Explosive device
-
Punjab CM: పంజాబ్ సీఎం హత్యకు కుట్ర? ఇంటివద్ద బాంబు స్వాధీనం..
చండీగఢ్: పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ ఇంటి వద్ద లైవ్ బాంబు దొరకడం కలకలం రేపింది. చండీగఢ్‌లోని ఆయన నివాసం వద్ద పోలీసులు ఈ బాంబును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీఎం భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. చండీగఢ్‌లోని పంజాబ్, హరియాణ సీఎంల నివాసాలకు సమీపంలో బాంబ్ షెల్ లభించింది. బాంబ్ స్క్వాడ్ అధికారులు సోమవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో దీన్ని స్వాధీనం చేసుకున్నారు. భగవంత్ మాన్ హెలిప్యాడ్ సమీపంలోనే ఈ బాంబు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బాంబును గుర్తించిన సమయంలో ఆయన ఇంట్లో లేరు. ఎవరో భగవంత్ మాన్ హత్యకు కుట్ర పన్నే బాంబు అమర్చి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. కేసు నమోదుచేసుకుని త్వరితగతిన దర్యాప్తు చేపట్టారు. భారత సైన్యం వెస్టర్న్ కమాండ్ రంగంలోకి దిగి ఈ ఘటనపై ప్రాథమిక విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఏకంగా సీఎం ఇంటి వద్ద బాంబు దొరకడంతో భద్రతా వైఫల్యం స్పష్టంగా కన్పిస్తోంది. సైన్యం, అధికారులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నారు. Bomb found near Punjab CM Bhagwant Mann's house in Chandigarh; bomb squad present at the spot pic.twitter.com/qrDCnBS2IF — ANI (@ANI) January 2, 2023 చదవండి: 'సమాజం ఎటుపోతుందో అర్థంకావట్లేదు.. ఆ కిరాతకులను ఉరి తీయాలి' -
విధ్వంసకర వీబీఐఈడీ
వెహికల్ బార్న్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (వీబీఐఈడీ) అంటే వాహనాలతో ఐఈడీ దాడు లని అర్థం. ఇది ఇప్పుడు కశ్మీర్లో గస్తీ కాస్తున్న భద్రతాదళాలను అప్రమత్తం చేసింది. ఒక్కొక్కరుగా కశ్మీర్లో పనిచేస్తున్న ఉగ్ర సంస్థల ముఖ్యనాయకులను ఏరిపారేస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఉగ్రమూకలు సాంకేతిక పద్ధతిలో భారత సైన్యంపై దాడులకు వ్యూహం రచిస్తున్నారు. ఇందులో భాగంగానే వీబీఐఈడీలతో దాడులు ఈ విషయంపై మిలటరీ ఇంటెలిజెన్స్ గతంలో హెచ్చరించింది. ఇలాంటి పేలుడు పదార్థాలతో కూడిన వాహనాలను రూపొందించడం తేలిక కాదు. అందుకే అలాంటి నిపుణులు దొరికినప్పుడే ఉగ్రవాదులు నాలుగైదు వాహనాలను సిద్ధం చేసుకుని ఉంచుతున్నారు. సమస్యాత్మక ప్రాం తాల్లో, యుద్ధ జోన్లలో భారీ విధ్వంసం సృష్టించడానికి టెర్రరిస్టులు ఇలా కారు బాంబుల్ని వినియోగిస్తున్నారని ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు వెల్లడించారు.‘ఇలాంటి దాడుల్లో పేలుడు పదార్థాల ద్వారా జరిగే విధ్వంసంతో పాటు.. ఆ వాహన భాగాలు తునాతునకలవడం వల్ల కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇక కారులో ఉండే పెట్రోల్, డీజిల్ వంటివి ఇంధనాలు పేలుడు తీవ్రతను మరిన్ని రెట్లు పెంచుతాయి’అని ఆయన పేర్కొన్నారు. ఈ ఆపద నుంచి బయటపడలేమా? అందుకే పోలీసులు ఆర్డీఎక్స్, ప్రాణహాని తలపెట్టే రసాయనాలు అధిక మొత్తంలో ఎక్కడైనా అమ్ముడవుతున్నట్లు తెలిస్తే అప్రమతమై నిఘా పెంచి ఇలాంటి ప్రమాదాలను అరికట్టేందుకు వీలుంటుంది. సున్నితమైన ప్రాంతాల్లో బాంబు డిస్పో జింగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించడం.. అనుమానిత ప్రాంతాల్లో వాహనాల కదలికలను జాగ్రత్తగా గమనించడం ద్వారా వీబీఐఈడీలను గుర్తించేందుకు వీలుంటుంది. వీబీఐఈడీ దాడులు జరపడానికి ఒక్కసారి ఆ వాహనం కదిలిందంటే చాలు.. దానిని నియంత్రించడం చాలా కష్టసా«ధ్యమైన విషయం. భద్రతా దళాలు వాటిని ఆపడానికి ప్రయత్నించినా అవి పేలిపోయే ప్రమాదం ఉంది. ఒక పరిమితికి మించి కారు స్పీడు పెంచినా, తగ్గించినా అవి పేలిపోతాయి. అంతేకాదు డ్రైవర్ డోర్ ఓపెన్ చేసినా, ఇగ్నిషన్ కీ ఆన్/ఆఫ్ చేసినా వాహనం పేలిపోతుంది. అందుకే సెక్యూరిటీ పికెట్స్ వద్ద వాహనాల చెకింగ్ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇరాక్, అఫ్గానిస్తాన్ వంటి దేశాల్లో కారు బాంబు దాడులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పుడు కశ్మీర్లో కూడా అలాంటి దాడులు మొదలవడం దడ పుట్టిస్తోంది. ‘కపిల్ శర్మ షో’ నుంచి సిద్దూ ఔట్! ముంబై: సోనీ టీవీలో ప్రజాదరణ పొందిన ‘కపిల్ శర్మ షో’నుంచి మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్‌సింగ్ సిద్దూ ఉద్వాసనకు గురయ్యారు. 40 మంది సీఆర్పీఎఫ్ ప్రాణాలు బలి గొన్న పుల్వామా ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ పాత్ర లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో వివాదం చెలరేగడంతో ‘సోనీ’ సంస్థ ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. కమెడియన్ కపిల్ శర్మ షోలో కొన్నేళ్లుగా సిద్దూ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. పుల్వామా దాడి ఘటనపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘కొందరు వ్యక్తులు చేసిన పనికి మొత్తం ఆ దేశానికే ఆపాదిస్తారా? ఉగ్ర వాదుల పిరికి చర్యలపై దేశాలను బాధ్యులుగా చేయడం తగదు’ అంటూ వ్యాఖ్యానించారు. పుల్వామా దాడిలో పాక్ హస్తం ఉందంటూ దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబుకుతుండగా ఆయన ఆ దేశాన్ని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీంతో ఆయన్ను కపిల్‌శర్మ షో నుంచి తప్పిస్తున్నట్లు సోనీ టీవీ తెలిపింది. వీబీఐఈడీ ఎలా పేలుతుంది? ► డ్రైవింగ్ సీటులో కూర్చున్న ఆత్మాహుతి బాంబర్ నిర్దేశిత ప్రాంతానికి చేరుకుని సైడ్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే పేలిపోతుంది. ► యాక్సిలరేటర్ రైజ్ చేయడం లేదంటే స్లోచేయడం ద్వారా కూడా ఈ బాంబులను పేల్చవచ్చు. ► ఇగ్నీషన్ కీ ఆన్, ఆఫ్‌ల ద్వారా కూడా పేలుడు జరిగేలా చేయొచ్చు. ► ఇక ఏదైనా ప్రాంతంలో పార్క్ చేసి ఉంచిన కారుని టైమర్ ద్వారా పేల్చేందుకు వీలుంటుంది. ► పేలుడు పదార్థాలను కార్లో ఎక్కడ పెడతారు? ► తక్కువ మొత్తంలో పేలుడు పదార్థాలైతే ముందు సీటులో అమరుస్తారు. ► భారీ పేలుడు పదార్థాలను వినియోగించాల్సి వస్తే డిక్కీలో పెడతారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
అమెరికాను భయపెడుతున్న ‘ప్యాకెట్లు’
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కి, మాజీ అధ్యక్షుల నివాసాలకు, బిలియనీర్ జార్జ్ సోరస్ ఇంటికి, సీఎన్ఎన్ మీడియా సంస్థకు అనుమానాస్పద ప్యాకెట్లు వస్తున్నాయి. పార్శిల్ని విప్పి చూడగా వాటిలో పేలుడు పరికారాలు బయటపడుతున్నాయి. వీటిని చూసిన సీఎన్ఎన్ ముందు జాగ్రత్త చర్యగా ఫైర్ అలారమ్ మోగించి తన సిబ్బందిని బయటకు పంపించింది. తొలుత ఈ ప్యాకెట్లు మంగళవారం బిల్ క్లింటన్ నివాసానికి, బుధవారం ఒబామా నివాసానికి వచ్చాయని ఎఫ్‌బీఐ ప్రకటించింది. అయితే ఈ ప్యాకెట్లు వచ్చిన సమయంలో హిల్లరి దంపతులు ఇంట్లో ఉన్నారా లేదా అనే విషయం గురించి ఎటువంటి సమాచారం తెలియలేదు. వీటి గురించి దర్యాప్తు కొనసాగుతుందని ఎఫ్‌బీఐ అధికారులు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. We are aware of a suspicious package found in the vicinity of the Clinton residence in Chappaqua, NY, and our JTTF has engaged with our federal, state and local partners to investigate. As this is an on-going investigation, we will have no further comment at this time — FBI New York (@NewYorkFBI) October 24, 2018 అయితే మాజీ అధ్యక్షులు, ప్రముఖుల ఇళ్లకు వస్తోన్న ఈ అనుమానాస్పద ప్యాకెట్ల అంశాన్ని వైట్ హౌస్ ఖండించింది. ఇలాంటి భయపెట్టే చర్యలు చట్ట వ్యతిరేకమైనవని, అసహ్యమైనవని పేర్కొంది. వీటికి పాల్పడే వారు ఎవరైనా సరే.. తగిన మూల్యం చెల్లిస్తారని హెచ్చరించింది. అంతేకాక ఈ ప్యాకెట్ వచ్చిన వారందరికి భద్రత కల్పిస్తామని వెల్లడించింది. -
బాంబు జాకెట్‌తో మసీదుకెళ్లి మారణహోమం
కాబుల్: అప్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులు తెగబడ్డారు. కాబుల్‌లో పెద్ద మొత్తంలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. దీంతో 27మంది అక్కడికక్కడే మృత్యువాతపడగా 35మంది తీవ్ర గాయాలపాలయ్యారు. దాడి జరిగిన ప్రాంతమంతా ధ్వంసమై రక్తపు మరకలతో భీతవాహంగా కనిపించింది. షియా మసీదును లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఈ దారుణానికి దిగారు. ప్రత్యక్ష సాక్షులు, అక్కడికి చేరుకున్న పోలీసుల వివరాల ప్రకారం బాంబు జాకెట్ ధరించిన ఓ ఉగ్రవాది బాకిర్ ఉల్ ఓలమ్ అనే మసీదులోకి ప్రవేశించాడు. ఆ సమయంలో అందరూ ప్రార్థనలకు సిద్ధమవుతుండగా గట్టిగా కేకలు వేస్తూ తనను తాను పేల్చుకుని మారణ హోమానికి పాల్పడ్డాడు. కాగా, ఈ దాడికి ఎవరు చేశారనే విషయం ఇంకా తెలియరాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
జాగిలాల ప్రయోగం సక్సెస్!
- మలినాయిస్ జాతి జాగిలాల్ని బిహార్‌లో వినియోగించిన సీఆర్పీఎఫ్ - సెర్చ్ ఆపరేషన్స్‌లో కీలకపాత్ర సాక్షి, హైదరాబాద్: బెల్జియం మలినాయిస్ జాగిలాలు తమ ప్రత్యేకతను చాటాయి. మందుపాతరలు, ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్(ఐఈడీ) బాంబుల్ని గుర్తించడంలో తమకు తామే సాటి అని నిరూపించుకున్నాయి. ఏపీ సహా పలు రాష్ట్రాల్లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్స్‌లో బెల్జియం మలినాయిస్ జాగిలాల్ని వినియోగించటానికి కేంద్ర హోంశాఖ(ఎంహెచ్ఏ) అనుమతి పొందిన సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్(సీఆర్పీఎఫ్) ప్రయోగాత్మకంగా వాటిని బిహార్‌లో ఉపయోగించింది. బిహార్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన భారీ సెర్చ్ ఆపరేషన్‌లో మలినాయిస్ జాగిలాలు కీలకపాత్ర పోషించినట్టు అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు నివేదికను రూపొందించి ఎంహెచ్ఏకు పంపారు. బిహార్ ఎన్నికల్ని భగ్నం చేయాలని కుట్రపన్నిన మావోయిస్టులు భారీ పథక రచన చేశారని, ప్రధానంగా జాముయ్, గయ, నవద తదితర జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు ప్రయాణించే మార్గాల్లో మందుపాతరలు, ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్(ఐఈడీ) బాంబుల్ని ఏర్పాటు చేశారని నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో వీటిని గుర్తించి.. నిర్వీర్యం చేసే బాధ్యతల్ని బిహార్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సహకారంతో సీఆర్పీఎఫ్ చేపట్టింది. ఇందులో భాగంగా నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్స్‌లో ప్రయోగాత్మకంగా బెల్జియం మలినాయిస్ జాగిలాల్ని వినియోగించింది. గత గురువారం నిర్విరామంగా పనిచేసిన ఈ జాగిలాలు జాముయ్ జిల్లాలోని భీమ్బంద్తోపాటు నవద జిల్లాలో మావోయిస్టులు అమర్చిన 51 బాంబుల్ని గుర్తించాయి. భూమిలో దాచిన వాటినేగాక కల్వర్టులకింద, పడవల్లోనూ అమర్చిన బాంబుల్ని సైతం గుర్తించి.. నిర్వీర్యం చేయడంలో సీఆర్పీఎఫ్కు సహకరించాయి. రోడ్డు సదుపాయంలేని ప్రాంతాలకు భద్రతా బలగాలు మరపడవల ద్వారా వెళుతుంటాయి. మావోయిస్టులు వీటిలో బాంబులు అమర్చడం ఇదే తొలిసారి. అయినప్పటికీ మలినాయిస్ జాగిలాలు వాటిని తేలిగ్గా గుర్తించాయని సీఆర్పీఎఫ్ అధికారులు పేర్కొన్నారు. గయ జిల్లాలోని ఇమాంగంజ్ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్లలో అమర్చిన 10 కేజీల పేలుడు పదార్థాన్ని గుర్తించడంలోనూ ఇవి సఫలీకృతమయ్యాయి. షెపర్డ్, లాబ్రెడార్ స్థానంలో మలినాయిస్ బెల్జియం మలినాయిస్ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఈ విభాగానికి చెందిన కెన్నెల్ యూనిట్లో ఉన్న 350 జర్మన్ షెపర్డ్, లాబ్రెడార్ శునకాల స్థానంలో వీటిని తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. జర్మన్ షెపర్డ్, లాబ్రెడార్ జాగిలాల్ని ఢిల్లీ పోలీసుతోసహా ఇతర పోలీసు విభాగాలకు అందించాలని సీఆర్పీఎఫ్ యోచిస్తోంది. -
'ఆ పేలుడు పరికరంతో హడిన్ కు సంబంధం లేదు'
సిడ్నీ:ఆస్ట్రేలియా క్రికెటర్ బ్రాడ్ హడిన్ ఇంటి ఆవరణలో దొరికిన పేలుడు పరికరంతో అతనికి ఎటువంటి సంబంధం లేదని పోలీసులు తెలిపారు. హడిన్ ఇంటి సమీపంలో శుక్రవారం పేలుడు పదార్థ పరికరం లభించడంతో అప్రమత్తమైన ఆస్ట్రేలియా పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్న అనంతరం దర్యాప్తు చేపట్టారు. ఈ పేలుడు పరికరంతో హడిన్ కు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. పేలుడు పదార్థాలతో హడిన్ కు కానీ, అతని కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి సంబంధం లేదని తమ దర్యాప్తులో తేలినట్లు రైడ్ లోకల్ ఏరియా కమాండ్ సూపరిండెంట్ జోన్ డంకన్ శనివారం పేర్కొన్నారు. కాగా, అనుమానాస్పద పేలుడు పరికరంపై ఎవరికైనా సమాచారం తెలిస్తే తమను సంప్రదించాల్సిందిగా స్థానికులకు విజ్ఞప్తి చేశారు. -
బేతంచర్లలో భారీ పేలుడు పదార్థాలు స్వాధీనం
కర్నూలు: కర్నూలు జిల్లాలో భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న పేలుడు పదార్థాలను మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బేతంచర్ల పట్టణంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా టాటాసుమోలో తరలిస్తున్న 5 వేల డెటోనెటర్లు, 1249 ఐడీఎల్ పవర్ జిల్టిన్స్టిక్లు, 500 కేజీల అమ్మోనియాను పోలీసులు స్వాధీనం చేసుకున్నరు. అనంతరం ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ పేలుడు పదార్థాలను కర్నూలు నుంచి నొసంకు తరలిస్తున్నట్లు నిందితులు పోలీసులను తెలిపారు. విచారణ కొనసాగుతుంది.