టీడీపీకి మాజీ ఎమ్మెల్యే గడికోట హితవు
ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం దారుణం
పోలీసుల ఉదాశీన వైఖరే కారణం
హోదా సాధనకు ఇదే సమయం
అందుకు మేం కూడా మద్దతిస్తాం
రాయచోటి/రాయచోటి రూరల్: అధికారాన్ని దక్కించుకున్న వారు చేతనైతే అభివృద్ధితో ప్రజల మనసులను చూరగొనాలే కానీ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు తెగబడటం ఏమిటని అన్నమయ్య జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో గెలుపు, ఓటములు సహజమని, అధికారంలోకి వచి్చన వారు అందరికీ మంచి చేస్తూ ముందుకు సాగాలన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న హింసాకాండకు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. సోమవారం రాయచోటిలోని పార్టీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషాతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.
తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి..
నిర్మాణాలు పూర్తి చేసుకున్న సచివాలయాలపై అల్లరి మూకలు దాడులకు తెగబడి బోర్డులు ధ్వంసం చేయటాన్ని గడికోట తీవ్రంగా ఖండించారు. ప్రజల ఆస్తులైన ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు అనంతరం టీడీపీకి చెందిన అల్లరి మూకలు సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్స్‌పై దాడులు చేస్తూ అరాచకం సృష్టిస్తున్నాయన్నారు. రామాపురం మండలం చిట్లూరు, రాయచోటి రూరల్ మండలం శిబ్యాల గ్రామ సచివాలయాల్లో సంఘ విద్రోహ శక్తులు విధ్వంసం సృష్టించాయని చెప్పారు.
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. ప్రజలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు అనునిత్యం అండగా ఉంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలపై జరుగుతున్న దాడులపై కలెక్టర్ తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయడంపై మండిపడ్డారు. ప్రజల తీర్పు ఎప్పుడూ ఒకవైపే ఉండదని గుర్తుంచుకోవాలని సూచించారు. దాడులు, పోలీసుల నిర్లిప్త వైఖరిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
హోదా ఇస్తేనే మద్దతివ్వాలి
కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకపోవడం ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు సువర్ణావకాశమని గడికోట పేర్కొన్నారు. చంద్రబాబు దీన్ని సది్వనియోగం చేసుకుంటూ రాష్ట్రానికి మేలు చేయాలని సూచించారు. ప్రత్యేక హోదా ఇస్తేనే కేంద్రానికి మద్దతు ఇస్తామని గట్టిగా చెబితే కచి్చతంగా సాధించే వీలుందన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ సీపీకి చెందిన 11 మంది రాజ్యసభ సభ్యులతోపాటు నలుగురు లోక్‌సభ ఎంపీలు అండగా నిలబడతారని చెప్పారు. పోలవరానికి రూ.12 వేల కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గట్టిగా ఒత్తిడి చేయడంతో ఈ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చిందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment