'టీడీపీ గుండాలను కఠినంగా శిక్షించాలి'
కర్నూలు: డోన్‌లో టీడీపీ గుండాల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రసాద్ ఆరోగ్యం విషమంగా ఉంది. దీంతో మెరుగైన చికిత్స కోసం ప్రసాద్‌ను హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. కర్నూలు ఆసుపత్రిలో కార్యకర్తలను ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరామర్శించారు. దాడికి పాల్పడిన తెలుగుదేశం పార్టీ గుండాలను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
మున్సిపల్ మార్కెట్ వేలంలో పాల్గొనేందుకు వచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ వర్గీయులపై శుక్రవారం టీడీపీ నేతలు కత్తులు, ఇనుపరాడ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.