బాంబు జాకెట్తో మసీదుకెళ్లి మారణహోమం | 27 dead in suicide attack at Shia mosque in Kabul | Sakshi
Sakshi News home page

బాంబు జాకెట్తో మసీదుకెళ్లి మారణహోమం

Published Mon, Nov 21 2016 3:00 PM | Last Updated on Tue, Nov 6 2018 8:35 PM

బాంబు జాకెట్తో మసీదుకెళ్లి మారణహోమం - Sakshi

బాంబు జాకెట్తో మసీదుకెళ్లి మారణహోమం

కాబుల్: అప్ఘనిస్థాన్లో ఉగ్రవాదులు తెగబడ్డారు. కాబుల్లో పెద్ద మొత్తంలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. దీంతో 27మంది అక్కడికక్కడే మృత్యువాతపడగా 35మంది తీవ్ర గాయాలపాలయ్యారు. దాడి జరిగిన ప్రాంతమంతా ధ్వంసమై రక్తపు మరకలతో భీతవాహంగా కనిపించింది. షియా మసీదును లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఈ దారుణానికి దిగారు.

ప్రత్యక్ష సాక్షులు, అక్కడికి చేరుకున్న పోలీసుల వివరాల ప్రకారం బాంబు జాకెట్ ధరించిన ఓ ఉగ్రవాది బాకిర్ ఉల్ ఓలమ్ అనే మసీదులోకి ప్రవేశించాడు. ఆ సమయంలో అందరూ ప్రార్థనలకు సిద్ధమవుతుండగా గట్టిగా కేకలు వేస్తూ తనను తాను పేల్చుకుని మారణ హోమానికి పాల్పడ్డాడు. కాగా, ఈ దాడికి ఎవరు చేశారనే విషయం ఇంకా తెలియరాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement