bethamcherla
-
పుష్పరాజ్.. తగ్గేదేలే.. అచ్చం బన్నీని తలపించావ్ భయ్యా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2021లో పుష్ప పార్ట్-1 బన్నీ ఫ్యాన్స్‌ను ఓ రేంజ్లో అలరించింది. తగ్గదేలే అనే డైలాగ్ ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆ డైలాగ్ కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో చెప్పే ఉంటారు. అంతా ఫేమస్ అయిపోయాడు పుష్పరాజ్. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అయితే ఏకంగా బన్నీ స్టైల్‌తో అభిమానలను అలరించారు.ఇకపోతే ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. మరికొద్ది రోజుల్లోనే పుష్పరాజ్ థియేటర్లలో సందడి చేయనున్నారు. రిలీజ్‌కు ఇంకా కేవలం 20 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే టీజర్, పోస్టర్లతో హోరెత్తించిన మేకర్స్.. మెగా ఈవెంట్ కోసం సిద్ధమయ్యారు. పుష్ప-2 ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను పట్నాలో భారీఎత్తున నిర్వహిస్తున్నారు. ఈనెల 17న భారీస్థాయిలో జరిగే ఈవెంట్లో ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.ఇకపోతే బన్నీ ఫ్యాన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లో ఏహీరోకు లేని ఫ్యాన్‌బేస్ ఆయనకు మాత్రమే సొంతం. తాజాగా ఓ అభిమాని చేసిన మేకప్ స్టంట్ అదిరిపోయింది. అచ్చం అల్లు అర్జున్ను తలపించేలా పుష్ప-2 గెటప్‌లో కనిపించారు. నంద్యాల జిల్లా బేతంచెర్లకు చెందిన కొరియోగ్రాఫర్ డీజే మధు చేసిన ఈ వీడియో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఇది చూసిన నెటిజన్స్ ఒక్కసారిగా అల్లు అర్జున్ను చూసినంత ఫీలింగ్ వచ్చిందని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరేమో బన్నీ ఫ్యాన్స్ రచ్చ అంటే ఆ మాత్రం రేంజ్ ఉంటుందని పోస్ట్ చేస్తున్నారు. కాగా.. పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఇప్పటికే యూఎస్ ప్రీమియర్స్‌కు సంబంధించి టికెట్ల్ బుకింగ్స్ కూడా పూర్తయ్యాయి. View this post on Instagram A post shared by D J Madhu (@name_is_djmadhu) -
జోడెద్దుల ఊయ్యాల.. హాయిగా నిద్రపోవాల!
సాక్షి, బేతంచెర్ల: కాడెద్దుల పట్టెడలకు చీరతో ఊయల. అందులో ఆదమరిచి నిద్రపోతున్న ఓ చిన్నారి.. ఓ రైతు కుటుంబం తమ బిడ్డను ఈ విధంగా నిద్రకేసి ఎంచక్కా వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. ఎద్దులు అడుగు తీసి అడుగేసినప్పుడల్లా ఊయల ఊగుతుండగా.. జోలపాటలా వస్తున్న ఎద్దుల మెడలోని గంటల సవ్వడికి ఆ చిన్నారి హాయిగా నిద్రపోతోంది. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురంలోని ఓ రైతు జంట తమ బిడ్డను ఈ విధంగా నిద్రపుచ్చుతున్న సన్నివేశం సాక్షి కెమెరాకు చిక్కింది. (క్లిక్: అర్ధసత్యాల ఆంధ్రజ్యోతి) -
టీవీ చూడరు, మద్యం, మాంసం ముట్టరు.. ప్రత్యేక జీ‘వనం’
భవిష్యత్ తరాలకు ఆరోగ్యకర సమాజాన్ని అందించాలనే లక్ష్యంతో వారంతా సంఘటితమయ్యారు. యాంత్రిక జీవనాన్ని వీడి ప్రకృతి వైపు అడుగులు వేశారు. పలువురికి స్ఫూర్తి కలిగేలా ప్రత్యేక జీవనం గడుపుతున్నారు. ఉరుకులపరుగుల మనుషుల మధ్య కాకుండా ఆహ్లాదకర వాతావరణంలో నివాసముంటూ సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆదర్శంగా జీవిస్తున్నారు. వీరి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే బేతంచెర్ల పట్టణానికి కిలో మీటరు దూరంలో కొలుములపల్లె రహదారిలోని రాధాస్వామి నగరిని సందర్శించాల్సిందే. బేతంచెర్ల: ఆధునిక ప్రపంచంలో మనుషుల మధ్య దూరం పెరుగుతోంది. ఇరుగుపొరుగు అనేది కనుమరుగవుతోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేదు.. అంతటా ఇదే పరిస్థితి. ఎవరి జీవితం వారిది అన్నట్లుగా మారుతోంది. ఆత్మీయతలు, ఆప్యాయతలు మసకబారుతున్నాయి. బేతంచెర్లలోని రాధాస్వామి నగరి ప్రజలు వీటికి అతీతం. అందరిదీ ఒకే మాట. ఒకే బాట. వేర్వేరు వృత్తుల్లో కొనసాగుతున్నా.. పర్యావరణ రక్షణ, ఆరోగ్య సంరక్షణకు రాధాస్వామి ధార్మిక సంస్థ వైపు అడుగులు వేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా పట్టణానికి చెందిన ఈ సంస్థ ప్రస్తుతం 8వ గురువు పరమ గురువు ప్రేమ్‌శరన్ సత్సంగి సాహెబ్ వారి ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఇప్పటికే పలు కాలనీలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, సేవా సంస్థలు, ఆసుపత్రులు అనుబంధంగా కొనసాగుతున్నాయి. చిరు తిండ్లను తయారు చేస్తున్న మహిళలు ఈ క్రమంలో బేతంచెర్ల పట్టణానికి చెందిన ప్రేమ స్వరూప్ అధ్యక్షతన 14 కుటుంబాలు ప్రత్యేక జీవనం అలవర్చుకున్నాయి. వీరికి స్ఫూర్తిగా రామళ్లకోట, కొలుములపల్లె, ముద్దవరం ప్రాంతాల్లో మరో 20 కుటుంబాలు వీరి బాటలో పయనిస్తున్నాయి. కర్నూలు నగరంలో కూడా దాదాపు 300 కుటుంబాలు ఉన్నాయి. ఈ ధార్మిక సంస్థలో సభ్యులుగా ఉన్నవారంతా గురువు ఆదేశాల ప్రకారం కొన్ని నియమాలు తప్పక పాటిస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించే ఏసీలు వినియోగించడం లేదు. వ్యవసాయంలో రసాయన, పురుగు మందులకు దూరంగా ఉంటున్నారు. అలాగే మద్యం, మాంసం తీసుకోవడం లేదు. ఉదయం వ్యాయామం తప్పక చేస్తున్నారు. ఏ ఇంట్లో కూడా టీవీలు కనిపించవు. ప్రతి ఒక్కరూ తెల్లవారు జామున 3.30 గంటల నుంచి ప్రార్థన, సత్సంగంతో వారి దిన చర్య ప్రారంభమవుతోంది. కష్టపడి పనిచేస్తూ జీవన విధానం కొనసాగిస్తూ, సేవా మార్గంలో నడవాలనేది వారి అభిమతం. సమష్టిగా వ్యవ‘సాయం’ బేతంచెర్ల రాధాస్వామి కాలనీలో నివాసం ఉంటున్న దాదాపు 100 మంది పెద్దలు, పిల్లలు, వృద్ధులు సామూహికంగా వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. రెండు ఎకరాల్లో సపోట, జామ, సీతాఫలం పండ్ల మొక్కలతో పాటు రోజు వినియోగించుకునేందుకు ఆకుకూరలు, కూరగాయలు పండించుకుంటూ ఆరోగ్యకరమైన జీవనం గడుపుతున్నారు. ఉదయం, సాయంత్రం వ్యవసాయ పనులు చేస్తారు. ఆధునిక యంత్రాలను ఉపయోగిస్తున్నారు. అలాగే నాణ్యమైన వస్తువులు (కాటన్ దుస్తులు, దోమ తెరలు, దుప్పట్లు, పాదరక్షలు) తయారు చేసి సేవాదృక్పథంతో ఏడాదికోసారి లాభాపేక్ష లేకుండా విక్రయిస్తారు. స్వయం ఉపాధిని పెంపొదించుకునేందుకు మహిళలు ఖాళీ సమయంలో చిరుతిండ్లను తయారు చేసి విక్రయిస్తున్నారు. -
విషాదం: దోశ పిండి నీలాగే ఉందనడంతో
బేతంచెర్ల(కర్నూలు జిల్లా): పట్టణంలోని కోటపేట కాలనీలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికంగా నివాసముంటున్న మాబాషా, షాకీరాబీ (26) దంపతులు అరటి పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం ఉన్నారు. ఆదివారం ఉదయం షాకీరాబీ దోశ పిండి గ్రైండ్ పట్టించుకొని వచ్చింది. ‘దోశ పిండి నీ లాగే’ ఉందని తోడి కోడలు షబానా అనడంతో మనస్తాపానికి గురైంది. అనంతరం టిఫిన్ చేసే విషయంలో భర్తతో వాగ్వాదం జరిగింది. కొద్దిసేపటికి ఇంట్లో ఎవరూ లేని సమయంలో షాకీరాబీ ఉరి వేసుకుంది. కొన ఊపిరితో ఉన్న ఆమెను కుటుంబీకులు ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: కార్పొరేటర్ హత్య కేసు: కృష్ణా జిల్లాలో చిన్నా?) నెత్తురోడిన రహదారి -
అనుమానిస్తున్నాడని భర్తను గొడ్డలితో నరికింది
సాక్షి, బేతంచెర్ల (కర్నూలు): తాళికట్టిన భర్తనే భార్య కడతేర్చింది. గాఢ నిద్ర లో ఉన్న అతడిని గొడ్డలితో విచక్షణా రహితంగా నరికి హతమార్చింది. అనంతరం స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఈ ఘటన మండల పరిధిలోని గోర్లగుట్ట గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గోర్లగుట్ట గ్రామానికి చెందిన రామదాసు, సుంకులమ్మ కుమారుడు వడ్డె చిన్న ఆంజనేయులు(35)కు బనగానపల్లె మండలం పలుకూరు గ్రామానికి చెందిన నరసింహుడు, లక్ష్మిదేవి కూతురు ధనలక్ష్మితో 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తెలు పూజిత, వర్షిణి, కుమారుడు హేమంత్ ఉన్నారు. పాలీస్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. కాగా కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న వడ్డె ఆంజనేయులు తాగుడుకు బానిసై వేధించడం మొదలుపెట్టాడు. ఈక్రమంలో మంగళవారం మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. అనంతరం ఇద్దరూ నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న భర్తను భార్య గొడ్డలితో విచక్షణారహితంగా నరికి హత్య చేసింది. అనంతరం స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. కాగా ఈ విషయం పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. సీఐ కేశవరెడ్డి, ఎస్ఐ సురేష్ ఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లెకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. (చదవండి: మహిళల భద్రత మా బాధ్యత) -
జీవితంపై విరక్తి చెంది యువతి..
సాక్షి, బేతంచెర్ల: మండల పరిధిలోని ఆర్.కొత్తపల్లె గ్రామానికి చెందిన ఓ యువతి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మహేశ్వర్‌రెడ్డి కుమార్తె ఉషారాణి (18) కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. వైద్యం చేయించినా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది శనివారం పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం డోన్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ప్రకాశ్ తెలిపారు. -
అమ్మా ! నాకెందుకు ఈ శిక్ష..
అమ్మా..! నేను చేసిన నేరమేమిటి? నాన్న ఆడ పిల్ల వద్దన్నందుకు నెలలు నిండకముందే నేలపై విసిరేశావా? లేదా ‘తప్పు’ దారిలో నడిచి తల్లి అవుతున్నందుకు భయపడ్డావా? చేతులెట్లా వచ్చెనమ్మా నన్ను చెత్తకుప్ప పాలు చేసేందుకు? మీరు చేసిన పాపానికి నాకెందుకమ్మా శిక్షా? సాక్షి, బేతంచెర్ల(కర్నూలు) : పట్టణంలోని సంజీవనగర్ కాలనీలో గురువారం మధ్యాహ్నం చెత్త కుప్పలో నెలలు నిండని ఆడ మృత శిశువును స్థానికులు కనుగొన్నారు. చెత్త కుప్పలో పడి ఉన్న శిశివును కుక్కలు ఎత్తుకొని వెళ్తుండటం గమనించి కాలనీ వాసులు అడ్డుకున్నారు. వెంటనే పంచాయతీ ఈఓ జితేంద్రకు సమాచారం ఇవ్వడంతో ఆయన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాలనీల్లో ఎవరైనా ప్రసవించారా అని అంగన్వాడీ కార్యకర్తలతో విచారించారు. పోలీసులు సైతం ఘటనా స్థలానికి చేరుకొని కాలనీవాసులతో చర్చించారు. కాగా మృత శిశువు బొడ్డు తాడు, ముఖంపై గాయాలు ఉన్నాయి. నెలలు నిండక ముందే ప్రసవించిందో లేక, అడ్డదారిలో తల్లి అవుతున్నందుకు భయపడిందో ఏమో ఇలా చెత్త కుప్ప పాలు చేసేందుకు చేతులెట్లా వచ్చె అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అనగనగా ఏడు ఊర్ల గవి
ఏడు ఊర్ల గవి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఏడు ఊర్ల జనాలు పట్టే విశాలమైన చీకటి గుహ అది. లోనికి వెళ్లడానికి చిన్న మార్గం. లోపల శివుడు,బసవేశ్వరుడి విగ్రహాలు. శివుడికి అభిషేకం చేస్తున్నట్లుగా గుహ పైభాగం నుంచి చుక్క చుక్క నీరు పడుతుండటం.. ఎవరో పరిచినట్లుగా బండరాయి ఉండటం. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే అంతుచిక్కని మరో గుహ.. ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఆ గుహను సందర్శించాలంటే గడివేముల మండలం పైభోగుల గ్రామ సమీపంలోని కొండకు వెళ్లాల్సిందే. కర్నూలు , గడివేముల:జిల్లాలో ప్రపంచ ఖ్యాతి పొందిన బెలుం గుహలతో పాటు బేతంచెర్ల సమీపంలోని ఎర్రజాల గుహలు, ప్యాపిలి ప్రాంతంలో వాల్మీకి గుహలు సహజ సిద్ధంగా ఏర్పడి పర్యాటకులను ఎంతోగాను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇలాంటి గుహలు జిల్లాలో చాలా ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో వెలుగులోకి రావడం లేదు. ఆ కోవకు చెందినదే ఏడు ఊర్ల గుహ. గడివేముల మండలం కె. బొల్లవరం – పైబోగుల గ్రామాల మధ్యలో ఉన్న కొండల్లో ఉన్న విశాలమైన గుహకు ఎంతో చరిత్ర ఉంది. ఈ గుహను ఇప్పటికీ ఎంతో మంది సందర్శించారు. ఇక్కడ పూర్వం జనం నివసించారు అని చెప్పేందుకు స్థానికుల్లో ఓ కథనం ప్రాచుర్యంలో ఉంది. ఈ కొండ ప్రాం తంలో గని రాజ్యం ఉండేది. ఆ కాలంలో దివిటీ దొంగలు పట్టపగలే దాడులు చేసి సంపన్నులు, పేదలు అందరినీ లూటీ చేసేవారు. వారి బారి నుంచి కాపాడుకునేందుకు సమీపంలోని ఏడు గ్రామాల ప్రజలు ఈ గుహలోకి చేరుకుని కొన్నాళ్ల పాటు ఇక్కడే తలదాచుకున్నారు. దీంతో ఈ గుహకు ఏడు ఊర్ల గవిగా పేరొందింది. విభూదమ్మతో వెలుగులోకి.. గని గ్రామానికి చెందిన విభూదమ్మ అవ్వను ప్రజలు మహిమాన్వితురాలిగా కొలిచారు. ఈమె తరచూ ఏడు ఊర్ల గవికి వెళుతూ ఉండేది. ఆ గుహలోనే నెలల తరబడి ఏమీ తినకుండా ధ్యానం చేస్తూ గడిపేది. గ్రామస్తులను ఆహ్వానిస్తూ అక్కడ పూజలు నిర్వహించేది. ఈమె మృతి చెందిన తర్వాత గని గ్రామంలో సమాధి చేసి పూజలు చేస్తున్నారు. అలాగే గని గ్రామానికి చెందిన యోగీశ్వరులు కూడా ఇక్కడే ధ్యానం చేసేవారు. చుట్టు పక్కల కొండల్లో ఎక్కడ చూసిన చుక్క నీరు దొరకదు. అయితే గుహలోని శివుని విగ్రహంపై మాత్రం చుక్క చుక్క నీరు పడుతుండటం విశేషం. ఏడాది పొడవునా ఆ ధార అలానే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఏడు ఊర్ల గవితో పాటు లోపల మరొక గుహ ఉందని స్థానికులు చెబుతున్నారు. పెద్దదైన శివుని విగ్రహం, నీరు కాలువ రూపంలో పారుతుందని, ఈ నీరే పక్కనే ఉన్న ప్రసిద్ధ క్షేత్రం భోగేశ్వరస్వామి దేవాలయం కోనేరులోని నందినోటి నుంచి బయటకు వస్తుందని, ఈ కాలువలో జారవిడిచిన పిల్లనగోవి భోగేశ్వరంలో తేలిందని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈ గుహ దారికి ఇరువైపులా అక్కడక్కడా దీపపు చెమ్మలు కనిపించాయని, అంటే ఈ దారి గుండా తీరం ఉంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎలా వెళ్లాలి ? కర్నూలు నుంచి 45 కిలో మీటర్ల దూరంలో మండల కేంద్రం గడివేముల పరిధిలోని కె.బొల్లవరం, పైభోగుల గ్రామాల సరిహద్దుల్లో కొండల మధ్య ఈ గుహ ఉంది. గడివేముల నుంచి కె.బొల్లవరానికి చేరుకుంటే అక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే గుహల వద్దకు చేరుకోవచ్చు. కార్తీకాల్లో పూజలు గుహ లోపల శివుడు, నంది విగ్రహాలు ఉండటంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కార్తీకాలలో ఇక్కడ ఘనంగా పూజలు నిర్వహిస్తారు. ఇక్కడే వన భోజనాలు చేస్తారు. కనీస వసతులు, రహదారి లేకున్నా పదుల సంఖ్యలో కుటుంబాలు ఎడ్ల బండ్లపై వచ్చి పండుగ చేసుకుంటారు. అటు పర్యాటకానికి... ఇటు ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధే చెందే అవకాశాలు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గుహ అద్భుతం గుహ ఎంతో అద్భుతంగా ఉన్నా అధికారులు పట్టించు కోవడం లేదు. ఇక్కడికి రావడానికి సరైనదారి లేదు. ఏటా కార్తీకాలను ఘనంగా చేస్తాం. ఏడు ఊర్ల గవి తర్వాత ఉన్న ఇంకో గుహను చూడటానికి ప్రయత్నించాం కానీ సాధ్యపడ లేదు. లోపల చూసివచ్చినోడు మరుజన్మ ఎత్తినట్టేరా అని మా గ్రామ పెద్దలు అనేవారు. ప్రభుత్వం పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. గుహలో విద్యుద్దీపాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. – చాకలి పుల్లయ్య, కె. బొల్లవరం గ్రామం సందర్శన సాహసమే ఏడు ఊర్ల గుహ మా పొలాలకు దగ్గర్లోనే ఉంది. గుహ దగ్గరికి వెళ్లడానికి దారి మా పొలాల గుండా మేమే ఏర్పరచుకున్నాం. ఒక సాధువుతో పాటు చిన్నప్పుడు మా సావాసాగాళ్లతో కలసి లోపలి గుహదారి వెంట పాక్కుంటూ చాలా దూరం వెళ్లాం. కేవలం ఒక మనిషి పాకడానికి మాత్రమే దారి ఉంటుంది. లోపల పెద్ద పెద్ద గుండ్రాళ్ల సందు నుంచి వెళుతూ ఉండాలి. ఎంత దూరం వెళ్లినా ఏం అంతుచిక్కగా వెనుదిరిగాం. గుహలో ఏం ఉందో మా పెద్దోల్ల మాటల్లో తప్ప మేం చూడలేకపోయాం. కానీ ఆ ఆశ మాత్రం అలాగే ఉంది. ఇప్పటికీ నీళ్లకోసం బయటి గుహలోకి వెళ్తూ ఉంటాం. –సత్యాలు, పైబోగుల గ్రామం నీటి ధార విచిత్రం మేం గొర్రెలు కాసేటపుడు నీటి కోసం గుహలోపలికి వెళ్లి వచ్చే వాళ్లం. ఈ కొండ ప్రాంతంలో ఎక్కడా చుక్కనీరు దొరకక పోయినా ఈ గుహలో స్వచ్ఛమైన నీరు దొరకడం విచిత్రం. మేము వయసులో ఉన్నప్పుడు లోపలి గుహలో ఏం ఉందో చూడాలని అందరం ప్రయత్నించినోళ్లమే. విభూదమ్మ అవ్వ అక్కడే ఒంటరిగా నెలల తరబడి ఉండేది. –వెంకటయ్య, కె.బొల్లవరం అభివృద్ధికి కృషి చేస్తాం ఏడు ఊర్ల గవి ప్రాంతం మా దృష్టిలో ఉంది. జిల్లాలో ఇటువంటివి ఇంకా అనేకం వెలుగులోకి తేవాలి. ఇందుకు పలు ప్రభుత్వ శాఖల సహకారం అవసరం. దీంతో కొంత జాప్యమయ్యే అవకాశం ఉంది. స్థానికుల సహాయ సహకారాలు ఉంటేనే మేము ఏదైనా చేయగలం. త్వరలో ఆ ప్రాంతాన్ని సందర్శించి గృహ అభివృద్ధికి గ్రామస్తులతో చర్చిస్తాం. – బి.వెంకటేశ్వర్లు, జిల్లా పర్యాటక అధికారి -
ప్రమాదపు అంచున పాఠశాల
సాక్షి,బేతంచెర్ల : కర్నూలు జిల్లా బేతంచెర్ల పట్టణానికి సమీపాన ఉన్న అయ్యలచెర్వు ప్రాథమిక పాఠశాల పరిసరాలు ప్రమాదకరంగా ఉన్నాయి. ఈ పాఠశాలలో సుమారు 158 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ముఖ్యంగా 15 సంవత్సరాల నుంచి పరిశ్రమల నుంచి వచ్చే నాపరాయి వేస్టేజీ, ఒండ్రు మట్టిని పాఠశాల వెనక భాగాన తరలించి, అక్కడే డంప్ చేయడంతో.. ఆ ప్రాంతం పెద్ద కొండలా కనిపిస్తోంది. ఎప్పుడైనా వర్షాలు ఎక్కువై నాపరాయి వేస్టేజీ కొండ కూలితే పాఠశాలపై పడే అవకాశం ఉంది. దానికితోడు, ఆ వేస్టేజీ రాళ్ల కింద ఉండే ఒండ్రుమట్టి పాఠశాల ఆవరణలోకి వచ్చి అసౌకర్యంగా దర్శనమిస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు చొరవ చూపి, నాపరాళ్లు, ఒండ్రుమట్టి వేస్టేజీని వేరే ప్రాంతానికి తరలించి, పాఠశాల ఆవరణాన్ని విద్యార్థులకు సౌకర్యంగా మార్చాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
తపాలా ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి
బేతంచెర్ల : గ్రామీణ తపాలా ఉద్యోగుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని ఆ సంఘం నాయకులు చల్లా వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు అన్నారు. శనివారం స్థానిక పోస్టాఫీసు వద్ద తపాలా ఉద్యోగుల సమ్మె కొనసాగింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ, మండల, జిల్లాస్థాయిలో తపాల సేవలు స్తంభించిపోయినా కేంద్ర ప్రభుత్వం స్పందిచకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి తపాలా ఉద్యోగుల సమస్యలతో పాటు, కమలేశ్‌చంద్ర కమిటీ సిఫారసులను వెంటనే అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో తపాలా ఉద్యోగులు విజయ్‌కుమార్, రమేశ్, మధు శివరామయ్య, ఖలీల్, రంగమ్మ, రామలక్షమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ప్రియుడు అనుకొని.. కొడుకుని నరికాడు
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానించిన భర్త.. ప్రియుడు అనుకుని కన్నకొడుకుపైనే గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటన కర్నూల్ జిల్లా బేతంచెర్ల మండలంలోని గుత్‌పల్లెలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన సోమన్న రామలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని సోమన్న అనుమానిస్తుండేవాడు. దీంతో దంపతులకు తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున పీకల దాకా మద్యం సేవించిన సోమన్న ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో తన భార్య ప్రియుడు ఇంట్లో ఉన్నాడని భావించి బెడ్‌పై పడుకుని ఉన్న పెద్ద కొడుకు పరుశురామ్(14)పై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో పరుశురామ్‌కు తీవ్ర గాయాలవడంతో బేతంచెర్లకు తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడుని కర్నూలుకు తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు సోమన్నపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
ఆటో బోల్తా- ఒకరు మృతి
– ముగ్గురికి తీవ్రగాయాలు బేతంచెర్ల: ఆటో బోల్తా పడిన ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందగా, మరో ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బేతంచెర్ల సమీపంలో గురువారం చోటు చేసుకుంది.ఽ సీతారామపురం గ్రామం నుంచి ఆరుగురు ప్రయాణికులతో బయలుదేరిన ఆటో బేతంచెర్ల సమీపంలోని అయ్యల చెరువు వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సీతారామాపురం గ్రామానికి చెందిన తిమ్మయ్యతో పాటు, బాల నాగమ్మ, బేతంచెర్ల జంగాల పేటకు చెందిన బాలమ్మ, సుంకమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బేతంచెర్ల ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే తిమ్మయ్య(50) మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాల నాగమ్మ, సుంకమ్మ, బాలమ్మను మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ తిరుపాలు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లెకు తరలించారు. -
గుప్త నిధుల దొంగలు అరెస్టు
బేతంచెర్ల (కర్నూలు జిల్లా): బేతంచెర్ల మండలపరిధిలోని యం పేండేకల్లు గ్రామ సమీపాన ఉన్న దుర్గమ్మ చెర్వు దగ్గర ఉన్న అమ్మవారి విగ్రహం ముందు భాగన గుప్త నిధుల కోసం ఈనెల 26 వతేదిన తవ్వకాలు చేపట్టిన నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ సుబ్రమణ్యం మంగళవారం వెల్లడించారు. వివరాల మేరకు మండలపరిధిలోని యం పేండేకల్లు గ్రామ సమీపాన ఉన్న దుర్గమ్మ చెర్వు విగ్రహం ముందు భాగాన గుప్త నిధులు ఉన్నాయన్న సమాచారం మేరకు బేతంచెర్లకు చెందిన పాపసాని తిరుమలేశ్వర్‌రెడ్డి, ఈడిగ వేంకటేశ్వరగౌడు, సూరిబాబు,అయ్యల చెర్వుకు చెందిన శాలు, కర్నూలు గణేష్ నగర్‌కు చెందిన పింజరి నబిసాహేబ్, పొలా వెంకటస్వామి తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఈనెల 26 వ తేదిన ద్విచక్రవాహనాలపై సంఘటన స్థలానికి చేరుకొని క్షుద్ర పూజలు నిర్వహించి తవ్వకాలు చేపట్టారు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటన స్థలానికి వెల్లగా గుప్త నిధుల తవ్వకాలు చేపట్టిన దొంగలు ద్విచక్రవాహనాలు వదిలివేసి పారిపోయారు. గ్రామ వీఆర్వో మద్ది లేటిస్వామి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టగా మంగళవారం కొలుములపల్లె రహదారిలోని నీల్ల ట్యాంకు వద్దపాపసాని తిరుమలేశ్వర్‌రెడ్డి, ఈడిగ వేంకటేశ్వరగౌడు, సూరిబాబు,అయ్యల చెర్వుకు చెందిన శాలు, కర్నూలు పింజరి నబిసాహేబ్, పొలా వెంకటస్వామి లు అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో ఇద్దరు పరారిలో ఉన్నట్లు తెలిపారు. వీరంతా అక్షయగోల్డ్ స్కీములో నష్ట పోయి గుప్త నిధుల ద్వార నష్టాలను పూడ్చుకోవచ్చని అయ్యలచెర్వు కు చెందిన శాలు సలహా మేరకు తవ్వకాలకు పాల్పడ్డారని సీఐ సుబ్రమణ్యం తెలిపారు.కార్యక్రమంలో ఎస్ఐ హనుమంత్‌రెడ్డి, కానిస్టేబుల్ జనార్థన్,రమణ తదితరులు పాల్గొన్నారు. -
బడుగు రైతుపై పోలీసుల ప్రతాపం
బేతంచెర్ల (కర్నూలు) : ఓ వ్యక్తి పోలీసు దెబ్బలకు తాళలేక తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం రుద్రవరంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడి తల్లి నాగమ్మ, భార్య పెద్ద లక్ష్మీదేవి తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రవరం గ్రామానికి చెందిన రైతు తలారి పెద్ద మద్దిలేటి సోమవారం రాత్రి మద్యం తాగి ఇంటి ఆవరణలో అరుస్తున్నాడు. అదే సమయంలో గ్రామంలో పికెట్ నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులు అతడిని గ్రామంలోని ఆలయం వద్దకు తీసుకెళ్లి విపరీతంగా కొట్టారు. కదల్లేనిస్థితిలో ఉన్న పెద్ద మద్దిలేటిని కుటుంబసభ్యులు మంగళవారం ఉదయం ఇంటికి తీసుకెళ్లారు. అయితే పోలీసులు మళ్లీ వెళ్లి బేతంచెర్లకు రావాలని బాధితుడికి హుకుం జారీ చేశారు. తీవ్రంగా భయపడిన అతడు ఫిట్స్‌తో పడిపోయాడు. దీంతో 108 వాహనంలో బేతంచెర్ల ఆస్పత్రికి, అనంతరం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తన భర్తకు ఇంతకుమునుపు ఎప్పుడూ ఫిట్స్ రాలేదని, పోలీసుల దెబ్బలకు భయపడి ఫిట్స్ వచ్చాయని భార్య అంటోంది. ఈ విషయమై సీఐ సుబ్రమణ్యంను వివరణ కోరగా గ్రామంలో జరిగిన ఘటన తీరుపై విచారిస్తున్నామన్నారు. -
పిడుగుపాటుతో 20 గొర్రెలు మృతి
బేతంచర్ల : కర్నూలు జిల్లా బేతంచర్ల మండలంలోని భూగానపల్లిలో పిడుగుపాటుకు 20 గొర్రెలు మృతి చెందాయి. బనగానపల్లి మండలం నందవరం గ్రామానికి చెందిన కొందరు గొర్రెలను తీసుకుని భూగానపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో గడ్డి మేపేందుకు వెళ్లారు. శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షంతోపాటు పిడుగు పడడంతో 20 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. -
కారు, లారీ ఢీ: ఇద్దరికి గాయాలు
బేతంచెర్ల(కర్నూలు జిల్లా): వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి కారును ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం గొల్లగుట్ట గ్రామ సమీపంలో జరిగింది. వివరాలు.. మైనర్ ఇరిగేషన్ జేఈ, మరో వ్యక్తితో కలిసి కారులో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం 108లో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తహశీల్దార్‌కు రూ.10 వేల జరిమానా
బేతంచర్ల (కర్నూలు) : బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఓ తహశీల్దార్‌కు రూ.10 వేల జరిమానా విధిస్తూ రాష్ట్ర హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే... కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం ముద్దనూరు గ్రామానికి చెందిన ఎన్.రాధమ్మ అనే మహిళ... తహశీల్దార్ రామకృష్ణుడు వేధింపులపై హైకోర్టును ఆశ్రయించగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. ముద్దనూరు గ్రామానికి చెందిన సర్వే నెంబర్లు 688, 528బి లలో 4.2 ఎకరాల భూమికి రాధమ్మ యజమానురాలు. అయితే ఈ భూమితో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని, అక్రమంగా సాగు చేస్తోందంటూ తహశీల్దార్ వేధింపులకు దిగడంతోపాటు కేసు పెట్టించారు. దీంతో బాధితురాలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు.. తహశీల్దార్ రామకృష్ణుడు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని పేర్కొంటూ రూ.10 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. -
బేతంచర్లలో భారీ పేలుడు పదార్థాలు స్వాధీనం
కర్నూలు: కర్నూలు జిల్లాలో భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న పేలుడు పదార్థాలను మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బేతంచర్ల పట్టణంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా టాటాసుమోలో తరలిస్తున్న 5 వేల డెటోనెటర్లు, 1249 ఐడీఎల్ పవర్ జిల్టిన్స్టిక్లు, 500 కేజీల అమ్మోనియాను పోలీసులు స్వాధీనం చేసుకున్నరు. అనంతరం ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ పేలుడు పదార్థాలను కర్నూలు నుంచి నొసంకు తరలిస్తున్నట్లు నిందితులు పోలీసులను తెలిపారు. విచారణ కొనసాగుతుంది.