కనిగిరిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ఎమ్మెల్యే ఉగ్ర కక్ష
అక్రమ కట్టడాల పేరుతో కక్షసాధింపు
రూ.కోటి విలువైన ఇళ్లు, కట్టడాలను కూల్చేసిన అధికారులు
కనిగిరి రూరల్: ప్రకాశం జిల్లా కనిగిరిలో టీడీపీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అధికారులను అడ్డంపెట్టుకుని వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. సుమారు రూ.కోటి విలువైన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకుల ఇళ్లు, నిర్మాణాలను ఆదివారం కూలగొట్టించారు. మున్సిపల్, రెవెన్యూ అధికారుల సహాయంతో పోలీస్ బందోబస్తు మధ్య పొక్లెయిన్లతో విరుచుకుపడ్డారు. బాధితుల కథనం ప్రకారం.. కనిగిరి మున్సిపాలిటీ కాశిరెడ్డినగర్ సమీపంలో ఎస్‌కే హుస్సేన్‌బీ పేరుతో 1976లో పాస్‌బుక్ పట్టా ఉంది.
హుస్సేన్ పేరుతో 863ఏ సర్వే నంబరులో ఉన్న 4.56 ఎకరాలకు సంబంధించి 1976–2008 సంవత్సరాల మధ్య 10 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆ తరువాత ఆ భూమి క్రయవిక్రయాలు జరిగాయి. ఆ భూమిలో పలువురు ఇళ్లు నిర్మించుకున్నారు. ఇంటిపన్ను కడుతున్నారు. విద్యుత్ కనెక్షన్లున్నాయి. మరికొంత భూమిలో పదేళ్ల కిందటే ఐదారుగురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు రేకులòÙడ్లు, కట్టడాలు, ప్రహరీలు నిర్మించుకున్నారు.
తాజాగా మరికొందరు వారి స్థలాలకు ప్రహరీలు కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కక్షసాధింపులో భాగంగా ఎమ్మెల్యే ఉగ్ర ముందుగా ఒక పక్షపత్రికల్లో ఆ భూమి వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు ఆక్రమించారని రాయించి, కనీస సమాచారం ఇవ్వకుండా ఆదివారం సెలవురోజు అయినా ఒక్కసారిగా ఆర్డీవో జాన్ ఇరి్వన్, మున్సిపల్ కమిషనర్ టి.వి.రంగారావు సమక్షంలో నిర్మాణాలను కూల్చివేశారు.
గతంలో సర్వే నంబరు 863ఎలోని 4.56 ఎకరాలను మున్సిపాలిటీ భవన నిర్మాణానికి కేటాయించి ఉన్నట్లు, అసైన్డ్ భూమి కింద ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో ఆ భూమిని మున్సిపాలిటీకి కేటాయించినప్పుడు భూ హక్కుదారులు కోర్టుకు వెళ్లారు. దానిపై హైకోర్టు స్టే ఆర్డర్ ఉంది. ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఇళ్లు, కట్టడాలను ధ్వంసం చేయించారు.
హైకోర్టు, ఆర్డీవో కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నా..
అధికారులు ఆదివారం కూల్చేసిన భవన నిర్మాణాలకు సంబంధించిన స్థల వివాదం ప్రస్తుతం ఆర్డీవో కోర్టులో పెండింగ్‌లో ఉంది. దీనిపై శేఖర్, బ్రహ్మయ్య, బాషా తదితరులు కోర్టులకు వెళ్లి పిటిషన్లు వేశారు. అయినా అవేమీ లెక్క చేయకుండా ఆక్రమణల తొలగింపు పేరుతో ఆదివారం కూల్చేశారు.
కనీసం తమకు సమాచారం, నోటీసులు ఇవ్వకుండా ఎందుకు కూల్చేస్తున్నారంటూ నిర్మాణదారులైన ఖాశిం, రసూల్, బ్రహ్మయ్య అధికారులను అడిగినా పట్టించుకోలేదు. బాధితులు శ్రీను, రసూల్, ఖాశిం, బ్రహ్మయ్య, బాషా తదితరులు హైకోర్టులో, ఆర్డీవో కోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయనడానికి సంబంధించిన ఆధారాలను, ఇతర డాక్యుమెంట్లను చూపించినా ఆర్డీవో, కమిషనర్ లెక్క చేయలేదు. ఈ వ్యవహారంపై మళ్లీ కోర్టును ఆశ్రయించనున్నట్లు బాధితులు తెలిపారు.
వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల షెడ్లు నేలమట్టం
బిక్కవోలు: తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులకు చెందిన రేకుల షెడ్లను పంచాయతీ వారు నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. గ్రామంలోని చెరువు గట్టుపై 11 మంది షెడ్లు నిరి్మంచుకుని ఎన్నో ఏళ్లుగా చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. పంచాయతీ అధికారులు, సిబ్బంది ఆదివారం భారీ పోలీసు బందోబస్తు నడుమ రెండు జేసీబీలతో అక్కడకు చేరుకున్నారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన గండి నాగవెంకటరమణ, గొరపల్లి సీతారామయ్య రేకుల షెడ్లను కూల్చేశారు. దీనిపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పంచాయతీ వార్డు సభ్యురాలు కూడా అయిన వెంకటరమణ భార్య రామతులసి.. షెడ్ల కూల్చివేతపై అధికారులను నిలదీశారు. కనీస సమాచారం ఇవ్వకుండా కక్షపూరితంగా షెడ్లు కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులమనే ఒకే ఒక్క కారణంతో తమ ఆస్తులు ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు అనపర్తి సీఐతో పాటు ముగ్గురు ఎస్.ఐ.లు, సుమారు 30 మంది పోలీసు సిబ్బందితో వచ్చిన పంచాయతీ సిబ్బంది గ్రామంలో యుద్ధవాతావరణం సృష్టించారని చెప్పారు.
షెడ్లను కూల్చడం అధికార పార్టీ నాయకుల ఆకృత్యాలకు, వ్యవస్థల పనితీరుకు అద్దం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆ షెడ్లు అక్రమ కట్టడాలని తాము నోటీసులు ఇవ్వగా పలువురు గడువు కోరారని, వెంకటరమణ, సీతారామయ్య స్పందించనందున వారి షెడ్లు కూల్చేశామని పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment