DESTRUCTION
-
YSRCP నేతలే లక్ష్యంగా దాడులు
-
వరద విధ్వంసం.. హృదయ విదారక దృశ్యాలు (ఫోటోలు)
-
వైఎస్సార్సీపీ శ్రేణుల నిర్మాణాల ధ్వంసం
కనిగిరి రూరల్: ప్రకాశం జిల్లా కనిగిరిలో టీడీపీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అధికారులను అడ్డంపెట్టుకుని వైఎస్సార్సీపీ శ్రేణులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. సుమారు రూ.కోటి విలువైన వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకుల ఇళ్లు, నిర్మాణాలను ఆదివారం కూలగొట్టించారు. మున్సిపల్, రెవెన్యూ అధికారుల సహాయంతో పోలీస్ బందోబస్తు మధ్య పొక్లెయిన్లతో విరుచుకుపడ్డారు. బాధితుల కథనం ప్రకారం.. కనిగిరి మున్సిపాలిటీ కాశిరెడ్డినగర్ సమీపంలో ఎస్కే హుస్సేన్‌బీ పేరుతో 1976లో పాస్‌బుక్ పట్టా ఉంది. హుస్సేన్ పేరుతో 863ఏ సర్వే నంబరులో ఉన్న 4.56 ఎకరాలకు సంబంధించి 1976–2008 సంవత్సరాల మధ్య 10 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆ తరువాత ఆ భూమి క్రయవిక్రయాలు జరిగాయి. ఆ భూమిలో పలువురు ఇళ్లు నిర్మించుకున్నారు. ఇంటిపన్ను కడుతున్నారు. విద్యుత్ కనెక్షన్లున్నాయి. మరికొంత భూమిలో పదేళ్ల కిందటే ఐదారుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు రేకులòÙడ్లు, కట్టడాలు, ప్రహరీలు నిర్మించుకున్నారు. తాజాగా మరికొందరు వారి స్థలాలకు ప్రహరీలు కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కక్షసాధింపులో భాగంగా ఎమ్మెల్యే ఉగ్ర ముందుగా ఒక పక్షపత్రికల్లో ఆ భూమి వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు ఆక్రమించారని రాయించి, కనీస సమాచారం ఇవ్వకుండా ఆదివారం సెలవురోజు అయినా ఒక్కసారిగా ఆర్డీవో జాన్ ఇరి్వన్, మున్సిపల్ కమిషనర్ టి.వి.రంగారావు సమక్షంలో నిర్మాణాలను కూల్చివేశారు. గతంలో సర్వే నంబరు 863ఎలోని 4.56 ఎకరాలను మున్సిపాలిటీ భవన నిర్మాణానికి కేటాయించి ఉన్నట్లు, అసైన్డ్ భూమి కింద ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో ఆ భూమిని మున్సిపాలిటీకి కేటాయించినప్పుడు భూ హక్కుదారులు కోర్టుకు వెళ్లారు. దానిపై హైకోర్టు స్టే ఆర్డర్ ఉంది. ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి వైఎస్సార్సీపీ శ్రేణుల ఇళ్లు, కట్టడాలను ధ్వంసం చేయించారు. హైకోర్టు, ఆర్డీవో కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నా.. అధికారులు ఆదివారం కూల్చేసిన భవన నిర్మాణాలకు సంబంధించిన స్థల వివాదం ప్రస్తుతం ఆర్డీవో కోర్టులో పెండింగ్‌లో ఉంది. దీనిపై శేఖర్, బ్రహ్మయ్య, బాషా తదితరులు కోర్టులకు వెళ్లి పిటిషన్లు వేశారు. అయినా అవేమీ లెక్క చేయకుండా ఆక్రమణల తొలగింపు పేరుతో ఆదివారం కూల్చేశారు. కనీసం తమకు సమాచారం, నోటీసులు ఇవ్వకుండా ఎందుకు కూల్చేస్తున్నారంటూ నిర్మాణదారులైన ఖాశిం, రసూల్, బ్రహ్మయ్య అధికారులను అడిగినా పట్టించుకోలేదు. బాధితులు శ్రీను, రసూల్, ఖాశిం, బ్రహ్మయ్య, బాషా తదితరులు హైకోర్టులో, ఆర్డీవో కోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయనడానికి సంబంధించిన ఆధారాలను, ఇతర డాక్యుమెంట్లను చూపించినా ఆర్డీవో, కమిషనర్ లెక్క చేయలేదు. ఈ వ్యవహారంపై మళ్లీ కోర్టును ఆశ్రయించనున్నట్లు బాధితులు తెలిపారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల షెడ్లు నేలమట్టంబిక్కవోలు: తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు చెందిన రేకుల షెడ్లను పంచాయతీ వారు నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. గ్రామంలోని చెరువు గట్టుపై 11 మంది షెడ్లు నిరి్మంచుకుని ఎన్నో ఏళ్లుగా చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. పంచాయతీ అధికారులు, సిబ్బంది ఆదివారం భారీ పోలీసు బందోబస్తు నడుమ రెండు జేసీబీలతో అక్కడకు చేరుకున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన గండి నాగవెంకటరమణ, గొరపల్లి సీతారామయ్య రేకుల షెడ్లను కూల్చేశారు. దీనిపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ వార్డు సభ్యురాలు కూడా అయిన వెంకటరమణ భార్య రామతులసి.. షెడ్ల కూల్చివేతపై అధికారులను నిలదీశారు. కనీస సమాచారం ఇవ్వకుండా కక్షపూరితంగా షెడ్లు కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులమనే ఒకే ఒక్క కారణంతో తమ ఆస్తులు ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు అనపర్తి సీఐతో పాటు ముగ్గురు ఎస్.ఐ.లు, సుమారు 30 మంది పోలీసు సిబ్బందితో వచ్చిన పంచాయతీ సిబ్బంది గ్రామంలో యుద్ధవాతావరణం సృష్టించారని చెప్పారు. షెడ్లను కూల్చడం అధికార పార్టీ నాయకుల ఆకృత్యాలకు, వ్యవస్థల పనితీరుకు అద్దం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆ షెడ్లు అక్రమ కట్టడాలని తాము నోటీసులు ఇవ్వగా పలువురు గడువు కోరారని, వెంకటరమణ, సీతారామయ్య స్పందించనందున వారి షెడ్లు కూల్చేశామని పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ చెప్పారు. -
విగ్రహాలు, శిలాఫలకాలు ధ్వంసం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలోని పలుచోట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు విధ్వంసకాండను కొనసాగిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను, అభివృద్ధి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం గోపాలపురంలో గురువారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహం తలభాగాన్ని ఛిద్రం చేసి విగ్రహాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి స్వామిదాసు ధ్వంసమైన వైఎస్ విగ్రహాన్ని శుక్రవారం పరిశీలించారు. అనంతరం స్వామిదాసు విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ క్యాడర్‌ను భయభ్రాంతులకు గురిచేయడానికి దుండగులు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పోలీసులు, అధికారులు నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. » తెలుగుదేశం నాయకులు గ్రామాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతూ ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్నారని చెప్పారు. ఏకొండూరు మండలం రేపూడిలో టీడీపీ కార్యకర్తలు ఎంపీటీసీ సభ్యురాలి పొలం ఫెన్సింగ్‌ను ధ్వంసం చేసి తోటలోని మొక్కలను పాడుచేశారని చెప్పారు. వెంకట్ తండాలో భూక్యా వెంకట్ పొలంలో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను ధ్వంసం చేసి రూ.లక్షకు పైగా నష్టం కలిగించారని తెలిపారు. తునికిపాడులో గంపలగూడెం మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడిని గ్రామ బహిష్కరణ చేస్తున్నట్లు టీడీపీ నాయకులు ప్రకటించడం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందని పేర్కొన్నారు. పోలీసులు ఇటువంటి సంఘటనలపై సత్వరం చర్యలు తీసుకుని నిందితులను శిక్షించకపోతే తాము ఉపేక్షించబోమని హెచ్చరించారు. గ్రామ సచివాలయాలపై శిలాఫలకాలను ధ్వంసం చేయడం కూడా ఉన్మాదచర్యగా ఆయన అభివర్ణించారు. తిరువూరు, ఏకొండూరు, విస్సన్నపేట జెడ్పీటీసీ సభ్యులు యరమల రామచంద్రారెడ్డి, భూక్యా గన్యా, లోకేశ్వరరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు ఈ ఘటనలను ఖండించారు. » గుంటూరు జిల్లా తెనాలి 14వ వార్డులోని శ్రీ గంగానమ్మ తల్లి దేవస్థానం వద్ద అప్పటి మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు తన సొంత నిధులు రూ.లక్షతో దేవస్థాన ప్రాంగణాన్ని అభివృద్ధి చేశారు. అనంతరం అప్పటి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌తో శిలాఫలకాన్ని ఆవిష్కరింపజేశారు. శిలాఫలకంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యే, వైస్ చైర్మన్ ఫొటోలు ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి కొందరు టీడీపీ నాయకులు శిలాఫలకంపై ఉన్న మూడు ఫొటోలను ధ్వంసం చేశారు. » తెనాలి 15వ వార్డు చినరావూరు పార్కు వద్ద వైఎస్సార్సీపీ జెండా దిమ్మెను ఏర్పాటు చేసి అక్కడ శిలాఫలకాన్ని అప్పటి ఎమ్మెల్యే శివకుమార్ ఆవిష్కరించారు. అక్కడ కూడా సీఎం జగన్, ఎమ్మెల్యే శివకుమార్, వైస్ చైర్మన్ కోటేశ్వరరావు ఫొటోలు ఏర్పాటు చేశారు. వాటిని కొందరు టీడీపీ నాయకులు ధ్వంసం చేశారు. » నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రూరల్ మండలం అహోబిలంలో మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తుతెలియని దుండగులు గురువారం రాత్రి ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ శివారు నుంచి దేవాలయం వరకు సీసీ రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డును ప్రారంభించిన అప్పటి ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇది జీర్ణించుకోలేని టీడీపీ కార్యకర్తలే ధ్వంసం చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే అహోబిలం గ్రామ శివారులోని దొరకొట్టాల వద్ద ఓ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. » ఏలూరు జిల్లాలోని మండల కేంద్రమైన ద్వారకాతిరుమలలో శుక్రవారం కొందరు వ్యక్తులు ఒక శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. స్థానిక శివాలయానికి వెళ్లే ఘాట్ రోడ్డులో మండల పరిషత్ నిధులు రూ.5 లక్షలతో నిర్మించిన మంచినీటి బోరు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని పగులగొట్టారు. టీడీపీ వర్గీయులు రెచ్చిపోయి దౌర్జన్యాలు, దాడులకు దిగడం, ప్రభుత్వ ఆస్తులు, శిలాఫలకాలను ధ్వంసం చేయడం సరికాదంటూ గ్రామస్తులు పేర్కొంటున్నారు. » తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పెన్నగడం ఎస్సీ కాలనీలో పదేళ్లుగా ఉన్న వైఎస్సార్సీపీ జెండా దిమ్మెను శుక్రవారం టీడీపీ నాయకులు జేసీబీతో ధ్వంసం చేశారు. టీడీపీ నాయకులు ఇలాంటి అరాచాకాలు చేయడం తగదని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. »పశ్చిమగోదావరి జిల్లా తణుకు రూరల్ మండలం వేల్పూరు గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గురువారం రాత్రి గ్రామానికి చెందిన వంగవోలు విజయ్‌కుమార్ ధ్వంసం చేశాడు. స్థానిక బండా పట్టాభి రైస్‌మిల్లు వీధిలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాల వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జాతర సందర్భంగా గురువారం రాత్రి ఊరేగింపు నిర్వహించారు. ఈ సమయంలో వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం ఉదయం అక్కడ పరిశీలించారు. తణుకు రూరల్ సీఐ జి.వి.వి.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్ఐ కె.చంద్రశేఖర్, ఇతర పోలీసు సిబ్బంది విచారణ చేపట్టారు. గ్రామంలో అల్లర్లు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సమీపంలో సీసీ కెమెరాల పుటేజీ పరిశీలించి విగ్రహాన్ని ధ్వంసం చేసిన విజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు విజయ్‌కుమార్ అంగీకరించాడని సీఐ నాగేశ్వరరావు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. పగలగొట్టిన విగ్రహం స్థానంలో వైఎస్సార్ కొత్త విగ్రహాన్ని శుక్రవారం సాయంత్రానికి స్థానిక పోలీసులు ఏర్పాటు చేశారు. స్థానిక నాయకులే దీన్ని ఏర్పాటు చేయించారని తెలుస్తోంది. ఎవరు ఏర్పాటు చేయించారనే విషయాన్ని పోలీసులు చెప్పలేదు. -
ఆగని టీడీపీ అరాచకం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నేతలు, కార్యకర్తల అరాచకాలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల విధ్వంసాలకు పాల్పడుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడమేగాక ప్రగతిపనుల శిలాఫలకాలను ముక్కలు చేస్తున్నారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం శివాపురంతండాలో ఆదివారం రాత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన విగ్రహాన్ని మాయం చేశారు. దీన్ని గమనించిన స్థానికులు సోమవారం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడినవారి ఆచూకీ కోసం వివరాలు సేకరిస్తున్నట్లు నకరికల్లు ఎస్ఐ కె.నాగేందర్రావు చెప్పారు.గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటుచేశారు. నాదెండ్ల మండలం సాతులూరులో వడ్డెరపాలెం వెళ్లే మెయిన్ సెంటర్లోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గ్రామానికి చెందిన ముగ్గురు టీడీపీ కార్యకర్తలు ఆదివారం ధ్వంసం చేశారు. ఇది గమనించిన వైఎస్సార్సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో నాడు–నేడు కింద గత ప్రభుత్వంలో నిర్మించిన పాఠశాల ప్రహరీలను ఆదివారం టీడీపీ నాయకులు జేసీబీ యంత్రాలతో కూల్చేశారు. నాడు–నేడు కింద కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని తంబిగానిపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను గత ప్రభుత్వం తీర్చిదిద్దింది.గ్రామ నడిబొడ్డున ఉన్న పాఠశాలకు ప్రత్యేకంగా రూ.20 లక్షలతో ప్రహారీ నిర్మించింది. ఈ గోడను కొందరు టీడీపీ నాయకులు ఇళ్లకు అడ్డంగా నిర్మించారని ఇప్పుడు కూల్చేశారు. టీడీపీ నాయకుల ఇళ్ల ముందు విశాలంగా స్థలం కావాలని రూ.20 లక్షలతో నిర్మించిన ప్రహరీని కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుప్పం మండలంలోని మల్లానూరు గ్రామ సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆవిష్కరించిన శిలాఫలకాలను ధ్వంసం చేశారు. గుత్తార్లపల్లి వద్ద నిర్మించిన వన్నెకుల క్షత్రియ భవనం ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని సైతం కూల్చేశారు.శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఇడిమేపల్లి పంచాయతీ జంగాలపల్లిలో వైఎస్సార్సీపీ కార్యకర్త పచ్చికాల శీనయ్య రేకుల షెడ్‌ను, ప్రహరీని స్థానిక టీడీపీ కార్యకర్తలు సోమవారం తెల్లవారుజామున ధ్వంసం చేశారు. శీనయ్య రూ.5 లక్షలతో తన స్థలంలో షెడ్ వేసుకుని చుట్టూ ప్రహరీ నిర్మించుకున్నారు. ప్రహరీని, షెడ్‌ను ధ్వంసం చేస్తామని టీడీపీ కార్యకర్తలు బెదిరిస్తుండటంతో శీనయ్య రెండురోజుల కిందట వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు సోమవారం తెల్లవారుజామున జేసీబీతో ప్రహరీని, రేకుల షెడ్‌ను ధ్వంసం చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అంకమరావు తెలిపారు.తూర్పు గోదావరి జిల్లాలో నియోజకవర్గ కేంద్రమైన గోపాలపురం నుంచి దొండపూడి గ్రామం వరకు రోడ్డు నిర్మాణానికి మాజీ హోం మంత్రి తానేటి వనిత ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తుతెలియని దుండగులు ఆదివారం రాత్రి ధ్వంసం చేశారు. దీనిపై సోమవారం ఉదయం ఆ శిలాఫలకం వద్ద వైఎస్సార్సీపీ నాయకులు, వైఎస్ ఆర్మీ సభ్యులు నిరసన తెలిపారు. అనంతరం నాలుగురోడ్ల కూడలి వద్ద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేసి నివాళులర్పించారు.తాము గత ఐదేళ్లలో ఎప్పుడూ ఇటువంటి దాడులు, శిలాఫలకాల ధ్వంసాలు చేయలేదని వారు చెప్పారు. టీడీపీ, జనసేన నాయకులు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలాఫలకం ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వారు డిమాండ్ చేశారు.అంగన్వాడీ స్థలం కబ్జాపెద్దపంజాణి (చిత్తూరు జిల్లా): అంగన్వాడీ కేంద్రానికి కేటాయించిన స్థలాన్ని టీడీపీ నాయకులు ఆక్రమించిన ఘటన పెద్దపంజాణి మండలంలోని బెరబల్లిలో సోమవారం చోటు చేసుకుంది. పెద్దపంజాణి పంచాయతీ బెరబల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు అక్రమంగా తమ ఆధీనంలో ఉంచుకున్న సుమారు 10 సెంట్ల ప్రభుత్వ భూమిని దాదాపు రెండేళ్ల క్రితం గ్రామస్తుల వినతి మేరకు రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలాన్ని అంగన్వాడీ కేంద్రానికి కేటాయిస్తూ ఆక్రమణలకు గురికాకుండా ప్రహరీ ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులు తమ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ భూమిని తిరిగి వారి ఆధీనంలోకి తీసుకున్నారు. జేసీబీతో ప్రహరీని తొలగించారు. -
ఆగని టీడీపీ ఉన్మాదం
సాక్షి నెట్వర్క్: ఎన్నికల్లో కూటమి విజయం తర్వాత టీడీపీ శ్రేణుల్లో చెలరేగిన ఉన్మాదం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులపై దాడుల రూపంలో కొనసాగుతూనే ఉంది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే మొదలైన ఈ దాడుల నియంత్రణకు ప్రభుత్వం కనీస ప్రయత్నం చేయడంలేదు. దీన్ని ఆసరా చేసుకొని టీడీపీ శ్రేణులు మరింతగా రెచ్చిపోతున్నాయి. గురువారమూ టీడీపీ శ్రేణులు పలు సచివాలయాలు, ప్రభుత్వ స్థలాలపై దాడులు చేశాయి. శిలాఫలకాలు ధ్వంసం చేశాయి. బోర్డులు విరగ్గొట్టాయి.» చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో బైరెడ్డిపల్లె, నగరి మండలాల్లోని పలు సచివాలయాల్లో ఉద్యోగులు విధి నిర్వహణలో ఉండగానే టీడీపీ నాయకులు శిలాఫలకాలను ధ్వంసం చేశారు. పుంగనూరు మండలంలోని పాలెంపల్లి, భీమగానిపల్లి, బోడేవారిపల్లె సచివాలయాలకు, వెల్నెస్ సెంటర్లకు, ఆర్బీకెలకు, ఆర్వో ప్లాంటుకు, నాడు–నేడు స్కూల్ ప్రారంభించేందుకు వేసిన శిలాఫలకాలను ధ్వంసం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోటోలు ఉన్న శిలాఫలాకాలను గునపాలతో ధ్వంసం చేశారు. దీంతో సచివాలయ కార్యదర్శులు భయంతో పరుగులు తీశారు.» బైరెడ్డిపల్లె మండలం లక్కనపల్లెలో సచివాలయంలోని శిలాఫలకాలు, సంక్షేమ పథకాల బోర్డులను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. శిలాఫలకాలు తొలగించాలని ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు లేవని ఎంపీడీవో రాజేష్ చెప్పారు. కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో రెచ్చగొడుతూ శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.» నగరి మండలం తెరణి గ్రామంలో సచివాలయ భవనంపై ఉన్న నవరత్నాల ఫలకాన్ని గురువారం టీటీడీ నాయకులు, కార్యకర్తలు తొలగించారు. భవనం ముందు ఉన్న ప్రారంభోత్సవ శిలాఫలకంపై పెయింట్ పూశారు. ఈ ఘటనపై స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు పోలీసులకు సమాచారం అందించారు.» శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రామాయపట్నం గ్రామ సచివాలయం భవనంపై ఉన్న నవరత్నాల బోర్డును టీడీపీ కార్యకర్తలు బుధవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. » నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని కల్వటాలలో టీడీపీ నాయకులు మినరల్ వాటర్ ప్లాంట్ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా ఎస్సీ కాలనీకి చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరులు పెసల ఏసోబు, యాడికి ఏబులపై కర్రలతో దాడి చేశారు.» బాపట్ల జిల్లా బల్లికురవ మండలం వలాపల్లి గ్రామంలో 2017–2018లో ఉపాధి హామీ నిధులు రూ.10 లక్షలతో గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించారు. 2019లో దానిపై మొదటి అంతస్తు నిర్మించి, సచివాలయం ఏర్పాటు చేశారు. ఈ సచివాలయం శిలాఫలకాన్ని టీడీపీ నాయకులు ధ్వంసం చేశారు. గ్రామస్తులందరూ గ్రామాభివృద్ధికి బాటలు వేసుకోవాలే తప్ప శిలాఫలకాలు ధ్వంసం చేయడం సరికాదని గ్రామ సర్పంచ్ మందా మోహన్‌రావు అన్నారు. -
టోల్ అడిగినందుకు బుల్డోజర్తో విధ్వంసం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్లు దూకుడు కొనసాగిస్తున్నాయి. రాష్ట్రంలోని హపూర్ జిల్లాలో మంగళవారం(జూన్11)బుల్డోజర్ బీభత్సం సృష్టించింది. జిల్లాలోని పిల్కువా ప్రాంతం ఛాజార్సి టోల్ బూత్ వద్ద ఉదయం 8.30 గంటలకు ఒక బుల్డోజర్ వచ్చి ఆగింది. టోల్ ప్లాజా సిబ్బంది బుల్డోజర్ డ్రైవర్‌ను టోల్ ఛార్జీలు చెల్లించాలని అడిగారు. దీంతో ఆగ్రహానికి గురైన బుల్డోజర్ డ్రైవర్ టోల్ ప్లాజాకు చెందిన రెండు బూత్‌లతో పాటు సీసీ కెమెరాలను ధ్వంసం చేశాడు. బుల్డోజర్ వి ధ్వంసాన్ని టోల్‌ప్లాజా సిబ్బంది వీడియో తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బుల్డోజర్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. బుల్డోజర్ను స్వాధీనం చేసుకున్నారు. -
చేతనైతే మంచి చేయండి
రాయచోటి/రాయచోటి రూరల్: అధికారాన్ని దక్కించుకున్న వారు చేతనైతే అభివృద్ధితో ప్రజల మనసులను చూరగొనాలే కానీ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు తెగబడటం ఏమిటని అన్నమయ్య జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో గెలుపు, ఓటములు సహజమని, అధికారంలోకి వచి్చన వారు అందరికీ మంచి చేస్తూ ముందుకు సాగాలన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న హింసాకాండకు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. సోమవారం రాయచోటిలోని పార్టీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషాతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి.. నిర్మాణాలు పూర్తి చేసుకున్న సచివాలయాలపై అల్లరి మూకలు దాడులకు తెగబడి బోర్డులు ధ్వంసం చేయటాన్ని గడికోట తీవ్రంగా ఖండించారు. ప్రజల ఆస్తులైన ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు అనంతరం టీడీపీకి చెందిన అల్లరి మూకలు సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్స్‌పై దాడులు చేస్తూ అరాచకం సృష్టిస్తున్నాయన్నారు. రామాపురం మండలం చిట్లూరు, రాయచోటి రూరల్ మండలం శిబ్యాల గ్రామ సచివాలయాల్లో సంఘ విద్రోహ శక్తులు విధ్వంసం సృష్టించాయని చెప్పారు.ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. ప్రజలకు వైఎస్సార్సీపీ శ్రేణులు అనునిత్యం అండగా ఉంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలపై జరుగుతున్న దాడులపై కలెక్టర్ తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయడంపై మండిపడ్డారు. ప్రజల తీర్పు ఎప్పుడూ ఒకవైపే ఉండదని గుర్తుంచుకోవాలని సూచించారు. దాడులు, పోలీసుల నిర్లిప్త వైఖరిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.హోదా ఇస్తేనే మద్దతివ్వాలి కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకపోవడం ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు సువర్ణావకాశమని గడికోట పేర్కొన్నారు. చంద్రబాబు దీన్ని సది్వనియోగం చేసుకుంటూ రాష్ట్రానికి మేలు చేయాలని సూచించారు. ప్రత్యేక హోదా ఇస్తేనే కేంద్రానికి మద్దతు ఇస్తామని గట్టిగా చెబితే కచి్చతంగా సాధించే వీలుందన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ సీపీకి చెందిన 11 మంది రాజ్యసభ సభ్యులతోపాటు నలుగురు లోక్‌సభ ఎంపీలు అండగా నిలబడతారని చెప్పారు. పోలవరానికి రూ.12 వేల కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని, వైఎస్ జగన్మోహన్రెడ్డి గట్టిగా ఒత్తిడి చేయడంతో ఈ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చిందని వివరించారు. -
AP: వైఎస్సార్ విగ్రహాల విధ్వంసం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో అధికారం అండ చూసుకుని టీడీపీ కార్యకర్తలు విధ్వంస కాండను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. వైఎస్సార్ కార్యకర్తలపై దాడులకు పాల్పడటంతో పాటు పనిగట్టుకుని వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. పెట్రోల్ పోసి తగలబెడుతున్నారు. ట్రాక్టర్లతో కూల్చేస్తున్నారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లిలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి గురువారం అర్ధరాత్రి నిప్పు పెట్టారు. పొగ రావడాన్ని గమనించిన స్థానికులు నీళ్లు పోసి మంటలార్పారు.అంతకు ముందు విగ్రహానికి తాళ్లు కట్టి ట్రాక్టర్‌తో లాగి కూల్చేయడానికి విఫలయత్నం చేశారు. విగ్రహం ముందు వైపు ట్రాక్టర్ స్లిప్ అయిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అనంతరం మడ్డి ఇంజన్ ఆయిల్ తీసుకొచ్చి విగ్రహం మీద పోసి నిప్పు పెట్టారు. ఆ మేరకు విగ్రహం పక్కనే మడ్డి ఆయిల్ డబ్బాలు కూడా ఉన్నాయి. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ సుమన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రకాశం జిల్లా సీఎస్ పురం మండలం పెదగోగులపల్లెలో శుక్రవారం సాయంత్రం టీడీపీ శ్రేణులు విధ్వంసానికి పాల్పడ్డాయి.వైఎస్సార్ హెల్త్ క్లినిక్ సమీపంలో ఉన్న బోర్డును నేలమట్టం చేశారు. సమీపంలోని ఆర్వో ప్లాంటులోకి చొరబడి పైపులను విరిచేశారు. పల్నాడు జిల్లా వినుకొండ రూరల్ మండలం చీకటీగలపాలెం అడ్డరోడ్డులో కూడా ఇదే రీతిలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని సందర్శించారు. ⇒ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం శ్రీరంగరాజపురం మండలంలోని 49 కొత్తపల్లిమిట్ట, పుత్తూరు–చిత్తూరు జాతీయ రహదారిలోని దీపిక కల్యాణ మండపం వద్ద ఉన్న వైఎస్సార్సీపీ ప్రచార వాహనాన్ని ధ్వంసం చేసి పెట్రోలు పోసి నిప్పంటించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మి ఎన్నికల్లో ఈ వాహనాన్ని ఉపయోగించారు. పోలింగ్ అనంతరం ఆ వాహనాన్ని దీపిక కల్యాణ మండపం వద్ద పార్కింగ్ చేశారు. దుండగులు వాహనానికి నిప్పంటించిన తర్వాత కల్యాణ మండపంపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. వీవీ.పురం, కొత్తపల్లి మహభారతం, వినాయకస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసి శిలాఫలకాల్ని ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ మండలాధ్యక్షడు మణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ⇒ కూటమి శ్రేణులు విజయవాడలో వైఎస్సార్ విగ్రహం మెడలో టీడీపీ కండువా, చేతిలో ఆ పార్టీ జెండా పెట్టారు. ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు విజయవాడ భవానీపురం స్వాతి రోడ్డులో శుక్రవారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ బీజేపీ కార్యాలయం దాటి శివాలయం సెంటర్‌కు చేరుకుంది. ఆ సమయంలో ఓ యువకుడు పొక్లెయిన్‌పైకి ఎక్కి మహానేత వైఎస్సార్ విగ్రహం మెడలో పచ్చ కండువా వేశాడు. చేతిలో టీడీపీ జెండా పెట్టాడు. భవానీపురం పోలీసులు వారిస్తున్నా కార్యకర్తలు పట్టించుకోలేదు. ర్యాలీ ముందుకు కదిలిన తర్వాత పోలీసులు టీడీపీ కండువా, జెండాను తొలగించారు.⇒ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని కుప్పంబాదూరు గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. గ్రామంలోని ప్రధాన రహదారి సమీపంలో ఎన్నో ఏళ్ల క్రితం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి 10 గంటల వరకు విగ్రహం అక్కడే ఉందని, ఉదయం లేచి చూసేసరికి విగ్రహం లేకపోవడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.⇒ టీడీపీ కార్యకర్తలు శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో హల్ చల్ చేశారు. పట్టణంలోని పలుచోట్ల శిలాఫలకాలు ధ్వంసం చేయడంతో పాటు పలుచోట్ల ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు, మొండితోక అరుణ్ కుమార్ల బోర్డులను తొలగించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులకు, పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. -
Lok sabha elections 2024: దేశ గౌరవం ధ్వంసం: సోనియా
జైపూర్: దేశ గౌరవాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వంసం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఆరోపించారు. కుట్రలు కుతంత్రాలు, బెదిరింపులతో ప్రతిపక్ష నాయకులను బీజేపీలో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. శనివారం రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. గత పదేళ్ల ఎన్డీయే పాలనలో ఒరిగిందేమీ లేదని అన్నారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, అసమానతలు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పారు. నేడు దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో చిక్కుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు విధ్వంసానికి గురవుతున్నాయని తెలిపారు. ఎన్డీయే పాలనలో రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరంకుశ పాలనలను సహించే ప్రసక్తే లేదని, తగిన బుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ దేశం ఏ ఒక్కరి సొత్తు కాదని, ఇది ప్రజలందరికీ చెందుతుందని పేర్కొన్నారు. ‘గ్యారంటీ’ని దొంగిలించిన మోదీ: ఖర్గే అబద్ధాల నాయకుడు నరేంద్ర మోదీ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ‘గ్యారంటీ’ అనే పదాన్ని కాంగ్రెస్ నుంచి మోదీ దొంగిలించారని చెప్పారు. అవినీతిపరులు బీజేపీలో చేరగానే పరిశుద్ధులుగా మారిపోతున్నారని ప్రియాంకాగాంధీ వాద్రా ఎద్దేవా చేశారు. -
AI: త్వరలోనే ‘ఏఐ’తో ఆ ముప్పు!
కాలిఫోర్నియా: కీడెంచి మేలు ఎంచాలంటారు పెద్దలు. కానీ జనరేటివ్ ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విషయంపై అందరూ చేస్తోంది దాంతో వచ్చే మేళ్ల గురించిన చర్చే. ఈ అత్యాధునిక టెక్నాలజీతో భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లపై ఎవరూ ఆలోచించడం లేదు. అయితే మెషిన్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు ఎలిజర్ యడ్కోవ్‌స్కీ మాత్రం ఈ కోణంలో ఆలోచించి మానవాళికి ఏఐతో ఏ రేంజ్లో ముప్పు పొంచి ఉందో చెబుతున్నాడు. గార్డియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఐకి సంబంధించి యడ్కోవ్‌స్కీ ఒక సంచలన విషయం వెల్లడించాడు. మరో రెండేళ్లు లేదంటే ఐదేళ్లు, మరీ అడిగితే ఓ పదేళ్లు మాత్రమే మానవాళికి మిగిలి ఉన్న గడువని చెప్పాడు. మిగిలిన గడువు అని యడ్కోస్కీ వాడిన పదానికి ఆయనను ఇంటర్వ్యూ చేసిన టామ్ లామంట్ అర్థం చెప్పే ప్రయత్నం చేశాడు. టర్మినేటర్, మ్యాట్రిక్స్ సినిమాల్లో చూపించినట్లు మెషీన్లతోనే అంతం అని లామంట్ వివరించాడు. భవిష్యత్తులో భారీ సంఖ్యలో ఉద్యోగాలు పోతాయని చాలా మంది ఏఐని విమర్శిస్తున్న విషయం తెలిసిందే. అయితే యడ్కోవ్‌స్కీ మాత్రం ఒక అడుగు ముందుకేసి ఏఐతో ఏకంగా మానవాళికే ముప్పు అని అతని స్టైల్లో హెచ్చరించాడు. గతంలోనూ డేటా సెంటర్ల విషయంలో బాంబింగ్ డేటా సెంటర్లనే పదాన్ని ఈయన వాడాడు. అయితే దీని విషయంలో కొద్దిగా పునరాలోచనలో పడ్డానని కూడా అతడే తర్వాత చెప్పడం గమనార్హం. ఇదీ చదవండి.. సొంత దేశంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు -
Israel-Hamas war: దిగ్బంధంలో ఆస్పత్రులు
ఖాన్ యూనిస్/టెల్ అవీవ్: దక్షిణ గాజాకు బారులు కట్టిన జనం.. హమాస్ మిలిటెంట్ల స్థావరాలే లక్ష్యంగా ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. వీధుల్లో భూతల పోరాటాలు.. ఆసుపత్రులను చుట్టుముట్టిన ఇజ్రాయెల్ సైనికులు.. గాజా స్ట్రిప్‌లో ప్రస్తుత దృశ్యమిదీ. గాజా సిటీలోని నాలుగు పెద్ద ఆసుపత్రులపై ఇజ్రాయెల్ సైన్యం గురిపెట్టింది. హమాస్ కమాండ్ సెంటర్లు అక్కడే ఉన్నాయని, వాటిని ధ్వంసం చేయక తప్పదని తేల్చిచెప్పింది. శుక్రవారం తెల్లవారుజామునే నాలుగు ఆసుపత్రుల సమీపంలో క్షిపణి దాడులు చేసింది. గాజాలో అతిపెద్దదైన అల్–షిఫా ఆసుపత్రి ప్రాంగణంలో 24 గంటల వ్యవధిలో ఐదుసార్లు క్షిపణులు ప్రయోగించింది. కొన్ని వార్డులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇంట్లో కంటే ఆసుపత్రిలోనే భద్రత ఉంటుందని ఇక్కడ ఆశ్రయం పొందుతున్న వేలాది మంది జనం తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని క్షణమొక యుగంలా కాలం గడిపారు. అల్–ఫిఫా హాస్పిటల్ వద్ద జరిగిన దాడుల్లో ఒకరు మరణించారని, మరికొందరు గాయపడ్డారని గాజా ఆరోగ్యశాఖ ప్రకటించింది. కానీ, తమ సైన్యం దాడుల్లో 19 మంది మిలిటెంట్లు హతమయ్యారని, వీరిలో హమాస్ కీలక కమాండర్, ప్లాటూన్ కమాండర్ సైతం ఉన్నారని ఇజ్రాయెల్ వెల్లడించింది. 20 రాకెట్ లాంచర్లు నిల్వ చేసిన హమాస్ షిప్పింగ్ కంటైనర్‌ను ధ్వంసం చేశామని తెలియజేసింది. గాజాసిటీలోని నాలుగు ఆసుపత్రుల చుట్టూ ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు మోహరించాయి. ఇజ్రాయెల్ సేనలు గాజా నగరంలోకి మున్ముందుకు చొచ్చుకొస్తున్నాయి. గాజాసిటీలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయగా, 20 పాలస్తీనియన్లు మరణించారని స్థానిక అధికారులు చెప్పారు. మృతులు 11,078.. క్షతగాత్రులు 27,000 ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 11,078 మంది మరణించారని, వీరిలో 4,506 మంది చిన్నారులు ఉన్నారని గాజా ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. 27,000 మంది గాయపడ్డారని తెలిపింది. మరో 2,650 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారంతా ఇప్పటికే మృతిచెంది ఉండొచ్చని తెలుస్తోంది. వలస వెళ్తున్నవారిపై వైమానిక దాడులు! ఉత్తర గాజా నుంచి జనం దక్షిణ గాజాకు చేరుకోవడానికి వీలుగా ఇజ్రాయెల్ సైన్యం ప్రతిరోజూ దాదాపు 4 గంటలపాటు దాడులకు విరామం ఇస్తోంది. ఇకపై నిత్యం విరామం అమల్లో ఉంటుందని ఇజ్రాయెల్ వెల్లడించింది. గత ఐదు రోజుల్లో 1,20,000 మంది దక్షిణ గాజాకు వెళ్లిపోయారు. వారిపైనా వైమానిక దాడులు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈజిప్టు నుంచి గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సాయం అందుతోంది. ఆహారం, నిత్యావసరాలు, ఔషధాలతోప్రతిరోజు దాదాపు 100 వాహనాలు గాజాకు చేరుకుంటున్నాయి. మరోవైపు, హమాస్ మిలిటెంట్లపై దాడులు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహూ పునరుద్ఘాటించారు. గాజాలో హమాస్ స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసేవరకూ అవి కొనసాగుతాయన్నారు. ఉత్తర గాజా.. భూమిపై నరకం గాజాపై ఇజ్రాయెల్ సైన్యం నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతోంది. మిలిటెంట్ల స్థావరాలతోపాటు సాధారణ జనవాసాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. అక్టోబర్ 7న యుద్ధం ప్రారంభం కాగా, గాజాలో ఇప్పటికే దాదాపు 50 శాతం ఇళ్లు నేలమట్టం అయ్యాయి. శిథిలాలుగా మారిపోయాయి. ప్రధానంగా ఉత్తర గాజాలో పరిస్థితి భీతావహంగా మారింది. ఈ ప్రాంతం మరుభూమిని తలపిస్తోంది. ఐక్యరాజ్యసమితి హ్యూమానిటేరియన్ ఆఫీసు ఉత్తర గాజాను ‘భూమిపై నరకం’గా అభివరి్ణంచిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. -
రూ.468 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు ధ్వంసం
శంషాబాద్ (హైదరాబాద్): ఆర్జీఐ విమానాశ్రయంతో పాటు వివిధ ప్రాంతాల్లో అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డ రూ.468 కోట్ల విలువైన మాదకద్రవ్యాలతో పాటు విదేశీ సిగరెట్లను హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు ధ్వంసం చేశారు. మేడ్చల్ జిల్లా దుండిగల్‌లో హైదరాబాద్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా అధికారులు మంగళవారం ఈ ప్రక్రి యను పూర్తి చేశారు. ధ్వంసం చేసిన వాటిలో రూ.95.37 కోట్ల విలువ చేసే 27 కేజీల హెరాయిన్, రూ.272.55 కోట్ల విలువ చేసే 136 కేజీల మెఫిడోన్, రూ.కోటి విలువ చేసే 52 కేజీల గంజాయితోపాటు ఆర్జీఐ విమానా శ్రయంలో పట్టుడిన రూ.40 లక్షల విలువ చేసే విదేశీ సిగరెట్లు కూడా ఉన్నాయి. నైజీరియా, టాంజానియా, దక్షిణాఫ్రికా, బెనియోనాయస్ దేశాలకు చెందిన పౌరులతో పాటు మనదేశానికి చెందిన వారి నుంచి కస్టమ్స్ అధికారులు, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు కలిసి వీటిని పట్టుకున్నారు. -
జాతి క్షేమాన్ని మించిన పదవీ కాంక్ష..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సారథ్యంలోని గత యూపీఏ ప్రభుత్వం అధికార వ్యామోహంతో జాతి ప్రయోజనాలను పక్కనబెట్టిందని, బ్యాంకింగ్ వ్యవస్థను నాశనం చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. తమ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలను తిరిగి గాడినపెట్టిందని చెప్పారు. శనివారం ప్రధాని మోదీ రోజ్‌గార్ మేళాను వర్చువల్‌గా ప్రారంభించి, మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో 70వేల మందికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. ‘ఆ ఒక్క కుటుంబానికి సన్నిహితులైన కొందరు రాజకీయ నేతలు బ్యాంకుల నుంచి తమ వారికి వేల కోట్ల రూపాయలను ఇప్పించి, ఎప్పటికీ తిరిగి చెల్లించేవారు కాదు. అప్పట్లో జరిగిన ఫోన్ బ్యాంకింగ్ స్కాం అతిపెద్ద కుంభకోణం. అది దేశ బ్యాంకింగ్ వ్యవస్థ వెన్ను విరిచేసింది’అని ప్రధాని తెలిపారు. ఇప్పుడు అందరూ ఫోన్ బ్యాంకింగ్‌ను వాడుకుంటున్నారు. కానీ, అప్పట్లో జరిగింది వేరని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఉన్న దేశాల్లో భారత్ కూడా ఉందన్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న బ్యాంకుల నిర్వహణను బలోపేతం చేయడం, బ్యాంకులను విలీనం చేయడం, ఈ రంగంలో వృత్తినైపుణ్యంను పెంచడం వంటి అనేక చర్యలతో ఇది సాధ్యమైందని వివరించారు. గతంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు వేలాది కోట్ల నిరర్ధక ఆస్తులతో కునారిల్లుతూ ఉండేవి. కానీ, నేడవి రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు సేవలందించడంలో, ముద్ర వంటి వివిధ ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో బ్యాంకింగ్ రంగ ఉద్యోగులు శ్రమిస్తున్న తీరు, నిబద్ధతలను ఆయన కొనియాడారు. వాతావరణ కార్యాచరణలో భారత్ ముందుంది పణజి: వాతావరణ కార్యాచరణలో భారతదేశం ముందుండి నడిపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. హరితాభివృద్ధి, ఇంధన పరివర్తన వంటి వాతావరణ పరిరక్షణ హామీలను ఒక్కటొక్కటిగా నెరవేరుస్తోందని అన్నారు. శనివారం ప్రధాని గోవాలో జరుగుతున్న జీ20 కూటమి దేశాల ఇంధన మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి వర్చువల్‌గా మాట్లాడారు. స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యంలో 50 శాతం మృత్తికేతర ఇంధన వనరుల నుంచి 2030నాటికి సాధించాలన్న లక్ష్యం కోసం భారత్ ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. పవన, సౌర విద్యుదుత్పాదనలో సైతం అగ్రగామి దేశాల సరసన భారత్ నిలిచిందని తెలిపారు. వీటితోపాటు తక్కువ వడ్డీకే రుణాలివ్వడం ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలకు చేయూతనివ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. ‘సాంకేతికతలో అంతరాలను పూడ్చటం, ఇంధన భద్రత పెంపు, సరఫరా గొలుసుల్లో వైవిధ్యత వంటివాటి కోసం నూతన మార్గాలను అన్వేషించాల్సి ఉంది. భవిష్యత్తు ఇంధనాల కోసం సహకారాన్ని బలోపేతం చేసుకోవాల్సి ఉంది. ఇంధన భద్రతను పెంచుకునేందుకు దేశాల మధ్య గ్రిడ్లు, అనుసంధానతలపై దృష్టి సారించాలి. పరస్పరం అనుసంధానించిన గ్రీన్‌గ్రిడ్లు గొప్ప మార్పును తీసుకువస్తాయి’అని ప్రధాని మోదీ అన్నారు. వీటివల్ల వాతావరణ లక్ష్యాలు, హరిత పెట్టుబడుల సాధన, కోట్లాదిమందికి హరిత ఉద్యోగావకాశాల కల్పనకు వీలవుతుందని తెలిపారు. ‘ఇంధనం లేనిదే అభివృద్ధి, భవిష్యత్తు స్థిరత్వంపై చర్చ పూర్తికాదు. వ్యక్తుల నుంచి దేశాల వరకు అభివృద్ధిలో అన్ని స్థాయిల్లోనూ ఇంధన కీలకంగా మారిందని పేర్కొన్నారు. -
ఈ బాంబు ఒక్కటి వేస్తే.. 100 బాంబులు వేసినట్టే..
ఏదైనా బాంబును ప్రయోగిస్తే.. అది పడిన ప్రదేశంతోపాటు కొంతదూరం వరకు విధ్వంసం సృష్టిస్తుంది. అక్కడితో దాని పని అయిపోతుంది. అదే క్లస్టర్ బాంబును ప్రయోగిస్తే.. టార్గెట్ చేసిన ప్రదేశంతోపాటు చుట్టుపక్కల కొంత దూరం దాకా విధ్వంసం సృష్టిస్తుంది. అందులోని భాగాలు ఆ తర్వాత కూడా పేలుతూనే.. అక్కడికి వచ్చినవారి ప్రాణాలు తీస్తూనే ఉంటాయి. తాజాగా ఉక్రెయిన్‌కు అమెరికా క్లస్టర్ బాంబులను ఇవ్వడం, ప్రతిగా తమ వద్ద కూడా క్లస్టర్ బాంబులు ఉన్నాయని రష్యా హెచ్చరించడం నేపథ్యంలో.. క్లస్టర్ బాంబులు ఏమిటి? వాటితో ప్రమాదమేంటి? ఇప్పటివరకు ఎక్కడైనా ప్రయోగించారా? అన్న వివరాలు తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ ఒకటి కాదు వందల బాంబులు కలిపి.. సాధారణంగా క్షిపణులు అయినా, ఇతర బాంబులు అయినా వాటిలో పేలిపోయే భాగం (వార్ హెడ్) ఒకటే ఉంటుంది. ఒకే ప్రదేశంలో పెద్ద పేలుడు సంభవిస్తుంది. అదే క్లస్టర్ బాంబులో వందలకొద్దీ చిన్న బాంబులు (బాంబ్లెట్లు) ఉంటాయి. దీనిని ప్రయోగించాక నిర్దేశించిన ప్రాంతానికి చేరుకోగానే విచ్చుకుని.. అందులోని చిన్న బాంబులన్నింటినీ కొంతదూరం వరకు వెదజల్లుతుంది. ఇలా ఎక్కువ విస్తీర్ణంలో పేలుళ్లు జరుగుతాయి. అంత విస్తీర్ణంలో విధ్వంసం జరుగుతుంది. మిలటరీ స్థావరాలు, వాహనాలు, ఆయుధాలు నాశనమవుతాయి. ఆ ప్రాంతంలో ఉండే సైన్యం, సాధారణ ప్రజలకూ ప్రమాదం కలుగుతుంది. అప్పుడే పేలక.. తర్వాత ప్రాణాలు తీస్తూ.. క్లస్టర్ బాంబులు వెదజల్లే బాంబ్లెట్లలో అన్నీ అప్పటికప్పుడే పేలిపోవు. వాటిలో కొన్ని నేలపై చెల్లాచెదురుగా పడిపోతాయి. కొన్నిసార్లు ఏళ్లకేళ్లు కూడా అలాగే ఉంటాయి. ఎప్పుడైనా సైనికులుగానీ, సాధారణ పౌరులుగానీ వాటిని తాకితే పేలిపోయి ప్రాణాలు తీస్తాయి. అంటే యుద్ధం ముగిసిపోయినా బాంబుల బాధ తప్పని పరిస్థితి. ♦ గతంలో వియత్నాం, లావోస్, ఇరాక్, అష్గానిస్తాన్ తదితర యుద్ధాల్లో అమెరికా ఈ కస్టర్ బాంబులను వినియోగించింది కూడా. వాటిలో పేలిపోకుండా ఉన్న బాంబులు ఇప్పటికీ తరచూ విస్ఫోటం చెందుతూ ప్రజలు ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉన్నాయి. ♦ క్లస్టర్ బాంబులు భారీగా జన హననానికి దారి తీస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు వీటి వాడకాన్ని నిషేధిస్తూ ఒప్పందం చేసుకున్నాయి. అయితే ఆ ఒప్పందంపై అమెరికా, ఉక్రెయిన్, రష్యా సంతకం చేయకపోవడం గమనార్హం. ‘డడ్ రేటు’తో ఎఫెక్ట్ క్లస్టర్ బాంబు ప్రయోగించినప్పుడు పేలకుండా ఉండిపోయే బాంబ్లెట్ల శాతాన్ని ‘డడ్ రేటు’గా పిలుస్తారు. ఈ డడ్ రేటు ఎంత ఎక్కువగా ఉంటే.. భవిష్యత్తులో ప్రజలు వాటి బారినపడే ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుంది. రష్యాకు చెందిన క్లస్టర్ బాంబుల డడ్ రేటు 4శాతం నుంచి 40 శాతం వరకు ఉంటుందని అంచనా. తాజాగా ఉక్రెయిన్‌కు ఇచ్చిన క్లస్టర్ బాంబుల డడ్ రేటు చాలా తక్కువగా 2.35 శాతమేనని అమెరికా అధికారులు ప్రకటించడం గమనార్హం. క్లస్టర్ బాంబుల ప్రత్యేకతలివీ.. ♦ క్లస్టర్ బాంబు బరువు సాధారణంగా 450 కిలోల నుంచి 500 కిలోల వరకు ఉంటుంది. అందులో ఒక్కోటీ ఏడెనిమిది అంగుళాల పొడవున్న 200 వరకు బాంబ్లెట్లు ఉంటాయి. ♦ క్లస్టర్ బాంబు నిర్దేశిత లక్ష్యానికి చేరువకాగానే.. అతి వేగంగా తిరగడం మొదలవుతుంది. తర్వాత దశలవారీగా బాంబ్లెట్లను విడుదల చేస్తుంది. దీనివల్ల బాంబ్లెట్లు దూరదూరంగా, వేగంగా పడిపోతాయి. ♦ క్లస్టర్ బాంబుల్లోని బాంబ్లెట్లకు కిందివైపు ఫ్యాన్ తరహా ప్రత్యేకమైన రెక్కలు, లేకుంటే చిన్నపాటి ప్యారాచూట్లను అమర్చుతారు. దీనితో అవి ఓ క్రమంలో నేలను తాకి పేలిపోతాయి. ♦ పేలిపోకుండా ఉండిపోయిన బాంబ్లెట్లను గుర్తించి నిర్విర్యం చేయడం కూడా ప్రమాదకరమైన పనే. ఎవరైనా తాకగానే పేలిపోయే అవకాశాలు ఎక్కువ. అందువల్ల బాంబ్ డిస్పోజల్ యూనిట్లు, రోబోలతో వాటిని గుర్తించి, నిర్విర్యం చేయాల్సి ఉంటుంది. 1 మిలటరీ వాహనం నుంచి క్లస్టర్ బాంబు ప్రయోగం 2 నిర్దేశిత లక్ష్యానికి సమీపంలో ఉండగా క్లస్టర్ బాంబు నుంచి బాంబ్లెట్లు విడుదల అవుతాయి. 3 చాలా వరకు బాంబ్లెట్లు నేలను తాకగానే పేలిపోతాయి. 4 కొంత మేర బాంబ్లెట్లు పేలిపోకుండా నేలపై పడి ఉంటాయి. వాటిని ఎవరైనా తాకితే వెంటనే పేలిపోయి విధ్వంసం సృష్టిస్తాయి. -
ఉక్రెయిన్‌లో కూలిపోయిన భారీ డ్యామ్.. పలు ప్రాంతాలు జలమయం (ఫొటోలు)
-
సిరియాపై ఇజ్రాయెల్ దాడులు..ఐదుగురు మృతి
డెమాస్కస్: సిరియా రాజధాని డెమాస్కస్పై ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం ఐదుగురు చనిపోగా, 15 మంది వరకు గాయపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో రాజధానిలోని నివాస భవనసముదాయాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగిందని ప్రభుత్వ వార్తా సంస్థ సనా పేర్కొంది. వందల ఏళ్లనాటి కోట, ఒక కళాశాల ధ్వంసమయ్యాయని వివరించింది. ఇరాన్ అనుకూల హిజ్బొల్లా మిలిటెంట్లే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో కనీసం 15 మంది చనిపోయినట్లు యూకే కేంద్రంగా పనిచేసే సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ పేర్కొంది. కాగా, ఈ ఘటనపై స్పందించేందుకు ఇజ్రాయెల్ నిరాకరించింది. -
ఏపీలో మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం
-
దూరం చేసే అహంకారం
అహంకారం... అయిన వాళ్ళనే కాదు, కానివాళ్లనూ దూరం చేస్తుంది. అందరితో వ్యతిరేకతను పెంచి, సమాజానికి దూరంగా బతికేలా చేస్తుంది. అహంకారం ఉన్న వ్యక్తులను ఏ సమాజమూ గుర్తించదు. ఏ మనిషీ గౌరవించడు. సరికదా, అవసరమయినపుడు ఆదుకునేవారు లేక అలాంటి వ్యక్తులు నానా ఇబ్బందులూ పడతారు. నిత్య జీవితంలో చాలామంది తమ గురించి, తమ ఆలోచనల గురించి గొప్పగా ఊహించుకుంటూ, తాము అందరికంటే ఉన్నతులమని, తమకంటే గొప్ప వారు మరొకరు లేరని భ్రమిస్తూంటారు. చేస్తున్న ప్రతిపనిలోనూ తమ గొప్పతనాన్ని చాటుకుంటూ, తాము ఇతరులకు భిన్నమని, ఇతరులకంటే తాము చాలా ఎక్కువమని భావిస్తూ వాస్తవానికి దూరంగా జీవిస్తారు. వారిలో ఏ విశేషమూ లేకపోయినా, ఎంతో విఖ్యాతులమని విర్రవీగుతారు. తమలోని వాపును కూడా మహాబలమని భ్రమిస్తారు. అణకువతో ఓ మెట్టు దిగుదామన్న విషయాన్ని అటుంచి దానిని అవమానంగా భావిస్తారు. ఇలా అంతర్యామికీ, అంతరాత్మకూ మధ్య ఉన్న ఆ అదృశ్య, అతి ప్రమాదకర అంతఃశత్రువే అహంకారం. దానినే మనం గర్వమని కూడా పిలుస్తుంటాం. వినమ్రతకు అహంకారం బద్ధ వ్యతిరేకం. గర్విష్టికి భగవంతుడు ఆమడదూరంలో ఉంటాడు. ముందు ‘నేను’ అనే మాయ నుంచి బయట పడితే, ఆ తరువాత తన దరికి చేర్చుకుంటానంటాడు. నిజానికి ఆధ్యాత్మిక సాధనల లక్ష్యం ఆత్మను పొందడం కాదు. అహంకారాన్ని పోగొట్టుకోవడమే. మనం తినే తిండిలో కారం ఎక్కువైతే శరీరంలోని రక్తం మలినమవుతుంది. అదే అహంకారం పాలు ఎక్కువైతే మానవత్వమే మంటకలసి పోతుంది. ఎవరిలో అహంకారం ప్రవేశిస్తుందో అలాంటి వారు అధోగతి పాలవుతారు. చెదపురుగు పట్టిన వస్తువు ఏ విధంగా పనికి రాకుండా పోతుందో, అదేవిధంగా అహంకారం అనే చెదపురుగు పడితే మానవవత్వం మృగ్యమైపోతుంది. మనిషికి బుర్ర నిండా వెర్రి ఆలోచనలు కలిగిస్తుంది. మానవత్వం నుంచి రాక్షసత్వంలోకి మనిషిని నెట్టేస్తుంది. గర్వం లేదా అహంకారం ఎవరిలో ప్రవేశిస్తుందో వారి గతి అధోగతే. మనిషిలో గర్వం, అహంకారం కొంచెం ఉన్నా అవి మనిషిని నిలువునా ముంచేస్తాయి. గర్వంతో కూడిన విజయం ఎల్లప్పుడూ శాశ్వతం కాదు. అలాంటి విజయం వలన తాత్కాలిక ఆనందం పొందినప్పటికీ, సమస్యలు వచ్చినప్పుడు మనకు తోడుగా ఎవరూ ఉండరని గుర్తుంచుకోవాలి. నాది, నేను అనే భావనలు మనిషిలో గర్వాన్ని, అహంకారాన్ని పెంచుతాయి. ఈ రెండు భావనలను మనసు నుంచి తుడిచేస్తే జీవితంలో ఎలాంటి విజయాన్నైనా సొంతం చేసుకోవచ్చు. దుర్యోధనుడి విపరీతమయిన అహంకారం వల్లే మహా భారత సంగ్రామం జరిగింది. గర్వితుడయిన దుర్యోధనుడి అహంకారం వల్ల పాండవులకు ధర్మంగా రావల్సిన రాజ్యం కూడా రాకుండా పోయింది. అంతేకాదు ద్రౌపది వస్త్రాపహరణానికి, కౌరవ సేనల అకృత్యాలకు, జూదంలో ధర్మరాజును మాయతో గెలిచిన తీరుకు... ఇలా అన్నింటికీ దుర్యోధరుని అహంకారమే కారణమయ్యింది. ఆ అహంకారం వల్లే సాక్షాత్తు శ్రీ కృష్ట భగవానుడు యుద్ధం వద్దని వారించడానికి వచ్చినా దుర్యోధనుడు వినలేదు.. కయ్యానికి కాలు దువ్వి , తాను నాశనమవడమే కాకుండా ఏకంగా కురు వంశం నాశనమవ్వడానికి కారణమయ్యాడు. ఇలా దుర్యోధనుడే కాదు మన పురాణాలలో అనేక మంది పురాణ పురుషులు అహంకారంతో తమ నాశనాన్ని తామే కోరి తెచ్చుకున్నారు. గర్వమనేది మనిషిని పూర్తిగా నిర్వీర్యుడ్ని చేసి, పతనానికి పునాది వేస్తుంది. కనుక ఎవరైనా ఒకరిపై గెలిచామనే గర్వంతో ఆనందిస్తున్నారంటే వారిలో మానసిక వైకల్యం ఉన్నట్టుగానే భావించాలి. గర్వం నాశనానికి తొలి మెట్టు. మనిషిలో గర్వం అనే అగ్నిని రాజేస్తే, ఆ తర్వాత అది దుఃఖానికి కారణమవుతుంది. మనషి బతికి ఉన్నప్పుడే నేను, నాది అనే భావనలు కలుగుతాయి. మరణించాక శ్మశానంలో రాజైనా,సేవకుడైనా,ధనికుడైనా, పేదవాడైనా ఒక్కటే. అందువల్ల ఈ భూమి మీద బతికున్నంత కాలం ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా జీవించడానికి కృషి చేయాలి. గర్వాన్ని ఎలాంటి పరిస్థితుల్లో దరి చేరనివ్వకుండా సచ్ఛీలతతో తమకున్నదానిలో ఇతరులకు సహాయం చేసేవాడే నిజమైన విజేత అవుతాడన్న వాస్తవాన్ని గుర్తెరగాలి. విధేయత, అణకువ లాంటి లక్షణాలు మనుషులను విజయతీరాలకు తీసుకువెళతాయి. అందువలన జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరినప్పటికీ గర్వం, తలకెక్కించు కోకుంటే అసలైన విజయం సొంతం అవుతుంది. గర్వం లేనివారు ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో తప్పక విజయం సాధిస్తారు. గర్వం లేనప్పుడు దురభిప్రాయం ఉండదు. ఎందుకంటే గర్వం, దురభిప్రాయం రెండూ వేరు వేరు కాదు. మనిషికి ఒకదాని పట్ల గర్వభావన ఉంటే వేరొక దాని పట్ల దురభిప్రాయం, అంటే చిన్న చూపు ఉన్నట్లే. కనుక గర్వం ఒక విధమైన దురభిప్రాయంలో నాటుకుపోయి ఉంటుంది. అహంకారం అనేది ఎక్కడో ఉండదు. అజ్ఞాతంగా మనలోనే ఉంటుంది. ఇది అనేక అనర్థాలకు మూలకారణమవుతుంది. ఉన్న పళంగా ఆకాశానికి ఎత్తేసి, ఆ ఆకాశం నుంచి ఒక్క ఉదుటన పాతాళంలోకి తోసేస్తుంది. అహంకారం ఉన్న వ్యక్తులెవరైనా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటారు. – దాసరి దుర్గా ప్రసాద్ -
రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో.. ఏ1గా మధుసూదన్
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన విధ్వంసం కేసులో 45 మందిని అరెస్టు చేసిన పోలీసులు యల్లారెడ్డికి చెందిన స్పోర్ట్స్ పర్సన్ మలవెల్లి మధుసూదన్‌ను ఏ1 గా చూపించారు. ప్రస్తుతానికి ఇతడే ప్రధాన నిందితుడు అయినప్పటికీ.. దర్యాప్తులో వేరే వ్యక్తుల పాత్ర తేలే అవకాశం ఉందని చెపున్నారు. మధుసూదన్‌తో సహా అరెస్ట్‌చేసిన నిందితులను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి.. రిమాండ్ రిపోర్టును దాఖ లు చేశారు. ఇందులో మొత్తం 56 మందిని ఇప్పటివరకు నిందితులుగా గుర్తించినట్లు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు పేర్కొన్నారు. 13 మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు. శుక్రవారం నమోదుచేసిన ఎఫ్ఐఆర్లో ఐపీసీ, రైల్వే, ప్రజా ఆస్తుల విధ్వంసక నిరోధక చట్టాల్లోని 15 సెక్షన్ల కింద నిందితులపై ఆరో పణలున మోదుచేశారు. ప్రాథమిక దర్యాప్తులో కుట్రకోణం వెలుగులోకి రావడంతో ఆదివారం నాటి నిందితుల రిమాండ్ రిపోర్ట్‌లో ఆమేరకు ఐపీసీలోని 120బీ సెక్షన్‌ను జోడించారు. కాగా, మధుసూదన్ జాతీయ కబడ్డీ ఆటగాడు. 18 మంది ప్రత్యక్ష సాక్షులు ఈ కేసులో క్షతగాత్రులు సహా 18 మందిని ప్రత్యక్ష సాక్షులుగా చేర్చారు. నిందితులుగా ఉన్న 56 మందీ ఫిజికల్, మెడికల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సా«ధించి ఆర్మీ ఉద్యోగం కోసం ఎదు రుచూస్తున్న వారేనని పోలీసులు పేర్కొన్నా రు. కేంద్రం కొత్తగా తెచ్చిన అగ్నిపథ్ నియా మక పథకానికి వ్యతిరేకంగా వాట్సాప్ గ్రూపు లు ఏర్పాటు చేశారని, ఇప్పటివరకు 8 గ్రూపులను గుర్తించామని, బిహార్‌లో జరిగిన అలర్ల వీడియోలను వీటిలో పోస్టు చేశారని రిపోర్టులో పేర్కొన్నారు. ఏడు వాట్సాప్ గ్రూపుల అడ్మిన్లు పరారీలో ఉండగా.. ‘రైల్వేస్టేషన్ బ్లాక్’అడ్మిన్ రమేశ్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ గ్రూప్ ద్వారా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధ్వంసానికి ప్లాన్ చేశారని, పలు ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలకు చెందిన నిర్వాహకులు, యజమానులు, డైరెక్టర్లు సహకరించారని పొందుపరిచారు. ఆస్తి, ఆత్మ రక్షణ కోసం పోలీసులు నిరసనకారులపై కాల్పులు జరిపారని బుల్లెట్ తగిలి రాకేష్ మరణించగా... మరో 12 మందికి గాయాలయ్యాయని రాశారు. ఈ రిపోర్ట్‌లో ఎక్కడా ఏపీలోని నరసరావుపేటకు చెందిన సాయి డిఫెన్స్ అకాడమీ యజమాని ఆవుల సుబ్బారావు పేరు కనిపించ లేదు. సికింద్రాబాద్ స్టేషన్ మేనేజర్ రాజ నర్సు ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ వెల్లడించింది. విధ్వంసంలోని ప్రతి ఘట్టమూ సెల్ఫోన్లలో రికార్డింగ్ సికింద్రాబాద్ స్టేషన్లో స్వయంగా విధ్వంసం సృష్టించిన వారే సాక్ష్యాధారాలను పరోక్షంగా ఇచ్చారని అధికారులు చెప్తున్నారు. ఈ విధ్వంసంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తాము చేసే చర్యలను తమ ఫోన్లలో ఇతరుల ద్వారా రికార్డు చేయించారు. రైలు ఇంజిన్ పగలకొట్టడం దగ్గర నుంచి బోగీలు కాల్చడం వరకు ప్రతి ఘట్టాన్నీ ఇలా చిత్రీకరించారు. ఓ ఆందోళనకారుడు ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగీలోకి ఎక్కి, అక్కడ దొరికిన కాగితాలను సీటులో వేసి, మంట అంటిస్తున్నదీ తన సెల్ఫోన్లో రికార్డు చేయించాడు. ఇలాంటి ఫొటోలు, వీడియోలను కొన్నింటిని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయగా మరికొన్ని గ్యాలరీల్లో సేవ్ అయి ఉన్నాయి. 45 మంది నిందితులను అరెస్టు చేసిన జీఆర్పీ పోలీసులు వారి నుంచి 44 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని విశ్లేషించి ఈ విధ్వంసానికి పథక రచన చేసిన వారి వివరాలను వాట్సాప్ గ్రూపుల ద్వారా తెలుసుకున్నారు. ఫోన్లలో ఉన్న వీడియో, ఫొటో సాక్ష్యాలను సేకరిం చారు. న్యాయస్థానం అనుమతితో ఈ ఫోన్ల ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపి వీటిని పక్కా ఆధారాలుగా తయారు చేయాలని నిర్ణయిం చారు. మరోపక్క విధ్వంసం కేసును హైదరాబాద్ పోలీసులకు బదిలీ చేశామని రైల్వే ఎస్పీ ఆదివారం రాత్రి ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు ఇవ్వాలని, సోమవారం వరకు అలాంటివి అందలేదని నగర పోలీసులు చెప్తున్నారు. సుబ్బారావుని తెస్తారా? లేదా? ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేటకు చెందిన సా యి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావును ఈ కేసులో అరెస్టు చేయడంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. విధ్వంసానికి పాల్పడిన నిందితుల్లో 272 మంది నగరంలోని ఇతడి బ్రాంచ్ అభ్యర్థులని పోలీసులు గుర్తించారు. అభ్యర్థులను రెచ్చగొట్టడంతోపాటు ఉదంతం జరగడానికి ముందు రోజు రాత్రి సికింద్రాబాద్ వచ్చాడని, ఘటన జరిగిన రోజు కొన్ని గంటలు ఉన్నాడని తేల్చారు. అయితే నరసరావుపేట పోలీసుల అదుపులో ఉన్న ఇతడిని తమకు అప్పగించాలంటూ రైల్వే పోలీసులు కోరలేదు. సుబ్బారావును నిందితుడిగా చేర్చడానికి మరికొన్ని ఆధారాలు అవసరమని ఓ అధికారి పేర్కొన్నారు. కీలక నిందితులది కామారెడ్డి జిల్లా సాక్షి, కామారెడ్డి: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కేసులో కీలక నిందితులు కామారెడ్డి జిల్లాకు చెందిన వారే ఉన్నారు. కేసులో ఏ1గా ఉన్న మలపెల్లి మధుసూదన్ (20)ది ఎల్లారెడ్డి కాగా.. ఏ5 సంతోష్ (22) గాంధారి మండలం మాతుసంగెంకు చెందిన వాడు, ఏ13 బూక్య పెంట్య (19) మాచారెడ్డి మండలం ఎల్లంపేటకు చెందిన వ్యక్తిగా తేల్చారు. వీరితోపాటు విధ్వంసంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ సబ్ డివిజన్లకు చెందిన మరో 12 మంది ఉన్నట్టు తెలుస్తోంది. సోమవారం పోలీసులు జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. -
ఉక్రెయిన్‌లో అదే విధ్వంసం
కీవ్: ఉక్రెయిన్‌పై దాడులను రష్యా మరింత తీవ్రతరం చేస్తోంది. దేశంలోని పలు నగరాలు, పట్టణాలపై ఆదివారం మరింత భారీ స్థాయిలో క్షిపణి, బాంబు దాడులకు దిగింది. సెంట్రల్ ఉక్రెయిన్‌లోని వినిటిసా నగరంలో విమానాశ్రయం రష్యా క్షిపణి దాడుల్లో ధ్వంసమైంది. కాల్పుల విరమణకు రెండు రోజుల వ్యవధిలో రెండోసారి రష్యా తూట్లు పొడిచింది. రేవు పట్టణం మారియుపోల్, వోల్నోవఖా నగరాల నుంచి పౌరులు సురక్షితంగా తరలిపోయేందుకు వీలుగా కొద్ది గంటలు కాల్పులు ఆపుతామని ప్రకటించి, కాసేపటికే భారీ కాల్పులతో వాటిపైకి విరుచుకుపడింది. శనివారం కూడా రష్యా ఇలాగే మాటిచ్చి తప్పడం తెలిసిందే. కీవ్‌కు ఉత్తరాన ఉన్న చెర్నిహివ్‌లో 500 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత శక్తిమంతమైన ఎఫ్ఏబీ–500 బాంబులను జనావాసాలపై రష్యా ప్రయోగించింది. దుర్భేద్యమైన కట్టడాలను పేల్చేసేందుకు సైనిక, పారిశ్రామిక లక్ష్యాలపై మాత్రమే వీటిని ప్రయోగిస్తుంటారు. ఖర్కీవ్‌లో అణు పదార్థాలు, రియాక్టర్ ఉన్న ఓ పరిశోధన సంస్థపై కూడా రష్యా రాకెట్లు ప్రయోగించినట్టు ఉక్రెయిన్ పేర్కొంది. దాడుల్లో వాటికేమైనా అయితే భారీ వినాశనం తప్పదని ఆందోళన వెలిబుచ్చింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య సోమవారం మూడో రౌండ్ చర్చలు జరగవచ్చని తెలుస్తోంది. యుద్ధం నేపథ్యంలో కనీసావసరాలు తీరక విపరీతమైన చలి, ఆహారం, తాగునీటి కొరతతో ఉక్రెయిన్‌వాసులు అల్లాడుతున్నారు. కీవ్ సమీపంలోని ఇర్పిన్ వద్ద వేలాది మంది పొట్ట చేతపట్టుకుని పోలండ్, రొమేనియా, మాల్డోవా వైపు వెళ్లిపోతూ కన్పించా రు. వీరిలో పలువురు రష్యా తూటాలకు బలయ్యారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది! ముప్పేట దాడిలో నగరాలు మరోవైపు ఖర్కీవ్, చెర్నిహివ్తో పాటు కీవ్, మికోలేవ్, సమీ తదితర నగరాలను కూడా రష్యా సైన్యం పూర్తిగా చుట్టుముట్టి ముప్పేట దాడులు చేస్తోంది. వీటిని ఉక్రెయిన్ సైనికులు శాయశక్తులా అడ్డుకుంటున్నారు. కీవ్ పరిసరాల్లో కందకాలు తవ్వి, నానా వస్తువులతో రోడ్లను బ్లాక్ చేసి రష్యా సేనలను నిలువరిస్తున్నారు. అయినా నగరంపైకి రష్యా క్షిపణులు, బాంబులు నిరంతరం వచ్చి పడుతూనే ఉన్నాయి. పరిసర ప్రాంతాలు, గ్రామాలపై కూడా భారీగా దాడులు కొనసాగుతున్నాయి. ఏ క్షణమైనా భారీ దాడి జరగవచ్చనే భయాల మధ్య జనం భారీగా రాజధాని వదిలి వెళ్లిపోతున్నారు. అయితే కీవ్ ముట్టడి కోసం కొద్ది రోజుల క్రితం బయల్దేరిన 64 కిలోమీటర్ల పొడవైన రష్యా పటాలం ఇప్పటికీ నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయి ఉందని సమాచారం. ఆదివారం మరో రష్యా యుద్ధ విమానాన్ని కూల్చేసిట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. దేశంలోని అతి పెద్ద రేవు పట్టణమైన ఒడెసాలో కూడా రష్యా దళాలను ఉక్రెయిన్ సైన్యం తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ప్రతి నగరంలోనూ రష్యా సేనలపై దాడికి దిగాలని పౌరులకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పిలుపునిచ్చారు. వారిపై వీధి పోరాటాలకు దిగాలని సూచించారు. భారీగా సైన్యాలు దూసుకొస్తున్నా ప్రజలు ఉక్రెయిన్ సైనికులతో కలిసి వారిని ఎదుర్కొంటున్న తీరును ఎంత పొగిడినా తక్కువేనన్నారు. స్టార్‌లింక్ సిస్టమ్ ద్వారా తమ దేశానికి ఇంటర్నెట్ సేవలు అందిస్తూ రష్యా దుర్మార్గాన్ని బయటి ప్రపంచానికి చూపించేందుకు తోడ్పడుతున్న స్పేస్ ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ...అప్పటిదాకా పోరే: పుతిన్ ప్రస్తుత పరిస్థితికి ఉక్రెయినే కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. తమ డిమాండ్లకు ఉక్రెయిన్ అంగీకరించే దాకా యుద్ధం కొనసాగి తీరుతుందన్నారు. తీరు మారకపోతే ఉక్రెయిన్ స్వతంత్ర దేశ హోదా ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. ఆదివారం టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ పుతిన్‌తో గంటకు పైగా జరిగిన ఫోన్ చర్చల్లో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలపైనా పుతిన్ మరోసారి మండిపడ్డారు. అవి తమపై యుద్ధం ప్రకటించడమేనన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెనెట్ ఆకస్మికంగా రష్యా వెళ్లి పుతిన్‌తో మూడు గంటల పాటు చర్చలు జరిపారు. తర్వాత జెలెన్స్కీతో కూడా ఆయన మాట్లాడారు. ఉక్రెయిన్‌కు అమెరికా ఫైటర్ జెట్లు? ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల మద్దతు కొనసాగుతూనే ఉంది. ఆయుధాలు, యుద్ధ పరికరాలతో పాటు సహాయ సామగ్రి దాకా భారీగా అందుతోంది. తమకు ఫైటర్ జెట్లు అందజేయాలన్న జెలెన్స్కీ విజ్ఞప్తిపై అమెరికా సానుకూలంగా స్పందిస్తోంది. ఈ విషయమై పోలండ్‌తో మాట్లాడుతున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. ఉక్రెయిన్‌లో మరో అణు విద్యుత్కేంద్రాన్ని కూడా ఆక్రమించేందుకు రష్యా సేనలు ప్రయత్నిస్తున్నట్టు జెలెన్స్కీ ఆరోపించారు. వెంటనే ఉక్రెయిన్ను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని నాటోకు మరోసారి విజ్ఞప్తి చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్ నుంచి 15 లక్షల మంది వలస బెర్లిన్: ఉక్రెయిన్ నుంచి ప్రాణాలు అర చేతుల్లో పెట్టుకొని 15 లక్షల మంది వలస వెళ్లినట్టుగా ఐక్యరాజ్య సమితి శరణార్థ సంస్థ వెల్లడించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో అత్యంత వేగంగా పెరిగిపోతున్న వలసల సంక్షోభం ఇదేనని తెలిపింది. మీడియాపై రష్యా ఉక్కుపాదం మాస్కో: ఉక్రెయిన్‌పై దాడితో సొంత దేశంలో వెల్లువెత్తుతున్న నిరసన గళాల్ని రష్యాలో పుతిన్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తోంది. స్వతంత్రంగా వ్యవహరించే మీడియాపై ఉక్కుపాదం మోపుతోంది. న్యూస్ వెబ్సైట్లను బ్లాక్ చేస్తోంది. యుద్ధానికి వ్యతిరేకంగా ఎవరైనా నిరసన తెలిపితే అరెస్ట్ చేస్తోంది. ఆదివారం పలు స్వతంత్ర ఆన్లైన్ న్యూస్ వెబ్ సైట్లను రష్యా ప్రభుత్వం బ్లాక్ చేసింది. మరికొన్ని మీడియా సంస్థలపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చి మూత పడేలా చేసింది. అలాంటి సంస్థల్లో అమెరికా నిధులతో నడుస్తున్న రేడియో ఫ్రీ యూరప్ కూడా ఉంది. బెలారస్ ఉప రక్షణ మంత్రి రాజీనామా కీవ్: బెలారస్ ఉప రక్షణ మంత్రి మేజర్ జనరల్ విక్టర్ గులేవిచ్ తన పదవికి రాజీనామా చేశారు. ఉక్రెయిన్ దురాక్రమణలో పాలుపంచుకోవడం ఇష్టంలేక పదవిని వీడుతున్నట్లు తెలిపారు. తన రాజీనామాను రక్షణమంత్రి కార్యాలయానికి పంపినట్లు తెలిపారు. రష్యా బలగాలను తమ సరిహద్దుల్లో మోహరించడానికి అనుమతించినవారిలో గులేవిచ్ కూడా ఉన్నారు. ఆయనపై యూకే పలు ఆర్థిక ఆంక్షలు విధించింది. -
బుందేల్‌ఖండ్‌ను నాశనం చేశారు: మోదీ
మహోబా(యూపీ): ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతాన్ని గతంలో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం చెలాయించిన నాయకులు నాశనం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఇక్కడి వనరులను, అటవీ సంపదను మాఫియాల చేతికి అప్పగించాయని దుయ్యబట్టారు. ఆయన శుక్రవారం బుందేల్‌ఖండ్‌లో రూ.3,425 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఝాన్సీలో 600 మెగావాట్ల అల్ట్రా మెగా సోలార్ పవర్ పార్కు నిర్మాణానికి పునాదిరాయి వేశారు. అలాగే స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన లైట్ కంబాట్ హెలికాప్టర్లు, మానవరహిత ఏరియల్ వెహికిల్స్ (యూఏవీలు), యుద్ధనౌకల్లో వినియోగించే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్‌ను ఝాన్సీలో భారత సైనికదళాలకు అందించారు. -
UP: సెంట్రల్ జైలులో ఖైదీల వీరంగం
-
సెంట్రల్ జైలులో ఖైదీల రాళ్ల దాడి.. ఆపై నిప్పు!
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని జైఫతేఘర్ సెంట్రల్ జైలులో ఖైదీలు వీరంగం సృష్టించారు. జైలు సిబ్బందిపై రాళ్లలో దాడి చేసి, జైలుకు నిప్పు అంటించారు. హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సందీప్ కుమార్ అనే వ్యక్తి మృతి చెందడంతో ఖైదీలు నిరసన తెలిపారు. ఈ నిరసన కాస్త ఉద్రిక్తంగా మారింది. జైలు సిబ్బంది సరైన వైద్యం అందించకపోవడం కారణంగానే సందీప్ కూమార్ మృతిచెందాడని పలువురు ఖైదీలు ఆరోపణలు చేసి దాడికి పాల్పడ్డారు. ఖైదీలు ఇద్దరు డిప్యూటీ జైలర్లను జైలులోనే బంధించారు. దీంతో పోలీసులు ఖైదీల అల్లర్లును ఆపడానికి వారిపై భాష్ప వాయువు ప్రయోగించారు. అయినప్పటికీ అదుపులోకి రాకపోవటంతో అదనపు బలగాలను జైలులోకి మోహరించారు. దీంతో జైలు ఉన్నతాధికారులు ఖైదీలును శాంతిపజేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. -
డ్రోన్ విధ్వంసక వ్యవస్థ త్వరలోనే సైన్యానికి..
భారత సైన్యం, ఇతర భద్రతా దళాలకు డ్రోన్లను గుర్తించి ధ్వంసం చేసే వ్యవస్థ త్వరలోనే అందుబాటులోకి రానుంది. డ్రోన్లను గుర్తించడం, జామ్ చేయడం, ధ్వంసం చేయడం కోసం రూపొందించిన పరిజ్ఞానాన్ని విజయవంతంగా పరీక్షించి కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రదర్శించాం. ఈ పరిజ్ఞానాన్ని ఇప్పటికే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌కు అందించాం. మరికొన్ని పరిశ్రమలకు కూడా త్వరలో అందించి వాటి ద్వారా డ్రోన్ విధ్వంసక వ్యవస్థ ఉత్పత్తిని చేపడతాం. సాక్షి, అమరావతి: శత్రు దేశాలు, ఉగ్రవాద సంస్థలు, అసాంఘిక శక్తులు ప్రయోగించే డ్రోన్లను గుర్తించి ధ్వంసం చేసే పరిజ్ఞానాన్ని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) ఇప్పటికే విజయవంతంగా అభివృద్ధి చేసిందని సంస్థ చైర్మన్ జి. సతీశ్‌రెడ్డి వెల్లడించారు. రక్షణ రంగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రరాజ్యాలకు దీటుగా అభివృద్ధి సాధిస్తోందని ఆయన చెప్పారు. భారత సైన్యం, ఇతర భద్రతా దళాలకు ఈ వ్యవస్థ త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డ్రోన్ విధ్వంసక వ్యవస్థతోపాటు రక్షణ రంగంలో భారత్ ప్రపంచంలోనే బలమైన శక్తిగా ఎదుగుతున్న తీరును ఇలా వివరించారు.. ►డ్రోన్లను గుర్తించడం, జామ్ చేయడం, ధ్వంసం చేయడం కోసం రూపొందించిన పరిజ్ఞానాన్ని విజయవంతంగా పరీక్షించి కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రదర్శించాం. ►ఈ పరిజ్ఞానాన్ని ఇప్పటికే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌కు అందించాం. మరికొన్ని పరిశ్రమలకు కూడా త్వరలో అందించి వాటి ద్వారా డ్రోన్ విధ్వంసక వ్యవస్థ ఉత్పత్తిని చేపడతాం. ►టీటీడీతో సహా ఎవరైనా సరే ఆ పరిశ్రమల నుంచి డ్రోన్ విధ్వంసక టెక్నాలజీని కొనుగోలు చేసి అవసరమైనచోట్ల నెలకొల్పుకోవచ్చు. టాప్ ఫైవ్‌లో భారత్ ►రక్షణ రంగంలో భారతదేశం స్వయం సమృద్ధిని సాధించి ప్రపంచంలోనే మొదటి ఐదు అగ్రరాజ్యాల జాబితాలో స్థానం సాధించింది. ►బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ కలిగి ఉన్న నాలుగు దేశాల్లో భారత్ ఒకటి. ►అత్యాధునిక తేజస్ యుద్ధ విమానాలను రూపొందించిన ఆరు దేశాల్లో మన దేశం ఉంది. ►అణు ట్యాంకర్లు కలిగిన ఏడు దేశాల్లో భారత్ ఉంది. ►క్షిపణి విధ్వంసకర వ్యవస్థను అభివృద్ధి చేసిన ఆరు దేశాల్లో భారత్‌కు చోటు దక్కింది. ►ఉపగ్రహాలను న్యూట్రలైజ్ చేసి ధ్వంసం చేయగల సామర్థ్యం కలిగిన నాలుగు దేశాల్లో భారత్ కూడా ఉండటం గర్వకారణం. ►ప్రపంచంలోనే అత్యంత దూరంలోని అంటే 48 వేల కి.మీ. వరకు షెల్స్ ప్రయోగించే 155 ఎంఎం గన్ను రూపొందించాం. ►దేశంలో 2 వేల ప్రధాన పరిశ్రమలతోపాటు మొత్తం 11వేల పరిశ్రమలు రక్షణ ఉత్పత్తులను తయారుచేస్తున్నాయి. ►రాబోయే ఐదారేళ్లలో రక్షణ రంగంలో దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచడం.. అగ్రరాజ్యాలకు దీటుగా నిలబడాలన్నదే ప్రస్తుత లక్ష్యం. ►కృష్ణాజిల్లాలోని నాగాయలంక క్షిపణి ప్రయోగ కేంద్రం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. కరోనా మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం దేశంలో కరోనా మూడో వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం, డీఆర్డీఓ పూర్తి సన్నద్ధంగా ఉన్నాయని సతీశ్‌రెడ్డి చెప్పారు. కృష్ణాజిల్లా రచయితల సంఘం ఆదివారం విజయవాడలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో సతీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ప్రతి జిల్లాలో రెండు ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పుతుండటంతోపాటు లిక్విడ్ ఆక్సిజన్ కూడా అందుబాటులో ఉంచేందుకు అవసరమైన ట్యాంకర్లను సిద్ధంచేస్తున్నట్లు చెప్పారు. కరోనాను అరికట్టేందుకు మొత్తం 75 రకాల ఉత్పత్తులను కనిపెట్టడంతోపాటు 190 రకాల పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశామని ఆయన చెప్పారు. -
అమెరికాలో గాంధీ విగ్రహం ధ్వంసం పట్ల తీవ్ర నిరసన
డల్లాస్ : వాషింగ్టన్ డి.సి లో ఇండియన్ ఎంబసీకి ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని దౌర్జన్యకారులు ధ్వంసం చేయడాన్ని మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా ప్రవాస భారతీయులను, గాంధేయవాదులను తీవ్రంగా కలచి వేసిందన్నారు. అమెరికాలో ప్రస్తుతం నెలకొన్న జాతివివక్షత నిరసనకు ఈ ధ్వంసానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలో మే 25న ఒక పోలీస్ అధికారి జార్జ్ ఫ్లాయిడ్ అనే ఆఫ్రికన్ అమెరికన్ మెడను ఎనిమిది నిమిషాల పాటు తొక్కి పట్టి ఉంచడం ద్వారా అతని మరణానికి కారణం అవడం ఒక అనాగరిక, పాశవిక చర్య అని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన మొదటిది కాదని, గతంలో అనేక రాష్ట్రాల్లో ఈ విధంగా జరగడం ఏ మాత్రం సమర్ధనీయం కాదన్నారు. ప్రస్తుతం ఆరు రాష్ట్రాల్లో ముప్పై కి పైగా నగరాల్లో అత్యవసర పరిస్థితి నెలకొని ఉంది. ఆఫ్రికన్ అమెరికన్ల ఆగ్రహానికి, ఆవేదనకు, నిరసనకు అర్థం ఉందని, తప్పనిసరిగా అందరూ మద్దతు పలకాలని ప్రసాద్ అన్నారు. అయితే ఆఫ్రికన్ అమెరికన్లకు న్యాయం జరగాలని ఏ ఉద్దేశ్యంతో ఆందోళన ప్రారంభించారో, గత పది రోజులుగా జరుగుతున్న ఈ దౌర్జన్యాలు, దహనకాండ, ధ్వంసంతో ఆ ఆశయం పక్క మార్గం పట్టి దహనాలు, దోపిడీలు, విధ్వంసాలకు దారి తీయడం శోచనీయమన్నారు. ముఖ్యంగా ఆఫ్రికన్ అమెరికన్ల ఆత్మ గౌరవాన్ని, వారి హక్కులకై నిరంతర పోరాటం చేసిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ లాంటి నాయకులు మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకొని శాంతియుత పంథాలో ఉద్యమాలను నిర్వహిస్తే అదే గాంధీ విగ్రహాన్ని ఇప్పుడు ధ్వంసం చేయడం ఒక అనాలోచిత చర్య అని డా. ప్రసాద్ తోటకూర పేర్కొన్నారు . ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులలో ప్రభుత్వం, ప్రభుత్వాధికారుల వ్యాఖ్యానాలు ఆఫ్రికన్ అమెరికన్లకు స్వాంతన చేకూర్చే విధంగా ఉండాలే తప్ప అగ్నికి ఆజ్యం పోసే విధంగా ఉండకూడదు. ప్రజల రక్షణలో చాలా మంది పోలీసులు తమ ప్రాణాలు కోల్పోవడం కూడా ప్రజలందరూ గుర్తుంచుకోవాలని.. అయితే పోలీసులు నేరస్తులను పట్టుకొని న్యాయస్థానానికి అప్పగించాలే తప్ప, తమకున్న విచక్షణాధికారాలను దుర్వినియోగ పరిచి ఈ విధంగా ప్రాణాలు తీయడం ఏ మాత్రం సమర్ధనీయం కాదని మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర అన్నారు. -
ఆరో వినాశనం.. ఇలా ఆపేద్దాం!
వాషింగ్టన్: భూమి చరిత్రలో ఆరో వినాశనం త్వరలోనే ఉండనుందా..? ఇప్పటివరకు ఐదు సమూహ వినాశనాలతో తల్లడిల్లిన భూమికి ఆరో వినాశనం తప్పదా..? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. రానున్న ఆ ఆరో వినాశనానికి మూల కారకులు మానవులేనని కూడా చెబుతున్నారు. భూమిపై జీవ వైవిధ్యాన్ని, సమతుల్యతను కాపాడి ఆరో వినాశనాన్ని తప్పించేందుకు రూపొందించిన ఓ విధానం అమలుకు ఏడాదికి రూ.7 లక్షల కోట్లు అవసరమవుతాయని ఆయన వెల్లడించారు. ఇది కూడా ఎంత వీలైతే అంత త్వరగా చేపట్టాలని, తద్వారా మానవ నిర్మిత జీవవైవిధ్యం ద్వారా జరిగే విధ్వంసాన్ని ఈ దశాబ్దంలోనే అడ్డుకోవచ్చని స్పష్టం చేశారు. ఆరో వినాశనం మానవుడి భుజస్కందాలపై ఉందని, ఏం చేయాలో తేల్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఎకాలజిస్ట్ గ్రెగ్ అస్నర్ తెలిపారు. భూమిపై జీవవైవిధ్యాన్ని, సమృద్ధిని కాపాడటానికి ‘ఏ గ్లోబల్ డీల్ ఫర్ నేచర్(జీడీఎన్)’అనే సైన్స్ పాలసీని రూపొందించిన 19 మంది అంతర్జాతీయ పరిశోధకుల్లో అస్నర్ ఒకరు. ఈ ఖర్చు అంత భారీదేమీ కాదని, అమెరికాలోని యాపిల్, బెర్క్‌షైర్ హాత్వే కంపెనీలు 2018లో ఆర్జించిన లాభాలతో ఇది సమానమన్నారు. రెండో అతిపెద్ద నిర్ణయం.. భూ వినాశనాన్ని అడ్డుకునేందుకు తీసుకున్న నిర్ణయాల్లో జీడీఎన్ రెండో అతిపెద్ద నిర్ణయం కాగా.. మొదటిది 2015లో తీసుకున్న పారిస్ ఒప్పందం. ‘అయితే పారిస్ ఒప్పందం ఒక్కటే భూమిపై జీవ వైవిధ్యాన్ని, మానవాళికి అవసరమైన పర్యావరణాన్ని సంరక్షించలేదు. దీని కోసం మరొక ప్రత్యామ్నాయం అవసరం. శాస్త్ర ఆధారిత, నిర్ణీత కాల పాలసీ అయిన ది గ్లోబల్ డీల్ ఫర్ నేచర్ భూమిపై జీవ వైవిధ్యాన్ని, సమృద్ధిని కాపాడగలదు. భూ వినాశనాన్ని ఆపడానికి నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో జీడీఎన్ పాలసీకి తిరుగులేదు. భావితరాలకు మనం ఇవ్వబోయే అతిపెద్ద బహుమతి ఈ పాలసీ మాత్రమే. జీడీఎన్ పాలసీలో మూడు లక్ష్యాలను నిర్దేశించాం’అని అమెరికాలోని నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్‌కు చెందిన ఎరిక్ డైనర్స్టెయిన్ వెల్లడించారు. ఈ పరిశోధన ఫలితాలు సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. మన నిబద్ధతను పునరుద్ఘాటిద్దాం: మోదీ వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్లను తగ్గించడంలో దేశ నిబద్ధతను పునరుద్ఘాటించేందుకు ధరిత్రీ దినోత్సవం ఓ సందర్భం అని ప్రధాని మోదీ అన్నారు. ధరిత్రీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ..‘భూమాతకు మనం భక్తితో నమస్కరిస్తాం. ఏళ్లుగా అసాధారణ వైవిధ్యాలకు ఈ భూగ్రహం ఓ నిలయం. మన గ్రహం శ్రేయస్సు కోసం స్థిరమైన అభివృద్ధి, వాతావరణ మార్పులను తగ్గించడంలో మన నిబద్ధతను ఈ రోజున మరోసారి పునరుద్ఘాటిస్తున్నాం’అని అన్నారు. -
విధ్వంసకర వీబీఐఈడీ
వెహికల్ బార్న్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (వీబీఐఈడీ) అంటే వాహనాలతో ఐఈడీ దాడు లని అర్థం. ఇది ఇప్పుడు కశ్మీర్లో గస్తీ కాస్తున్న భద్రతాదళాలను అప్రమత్తం చేసింది. ఒక్కొక్కరుగా కశ్మీర్లో పనిచేస్తున్న ఉగ్ర సంస్థల ముఖ్యనాయకులను ఏరిపారేస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఉగ్రమూకలు సాంకేతిక పద్ధతిలో భారత సైన్యంపై దాడులకు వ్యూహం రచిస్తున్నారు. ఇందులో భాగంగానే వీబీఐఈడీలతో దాడులు ఈ విషయంపై మిలటరీ ఇంటెలిజెన్స్ గతంలో హెచ్చరించింది. ఇలాంటి పేలుడు పదార్థాలతో కూడిన వాహనాలను రూపొందించడం తేలిక కాదు. అందుకే అలాంటి నిపుణులు దొరికినప్పుడే ఉగ్రవాదులు నాలుగైదు వాహనాలను సిద్ధం చేసుకుని ఉంచుతున్నారు. సమస్యాత్మక ప్రాం తాల్లో, యుద్ధ జోన్లలో భారీ విధ్వంసం సృష్టించడానికి టెర్రరిస్టులు ఇలా కారు బాంబుల్ని వినియోగిస్తున్నారని ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు వెల్లడించారు.‘ఇలాంటి దాడుల్లో పేలుడు పదార్థాల ద్వారా జరిగే విధ్వంసంతో పాటు.. ఆ వాహన భాగాలు తునాతునకలవడం వల్ల కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇక కారులో ఉండే పెట్రోల్, డీజిల్ వంటివి ఇంధనాలు పేలుడు తీవ్రతను మరిన్ని రెట్లు పెంచుతాయి’అని ఆయన పేర్కొన్నారు. ఈ ఆపద నుంచి బయటపడలేమా? అందుకే పోలీసులు ఆర్డీఎక్స్, ప్రాణహాని తలపెట్టే రసాయనాలు అధిక మొత్తంలో ఎక్కడైనా అమ్ముడవుతున్నట్లు తెలిస్తే అప్రమతమై నిఘా పెంచి ఇలాంటి ప్రమాదాలను అరికట్టేందుకు వీలుంటుంది. సున్నితమైన ప్రాంతాల్లో బాంబు డిస్పో జింగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించడం.. అనుమానిత ప్రాంతాల్లో వాహనాల కదలికలను జాగ్రత్తగా గమనించడం ద్వారా వీబీఐఈడీలను గుర్తించేందుకు వీలుంటుంది. వీబీఐఈడీ దాడులు జరపడానికి ఒక్కసారి ఆ వాహనం కదిలిందంటే చాలు.. దానిని నియంత్రించడం చాలా కష్టసా«ధ్యమైన విషయం. భద్రతా దళాలు వాటిని ఆపడానికి ప్రయత్నించినా అవి పేలిపోయే ప్రమాదం ఉంది. ఒక పరిమితికి మించి కారు స్పీడు పెంచినా, తగ్గించినా అవి పేలిపోతాయి. అంతేకాదు డ్రైవర్ డోర్ ఓపెన్ చేసినా, ఇగ్నిషన్ కీ ఆన్/ఆఫ్ చేసినా వాహనం పేలిపోతుంది. అందుకే సెక్యూరిటీ పికెట్స్ వద్ద వాహనాల చెకింగ్ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇరాక్, అఫ్గానిస్తాన్ వంటి దేశాల్లో కారు బాంబు దాడులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పుడు కశ్మీర్లో కూడా అలాంటి దాడులు మొదలవడం దడ పుట్టిస్తోంది. ‘కపిల్ శర్మ షో’ నుంచి సిద్దూ ఔట్! ముంబై: సోనీ టీవీలో ప్రజాదరణ పొందిన ‘కపిల్ శర్మ షో’నుంచి మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్‌సింగ్ సిద్దూ ఉద్వాసనకు గురయ్యారు. 40 మంది సీఆర్పీఎఫ్ ప్రాణాలు బలి గొన్న పుల్వామా ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ పాత్ర లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో వివాదం చెలరేగడంతో ‘సోనీ’ సంస్థ ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. కమెడియన్ కపిల్ శర్మ షోలో కొన్నేళ్లుగా సిద్దూ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. పుల్వామా దాడి ఘటనపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘కొందరు వ్యక్తులు చేసిన పనికి మొత్తం ఆ దేశానికే ఆపాదిస్తారా? ఉగ్ర వాదుల పిరికి చర్యలపై దేశాలను బాధ్యులుగా చేయడం తగదు’ అంటూ వ్యాఖ్యానించారు. పుల్వామా దాడిలో పాక్ హస్తం ఉందంటూ దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబుకుతుండగా ఆయన ఆ దేశాన్ని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీంతో ఆయన్ను కపిల్‌శర్మ షో నుంచి తప్పిస్తున్నట్లు సోనీ టీవీ తెలిపింది. వీబీఐఈడీ ఎలా పేలుతుంది? ► డ్రైవింగ్ సీటులో కూర్చున్న ఆత్మాహుతి బాంబర్ నిర్దేశిత ప్రాంతానికి చేరుకుని సైడ్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే పేలిపోతుంది. ► యాక్సిలరేటర్ రైజ్ చేయడం లేదంటే స్లోచేయడం ద్వారా కూడా ఈ బాంబులను పేల్చవచ్చు. ► ఇగ్నీషన్ కీ ఆన్, ఆఫ్‌ల ద్వారా కూడా పేలుడు జరిగేలా చేయొచ్చు. ► ఇక ఏదైనా ప్రాంతంలో పార్క్ చేసి ఉంచిన కారుని టైమర్ ద్వారా పేల్చేందుకు వీలుంటుంది. ► పేలుడు పదార్థాలను కార్లో ఎక్కడ పెడతారు? ► తక్కువ మొత్తంలో పేలుడు పదార్థాలైతే ముందు సీటులో అమరుస్తారు. ► భారీ పేలుడు పదార్థాలను వినియోగించాల్సి వస్తే డిక్కీలో పెడతారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ప్రజాస్వామ్య విలువలు నాశనం
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం పరిరక్షించాల్సిన విలువలను నిదానంగా, పూర్తిస్థాయిలో నాశనం చేస్తోందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోపించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ఈ విషయంపై జాతీయస్థాయిలో చర్చ జరగాలన్నారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ రాసిన ‘షేడ్స్ ఆఫ్ ట్రూత్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మన్మోహన్ మాట్లాడారు. ‘మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం పరిరక్షించే విలువలను నిదానంగా పూర్తిస్థాయిలో నాశనం చేస్తోంది. సుపరిపాలన అందించడంలో కీలకమైన జాతీయ సంస్థలు ఎన్నడూలేని స్థాయిలో కొత్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నాలుగేళ్లలో పొరుగుదేశాలతో మన సంబంధాలు దిగజారాయి. దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి శాస్త్ర, సాంకేతికతల వినియోగంలో ప్రభుత్వం విఫలమైంది. మహిళలు, దళితులు, మైనారిటీలు మరింత అభద్రతాభావంలోకి జారిపోతున్నారు. విదేశాల్లో మూలుగుతున్న లక్షల కోట్ల నల్లధనాన్ని వెనక్కి తెస్తామన్న హామీని నెరవేర్చేందుకు కేంద్రం సరైన చర్యలేవీ తీసుకోలేదు. దేశంలోని విశ్వవిద్యాలయాల్లో ఉన్న ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మోదీ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది.ఈ అణచివేత చర్యలన్నింటిపై నిజంగా జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఆ చర్చ ఈ రోజు ఇక్కడి నుంచే మొదలవుతుందని నేను ఆశిస్తున్నా’ అని మన్మోహన్ తెలిపారు. విపక్షాలు ఏకమైతే ఇక బీజేపీ అధికారంలోకి రావడం కలేనని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. -
కీలక వ్యవస్థలు నాశనం
లండన్: బీజేపీ పాలనలో సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం, భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) తదితర సంస్థలను నాశనం చేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. 2014కు ముందు దేశంలో అభివృద్ధే జరగలేదనడం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను అవమానించారన్నారు. లండన్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యులనుద్దేశించి ఆదివారం రాహుల్ ప్రసంగించారు. ‘ప్రపంచ భవిష్యత్తును భారత్ నిర్దేశిస్తోంది. కాంగ్రెస్ సహాయంతోనే భారతీయులు దీన్ని సాధ్యం చేసి చూపించారు. ఆయన పగ్గాలు చేపట్టకముందు దేశంలో అభివృద్ధే జరగలేదని అంటే ప్రతి భారతీయుడిని అవమానించినట్లే’ అని రాహుల్ పేర్కొన్నారు. దేశంలో దళితులు, రైతులు, గిరిజనులు, మైనారిటీలు, పేదలు వారికి కావాల్సిన దానిగురించి గొంతెత్తితే భౌతికదాడులకు పాల్పడుతున్నా రని విమర్శించారు. ఎస్సీ,ఎస్టీలపై దాడుల నియంత్రణ చట్టాన్ని అటకెక్కించారని, స్కాలర్షిప్లను ఆపేశారని ఆరోపణలు చేశారు. దేశంలో రైతులకు రుణమాఫీ చేయకుండా అనిల్ అంబానీ వంటి వ్యక్తులకు మాత్రం అనుచితంగా లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. పార్లమెంటులో రాఫెల్ ఒప్పందంపై తన ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పలేదన్నారు. -
ఫరూక్ ఇంట్లో చొరబడ్డ ఆగంతకుడు
జమ్మూ: కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా నివాసంలోకి ఓ యువకుడు కారుతో దూసుకొచ్చి కలకలం సృష్టించాడు. గేటు బద్దలుకొట్టి లోనికి ప్రవేశించిన అతను ఇంట్లోకొచ్చి విధ్వంసానికి పాల్పడ్డాడు. చివరకు అక్కడ విధులు నిర్వర్తిస్తున్న భదత్రా దళాలు అతడిని కాల్చి చంపాయి. శనివారం జమ్మూ శివారులోని భటిందీలో ఈ ఘటన జరిగింది. శ్రీనగర్ ఎంపీ అయిన ఫరూక్ పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లి, తిరిగొస్తున్న సమయంలో ఆయన ఇంటిపై ఈ దాడి జరిగింది. ఫరూక్‌తో పాటు ఆయన కొడుకు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆ ఇంట్లోనే ఉంటున్నారు. జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణ కలిగిన ప్రముఖుల ఇంట్లోకి అనామకుడు చొరబడటం తీవ్ర భద్రతా ఉల్లంఘనను తేటతెల్లం చేస్తోంది. కాగా, చొరబాటుదారుడిని పాతికేళ్ల సయీద్ మురాద్ షాగా గుర్తించారు. హెచ్చరించినా దూసుకెళ్లాడు.. భద్రతా సిబ్బంది హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతూ వేగంగా దూసుకొచ్చిన మురాద్.. ఇంటి ముందటి గేటును బద్దలుకొట్టి లోనికి చొరబడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కాంపౌండ్ లోపల అడ్డందిడ్డంగా వాహనం నడుపుతూ లాన్లో కారు దిగాడు. మురాద్‌ను నిలువరించే క్రమంలో ఒక పోలీస్ గాయపడ్డాడు. లోనికి వెళ్లిన మురాద్ గాజు టేబుళ్లు, గోడలకు వేలాడుతున్న చిత్రపటాలను ధ్వంసం చేశాడు. తర్వాత బెడ్రూంకు వెళ్లే మెట్లు ఎక్కేందుకు ప్రయత్నించగా సీఆర్పీఫ్ జవాన్లు అతడిని హతమార్చారు. కేసు నమోదుచేసి అతని తండ్రి జాడను కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఫరూక్ నివాసానికి పటిష్ట భద్రత ఉన్నా మురాద్లోనికి ఎలా ప్రవేశించాడన్నదానిపై విచారణకు ఆదేశించారు. కాగా, ఈ పరిణామంపై ఫరూక్ అబ్దుల్లా స్పందిస్తూ..ఈ ఘటన దురదృష్టకరమని, రాష్ట్రంలో నెలకొన్న భద్రతా పరిస్థితిని ఇది తేటతెల్లం చేస్తోందని అన్నారు. ఉదయం జిమ్‌కు వెళ్లిన మురాద్.. ఫరూక్ ఇంట్లోకి ఎందుకు చొరబడ్డాడో అర్థంకావడం లేదని అతని బంధువులు చెప్పారు. మురాద్ వెంట ఎలాంటి ఆయుధాలు లేవని, అతడిని అరెస్ట్ చేయకుండా ఎందుకు కాల్చి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
దేశంలోకి జైషే ఉగ్రవాదులు
శ్రీనగర్: కశ్మీర్లోకి 20 మందికిపైగా ఉగ్రవాదులు చొరబడినట్లు నిఘావర్గాలు తెలిపాయి. వీరు కశ్మీర్‌లోయతో పాటు ఢిల్లీలో పెద్దఎత్తున విధ్వంసానికి పాల్పడే అవకాశముందని హెచ్చరించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు కశ్మీర్, ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదులు పాక్ నుంచి పీర్‌పంజాల్ పర్వతశ్రేణి ద్వారా కశ్మీర్లోకి చొరబడ్డారని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. జైషే మహమ్మద్ ఉగ్రసంస్థకు చెందిన వీరందరూ చిన్నచిన్న గ్రూపులుగా విడిపోయి వచ్చారని వెల్లడించారు. ఉగ్రవాదుల వద్ద భారీఎత్తున పేలుడుపదార్థాలు, ఆయుధాలు ఉన్నాయన్నారు. ఇంత భారీస్థాయిలో ఉగ్రవాదులు చొరబడటం చాలా అరుదని వ్యాఖ్యానించారు. ఇస్లాం విస్తరణకు కీలకంగా నిలిచిన బద్ర్ యుద్ధం ఇస్లామిక్ క్యాలండర్ ప్రకారం శనివారం (రంజాన్ నెల 17వ రోజు) జరిగింది. అందుకే ఈరోజు వారు విధ్వంసం సృష్టించే అవకాశముంది. కీలకమైన సైనిక స్థావరాలతో పాటు ఇతర ప్రాంతాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కశ్మీర్లో గ్రెనేడ్ దాడి నిఘావర్గాలు హెచ్చరించిన కొన్నిగంటల్లోనే కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామాలో అధికార పీడీపీ నేత, త్రాల్ ఎమ్మెల్యే ముస్తాక్ షా ఇంటిపై గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. గ్రెనేడ్ ఇంట్లోని పచ్చిక ప్రాంతంలో పేలడంతో ఎవ్వరికీ గాయాలుకాలేదు. -
వందేళ్లలో ఇదే భారీ విస్పోటనం
పహోవా, హవాయి : ఈ నెల మూడున హవాయి ద్వీపంలోని కిలౌయిలో అగ్ని పర్వతం బద్దలయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి నేటి వరకూ అంటే దాదాపు నాలుగు వారాలుగా లావా వెలువడుతూనే ఉన్నది. కిలౌయి అగ్ని పర్వతం నుంచి బయటకు వస్తున్న లావాతో హవాయి వీధులన్నీ పూర్తిగా కప్పబడ్డాయి. చాలా నివాస గృహాలు నాశనం అయ్యాయి. స్థానికులు ఆ ప్రదేశాన్ని విడిచి సురక్షిత ప్రాంతాలకు చేరాలని అధికారులు కోరుతున్నారు. బిగ్ ఐలాండ్‌లో ఉన్న లీలాని ఎస్టేట్స్ హౌసింగ్ డెవలప్మెంట్కు సమీపాన ఉన్న ఈ కిలౌయి అగ్నిపర్వతం విస్పోటనం చెందడంతో విధ్వంసకర రీతిలో లావా వెలువడుతుండటంతో ఈ ప్రాంతంలోని ఇళ్లు పూర్తిగా నాశనమయ్యాయి. ఈ నెల 3న విస్పోటమయిన ఈ అగ్నిపర్వతం వల్ల నాశనమయిన ఇళ్ల సంఖ్య తొలుత 50 కాగా ప్రమాద తీవ్రత పెరగడం వల్ల ఇది 80కు చేరుకుందని ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ తెలిపింది. అంతేకాక దాదాపు 890 హెక్టార్ల(2,200) విస్తీర్ణం మేర లావా వ్యాపించిందని తెలిపింది. గత వంద సంవత్సరాలలో ఇదే అతి పెద్ద భారీ విస్పోటనమని, నష్టం కూడా పెద్ద మొత్తంలో వాటిల్లిందని ప్రకటించింది. దాదాపు 37 ఇళ్ల చుట్టూ లావా పేరుకుపోయింది. ఆ ఇళ్లలో ఇంకా ఎవరైనా ఉంటే వారు బయటకు రావడానికి వీలులేకుండా దాదాపు 30 మీటర్ల ఎత్తు వరకు లావా వ్యాపించిందని తెలిపింది. మొత్తం అగ్ని పర్వతంలో ఉన్న లావాలో, ప్రస్తుతం బయటకు వస్తున్నది చాలా కొద్దిశాతమేనని, ఈ కొద్ది మొత్తానికే పరిస్థితి ఇలా ఉంటే, ఇక మొత్తం లావా బయటకు ప్రవహిస్తే పరిస్థితిని ఊహించలేమని అమెరికా జియలాజికల్ డిపార్టుమెంటు ఆందోళన వ్యక్తం చేసింది. ఇకైక అనే వ్యక్తి ఈ అగ్ని పర్వత విస్పోటనాన్ని వీడియో తీసి ఫేస్బుక్లో పోస్టు చేశాడు. దానిలో అతను ‘అగ్నిపర్వతం నుంచి వెలువడిని లావా ఈ దారిలో ఉన్న 8 ఇళ్లను కేవలం 12 గంటల్లో నామరూపాలు లేకుండా చేసింది . ఇక్కడే మా సోదరుని ఇళ్లు కూడా ఉంది. కానీ ఇప్పుడు దాన్ని కనీసం గుర్తుపట్టడానికి కూడా వీలు లేనంతగా మారిపోయింద’న్నాడు. -
కర్ణాటక గవర్నర్‌ను రీకాల్ చేయండి: మోదీ
న్యూఢిల్లీ: ‘కర్ణాటక గవర్నర్ కృతనిశ్చయంతో భారత సమాఖ్య వ్యవస్థను నాశనం చేస్తున్నారు. ఆయన్ను వెంటనే రీకాల్ చేయాల్సిందిగా రాష్ట్రపతిని కోరాలని ప్రధానికి విజ్ఞప్తి చేశాను’ అని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌ను మోదీ 2011లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారు. అప్పటి కర్ణాటక గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్‌ను విమర్శిస్తూ మోదీ చేసిన ఈ ట్వీట్‌ను కాంగ్రెస్ పార్టీ గురువారం రీట్వీట్ చేసింది. కర్ణాటక గవర్నర్‌ను రీకాల్ చేయాలన్న మోదీ వ్యాఖ్యలకు తాము కూడా అంగీకరిస్తున్నట్లు వ్యంగ్యంగా స్పందించింది. కర్ణాటక గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ 2011, మే 19న మోదీ ఈ ట్వీట్ చేశారు. -
ఢిల్లీని ముంచెత్తిన గాలి దుమారం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని భారీ గాలి దుమారం వణికించింది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో గంటకు 70 కి.మీ. వేగంతో పెనుగాలులు విధ్వంసం సృష్టించాయి. ఆ తీవ్రతకు ఢిల్లీలోని పలు ప్రాంతాలతో పాటు, గురుగ్రామ్, నోయిడాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం నేడు అన్ని సాయంత్రపు స్కూళ్లకు సెలవు ప్రకటించింది. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ ఆరుబయట ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని హెచ్చరించింది. మరోవైపు ఉత్తర భారతదేశంలో మంగళవారం నుంచి శుక్రవారం వరకూ తుపానులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) హెచ్చరించింది. రాజస్తాన్‌లో ఇసుక తుపానులు, ఆరు రాష్ట్రాల్లో గాలి దుమారంతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, హరియాణా, ఢిల్లీ, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం గంటకు 50–70 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంది. -
సంఘ్, బీజేపీలే దేశానికి శత్రువులు
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగంపై దాడి చేస్తున్న సంఘ్ పరివార్, బీజేపీలే దేశానికి ప్రధాన శత్రువులని, నరేంద్ర మోదీ ప్రభుత్వం గత నాలుగేళ్లలో విధ్వంసం సృష్టించిందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అమెరికా, ఇజ్రాయెల్‌కు తాకట్టు పెట్టిన మోదీ సర్కారు దేశంలోనూ మత కోణంలో రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. సంఘ్ పరివార్ చేతిలో బీజేపీ ప్రభుత్వం రిమోట్కంట్రోల్గా మారిందని పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన సీపీఎం 22వ జాతీయ మహాసభల్లో ఆ పార్టీ ప్రతినిధులకు సౌహార్ద సందేశమిచ్చారు. ‘‘దళితులు, మైనార్టీలను బలి తీసుకుంటున్నారు. లౌకికవాద యువతను చంపేస్తున్నారు. ముఖ్య ప్రభుత్వ పదవులు, యూనివర్సిటీలు, ఇతర సంస్థల్లో ఆర్ఎస్ఎస్ శక్తులు ప్రవేశించాయి. ఫాసిస్ట్ పాలనకు మోదీ సర్కారు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ మతతత్వ సర్కారు అవలంబిస్తున్న విధానాలపై ప్రజల నుంచి నిరసన వస్తోంది. వామపక్ష పార్టీలు మిలిటెంట్ ఉద్యమాలు నిర్వహించి ప్రజలకు విముక్తి కలిగించాలి’’ అని సురవరం అన్నారు. దేశంలో అవినీతి పెరిగిపోయిందని, రైతులు కష్టాల్లో ఉన్నారని పేర్కొన్నారు. కార్పొరేట్ అనుకూల ఆర్థిక వ్యవస్థ కారణంగా దేశంలో 36 కుటుంబాలకే లబ్ధి కలుగుతోందని, సామాన్యుడు ఛిద్రమై పోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో వామపక్షాల ఐక్యత గతం కన్నా ఎంతో అవసరమని స్పష్టంచేశారు. ఈ దిశగా ఉమ్మడి పోరాటాలకు సీపీఐ తమ వంతు సహకారం అందిస్తుందన్నారు. వామపక్షాలు మాత్రమే ప్రజలను ఈ దుస్థితి నుంచి గట్టెక్కించగలవని చెప్పారు. ఇంతటి దుస్థితి ఎప్పుడూ లేదు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పౌర హక్కులకు ఇంతటి దుస్థితి ఎప్పుడూ లేదని సీపీఐ (ఎంఎల్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య ఆరోపించారు. బెంగాల్, త్రిపురల్లో ఓటమి వామపక్ష శ్రేణుల్లో కొంత నిరుత్సాహాన్ని కలిగించిందని అన్నారు. అయితే ఢిల్లీ, మహారాష్ట్రల్లో కార్మిక ఆందోళనలు, నాసిక్–ముంబైల వరకు రైతుల ర్యాలీ, విద్యార్థుల ఆందోళనలు దేశంలో మార్పునకు సంకేతాలుగా కనపడుతున్నాయన్నారు. – దీపాంకర్ భట్టాచార్య, సీపీఐఎంఎల్ నేత సీపీఎం పెద్దన్న పాత్ర తీసుకోవాలి దేశంలో వామపక్ష ఐక్యత కోసం కృషి చేయాల్సిన బాధ్యత సీపీఎంపై ఉందని ఫార్వర్డ్ బ్లాక్ జాతీయ నాయకుడు శివశంకరన్ అన్నారు. దేశంలో ఉన్న వామపక్ష పార్టీల్లో అతిపెద్ద పార్టీ సీపీఎం అని, మహాసభకు హాజరైన వామపక్ష పార్టీలే కాక, విస్తృత వామపక్ష ఐక్య ఉద్యమాలను నిర్మించడంలో సీపీఎం ప్రధాన పాత్ర పోషించాలన్నారు. – శివశంకరన్, ఫార్వర్డ్ బ్లాక్ జాతీయ నేత సవాళ్ల సమయమిది మతానికి రాజకీయ రంగు పులిమి దేశంలోని బీజేపీ ప్రభుత్వం ముందుకెళుతోందని రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఆర్ఎస్పీ) నాయకుడు మనోజ్ భట్టాచార్య వ్యాఖ్యానించారు. సవాళ్లతో కూడుకున్న ఈ సమయంలో వామపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. – మనోజ్ భట్టాచార్య, ఆర్ఎస్పీ నేత బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలి దేశానికి ప్రస్తుతం మిలిటెంట్ ప్రజాస్వామిక ఉద్యమాలు అత్యవసరమని ఎస్‌యూసీఐ (సీ) నాయకుడు ఆశిష్ భట్టాచార్య అన్నారు. దేశంలోని బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. – ఆశిష్ భట్టాచార్య, ఎస్‌యూసీఐ(సీ) నేత -
డ్రెస్సింగ్ రూమ్ విధ్వంసం.. కారకుడు అతనే!
సాక్షి, స్పోర్ట్స్ : నిదహస్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్ అనంతరం చోటు చేసుకున్న విధ్వంస ఘటనపై నివేదిక వెలువడింది. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఈ ఘటనకు కారణమని తేలింది. డ్రెస్సింగ్ రూమ్ అద్దాలు పగిలిపోయిన ఘటనపై దర్యాప్తు చేపట్టిన మ్యాచ్ రిఫెరీ క్రిస్ బ్రాడ్.. మైదాన సిబ్బందిని విచారణ చేపట్టారు. అందులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన ఆయన ఎటువంటి దాడి జరగలేదని నిర్ధారించారు. అందులో షకీబ్ తలుపును బలవంతంగా నెట్టడంతో గదికి ఉన్న అద్దాలు పగిలిపోయినట్లు స్పష్టంగా ఉంది. ఈ మేరకు క్రిస్ బ్రాడ్ నివేదికను సిద్ధం చేసినట్లు శ్రీలంక న్యూస్ పేపర్ ది ఐలాండ్ కథనం వెలువరించింది. అయితే బంగ్లా ఆటగాళ్లు విజయోత్సాహం వేడుకలు నిర్వహించుకున్న క్రమంలోనే ఈ ఘటన జరిగిందని.. దీని వెనుక శ్రీలంక అభిమానులు ఉన్నారన్న రీతిలో వెలువడ్డ అభూత కల్పన కథనాలను క్రిస్ బ్రాడ్ ఖండించినట్లు ఆ కథనం ఉటంకించింది. ఘటనలో షకీబ్‌పై చర్యలు తీసుకునే అంశంపై మాత్రం ఆయన స్పందించలేదు. ఇక శ్రీలంక మ్యాచ్‌లో గందరగోళంపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ షకీబ్‌తో పాటు మరో ఆటగాడు నురుల్ మ్యాచ్ ఫీజులో కోత విధించిన సంగతి తెలిసిందే. -
దేశంలో విధ్వంసానికి పాక్ కుట్ర?
-
హింసను సహించేది లేదు
► డేరా విధ్వంసంపై ‘మన్ కీ బాత్’లో మోదీ పరోక్ష ప్రస్తావన ► సెప్టెంబర్ 15 నుంచి ‘స్వచ్ఛత సేవ’ ప్రచారంలో పాల్గొనండి ► జన్‌ధన్‌లో 30 కోట్ల మందికి భరోసా: మోదీ న్యూఢిల్లీ: విశ్వాసం పేరిట హింసను సహించేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని, అందరూ చట్టం ముందు తలొగ్గాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ఆదివారం మన్ కీ బాత్ నెలవారీ రేడియో ప్రసంగంలో... హరియాణా, పంజాబ్‌ల్లో గుర్మీత్ రామ్ రహీం సింగ్ అనుచరులు సృష్టించిన విధ్వంసాన్ని మోదీ పరోక్షంగా ప్రస్తావిస్తూ దోషులకు తప్పకుండా శిక్ష పడుతుందని చెప్పారు. సెప్టెంబర్ 15 నుంచి ‘స్వచ్ఛత సేవ’ ప్రచారంలో భాగస్వాములుగా కావాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రధాని ప్రసంగం ఆయన మాటల్లోనే ఒకవైపు దేశం పండుగల సంబరాల్లో ఉండగా.. మరోవైపు హింసాత్మక సంఘటనల వార్తలు వినిపిస్తే తప్పనిసరిగా ఆందోళన చెందాల్సి వస్తోంది. బుద్ధుడు, గాంధీలు పుట్టిన దేశం మనది. శతాబ్దాలుగా మన పూర్వీకులు ఆకలింపు చేసుకున్న సోదర భావం, అహింస, పరస్పర గౌరవం మనకు వారసత్వంగా అలవడ్డాయి. ' ఎర్రకోట నుంచి.. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఒక విషయం స్పష్టం చేశాను. విశ్వాసం పేరిట హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని చెప్పాను. అది మత నమ్మకాలకు సంబంధించినదైనా, రాజకీయ సిద్ధాంతాలు లేక వ్యక్తి విధేయత, ఆచార, సంప్రదాయాల విషయంలోనైనా హింసను సహించేది లేదు. ఒకరి విశ్వాసాల కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఏ ఒక్కరికి లేదు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేవారు, హింసాత్మక ప్రవృత్తిని అనుసరించేవారి విషయంలో ఈ దేశం, ఏ ప్రభుత్వమైనా చూస్తూ ఊరుకోదని హామీనిస్తున్నా. పండుగలు నమ్మకానికి ప్రతీకలు దేశంలో భిన్నత్వమనేది వంటకాలు, జీవన విధానం, వస్త్రధారణకే పరిమితం కాలేదు. ప్రతీ విషయంలో అది కనిపిస్తుంది. ఇటీవల గుజరాత్ వరదల్లో దెబ్బతిన్న 22 ఆలయాల్ని, రెండు మసీదుల్ని జమియత్–ఉలేమా–ఈ–హింద్ వాలంటీర్లు శుభ్రం చేశారు. ఐకమత్యానికి అది మంచి ఉదాహరణ. ఆధునిక భారతంలో పండుగలు విశ్వాసం, నమ్మకానికి ప్రతీకలు. జైనులు జరుపుకునే సంవత్సరి పండుగ క్షమాగుణం, అహింస, సోదరభావానికి ప్రతీక. గణేశ్ చతుర్థి సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. ఈ పండుగ.. ఐక్యత, సమానత్వం, నిజాయితీకి అద్దం పడుతుంది. కొద్ది రోజుల్లో ఈద్–ఉల్–జువా జరుపుకోనున్నాం. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. స్వచ్ఛత కోసం మరో ముందడుగు దేశంలో 67 శాతం ప్రజలకు ప్రస్తుతం మరుగుదొడ్ల సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మూడేళ్ల క్రితం అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్‌ను ప్రారంభించాం. ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మంచి ఫలితాలు చూశాం. ఈ సారి గాంధీ జయంతిని ‘క్లీన్ సెకండ్ అక్టోబర్’గా జరుపుకోవాలి. సెప్టెంబర్ 15 నుంచి ‘స్వచ్ఛత సేవ’ ప్రచారంలో అందరూ పాలుపంచుకోవాలి. జన్‌ధన్ యోజన ప్రారంభించి ఆదివారంతో మూడేళ్లు పూర్తవుతుంది. దాదాపు 30 కోట్ల మందికి జన్‌ధన్ ఖాతాలు ఇచ్చాం. రూ. 65 వేల కోట్లు బ్యాంకుల్లో జమయ్యాయి. ‘నవ భారత్’ దిశగా.. 2022 నాటికి ‘నవ భారత్’ కల సాకారం చేసేందుకు స్పష్టమైన లక్ష్యాలతో ముందు కు సాగాలని ప్రధాని మోదీ కేంద్ర ప్రభు త్వ ఉన్నతాధికారులకు సూచించారు. ఆయన ఆదివారం 80 మంది కేంద్ర ప్రభు త్వ అదనపు కార్యదర్శులు, ఉమ్మడి కార్యదర్శులతో సమావేశమయ్యారు. తయారీ రంగం వైద్య పరికరాల తయారీపై దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సానుకూల పని వాతావరణాన్ని కొనసాగించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. కొత్త చట్టాలు రూపొందించిన తరువాత పాతవి సమీక్షించి, అనసరమని భావిస్తే రద్దు చేయాలని అన్నారు. -
ప్రభుత్వాసుపత్రిలో యువకుల విధ్వంసం
కొవ్వూరు : కొవ్వూరు ప్రభుత్వాసుపత్రిలో గురువారం అర్ధరాత్రి సమయంలో పట్టణానికి చెందిన యువకులు కర్రలతో అద్ధాలు పగలకొట్టి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనను నిరసిస్తూ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది శుక్రవారం నల్లరిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో రెండు వర్గాల యువకుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఒక వర్గం యువకులు చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. తమపై దాడి చేసి ఆసుపత్రికి వచ్చారని, పోలీసులకు ఫిర్యాదు చేశారనే ఆరోపణతో మరో వర్గానికి చెందిన యువకులు ముకుమ్మడిగా ఆసుపత్రికి చేరుకున్నారు. కర్రలు పట్టుకుని ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్ద ఉన్న అద్ధాలు పగలకొట్టారు. లోపలికి ప్రవేశించి హల్చల్ చేశారు. ఆసుపత్రి బయట ఉన్న మోటారు సైకిళ్లను ధ్వంసం చేసి వెళ్లిపోయారు. ఈ పరిణామాలపై వైద్యులు, సిబ్బంది ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్ఎస్వీ రామకృష్ణారావు మాట్లాడుతూ ఆసుపత్రిలో విధి నిర్వహణలో ఉన్న వైద్య సిబ్బందిని, రోగులను భయబ్రాంతులకు గురిచేసిన యువకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిబ్బంది మోటారు సైకిళ్లను ధ్వంసం చేయడం అమానుషమన్నారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైద్య ఉద్యోగుల సంఘం నాయకురాలు హెప్సిబా మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి రక్షణ లేకుండా పోయిందన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కంఠమణి రామకృష్ణ, నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, కమిటీ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. పట్టణ సీఐ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని నాయకులు, వైద్యులకు ఆయన హామీ ఇచ్చారు.సీసీ కెమెరా పుటేజీలను సీఐ పరిశీలించారు. -
RBI పాత నోట్లు ఎంత ధ్వంసం చేస్తుందో తెలుసా
-
అభివృద్ది పేరుతో విధ్వంసం వద్దు
2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి 26న హైదరాబాద్‌లో సీపీఎం మహాధర్నా పోస్టర్ విడుదల పరిగి: నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి వెంకటయ్య అన్నారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించే విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన మహా ధర్నా పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ సమీపంలో నిర్మిస్తున్న రిజర్వాయర్‌తో కుల్కచర్ల, గండేడ్ మండలాల్లో ఆరు గ్రామాలు ముంపుకు గురవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రవి, యాదగిరి, నసీర్ పాల్గొన్నారు. -
ఉగ్ర పడగ!
రోటీన్‌కు భిన్నంగా..! ఉగ్రవాదుల అరెస్టుతో కలకలం ఉలిక్కిపడిన నగరం ఎన్ఐఏ చర్యలతో తప్పిన పెను ముప్పు వారు చాపకింద నీరులా వ్యాపిస్తున్నారు.వారి టార్గెట్ యువత.. వ్యక్తిగతంగా కలవరు. కనీసం ఫోన్ కూడా చేయరు. అంతా ఆన్లైన్లోనే. సామాజిక మాద్యమాలే వేదికగా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) భాగ్యనగరంలోవిషవృక్షంలా విస్తరిస్తోంది. ఇక్కడి యువతకు గాలం వేసిఆకర్షితులైన వారికి ఉగ్ర పాఠాలు బోధిస్తోంది.ఏడాదిన్నర కాలంలో 9 మంది పోలీసులకు చిక్కడ. సంచలనమైతే.. తాజాగా బుధవారం పాతబస్తీలో 11 మంది ఎన్ఐఏకు పట్టుబడ్డారు. వీరంతా ఐసిస్‌కు అనుబంధంగా ఉన్న ‘ఏయూటీ’ మాడ్యుల్‌కు చెందిన వారు.ఈ వార్తతో నగరం ఉలిక్కిపడింది. అసలు ఐసిస్ రిక్రూట్మెంట్ విధానం ఏమిటి..? యవతను ఎలా రెచ్చగొడుతోంది..? దేశం దాటేందుకు ఎలా సహకరిస్తోంది..? నగరంలో ఐసిస్ జాడలు, గత సంఘటనలపై ‘సాక్షి’ ఫోకస్. -సాక్షి, సిటీబ్యూరో నగరం ఉలిక్కిపడింది. ‘ఉగ్ర’జాడలు బయట పడడంతో అవాక్కైంది. ముష్కరుల కుట్రల్ని ముందే గుర్తించారు కాబట్టి సరిపోయింది...లేకుంటే..?? ఊహిస్తేనే వెన్నులో వణుకు పుడుతోంది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)కు అనుబంధంగా ఏర్పాటైన అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్ (ఏయూటీ) నగరంలో విధ్వసాలకు పన్నిన మరో కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఛేదించింది. బుధవారం తెల్లవారుజామున పాతబస్తీలోని వేర్వేరు ప్రాంతాల్లో 11 మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసింది. వీరి నుంచి ఆయుధాలు, నగదు, బాంబుల తయారీకి వినియోగించే ముడిపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో నగరంలో కలకలం రేగింది. గతానుభవాల నేపథ్యంలో ప్రజల్లో ఈ అంశం చర్చనీయాంశమైంది. ఎన్ఐఏ ముందే మేల్కొనకపోతే మరో విధ్వంసంతో నగరం కకావికలమయ్యేదనే భయాందోళనలు వ్యక్తమయ్యాయి. సామాజిక, ఆర్థిక, అంతర్జాతీయ కారణాల నేపథ్యంలో ఉగ్రవాద సంస్థలకు రిక్రూట్మెంట్ తేలికైపోయినా.. విధ్వం సాలకు అవసరమైన పేలుడు పదార్థాల సేకరణ సవాల్‌గా మారింది. హైదరాబాద్‌లో చిక్కిన ఏయూటీ మాడ్యుల్ మాత్రం ఈ వ్యవహారంలోనూ తెలివిగా వ్యవహరించింది. రోటీన్‌కు భిన్నంగా సాంప్రదాయేతర ‘విధ్వంస’వనరులపై దృష్టి పెట్టింది. పోలీసు, నిఘా వర్గాలకు ఏమాత్రం అనుమానం రాకుండా ఉండేలా ప్రణాళికలు రచించింది. 11 మంది ముష్కరుల నుంచి ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్న వాటిలో నాటు తుపాకులతో పాటు సాధారణ పదార్థాలుగా పరిగణించే యూరియా, హైడ్రోజన్ పెరాక్సైడ్, పాస్ఫరస్, పెయింట్స్ వంటివి ఉండటం గమనార్హం. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు, పాక్ ప్రేరేపిత సంస్థలకు చెందిన ముష్కరులు దేశంలో చేసిన బాంబు పేలుళ్లకు ఎక్కువగా ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాన్ని వినియోగించేవారు. 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల మొదలు అనేక ఘటనల్లో ఇది వెలుగులోకి వచ్చింది. ఈ విధ్వంసాలకు ఆర్డీఎక్స్ నేరుగా పాకిస్థాన్ నుంచే సరఫరా అయ్యేది. ఇది ముప్పని భావించిన ఆ దేశం దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) దగ్గరకు వచ్చేసరికి పరోక్షంగా సహకరిస్తున్న పాక్ నిఘా సంస్థ పేలుడు పదార్థాల సేకరణ స్థానికంగానే సమకూర్చుకోవాలని స్పష్టం చేసింది. దీంతో ఈ మాడ్యుల్ ఉగ్రవాదులు అమ్మోనియం నైట్రేట్ స్లర్రీని వినియోగించారు. సిటీలో జరిగిన 2007, 2013 జంట పేలుళ్లలో ఐఎం ఉగ్రవాదులు దీన్నే వాడారు. తాజాగా చిక్కిన ఏయూటీ మాడ్యుల్ పేలుడు పదార్థాల సమీకరణలో మరో అడుగు ముందుకు వేసింది. అమ్మోనియం నైట్రేట్‌ను సమీకరించుకోవడానికి ప్రయత్నించినా నిఘాకు చిక్కే ప్రమాదం ఉందనే అనుమానంతో సాధారణ వస్తువులపై దృష్టిపెట్టింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేలా సాధారణ పదార్థాలనే పేలుడు పదార్థాలుగా వినియోగించే అంశంపై సుదీర్ఘ అధ్యయనమే చేసింది. ఈ మాడ్యుల్లో ఉన్న విద్యాధికులు ఇంటర్నెట్లో చేసిన పరిశీలన తరవాత యూరియా, హైడ్రోజన్ పెరాక్సైడ్, ఫాస్పరస్‌లను బాంబుల తయారీకి ఎంచుకున్నారు. అగ్గిపుల్లలకు తలగా ఉండేదీ ఫాస్పరస్ కావడంతో పాటు దీపావళి సామాను తయారీకి వినియోగించే, రైతులు వాడే ఇవి మార్కెట్లో తేలిగ్గా దొరకడంతో పాటు ఎవరికీ అనుమానం రాదని వీటిని ఎంపిక చేసుకున్నారు. వీటితో తయారు చేసిన ఐఈటీ బాంబులు పేలినప్పుడు స్ల్పింటర్స్‌గా దూసుకుపోయి టార్గెట్‌ను ఛిద్రం చేయడం కోసం ఆ బాంబుల్లో మేకులు వేయడానికి ఏయూటీ మాడ్యుల్ సిద్ధమైంది. -
పాక్‌లో హిందూ ఆలయాలను కూల్చనివ్వం
అతడు కరడుగట్టిన ఉగ్రవాది. పాకిస్థాన్‌లోనే నిషేధించిన జమాత్ ఉద్ దవా అనే ఉగ్రవాద సంస్థకు అధినేత. పేరు హఫీజ్ సయీద్. అలాంటి వ్యక్తి తాజాగా చేసిన ప్రకటన ఆశ్చర్యం కలిగిస్తోంది. పాకిస్థాన్‌లోని హిందూ ఆలయాలతో పాటు ముస్లిమేతరులకు సంబంధించిన పవిత్ర స్థలాలు వేటినీ కూల్చడానికి తాము ఒప్పుకొనేది లేదని చెప్పాడు. హిందూ సోదరుల పవిత్రస్థలాలను కాపాడాల్సిన బాధ్యత ముస్లింలపై ఉంటుందని సింధ్ రాష్ట్రంలోని మత్లీ పట్టణంలో జరిగిన ఓ సమావేశంలో సయీద్ అన్నాడు. సింధ్‌లోని థార్ ప్రాంతంలో తమ సంస్థ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్న ఆరోపణలను సయీద్ ఖండించాడు. కశ్మీరీ ముస్లింలకు కూడా అతడు మద్దతు పలికినట్లు తెలుస్తోంది. -
హాలీవుడ్ నటుడిపై దేశబహిష్కరణ వేటు!
ఈ ఏడాది ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు సాధించాడు. లెక్కకు మిక్కిలి సినిమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు. సోషల్ మీడియాలో అతని ఫాలోవర్ల సంఖ్య 3.6 కోట్ల మందికి పైనే. అన్నింటికి మించి పర్యావరణ పరిరక్షణ కోసం విపరీతంగా పాటుపడతాడు. ఫలానాచోట, ఫలానా కారణం వల్ల వాతావరణం కలుషితం అవుతోందని తెలిస్తేచాలు, స్టార్ డమ్ ను పక్కన పెట్టి ప్రకృతి ప్రేముకులతో కలిసి ఆందోళనకు దిగుతాడు. ప్రకృతి సమతుల్యం కోసం పరితపించే ఆ లక్షణమే హాలీవుడ్ హీరో లియోనార్డో డికాప్రియోను ఇప్పుడు చిక్కుల్లో పడేసింది. అమెరికా సహా ప్రపంచ దేశాల్లో చాలా ఏళ్లుగా పర్యావరణ పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేస్తోన్న, చేస్తున్నవారిని ప్రోత్సహిస్తోన్న డికాప్రియో గతవారం ఇండోనేసియాలో పర్యటించాడు. అక్కడి ప్రఖ్యాత గునుంగ్ లేసర్ జాతీయపార్కును సందర్శించిన సందర్భంలో ఇండోనేసియా ప్రభుత్వ తీరుపై ఘాటైన విమర్శలు చేశాడు. దీంతో అక్కడి ప్రభుత్వం డికాప్రియోపై దేశబహిష్కరణ వేటు వేస్తామని హెచ్చరించింది. దాదాపు 10 లక్షల హెక్టార్లు విస్తరించి ఉన్న గునుంగ్ పార్క్ ప్రపంచ ప్రఖ్యాత ఎకోజోన్లల్లో ఒకటి. అరుదైన వృక్షజాతులు, జంతుజాలానికి నిలయం. సముద్ర మట్టానికి 3వేల అడుగుల ఎత్తులో రమణీయతతో అలరారే ఆ ప్రాంతంలో పామ్ ఆయిల్ ప్లాంట్లకు అనుమతినివ్వడం ద్వారా విధ్వంసానికి పూనుకుంది ఇండోనేసియా ప్రభుత్వం. పామ్ ఆయిల్ ప్లాంట్లను ఇటీవల భారీగా విస్తరిస్తోంది కూడా. పామాయిల్ మొక్కల కోసం అడవిని చదునుచేయడంతోపాటు, పంటను నాశనం చేస్తున్నాయనే మిశపై ఒరాంగుటన్(అరుదైన చింపాజీలు)లను విచక్షణా రహితంగా చంపేస్తున్నారు. వీటన్నింటిపై ఇండోనేసియన్లే కాక ప్రపంచ ప్రపంచ దేశాల్లోని పర్యావరణ ప్రేమికులంతా ఆందోళననలు చేస్తున్నారు. వారికి మద్దతుగా ఇండోనేసియాకు వచ్చిన డికాప్రియో ప్రభుత్వం తీరును విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. దీంతో మా దేశాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు వివరణ ఇవ్వమంటూ స్థానిక అధికారులు డికాప్రియోకు నోటీసులు జారీచేశారు. నోటీసులు అందుకునేలోపే నటుడు స్వదేశం అమెరికాకు వెళ్లిపోయాడు. గతంలో తమ దేశ అధికారులను వేధించాడనే ఆరోపణలపై నటుడు హారిసన్ ఫోర్డ్ (ఇండియానా జోన్స్, స్టార్ వార్స్ ఫేమ్) ను కూడా దేశం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించింది ఇండోనేసియా ప్రభుత్వం. -
రెండు రోజులుగా ఏనుగుల విధ్వంసం
వి.కోట: చిత్తూరు జిల్లా వి.కోట మండల పరిధిలోని అటవీ సరిహద్దు గ్రామాలు వరుసగా జరుగుతున్న ఏనుగుల దాడుల్లో అతలాకుతలం అవుతున్నాయి. బోయుచిన్నాగనపల్లె సమీపంలో సోలార్ కంచె దాటి వచ్చిన ఏనుగుల గుంపు రెండు జట్లుగా విడిపోయాయి. ఏడు ఏనుగులున్న మంద రామనాథపురం వద్ద పంటలపై దాడి చేశాయి. సుబ్రవుణ్యం నాయుడుకు చెందిన బీన్స్, పశుగ్రాసం, శివకుమార్‌కు చెందిన టమాట, గోవిందస్వామిగౌడుకు చెందిన టమాట, బీన్స్ తోటలను ధ్వంసం చేశాయి. సుబ్రమణ్యంనాయుడుకు చెందిన డ్రిప్ పరికరాలను మరోమారు ధ్వంసం చేశాయి. మరో ఏనుగుల మంద బీసీ పల్లెకు చెందిన హనుమంతుకు సంబంధించిన 150 మామిడి చెట్లను ధ్వంసం చేశాయి. కొత్తకుంట వద్ద గోవిందు అనే రైతు సాగు చేసిన చెరుకు పంటను, బీసీ పల్లె అశోక్, నారాయణస్వామికి చెందిన గెర్కిన్ పంటను ధ్వంసం చేశాయి. -
విశాఖలో కమ్యూనికేషన్ వ్యవస్ధ చిన్నాభిన్నం
-
బెయిల్ కోసం కర్ణాటక హైకోర్టుకు జయలలిత!
చెన్నై:బెంగళూరు నగర శివారులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బెయిల్ కోసం సోమవారం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించనున్నారు. అంతే కాకుండా ప్రత్యేక కోర్టు విధించిన శిక్షపై కూడా స్టే విధించాలని ఆమె కోర్టుకు విన్నవించనున్నారు. ఇందుకు సంబంధించి న్యాయపరమైన వ్యూహాలపై జయలలిత తరుపు న్యాయవాదులు చర్చించారు. మంగళవారం బెయిల్ పిటీషన్ విచారణకు వచ్చే అవకాశం ఉందని న్యాయసలహాదారులు పేర్కొన్నారు. మూడేళ్ల కన్నా ఎక్కువకాలం శిక్ష పడితే హైకోర్టు మాత్రమే బెయిల్ ఇవ్వాలని సీనియర్ న్యాయవాది బి.కుమార్ తెలిపారు. ప్రస్తుతం కర్ణాటక హైకోర్టుకు దసరా సెలవులు. -
తమిళనాట విధ్వంసకాండ
-
తమిళనాట విధ్వంసకాండ
రాష్ట్రవ్యాప్తంగా జయ అభిమానుల ఆందోళనలు బస్సుల దహనం, ద్విచక్ర వాహనాల ధ్వంసం డీఎస్పీపైనే పెట్రోలు పోసిన నిరసనకారులు చెన్నై . ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు బెంగళూరు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించడం తమిళనాట విధ్వంసానికి దారితీసింది. అన్ని జిల్లాల్లోనూ అన్నాడీఎంకే శ్రేణులు, జయలలిత అభిమానులు చెలరేగిపోయారు. కోర్టు తీర్పు కోసం శనివారం ఉదయం నుంచే ప్రజలు, పార్టీ శ్రేణులు ఉత్కంఠతో టీవీలకు అతుక్కుపోయారు. జయను కోర్టు దోషిగా ప్రకటించినట్లు మధ్యాహ్నం వార్తలు వెలువడగానే అమ్మ అభిమానులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. రైల్‌రోకో, రాస్తారోకోలు నిర్వహించారు. చెన్నైలో రోడ్లపై తిరుగుతున్న అనేక బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. కరుణానిధి, స్టాలిన్, అళగిరి, సుబ్రహ్మణ్యస్వామి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆందోళనలతో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూతపడ్డాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలను ఆందోళనకారులు బలవంతంగా మూయించారు. ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సర్వీసులు సైతం నిలిచిపోయాయి. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు వచ్చే బస్సులను ముందుజాగ్రత్త చర్యగా నిలిపేశారు. కాంచీపురంలో 8 బస్సులను తగులబెట్టారు. తిరువళ్లూరులో ఆందోళనకారులను అడ్డుకున్న టౌన్ డీఎస్పీ చంద్రశేఖరన్‌పై అల్లరిమూకలు పెట్రోలు పోసి నిప్పంటించే యత్నం చేశాయి. అయితే పోలీసులు, స్థానికులు ఆయన్ను రక్షించారు. జయలలిత ప్రాతినిధ్యం వహిస్తున్న తిరుచ్చిరాపల్లి జిల్లా శ్రీరంగం ఆందోళనలతో అట్టుడికింది. అమ్మ మద్దతుదారులు మధురైలోని కరుణ పెద్దకుమారుడు అళగిరి ఇంటిపైనా, చెన్నైలోని సుబ్రహ్మణ్యస్వామి నివాసంపైనా రాళ్ల వర్షం కురిపించారు. చెన్నై గోపాలపురంలో కమలకన్నన్ అనే అన్నాడీఎంకే కార్యకర్త ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మాహుతికి యత్నించాడు. చెన్నైలోని జయ నివాసం వద్ద మీడియా ప్రతినిధులపై ఆందోళనకారులు దాడులకు పాల్పడి కెమెరాలను ధ్వంసం చేశారు. ఈ ఆందోళనల్లో 20 మంది వరకూ గాయపడ్డారు. రాష్ట్రం మొత్తం మీద వెయ్యి మందికిపైగా అన్నాడీఎంకే కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మ మద్దతుదారుల ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రవాప్తంగా పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించారు. మరోవైపు అన్నాడీఎంకే కార్యకర్తల ఆందోళనల నేపథ్యంలో డీఎంకే కార్యాలయాలు, ఆ పార్టీ సీనియర్ నేతలకు అలాగే బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామికి భద్రతను పెంచారు. శాంతిభద్రతలపై గవర్నర్ సమీక్ష తమిళనాడులో తాజా పరిస్థితులపై ఆ రాష్ట్ర గవర్నర్ కె.రోశయ్య శనివారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి జయలలితకు జైలు శిక్ష పడటంతో చెలరేగిన అల్లర్లపై రాజ్‌భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా పరిస్థితిని అధికారులు గవర్నర్‌కు వివరించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను గవర్నర్ ఆదేశించారు.