
అభివృద్ది పేరుతో విధ్వంసం వద్దు
2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి
26న హైదరాబాద్‌లో సీపీఎం మహాధర్నా పోస్టర్ విడుదల
పరిగి: నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి వెంకటయ్య అన్నారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించే విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన మహా ధర్నా పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ సమీపంలో నిర్మిస్తున్న రిజర్వాయర్‌తో కుల్కచర్ల, గండేడ్ మండలాల్లో ఆరు గ్రామాలు ముంపుకు గురవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రవి, యాదగిరి, నసీర్ పాల్గొన్నారు.