retaliation
-
ఇరాన్‌పై నిప్పుల వర్షం
టెల్ అవీవ్: పశ్చిమాసియాలో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయాయి. ఊహించినట్లుగానే ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం ప్రతీకార చర్యలు ప్రారంభించింది. శనివారం తెల్లవారుజామున యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. ఇలామ్, ఖుజిస్తాన్, టెహ్రాన్ ప్రావిన్స్‌ల్లోని సైనిక, ఆయుధ స్థావరాలే లక్ష్యంగా దాడులకు దిగింది. మొత్తం 100 ఫైటర్ జెట్లతో మూడు దశల్లో 20 లక్ష్యాలపై కచి్చతత్వంతో కూడిన దాడులు నిర్వహించింది. ఇరాన్‌కు చెందిన క్షిపణి, డ్రోన్ల తయారీ కేంద్రాలు, ప్రయోగ కేంద్రాలపై వైమానిక దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. అయితే, చమురు నిల్వలపై దాడులు జరిగాయా లేదా అనేది తెలియరాలేదు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్ధాలు వినిపించినట్లు సమాచారం. తాజా దాడుల్లో ఇరాన్‌కు ఎంతమేరకు నష్టం వాటిల్లిందన్న సంగతి ఇజ్రాయెల్ బయటపెట్టలేదు. ఇరాన్‌పై దాడుల తర్వాత తమ యుద్ధవిమానాలు క్షేమంగా వెనక్కి తిరిగి వచ్చాయని వెల్లడించింది. గత నాలుగు దశాబ్దాల తర్వాత ఇరాన్‌పై మరో దేశం నేరుగా దాడికి దిగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ ఆపరేషకు ఇజ్రాయెల్ ‘పశ్చాత్తాప దినాల మిషన్’ అని పేరుపెట్టింది. రంగంలోకి అత్యాధునిక యుద్ధ విమానాలు ఇజ్రాయెల్ సైన్యం పక్కా ప్రణాళికతో ఇరాన్‌పై దాడికి దిగినట్లు సమాచారం. అత్యాధునిక ఫైటర్ జెట్లను సైన్యం రంగంలోకి దించింది. ఐదో తరం ఎఫ్–35 అడిర్ ఫైటర్ జెట్లు, ఎఫ్–15టీ గ్రౌండ్ అటాక్ జెట్లు, ఎఫ్–16ఐ సూఫా ఎయిర్ డిఫెన్స్ జెట్లు ఇందులో ఉన్నాయి. ఇవి 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదింగలవు. ఇజ్రాయెల్ ప్రధానంగా ఇరాన్ సైనిక, ఆయుధ స్థావరాలపైనే గురిపెట్టింది. జనావాసాల జోలికి వెళ్లలేదు. తొలుత రాడార్, ఎయిర్ డిఫెన్స్ కేంద్రాలపై దాడికి పాల్పడింది. అనంతరం సైనిక స్థావరాలు, మిస్సైల్, డ్రోన్ల కేంద్రాలపై క్షిపణుల వర్షం కురిపించింది. మొత్తం మూడు దశల్లో దాడులు జరగ్గా, ఒక్కో దశ దాడిలో దాదాపు 30 చొప్పున యుద్ధవిమానాలు పాల్గొన్నాయి. మరోవైపు ఇరాన్ నుంచి ప్రతిదాడులు జరిగే అవకాశం ఉందన్న అంచనాతో ఇజ్రాయెల్, అమెరికా తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అప్రమత్తం చేశాయి. విమానాల రాకపోకలకు వీల్లేకుండా ఇరాన్, ఇరాక్ తమ గగనతలాన్ని మూసివేశాయి. టెహ్రాన్‌లో సాధారణ పరిస్థితులే.. ఇజ్రాయెల్ దాడుల్లో తమకు పరిమిత నష్టమే వాటిల్లిందని, ఎదురుదాడిలో నలుగురు సైనికులు మృతి చెందారని ఇరాన్ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ దాడులను తమ గగనతల రక్షణ వ్యవస్థ సమర్థంగా తిప్పికొట్టిందని చెప్పారు. దాడుల అనంతరం టెహ్రాన్‌లో సాధారణ పరిస్థితులే కనిపించాయి. పిల్లలు స్కూళ్లకు వెళ్లారు. దుకాణాలు ఎప్పటిలాగే తెరుచుకున్నాయి. పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద మాత్రం జనం బారులు తీరి కనిపించారు. ఇదిలా ఉండగా, ఇరాన్‌పై దాడుల పట్ల మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఇజ్రాయెల్ చర్యను పలు దేశాలు ఖండించాయి. సంయమనం పాటించాలని సూచించాయి. అమెరికా వంటి మిత్రదేశాలు మాత్రం ఇజ్రాయెల్‌కు మద్దతు పలికాయి. 25 రోజుల తర్వాత ప్రతిదాడి ఇరాన్‌పై దాడుల సందర్భంగా కొన్ని ఫొటోలు, వీడియోలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఇందులో టెల్ అవీవ్ ఉన్న కిర్యా మిలటరీ బేసులోని మిలటరీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లాంట్ సైనిక సలహాదారులతో, సైనికాధికారుతో చర్చిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్»ొల్లా, హమాస్ నాయకులు మరణించడం పట్ల ఇరాన్ ఆగ్రహంతో రగిలిపోయింది. ఈ నెల 1న ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్ భూభాగంపై దాదాపు 200 క్షిపణులు ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇరాన్ పెద్ద తప్పు చేసిందని, తాము తగిన జవాబు ఇవ్వక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అప్పుడే హెచ్చరించారు. ఇరాన్ దాడి చేసిన వెంటనే ఇజ్రాయెల్ ప్రతిదాడులకు దిగే అవకాశం ఉందని అప్పట్లో భావించినప్పటికీ ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గింది. అప్పుడు వాతావరణం అనుకూలించకపోవడంతో తమ ఆపరేషన్ వాయిదా వేసుకుంది. పరిస్థితులు సానుకూలంగా మారడంతో 25 రోజుల తర్వాత ఇరాన్‌పైకి యుద్ధ విమానాలు పంపించింది. -
ఇజ్రాయెల్ దాడులు.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
టెహ్రాన్: తమపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు పాల్పడితే అమెరికా పూర్తి బాధ్యత వహించాల్సిందేనని ఇరాన్ అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రణాళికల గురించి తమకు తెలుసునని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్, యూఎన్ భద్రతా మండలి స్విస్ ప్రెసిడెన్సీని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ రాసిన లేఖ తీవ్రమైన ఆందోళన, రెచ్చగొట్టే విధంగా ఉందని ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవాని అన్నారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం.. చట్టవిరుద్ధమైన సైనిక దురాక్రమణకు అమెరికా పరోక్ష ఆమోదం, స్పష్టమైన మద్దతును ప్రకటిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తుందని అన్నారు. ‘‘అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘిస్తూ.. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేసే దురాక్రమణ చర్యలను ప్రేరేపించటం, ప్రారంభించటంపై అగ్రరాజ్యం అమెరికా పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని అన్నారు.BREAKING: Iran says US will bear ‘full responsibility' for an Israeli retaliation.— The International Index (@theintlindex) October 21, 2024క్రెడిట్స్: The International Indexఅక్టోబరు 1న ఇరాన్.. ఇజ్రాయెల్‌పై చేసిన మిసైల్స్ దాడికి ఎలా? ఎప్పుడు? స్పందిస్తుందని మీడియా అడిగిన ప్రశ్నకు జో బైడెన్ ఇటీవల స్పందించారు. ప్రస్తుతం ఇజ్రాయెల్.. ఇరాన్‌పై చేసే ప్రతీకార దాడిపై స్పష్టమైన అవగాహన ఉందని అన్నారు.ఇక.. టెహ్రాన్ మద్దతుగల హమాస్, హెజ్బొల్లాకు చెందిన నాయకులు, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ జనరల్‌ను అంతంచేసినందుకు ప్రతీకారంగా ఇరాన్ ఇటీవల ఇజ్రాయెల్‌పై దాదాపు 200 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన విషయం తెలిసిందే. దీంతో అమెరికాకు మిత్ర దేశమైన ఇజ్రాయెల్.. గాజాలో హమాస్, లెబనాన్‌లోని హెజ్బొల్లాను దాడులకు అంతం చేసి ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది.చదవండి: ట్రంప్ ‘మెక్‌డొనాల్డ్’ షోపై భారీ ట్రోలింగ్ -
Israel-Iran Tensions: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు
జెరూసలేం: పశ్చిమాసియాలో యుద్ధ మేఘా లు కమ్ముకుంటున్నాయి. యూదు దేశం ఇజ్రాయెల్‌పై ఇస్లామిక్ దేశం ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. సిరియా రాజధాని డెమాస్కస్‌లో తమ దౌత్య కార్యాలయంపై దాడి చేసి, ఇద్దరు ఉన్నతస్థాయి సైనికాధికారులను పొట్టనబెట్టుకున్న ఇజ్రాయెల్‌కు తగిన బుద్ధి చెప్పాలన్న కృతనిశ్చయంతో ఇరాన్ ఉంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ సైన్యం ఏ క్షణమైనా దాడికి దిగొచ్చని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా వెల్లడించారు. ఇజ్రాయెల్‌లోని కీలక నగరాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ అత్యాధునిక డ్రోన్లు, రాకెట్లు ప్రయోగించే అవకాశం ఉందని వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ సైన్యం సన్నాహాలు ప్రారంభించింది. సరిహద్దుల్లో నిఘాను పటిష్టం చేసింది. ఇజ్రాయిల్ దళాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. యాంటీ మిస్సైల్ మొబైల్ లాంచర్లను రంగంలోకి దించారు. ఇజ్రాయెల్‌పై దాడికి దిగితే సహించబోమని అమెరికా ఇరాన్‌ను హెచ్చరించింది. ఇజ్రాయెల్‌కు రక్షణగా అమెరికా తన యుద్ధ నౌకలను పంపిస్తున్నట్లు తెలిసింది. టెహ్రాన్ నుంచి తమ విమానాల రాకపోకలను ఈ నెల 18వ తేదీ వరకూ రద్దు చేసినట్లు లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ తెలియజేసింది. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల్లో ఉన్న తమ పౌరులకు కొన్ని దేశాలు ప్రయాణ అడ్వైజరీలు జారీ చేశాయి. ఆ నౌకలో భారతీయులు 17 మంది భారతీయ నావికులు ఉన్న ఇజ్రాయెల్ కంటైనర్ షిప్‌ను ఇరాన్ పారామిలటరీ రివల్యూషనరీ గార్డు కమాండోలు శనివారం స్వాధీనం చేసుకున్నారు. పర్షియన్ గల్ఫ్‌లోని హొర్మూజ్ జలసంధిలో ఈ సంఘటన జరిగింది. నౌకను ప్రస్తుతం ఇరాన్ జలాల వైపు మళ్లిస్తున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఎంఎస్సీ ఏరీస్ అనే పేరున్న ఈ నౌకపై పోర్చుగీస్ జెండా ఉంది. ఇది ఇజ్రాయెల్‌లోని జొడియాక్ గ్రూప్‌నకు చెందిన నౌక. ఇరాన్ కమాండోలు సోవియట్ కాలం నాటి మిల్ ఎంఐ–17 హెలికాప్టర్ నుంచి తాడు సహాయంతో నౌకపై దిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇరాన్ కమాండోల దుశ్చర్యపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చవద్దని హెచ్చరించింది. ఇరాన్ కమాండోలు స్వా«దీనం చేసుకున్న కంటైనర్ నౌకలో ఉన్న 17 మంది భారతీయ నావికుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని భారత వర్గాలు తెలిపాయి. దౌత్యమార్గాల్లో ఇరాన్‌ను అధికారులను సంప్రదిస్తున్నామని పేర్కొన్నాయి. -
దౌత్యవేత్తల బహిష్కరణ: దెబ్బకి దెబ్బ కొట్టిన అమెరికా
వాషింగ్టన్: రష్యా చర్యకు అమెరికా ప్రతిచర్యకు దిగింది. తమ దేశం నుంచి ఇద్దరు రష్యా దౌత్యవేత్తను బహిష్కరిస్తూ తాజాగా ప్రకటన చేసింది. కీలక సమాచారం సేకరించారనే ఆరోపణలపై ఇద్దరు అమెరికన్ దౌత్యవేత్తలను తమ దేశం విడిచి వెళ్లాలంటూ కిందటి నెలలో రష్యా ఆదేశించింది. ఈ యాక్షన్‌కు కౌంటర్ యాక్షన్‌గానే.. అగ్రరాజ్యం ఇప్పుడు కౌంటర్ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ‘‘మా దౌత్యవేత్తలను రష్యా ప్రభుత్వం కావాలనే వేధింపులకు గురి చేస్తోంది. ఈ పరిణామాన్ని మేం సహించేది లేదు’’ అని అమెరికా అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తాజాగా ఒక ప్రకటనలో తెలిపారు. తద్వారా ఇది ప్రతీకారచర్య అనే విషయాన్ని స్పష్టం చేశారాయన. అమెరికాను విడిచి వెళ్లేందుకు రష్యా దౌత్య వేత్తలిద్దరికీ వారం గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే వాళ్ల పేర్లు మాత్రం వెల్లడించలేదు. ఇదిలా ఉంటే.. వ్లాడివోస్టోక్‌లోని అమెరికా కాన్సులేట్‌కు చెందిన ఓ మాజీ ఉద్యోగి.. రష్యా భద్రతకు సంబంధించిన కీలక సమాచారం సేకరించాడని దర్యాప్తులో తేలింది. దీంతో అతన్ని దోషిగా తేల్చారు. అయితే.. అమెరికా దౌత్యవేత్తలు జెఫ్రీ సిల్లిన్, డేవిడ్ బెర్న్స్టెయిన్లు ఆ మాజీ ఉద్యోగితో సంబంధాలు కలిగి ఉన్నారని, వాళ్లు కూడా ఇందుకు సహకరించారని ఆరోపిస్తూ రష్యా ఈ ఇద్దరిని బహిష్కరించింది. అయితే అమెరికా ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. తమ దౌత్యవేత్తలను రష్యా ఘోరంగా అవమానిస్తోందని విమర్శించింది. మరోవైపు 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా-అమెరికాల మధ్య సంబంధాలు అంతకంతకు దిగజారుతున్నాయి. -
తైవాన్ సమీపంలో భారీగా చైనా విమానాలు, నౌకలు
తైపీ: చైనా మరోసారి ప్రతీకార చర్యలకు దిగింది. గురువారం అమెరికా నేవీకి చెందిన పి–8ఏ పొసెడాన్ యాంటీ సబ్మెరీన్ గస్తీ విమానం చైనా– తైవాన్లను విడదీసే తైవాన్ జలసంధి మీదుగా చక్కర్లు కొట్టడం ఆ దేశానికి మింగుడుపడటం లేదు. దీంతో, శుక్రవారం యుద్ధ విమానాలను, నేవీ షిప్‌లను పెద్ద సంఖ్యలో తైవాన్ సమీపంలోకి పంపించి, బెదిరింపు చర్యలకు దిగింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)కి చెందిన 38 ఫైటర్ జెట్లు, ఇతర యుద్ధ విమానాలు తమ భూభాగానికి అత్యంత సమీపంలోకి వచ్చినట్లు తైవాన్ రక్షణ మంత్రి శుక్రవారం తెలిపారు. ఈ నెలారంభంలో భారీగా సైనిక విన్యాసాలు చేపట్టిన తర్వాత పెద్ద సంఖ్యలో విమానాలు, నౌకలను తైవాన్ సమీపంలోకి తరలించడం ఇదే మొదటిసారి. -
కలిస్తే ఖబడ్దార్.. తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన చైనా
బీజింగ్: తైవాన్‌కు చైనా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ ప్రస్తుతం దౌత్యపరమైన ఒప్పందాల కోసం మధ్యఅమెరికాలో పర్యటిస్తున్నారు. అయితే.. దేశ అంతర్గత వ్యవహారాలను ఈ పర్యటనలో అగ్రరాజ్యంతో చర్చిస్తే.. చూస్తూ ఊరుకోబోమని డ్రాగన్ హెచ్చరించింది. అంతేకాదు.. పర్యటనకు ముందు సాయ్ చేసిన వ్యాఖ్యలను ధిక్కార స్వరంగా భావిస్తున్నామని స్పష్టం చేసింది. సాయ్ ఇంగ్-వెన్ పర్యటనకు ముందు మాట్లాడుతూ.. తైవాన్‌కు ప్రపంచంతో సంబంధాలు కొనసాగించే హక్కు ఉందని, బయటి శక్తులు(చైనాను ఉద్దేశించి..) ఈ మేరకు ఎలాంటి ప్రభావం తమపై చూపలేదంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు ఆమె మధ్యలో కాలిఫోర్నియాను సందర్శించాల్సి ఉండగా.. యూఎస్ హౌజ్ స్పీకర్ కెవిన్ మెక్‌కార్థీతో భేటీ అవుతారనే సమాచారం అందుతోంది. అయితే.. ఈ భేటీ పరిణామంపై డ్రాగన్ కంట్రీ తీవ్రంగా స్పందించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ.. ఒకవేళ తైవాన్ అధ్యక్షురాలు గనుక అమెరికా చట్టసభ స్పీకర్‌ను కలిస్తే మాత్రం పరిణామాలను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని, ఇది చైనా సార్వభౌమత్వాన్ని దెబ్బ తీసే అంశంగా భావించక తప్పదని పేర్కొంది. మరోవైపు సాయ్ ఇంగ్-వెన్ వ్యాఖ్యపైనా చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలను, చర్యలను బీజింగ్ వర్గాలను రెచ్చగొట్టడం కిందే చూడాల్సి వస్తుందని, ప్రతీకార చర్యలు తప్పవని, తర్వాతి పరిణామాలకు తైవాన్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
కరోనా పరీక్షలు.. దక్షిణ కొరియా, జపాన్‌పై చైనా ప్రతీకార చర్యలు..
బీజింగ్: చైనాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఆ దేశం నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలు తప్పనిసరి చేశాయి దక్షిణ కొరియా, జపాన్. అయితే ఈ దేశాల తీరుపై డ్రాగన్ దేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ప్రతీకార చర్యలకు దిగింది. తమ దేశస్థులపై కరోనా ఆంక్షలు విధించినందుకు బదులుగా దక్షిణ కొరియా దేశస్థులకు షార్ట్ టర్మ్ వీసాల జారీని సస్పెండ్ చేసింది చైనా. సియోల్‌లోని చైనా ఎంబసీ మంగళవారం ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. అలాగే జపాన్ దేశస్థులపైనా ఇలాంటి ఆంక్షలే విధించింది. చైనా తీరును చూస్తుంటే ప్రతీకార చర్యల్లో భాగంగానే వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. కరోనా విషయంలో తమపై కొన్ని దేశాలు వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని డ్రాగన్ దేశం ఇదివరకే తీవ్ర విమర్శలు చేసింది. ఇప్పుడు ఏకంగా కక్షపూరిత చర్యలకు దిగుతోంది. చైనాలో జీరో కోవిడ్ పాలసీని ఎత్తివేసినప్పటి నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. వేల మంది చనిపోయి శ్మశానాల్లో ఖాళీ లేని పరిస్థితి. చైనా మాత్రం కరోనా కేసుల లెక్కలను వెల్లడించలేదు. కోవిడ్ బాధితులను ట్రాక్ చేయడం సాధ్యం కాదని చేతులు ఎత్తేసింది. ఈనేపథ్యంలోనే అమెరికా, భారత్ సహా పలు దేశాలు చైనా ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. మరోవైపు దాదాపు మూడేళ్ల తర్వాత సరిహద్దులను ఆదివారం తెరిచింది చైనా. కరోనా కేసులు వెలుగు చూసిన తొలినాళ్లలో వీటిని మూసివేసింది. అన్నిదేశాలు ఎప్పుడో ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ చైనా మాత్రం డిసెంబర్ 7న జీరో కోవిడ్ పాలసీ నుంచి ప్రజలకు విముక్తి కల్పించింది. తాజాగా ఇతర దేశాలతో సరిహద్దులను కూడా తెరిచింది. చదవండి: షాకింగ్.. విమానంలోకి పామును తీసుకెళ్లబోయిన మహిళ.. ఫొటో వైరల్.. -
రష్యా రాకెట్ దాడుల్లో... 600 మంది సైనికులు మృతి!
మాస్కో: తూర్పు ఉక్రెయిన్‌లో సైనికుల తాత్కాలిక నివాసాలపై తాము జరిపిన రాకెట్ దాడుల్లో 600 మంది మరణించారని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. రష్యా అధీనంలో ఉన్న డాన్‌టెస్క్ ప్రాంతంపై ఉక్రెయిన్ దాడుల్లో 89 మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ప్రతీకార చర్యగానే తాము క్రమటోర్క్‌స్‌పై ప్రాంతంలో సైనికుల ఇళ్లపై దాడులు చేసినట్టు పేర్కొంది. సైనికులు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న ఇళ్లకు సంబంధించిన కచ్చితమైన సమాచారం అందడంతో తాము రాకెట్ దాడులు చేశామని ఒక ప్రకటనలో తెలిపింది. ఒక ఇంట్లో 700 మంది సైనికులు ఉంటే, మరొక ఇంట్లో 600 మంది ఉన్నారని తాము చేసిన రాకెట్ దాడుల్లో 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ఇదే నిజమైతే గత ఫిబ్రవరి 24న యుద్ధం మొదలు పెట్టినప్పట్నుంచి ఉక్రెయిన్‌కు భారీగా ప్రాణనష్టం జరిగిన ఘటన ఇదే. -
Russia-Ukraine war: రష్యా ప్రతీకారం
జపొరిజాజియా: రష్యా–క్రిమియా ద్వీపకల్పాన్ని అనుసంధానించే కీలక వంతెనపై ఉక్రెయిన్ అనుకూల వర్గాలు పేలుళ్లకు పాల్పడిన నేపథ్యంలో పుతిన్ సైన్యం ప్రతీకార చర్యలకు దిగింది. ఉక్రెయిన్‌లోని జపొరిజాజియా సిటీపై నిప్పుల వర్షం కురిపించింది. శనివారం అర్ధరాత్రి తర్వాత వరుసగా రాకెట్లు ప్రయోగించింది. ఈ ఘటనలో 12 మంది పౌరులు మృతిచెందారు. 60 మందికి పైగా గాయపడ్డారు. రష్యా దాడుల్లో 20 ప్రైవేట్ నివాస గృహాలు, 50 అపార్టుమెంట్ భవనాలు దెబ్బతిన్నాయని సిటీ కౌన్సిల్ కార్యదర్శి అనాతోలివ్ కుర్టెవ్ చెప్పారు. జపొరిజాజియాలో రష్యా రాకెట్ దాడులను ఉక్రెయిన్ సైన్యం ధ్రువీకరించింది. పదుల సంఖ్యలో పౌరులు గాయపడ్డారని పేర్కొంది. రష్యా దాడుల పట్ల స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. రష్యా అంతర్జాతీయ ఉగ్రవాది అంటూ మండిపడ్డారు. తమను ఎవరూ రక్షంచలేరా? అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అమాయకులను బలి తీసుకున్నారు: జెలెన్స్కీ వాస్తవానికి దక్షిణ ఉక్రెయిన్‌లోని జపొరిజాజియా ప్రస్తుతం రష్యా ఆధీనంలోనే ఉంది. ఈ ప్రాంతాన్ని తమ దేశంలో విలీనం చేస్తూ రష్యా అధినేత పుతిన్ ఇటీవలే సంతకాలు చేశారు. జపొరిజాజియా ప్రావిన్స్ మొత్తం చట్టబద్ధంగా తమదేనని వాదిస్తున్నారు. గత గురువారం ఇదే సిటీపై రష్యా సైన్యం జరిపిన క్షిపణి దాడుల్లో 19 మంది బలయ్యారు. తమ నియంత్రణలో ఉన్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని రష్యా ఇటీవల తరచుగా దాడులు చేస్తుండడం గమనార్హం. తాజా రాకెట్ దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వేళ దయ, కరుణ లేకుండా అమాయక ప్రజలను పొట్టనపెట్టుకున్నారని దుమ్మెత్తిపోశారు. అది అక్షరాలా రాక్షసకాండ అని ధ్వజమెత్తారు. ఈ దాడులకు ఆదేశాలిచ్చినవారు, వాటిని పాటించినవారు తప్పనిసరిగా చట్టానికి, ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. వంతెన భద్రత పెంచాలని ఆదేశాలు ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియా ద్వీపకల్పాన్ని 2014లో రష్యా ఆక్రమించింది. రష్యా–క్రిమియాను అనుసంధానించే వంతెనపై శనివారం భారీ ఎత్తున పేలుళ్లు జరిగాయి. వంతెన కొంతవరకు ధ్వంసమైంది. ఈ పేలుళ్లకు ఇంకా ఎవరూ బాధ్యత వహించలేదు. ఇదంతా ఉక్రెయిన్ అనుకూలవర్గాల పనేనని రష్యా నిర్ణయానికొచ్చింది. ప్రతీకార చర్యల్లో భాగంగా జపొరిజాజియాను లక్ష్యంగా చేసుకుంది. వంతెనకు, అక్కడున్న ఇంధన రంగ మౌలిక సదుపాయాలకు భద్రత పెంచాలంటూ పుతిన్ శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. భద్రత కోసం ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్‌ను రంగంలోకి దించారు. పుతిన్ ‘ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్’ ప్రారంభించారని రష్యా ప్రజాప్రతినిధులు కొందరు తెలిపారు. తూర్పు డొనెట్స్క్ రీజియన్‌లోని బఖ్ముత్, అవ్దివ్కా నగరాల్లో రష్యా, ఉక్రెయిన్ బలగాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ సాగింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ సైనిక దళాల అధికారి ఆదివారం ఉదయం వెల్లడించారు. ప్రస్తుతం రెండు నగరాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ జవాన్ల మధ్య ఘర్షణలో వాటిల్లిన ప్రాణనష్టంపై వివరాలు తెలియరాలేదు. రష్యా సైన్యానికి కొత్త కమాండర్ రష్యా–క్రిమియా వంతెనపై పేలుళ్ల తర్వాత రష్యా ఒక్కసారిగా అప్రమత్తయ్యింది. ఉక్రెయిన్‌లో తమ సైనిక బలగాలకు సారథ్యం వహించడానికి ఎయిర్‌ఫోర్స్ చీఫ్ జనరల్ సెర్గీ సురోవికిన్‌ను నియమిస్తున్నట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఇకపై ఉక్రెయిన్‌లో సైనిక ఆపరేషన్లను ఆయనే ముందుండి నడిపిస్తారని స్పష్టం చేసింది. సురోవికిన్‌ను కొన్ని నెలల క్రితం దక్షిణ ఉక్రెయిన్‌లో రష్యా సేనలకు ఇన్చార్జిగా నియమించారు. ఇప్పుడు పదోన్నతి కల్పించారు. ఆయన గతంలో సిరియాలో రష్యా సైన్యానికి సారథ్యం వహించారు. సిరియాలోని అలెప్పో నగరంలో పెను విధ్వంసానికి సురోవికిన్ ప్రధాన కారకుడన్న ఆరోపణలున్నాయి. -
ప్రతీకార దాడులు చేస్తాం: కైలాసం
మల్కన్ గిరి ఎన్ కౌంటర్ పై మావోయిస్టు ఈస్ట్ డివిజన్ కార్యదర్శి కైలాసం శుక్రవారం స్పందించారు. విద్రోహశక్తుల కారణంగానే ఎన్ కౌంటర్ జరిగిందని చెప్పారు. ఈ దాడిలో మావోయిస్టు పార్టీ సభ్యులు, నేతలు మరణించినట్లు వెల్లడించారు. దాడిని పచ్చి బూటకపు ఎన్ కౌంటర్ గా పేర్కొన్న కైలాసం.. తమ అగ్రనేత ఆర్కే పోలీసుల అదుపులో ఉన్నట్లు అనుమానాలున్నాయని చెప్పారు. ఎంత పెద్ద ఎన్ కౌంటర్ అయినా ఇంతమంది ఎప్పుడూ చనిపోరని అన్నారు. ఘటన వెనుక ఒడిశా పోలీసుల నిఘా వర్గాల ప్రమేయం ఉందని చెప్పారు. కచ్చితంగా ప్రతీకారదాడులు చేస్తామని తెలిపారు. ఎన్ కౌంటర్ లో సాధారణ పౌరులు కూడా మరణించారని చెప్పారు. మరికొంత సమాచారన్ని త్వరలో చెబుతానని అన్నారు. -
ప్రతీకార దాడులు
మణిపూర్‌లో ఈ నెల 4న మిలిటెంట్లు రెచ్చిపోయి జవాన్లపై దాడి జరిపి 20మందిని పొట్టనబెట్టుకున్న ఉదంతం అనంతరం అందరూ ఊహిస్తున్నదే జరిగింది. ఈ దాడికి ప్రతీకారంగా మన సైన్యం మయన్మార్ భూభాగంలో ఉంటున్న మిలిటెంట్ల స్థావరాలపై విమానాలు, హెలికాప్టర్ల సాయంతో మంగళవారం మెరుపు దాడులు నిర్వహించింది. ఆ దేశ భూభాగంలో 5 కిలోమీటర్ల లోపలకు వెళ్లి ఈ దాడులు చేసింది. ఇందులో మృతులెంతమందో, మిలిటెంట్లకు ఇతరత్రా జరిగిన నష్టమేమిటో వివరాలు లేవు. ఇవి బుధవారం కూడా కొనసాగుతాయని సైన్యం ప్రకటించింది. మరో దాడికి పథకం పన్నుతున్నారని తెలిసి దాన్ని నివారించడం కోసం ఈ చర్యకు పూనుకోవాల్సివచ్చిందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఉగ్రవాదమైనా, మరే ఇతర వర్గాలు చేసే హింస అయినా ఏ దేశంలోని ప్రభుత్వాలకైనా సమస్యే. ఆ సమస్యను ఎదుర్కొనడానికి ప్రభుత్వాలు అవలంబించే పద్ధతులపై భిన్న కోణాల్లో చర్చ జరుగుతుంటుంది. సరిహద్దుల అవతల స్థావరాలను ఏర్పాటుచేసుకుని ఉగ్రవాద ఘటనలకు పాల్పడుతున్నవారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే పాక్ భూభాగంలోకి ప్రవేశించి బాంబు దాడులు నిర్వహించాలని విపక్షంలో ఉన్నప్పుడే బీజేపీ డిమాండ్ చేసేది. నాలుగేళ్లక్రితం ఉగ్రవాద నేత బిన్ లాడెన్ తలదాచుకున్న స్థావరాన్ని గుర్తించి అమెరికా మెరైన్ కమాండోలు అర్థరాత్రి దాడులు నిర్వహించి అతన్ని మట్టుబెట్టినప్పుడు అప్పటి మన ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ ‘అలాంటి సామర్థ్యం భారత్‌కు సైతం ఉన్నద’ని ప్రకటించినప్పుడు పెద్ద సంచలనం కలిగింది. ఆ తరహా దుస్సాహసానికి పాల్పడితే తీవ్ర పరిణామాలుంటాయని వెనువెంటనే పాకిస్థాన్ జవాబిచ్చింది. కారణం ఏమైనా కావొచ్చుగానీ... ఒక దేశం భూభాగంలోకి మరో దేశానికి చెందిన సైన్యం ముందస్తు సమాచారం ఇవ్వకుండా చొరబడటం, సైనిక చర్యకు పాల్పడి వెళ్లడం అసాధారణమే కాదు, అవాంఛనీయ పరిణామం కూడా. అందులో సందేహం లేదు. అందునా పరస్పరం కత్తులు నూరుకునే రెండు ఇరుగు పొరుగు దేశాలమధ్య అలాంటి పరిణామం చోటుచేసుకోవడం మంచిది కానే కాదు. ఇప్పుడు మయన్మార్ భూభాగంలో నేషనల్ సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఎన్ఎస్సీఎన్)-ఖప్లాంగ్ వర్గం, కాంగ్లీ యవోల్ కన్నా లుప్ (కెవెకైఎల్) శిబిరాలపై మయన్మార్ ప్రభుత్వానికి ముందస్తుగా తెలియజెప్పి దాడులు నిర్వహించామని మన సైన్యం ప్రకటించింది. భారత్-మయన్మార్ సైన్యాల మధ్య ఇటువంటి సన్నిహిత సహకారం ఎన్నాళ్లనుంచో ఉన్నదని కూడా చెప్పింది. దాడులు జరిగిన ప్రాంతం మయన్మార్లోనిదే అయినా ఆ ప్రాంతంపై అక్కడి ప్రభుత్వానికి ఏనాడూ పట్టులేదు. అక్కడ మిలిటెంట్ వర్గాలదే హవా. ఇలా పరస్పర సహకారంతో పొరుగుదేశాల భూభాగాల్లో మన దేశం దాడులు నిర్వహించడం ఇది మొదటిసారేమీ కాదు. 2003లో భూటాన్ భూభాగంలో మిలిటెంట్ల స్థావరాలపై ఇలాంటి దాడులే జరిగాయి. 1995లో, 2006లో మయన్మార్‌లోనే మన సైన్యం దాడులు చేసింది. ఆ సందర్భాల్లో పలువురు మిలిటెంట్లను హతమార్చడంతోపాటు వందల సంఖ్యలోమిలిటెంట్లను అదుపులోనికి తీసుకున్నారు. అయితే, వాటిని బాహాటంగా ప్రచారం చేసుకోవడం, పాక్తోసహా మిలిటెంట్లకు ఆశ్రయమిచ్చే దేశాలన్నిటికీ ఇది హెచ్చరికలాంటిదని చెప్పడం ఇదే ప్రథమం. ఉగ్రవాదులకూ, మిలిటెంట్లకూ ఆశ్రయమిచ్చే దేశాల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై మన దేశానికి ఇప్పటికే స్పష్టత ఉంది. అలాంటి దేశాలతో నిరంతర చర్చలద్వారా వాటిని దారికి తీసుకురావడానికి ప్రయత్నించడం, తన విధానాలను మార్చుకోనట్టయితే ఆ దేశంపై అంతర్జాతీయ వేదికలపై ఒత్తిళ్లు తీసుకురావడం వంటివి చేస్తారు. పాకిస్థాన్ విషయంలో మన దేశం ఇప్పటికే ఈ తరహా మార్గాల్లో ఒత్తిళ్లు తెస్తున్నది. ఆ మార్గాలన్నీ మూసుకుపోయినప్పుడు ఏం చేయాలన్నది వేరే విషయం. అందుకు అంతర్జాతీయంగా అంగీకరించిన విధానాలున్నాయి. ఆ పరిస్థితులేర్పడిన పక్షంలో ఐక్యరాజ్యసమితి, భద్రతామండలి, అగ్రరాజ్యాలు...అన్నీ రంగంలోకొస్తాయి. అప్పుడు ఎలాంటి పరిష్కారం లభిస్తుందో, దానివల్ల చేకూరే ప్రయోజనం ఎంత అన్నది ఎవరూ చెప్పలేరు. ప్రపంచ అభీష్టానికి వ్యతిరేకంగా పాకిస్థాన్ వ్యవహరించదల్చుకుంటే అందుకు ఆ దేశం మూల్యం చెల్లించకతప్పదు. అలాంటి మార్గాల్లో ప్రయత్నాలు చేస్తుండగా ఇప్పుడు మయన్మార్ దాడుల సందర్భంలో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం,హెచ్చరించడం ఎందుకో అర్థంకాని విషయం. సమయం వచ్చినప్పుడు ఏం చేయాలో అది చేయడమే వివేకవంతంగా వ్యవహరించడం అవుతుంది తప్ప, ముందే ఉత్సాహంగా ప్రకటనలు చేయడం వల్ల ఒరిగేదేమీ ఉండదు. అది మన వ్యూహాన్ని, మన ఆలోచనలనూ బహిరంగ చర్చకు పెట్టడమే అవుతుంది. అందువల్ల అనవసర రాద్ధాంతం మాత్రమే మిగులుతుంది. ప్రతి అంశాన్నీ రాజకీయ ప్రయోజనాలతో ముడిపెట్టి ఆలోచించడం, ప్రజలను ఉత్సాహపరిచే ప్రకటనలు చేయడం ఎంతవరకూ అవసరమో ఆలోచించాల్సి ఉంది. మంత్రి ప్రకటనవల్ల సహజంగానే మాటల యుద్ధం బయల్దేరింది. చూస్తూ ఊరుకోవడానికి తమ దేశం మయన్మార్ కాదని పాక్ బదులిచ్చింది. పాకిస్థాన్ ప్రాపకంతో సాగే ఉగ్రవాదం వల్ల మన దేశం ఎంత నష్టపోయిందో ప్రపంచానికంతకూ తెలుసు. 2008లో ముంబైపై దాడి జరిపి ఉగ్రవాదులు సాగించిన ఊచకోతకు సంబంధించి హఫీజ్ సయీద్ వంటివారిని వెంటనే అప్పగించాలని మన దేశం పాకిస్థాన్‌ను కోరుతూనే ఉంది. అందుకు సంబంధించి అవసరమైన సాక్ష్యాధారాలను మన దేశం అందజేసింది. అవి అసమగ్రంగా ఉన్నాయని, వాటికి విలువలేదని పాక్ వాదిస్తోంది. అలాగే దావూద్ ఇబ్రహీం ఇప్పటికీ పాక్‌లోనే తలదాచుకున్నాడని మన దేశం చెబుతుంటే లేనేలేడని ఆ దేశం బుకాయిస్తున్నది. అటు అమెరికా ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోంది. ఉగ్రవాదానికి పాకిస్థాన్ నారూ నీరూ పోస్తున్న తీరు తెలిసినా ఆ దేశానికి ఆయుధాలు అమ్మడం, ఆర్థిక సాయం చేయడం మానుకోలేదు. కేవలం తన ప్రయోజనాలు చూసుకోవడం తప్ప వాస్తవాలేమిటో ఆలోచించి ప్రవర్తించడంలేదు. సమస్యలు చాలా ఉన్నాయి. అయితే పరిష్కారాలు వెదకడం, వాటిని చాకచక్యంగా అమలు చేయడంలో ఎంతో పరిణతిని ప్రదర్శించాలి. లేనట్టయితే ఎప్పటికీ బాధితులుగా మిగులుతాం. -
ప్రతీకార దాడులు తప్పవు ఈటెల హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వాదులపై దాడులు చేసిన వారిని చట్టపరంగా శిక్షించని పక్షంలో ప్రతీకార దాడులు తప్పవని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నాయకుడు ఈటెల రాజేందర్ హెచ్చరించారు. ఏపీఎన్జీవోల సభకు అనుమతించి, తెలంగాణ సభలపై ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ నేతలు శనివారం అసెంబ్లీ ఆవరణలో శనివారం దీక్షకు దిగారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొప్పుల ఈశ్వర్, ఎం. బిక్షపతి, కొప్పుల హరీశ్వర్ రెడ్డి, ఎస్.వేణుగోపాలాచారి, సత్యనారాయణ, వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు కె. స్వామిగౌడ్, పాతూరి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట దీక్షకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. అందుకు అధికారులు అనుమతించకపోవడంతో అసెంబ్లీ రెండో గేటుకు కుడిపక్కనే దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, హరీష్‌రావు, ఎంపీ జి.వివేక్, కె. స్వామిగౌడ్ మీడియాతో మాట్లాడారు. జై తెలంగాణ అని నినదించిన పోలీసు కానిస్టేబుల్‌పై విచక్షణా రహితంగా దాడి చేయుడం ప్రజాస్వావ్యు విరుద్ధవుని వారు అన్నారు. దాడి చేసినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకోని పక్షంలో తెలంగాణ ప్రజలు ప్రతీకార దాడులకు దిగుతారని అన్నారు. హైదరాబాద్,.. సమైక్య రాష్ట్రానికి పుట్టినబిడ్డ కాదని, హైదరాబాద్ ఉందనే, సమైక్యవాదులు దోచుకోవడానికి వచ్చారని ఈటెల వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో సభ పెట్టి తెలంగాణ ప్రజల గుండెల మీద తన్నినట్టుగా ప్రజలు భావిస్తున్నారని, ముఖ్యమంత్రి కిరణ్, సీమాంధ్ర జేఏసీ చైర్మన్‌గా వ్యవహరిస్తూ, డీజీపీని కన్వీనర్‌గా పెట్టుకుని తెలంగాణ ప్రజలపై కక్షసాధిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే టి.హరీష్‌రావు మాట్లాడుతూ, కానిస్టేబుల్ శ్రీనివాస్‌పై దాడిని,.. తెలంగాణ పోలీసులపై జరిగిన దాడిగా భావిస్తున్నావుని, ప్రాంతాలవారీ విభజన ఇక పోలీసుశాఖలోనూ తప్పదని అన్నారు. దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని, శ్రీనివాస్‌కు పూర్తిస్థాయిలో వైద్య చికిత్సను అందించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్, డీజీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తుంటే తెలంగాణ ప్రాంత మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలపై దండయాత్రకు వచ్చినట్టుగా సీవూంధ్రులు హైదరాబాద్ వచ్చినా వారికి సహకరించామని, సీమాంధ్ర గూండాలు మాత్రం తెలంగాణవాదులపై దాడి చేశారని ఆయున ఆరోపించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ స్వామిగౌడ్ తదితరులు మీడియూతో వూట్లాడారు. విద్వేషాన్ని రెచ్చగొడుతున్న కిరణ్: వివేక్ సీఎం ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, పోలీసులు, డబ్బును వినియోగించి ఎన్జీవోల సభను ముఖ్యమంత్రే నిర్వహించారని ఎంపీ జి. వివేక్ ఆరోపించారు. హైదరాబాద్‌లోనూ సమైక్య ఉద్యమం ఉన్నట్టుగా చిత్రీకరించే కుట్రతోనే ప్రభుత్వమే సభను నిర్వహించిందన్నారు. సభకు సీవూంధ్ర జిల్లాలవారే వచ్చారని, తెలంగాణకు, సీమాంధ్రకు మధ్య విభజన దీనితో మరింత స్పష్టమైందన్నారు. రాష్ట్రపతి పాలన పెట్టాలి: కోమటిరెడ్డి సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కువూర్రెడ్డిని బర్తరఫ్ చేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఎన్జీవోల సభకు 5 రోజుల ముందే అనుమతి ఇవ్వడం, సభకు వచ్చేవారికి వేలాదిమంది పోలీసులను రక్షణగా పెట్టడం సరికాదన్నారు.