kurnool hospital
-
వైద్యం ఇక ‘సూపర్’
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పాతికేళ్ల క్రితం సూపర్‌స్పెషాలిటీ కోర్సులు మంజూరైనా భవనం లేక ఎన్నో అవస్థలు. ఆ సమస్య 2002లో తీరింది. ‘సూపర్’ విభాగాలున్నా ఎండీ, ఎంసీహెచ్ కోర్సులు లేని లోటు ఇన్నాళ్లకు తీరింది. ఇటీవల మూడు విభాగాలు పీజీ సీట్లు సాధించగా, తాజాగా నెఫ్రాలజీ విభాగం సైతం ఆ జాబితాలో చేరింది. త్వరలో మరో మూడు సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఎంసీహెచ్ కోర్సుకు అనుమతులు రానున్నాయి. దీంతో సామాన్య రోగులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వైపు చూడకుండా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనే ‘సూపర్’ వైద్యం అందనుంది. కర్నూలు మెడికల్ కాలేజీ, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (బోధనాసుపత్రి)కి 65 ఏళ్ల చరిత్ర ఉంది. అయినా ఇప్పటికీ సూపర్‌స్పెషాలిటీ కోర్సులు ఇక్కడ ప్రారంభం కాలేదు. ఆరు జిల్లాలకు పెద్ద దిక్కుగా మారి, రోజూ వేలాది మందికి చికిత్సను అందించే ఈ ఆసుపత్రిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు గత పాలకులు విముఖత చూపారు. చెప్పుకోవడానికి అవసరమైన సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఉన్నాయి. అలాగే సమయం, శ్రమ తెలియకుండా పనిచేసే వైద్యులు ఉన్నారు. కానీ అవసరమైన మౌలిక సదుపాయాలు, సిబ్బందిని మంజూరు చేయడంలో గత పాలకులు తగిన శ్రద్ధ చూపలేదు. ఫలితంగా రాయలసీమ జిల్లాల ప్రజలు మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినా, తిరిగి ఇంకా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వైపు చూడాల్సిన పరిస్థితి. సామాన్యునికి జబ్బు వస్తే ప్రైవేటుకు వెళ్లి ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్వయంగా కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ ఎస్. సంజీవకుమార్ పలుమార్లు చెబుతూ వచ్చారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు గాను ఆయన తన వంతు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా కర్నూలు బోధనాసుపత్రిలో సూపర్‌స్పెషాలిటీ విభాగాలకు పీజీ సీట్లు తెప్పించడంలో తన వంత పాత్ర పోషించారు. ఎంసీఐని సంప్రదించి, అందుకు సంబంధించిన ఫైలును ముందుకు కదలించే ప్రక్రియ చేపట్టారు. ఈ కారణంగా ఇటీవల యురాలజీ (ఎంసీహెచ్), నేడు నెఫ్రాలజీ (ఎండీ) విభాగాలకు పీజీ సీట్లు మంజూరయ్యాయి. రెండేళ్ల క్రితం కార్డియాలజీ (ఎండీ), గ్యాస్ట్రో ఎంట్రాలజి (ఎండీ) విభాగాల్లోనూ పీజీ కోర్సు మొదలైంది. ఆయా విభాగాల్లో ఏడాదికి రెండు సీట్ల చొప్పున మూడేళ్లకు ప్రస్తుతం ఆరుగురు పీజీ వైద్య విద్యార్థులు చదువుతూనే పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందిస్తున్నారు. ఉపయోగాలు ఇవీ.. ఆసుపత్రిలోని కార్డియాలజీ, కార్డియోథొరాసిక్, యురాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరి, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, పీడియాట్రిక్ సర్జరి, ప్లాస్టిక్ సర్జరి, క్యాన్సర్ విభాగాలను సూపర్‌స్పెషాలిటీ విభాగాలుగా పిలుస్తారు. ఆయా విభాగాలు దాదాపు 35 ఏళ్ల క్రితమే ఏర్పడినా ఇప్పటి వరకు వాటికి పీజీ సీట్లు మంజూరు కాలేదు. దీంతో పేదలు మెరుగైన వైద్యానికి దూరమయ్యే పరిస్థితి. నెఫ్రాలజీ, న్యూరోసర్జరి, కార్డియాలజీ, పీడియాట్రిక్ సర్జరి, ప్లాస్టిక్ సర్జరి విభాగాల్లో పడకల సంఖ్యకు మించి రెండు, మూడింతలు రోగులు చేరి చికిత్స పొందుతున్నారు. అనధికారికంగా ప్రతి విభాగంలో 40 నుంచి 100 పడకలు అధికంగా ఉంటున్నాయి. అయినా ఆయా విభాగాలకు పీజీ సీట్లు తెప్పించడంలో అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఎట్టకేలకు ఇప్పుడు ఆయా విభాగాల్లో పీజీ సీట్లు రావడం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది. దీంతో ఆయా విభాగాల్లో జూనియర్ వైద్యుల సంఖ్య ఆరుకు పెరుగుతుంది, దీంతో పాటు రోగులకు వచ్చే వ్యాధులను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన మెరుగైన, నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు వీలుంది. దీంతో పాటు వైద్య విద్యార్థులు అభ్యసించేందుకు, వారు జాతీయ, రా్రïÙ్టయ సదస్సుల్లో పరిశోధనాపత్రాలు సమరి్పంచేందుకు సైతం ఇది ఎంతో ఉపయోగపడుతుంది. పలు పరిశోధనలకు సైతం ఈ ఆసుపత్రి వేదికగా అయ్యే అవకాశం ఉంది. అన్ని రంగాల్లో అభివృద్ధి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తోందని కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ ఎస్. సంజీవకుమార్ అన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీ(బోధనాసుపత్రి)లోని నెఫ్రాలజీ విభాగానికి పీజీ సీట్లు మంజూరైన సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మనిషి తనకు వచ్చిన అనారోగ్యాన్ని బాగు చేసుకునేందుకు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకూడదన్నారు. ఇప్పటికీ సూపర్‌స్పెషాలిటీ వైద్యం కోసం హైదరాబాద్ వెళ్తున్నారని, ఇకపై అలాంటి పరిస్థితి రానీయకుండా ప్రభుత్వం కర్నూలు ఆసుపత్రిలో రూ.720 కోట్లతో నూతన భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన చేస్తోందన్నారు. అలాగే వందలాది మంది వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిని నియమిస్తోందని చెప్పారు. దాతలు సైతం కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్(సీఎస్ఆర్)లో భాగంగా ఆసుపత్రి అభివృద్ధికి విరాళాలు ఇవ్వాలని కోరారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. చంద్రశేఖర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి. నరేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు 4 సూపర్‌స్పెషాలిటీ విభాగాలకు పీజీ సీట్లు వచ్చాయని, త్వరలో న్యూరోసర్జరి, పీడియాట్రిక్ సర్జరి, ప్లాస్టిక్ సర్జరి విభాగాలకు సైతం ఎంసీహెచ్ కోర్సు రానుందన్నారు. దీనివల్ల ఆయా విభాగాలు బలోపేతం అవుతాయని, రోగులకు మరింత మెరుగైన వైద్యం అందుతుందని అన్నారు. సమావేశంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ భగవాన్, డాక్టర్ నరసింహులు, యురాలజిస్టు డాక్టర్ విక్రమసింహారెడ్డి, డాక్టర్ సీతారామయ్య, నెఫ్రాలజిస్టు డాక్టర్ పీఎన్ జిక్కి, డాక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు. -
బాబోయ్ దొంగలు..
పెద్దాస్పత్రిలోని గైనిక్ విభాగంలో కు.ని ఆపరేషన్ కోసం వచ్చిన ఓ బాలింత నుంచి గత ఫిబ్రవరిలో గుర్తుతెలియని మహిళ మాయమాటలు చెప్పి ఆమె వద్ద ఉన్న శిశువును అపహరించింది. పరిసర ప్రాంతాల్లో సీసీ టీవీ ఫుటేజ్‌లు ఏవీ పనిచేయకపోయినా ఓ వ్యక్తి అనుమానంతో గుర్తుతెలియని మహిళను వీడియో తీయడంతో కొన్ని గంటల్లోనే పోలీసులు శిశువును తల్లికి అప్పగించగలిగారు. ఆసుపత్రిలోని గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్సల వార్డులో గత గురువారం చికిత్స పొందుతున్న బొంగుల బజార్‌కు చెందిన వైఎం శ్రీనివాసులు వద్ద ఉన్న మొబైల్‌ఫోన్‌ను తస్కరించారు. శ్రీనివాసులు రాత్రి నిద్రిస్తూ తలగడ కింద సెల్‌ఫోన్ పెట్టుకున్న విషయాన్ని గుర్తించి దొంగ మరీ చోరీ చేశాడు. కర్నూలు(హాస్పిటల్): ఆసుపత్రిలో ఇలాంటి దొంగతనాలు ప్రతిరోజూ ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. చికిత్స కోసం సుదూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసాలకు ఓర్చి వచ్చిన వారి నగదు, వస్తువులు పోగొట్టుకుని తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ఆసుపత్రిలో వందల సంఖ్యలో సెక్యూరిటీ గార్డులు, సీసీ కెమెరాలు ఉన్నా దొంగతనాలు మాత్రం ఆగడం లేదు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ప్రతిరోజూ 3వేల మందికి పైగా ఓపీ రోగులు చికిత్స కోసం జిల్లాతో పాటు కడప, అనంతపురం, ప్రకాశం, మహబూబ్‌నగర్, గద్వాల, అలంపురం, బళ్లారి, రాయచూరు జిల్లాల నుంచి వస్తుంటారు. ఇన్పేషెంట్లుగా 2వేల మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటారు. రోగులకు సహాయంగా మరో 5వేల మంది ఆసుపత్రిలో తిరుగుతుంటారు. ఈ మేరకు రోజూ 10వేల మంది రోగులు, వారి సహాయకులు, మరో 2వేల మందికి పైగా వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది తిరుగుతుంటారు. ఆసుపత్రిలో 180 మంది సెక్యూరిటీ గార్డులను గత ప్రభుత్వంలో ఓ ప్రైవేటు ఏజెన్సీ నిర్వహించేది. ప్రస్తుతం ఆసుపత్రి అధికారులే సెక్యూరిటీ గార్డుల జీతభత్యాలు ఇస్తున్నారు. ప్రసూతి విభాగం, చిన్నపిల్లల విభాగాల్లో 24 మంది సెక్యూరిటీ గార్డులు, ఇద్దరు సూపర్వైజర్లు విధులు నిర్వహిస్తుంటారు. గతంలో పనిచేసిన ఏజెన్సీ సెక్యూరిటీ గార్డులకు సక్రమంగా జీతభత్యాలు ఇవ్వకపోవడంతో పలువురు ఉద్యోగాలు మానేశారు. ప్రస్తుతం ఉన్న వారి సంఖ్య ఆసుపత్రి విస్తీర్ణం రీత్యా సరిపోవడం లేదు. ఉన్న వారిలో చాలా మంది విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆసుపత్రిలోకి ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారనే కనీస వివరాలు పరిశీలించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అపరిచిత వ్యక్తులు, దొంగలు ఆసుపత్రిలో యథేచ్ఛగా తిరుగుతున్నా అడిగే నాథుడు కరువయ్యారు. రాత్రీ పగలూ ఆసుపత్రిలో తిరుగుతూ దొంగతనాలకు అనువైన వాతావరణం, వ్యక్తులను, ప్రాంతాలను గుర్తిస్తూ సులభంగా చోరీలకు పాల్పడుతున్నారు. సీసీ కెమెరాల పనితీరుఅంతంత మాత్రమే.. ఆసుపత్రిలో ప్రతి విభాగంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు నిర్వహణ ఖర్చుల కింద ప్రతి నెలా ఆసుపత్రి నుంచి నిధులు చెల్లించాల్సి ఉంది. అయితే కొన్ని నెలలుగా అధికారులు సదరు సంస్థకు నిధులు విడుదల చేయడం లేదనే ఆరోపణలున్నాయి. ఇదే సమయంలో ఆసుపత్రిలోని సీసీ కెమెరాలు సైతం పూర్తిస్థాయిలో పనిచేయడం లేదన్న విమర్శలున్నాయి. ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఆర్‌ఎంవోను నియమించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ చెప్పారు. ఈ మేరకు భద్రతను మరింత పటిష్టం చేస్తామని పేర్కొన్నారు. -
అబ్బాయి పుడితే రూ.1000, అమ్మాయి అయితే 500
‘సార్..ఈ ఆసుపత్రిలో గర్భిణులను పురుగులను చూసినట్లు చూస్తారు. వైద్యపరీక్షలు, రక్తంతో పాటు తుదకు జ్వరం మాత్రలకు కూడా బయటకే రాస్తారు. రక్తం తెప్పించినా ఎక్కించరు. పెద్ద డాక్టర్ వచ్చి తిడితే ఎక్కిస్తున్నారు. అబ్బాయి పుడితే వెయ్యి, అమ్మాయి పుడితే 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. చివరకు బండి(స్ట్రెచ్చర్) తోయడానికి రూ.50 నుంచి రూ.100 ఇవ్వాల్సిందే. లేకపోతే పేషెంట్‌ను ఈడ్చి పడేస్తారు’ అంటూ కోడుమూరు మండలం లద్దగిరి గ్రామానికి చెందిన గిడ్డయ్య.. జిల్లా కలెక్టర్ సత్యనారాయణ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కాన్పుల వార్డులో ఏళ్ల తరబడి వేళ్లూనుకున్న దుష్ట సంస్కృతి వల్ల రోగులు బేజారెత్తిపోతున్నారు. ఈ క్రమంలో మంగళవారం రోగుల కుటుంబీకులు కలెక్టర్‌ను చూడగానే ఆయన వద్దకు వెళ్లి తమ బాధను చెప్పుకున్నారు. లద్దగిరికి చెందిన గిడ్డయ్య మాట్లాడుతూ.. ‘సార్..మాకు మందులు, వైద్యపరీక్షలు, లంచాలు ఇలా అన్నింటికీ కలిపి ఇప్పటికే రూ.10 వేలు ఖర్చయ్యింది. ఇదేమని గట్టిగా మాట్లాడితే బయటకు వెళ్లగొడతారు. దీనికంటే ప్రైవేటు ఆసుపత్రులేనయం. అదే రూ.10వేలు ఖర్చు పెట్టుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆసుపత్రిని మీరైనా సరిదిద్దండయ్యా’ అంటూ వేడుకున్నాడు. తన భార్య సునీతను వారం క్రితం ఆసుపత్రిలో చేర్పించగా.. గత శుక్రవారం సిజేరియన్ ద్వారా కాన్పు చేశారని అతను తెలిపాడు. మిగిలిన వారు కూడా కలెక్టర్ వద్దకు వెళ్లి ప్రసూతి విభాగంలో వసూళ్ల బాగోతం గురించి పూసగుచ్చినట్లు చెప్పారు. దీంతో ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహించిన కలెక్టర్... ‘ఏంటిది?’ అంటూ సూపరింటెండెంట్ డాక్టర్ పి.చంద్రశేఖర్ వైపు చూశారు. ప్రతి దానికీ డబ్బే పెద్దాసుపత్రి ప్రసూతి విభాగంలో గర్భిణుల బాధలు వర్ణనాతీతం. పేరుకు కొత్త భవనమే గానీ అందులోని పాత విధానాలు మాత్రం మారలేదు. ఎప్పటిలాగే అబ్బాయి పుడితే రూ.1000, అమ్మాయి పుడితే రూ.500 ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. డబ్బులు లేవంటే ఎందుకొచ్చారంటూ దురుసుగా మాట్లాడుతున్నారు. ఆపరేషన్ థియేటర్ నుంచి బాలింతను వార్డుకు స్ట్రెచ్చర్‌పై తీసుకురావడానికి కూడా రూ.100 నుంచి రూ.200 వసూలు చేస్తున్నారు. లేదంటే పచ్చి బాలింత అని కూడా చూడకుండా నిర్దయగా బెడ్‌పై పడేస్తారు. బాలింతల దుస్తులు ఉతికేందుకు కూడా ఇక్కడ దశాబ్దాల తరబడి దందా కొనసాగుతోంది. ఒక జత దుస్తులు ఉతికినందుకు గాను రూ.200 వరకు ఇవ్వాల్సిందే. అప్పుడే జన్మించిన శిశువులను కుటుంబ సభ్యుల చేతికి ఇస్తున్నారు. వారు కూర్చునేందుకు సరైన వసతి కూడా లేదు. డెలివరీ రూమ్ వద్ద వరండాలో, అందరూ తిరిగే ప్రాంతంలో నేలపైనే అప్పుడే జన్మించిన శిశువులను ఎత్తుకుని కూర్చువాల్సి వస్తోంది. దీనివల్ల పసిపిల్లలు ఇన్ఫెక్షన్ బారిన పడతారన్న జ్ఞానం అధికారులకు, సిబ్బందికి ఉండడం లేదు. ఆరోగ్యశ్రీ ఉన్నా రూ.10 వేలకుపైగా ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల నుంచి ఈ ఆసుపత్రిలో ప్రసవాలకు కూడా ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) పథకాన్ని వర్తింపజేసింది. దీనిద్వారా గర్భిణులు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఉచితంగా వైద్యం అందుకునే వీలుంది. ఒకవేళ మందులు బయట కొనుగోలు చేసినా ఆ మొత్తాన్ని డిశ్చార్జ్ సమయంలో తిరిగి చెల్లించే వీలున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ కారణంగా ఆసుపత్రిలో చేరిన గర్భిణులు డిశ్చార్జ్ అయ్యే వరకు ఒక్కొక్కరు సాధారణ కాన్పు అయితే రూ.3 వేల దాకా, సిజేరియన్ అయితే రూ.10 వేల దాకా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. ప్రసవాలు చేసిన వైద్యులకు, సిబ్బందికి, అధికారులకు మాత్రం వైద్యసేవ కింద ప్రోత్సాహక నగదు అందుతోంది. రూ.10 వేలు ఖర్చయ్యింది మాది గద్వాలలోని అమరావతి ప్రాంతం. నా భార్య భవానిని 20 రోజుల క్రితం ప్రసూతి విభాగంలో చేర్పించా. ఏడవ నెలలో ఆడబిడ్డను ప్రసవించింది. ఈ సమయంలో మందులన్నీ బయటకే రాశారు. బీపీ తగ్గేందుకు ఇంజెక్షన్లు, రక్తకణాల కోసం రక్తానికి కూడా బయటే తెప్పించుకున్నాం. ఇప్పటి వరకు రూ.10వేలు ఖర్చు అయ్యింది. –నల్లన్న, గద్వాల -
తెల్ల కోటు.. వేసుకుంటే ఒట్టు
శుభ్రంగా డ్రెస్ వేసుకుని, నీట్‌గా షేవింగ్ చేసుకుని కర్నూలుపెద్దాసుపత్రిలో తిరిగితే చాలు రోగులు, వారి కుటుంబసభ్యులు మాకు వైద్యం చేయండని వెంటపడతారు. ఇక్కడ డాక్టర్ ఎవరో.. సాధారణ వ్యక్తి ఎవరో అర్థం గాని పరిస్థితి నెలకొంది. వైద్యుల్లో చాలా మంది డ్రెస్ కోడ్ పాటించడం లేదు. వారిని చూసి జూనియర్ వైద్యులూ తెల్లకోటు జోలికి వెళ్లరు. ఫలితంగా ఎవరు ఎవరికి వైద్యం చేస్తున్నారో అర్థం గాని పరిస్థితి. ఈ క్రమంలోనే అగంతకులు మోసాలకు పాల్పడుతున్నారు. కర్నూలు (హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 400 మంది దాకా వైద్యులు (ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు), అంతకు రెట్టింపు సంఖ్యలో జూనియర్ వైద్యులు, హౌస్ సర్జన్లు కలిసి రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఆసుపత్రికి ప్రతిరోజూ 3 వేల మంది ఓపీ రోగులు, 1500 మంది దాకా ఇన్ పేషంట్లు చికిత్స పొందుతున్నారు. అటు కేసీ కెనాల్ నుంచి ఇటు హంద్రీనది వరకు దాదాపు రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో సువిశాల ప్రాంతంలో ఏర్పాటైన ఈ బోధనాసుపత్రిలో పాత, కొత్త భవనాలు 30కి పైగా ఉన్నాయి. ఇంత పెద్ద ఆసుపత్రిలో ఎవరు, ఎక్కడ ఉంటారో, ఏ వార్డు ఎక్కడో తెలుసుకోవడం ఒక్కోసారి ఏళ్లకొద్దీ ఆసుపత్రిలో పనిచేసే వారికే సరిగ్గా అర్థం కాదు. ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ పనిచేసే వారిని గుర్తించడమూ కష్టమే. డ్రెస్ కోడ్‌కు నీళ్లొదిలారు...! సాధారణంగా ప్రతి చిన్న ఆసుపత్రిలో, ప్రైవేటు కార్యాలయాల్లో డ్రెస్ కోడ్ ఉంటుంది. కార్పొరేట్ ఆసుపత్రులు, సంస్థల్లో అయితే ఇది తప్పనిసరి. డ్రెస్ కోడ్ లేకపోతే హాజరు కూడా తీసుకోరు. వారు చేసే పనిని బట్టి దుస్తులు, ఐడీ కార్డు ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా ఉండాలి. అయితే నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఆఫ్ హాస్పిటల్(ఎన్ఏబీహెచ్) గుర్తింపు కోసం వెళ్తున్న కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో డ్రెస్ కోడ్‌కు నీళ్లొదిలారు. మెజారిటీ వైద్యులు సాధారణ వ్యక్తుల్లాగే ఆసుపత్రిలో తిరుగుతుంటారు. అలాగే రోగులకు వైద్యం అందిస్తుంటారు. వారికి ఎలాంటి డ్రెస్ కోడ్ ఉండదు. కొందరు వైద్యుల మెడలో స్టెత్ ఉండటాన్ని బట్టి వారిని డాక్టర్ అనుకోవాలి. మరికొందరైతే అసలు స్టెత్ కూడా వాడరు. సాధారణ డ్రెస్‌లో వెళ్లి రోగులను పలకరించి వైద్యం సూచించి వెళ్తుంటారు. యథా రాజా తదా ప్రజా అన్నట్లు వీరిని చూసి పీజీ వైద్య విద్యార్థులు, హౌస్సర్జన్లు సైతం అధిక శాతం డ్రెస్ కోడ్ పాటించడం లేదు. హౌస్సర్జన్లకు, పీజీ వైద్యులకు వేర్వేరుగా ఆప్రాన్(తెల్లకోటు) ఉంటుంది. కానీ వారు తెల్లకోటు వాడరు. మరికొందరైతే టీ షర్ట్ ధరించి చేతిలో స్టెత్ పట్టుకుని తిరుగుతూ వైద్యం చేస్తుండటం అత్యవసర విభాగాల్లోనూ కనిపిస్తుంది. డ్రెస్ కోడ్ పాటించాలని అటు ఉన్నతాధికారులు గానీ, ఇటు వారి చీఫ్‌లు గానీ గట్టిగా చెప్పకపోవడం గమనార్హం. దర్జాగా అపరిచిత వ్యక్తుల సంచారం ఆసుపత్రిలో పారిశుధ్య కార్మికులకు, సెక్యూరిటీ గార్డులకు వేర్వేరుగా డ్రెస్ కోడ్ పాటిస్తున్నారు. వీరితో పాటు నర్సులు, నర్సింగ్ విద్యార్థినిలు డ్రెస్ కోడ్ అమలు చేస్తున్నారు. వీరు మినహా రెగ్యులర్ వైద్యులు, ఉద్యోగులు, పారామెడికల్ సిబ్బందితో పాటు నాల్గవ తరగతి సిబ్బంది సైతం డ్రెస్ కోడ్ పాటించడం లేదు. ఈ కారణంగా ఆసుపత్రిలో ఇటీవల కాలంలో అపరిచిత వ్యక్తుల సంచారం అధికమైంది. రెండు రోజుల క్రితం ఓ అపరిచిత వ్యక్తి వైద్యునిగా చెప్పుకుంటూ నేరుగా క్యాజువాలిటీలోనే తిరిగాడు. కొందరు రోగులకు వైద్యం చేస్తున్నట్లు నటించాడు. శరీన్‌నగర్‌కు చెందిన లక్ష్మిదేవి అనే మహిళకు వైద్యం చేస్తున్నట్లు నటించి, ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసును అపహరించి ఉడాయించాడు. ఇతనే కాదు ఆసుపత్రిలో అపరిచితుల సంచారం ఇటీవల అధికమైంది. ఆసుపత్రి సిబ్బంది మాదిరిగా ఇక్కడ తిరుగుతూ రోగులు, వారి కుటుంబీకుల నుంచి అందినకాడికి దండుకుని పారిపోతున్నారు. ఆసుపత్రిలో అధిక శాతం డ్రెస్ కోడ్ ఎవరూ పాటించకపోవడంతో ఎవరు ఆసుపత్రికి చెందిన వారో ఎవరు పరాయి వ్యక్తులో రోగులకు, వారి కుటుంబీకులకు గుర్తించడం కష్టం అవుతోంది. ఫలితంగా అపరిచిత వ్యక్తుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. అన్ని విభాగాల్లో డ్రెస్ కోడ్ అమలు చేస్తాం ఎన్ఏబీహెచ్ నిబంధనల ప్రకారం ఆసుపత్రిలో ప్రతి ఒక్కరూ డ్రెస్ కోడ్ పాటించాలి. వారి వారి వృత్తి, హోదాను బట్టి డ్రెస్ ధరించాలి. దీంతో పాటు ప్రతి ఒక్కరి మెడలో గుర్తింపు కార్డు (ఐడీ కార్డు) ఉండాలి. ఈ మేరకు సోమవారం నుంచి ఆయా విభాగాల వారీగా వైద్యులతో సమావేశమై ఆదేశాలు జారీ చేయనున్నాము. –డాక్టర్ పి. చంద్రశేఖర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ -
కోట్లు మింగిన..మాయదారి ఎలుకలు
మన ఇంట్లోకి ఎలుకలు వస్తుంటే ఏం చేస్తాం.. ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటాం. ఎలుకలు, పాములు వంటివి రాకుండా అవసరమైన చర్యలు చేపడతాం. కానీ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఈ పరిస్థితి లేదు. ఎలుకలు, పాములు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. వాటి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నప్పటికీ వాటి సంఖ్య మాత్రం ఏటా పెరుగుతూనే ఉంది. ఈ పేరిట ఖర్చు చేస్తున్న కోట్లాది రూపాయల నిధులు ఎటు పోతున్నాయో, వాటిని ఏ మాయదారి ఎలుకలుమింగేస్తున్నాయో తెలియని పరిస్థితి. కర్నూలు, (హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఫెస్ట్ అండ్ రొడెంట్ కంట్రోల్ (చెదలు, ఎలుకల నియంత్రణ) బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం 2016 జూన్ నుంచి పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీస్ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థకు అప్పట్లో నెలకు రూ.5 లక్షలకు పైగా అందజేసేది. ఈ మొత్తంలో ఏటా మూడు శాతం పెరుగుదల ఉంటోంది. ఈ మేరకు ప్రస్తుతం నెలకు రూ.6 లక్షల దాకా చెల్లిస్తున్నారు. ఈ సంస్థలో ఎనిమిది మంది వర్కర్లు, ఒక సూపర్వైజర్పనిచేస్తున్నారు. వర్కర్లు ఆసుపత్రిలోని ఎలుకలు, పందికొక్కులను పట్టుకోవడం, పాములను గుర్తించి అవి దరిదాపులకు రాకుండా చేయడం, బల్లులు, బొద్దింకలు, ఈగలు, దోమలు, ఇతర క్రిమికీటకాలను నివారించడం వీరి విధి. ఇందుకోసం క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడంతో పాటు ఎలుకలు, పందికొక్కులను పట్టుకునేందుకు బోన్లు, గమ్ప్యాడ్లు పెట్టాలి. జంతు సంరక్షణ చట్టం ప్రకారం పాములను చంపకూడదు. కాబట్టి ఆసుపత్రి పరిసరాల్లో తిరిగే పాములను గుర్తించి, అవి మళ్లీ అటువైపు రాకుండా మందు చల్లాల్సి ఉంటుంది. అయితే..ఈ పనులను పూర్తి స్థాయిలో చేయకపోవడం వల్ల ఎలుకలు, పందికొక్కులు ఏటా పెరిగిపోతున్నట్లు విమర్శలున్నాయి. అలాగే పాములు పట్టేందుకు ప్రత్యేకంగా ఓ వ్యక్తిని నియమించినా..అవి కూడా ఆసుపత్రి పరిసరాల్లో యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. రూ.1.46 కోట్ల ఖర్చు ఆసుపత్రిలో 2016 జూన్ 7 నుంచి చెదలు, ఎలుకలు, పాముల నియంత్రణ పనులను పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీస్ సంస్థ ప్రారంభించింది. ఈ సంస్థకు 2016లో రూ.29,69,838, అలాగే 2017లో రూ.52,93,947లు, 2018లో రూ.63,33,697 కలిపి.. మొత్తం 31 నెలల్లో రూ.1,45,97,482 చెల్లించారు. ప్రతి సంవత్సరం నిధులు ఖర్చవుతూనే ఉన్నాయి గానీ ఎలుకలు, పందికొక్కులు, పాములు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ ఆసుపత్రి పరిసరాల్లో, వార్డుల్లో సంచరిస్తున్నాయి. ఆసుపత్రిలోని వెనుక వైపున ఉన్న ఖాళీ ప్రాంతాల్లో పదుల కొద్దీ పెద్ద పాములు సంచరిస్తున్నట్లు సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. వెనుక వైపున ముళ్లకంపలు పెరగడం, మురుగుకుంటలు ఉండటం కారణంగా క్రిమికీటకాలు అధికంగా ఉంటున్నాయి. దీనికితోడు ఇక్కడే పందులు ఆవాసం ఏర్పరచుకున్నాయి. అవి సాయంత్రం వేళల్లో వార్డుల్లోకి వచ్చేస్తున్నాయి. పూర్తిగా మార్కులు వేయడం లేదు పెస్ట్ అండ్ రొడెంట్ కంట్రోల్ చేసే సంస్థకు మొదటి నుంచి పూర్తిస్థాయిలో మార్కులు వేయడం లేదు. 96 మార్కులు వేస్తేనే వారికి పూర్తిస్థాయి నిధులు విడుదలవుతాయి. కానీ మేము ఇప్పటివరకు 74 నుంచి 94 వరకు మాత్రమే ఇచ్చాం. మొదటి కంటే ఇప్పుడు వారి పనితీరులో మార్పు వచ్చింది. ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. –డాక్టర్ భగవాన్, ఇన్చార్జ్ సూపరింటెండెంట్ -
కంటబడితే క్లిక్‌మంటోంది!
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన సీసీ కెమెరాలు అమరుస్తున్నారు. కనిపిస్తే చాలు అవి ముఖాన్నే కాదు కళ్లనూ ఫొటో తీసి, ఐరిస్‌ను ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నాయి. అంతేకాదు పోలీస్ కమాండ్ కంట్రోల్‌కు పంపి నేరగాళ్ల ఆటకట్టించడంలోనూ దోహదపడుతున్నాయి. ఫేస్ డిటెక్నినేషన్ అని పిలవబడే ఈ కెమెరాలను ఆసుపత్రిలోని క్యాజువాలిటీ వద్ద రెండు, ట్రామాకేర్, ప్రధాన ద్వారం, టీబీ సెంటర్, సూపర్‌స్పెషాలిటీ విభాగాలు, క్యాన్సర్ విభాగం, పీడియాట్రిక్, మాతాశిశు భవనాలు, పేయింగ్బ్లాక్, మెడిసిన్ విభాగాలు, మార్చురీ, ప్రాంతీయ కంటి ఆసుపత్రి తదితర ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మాట్రిక్స్ సర్విలెన్స్ అనే సంస్థ 899 కెమెరాలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ఆసుపత్రులు, మసీదులు, దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్, రైల్వేస్టేషన్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో వీటిని అమరుస్తున్నారు. ఒక్క కర్నూలు నగరంలోనే 200లకు పైగా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ప్రతిని«ధి ఎల్లరాజు తెలిపారు. కనిపిస్తే కళ్లను ఫొటో తీసి పంపిస్తుంది ఈ అత్యాధునిక కెమెరాలకు ఎదురుగా ఎవ్వరైనా వెళితే వెంటనే వారి ఫొటోలను ఏకకాలంలో తీస్తుంది. అంతేకాదు ప్రధానంగా కళ్లను, ఐరిస్‌ను ఫోకస్ చేసి ఫొటో తీసి, దానిని ఆధార్‌తో అనుసంధానం చేస్తుంది. వెంటనే సదరు వ్యక్తి వివరాలు పోలీస్ కమాండ్ కంట్రోల్‌రూంకు చేరుకుంటాయి. అనుమానిత వ్యక్తులు ఎవ్వరైనా ఇందులో ఉంటే వెంటనే పోలీసులకు సిగ్నల్ వెళ్తుంది. ఈ మేరకు నేరాలను కట్టడి చేసేందుకు వీటిని ఏర్పాటు చేసినట్లు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఇవే గాక సిగ్నల్స్ ఉన్న ప్రాంతాల్లో ఎవ్వరైనా నిబంధనలకు వ్యతిరేకంగా రాంగ్ రూట్లో వెళ్లినా, రెడ్ సిగ్నల్స్ పడ్డప్పుడు వెళ్లినా వెంటనే ఫొటో తీసి పోలీసులకు పంపిస్తుంది. వారు సదరు వాహనదారుడికి జరిమానాకు సంబంధించిన చలానా పంపించేందుకు అవకాశం ఈ కెమెరాల ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. -
కర్నూలులో మరో స్వైన్‌ఫ్లూ కేసు నమోదు
కర్నూలు: జిల్లాలో స్వైన్‌ఫ్లూ వ్యాధి విస్తరిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. తాజాగా గరువారం జిల్లాలో మరో కేసు నమోదు అయింది. కల్లూరు మండలం పర్ల గ్రామానికి చెందిన 27 సంవత్సరాల మహిళకు స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇప్పటివరకు జిల్లాలో 56 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కాగా, 15 మంది స్వైన్ ఫ్లూతో మృతి చెందారని డాక్టర్లు తెలిపారు. -
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి!
కర్నూలు, ఆదోని: ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యసేవలు నానాటికీ తీసికట్టుగా మారుతున్నాయి. ఒకవైపు సౌకర్యాల లేమి, మరోవైపు సిబ్బంది నిర్లక్ష్యం వెరసి రోగులకు శాపంగా మారుతున్నాయి. ఆదోని ప్రభుత్వాసుపత్రిలో వైద్యసిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం పోయింది. ఆస్తమాతో బాధపడుతూ మంగళవారం ఆసుపత్రిలో చేరిన శివమ్మ(40)కు సకాలంలో ఆక్సిజన్ ఇవ్వకపోవడంతో మృతిచెందింది. సిలిండర్‌లో ఆక్సిజన్ అయిపోయిందని, వెంటనే మార్చాలని డ్యూటీ నర్సు వద్ద మొరపెట్టుకున్నా స్పందించలేదని, దీనివల్లే శివమ్మ చనిపోయిందని కుటుంబ సభ్యులు వాపోయారు. మృతురాలి అన్న వీరేష్, భర్త మహాదేవ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆదోని మండలం పెద్దహరివాణంకు చెందిన శివమ్మ ఆస్తమా బాధితురాలు. మంగళవారం ఊపిరి తీసుకోవడం చాలా కష్టమైంది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆదోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఉదయం 10 గంటలసమయంలో ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షించిన వైద్యుడు ఇంజెక్షన్ ఇచ్చి.. ఫ్లూయిడ్స్ ఎక్కించాలని, ఆక్సిజన్ కూడా పెట్టాలని కేస్‌షీట్‌లో రాశారు. ఈ మేరకు డ్యూటీ నర్సు చికిత్స ప్రారంభించారు. కాసేపటి తర్వాత పేషెంట్‌కు ఊపిరాడక ఇబ్బంది పడుతుంటే కుటుంబ సభ్యులు సిలిండర్ మీటరు చూసి ఆక్సిజన్ అయిపోయిందని నిర్ధారించుకుని నర్సు వద్దకు వెళ్లి చెప్పారు. ఆక్సిజన్ అయిపోయిందో, లేదో చెప్పడానికి మీరేమైనా డాక్టర్లా? అంటూ నర్సు చీదరించుకున్నారు. వచ్చి చూడాలని ప్రాధేయపడినా పట్టించుకోలేదు. పేషెంట్ పరిస్థితి విషమిస్తుండడంతో డ్యూటీ డాక్టరు, ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఫోన్ చేయగా.. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అందరూ చూస్తుండగానే మధ్యాహ్నం రెండు గంటల సమయంలో శివమ్మ తుది శ్వాస వదిలింది. ఈమెకు భర్త, నలుగురు ఆడ కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతదేహంతో ఆందోళన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బంధువులు ఆసుపత్రి వద్ద శివమ్మ మృతదేహంతో ఆందోళనకు దిగారు. డీవైఎఫ్ఐ నాయకులు తాహెర్ అలీ, వీరేష్, తిక్కప్ప మరికొందరు మద్దతుగా పాల్గొన్నారు. గంటకు పైగా ఆందోళన నిర్వహించినా ఎవరూ స్పందించలేదు. దీంతో మృతదేహాన్ని తీసుకుని రోడ్డుపైకి వచ్చారు. అధికారులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వన్‌టౌన్ ఎస్ఐ రమేష్ వచ్చి వారితో చర్చించారు. రోడ్డుపై ఆందోళన చేయడం తగదని, ఆసుపత్రి వద్దకు వెళ్లాలని సూచించారు. ఇందుకు ఆందోళనకారులు సమ్మతించారు. తిరిగి ఆసుపత్రి వద్ద అర గంట ఆందోళన చేపట్టినా ఎవరూ పట్టించుకోకపోవడంతో మళ్లీ రోడ్డుపైకి వచ్చారు. ఈ సందర్బంగా ఎస్ఐ, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. డాక్టర్ పద్మకుమార్ వారితో చర్చించేందుకు యత్నించారు. అయితే సూపరింటెండెంట్ రావాలని డిమాండ్ చేశారు. సాయంత్రం 6.30 గంటలకు సూపరింటెండెండ్ లింగన్న వచ్చి చర్చించారు. సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యం ఉంటే విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. -
కర్నూలు పెద్దాస్పత్రిలో దారుణం
కర్నూలు(హాస్పిటల్): వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ రోగి మృతి చెందిన సంఘటన కర్నూలులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చోటు చేసుకుంది. రోగుల కేస్‌షీట్లు తారుమారు కావడంతో ఒకరికి ఇవ్వాల్సిన వైద్యం మరొకరికి అందించారు. దీంతో రోగి కోలుకోలేక మృతి చెందాడు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం రాజపురానికి చెందిన భీమన్న గత నెల 24న కర్నూలు సర్వజన వైద్యశాలలోని న్యూరో సర్జరీ వార్డులో చేరి చికిత్స పొందాడు. అదే రోజున అనంతపురం జిల్లాకు చెందిన భీమప్ప రోడ్డు ప్రమాదానికి గురై అదే వార్డులో చేరాడు. పేర్లు దాదాపు ఒకేలా ఉండటంతోపాటు వైద్యుల నిర్లక్ష్యంతో కేస్‌షీట్లు తారుమారయ్యాయి. భీమప్పకు అందించాల్సిన వైద్యాన్ని భీమన్నకు అందించారు. దీంతో భీమన్న కోలుకోలేక ఆదివారం రాత్రి మృతి చెందాడు. మృతదేహానికి పోస్టుమార్టం చేయాలని వైద్యులు చెప్పడంతో అతని కుటుంబీకులకు అనుమానం వచ్చింది. అనారోగ్యంతో చనిపోతే పోస్టుమార్టం చేస్తారా అని ఆరా తీశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సోమవారం ఆస్పత్రిలోని క్యాజువాలిటీ వద్ద భీమన్న కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. తన భర్త మరణానికి కారణం వైద్యులేనని భార్య తెలుగు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై సూపరింటెండెంట్ డాక్టర్ పి.చంద్రశేఖర్ వివరణ ఇస్తూ.. భీమప్ప ఆస్పత్రిలో చేరిన మాట వాస్తవమేనని, కానీ ఆయన వార్డులో చేరి చికిత్స తీసుకోలేదని చెప్పారు. భీమన్న పేరును పొరపాటున భీమప్పగా నమోదు చేశారన్నారు. భీమన్నకు ఇచ్చిన వైద్యంలో ఎలాంటి లోపమూ లేదన్నారు. కర్నూలు పెద్దాస్పత్రిలో దారుణం -
ఎలుకలకు రూ.60లక్షలు ఖర్చు చేసిన ఏపీ
కర్నూలు: ప్రజా సంక్షేమం కోసం రూపాయలు ఖర్చుపెట్టడానికి చేతురాని ఏపీ ప్రభుత్వం చిన్న చిన్న విషయాలకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఒక్క రోజు డిన్నర్‌కు రూ.19లక్షలు ఖర్చు చేసి విమర్శలు ఎదుర్కొన్న బాబు ప్రభుత్వం మరో సంచలనాత్మక పని చేసింది. ఏకంగా ఎలుకలు పట్టుకోవడం కోసం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. గతేడాది కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ఎలుకలు కొరకడంతో చిన్నారి మృతి చెందిన ఘటన తెలిసిందే... అయితే ఎలుకల నివారణ కోసం ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.. ఇందుకోసం ఏకంగా ఓ సంస్థతో ఒప్పందంకూడా చేసుకున్నారు. ఇందులో విశేషం ఏమీ లేదు. కాకపోతే ఖర్చు కాస్త ఎక్కువ పెట్టారు. ఎంతంటే రూ.60 లక్షలు ఖర్చుపెట్టారు. 2016 నుంచి 2017 వరకు ఆసంస్థ 300 ఎలుకలను పట్టుకుంది. అంటే ఒక్కో ఎలుకను పట్టుకోవడానికి బాబు సర్కార్ రూ.20వేలు ఖర్చు చేసింది. -
కర్నూలు ఆస్పత్రికి పైలా
అనంతపురం మెడికల్ : అనారోగ్యంతో బాధపడుతున్న తాడిపత్రి నేత పైలా నర్సింహయ్యకు మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి రెఫర్ చేశారు. దీంతో ఆయన శనివారం అనంతపురం సర్వజనాస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఓ కేసులో నిందితుడైన పైలా గత నెల 21న తాడిపత్రి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన విషయం తెలిసిందే. అయితే అనారోగ్యం ఉండడంతో అదే నెల 22న తెల్లవారుజామున సర్వజనాస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి వైద్య చికిత్సలు పొందుతున్నారు. రెండ్రోజుల క్రితం మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు రెఫర్ చేసిన వైద్యులు.. ఆ తర్వాత రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో నిర్ణయాన్ని వెనక్కుతీసుకున్నారు. ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తనకు ప్రాణహాని ఉందంటూ పైలా ఆహారం తీసుకోకుండా నిరసన వ్యక్తం చేశారు. దీంతో శుక్రవారం పలు వైద్య పరీక్షలు నిర్వహించిన ఆస్పత్రి యాజమాన్యం శనివారం కూడా కొన్ని పరీక్షలు చేసింది. జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు ఇప్పటికే పైలా ఆరోగ్యంపై నివేదికను అందజేశారు. తాజాగా శనివారం సర్జికల్ హెచ్ఓడీ డాక్టర్ రామస్వామినాయక్, సైకియాట్రి హెచ్ఓడీ డాక్టర్ యెండ్లూరి ప్రభాకర్‌తో సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ సమావేశమయ్యారు. గతంలో పైలా నర్సింహయ్య చేయించుకున్న వైద్యానికి సంబంధించిన రిపోర్టులను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పైలాకు మానసిక సమస్య కూడా ఉన్నట్లు యెండ్లూరి ధ్రువీకరించారు. ‘మల్టిపుల్’ కంప్లైంట్స్ ఉన్న నేపథ్యంలో అపెండిసైటిస్, ఛాతీలో నొప్పి, మానసిక సమస్యకు మెరుగైన వైద్యం అవసరమని నిర్ణయానికి వచ్చి కర్నూలుకు సిఫార్సు చేశారు. -
'టీడీపీ గుండాలను కఠినంగా శిక్షించాలి'
-
'టీడీపీ గుండాలను కఠినంగా శిక్షించాలి'
కర్నూలు: డోన్‌లో టీడీపీ గుండాల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రసాద్ ఆరోగ్యం విషమంగా ఉంది. దీంతో మెరుగైన చికిత్స కోసం ప్రసాద్‌ను హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. కర్నూలు ఆసుపత్రిలో కార్యకర్తలను ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరామర్శించారు. దాడికి పాల్పడిన తెలుగుదేశం పార్టీ గుండాలను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. మున్సిపల్ మార్కెట్ వేలంలో పాల్గొనేందుకు వచ్చిన వైఎస్ఆర్సీపీ వర్గీయులపై శుక్రవారం టీడీపీ నేతలు కత్తులు, ఇనుపరాడ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. -
తేలుకాటుకు గురైన మహిళ మృతి
యాడికి (తాడిపత్రి) : తేటుకాటుకు గురై కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యాడికి మండలం పిన్నేపల్లికి చెందిన లక్ష్మి (28) మృతి చెందింది. స్థానికులు తెలిపిన మేరకు... లక్ష్మి ఆదివారం సాయంత్రం పశువులకు మేత వేయడం కోసం కందిపొట్టు విదిలిస్తుండగా అందులో ఉన్న తేలు కుట్టింది. దీంతో ఆమెను 108 వాహనంలో అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. ఈమెకు రేచీకటితో బాధపడుతున్న భర్త చితంబరరెడ్డి, ఆరో తరగతి చదువుతున్న కూతురు, నాలుగో తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు. నేత్రదానం భర్త చితంబరరెడ్డి, ఆమె తరపు బంధువులు లక్ష్మి కళ్లను కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు దానం చేయడానికి సమ్మతించారు. దీంతో వారు నేత్రాలను సేకరించారు. వీటిని హైదరాబాద్‌కు పంపించి కళ్లు అవసరం అయిన వారికి అమర్చేలా చర్యలు తీసుకుంటామని వైద్యులు తెలిపారు. -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
గుత్తి రూరల్ : బ్రాహ్మణపల్లికి చెందిన యువరాజు(18) అనే యువకుడు విద్యుదాఘాతంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పాండు కుమారుడు యువరాజు అక్టోబర్ 30న ఇంట్లో విద్యుత్ తీగలకు మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతనిని కర్నూలుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. -
కర్నూలు ఆస్పత్రిలో పాము కలకలం
కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో గురువారం ఓ పాము కలకలం సృష్ట్టించింది. ఆసుపత్రి వెనుకవైపు నుంచి వచ్చిన ఓ కట్ల పాము ఎంఎం-3 వార్డులోకి చేరుకుంది. ఓ రోగి దానిని చూసి భయంతో గట్టిగా కేకలు వేశాడు. దీంతో వార్డులోని మిగతా రోగులు భయంతో ఒక్క ఉదుటున బయటకు పరుగులు తీశారు. రోగుల సహాయకులు కర్రతో ఆ పామును చంపేసిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు కొరకడంతో ఓ శిశువు మృతి చెందిన విషయం మరువక ముందే కర్నూలు ఆసుపత్రిలో పాము కనిపించడం రోగుల్లో భయాందోళన నెలకొంది. -
కారు, లారీ ఢీ: ఇద్దరికి గాయాలు
బేతంచెర్ల(కర్నూలు జిల్లా): వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి కారును ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం గొల్లగుట్ట గ్రామ సమీపంలో జరిగింది. వివరాలు.. మైనర్ ఇరిగేషన్ జేఈ, మరో వ్యక్తితో కలిసి కారులో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం 108లో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పులే ఉసురు తీశాయా నాన్నా!
పంటలు సాగు చేసేందుకు ఆ రైతు దంపతులు అప్పులు చేశారు. అప్పులు తీర్చే మార్గం లేక సతమతమయ్యారు. దిక్కుతోచని స్థితిలో ఒకరి తర్వాత మరొకరు ప్రాణం తీసుకున్నారు. బిడ్డలు మాత్రం అనాథలయ్యారు.‘ నాన్నా.. అప్పులు మీ ఉసురు తీశాయా’ అన్నట్లు ఆ బిడ్డ నాన్న మృతదేహం వైపు అమాయకంగా చూస్తుంటే అక్కడున్నవారు చలించిపోయారు. ప్రొద్దుటూరులోని కొర్రపాడు రోడ్డులో సోమవారం రాత్రి ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అమృతానగర్‌కు చెందిన ఆకుల వెంకటసుబ్బయ్య(12) మరణించాడు. తండ్రి సుధాకర్‌తో కలసి ఆటోలో ప్రయాణిస్తుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. సుబ్బయ్య ఆరోగ్య పరిస్థితి విషమించండతో కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో కర్నూలు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోని బేతంచెర్ల వద్దకు వెళ్లగానే వెంకటసుబ్బయ్య తుదిశ్వాస వదిలాడు. మంగళవారం తెల్లవారుజామున బాలుడి మృతదేహాన్ని ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. పిల్లలంటే ప్రాణం.. అమృతానగర్‌కు చెందిన సుధాకర్, లక్ష్మిదేవి దంపతులకు వెంకటసుబ్బయ్య, శివలక్ష్మి అనే ఇద్దరు పిల్లలున్నారు. వెంకటసుబ్బయ్య అనిబిసెంట్ మునిసిపల్ హైస్కూల్లో ఆరో తరగతి చదువుతుండగా, కుమార్తె శివలక్ష్మి మూడో తరగతి చదువుకుంటోంది. బేల్దారి పని చేసుకునే సుధాకర్ పిల్లల్ని బాగా చదివించాలనుకున్నాడు. వారికి పిల్లలంటే ప్రాణం. మధ్య తరగతి కుటుంబం అయినా పిల్లలు అడిగింది కాదనకుండా ఇప్పించే వాళ్లు. సోమవారం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన వెంకటసుబ్బయ్య సంక్రాంతి పండుగకు బట్టలు కావాలంటూ తల్లి లక్ష్మీదేవిని అడిగాడు. ఇంకా పండుగ వారం ఉంది కదరా.. రెండు రోజులు ఉండి తెచ్చుకుందువులే అని ఆమె కుమారునితో చెప్పింది. అయినా అతను వినిపించుకోకుండా ఇప్పుడే ఇప్పించాలంటూ ఏడ్వడం మొదలు పెట్టాడు. అంతలోనే బేల్దారి పనికి వెళ్లొచ్చిన తండ్రి సుధాకర్ ను అడిగాడు. ఎంత చెప్పినా వినిపించుకునే పరిస్థితి లేకపోవడంతో సాయంత్రం కుమారుడ్ని వెంటబెట్టుకుని ప్రొద్దుటూరుకు వెళ్లాడు. కుమారుని కోరిక మేరకు అతనికి నచ్చిన రెండు జతల బట్టలు ఇప్పించాడు. అప్పటికే రాత్రి ఎనిమిది గంటలైంది. పాత బస్టాండ్‌కు రాగానే అమృతానగర్‌కు వెళ్లేందుకు ఆటో సిద్ధంగా ఉండటంతో తండ్రీకొడుకులు ఆటో ఎక్కారు. వారు ప్రయాణిస్తున్న ఆటో కొద్ది దూరం వెళ్లగానే ట్రాక్టర్ ఢీ కొంది. ఈ ప్రమాదంలో కుడివైపున కూర్చున్న వెంకటసుబ్బయ్యకు ట్రాక్టర్ నేరుగా తగలడంతో తలకు బలమైన గాయం అయింది. కుమారుడు రక్తపు మడుగులో ఉండటాన్ని చూసిన తండ్రి సుధాకర్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించగా ఆంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో అతను మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బంధువులు, అమృతానగర్ వాసులు మంగళవారం ఉదయం జిల్లా ఆస్పత్రి వద్దకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. బాలుడిని చూసి వారంతా చలించిపోయారు. కుమార్తె శివలక్ష్మిని దగ్గరకు తీసుకొన్న లక్ష్మీదేవి బోరున విలపించసాగింది. పోస్టుమార్టం అనంతరం బాలుడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందచేశారు. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.