లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్‌లు దూకుడు కొనసాగిస్తున్నాయి. రాష్ట్రంలోని హపూర్ జిల్లాలో మంగళవారం(జూన్11)బుల్డోజర్ బీభత్సం సృష్టించింది. జిల్లాలోని పిల్కువా ప్రాంతం ఛాజార్సి టోల్ బూత్ వద్ద ఉదయం 8.30 గంటలకు ఒక బుల్డోజర్ వచ్చి ఆగింది. టోల్ ప్లాజా సిబ్బంది బుల్డోజర్ డ్రైవర్‌ను టోల్ ఛార్జీలు చెల్లించాలని అడిగారు.
దీంతో ఆగ్రహానికి గురైన బుల్డోజర్ డ్రైవర్ టోల్ ప్లాజాకు చెందిన రెండు బూత్‌లతో పాటు సీసీ కెమెరాలను ధ్వంసం చేశాడు. బుల్డోజర్ వి ధ్వంసాన్ని టోల్‌ప్లాజా సిబ్బంది వీడియో తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బుల్డోజర్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. బుల్డోజర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment