గుత్తి రూరల్ : బ్రాహ్మణపల్లికి చెందిన యువరాజు(18) అనే యువకుడు విద్యుదాఘాతంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పాండు కుమారుడు యువరాజు అక్టోబర్ 30న ఇంట్లో విద్యుత్ తీగలకు మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతనిని కర్నూలుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.