
సాక్షి, ప్రకాశం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో అధికారుల అండతో పోలీసులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను టార్గెట్ చేసి అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో ఓ ఎస్‌ఐ దారుణంగా వ్యవహరించారు. అక్రమ కేసు బనాయించి.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తను విచక్షణారహితంగా కొట్టారు.
వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాలోని తాళ్లూరు ఎస్‌ఐ మల్లికార్జున.. వైఎస్సార్‌సీపీ కార్యకర్త విష్ణుపై అక్రమంగా కేసు పెట్టారు. కొర్రపాటిపాలెంకు చెందిన విష్ణు.. వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీ కట్టాడనే కారణంగా అతడిపై ఎస్‌ఐ మల్లికార్జున కేసు పెట్టారు. ఈ క్రమంలో విష్ణుపై కక్షగట్టిన టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక, టీడీపీ నేతల ప్రోద్భలంతో ఎస్‌ఐ.. వారి ఫిర్యాదు తీసుకుని విష్ణును స్టేషన్‌కు తరలించారు. అనంతరం,స్టేషన్‌కు వచ్చిన తర్వాత.. విష్ణుపై ఎస్ మల్లికార్జున విచక్షణారహితంగా దాడి చేశారు. తన బెల్టుతో విష్ణును చితకబాదారు. తర్వాత వదిలిపెట్టారు. దీంతో, బాధితుడు విష్ణుకు గాయాలు కావడంతో ఒంగోలు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దర్శి ఎమ్మెల్యే, జిల్లాపార్టీ అధ్యక్షుడు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి.. అర్ధరాత్రి అతడిని పరామర్శించారు.
