మాస్కో: తూర్పు ఉక్రెయిన్‌లో సైనికుల తాత్కాలిక నివాసాలపై తాము జరిపిన రాకెట్ దాడుల్లో 600 మంది మరణించారని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. రష్యా అధీనంలో ఉన్న డాన్‌టెస్క్ ప్రాంతంపై ఉక్రెయిన్ దాడుల్లో 89 మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ప్రతీకార చర్యగానే తాము క్రమటోర్క్‌స్‌పై ప్రాంతంలో సైనికుల ఇళ్లపై దాడులు చేసినట్టు పేర్కొంది.
సైనికులు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న ఇళ్లకు సంబంధించిన కచ్చితమైన సమాచారం అందడంతో తాము రాకెట్ దాడులు చేశామని ఒక ప్రకటనలో తెలిపింది. ఒక ఇంట్లో 700 మంది సైనికులు ఉంటే, మరొక ఇంట్లో 600 మంది ఉన్నారని తాము చేసిన రాకెట్ దాడుల్లో 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ఇదే నిజమైతే గత ఫిబ్రవరి 24న యుద్ధం మొదలు పెట్టినప్పట్నుంచి ఉక్రెయిన్‌కు భారీగా ప్రాణనష్టం జరిగిన ఘటన ఇదే.
Comments
Please login to add a commentAdd a comment