సిరియా టార్గెట్‌గా ఇజ్రాయెల్‌ దాడులు.. భారీగా ప్రాణ నష్టం | Israel strikes Syria Capital Damascus | Sakshi

సిరియా టార్గెట్‌గా ఇజ్రాయెల్‌ దాడులు.. భారీగా ప్రాణ నష్టం

Nov 15 2024 7:05 AM | Updated on Nov 15 2024 7:16 AM

Israel strikes Syria Capital Damascus

డెమాస్కస్‌: సిరియా రాజధాని డెమాస్కస్‌ లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో దాదాపు 15 మంది చనిపోయినట్టు సిరియా స్టేట్‌ మీడియా ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో, మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది.

ఇస్లామిక్ జిహాద్ గ్రూప్ ప్రధాన కార్యాలయాలు, సైనిక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. సిరియా రాజధానికి పశ్చిమాన ఉన్న మజ్జే, ఖుద్సాయా శివారులో ఉన్న భవనాలను టార్గెట్‌ చేస్తూ ఇజ్రాయెల్‌ వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో దాదాపు 15 మంది మరణించినట్టు స్థానిక మీడియా ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇజ్రాయెల్ కొన్నేళ్లుగా సిరియాలో ఇరాన్ సంబంధిత లక్ష్యాలపై దాడులు చేస్తోంది. అయితే, గాజా యుద్ధానికి దారితీసిన ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ గత ఏడాది అక్టోబర్ 7 దాడి చేసినప్పటి నుండి డెమాస్కస్‌లో దాడులను వేగవంతం చేసింది. హిజ్బొల్లాకు చెందిన కమాండర్లు, రివల్యూషనరీ గార్డ్‌లు మజ్జేలో నివసిస్తున్నట్లు ఇజ్రాయెల్‌ వెల్లడించింది. 

 ఇదిలా ఉండగా.. హిజ్బొల్లాకు వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటంలో ఇజ్రాయెల్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ దేశానికి చెందిన ఆరుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ లెబనాన్‌లో జరిగిన పోరాటంలో ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. లెబనాన్‌లో హిజ్బొల్లాకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మరణించిన ఇజ్రాయెల్ సైనికుల సంఖ్య 47కి పెరిగింది. ఓ గ్రామంలో జరిగిన దాడిలో సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement