వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి కారును ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
బేతంచెర్ల(కర్నూలు జిల్లా): వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి కారును ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం గొల్లగుట్ట గ్రామ సమీపంలో జరిగింది. వివరాలు.. మైనర్ ఇరిగేషన్ జేఈ, మరో వ్యక్తితో కలిసి కారులో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది.
దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం 108లో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.