
ట్రంప్‌పై పాలస్తీనియన్ల ఆగ్రహం
స్కాట్లాండ్ గోల్ఫ్ రిసార్ట్ ధ్వంసం
ఎడిన్‌బర్గ్: గాజా స్ట్రిప్‌ను ఖాళీ చేయించి అందమైన పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతానన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పాలస్తీనియన్లు ప్రతీకార చర్యలకు దిగారు. స్కాట్లాండ్‌లో ట్రంప్‌కు చెందిన టర్న్‌బెర్రీ గోల్ఫ్ రిసార్ట్‌ను ధ్వంసం చేశారు. శనివారం తెల్లవారుజామున నిరసనకారులు రిసార్ట్‌లోకి చొరబడ్డారు. గోల్ఫ్ హోల్స్‌ను నాశనం చేశారు. ఓపెన్ చాంపియ్íÙప్స్‌లో ఉపయోగించే వస్తువులు, ప్రదేశాలను పాడు చేశారు. అక్కడి పచ్చికబయళ్లపై ‘గాజా అమ్మకానికి లేదు’ అని తెల్లని పెయింట్‌తో రాశారు.
రిసార్ట్ క్లబ్‌హౌస్ భవన గోడలపై ఎరుపు రంగు చల్లారు. ఇది తమ పనేనని ‘పాలస్తీనా యాక్షన్’ అనే సంస్థ ప్రకటించుకుంది. ‘‘గాజాపై ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతీకారంగానే ఈ పని చేశాం. గాజాను తన సొంత ఆస్తిలా పరిగణిస్తామంటే ఒప్పుకోం. ఇది తెలియజేప్పేందుకు, ట్రంప్ ఆస్తికి భద్రత లేదని నిరూపించేందుకు రిసార్ట్‌పై దాడి చేశాం. గాజా స్ట్రిప్‌ను ఇజ్రాయెల్‌కు, అమెరికాకు వలసరాజ్యంగా మార్చే యత్నాలను అడ్డుకుంటాం’’ అని ప్రకటించింది. దాడిని పిల్లచేష్టగా రిసార్ట్ వర్గాలు కొట్టిపారేశాయి. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక గోల్ఫ్‌కోర్సుల్లో టర్న్‌బెర్రీ ఒకటి. ఇక్కడ నాలుగుసార్లు ఓపెన్ ఛాంపియన్íÙప్ జరిగింది. 2014లో ట్రంప్ కొనుగోలు చేసినప్పటి నుంచీ ఇక్కడ ఓపెన్ రొటేషన్‌ను అమలు చేయడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment