
బేతంచర్లలో భారీ పేలుడు పదార్థాలు స్వాధీనం
కర్నూలు: కర్నూలు జిల్లాలో భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న పేలుడు పదార్థాలను మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బేతంచర్ల పట్టణంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా టాటాసుమోలో తరలిస్తున్న 5 వేల డెటోనెటర్లు, 1249 ఐడీఎల్ పవర్ జిల్టిన్స్టిక్లు, 500 కేజీల అమ్మోనియాను పోలీసులు స్వాధీనం చేసుకున్నరు.
అనంతరం ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ పేలుడు పదార్థాలను కర్నూలు నుంచి నొసంకు తరలిస్తున్నట్లు నిందితులు పోలీసులను తెలిపారు. విచారణ కొనసాగుతుంది.