
డెమాస్కస్: సిరియా రాజధాని డెమాస్కస్‌పై ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం ఐదుగురు చనిపోగా, 15 మంది వరకు గాయపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో రాజధానిలోని నివాస భవనసముదాయాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగిందని ప్రభుత్వ వార్తా సంస్థ సనా పేర్కొంది.
వందల ఏళ్లనాటి కోట, ఒక కళాశాల ధ్వంసమయ్యాయని వివరించింది. ఇరాన్ అనుకూల హిజ్బొల్లా మిలిటెంట్లే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో కనీసం 15 మంది చనిపోయినట్లు యూకే కేంద్రంగా పనిచేసే సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ పేర్కొంది. కాగా, ఈ ఘటనపై స్పందించేందుకు ఇజ్రాయెల్ నిరాకరించింది.
Comments
Please login to add a commentAdd a comment