వెహికల్ బార్న్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (వీబీఐఈడీ) అంటే వాహనాలతో ఐఈడీ దాడు లని అర్థం. ఇది ఇప్పుడు కశ్మీర్‌లో గస్తీ కాస్తున్న భద్రతాదళాలను అప్రమత్తం చేసింది. ఒక్కొక్కరుగా కశ్మీర్‌లో పనిచేస్తున్న ఉగ్ర సంస్థల ముఖ్యనాయకులను ఏరిపారేస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఉగ్రమూకలు సాంకేతిక పద్ధతిలో భారత సైన్యంపై దాడులకు వ్యూహం రచిస్తున్నారు. ఇందులో భాగంగానే వీబీఐఈడీలతో దాడులు ఈ విషయంపై మిలటరీ ఇంటెలిజెన్స్ గతంలో హెచ్చరించింది.
ఇలాంటి పేలుడు పదార్థాలతో కూడిన వాహనాలను రూపొందించడం తేలిక కాదు. అందుకే అలాంటి నిపుణులు దొరికినప్పుడే ఉగ్రవాదులు నాలుగైదు వాహనాలను సిద్ధం చేసుకుని ఉంచుతున్నారు. సమస్యాత్మక ప్రాం తాల్లో, యుద్ధ జోన్లలో భారీ విధ్వంసం సృష్టించడానికి టెర్రరిస్టులు ఇలా కారు బాంబుల్ని వినియోగిస్తున్నారని ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు వెల్లడించారు.‘ఇలాంటి దాడుల్లో పేలుడు పదార్థాల ద్వారా జరిగే విధ్వంసంతో పాటు.. ఆ వాహన భాగాలు తునాతునకలవడం వల్ల కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇక కారులో ఉండే పెట్రోల్, డీజిల్ వంటివి ఇంధనాలు పేలుడు తీవ్రతను మరిన్ని రెట్లు పెంచుతాయి’అని ఆయన పేర్కొన్నారు.
ఈ ఆపద నుంచి బయటపడలేమా?
అందుకే పోలీసులు ఆర్డీఎక్స్, ప్రాణహాని తలపెట్టే రసాయనాలు అధిక మొత్తంలో ఎక్కడైనా అమ్ముడవుతున్నట్లు తెలిస్తే అప్రమతమై నిఘా పెంచి ఇలాంటి ప్రమాదాలను అరికట్టేందుకు వీలుంటుంది. సున్నితమైన ప్రాంతాల్లో బాంబు డిస్పో జింగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించడం.. అనుమానిత ప్రాంతాల్లో వాహనాల కదలికలను జాగ్రత్తగా గమనించడం ద్వారా వీబీఐఈడీలను గుర్తించేందుకు వీలుంటుంది. వీబీఐఈడీ దాడులు జరపడానికి ఒక్కసారి ఆ వాహనం కదిలిందంటే చాలు.. దానిని నియంత్రించడం చాలా కష్టసా«ధ్యమైన విషయం.
భద్రతా దళాలు వాటిని ఆపడానికి ప్రయత్నించినా అవి పేలిపోయే ప్రమాదం ఉంది. ఒక పరిమితికి మించి కారు స్పీడు పెంచినా, తగ్గించినా అవి పేలిపోతాయి. అంతేకాదు డ్రైవర్ డోర్ ఓపెన్ చేసినా, ఇగ్నిషన్ కీ ఆన్/ఆఫ్ చేసినా వాహనం పేలిపోతుంది. అందుకే సెక్యూరిటీ పికెట్స్ వద్ద వాహనాల చెకింగ్ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇరాక్, అఫ్గానిస్తాన్ వంటి దేశాల్లో కారు బాంబు దాడులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పుడు కశ్మీర్‌లో కూడా అలాంటి దాడులు మొదలవడం దడ పుట్టిస్తోంది.
‘కపిల్ శర్మ షో’ నుంచి సిద్దూ ఔట్!
ముంబై: సోనీ టీవీలో ప్రజాదరణ పొందిన ‘కపిల్ శర్మ షో’నుంచి మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్‌సింగ్ సిద్దూ ఉద్వాసనకు గురయ్యారు. 40 మంది సీఆర్పీఎఫ్ ప్రాణాలు బలి గొన్న పుల్వామా ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ పాత్ర లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో వివాదం చెలరేగడంతో ‘సోనీ’ సంస్థ ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. కమెడియన్ కపిల్ శర్మ షోలో కొన్నేళ్లుగా సిద్దూ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. పుల్వామా దాడి ఘటనపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘కొందరు వ్యక్తులు చేసిన పనికి మొత్తం ఆ దేశానికే ఆపాదిస్తారా? ఉగ్ర వాదుల పిరికి చర్యలపై దేశాలను బాధ్యులుగా చేయడం తగదు’ అంటూ వ్యాఖ్యానించారు. పుల్వామా దాడిలో పాక్ హస్తం ఉందంటూ దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబుకుతుండగా ఆయన ఆ దేశాన్ని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీంతో ఆయన్ను కపిల్‌శర్మ షో నుంచి తప్పిస్తున్నట్లు సోనీ టీవీ తెలిపింది.
వీబీఐఈడీ ఎలా పేలుతుంది?
► డ్రైవింగ్ సీటులో కూర్చున్న ఆత్మాహుతి బాంబర్ నిర్దేశిత ప్రాంతానికి చేరుకుని సైడ్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే పేలిపోతుంది.
► యాక్సిలరేటర్ రైజ్ చేయడం లేదంటే స్లోచేయడం ద్వారా కూడా ఈ బాంబులను పేల్చవచ్చు.
► ఇగ్నీషన్ కీ ఆన్, ఆఫ్‌ల ద్వారా కూడా పేలుడు జరిగేలా చేయొచ్చు.
► ఇక ఏదైనా ప్రాంతంలో పార్క్ చేసి ఉంచిన కారుని టైమర్ ద్వారా పేల్చేందుకు వీలుంటుంది.
► పేలుడు పదార్థాలను కార్లో ఎక్కడ పెడతారు?
► తక్కువ మొత్తంలో పేలుడు పదార్థాలైతే ముందు సీటులో అమరుస్తారు.
► భారీ పేలుడు పదార్థాలను వినియోగించాల్సి వస్తే డిక్కీలో పెడతారు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment