Government assets
-
చేతనైతే మంచి చేయండి
రాయచోటి/రాయచోటి రూరల్: అధికారాన్ని దక్కించుకున్న వారు చేతనైతే అభివృద్ధితో ప్రజల మనసులను చూరగొనాలే కానీ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు తెగబడటం ఏమిటని అన్నమయ్య జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో గెలుపు, ఓటములు సహజమని, అధికారంలోకి వచి్చన వారు అందరికీ మంచి చేస్తూ ముందుకు సాగాలన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న హింసాకాండకు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. సోమవారం రాయచోటిలోని పార్టీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషాతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి.. నిర్మాణాలు పూర్తి చేసుకున్న సచివాలయాలపై అల్లరి మూకలు దాడులకు తెగబడి బోర్డులు ధ్వంసం చేయటాన్ని గడికోట తీవ్రంగా ఖండించారు. ప్రజల ఆస్తులైన ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు అనంతరం టీడీపీకి చెందిన అల్లరి మూకలు సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్స్‌పై దాడులు చేస్తూ అరాచకం సృష్టిస్తున్నాయన్నారు. రామాపురం మండలం చిట్లూరు, రాయచోటి రూరల్ మండలం శిబ్యాల గ్రామ సచివాలయాల్లో సంఘ విద్రోహ శక్తులు విధ్వంసం సృష్టించాయని చెప్పారు.ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. ప్రజలకు వైఎస్సార్సీపీ శ్రేణులు అనునిత్యం అండగా ఉంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలపై జరుగుతున్న దాడులపై కలెక్టర్ తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయడంపై మండిపడ్డారు. ప్రజల తీర్పు ఎప్పుడూ ఒకవైపే ఉండదని గుర్తుంచుకోవాలని సూచించారు. దాడులు, పోలీసుల నిర్లిప్త వైఖరిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.హోదా ఇస్తేనే మద్దతివ్వాలి కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకపోవడం ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు సువర్ణావకాశమని గడికోట పేర్కొన్నారు. చంద్రబాబు దీన్ని సది్వనియోగం చేసుకుంటూ రాష్ట్రానికి మేలు చేయాలని సూచించారు. ప్రత్యేక హోదా ఇస్తేనే కేంద్రానికి మద్దతు ఇస్తామని గట్టిగా చెబితే కచి్చతంగా సాధించే వీలుందన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ సీపీకి చెందిన 11 మంది రాజ్యసభ సభ్యులతోపాటు నలుగురు లోక్‌సభ ఎంపీలు అండగా నిలబడతారని చెప్పారు. పోలవరానికి రూ.12 వేల కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని, వైఎస్ జగన్మోహన్రెడ్డి గట్టిగా ఒత్తిడి చేయడంతో ఈ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చిందని వివరించారు. -
చంద్రబాబు చేసింది వెయ్యి కోట్ల భూకుంభకోణం
గ్రేటర్ హైదరాబాద్‌లో ఏ మూలనైనా ఎకరానికి వంద కోట్ల ధర ఉంది. అలాంటిది 850 ఎకరాలంటే దాదాపు లక్ష కోట్ల రుపాయల విలువ. కేవలం నాలుగు రోజుల్లోనే లక్ష కోట్ల విలువైన భూమిని పక్కదారి పట్టించడమంటే చంద్రబాబు ఘనత అర్థం చేసుకోవచ్చు. 1999-2004 మధ్య జరిగిన ఈ కుంభకోణాన్ని బయటకు రాకుండా చేయడానికి నానా పాట్లు పడ్డా.. చివరికి హైకోర్టు తీర్పు రావడంతో బాబు కుంభకోణమంతా బట్టబయలైంది. సాక్షి, హైదరాబాద్: ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎంజీబీపీఎల్) కంపెనీ ఏర్పాటైన 4 రోజుల్లోనే 850 ఎకరాలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్న 2003 నాటి నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు తీవ్రస్థాయిలో తప్పుబట్టింది. కనీస విచారణ లేకుండా, అంతర్జాతీయ కంపెనీతో సంబంధాలు ఉన్నాయో లేదో తెలుసుకోకుండా, అత్యంత ఖరీదైన ప్రాంతంలో వేల కోట్ల విలువైన భూములను కారు చౌకగా ధారాదత్తం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పోర్ట్స్ అకాడమీ నిర్వహణ కోసం అంటూ ఏటా కోట్లాది రూపాయలు ముట్టజెప్పేందుకు, విద్యుత్, నీటి, సీవేజ్, డ్రైనేజీ సౌకర్యాలు 100 శాతం ఉచితంగా కల్పించేందుకు అంగీకరించడం గతంలో ఎప్పుడూ, ఎక్కడా చూడలేదంటూ విస్మయం వ్యక్తం చేసింది. గతంలో ఏ కంపెనీకీ అది ఏర్పాటైన 4 రోజుల్లో వందల ఎకరాలు అప్పగించినట్టుగా, నిర్వహణ ఖర్చులు, బిల్లుల మాఫీకి అంగీకరించినట్టుగా లేదని అభిప్రాయపడింది. 2007లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం విస్తృత ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకునే సదరు భూమిని వెనక్కు తీసుకుంటూ చట్టం చేసిందని స్పష్టం చేసింది. రాజ్యాంగంలో ఉన్న అధికారాల మేరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్తి (పరిరక్షణ, రక్షణ, పునఃప్రారంభం) చట్టాన్ని తీసుకొచ్చిందని.. ఇది ఎంతమాత్రం ఆక్షేపణీయం కాదని తేల్చిచెప్పింది. ఐఎంజీ భారత్ (పిటిషనర్) పేర్కొంటున్నట్లుగా ఆర్టికల్ 14 ఉల్లంఘన ఎక్కడా జరగలేదని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ పిటిషన్లో ఎలాంటి మెరిట్ కనిపించలేదని, ఆ ఒప్పందాన్ని ఏవిధంగానూ సమర్ధించలేమని ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటిల ధర్మాసనం 18 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత గురువారం తీర్పు ఇచ్చింది. దీనిపై మీరు సీబీఐ విచారణ జరిపిస్తారా? లేక మమ్మల్నే ఆదేశించమంటారా? అంటూ రాష్ట్ర ప్రభు త్వాన్ని ఈ అంశంపైనే దాఖలైన ఓ పిల్ విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై వా రం రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. యువతను క్రీడల్లో తీర్చిదిద్దడం కోసం అంటూ.. ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎంజీబీపీఎల్) 2003, ఆగస్టు 5న ఏర్పాటైంది. కంపెనీ ఏర్పాటైన 4 రోజులకే అంటే ఆగస్టు 9నే చంద్రబా బు నేతృత్వంలోని నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఐఎంజీ భారత్‌తో ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. క్రీడల్లో రాష్ట్ర యువతను చాంపియన్లుగా తీర్చిదిద్దడం కోసం అంటూ ఈ ఎంవోయూ చేసుకుంది. ఇందులో భాగంగా స్పోర్ట్స్ అకాడెమీలను నిర్మించడం, అభివృద్ధి చేయడం, నిర్వహించడం కోసం అంటూ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి సర్వే నంబర్ 25లో 400 ఎకరాలు ఇచ్చేందుకు అంగీకరించింది. అలాగే రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం మామిడిపల్లి సర్వే నంబర్ 99/1లోని మరో 450 ఎకరాలు అప్పగించేందుకు కూడా ఒప్పందం చేసుకుంది. అంతేకాకుండా ఐఎంజీ భారత్ అంతర్జాతీయ స్థాయిలో ప్రధాన కార్యాలయాన్ని నిర్మించుకునేందుకు బంజారాహిల్స్ నుంచి మాదాపూర్ వెళ్లే మార్గంలో ఎకరం నుంచి 5 ఎకరాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు 2004, ఫ్రిబవరిలో గచ్చి»ౌలిలో ఎంతో విలువైన 400 ఎకరాలను స్వల్ప మొత్తానికి అంటే కేవలం రూ.2 కోట్లకే ఐఎంజీ భారత్‌కు అప్పగించింది (సేల్ డీడ్ చేసింది). అయితే 2006లో ప్రభుత్వ ఆస్తులను కాపాడే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. 2007లో దీన్ని చట్టబద్ధం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్తి (పరిరక్షణ, రక్షణ, పునఃప్రారంభం) చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్ట ప్రకారం ఐఎంజీ భారత్‌తో అంతకుముందు ప్రభుత్వం చేసుకున్న ఎంఓయూ, ఆ మేరకు సేల్‌డీడ్ కూడా రద్దయ్యాయి. ఈ క్రమంలో 2007 చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం సంబంధిత లావాదేవీలు రద్దు చేయడమే కాకుండా ఐఎంజీ చెల్లించిన మొత్తాన్ని ఏడాదికి 12 శాతం వడ్డీతో తిరిగి ఇచ్చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే ప్రభుత్వ చట్టాన్ని సవాల్ చేస్తూ ఐఎంజీ భారత్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పూర్తి కేబినెట్ ఆమోదం లేదు: ఏజీ ‘పూర్తి కేబినెట్ ఆమోదం లేకుండా నాటి ప్రభుత్వం ఎంఓయూపై సంతకాలు చేసింది. ఆ సమయంలో భూమి విలువ ఎకరం రూ.13 లక్షలు ఉండగా, పిటిషనర్‌కు రూ.50 వేల స్వల్ప మొత్తానికే సరైన ఎలాంటి కారణం లేకుండా విక్రయించారు. ఐఎంజీ భారత్‌కు అమెరికన్ కంపెనీ అయిన ఐఎంజీతో ఎలాంటి సంబంధం లేదు. కానీ దానికి అనుబంధ సంస్థ అంటూ మోసగించారు. అందుకే తదుపరి ప్రభుత్వం ఎంవోయూను రద్దు చేసింది. పరిహారం ఇవ్వాలని కూడా నిర్ణయించింది. 2007లో ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఒక్క ఐఎంజీ కోసమే కాదు. ఇది ఇతర భూ లావాదేవీలకు కూడా వర్తిస్తుంది. ఇలా చట్టం తీసుకొచ్చే అధికారం రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ ప్రకారం శాసనసభకు ఉంది. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత 2007లో చేసిన చట్టం అమల్లోకి వచ్చింది..’అంటూ అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. కాగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ..‘ఒక ఐఎంజీ భారత్ కోసమే చట్టాన్ని తేవడం సమరి్థనీయం కాదు. ఎంవోయూను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదు..’అంటూ వాదించారు. ఎలాంటి విచారణ చేయకుండానే ఆమోదం: ధర్మాసనం ‘2003 ఆగస్టు 5న ఐఎంజీ భారత్ ఏర్పాటైన తర్వాతి రోజే, ఎలాంటి విచారణ చేసుకోకుండానే 6న నాటి యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం, కల్చలరల్ డిపార్ట్మెంట్ కంపెనీకి ఆమోదం తెలుపుతూ సర్క్యులర్ జారీ చేసింది. అదే రోజు నలుగురు మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీనికి ఆగమేఘాలపై గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత 9వ తేదీన ఎంవోయూ కుదుర్చుకున్నారు. స్పోర్ట్స్ అకాడెమీ, స్టేడియాల నిర్వహణకయ్యే ఖర్చు ఏడాదికి రూ.2.5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ అయితే ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని ఒప్పందంలో పేర్కొన్నారు. తొలి మూడేళ్లపాటు విద్యుత్, నీటి, సీవేజ్, డ్రైనేజీ బిల్లులనూ 100 శాతం తిరిగి చెల్లిస్తామని చెప్పారు. ఆ తర్వాత క్రమంగా దీన్ని తగ్గిస్తామని తెలిపారు. ముఖ్యంగా పిటిషనర్‌కు అంతర్జాతీయ క్రీడా సంస్థ (ఐఎంజీ, అమెరికా)తో సంబంధం గానీ, గతంలో క్రీడా రంగంలో అనుభవం గానీ లేవు. ఉన్నట్లుగా ఐఎంజీ ఎలాంటి పత్రాలను ప్రభుత్వానికి సమర్పించలేదు. ప్రభుత్వం రద్దయ్యాక 400 ఎకరాలకు సేల్‌డీడ్! 2003, నవంబర్ 14నే చంద్రబాబు ప్రభుత్వం రద్దయ్యింది. తర్వాత ఆపద్ధర్మ ప్రభుత్వంగా మాత్రమే కొనసాగింది. ఈ ఆపద్ధర్మ ప్రభుత్వ హయాంలోనే 400 ఎకరాలను నామమాత్రపు ధరకు ఐఎంజీ భారత్‌కు అప్పగిస్తూ సేల్‌డీడ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పుల మేరకు చట్టం ద్వారా ఒక వ్యక్తి మాత్రమే ప్రభావితం అయినా, 2007లో భూములపై రాష్ట్ర శాసనసభకు ఉన్న అధికారాలతోనే చట్టాన్ని రూపొందించింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సరైన కారణాలు ఉన్నప్పుడు రాజ్యాంగం ప్రభుత్వానికి ఈ అధికారం కలి్పంచింది. జాగ్రత్తగా గమనిస్తే.. కంపెనీ ఏర్పాటైన కేవలం 4 రోజుల్లోనే వేల కోట్ల విలువచేసే వందల ఎకరాల భూములు అప్పగించారు. మరే ఇతర కంపెనీకి రాష్ట్రంలో అంత స్వల్ప సమయంలో ఇలా భూములు ధారాదత్తం చేయలేదు. పిటిషనర్‌కు పరిహారం కోరే హక్కు ఉంది. అయితే 2007లో తీసుకొచ్చిన చట్టాన్ని తన ఒక్క కంపెనీ కోసమే అంటూ సవాల్ చేయలేరు. ప్రజా ఆస్తుల పరిరక్షణకే వైఎస్ సర్కార్ చట్టం.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ప్రభుత్వం ఉల్లంఘించిందన్న వాదన కూడా సరికాదు. ప్రజల ఆస్తులను కాపాడటం కోసమే 2007లో వైఎస్ సర్కార్ చట్టం తీసుకొచ్చింది. అది ఎవరి వ్యక్తిగత అవసరాల కోసం కాదన్న విషయం గ్రహించాలి. కంపెనీ ఏర్పాటు చేసిన నాలుగు రోజుల్లో వేల కోట్ల భూములు గతంలో మరే ఇతర కంపెనీకి ప్రభుత్వం కేటాయించినట్లుగా ఐఎంజీ నిరూపించలేకపోయింది. అలాగే ప్రభుత్వం చేసిన చట్టం చెల్లుబాటును అడ్డుకునేందుకు ఇందులో ఎలాంటి ఉల్లంఘనలు కూడా జరగలేదు. సేల్ డీడ్‌ను రద్దు చేయకూడదనే వాదన ఆమోదానికి అర్హమైనది కాదు. ఎంఓయూనే రద్దయినప్పుడు సేల్‌డీడ్ అమల్లో ఉండటం సాధ్యం కాదు..’అంటూ ధర్మాసనం తన తీర్పులో వ్యాఖ్యానించింది. సీబీఐ విచారణకు లేఖ రాశామన్నారుగా.. ‘ఐఎంజీ భారత్‌కు భూముల అప్పగింతపై సీబీఐ విచారణ కోరుతూ గతంలో లేఖ రాశాం అన్నారు.. ఎంత వరకు వచ్చింది? మీరు విచారణ కోరతారా? లేక మమల్నే సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు ఇవ్వమంటారా?’అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణలోగా ఏదో ఒకటి చెప్పాలని ఆదేశిస్తూ, విచారణను వారం పాటు వాయిదా వేసింది. ఐఎంజీ భారత్‌కు భూముల కేటాయింపు, ఎంవోయూ, సేల్‌డీడ్.. ఇలా అన్ని అంశాలపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ)తో విచారణ జరిపించాలని కోరుతూ టి.శ్రీరంగారావుతో పాటు మరొకరు 2012లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ ఒప్పందం వెనుక పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం చేసే ప్రయత్నం జరిగిందని, దీని వెనుక ఉన్న కుట్రదారులెవరో తేల్చాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ పిటిషన్లను గురువారం మరోసారి సీజే ధర్మాసనం విచారించింది. సీబీఐకి అప్పగించే విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్ అభిప్రాయం ధర్మాసనం కోరింది. ఆయన తమకు కొంత సమయం కావాలనడాన్ని, ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాత తెలియజేస్తాననడాన్ని తప్పుబట్టింది. ఇంకా ఎంతకాలం ఆగాలని, వారంలోగా ఏదో ఒకటి తేల్చిచెప్పాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. కాగా గతంలో ఇదే పిల్‌పై విచారణ సందర్భంగా ప్రభుత్వం కోరితే దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నామని న్యాయస్థానానికి సీబీఐ తెలియజేయడం గమనార్హం. -
అప్పు దొరక్క ఆస్తులు అమ్ముకుంటున్న పాకిస్థాన్!
ఇస్లామాబాద్: ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన పాకిస్థాన్‌లో దుర్భర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో దేశాన్ని సమస్యల నుంచి బయటపడేసేందుకు విదేశాలకు ఆస్తులు అమ్ముకుంటోంది. ఆస్తులు విక్రయించేందుకు ఉన్న అడ్డంకులను తొలగిస్తూ అత్యవసరంగా ఓ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం. అన్ని ప్రక్రియలను పక్కనపెట్టి.. రెగ్యులేటరీ తనిఖీలను సైతం తొలగించింది. ఎగవేతదారు అనే ముద్ర పడకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. ‘ఇంటర్ గవర్నమెంటల్ కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్డినెన్స్-2022’ను గురువారం ఫెడరల్ క్యాబినెట్ ఆమోదించింది. దేశంలోని ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ సంస్థల షేర్లను విదేశాలకు విక్రయించటంపై దాఖలయ్యే పిటిషన్లు విచారించకుండా కోర్టులకు సైతం అవకాశం లేదని ద ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ న్యూస్‌పేపర్ వెల్లడించింది. 2.5 బిలియన్ డాలర్ల సమీకరణ.. చమురు, గ్యాస్ కంపెనీలు, ప్రభుత్వ అధీనంలోని విద్యుత్తు కేంద్రాల్లో వాటాను యూఏఈకి విక్రయించేందుకు ఈ అత్యవసర ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. సుమారు 2 బిలియన్ల నుంచి 2.5 బిలియన్ల డాలర్లు వీటి ద్వారా పొందాలని భావిస్తోంది పాకిస్థాన్ ప్రభుత్వం. ఈ ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేసింది. అయితే.. ఈ ఆర్డినెన్స్‌పై పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఇంకా సంతకం చేయకపోవటం గమనార్హం. గతంలోనూ రుణాలు చెల్లించే స్థితిలో పాకిస్థాన్ లేకపోవటం వల్ల కొత్త రుణాలు ఇచ్చేందుకు ఈ ఏడాది మే నెలలో తిరస్కరించింది యూఏఈ. అయితే.. తమ కంపెనీలు పాక్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాలని పేర్కొంది. మరోవైపు.. దేశంలోని ఏదైన సంస్థను ప్రైవేటీకరణ చేసేందుకు సుమారు 471 రోజుల సమయం పడుతుందని పాకిస్థాన్ ఆర్థిక మంత్రి మిఫ్తాహ్ ఇస్మాయిల్ ఇటీవల పేర్కొనటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. నిధుల సేకరణకు ప్రభుత్వం రోజుల వ్యవధిలోనే ఒప్పందాలు పూర్తి చేయాలని సూచించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) నుంచి 1.17 బిలియన్ డాలర్ల రుణాలు పొందటంలో విఫలమైంది. ఆర్థిక అంతరాన్ని తగ్గించేందుకు మిత్ర దేశాల నుంచి 4 బిలియన్ డాలర్లు సేకరించాలని ఐఎంఎఫ్ సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆస్తులను విక్రయించి నిధులు సమీకరించేందుకు ప్రయత్నిస్తోంది పాకిస్థాన్. ఇదీ చూడండి: Pakistan: ‘మహిళలు పర్యాటక ప్రదేశాల్లోకి రావొద్దు’ -
అయిదో రోజూ పెట్రో మంట
న్యూఢిల్లీ: దేశంలో పెట్రో ధరలు వరుసగా అయిదో రోజు కూడా పెరిగాయి. ఆదివారం లీటరుపై పెట్రోల్, డీజిల్ ధరలు 35 పైసల చొప్పున పెరిగినట్లు ప్రభుత్వం రంగ ఇంధన సంస్థలు ప్రకటించాయి. తాజా పెంపుతో, లీటరు పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.107.59కు, ముంబైలో రూ. 113.46కు చేరిందని తెలిపాయి. అదేవిధంగా లీటరు డీజిల్ ధర ముంబైలో రూ.104.38కి, ఢిల్లీలో రూ.96.32కు చేరింది. కాగా, పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తనదైన శైలిలో స్పందించారు. ఈ పెరుగుదలను ప్రభుత్వం పాల్పడుతున్న పన్ను దోపిడీగా ఆయన పేర్కొన్నారు. దేశంలో ఎక్కడైనా ఎన్నికలు జరిగితే కొంతయినా ఉపశమనం లభిస్తుందేమోనని వ్యాఖ్యానించారు. ప్రజలను ఇబ్బందుల పాలు చేయడంలో మోదీ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. దేశంలో తీవ్రస్థాయికి చేరిన నిరుద్యోగం, ప్రభుత్వ ఆస్తుల విక్రయాలు, పెట్రోల్ ధరల పెంపులో మోదీ ప్రభుత్వం రికార్డులు సాధించిందన్నారు. -
ఎవరివైపు ఉంటారో ఆలోచించుకోండి: మంత్రి హరీశ్‌రావు
హుజూరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతున్న బీజేపీ వైపు ఉంటారో లేక ప్రభుత్వ ఆస్తులను కాపాడుతున్న సీఎం కేసీఆర్ వైపు ఉంటారో ఆలోచించుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సూచించారు. ఆర్టీసీకి ఏటా రూ. 2 వేల కోట్లు ఇచ్చి సీఎం కేసీఆర్ కాపాడుతుంటే కేంద్రం మాత్రం రైల్వే, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలను అమ్ముతోందని విమర్శించారు. శుక్రవారం హుజూరాబాద్‌లో రిటైర్డ్ ఉద్యోగుల కృతజ్ఞత సభలో మంత్రి హరీశ్ మాట్లాడుతూ సీఎం మంచి వేతన సవరణ చేసినందుకు రిటైర్డ్ ఉద్యోగులు కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారన్నారు. ‘మేము అమ్ముతున్నాం.. మీరు కూడా ప్రభుత్వరంగ సంస్థలను అమ్మితే బహుమానాలు ఇస్తాం’అని కేంద్రం రాష్ట్రానికి లేఖ రాసిందని హరీశ్ చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం యాదాద్రి, భద్రాద్రి లాంటి విద్యుత్ ఉత్పత్తి సంస్థలను నెలకొల్పి ఆస్తులు పెంచుతోందని వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ రంగానికి మేలు చేసిందో చెప్పాలని హరీశ్ డిమాండ్ చేశారు. ఈటల గెలిస్తే ఆయనకే మేలు.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ ప్రజలకు మేలు జరగాలని ఏమైనా రాజీనామా చేశారా? అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఉప ఎన్నికలో ఒకవేళ ఈటల గెలిస్తే వ్యక్తిగా ఆయనకు మేలు జరుగుతుందని, కానీ ఇది ప్రజలకు నష్టమేనన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు శక్తివంతులని, ఒక్కొక్కరూ వంద మందిని ప్రభావితం చేయగలరన్నా రు. సమావేశంలో మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, నాయకులు రాజయ్య, వి. హన్మంత్‌గౌడ్, విష్ణుదాస్ గోపాల్‌రావు, మోహన్‌రావు, తదితరులు పాల్గొన్నారు. -
భారత్‌కు కెయిర్న్ షాక్..
న్యూఢిల్లీ: బ్రిటన్ దిగ్గజం కెయిర్న్ ఎనర్జీతో రెట్రాస్పెక్టివ్ పన్నుల వివాదంలో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తనకు రావాల్సిన పరిహారాన్ని రాబట్టుకునేందుకు ప్యారిస్‌లో భారత్‌కి ఉన్న 20 ప్రభుత్వ ఆస్తులను జప్తు చేసుకునేందుకు కెయిర్న్ ఎనర్జీకి అనుకూలంగా ఫ్రాన్స్ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. ఎక్కువగా ఫ్లాట్ల రూపంలో ఉన్న ఈ ప్రాపర్టీలను భారత ప్రభుత్వం ఫ్రాన్స్‌లో తమ కార్యకలాపాలకు ఉపయోగిస్తోంది. వీటి విలువ సుమారు 20 మిలియన్ యూరోల దాకా ఉంటుందని అంచనా. తమకు అనుకూలంగా వచ్చిన ఉత్తర్వుల ఊతంతో ఆయా ప్రాపర్టీల్లో ఉన్న భారత అధికారులను కెయిర్న్ వెళ్లగొట్టే అవకాశాలు తక్కువే అయినా, కోర్టు ఆదేశాల కారణంగా వాటిని భారత ప్రభుత్వం విక్రయించడానికి ఉండదు. మరోవైపు, ఫ్రాన్స్ న్యాయస్థానం నుంచి తమకు ఇంకా ఎలాంటి ఉత్తర్వులు అందలేదని, అందిన తర్వాత చట్టపరంగా తగు పరిష్కార మార్గాలు అమలు చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. వివరాల్లోకి వెడితే.. కెయిర్న్ ఎనర్జీ 1994లో భారత్‌లో చమురు, గ్యాస్ రంగంలో ఇన్వెస్ట్ చేసింది. 2006లో తన భారత విభాగాన్ని బీఎస్ఈలో లిస్ట్ చేసింది. ఈ క్రమంలో కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణ ద్వారా కెయిర్న్ ఎనర్జీ లబ్ధి పొందిందని, దానికి సంబంధించి రూ. 10,247 కోట్ల మేర పన్ను పెనాల్టీ, వడ్డీ కట్టాలని కెయిర్న్‌కు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. గత డీల్స్‌కు కూడా వర్తించేలా సవరించిన పన్ను చట్టాలకు (రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్) అనుగుణంగా వీటిని జారీ చేసింది. భారత విభాగంలో కెయిర్న్‌కు ఉన్న షేర్లను, దానికి రావాల్సిన డివిడెండ్లు మొదలైన వాటిని జప్తు చేసింది. దీన్ని కెయిర్న్ ఎనర్జీ పలు న్యాయస్థానాలతో పాటు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌లో సవాలు చేయగా.. కంపెనీకి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. కెయిర్న్‌కు 1.72 బిలియన్ డాలర్లు పరిహారం ఇవ్వాలంటూ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ భారత్‌కు సూచించింది. కానీ కేంద్రం ఇందుకు సుముఖంగా లేకపోవడంతో విదేశాల్లో భారత్‌కి ఉన్న ఆస్తులను జప్తు చేయడం ద్వారా పరిహారాన్ని రాబట్టుకోవాలని కెయిర్న్ యోచిస్తోంది. దీనికోసం అమెరికా, ఫ్రాన్స్ తదితర దేశాల్లో ఆర్బిట్రేషన్ ప్యానెల్ ఆదేశాల అమలు కోరుతూ పిటీషన్లు దాఖలు చేసింది. -
తప్పుకోవాలని కోరే పరిస్థితులు మీరే కల్పించారు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్తులను వేలం ద్వారా విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో జరుగుతున్న విచారణ నుంచి మిమ్మల్ని (జస్టిస్ రాకేశ్‌కుమార్) తప్పుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసే పరిస్థితులు మీరే కల్పించారని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జస్టిస్ రాకేశ్‌కుమార్‌కు స్పష్టంచేసింది. ఈ విషయాన్ని బరువెక్కిన బాధాతప్త హృదయంతో చెబుతున్నామని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వివరించారు. కేవలం న్యాయం చేయడమే కాదని, న్యాయం చేసినట్లు కూడా కనిపించాల్సిన బాధ్యత కూడా న్యాయస్థానాలపై ఉందన్నారు. ప్రజామోదంతో ఎన్నికైన ప్రభుత్వాన్ని న్యాయబద్ధంగా నిర్వర్తించాల్సిన విధులను నిర్వర్తించకుండా అడ్డుకున్నారని తెలిపారు. ప్రభుత్వాన్ని ఊపిరి ఆడనివ్వకుండా చేయడమే కాక, వాదన వినిపించకుండా గొంతు కూడా నొక్కారని వివరించారు. దీనిపై స్పందించిన జస్టిస్ రాకేశ్‌కుమార్.. విచారణ సందర్భంగా ఎన్నో అంటుంటామని, సమాధానాలు రాబట్టేందుకు పలు ప్రశ్నలు అడుగుతుంటామని, వాటికి సమాధానం ఇస్తే సరిపోతుందన్నారు. తాను ఈ వ్యాజ్యాల్లో విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం అభ్యంతరం చెబుతూ, ఈ రెక్యూజ్ (విచారణ నుంచి తప్పుకోవడం) పిటిషన్ దాఖలు చేసిందన్నారు. ఆ వ్యాఖ్యలు తాను చేశానో లేదో ప్రస్తుత ధర్మాసనంలో ఉన్న తన సోదరి జడ్జి జస్టిస్ ఉమాదేవి చెప్పలేరని, అందువల్ల అప్పటి బెంచ్‌లో ఉన్న జస్టిస్ డి.రమేశ్‌తో కలిసి ప్రభుత్వ పిటిషన్ (రెక్యూజ్) విచారిస్తానని జస్టిస్ రాకేశ్ తెలిపారు. అందులో భాగంగా విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు. అలాగే, ప్రభుత్వం దాఖలు చేసిన రెక్యూజ్ పిటిషన్‌పై పిటిషనర్లు కావాలనుకుంటే ఈ నెల 23 నాటికి కౌంటర్లు దాఖలు చేయవచ్చునని తెలిపారు. ఈ మేరకు జస్టిస్ రాకేశ్, జస్టిస్ ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. మిషన్ బిల్డ్ ఏపీ కింద ప్రభుత్వ భూములను వేలం ద్వారా విక్రయించాలన్న సర్కారు నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ రాకేశ్ ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఇటీవల ఈ వ్యాజ్యాల విచారణ సందర్భంగా జస్టిస్ రాకేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే, వ్యంగ్య వ్యాఖ్యలు కూడా చేశారు. దీనిపై ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఈ వ్యాజ్యాల్లో ఆయన పక్షపాతంతో వ్యవహరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేస్తూ, విచారణ నుంచి ఆయనను తప్పుకోవాలని కోరుతూ రెక్యూజ్ పిటిషన్ దాఖలు చేసింది. మిగిలిన వ్యాజ్యాలతో పాటు ఈ రెక్యూజ్ పిటిషన్‌పై కూడా ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. కోర్టులతో పనిలేకుండా అన్నీ ప్రభుత్వం చేస్తుందని మీ ఉద్దేశమా? పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన బి.నళిన్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. ఈ ధర్మాసనం సభ్యుడిగా ఉండాలా? లేక విచారణ నుంచి తప్పుకోవాలా? అన్నది మీరు (జస్టిస్ రాకేశ్‌కుమార్) మాత్రమే స్వయంగా తీసుకోవాల్సిన నిర్ణయమని చెప్పారు. ఈ సమయంలో.. ప్రజామోదంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలను న్యాయబద్ధమైన విధులను నిర్వర్తించకుండా అడ్డుకుంటున్నారని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చెప్పారు. దీనికి జస్టిస్ రాకేశ్‌కుమార్ స్పందిస్తూ, ప్రజలు పూర్తిస్థాయి తీర్పునిచ్చారు కాబట్టి, న్యాయస్థానాలతో పనిలేకుండా అన్నీ మేమే (ప్రభుత్వం) చేసేస్తామన్నది మీ ఉద్దేశమా? అంటూ ప్రశ్నించారు. అది తన ఉద్దేశంతో ఎంతమాత్రం కాదని పొన్నవోలు తెలిపారు. నా చివరి దశలో ఇలాంటి పిటిషన్లు వస్తాయనుకోలేదు.. అనంతరం జస్టిస్ రాకేశ్‌కుమార్ స్పందిస్తూ, జస్టిస్ రమేశ్‌తో కలిసే ఈ రెక్యూజ్ పిటిషన్‌ను విచారించడం సబబుగా ఉంటుందని తెలిపారు. పదవీ విరమణ దశలో తనపై ఇలాంటి పిటిషన్లు వస్తాయని అనుకోలేదని, చివరి శ్వాస వరకు న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడేందుకు ప్రయత్నిస్తానని జస్టిస్ రాకేశ్ వ్యాఖ్యానించారు. -
ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదు
స్పష్టం చేసిన డీజీపీ సాంబశివరావు సాక్షి, అమరావతి: ముద్రగడ పద్మనాభం పాదయాత్రలో అసాంఘిక శక్తులు చొరబడి హింస సృష్టిస్తాయనే సమాచారం ఉన్నందునే అనుమతి ఇవ్వలేదని డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు. తూర్పుగోదావరిలో అరుునా కడపలో అరుునా ఇలాంటి యాత్రలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లాతోపాటు అన్ని జిల్లాల్లోనూ సెక్షన్ 30 అమల్లో ఉందని, అనుమతి లేకుండా ఎలాంటి పాదయాత్రలు, ఆందోళనలు చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముద్రగడ పద్మనాభం తన యాత్రకు ఇంతవరకూ అనుమతి కోరలేదని, ఒకవేళ కోరితే హింస జరగదని.. ఏం జరిగినా తానే బాధ్యత తీసుకుంటానని, ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరిగితే చెల్లిస్తానని హామీ పత్రం రాసిస్తే సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి దాన్ని పరిశీలిస్తామన్నారు. -
సుప్రీం సీరియస్
ఆస్తుల ధ్వంసం చేస్తే కఠిన నిర్ణయం ఆందోళకారులకు సుప్రీం హెచ్చరిక న్యూఢిల్లీ: ఆందోళనకారులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడం పరిధి దాటినట్లే అవుతుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. విధ్వంసానికి పాల్పడిన వారిపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొంది. ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్న వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పింది. జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్కు వ్యతిరేకంగా హార్దిక్ పటేల్ సుప్రీం ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు.. పై వ్యాఖ్యలు చేసింది. నిరసనకారులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను తగులబెట్టే హక్కు లేదంది. -
రగిలిన బాక్సైట్ చిచ్చు
ఉధృతం కానున్న ఉద్యమం మావోయిస్టుల చర్యలతో వేడెక్కిన మన్యం గూడెంకొత్తవీధి: బాక్సైట్ చిచ్చు మన్యంలో సెగలు రేపుతుంది. అదను చూసి మావోయిస్టులు పంజా విసిరారు. ఈసారి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయకుండా బాక్సైట్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. బాక్సైట్ ప్రభావిత ప్రాంతాలైన జర్రెల, మొండిగెడ్డ పంచాయతీల్లో కొందరు గిరిజన యువకులు పునరావాస కమిటీలుగా ఏర్పడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ 13 మందిని తాత్కాలిక ఉద్యోగులుగా నియమించింది. బాక్సైట్ ఏజెంట్‌గా పని చేస్తున్నారంటూ మావోయిస్టులు గతంలో ప్రజాకోర్టులు నిర్వహించి కమిటీ సభ్యులను హెచ్చరించి వదిలేశారు. 2011లో ఈ సంఘటన జరిగినప్పటికీ అదే గిరిజన యువకులు యథావిధిగా చింతపల్లి ఏపీ ఖనిజ అభివృద్ధి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా వీరు పద్ధతి మార్చుకోకపోవడం మావోయిస్టులకు ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి జర్రెల, మొండిగెడ్డ పంచాయితీ కేంద్రాల్లో సాయుధులైన 30 మంది మావోయిస్టులు, వందలాది మంది మిలీషియా సభ్యులతో కలిసి కోరాబు లక్ష్మీ నారాయణ, రీమలి శ్రీను, కొలగాని బాబూరావు, సాగిన బంగారయ్య ఇళ్లను ధ్వంసం చేసి నిప్పంటించారు. బాక్సైట్ ఉద్యమం ఉధృతం కానుందా..? ఐదేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు ప్రయత్నాలను అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు వ్యతిరేకించాయి. అప్పుడప్పుడు చప్పగా సాగే బాక్సైట్ వ్యతిరేక ఉద్యమం 2010 లో మావోయిస్టులు చర్యలతో వేడెక్కింది. బాక్సైట్‌కు అనుకూలంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయడాన్ని నిరశిస్తూ, దీనికి ప్రతీకారంగా అప్పటి జెడ్పీ ఉపాధ్యక్షుడు ఉగ్రంగి సోమలింగంను చౌడుపల్లి గ్రామంలో దళసభ్యులు హతమార్చారు. రాజకీయ పార్టీల నాయకులంతా తమ పదవులకు రాజీనామా చే సి బాక్సైట్ వ్యతిరేక ఉద్యమం చేయాలని హెచ్చరికలు జారీ చేశారు. అప్పట్లో అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులంతా సుమారు 3 నెలల పాటు అజ్ఞాతంలోని వెళ్లిపోయారు. మావోయిస్టుల పిలుపుతోనే మళ్ళీ వెనక్కి వచ్చిన వీరు బాక్సైట్ ఉద్యమంలో పాల్గొన్నారు. కాలక్రమంలో బాక్సైట్ ఉద్యమం చల్లబడింది. మావోయిస్టులకు అనేక ఎదురు దెబ్బలు తగిలాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ సైతం ఆర్థిక వనరులను పెంపొందించుకునేందుకు బాక్సైట్ తవ్వకాల అంశాన్ని గతేడాది తెరపైకి తెచ్చింది. మన్యంలో వేలాది హెక్టార్లలో నిక్షిప్తమైవున్న ఖనిజ తవ్వకాలను ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు అప్పగించింది. ఆ శాఖ కార్యాలయంచింతపల్లిలో కొనసాగుతోంది. ఇందులో పని చేస్తున్న గిరిజన యువకుల ఇళ్లను ఈ కారణంగానే మావోయిస్టులు ధ్వంసం చేసి నిప్పటించారు. ప్రజాకోర్టులో లొంగిపోండి.. ఈస్ట్ డివిజన్ కమిటీ పిలుపు బాక్సైట్ పునరావాస కమిటీ సభ్యులుగా పని చేస్తున్న వారంతా వారం రోజుల్లోగా ప్రజా కోర్టులో లొంగిపోవాలని ఈస్ట్ డివిజన్ కమిటీ పేరిట హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం రాత్రి జర్రెల, మొండిగెడ్డ ప్రాంతాల్లో వరుస దాడులకు పాల్పడిన మావోయిస్టులు సంఘటన ప్రదేశం వద్ద పెద్ద పెద్ద గోడపత్రికలు అతికించి వెళ్లారు. పునరావాస కమిటీ సభ్యులారా! మీ ఉద్యోగాలకు రాజీనామా చేసి గ్రామాల్లో సాధారణ జీవితాలను గడపాలని, కుటుంబ సభ్యులు వీరిపై ఒత్తిడి తీసుకురాని పక్షంలో వారిని కూడా గ్రామం నుంచి తరిమేస్తామని, జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ కు వ్యతిరేకంగా కరపత్రాలను అతికించారు. ఎస్ఆర్ కంపెనీ ప్రయోజనాల కోసమే మన్యంలో పోలీసు బలగాలు తిరుగుతున్నాయని, తమ ఆరోపణలకు సమాధానం చెప్పి గిరిజన గ్రామాల్లో దత్తత నిజస్వరూపాన్ని నిరూపించుకోవాలంటూ సీపీఐ మావోయిస్టు ఈస్ట్ డివిజన్ కమిటీ పేరిట ఆ కరపత్రాల్లో పేర్కొన్నారు.