
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. పేలుడు ధాటికి ఆరుగురు మృతి చెందగా 13 మంది గాయపడ్డారు. గాయపడ్డవారని ఆస్పత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. ఆత్మాహుతిదాడికి తామే కారణమని ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.
దాడిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిలో ఒక మహిళ ఉన్నట్లు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌లో 2021 నుంచి తాలిబన్ల పాలన కొనసాగుతోంది. ఇక్కడ తాలిబన్లకు వ్యతిరేకంగా పనిచేసే ఐసిస్ అనుబంధ ఉగ్రవాద సంస్థ తరచు స్కూళ్లు, ఆస్పత్రులపై ఆత్మాహుతి దాడులకు పాల్పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment