college building
-
TG: మరో ఘటన.. వాష్‌రూమ్‌లో వీడియో రికార్డింగ్..
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల టాయిలెట్లో అమ్మాయిల వీడియోలు చిత్రీకరించడం కలకలం రేపుతుంది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఏబీవీపీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ కళాశాలలో పరీక్ష రాసేందుకు వచ్చిన నక్క సిద్ధార్థ అనే థర్డ్ ఇయర్ విద్యార్థి.. అమ్మాయిల టాయిలెట్ గోడపై సెల్ ఫోన్ నుంచి వీడియోలు చిత్రీకరించాడు దీన్ని గమనించిన ఓ విద్యార్థిని విషయాన్ని కళాశాల సిబ్బందికి తెలిపింది.వెంటనే ఆ ఫోను స్వాధీనం చేసుకున్న ప్రిన్సిపల్ షీ టీమ్స్‌కు సమాచారం ఇచ్చారు పరీక్ష పూర్తయిన ఆ విద్యార్థి తన సెల్ ఫోన్ చోరీకి గురైనట్టు ఫిర్యాదు చేయడం ఆశ్చర్యాన్ని గురిచేసింది అనుమానించిన ప్రిన్సిపల్ అతన్ని బయటకు వెళ్లకుండా అక్కడే ఉంచుకొని పోలీసులకు అప్పగించారు. అయితే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగితే తాము ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యార్థులు మాత్రం తమకు న్యాయం చేయాలని ఆ వీడియోలు ఏం రికార్డయిందనే అనే విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తనకు తెలిసిన వెంటనే సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించినట్టు చెప్తున్నారు. మొత్తంగా కళాశాల టాయిలెట్లలో జరిగిన వీడియో చిత్రీకరణ ఇప్పుడు సంచలనంగా మారింది.ఇదీ చదవండి: పోలీస్‌స్టేషన్‌లో మహిళతో నీచ కృత్యం.. డీఎస్పీ అరెస్ట్ -
సిరియాపై ఇజ్రాయెల్ దాడులు..ఐదుగురు మృతి
డెమాస్కస్: సిరియా రాజధాని డెమాస్కస్పై ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం ఐదుగురు చనిపోగా, 15 మంది వరకు గాయపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో రాజధానిలోని నివాస భవనసముదాయాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగిందని ప్రభుత్వ వార్తా సంస్థ సనా పేర్కొంది. వందల ఏళ్లనాటి కోట, ఒక కళాశాల ధ్వంసమయ్యాయని వివరించింది. ఇరాన్ అనుకూల హిజ్బొల్లా మిలిటెంట్లే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో కనీసం 15 మంది చనిపోయినట్లు యూకే కేంద్రంగా పనిచేసే సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ పేర్కొంది. కాగా, ఈ ఘటనపై స్పందించేందుకు ఇజ్రాయెల్ నిరాకరించింది. -
గుంటూరులో సందడి చేసిన హిట్-2 టీమ్ ( ఫొటోలు)
-
కాలేజి గ్రౌండ్లో గ్యాంగ్ వార్
-
ఇట్లయితే ఎట్ల..?
ఖమ్మం సహకారనగర్: నిధులు విడుదలైనా నత్తనడకన నిర్మాణాలు. అనుకున్న సమయానికి పూర్తికాని భవనాల పనులు. రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పనులు జరగని పరిస్థితి. జూనియర్ కళాశాలల భవన నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చిస్తున్నా.. కొత్త భవనాలు అందుబాటులోకి రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని శాంతినగర్, చింతకాని మండలం నాగులవంచ, నేలకొండపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు కొత్త భవనాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో కొత్త భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. ఒక్కో భవన నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరు చేశారు. ఇందులో ప్రధానంగా శాంతినగర్ కళాశాల భవనం శిథిలావస్థకు చేరడంతో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ప్రత్యేక చొరవతో అదనంగా సుమారు రూ.కోటిన్నర నిధులు కేటాయించి.. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. తొలి రోజుల్లో పనులు వేగవంతం చేసి నిర్మాణాలు సగానికి పైగా పూర్తి చేశారు. ఆ తర్వాత అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడలేదనే విమర్శలున్నాయి. సుమారు రెండేళ్లు.. రెండేళ్లుగా కళాశాల భవనం నిర్మాణంలో ఉండగా.. ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు సుమారు 600 మంది ఇబ్బంది పడుతున్నారు. భవన నిర్మాణం తొలి రోజుల్లో శాంతినగర్ పాఠశాలలో షిఫ్టులవారీగా తరగతులు నిర్వహించి.. ఆరు నెలలపాటు అవస్థలు పడ్డారు. తర్వాత పాఠశాల భవనం అరకొర పనుల్లో ఉండగానే విద్యార్థులు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో నిర్మాణ సమయంలో పలు గ్రూపుల విద్యార్థులకు నిర్మాణ గదుల్లోనే తరగతులు బోధించిన సంఘటనలున్నాయి. అలాగే నేలకొండపల్లి, నాగులవంచ జూనియర్ కళాశాల విద్యార్థులు సైతం భవన నిర్మాణ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా ప్రాంతాల్లో భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసినట్లయితే విద్యార్థుల సమస్యలు పరిష్కారమయ్యే ఆవకాశం ఉంది. శాంతినగర్ కళాశాల భవన నిర్మాణానికి యథావిధిగా రూ.కోటి కేటాయిస్తే.. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ తాను చదువుకున్న కళాశాల కావడంతో ప్రత్యేక సౌకర్యాలు ఉండేలా చూడాలని, తన మార్క్‌ను చూపించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అదనంగా సుమారు రూ.1.50కోట్లు తీసుకొచ్చారు. ఆ వెంటనే పనులు ముమ్మరం చేయగా.. తర్వాత మధ్యలోనే పనులు మందగించాయి. నత్తనడకన నిర్మాణాలు.. మూడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సంబంధించిన భవన నిర్మాణాలన్నీ నత్తనడకన సాగు తుండడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడా ల్సి వస్తోంది. అరకొర వసతులతోనే విద్యాబోధన సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికార యంత్రాంగం వీటి నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించి త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. కొన్ని పెండింగ్‌లోనే.. కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయి. భవన నిర్మాణం ప్రారంభానికి ముందు జీఎస్టీ లేకపోవడం, తర్వాత జీఎస్టీ అమలు తదితర సమస్యలతో నిర్మాణాల్లో జాప్యం జరుగుతోంది. భవనం పూర్తయితే విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో చదువుకునే అవకాశం ఉంది. – విజయ, శాంతినగర్ కళాశాల ప్రిన్సిపాల్, ఖమ్మం పురోగతిలో పనులు.. మూడు కళాశాలలకు సంబంధించిన భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 70 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. వచ్చే విద్యా సంవత్సరానికి కొత్త భవనాల్లో తరగతులు ప్రారంభమయ్యే ఆవకాశం ఉందని భావిస్తున్నాం. – రవిబాబు, డీఐఈఓ, ఖమ్మం బ్లాక్ లిస్టులో పెట్టాలి.. కళాశాలల భవన నిర్మాణాల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లను తక్షణమే బ్లాక్ లిస్టులో పెట్టాలి. నిర్మాణాలు పూర్తికాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పరీక్షలు సమీపిస్తున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని త్వరితగతిన పనులు పూర్తి చేయాలి. – తాళ్ల నాగరాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి -
‘కాకతీయ’ మట్టి కాలేజీకి!
పెద్దపల్లి ఎమ్మెల్యేకు కలిసొచ్చిన మిషన్ కాకతీయ సుమారు 4,500 ట్రిప్పుల మట్టి తరలింపు సీఎం పేషీకి ఫిర్యాదు పెద్దపల్లి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మహాయజ్ఞంగా తలపెట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమ లక్ష్యం పక్కదారి పడుతోంది. టెండర్ల ప్రక్రి య మొదలు మట్టిని తరలించేవరకు అంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే నడుస్తోందనే దానికి పెద్దపల్లి నియోజకవర్గమే నిదర్శనం. ఈ నియోజకవర్గ పరిధిలో మిషన్ కాకతీయ కాంట్రాక్టు పనులన్నీ దాదాపుగా తన అనుచరులు, బంధువులకే దక్కేలా చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పనిలో పనిగా చెరువు మట్టిని సైతం వదల్లేదు. చెరువు మట్టిని పొలాల్లోకే తరలించాలని రైతులకు పిలుపునిచ్చి, అందుకు భిన్నంగా తన సొంత ప్రయోజనాలకు వాడుకోవడం చర్చనీయాంశమైంది. పెద్దపల్లిలోని ట్రినిటీ కళాశాల మైదానాన్ని చదును చేసుకునేందుకు రెండు చెరువుల నుంచి 4 వేల 500 ట్రిప్పుల మట్టిని తరలించినట్లు తెలుస్తోంది. బందంపల్లి చెరువు నుంచి 200 ట్రాక్టర్లను ఏర్పాటు చేసి ఏకంగా 4 వేల ట్రిప్పుల మట్టి మొరం తరలించారు. కాసులపల్లి చెరువు నుంచి 500 ట్రిప్పులకు పైగా మట్టిని కాలేజీకి తరలించారు. చెరువు మట్టి రైతులకు అవసరం లేనప్పుడు, సదరు చెరువు మట్టి పొలాలకు పనికి రాదని భావిస్తేనే ఇతరత్రా అవసరాలకు వినియోగించాలి. అందుకు గ్రామ పంచాయతీ తీర్మానం అవసరం. ఆ మట్టిని సైతం క్యూబిక్ మీటర్‌కు రూ.60 చొప్పు న రుసుం చెల్లించి తీసుకెళ్లాలి. ఈ 4 వేల ట్రిప్పుల మట్టికి ఎలాంటి రుసుం ప్రభుత్వానికి చెల్లించలేదని పేర్కొంటూ టీడీపీ నాయకులు ఉప్పు రాజు, ఎడె ల్లి శంకర్, సీపీఐ నాయకులు తాళ్లపల్లి లక్ష్మణ్, తాండ్ర సదానందం, సీపీఎం నాయకుడు రమేశ్ తదితరులు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. పొలాల్లోకి తరలించాల్సిన సారవంతమైన భూమిని సొంత కాలేజీకి ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. అధికారులపై తగిన చర్యలు తీసుకోవడంతోపాటు ఎమ్మెల్యేనుంచి జరిమానా వసూలు చేయాలని డిమాండ్ చేశారు. -
ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం