాయి. పెద్ద సంఖ్యలో ఆయుధ సామగ్రిని ఇక్కడికి తరలిస్తున్నాయి. పుతిన్ సేనలు పెద్ద వ్యూహమే పన్నినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని లుహాన్స్క్ ప్రాంతీయ గవర్నర్ సెర్గీ హైడై స్వయంగా ప్రకటించారు. రష్యా సైన్యం దాడుల్లో తాజాగా ఇద్దరు ఉక్రెయిన్ పౌరులు మరణించారని, ఐదుగురు గాయపడ్డారని చెప్పారు. డోన్బాస్లో మారియుపోల్ ఉదంతమే పునరావృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. సీవిరోడోంటెస్క్ రష్యా దక్షిణ సరిహద్దుకు 143 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం ప్రస్తుతం ఇక్కడే కేంద్రీకృతమైంది. లుహాన్స్క్ ప్రావిన్స్‌లో ఉక్రెయిన్ అధీనంలో ఉన్న ప్రాంతాలు సీవిరోడోంటెస్క్, లీసిచాన్స్క్ మాత్రమే. లుహాన్స్క్, డోంటెస్క్ను కలిపి డోన్బాస్‌గా పిలుస్తారు. డోంటెస్క్, లైమాన్లోనూ రష్యా, ఉక్రెయిన్ దళాల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఉక్రెయిన్‌లోని డోంటెస్క్, లుహాన్స్క్కి విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చెప్పారు. ఆ రెండు ప్రాంతాలను తాము స్వతంత్ర రాజ్యాలుగానే చూస్తున్నామని తెలిపారు. మైకోలైవ్ షిప్‌యార్డ్‌లో ఉక్రెయిన్ సైనిక వాహనాలను తాము ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనాషెంకోవ్ చెప్పారు. డోన్బాస్లో పరిస్థితి ఇప్పుడు మాటల్లో వర్ణించలేనంత తీవ్రంగానే ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఆయన రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్‌లో సైనికులతో మాట్లాడారు. మా వద్ద ఆ ప్రణాళిక లేదు: బైడెన్ ఉక్రెయిన్‌కు తాము ఆయుధాలు పంపించబోతున్నట్లు వస్తున్న వార్తనలు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు. లాంగ్–రేంజ్ రాకెట్ సిస్టమ్స్‌ను ఉక్రెయిన్‌కు ఇవ్వడం లేదని, అలాంటి ప్రణాళికేదీ తమ వద్ద లేదని స్పష్టం చేశారు. బైడెన్ ప్రకటన పట్ల రష్యా భద్రతా మండలి ఉప నేత దిమిత్రీ మెద్వెదేవ్ హర్షం వ్యక్తం చేశారు. కళాకారుల సాయం ఉక్రెయిన్‌కు చేతనైన సాయం అందించేందుకు కళాకారులు సైతం ముందుకొస్తున్నారు. కొన్ని రోజుల క్రితం యూరోవిజన్ పాటల పోటీలో విజేతగా నిలిచిన కలుష్ ఆర్కెస్ట్రా బృందం(ఉక్రెయిన్) సైతం ఈ జాబితాలో ఉంది. కలుష్ బృందానికి లభించిన ట్రోఫీ క్రిస్టల్ మైక్రోఫోన్‌ను క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ ‘వైట్‌బిట్’ 9 లక్షల డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ సొమ్ముతో ఉక్రెయిన్ సైన్యానికి మూడు డ్రోన్లు, గ్రౌండ్ కంట్రోల్ సిస్టమ్ అందిస్తామని కలుష్ బృందం వెల్లడించింది. అది చరిత్రాత్మక అవకాశం: స్టోల్టెన్‌బర్గ్ మాడ్రిడ్‌లో వచ్చే నెలలో జరగబోయే సదస్సు నాటో కూటమిని బలోపేతం చేసుకోవడానికి ఒక చరిత్రాత్మక అవకాశం అవుతుందని కూటమి సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ సోమవారం చెప్పారు. నాటో కూటమిలోకి స్వీడన్, ఫిన్లాండ్ను ఆహ్వానించేందుకు తాను ఉత్సాహంతో ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. -
Russia Ukraine war: లైమాన్.. రష్యా హస్తగతం!
కీవ్/మాస్కో: తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా సైన్యం తీవ్రంగా పోరాడుతోంది. మారియుపోల్ అనంతరం డోన్బాస్‌పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో పెద్ద నగరమైన లైమాన్‌ను తమ దళాలు, వేర్పాటువాదులు హస్తగతం చేసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనాషెంకోవ్ శనివారం ప్రకటించారు. ముఖ్యమైన రైల్వే జంక్షన్‌ను సైతం ఆక్రమించినట్లు తెలిపారు. లైమాన్కు విముక్తి కల్పించామని వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24 కంటే ముందు లైమాన్లో 20 వేల జనాభా ఉండేది. యుద్ధం మొదలైన తర్వాత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఉక్రెయిన్ ప్రభుత్వం తరలించింది. ఇక్కడున్న రైల్వే జంక్షన్లో రష్యా దళాలు పాగా వేశాయి. లైమాన్పై పట్టుచిక్కడంతో డోంటెస్క్, లుహాన్స్క్ను స్వాధీనం చేసుకోవడం రష్యాకు మరింత సులభతరం కానుంది. ఈ రెండు ప్రావిన్స్‌లను కలిపి డోన్బాస్‌గా వ్యవహరిస్తారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను ఆక్రమించలేక విఫలమైన రష్యా డోన్బాస్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. లుహాన్స్క్ ప్రావిన్స్‌లోని నగరాలైన సీవిరోడోంటెస్క్, లీసిచాన్‌స్క్‌లో రష్యా వైమానిక దాడుల శనివారం కూడా కొనసాగాయి. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో పరిస్థితి ప్రస్తుతం సంక్లిష్టంగానే ఉందని అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరించారు. అయినప్పటికీ తమ దేశానికి ముప్పేమీ లేదని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ ఒక స్వతంత్ర దేశంగా మనుగడ సాగిస్తుందని అన్నారు. 50 ఏళ్ల దాకా రష్యా సైన్యంలో చేరొచ్చు సైన్యంలో కాంట్రాక్టు సైనికుల నియామకాల కోసం వయోపరిమితిని పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శనివారం సంతకం చేశారు. ఈ బిల్లు ప్రకారం.. 50 ఏళ్ల వయసు లోపు ఉన్నవారు కాంట్రాక్టు జవాన్లుగా రష్యా సైన్యంలో చేరి సేవలందించవచ్చు. పురుషులైతే 65 ఏళ్లు, మహిళలైతే 60 ఏళ్లు వచ్చేదాకా సైన్యంలో పనిచేయొచ్చు. వార్షిక బోర్డర్ గార్డ్స్ దినోత్సవంలో పుతిన్ పాల్గొన్నారు. సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న జవాన్లను అభినందించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్, జర్మనీ చాన్సలర్ ఓలాఫ్ షోల్జ్‌తో పుతిన్ ఫోన్లో మాట్లాడారు. తమ దేశంపై ఆంక్షలు ఎత్తివేస్తే ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులు ఎగమతి చేయడానికి సిద్ధంగా ఉన్నామని పుతిన్ చెప్పారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇవ్వొద్దని మాక్రాన్, షోల్జ్‌కు సూచించారు. ఆయుధాలు సరఫరా చేస్తే ఉక్రెయిన్‌లో పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించారు. పరిమాణాలను ప్రమాదకరంగా మార్చొద్దని చెప్పారు. -
Russia-Ukraine war: నెమ్మదించిన రష్యా
ఖర్కీవ్: యుద్ధంలో రష్యాకు నానాటికీ ప్రతికూల పరిణామాలే ఎదురవుతున్నాయి. తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్ను పూర్తిగా స్వాధీనం చేసుకోవడం ద్వారా యుద్ధాన్ని గౌరవప్రదంగా ముగించాలన్న రష్యా ఆశలు ఫలించడం లేదని అమెరికా అంటోంది. అక్కడ కూడా రష్యా దాడులను ఉక్రెయిన్ సమర్థంగా అడ్డుకుంటోంది. దాంతో రష్యా యుద్ధ ప్రణాళిక బాగా నెమ్మదించిందని యూఎస్ రక్షణ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలతో పుతిన్ సేనల నైతిక స్థైర్యం నానాటికీ మరింతగా దిగజారుతోందని ఇంగ్లండ్ అభిప్రాయపడింది. శనివారం లుహాన్స్క్లో పలు ప్రాంతాలపై దాడికి దిగిన రష్యా సైనికుల్లో అత్యధికులను హతమార్చినట్టు స్థానిక గవర్నర్ తెలిపారు. డోన్బాస్ను పూర్తిగా నేలమట్టం చేయాలని, అక్కడున్న వారందరినీ హతమార్చాలని రష్యా ప్రయత్నిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ఆరోపించారు. ఖర్కీవ్‌లో సగానికి పైగా నివాస సముదాయాలు మరమ్మతులకు వీలు కానంతగా దెబ్బ తిన్నాయని నగర మేయర్ చెప్పారు. ఆంక్షల దెబ్బకు రష్యా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 10 శాతానికి పైగా కుంచించుకుపోతుందని ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ అంచనా వేసింది. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు పాశ్చాత్య దేశాలే తూట్లు పొడుస్తున్నాయని రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ ఆరోపించారు. -
Russia-Ukraine war: తూర్పున దాడి ఉధృతం
ఇర్పిన్: ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంపై రష్యా దాడులను తీవ్రం చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ముట్టడి విఫలమైన తర్వాత రష్యా తన దృష్టిని తూర్పు ఉక్రెయిన్‌వైపు మరలించింది. ఈ ప్రాంతంలో ఉక్రెయిన్‌కు కీలకమైన పరిశ్రమలున్నాయి. దీన్ని స్వాధీనం చేసుకుంటే ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయవచ్చని రష్యా భావిస్తోంది. డోన్బాస్ ప్రాంతంలో రష్యా కాల్పులు అధికమయ్యాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. మారియుపోల్‌లో ఇప్పటికీ ఉంటున్న పౌరులు మరిన్ని ఇక్కట్లు పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఆ నగరంలోని స్టీల్‌ప్లాంట్‌పై రష్యా దాడి ముమ్మరమైనట్లు శాటిలైట్ చిత్రాలు చూపుతున్నాయి. మరోవైపు ఉక్రెయిన్‌లో ఐరాస చీఫ్ గుటెరస్ పర్యటన కొనసాగుతోంది. యుద్ధంలో అధిక మూల్యం చెల్లించేది చివరకు సామాన్య ప్రజలేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధనేరాల గురించి మాట్లాడాల్సివస్తే, అసలు యుద్ధమే నేరమని చెప్పాలన్నారు. మరోవైపు ఉక్రెయిన్‌కు సహాయం కొనసాగిస్తామని బల్గేరియా కొత్త ప్రధాని భరోసా ఇచ్చారు. రష్యా పౌర నివాసాలపై దాడులకు దిగుతోందని ఉక్రెయిన్ అధికారులు ఆరోపించారు. తమ అధీనంలో ఉన్న ఖెర్సాన్ నగరంలో పేలుళ్లు జరిగాయని రష్యా తెలిపింది. పోరు కొనసాగించేందుకు తమకు మరిన్ని ఆయుధాలందించాలని ఉక్రెయిన్ మిత్ర దేశాలను కోరింది. నాటో సాయం 800 కోట్ల డాలర్లు ఇప్పటివరకు ఉక్రెయిన్‌కు నాటో దేశాలు దాదాపు 800 కోట్ల డాలర్ల సాయం అందించాయని నాటో చీఫ్ స్టోల్టెన్‌బర్గ్ చెప్పారు. ఉక్రెయిన్‌కు మరింత సాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. నాటోలో చేరాలనుకుంటే ఫిన్లాండ్, స్వీడన్‌ను సాదరంగా స్వాగతిస్తామని చెప్పారు. రష్యాతో యుద్ధం సంవత్సరాలు కొనసాగినా, తాము ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తామన్నారు. కొత్త శతాబ్దిలో యుద్ధాలు ఆమోదయోగ్యం కావని ఐరాస చీఫ్ గుటెరస్ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ యుద్ధంలో నేరాలపై ఐసీసీతో విచారణకు తాను మద్దతిస్తానన్నారు. ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలను ఆయన సందర్శించారు. -
తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటు ప్రాంతాలకు.. స్వతంత్ర హోదాకు రష్యా నిర్ణయం!
మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగే ఆలోచన లేదంటూనే సంక్షోభాన్ని మరింత పెంచే చర్యలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ దిగుతున్నారు. తూర్పు ఉక్రెయిన్‌లో వేర్పాటువాదుల అదీనంలోని రెండు ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తించాలని ఆయన నిర్ణయించారు. సోమవారం తన నేతృత్వంలోని ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ కౌన్సిల్‌ను సమావేశపరిచి ఈ విషయమై లోతుగా చర్చించారు. తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ దీనిపై మాట్లాడారు. దీనిపై ఉక్రెయిన్ తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. ఐరాస భద్రతా మండలిని తక్షణం సమావేశపరిచి రష్యా దూకుడుపై చర్చించాలని కోరింది. ఆ రెండు వేర్పాటువాద ప్రాంతాల్లో రష్యా అనుకూల రెబల్స్ ప్రభుత్వాలు నడుపుతున్నాయి. తమను స్వతంత్ర దేశాలుగా గుర్తించాలని, ఉక్రెయిన్ ఆక్రమణల బారినుంచి కాపాడి అన్నివిధాలా ఆదుకోవాలని రెబెల్స్ తాజాగా రష్యాను కోరారు. రష్యా పార్లమెంటు దిగువ సభ కూడా గత వారం పుతిన్‌కు ఆ మేరకు విజ్ఞప్తి చేసింది. -
ఉక్రెయిన్ ఉద్రిక్తతలు.. పుతిన్‌తో చర్చలకు బైడెన్ ఓకే
వాషింగ్టన్: యూరప్‌లో యుద్ధ భయాల నడుమ చివరి ఆశగా శాంతి యత్నాలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై అమెరికా, రష్యా అధ్యక్షులు జో బైడెన్, వ్లాదిమిర్ పుతిన్ మరోసారి చర్చలు జరిపే సూచనలు కని్పస్తున్నాయి. సంక్షోభాన్ని చల్లార్చేందుకు పుతిన్‌తో భేటీకి బైడెన్ సూత్రప్రాయంగా అంగీకరించారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకీ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సమస్యను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలన్నదే ముందునుంచీ తమ వైఖరి అన్నారు. అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు ఆంటోనీ బ్లింకెన్, సెర్గీ లవ్రోవ్ ఈ వారం భేటీ కానున్నారని గుర్తు చేశారు. అయితే ఈ రెండు భేటీలూ ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగని పక్షంలో మాత్రమే జరుగుతాయన్నారు. దీనిపై రష్యా ఆచితూచి స్పందించింది. అధ్యక్షుల సమావేశం జరిగే ఆస్కారముందన్న పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్, ‘‘అయితే అవి ఎప్పుడు, ఎలా జరుగుతాయన్న దానిపై ఈ దశలో మాట్లాడటం తొందరపాటే అవుతుంది’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘‘భేటీ జరగడం మంచిదేనని అధ్యక్షులిద్దరూ భావిస్తేనే జరుగుతుంది. విదేశాంగ మంత్రుల స్థాయిలో చర్చలు కొనసాగించాల్సిన అవసరముందన్న వరకూ మాత్రం ప్రస్తుతానికి స్పష్టత ఉంది’’ అన్నారు. చర్చలకు తామెప్పుడూ సిద్ధమేనని, కాదని యుద్ధానికే దిగితే దీటుగా స్పందించేందుకు రెడీగా ఉన్నామని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ అన్నారు. జోరుగా రష్యా సైనిక విన్యాసాలు రెబెల్స్ ముసుగులో ఉక్రెయిన్ భూభాగం నుంచి రష్యాపైకి కవి్వంపు చర్యలకు దిగి, ఆ సాకుతో దాడి చేయడం పుతిన్ వ్యూహమని అమెరికా ఆరోపిస్తూ వస్తోంది. శనివారం నాటి అణు పరీక్షలకు కొనసాగింపుగా బెలారుస్తో రష్యా సంయుక్త సైనిక విన్యాసాలు సోమవారమూ పెద్ద ఎత్తున జరిగాయి. తూర్పు ఉక్రెయిన్‌లో కాల్పులు, బాంబుల మోతలు మరింతగా పెరిగాయి. ఇవన్నీ పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీస్తాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. బెలారుస్ సరిహద్దుల నుంచి కేవలం 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా విరుచుకుపడుతుందని నాటో అనుమానిస్తోంది. విన్యాసాల పేరిట 30 వేల దాకా సైన్యాన్ని బెలారుస్‌కు ఇప్పటికే తరలించిందని ఆరోపిస్తోంది. ఉక్రెయిన్‌కు మూడువైపులా మోహరించిన దాదాపు రెండు లక్షల సైన్యం నెమ్మదిగా ముందుకే కదులుతోందని అమెరికా, పశి్చమ దేశాలు ఆరోపిస్తున్నాయి. దాడికి దిగితే రష్యాపై విధించాల్సిన కఠినమైన ఆంక్షల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినట్టు యూరోపియన్ యూనియన్ ప్రకటించింది. మాక్రాన్ మధ్యవర్తిత్వం బైడెన్, పుతిన్ తాజా భేటీ ప్రయత్నాలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మధ్యవర్తిత్వం వహించారు. బైడెన్, పుతిన్‌తో ఆయన మాట్లాడారని ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. ‘‘అధ్యక్షుల భేటీలో చర్చించాల్సిన అంశాలను అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు గురువారం సమావేశమై ఖరారు చేస్తారు. వీటితో పాటు ఉక్రెయిన్ విషయమై ఇరు దేశాల మధ్య ఇతర స్థాయిల్లో కూడా చర్చలు కొనసాగుతాయి’’ అని వివరించింది. ఈలోగా ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగకూడదన్నదే ఈ చర్చలన్నింటికీ ఏకైక షరతని వెల్లడించింది. -
దద్దరిల్లుతున్న తూర్పు ఉక్రెయిన్
కీవ్: యూరప్‌లో యుద్ధ ఘంటికలు మోగుతున్నాయి. సైన్యానికి, రష్యా అనుకూల రెబెల్స్‌కు మధ్య నానాటికీ పెరుగుతున్న కాల్పుల మోతతో తూర్పు ఉక్రెయిన్ సరిహద్దులు దద్దరిల్లుతున్నాయి. వీటికి తోడు గత 24 గంటల్లో ఇరువైపులా కనీసం 1,500కు పైగా పేలుళ్లు జరిగినట్టు తెలుస్తోంది. దాంతో రెబల్స్ ఆక్రమిత ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు రష్యా బాట పడుతున్నారు. ఉక్రెయిన్‌కు మూడువైపులా రష్యా సైనిక మోహరింపులు రెండు లక్షలకు చేరాయన్న వార్తలు యూరప్ దేశాలను మరింత ఆందోళన పరుస్తున్నాయి. శనివారం నాటి అణు, సంప్రదాయ సైనిక విన్యాసాలకు కొనసాగింపుగా నల్లసముద్ర తీరంలో రష్యా జోరుగా నావికా విన్యాసాలకు కూడా దిగింది. బెలారస్‌తో ఆదివారం ముగియాల్సిన సంయుక్త సైనిక విన్యాసాలు మరికొద్ది రోజులు కొనసాగుతాయని ప్రకటించి ఉద్రిక్తతలను మరింత పెంచింది. విన్యాసాలను పొడిగించినట్టే ఏదో సాకుతో రష్యా యుద్ధానికీ దిగుతుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆరోపించారు. దాన్ని నివారించేందుకు పుతిన్‌తో ఎక్కడైనా, ఎలాంటి రూపంలోనైనా చర్చలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సిద్ధమన్నారు. తూర్పు ఉక్రెయిన్‌లోని తమ పౌరుల భద్రత ప్రమాదంలో పడిందనే నెపంతో యుద్ధానికి దిగవచ్చని నాటో దేశాలంటున్నాయి. అక్కడ రష్యన్లను ఊచకోత కోస్తున్నారని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవల ఆరోపిస్తుండటమే ఇందుకు రుజువంటున్నాయి. పుతిన్ చెప్పిన చోట చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ ప్రకటించినా రష్యా స్పందించలేదు. రష్యా అసలు చర్చలకు సిద్ధంగా ఉందా అన్నది అసలు ప్రశ్న అని యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మైఖేల్ అన్నారు. దూకుడుగా క్షిపణి పరీక్షలు, దళాల మోహరింపులకు దిగుతున్న వాళ్లముందు చర్చల మంత్రం పఠించడం వృథా అని అభిప్రాయపడ్డారు. ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆదివారం పుతిన్‌తో ఫోన్లో మాట్లాడారు. అమెరికా, రష్యా విదేశాంగ మంత్రు లు ఆంటోనీ బ్లింకెన్, సెర్గీ లవ్రోవ్ 24న భేటీ కానున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ ఇప్పుడు యూరప్ అంతటి ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొం టోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి తెగబడితే దానిపై అత్యంత కఠినమైన ఆంక్షలు విధించే విషయంలో యూరప్ దేశాలన్నీ కలిసి రావాలి. – అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ వెనక్కు వచ్చేయండి ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి భారత దౌత్య సిబ్బంది కుటుంబీకులంతా వెంటనే వచ్చేయాలని కేంద్రం సూచించింది. అక్కడున్న భారతీయులంతా కూడా తక్షణం స్వదేశానికి వచ్చేయాలని మరోసారి చెప్పింది. ‘‘అందుబాటులో ఉన్న కమర్షియల్, చార్టర్డ్ ఫ్లైట్లలో బయల్దేరండి. వివరాల కోసం ఎంబసీని సంప్రదించండి.’’ అని పేర్కొంది. మంగళ, గురు, శనివారాల్లో ఉక్రెయిన్ నుంచి భారత్‌కు ఎయిరిండియా విమానాలున్నందున సిబ్బంది కుటుంబీకుల కోసం ప్రత్యేక విమానం పంపే ఆలోచనేదీ లేదని అధికారులు చెప్పారు. -
మృత్యువుకు చేరువలో ఎనిమిదివేలమంది!
ఉక్రెయిన్: తూర్పు ఉక్రెయిన్ ఇప్పుడు ఓ తీవ్ర సమస్యను ఎదుర్కొంటుంది. వైద్య సదుపాయాలు లేక, మందులు దొరక్క దాదాపు 8,000 మంది ప్రాణాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఏదో ఒకలా కోలుకుంటారులే అనుకోవడానికి వారేం సాధారణ రోగులు కాదు. ఎయిడ్స్ బాధితులు. హెచ్ఐవీ సోకిన వీరంతా కూడా కనీసం మరికొద్ది రోజులు బతికి ఉండే అవకాశం లేకుండా పోయింది. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ ఎయిడ్స్ సొసైటీ కాన్ఫరెన్స్‌లో ఆ సంస్థ చీఫ్ మైఖెల్ కజచ్కినే(ఈయన ఐక్యరాజ్య సమితి ప్రతినిధి కూడా) తెలిపారు. రష్యాకు తూర్పు ఉక్రెయిన్‌కు మధ్య ఏర్పడిన రాజకీయ సంక్షోభం వల్లే ఈ సమస్య తలెత్తిందని తెలిపారు. గత కొంత కాలంగా రష్యాకు ఉక్రెయిన్ను మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సరిహద్దుల వద్ద బలగాలు మోహరించారు. ఇంతకుముందు ఇరు దేశాలమధ్య పంపిణీ అయిన యాంటీ రిట్రోవైరల్ మెడిసిన్ ఇప్పుడు ఉక్రెయిన్‌కు చేరకుండా రష్యా సేనలు, రష్యా మద్దతు దారులు చెక్‌పోస్టుల వద్ద అడ్డుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులైన 8000 మంది ప్రాణాలు క్లిష్ట పరిస్థితుల మధ్య ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఈ సమస్యలో కీలక దేశాలనై జర్మనీ, అమెరికా, ఫ్రాన్స్, రష్యా, ఉక్రెయిన్ ఏదో ఒక ముందడుగు వేసి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఆగస్టు నెల సగంనాటికి మెడిసిన్ అందించకుంటే ఓ ప్రమాదం చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. అది మానవత్వానికి మచ్చలా కనిపిస్తుందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకో ఆసక్తి కరమైన విషయమేమిటంటే ఇక్కడివారికి ఎయిడ్స్ రావడానికి సిరంజిల ద్వారా డ్రగ్స్ తీసుకోవడమే ప్రధాన కారణమట.