
ఎలుకలకు రూ.60లక్షలు ఖర్చు చేసిన ఏపీ
కర్నూలు: ప్రజా సంక్షేమం కోసం రూపాయలు ఖర్చుపెట్టడానికి చేతురాని ఏపీ ప్రభుత్వం చిన్న చిన్న విషయాలకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఒక్క రోజు డిన్నర్‌కు రూ.19లక్షలు ఖర్చు చేసి విమర్శలు ఎదుర్కొన్న బాబు ప్రభుత్వం మరో సంచలనాత్మక పని చేసింది. ఏకంగా ఎలుకలు పట్టుకోవడం కోసం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. గతేడాది కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ఎలుకలు కొరకడంతో చిన్నారి మృతి చెందిన ఘటన తెలిసిందే...
అయితే ఎలుకల నివారణ కోసం ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.. ఇందుకోసం ఏకంగా ఓ సంస్థతో ఒప్పందంకూడా చేసుకున్నారు. ఇందులో విశేషం ఏమీ లేదు. కాకపోతే ఖర్చు కాస్త ఎక్కువ పెట్టారు. ఎంతంటే రూ.60 లక్షలు ఖర్చుపెట్టారు. 2016 నుంచి 2017 వరకు ఆసంస్థ 300 ఎలుకలను పట్టుకుంది. అంటే ఒక్కో ఎలుకను పట్టుకోవడానికి బాబు సర్కార్ రూ.20వేలు ఖర్చు చేసింది.