dhone
-
బుగ్గన వస్తున్నారని తెలిసి... ఇదేం చిల్లర రాజకీయం
-
డోన్‌లో మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహం
సాక్షి, నంద్యాల జిల్లా: డోన్‌లో మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వాకింగ్ కోసం మున్సిపల్ పార్క్‌కు వస్తున్నారనే సమాచారంతో గేటుకు తాళాలు వేశారు. వాకింగ్ పార్క్‌లో బుగ్గనను సిబ్బంది అడ్డుకున్నారు. మున్సిపల్ చైర్మన్ ఫోన్ చేస్తే కూడా మున్సిపల్ కమిషనర్ స్పందించలేదు.మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంతో రోడ్డుపైనే మాజీ మంత్రి వాకింగ్ చేశారు. నిత్యం వందలాది మంది వాకింగ్ చేసే పార్కుకు తాళం వేయడంతో వాకింగ్‌కి వచ్చిన వారు సైతం వెనుదిరిగారు. వాకింగ్ పార్కు తాళం వేయడంపై స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన పార్క్‌కు తాళం వేస్తారా అంటూ బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. -
అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...
-
ఎన్నికల ప్రచారంలో తన్నుకున్న టీడీపీ నేతలు
-
చిన్న విషయానికి చిల్లర గొడవ.. కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలు
-
రాళ్ల దాడులు.. పిడిగుద్దులు.. తమ్ముళ్ల డిష్యుం.. డిష్యుం!
సాక్షి, నంద్యాల జిల్లా: డోన్‌లో కూటమి నేతలు కొట్లాటకు దిగారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. కోట్ల సూర్యప్రకాశ్‌కు అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. చంద్రబాబు వచ్చి సర్ది చెప్పి పోయినా సొంత క్యాడర్ సహకరించలేదు.తాజాగా ప్యాపిలి మండలం పెద్దపూదెళ్లలో తెలుగు తమ్ముళ్లు దారుణంగా తన్నుకున్నారు. 'కోట్ల' ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాన్వాయ్ ఎవరెక్కాలనేదానిపై ఘర్షణ మొదలైంది.రాళ్లదాడులు, పిడిగుద్దులతో రెండు వర్గాలు విరుచుకుపడ్డాయి. సమన్వయం పాటించాలని కోట్ల సూర్యప్రకాశ్ కోరినా తెలుగు తమ్ముళ్లు లెక్కచేయలేదు. ‘కోట్ల’ చెప్పినా ఓ వర్గం మరింత రెచ్చిపోయి రాళ్లు రువ్వి దాడులకు దిగింది.ముందే ప్లాన్ చేసి టీడీపీలోని ఓ వర్గం దాడికి పురిగొల్పినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు డోన్ బహిరంగ సభలో పదే పదే సుబ్బారెడ్డి పేరు పలకడంపైనా ఓ వర్గం తెలుగు తమ్ముళ్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 'కోట్ల' కన్నా ఎక్కువ ప్రాధాన్యతనివ్వడంపై కోట్ల వర్గం కూడా అసంతృప్తితో ఉంది.టీడీపీకి వలసలుగా వెళ్లిన వారు కూడా ఎందుకొచ్చాం రా బాబూ అనుకునేలా కూటమిలో పరిస్థితి నెలకొంది. తమ్ముళ్ల బాహాబాహీతో తెలుగుదేశం బండారం బయటపడింది. -
డోన్ లో టీడీపీకి బిగ్ షాక్..
-
నీటి బొట్టు.. విలువ తెలుసు: సీఎం జగన్
రాష్ట్రంలో నాలుగేళ్లలో సాకారమైన మార్పులు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందా? లేదా? అని మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. ఆపై ఓట్లు వేసేందుకు ఎన్నికల్లో అడుగులు వేయాలి. గతంలోనూ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్! మారిందల్లా సీఎం మాత్రమే. కానీ అప్పుల రేటు గతంలో కంటే ఇప్పుడు చాలా తక్కువ. మీ బిడ్డ వచ్చాక అక్క చెల్లెమ్మల ఖాతాల్లో ఏకంగా రూ.2.35 లక్షల కోట్లు జమ చేశాడు. చంద్రబాబు హయాంలో ఇది ఎందుకు జరగలేదు? నాడు జన్మభూమి కమిటీల నుంచి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడి దాకా దోచుకోవడం, పంచుకోవడమే! మన పాలనలో ప్రతి అడుగు మంచి కోసమే. విద్య, వైద్యంతోపాటు మహిళా సాధికారత దిశగా వేగంగా అడుగులు వేశాం. సామాజిక న్యాయంలో మన ప్రభుత్వానికి ఎవరూ సాటి లేరు. మీకు మంచి జరిగి ఉంటే సైనికుల్లా మీ బిడ్డకు తోడుగా నిలబడి ప్రోత్సహించండి. దేవుడి దయతో మీకు ఇంకా మంచి చేసే పరిస్థితి రావాలని కోరుకుంటున్నా. – సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, కర్నూలు: వినాయక చవితి సందర్భంగా కర్నూలు, నంద్యాల జిల్లాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విలువైన వరాలను అందించారు. 2 జిల్లాల్లో 77 చెరువులకు హంద్రీ–నీవా నీటితోపాటు తాగునీటిని కూడా అందించే ప్రాజెక్టును సీఎం మంగళవారం ప్రారంభించారు. పత్తి కొండ నియోజకవర్గం లక్కసాగరం సమీపంలోని ఆలంకొండ పంప్‌హౌస్‌ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించి నీటిని విడుదల చేశారు. అక్కడ పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం డోన్‌లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. పక్కనే శ్రీశైలం ఉన్నా.. ఇది నీటి విలువ తెలిసిన మనందరి ప్రభుత్వం. రాయలసీమ నీటి కష్టాలు తెలిసిన మీ బిడ్డగా శాశ్వత మార్పులు తెచ్చేందుకు నాలుగేళ్లుగా అడుగులు వేస్తున్నాం. అందులో భాగంగానే కర్నూలు, నంద్యాల జిల్లాలకు మంచి జరిగే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి మెట్ట ప్రాంతాలకు తాగు, సాగు నీటిని అందించేందుకు లక్కసాగరం వద్ద పంప్ హౌస్ ఏర్పాటు చేసి 77 చెరువులను నింపుతు న్నాం. రోజుకు 160 క్యూసెక్కుల చొప్పున 90 రోజు ల్లో 1.24 టీఎంసీల హంద్రీ–నీవా జలాలతో చెరు వులను నింపుతాం. ఆశ్చర్యమేంటంటే పక్కనే శ్రీ శైలం ఉన్నా మెట్ట ప్రాంతాలైన పత్తికొండ, డోన్‌కు సాగునీరు అందని దుస్థితి నెలకొంది. డోన్ చరిత్రలో ఇప్పటివరకూ ఒక్క ఎకరాకు కూడా నికరజలాలు లేని పరిస్థితి. ఇంత దారుణ పరిస్థితులున్నా గతంలో ఎవరూ పట్టించుకున్న పరిస్థితులు లేవు. 2019 ఎన్ని కలకు కేవలం 4–5 నెలల ముందు చంద్రబాబు ఒక జీవో ఇచ్చి టెంకాయ కొట్టారు. కనీసం పైపులు వేసేందుకు భూసేకరణ కూడా జరగలేదు. హడా వుడిగా టెంకాయలు కొట్టేందుకు మాత్రం 8 ఎకరా లు కొనుగోలు చేశారు. అలాంటి దారుణమైన మోసాలకు పాల్పడ్డారు. చంద్రబాబు మాదిరిగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హడావుడిగా పనులు చేపట్టే ప్రభుత్వం మాది కాదు. మనందరి ప్రభుత్వం ఏర్పాటయ్యాక నీటి విలువ తెలిసిన రాయలసీమ బిడ్డగా రూ.253 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన చేపట్టాం. నాలుగేళ్లలోనే ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశాం. ఈ ప్రాంతంలో 8 మండలాలు కరువుతో ఉన్నాయి. మొత్తం 10,130 ఎకరాలకు సాగునీటితోపాటు ఈ ప్రాంతంలోని గ్రామాలకు తాగునీరు అందించే పనులు పూర్తి చేశాం. ఈ ప్రాజెక్టుతో డోన్, పత్తికొండ నియోజకవ ర్గాలకు మంచి జరుగుతుంది. ఆలూరు, పాణ్యం నియోజకవర్గాలకు కూడా మేలు జరుగుతుంది. వెల్దుర్తి, కల్లూరు మండలాల్లో 22 చెరువులకు హంద్రీ–నీవా కాలువ నుంచి ఇప్పటికే పైపులైన్ కనెక్టివిటీ పూర్తయింది. ట్రైల్ రన్ చేస్తున్నాం. కృష్ణగిరి, తుగ్గలి, మద్దికెర, దేవనకొండ, పత్తికొండ మండలాల్లోని 14 చెరువులకు కూడా పైపులైన్ కనెక్టివిటీ పూర్తయి ట్రైల్ రన్ జరుగుతోంది. ప్యాపిలి, డోన్ మండలాల్లో 19 చెరువులకు పైపులైన్ పూర్తయింది. జొన్నగిరి, డోన్, తుగ్గలి మండలాల్లోని మరో 7 చెరువులకు ట్రైల్‌రన్ పూర్తయి చెరువులకు నీళ్లు ఇస్తున్నాం. డోన్ నియో జకవర్గంలో అదనంగా అవసరాన్ని బట్టి మరో 8 చెరువులకూ నీరిస్తున్నాం. మొత్తంగా 77 చెరువులకు సంబంధించి ప్రాజెక్టు పనులను పూర్తి చేశాం. గాజులదిన్నె సామర్థ్యం పెంపుతో సాగుకు భరోసా.. ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలం గాజులదిన్నె వద్ద ఉన్న సంజీవయ్యసాగర్ ప్రాజెక్టు సామర్థ్యం 4.5 టీంఎంసీలు. 24,372 ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు వర్షాధారంతో నిండాల్సిందే. కృష్ణా జలాల కేటాయింపు లేదు. పత్తికొండ నియోజకవర్గంలోని 27 గ్రామాలకు, కృష్ణగిరి మండలంలో 55 ఆవాసాలకు, గోనెగండ్ల మండలంలోని 10 ఆవాసాలకు, డోన్ మునిసిపాలిటీకి ఇది తా గునీరు అందిస్తోంది. కర్నూలు కార్పొరేషన్‌కు కూడా తాగునీటిని అందిస్తోంది. ఇన్ని రకాలుగా ఉప యోగపడే ఈ ప్రాజెక్టు సామర్థ్యాన్ని మనం వచ్చిన తర్వాత 4.5 నుంచి 5 టీఎంసీలకు పెంచాం. హంద్రీ–నీవా ప్రధాన కాలువ నుంచి తూము నిర్మించి రూ.57 కోట్లతో నీళ్లు ఇస్తున్నాం. ఆ పనులు కూడా పూర్తి చేసినందుకు గర్వపడుతున్నా. ఈ ప్రాంతానికి ఇంత ఉపయోగపడే ఈ ప్రాజెక్టుపై గతంలో ఎప్పు డూ ఎవరూ ఆలోచన చేయలేదు. ఇక్కడ వర్షాలు పడితేనే వ్యవసాయం. చెరువులున్నా నింపాలనే ఆలోచన ఎవరూ చేయలేదు. ఎన్నికల సమయంలోనే కొందరికి టెంకాయలు, జీవోలు గుర్తొస్తాయి. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన రాదు. నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ఇక్కడకు వచ్చి నప్పుడు మీ కష్టాలు చూశా. మీకు నేనున్నానని చెప్పా. మాట ప్రకారం నాలుగేళ్లలో పూర్తి చేసి ఆశీస్సుల కోసం మీ ముందు నిలబడుతున్నా. ఆ రోజు వైఎస్సార్.. ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వం రాయలసీమలో ఎంత దుర్భిక్ష పరిస్థితులున్నాయో నాకు తెలుసు. ఈ రోజు హంద్రీ–నీవా నుంచి తూ ము పెట్టి 77 గ్రామాలకు జలాలు ఎత్తిపోస్తున్నాం. ఆ ప్రాజెక్టు కట్టింది ఎవరు? అని అడుగుతున్నా. చంద్రబాబు 9 ఏళ్లు సీఎంగా ఉండి ఖర్చు చేసింది కేవ లం రూ.13 కోట్లు. దివంగత వైఎస్ రాజ శేఖరరెడ్డి సీఎం అయ్యాక రూ.6 వేల కోట్లతో హంద్రీ–నీవా కాలువ నిర్మించారు. అందువల్లే ఈ రోజు కాలువ లపై తూములు ఏర్పాటు చేసి లిఫ్ట్‌లు పె ట్టుకుంటున్నాం. రాయలసీమ సాగునీటి కష్టాల ను తీర్చేందుకు పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచారు. ప్రజల గురించి ఎవరైనా ఆలోచించారంటే అప్పుడు వైఎస్సార్ హయాంలో.. ఆ తర్వాత దేవుడి దయ, మీ అందరి దీవెన లతో ఏర్పడ్డ మీ బిడ్డ ప్రభుత్వంలోనే. పోతిరెడ్డి పాడును 80 వేల క్యూసెక్కులకు తీసుకెళ్లేలా అడు గులు పడుతున్నాయి. గత పాలకుల నిర్వాకా లను మనమంతా చూశాం. పోతిరెడ్డిపాడుకు నీళ్లు వదలా లంటే శ్రీశైలం నిండాలి. 881 అడుగులకు చేరితే త ప్ప నీళ్లు రాని పరిస్థితి. శ్రీశైలం నిండేదెప్పుడు? నిండినా ఎన్ని రోజులు నీళ్లు ఉంటాయి? తెలంగాణ ప్రాజెక్టులకు 800 అడుగుల్లోనే నీళ్లు తీసుకుంటున్నా రు. 790 అడుగులకే పవర్ జనరేషన్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమ లిఫ్ట్ గురించి ఆ లోచించాం. 800 అడుగుల్లోనే నీళ్లు తీసుకునేలా రా యలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు జరుగుతున్నాయి. ప్రకాశం కరువూ తీరుస్తాం కరువుతో అల్లాడుతున్న ప్రకాశం జిల్లా కరువు కూడా తీరుస్తాం. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితేనే నీళ్లు వస్తాయి. ఇక్కడ రెండు టన్నెళ్లు ఉన్నాయి. వైఎస్సార్ హయాంలో ఒక్కో టన్నెల్ 18 కిలోమీటర్లతో పనులు ప్రారంభించారు. ఆయన హయాంలోనే టన్నెల్–1లో 12 కిలోమీటర్లు, టన్నె ల్–2లో 8 కిలోమీటర్లు మేర పనులు జరిగా యి. ఆ తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కరు వుతో అల్లాడుతున్న ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు మీ బిడ్డ మొదటి టన్నెల్ పూర్తి చేశాడు. రెండో టన్నెల్‌ను అక్టోబర్‌లో జాతికి అంకితం చేస్తున్నాం. నాడు వెలవెల.. నేడు కళకళ బాబు హయాంలో రాయలసీమలో ఏ ప్రాజెక్టు తీసుకున్నా నీటిని పూర్తి స్థాయిలో నిల్వ చేయలేదు. గండికోటకు 27 టీఎంసీల సామర్థ్యం ఉంటే 10–12 టీంఎసీలు కూడా నిల్వ చేయలేదు. చిత్రావతి సామ ర్థ్యం 10 టీఎంసీలు కాగా 2–3 టీఎంసీలను కూడా నిల్వ చేయని దుస్థితి. బ్రహ్మంసాగర్‌కు 17 టీఎంసీల సామర్థ్యం ఉంటే నాడు నీళ్లు అందని పరిస్థితి. మీ బిడ్డ సీఎం అయ్యాక కాలువల సామర్థ్యాన్ని పెంచాం. ప్రతి ప్రాజెక్టుకు ఆర్ అండ్ ఆర్ కోసం డబ్బులిచ్చాం. దీంతో పూర్తి స్థాయిలో నీళ్లు నిల్వ చేయగలుగుతున్నాం. గాలేరు –నగరి సుజల స్రవంతిలో అవుకు రెండో టన్నెల్ పనులను పూర్తి చేసింది కూడా ఈ ప్రభుత్వమే. ఇవన్నీ మంచి మనసు పెట్టి చేసిన పనులు. గతానికి, ఇప్పటికీ తేడా గమనించాలి. ఈ ప్రభుత్వం వచ్చాక రూ.2.35 లక్షల కోట్ల ను అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. మరి నాడు బాబు ఎందుకు చేయలేకపోయారు? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడితో కలసి దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) లక్ష్యంగా వ్యవహరించారు. కళ్లెదుటే మార్పులు.. గ్రామ స్థాయిలో మీ స్కూళ్లలో గతానికి, ఇప్పటికీ మధ్య తేడాను గమనించండి. స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం వచ్చింది. బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్ ఇస్తున్నాం. ఆరో తరగతి నుంచి ఐఎఫ్బీ ప్యానెళ్లతో డిజిటల్ బోధన, 8వ తరగతిలో ట్యాబ్‌లు ఇస్తు న్నాం. వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, అభివృద్ధి చేసిన పీహెచ్సీ, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులు ఎప్పడూ చూడని విధంగా కనిపి స్తున్నాయి. 17 కొత్త మెడికల్ కాలేజీలను నిర్మిస్తు న్నాం. 53 వేల మంది డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందిని నియమించాం. ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టాం. ఉచితంగా పరీక్షలు చేసి మందులు ఇస్తు న్నాం. వ్యవసాయంలో ఆర్బీకేలు రైతన్నలను చేయి పట్టుకుని నడిపి స్తున్నాయి. ఈ– క్రాపింగ్ నుంచి పంట కొనుగోలు వరకు మంచి జరుగుతోంది. ప్రతి అడుగులోనూ మంచి చేస్తున్న మన ప్రభు త్వానికి ఆశీస్సులు అందించాలని కోరుతున్నా. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మంత్రులు గుమ్మనూరు, అంబటి, ఎంపీలు పోచా బ్రహ్మానందరెడ్డి, సంజీవ్, ఎమ్మెల్యేలు ఆర్థర్, శిల్పా రవి, కంగాటి శ్రీదేవి,రాంభూపాల్‌రెడ్డి, చక్రపాణి రెడ్డి, బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, హఫీజ్‌ఖాన్, చెన్నకేశవరెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు ఇషాక్, మధుసూదన్, రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. సుగుణాల మారాజు – బుగ్గన రాజేంద్రనాథ్, ఆర్థిక శాఖ మంత్రి ‘కరువు సీమకు పండుగ పూట బహుమానం ఇచ్చేందుకు సీఎంజగన్ వచ్చారు. కర్నూలు జిల్లా శతాబ్దాలుగా ఎన్నో కరువులు చూసింది. ఒక్క ఎకరాకూ నీటి పారుదల లేని ప్రాంతం డోన్. రెయిన్‌గన్ ద్వారా నీళ్లిస్తామని గత పాలకులు బూటకపు మా టలు చెబితే ఈ రోజు 77 చెరువులు, వంద గ్రామాలకు సాగు, తాగునీరు అందిస్తున్న ప్రభుత్వం మాది. చెరువులకు నీళ్లు ఇవ్వడంతో భూగర్భ జలాలు పెరిగి భూములు సస్యశ్యామలం కానున్నాయి. సుగుణాలన్నీ ఉన్న మారాజు మన జగన్. అ వినీతికి పాల్పడి చంద్రబాబు జైలుకు వెళితే నిరసన దీక్షలు ఏమిటి? రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన ఓ వ్యక్తి దీనికి మద్దతు ప్రకటించడం ఎంత దారుణం? ప్రజలకు చైతన్యం లేదని, పిరికి వాళ్లు కాబట్టే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ కుంభకోణాలు, కుట్రలను చట్ట సభల సాక్షిగా ప్రజలకు తెలియచేస్తాం’ -
నీటి విలువ, సీమ కష్టాలు తెలిసిన ప్రభుత్వం మనది: సీఎం జగన్
సాక్షి, నంద్యాల/డోన్: రాయలసీమ నీటి కష్టాలు నాకు తెలుసు కాబట్టే సాగునీరు, తాగు నీరు అందించే చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. నీటి విలువ, సీమ కష్టాలు తెలిసిన ప్రభుత్వం మనది అని అన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలను పట్టించుకోలేదని ప్రజలకు గుర్తు చేశారు సీఎం జగన్. కాగా, ముఖ్యమంత్రి జగన్ డోన్ సభలో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు నమ్మకం.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు. చంద్రబాబు ఉద్దేశ్యం రాష్ట్రాన్ని దోచుకోవడం. దోచుకున్నది వీళ్లతో పంచుకోవడం. అలా పంచుకుంటే ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించే ప్రసక్తే ఉండదు. ఇవన్నీ ఈనాడు రాయదు.. చూపించదు. ఒక ఆంధ్రజ్యోతి చంద్రబాబు కోసం ఢంకా భజాయిస్తుంది. ఒక టీవీ5 చంద్రబాబు ఎంత దారుణంగా పాలన చేసి బ్రహ్మండంగా చేసిందని చెబుతుంది. ఇలా దుర్మార్గమైన ఆలోచనతో చేసిందే చంద్రబాబు పాలనంతా. టీడీపీ హయంలో జరిగిదంతా.. దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం. దోచుకోవడం గ్రామస్థాయిలో జన్మభూమి కమిటీలో ప్రారంభమైతే.. చివరకు దత్తపుత్రుడి షేరింగ్‌తో ఎండ్ అవుతుంది’ సీమ కష్టాలు మీ బిడ్డకు తెలుసు.. రాయలసీమ నీటి కష్టాలు నాకు తెలుసు. కరువు జిల్లాలకు సాగు, తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నాం. కర్నూలు, నంద్యాల జిల్లాలకు మెట్ల ప్రాంతాలకు సాగు నీరు అందుతుంది. లక్కసాగరం పంప్‌హౌస్ ద్వారా 77 చెరువులకు నీరు అందుతుంది. హంద్రీనీవా ప్రధాన కాలువ నుంచి చెరవులకు నీటి కేటాయింపు జరిగింది. గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలను పట్టించుకోలేదు. ఎన్నికలకు 4 నెలలకు ముందు చంద్రబాబు జీవోలు, శంకుస్థాపనలు చేశారు. ప్రాజెక్ట్ కోసం భూమిని కూడా కొనుగోలు చేయలేదు. కేవలం టెంకాయలు కొట్టడానికి ఏదో నామ మాత్రంగా 8 ఎకరాలు కొనుగోలు చేశారు. అధికారంలోకి రాగానే ప్రాజెక్ట్‌లు పూర్తి చేశాం.. నా సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా చూశాను. అధికారంలోకి రాగానే ప్రజల కష్టాలు తీర్చేందుకు చర్యలు తీసుకున్నాను. కరువుతో అల్లాడుతున్న సీమకు మంచి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. హంద్రీనీవాను దివంగత మహానేత వైఎస్సార్ పూర్తి చేశారు. ఆ మహానేత బిడ్డ హయాంలో ప్రజలకు మంచి జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్ట్‌ల పూర్తికి చర్యలు తీసుకున్నాం. రూ. 253 కోట్లతో ప్రాజెక్ట్‌ను పూర్తి చేశాం. డోన్, పత్తికొండ నియోజకవర్గాలకు మంచి జరుగుతుంది. గత ప్రభుత్వం ప్రాజెక్ట్‌లను పట్టించుకోని పరిస్థితి ఉండేది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాయలసీమ లిఫ్ట్ పనులు చేపట్టాం. వెలుగొండ ప్రాజెక్ట్‌ను వడివడిగా పూర్తి చేస్తున్నాం. రెండో టన్నెల్ పూర్తి చేసి అక్టోబర్‌లో ప్రారంభిస్తున్నాం. కరువుతో అల్లాడుతున్న సీమకు మంచి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నది మన ప్రభుత్వం. మీ బిడ్డ ప్రభుత్వంలో తేడాను గమనించండి.. గతంలో ఇదే బడ్జెట్. అప్పటి కంటే ఇప్పుడు అప్పులు తక్కువ చేశాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గమనించండి. అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి రూ.2లక్షల35వేల కోట్లు జమ చేశాం. గత ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది?. మా ఊరిలో స్కూళ్లను, ఆసుపత్రులను గమనించండి. వైద్య, విద్య, సంక్షేమంలో మన ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. దొంగల ముఠా అబద్దాలు, మోసాలను ప్రజలు నమ్మవద్దు. ఈ ముఠా రానున్న కాలంలో మరిన్ని అబద్దాలను వడ్డిస్తుంది. మన ప్రభుత్వంలో మంచి జరిగిందా లేదా అన్నది ఆలోచించండి. మీ ఇంట్లో మంచి జరిగిందనుకుంటే మీ బిడ్డను ఆశీర్వదించండి. -
నంద్యాల జిల్లా డోన్ లో నూతన పురపాలక భవనాన్ని ప్రారంభించిన మంత్రులు
-
టీడీపీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలికి వేధింపులు
సాక్షి, డోన్: నంద్యాల జిల్లా డోన్ ప్రాంతానికి చెందిన టీడీపీ నేత చండ్రపల్లె వెంకటరమణ ఆచారి.. ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిని లొంగదీసుకునేందుకు వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో అసభ్యకర మెసేజ్‌లు పంపుతూ మానసిక వేదనకు గురిచేస్తున్నాడు. చివరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు సోమవారం పోలీసులను కలిసి వెంకటరమణ ఆచారిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. డోన్ సీఐ మల్లికార్జున తెలిపిన వివరాలు.. టీడీపీ ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పీఏనంటూ వెంకటరమణఆచారి విశాఖకు చెందిన బాధితురాలితో పరిచయం పెంచుకున్నాడు. కొన్నాళ్లుగా అసభ్యకరంగా మెసేజ్‌లు పెడుతూ ఆమెను లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆమె విసుగు చెంది సోమవారం కొందరు మహిళా ప్రతిని«ధులను వెంట తీసుకుని వైజాగ్ నుంచి డోన్‌కు వచ్చి వెంకటరమణ ఆచారిని నిలదీసే ప్రయత్నం చేయగా.. ఆచారి, ఆయన కుటుంబ సభ్యులు ఆమెపై దాడి చేశారు. సొంత పార్టీలోనే మహిళా నేతకు రక్షణ కరువైంది.. రాష్ట్ర టీడీపీ మహిళా ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్న తన పట్ల ఆచారి ప్రవర్తించిన తీరుపై పలు మార్లు పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఉన్నత పదవిలో ఉన్న తనకే సొంత పార్టీ నేతల నుంచి రక్షణ కరువైందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. చదవండి: (సీఎం జగన్ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలం) -
చంద్రబాబుపై కేఈ ధిక్కార స్వరం
డోన్: తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై ఆ పార్టీ నేత, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ ధిక్కార స్వరం వినిపించారు. డోన్ టీడీపీ అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థిని ప్రభాకర్ తిరస్కరించారు. డోన్ నియోజకవర్గంలో కేఈ కుటుంబం కచ్చితంగా పోటీ చేస్తుందని బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు టీడీపీలో దుమారం రేపుతున్నాయి. డోన్ టీడీపీ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డిని చంద్రబాబు గతంలోనే ప్రకటించారు. ఈ నిర్ణయంపై కేఈ ప్రభాకర్ అసంతృప్తితో ఉన్నారు. తన జన్మదిన వేడుక సందర్భంగా బుధవారం డోన్‌లో ఓ ఫంక్షన్ హాలులో సభ నిర్వహించి, తన నిర్ణయాన్ని ప్రకటించారు. ‘40 ఏళ్లుగా కేఈ కుటుంబానికి డోన్ కంచుకోట. నేను జెడ్పీటీసీ నుంచి అంచెలంచెలుగా జనామోదంతో రాష్ట్ర మంత్రి వరకు ఎదిగాను. ఇప్పుడు ఎలాంటి అనుభవం, జనామోదం లేని వ్యక్తికి నియోజకవర్గ ఇన్చార్జి ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదు’ అని చెప్పారు. తమకు జన బలం, ధన బలం కూడా ఉందనే సంగతి ఎవ్వరూ మర్చిపోవద్దని అన్నారు. ఒంట్లో శక్తి కూడా తగ్గలేదని అన్నారు. కచ్చితంగా 2024 ఎన్నికల్లో పోటీ చేస్తామని, ఈ విషయంలో కార్యకర్తలు సందేహించాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. ఈ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయి. టిక్కెట్ ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగుతామని నేరుగా చంద్రబాబుకే స్పష్టం చేసినట్లు కేఈ వ్యాఖ్యలు ఉన్నాయి. ఇదిలా ఉండగా కేఈ జన్మదిన వేడుకకు హాజరుకాకుండా ఉండేందుకు సుబ్బారెడ్డి బుధవారమే నంద్యాలలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. -
గుండెల్ని కదిలించేలా.. ఈపాటి విశ్వాసం మనిషికెక్కడిది?
మనిషికి విశ్వాసం ఏమాత్రం?.. మూగజీవాలతో పోలిస్తే మాత్రం చాలా చాలా తక్కువే!!. ఇది నిరూపించే ఘటనలు ఎన్నో చూస్తున్నాం కూడా. ఇన్నాళ్లూ తన కడుపు నింపిన వ్యక్తి చనిపోవడంతో, ఈ కొండముచ్చు ఇలా ఆయన శవం దగ్గరే ఉండిపోయింది. ఆప్యాయంగా ఆయన్ని చూస్తూ.. హత్తుకుని.. కాసేపు అక్కడే ఉండిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. శ్రీలంక బట్టికలోవాలోని తలంగూడ ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల పీతాంబరం రాజన్.. అడవి నుంచి వచ్చిన ఓ కొండముచ్చుకు రోజూ తిండి పెట్టేవారట. అక్టోబర్ 17న ఆయన అనారోగ్య కారణాలతో చనిపోయారు. ఆయన పార్థీవ దేహాన్ని గ్రామస్థుల సందర్శన కోసం ఉంచగా.. ఆ కొండముచ్చు ఇలా తన విశ్వాసం.. ప్రేమను ప్రదర్శించింది. మరో ఘటనలో.. నంద్యాల డోన్ పట్టణం పాతపేటలో తనకు తిండి పెట్టిన ఓ మహిళ చనిపోతే శవయాత్రలో ఆ కొండ ముచ్చు పరుగులు తీసిన వీడియో ఒకటి స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. బలిజ లక్ష్మీదేవి అనే మహిళ బజ్జీల కొట్టు నడిపిస్తోంది. ఓ కొండముచ్చు రోజూ ఆమె దుకాణం వద్దకు వచ్చేది. అలా రోజూ వచ్చే కొండముచ్చుకు.. మంగళవారం నాడు లక్ష్మీదేవి కనిపించలేదు. ఆకస్మాత్తుగా ఆమె గుండెపోటుతో మరణించడంతో బంధవులు అంత్యక్రియల కోసం శవయాత్రను ఓ వాహనంలో నిర్వహించారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు.. ఆ కొండముచ్చు ఆ వాహనం వెంట పరుగులు తీయడాన్ని కొందరు రికార్డు చేసి వైరల్ చేశారు. All lives, #animals #birds #plants have intelligence & emotions. #Monkey mourns death of man who fed every day. By kissing him. Touching. Happened in #Srilanka. Mattaglabbu. pic.twitter.com/nBLKEW2JUZ — Straight Talk India (@sttalkindia) October 20, 2022 -
Dhone: ఆలంకొండలో విషాదం
డోన్ (నంద్యాల): ఆకర్షణకు, ప్రేమకు మధ్య వ్యత్యాసం తెలియని వయస్సు వారిది. సినిమాల ప్రభావంతోనో, సామాజిక మాధ్యమాల్లో అతి స్పందనలతోనో.. మరే కారణంతోనో ప్రేమలో పడ్డారు. ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇందుకు పెద్దలు అడ్డుచెప్పారు. అబ్బాయికి బలవంతంగా అక్కకూతురుతో పెళ్లి చేశారు. తమ సమస్యను పరిష్కరించుకునే మార్గాలు తెలియక మనస్తాపం చెందిన ఇద్దరు ప్రేమికులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. కృష్ణగిరి మండలం అలంకొండ గ్రామానికి చెందిన బోయ మాదులు, వెంకటలక్ష్మి దంపతుల కుమారుడు బోయ ప్రసాద్ (19) 8వ తరగతి వరకు చదువుకున్నాడు. గొర్రెలను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన చాకలి రామాంజనేయులు, లింగమ్మ దంపతుల కుమార్తె అనిత (16) పదో తరగతి పూర్తి చేసింది. వీరిరువురూ రెండు సంవత్సరాల నుంచి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. బోయ ప్రసాద్‌కు రెండు నెలల క్రితం అతని సొంత అక్క కూతురుతో వివాహం జరిపించారు. దీంతో మనస్తాపం చెందిన ప్రేమికులు మంగళవారం రాత్రి వారివారి ఇళ్ల నుంచి బయటకు వచ్చి డోన్ మండల పరిధిలోని మల్యాల గ్రామం సమీపంలో గుర్తు తెలియని రైలు కింద పడి అత్మహత్య చేసుకున్నారు. చదవండి: (టీడీపీ నాయకుడి కొడుకు నిర్వాకం.. ‘రూ.30 లక్షలు తెస్తేనే కాపురం చేస్తా’) బుధవారం ఉదయం రైల్వే ట్రాక్‌మెన్ సుధాకర్ మృతదేహాలను చూసి మల్యాల స్టేషన్ మేనేజర్ రాంబాబుకు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసి వెల్దుర్తి సీఐ యుగంధర్, సీఆర్పీఎఫ్ పోలీస్ వెంకటస్వామి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను గుర్తించి, వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి, మృతదేహాలను డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రైల్వే ఎస్ఐ కిరణ్‌కుమార్ తెలిపారు. ఆలంకొండలో విషాద ఛాయలు కృష్ణగిరి: ప్రేమజంట గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడంతో ఆలంకొండలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నలభై రోజుల క్రితం ఈతకెళ్లి నలుగురు చిన్నారులు కరెంట్‌షాక్‌తో మృతి చెందారు. అదే రోజు బోయ ప్రసాద్ తన అక్క కూతురుతో పెళ్లి చేసుకున్నాడు. గ్రామానికి చెందిన మరో అమ్మాయితో కలిసి ప్రసాద్ రైలు కిందపడి మృతి చెందడం అందరినీ కలిచివేసింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను గ్రామానికి తీసుకురాగా బందోబస్తు మధ్య అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ►ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 ►మెయిల్: roshnihelp@gmail.com -
నేనేమి పాపం చేశానమ్మా..
సాక్షి, కర్నూలు రాజ్‌విహార్: కన్నపేగు తెంచుకొని పుట్టిన బిడ్డను ఆసుపత్రిలో వదిలేసి వెళ్లారు తల్లిదండ్రులు. ఆడపిల్లా అని అలా చేశారో మరెమో తెలియదు కానీ తల్లి ఒడిలో ఉండాల్సిన పాప అనాథగా మిగిలింది. డోన్ పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న యశోద ఆసుపత్రికి గత నెల 30 తేదీ తెల్లవారు జామున ఒక నిండు గర్బిణి పురిటి నొప్పులతో వచ్చింది. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది వివరాలు ఏమీ అడగకుండా తొలుత కాన్పు చేశారు. ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తరువాత వివరాలు అడగగా తన భర్త, తల్లిదండ్రులు కింద ఉన్నారని వారిని కలవమంది. వారిని సంప్రదించగా కొద్ది సేపటి తర్వాత ఇస్తామని చెప్పి శిశువును అక్కడే వదిలేసి బాలింతతో కలిసి ఉడాయించారని డాక్టర్ సుంకన్న తెలిపారు. మాట్లాడుతున్న ఐసీడీఎస్ అధికారులు ఈ విషయం పోలీసులకు తెలియజేసి.. పాప కోసం ఎవ్వరైనా వస్తారేమోనని వేచి చూశామన్నారు. శుక్రవారం వరకు ఎవ్వరూ రాకపోవడంతో ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆశిశువును కర్నూలు శిశుమందిర్‌కు తరలించారు. చిన్నారిని 30 రోజుల్లోపు సంబంధికులు తగిన ఆధారాలు చూపించి తీసుకెళ్లకపోతే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తీర్మానం ద్వారా అనాథగా గుర్తించి చట్ట ప్రకారం దత్తత ఇవ్వనున్నట్లు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ, సాధికార అధికారి కేఎల్‌ఆర్‌కే కుమారి తెలిపారు. వివరాలకు కర్నూలు కలెక్టరేట్లోని తమ కార్యాలయం లేదా సి.క్యాంప్ వద్ద ఉన్న శిశుగృహంలో సందర్శించాలని సూచించారు. -
భర్తకు అన్నం వడ్డించి.. అంగడికి వెళ్లొస్తానని చెప్పి నవవధువు అదృశ్యం
సాక్షి, డోన్ టౌన్: మండలంలోని చిన్న మల్కాపురం గ్రామానికి చెందిన మాధవి అనే నవ వధువు అదృశ్యమైనట్లు రూరల్ ఎస్ఐ సురేష్ మంగళవారం తెలిపారు. ఈనెల 10వ తేదీన మాధవికి అనంతపురం జిల్లా యాడికి మండలం పిన్నేపల్లె గ్రామానికి చెందిన కొత్తరాయుడితో వివాహమైంది. తిరిగింపు, మరిగింపుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 19వ తేదీన నూతన దంపతులు చిన్నమల్కాపురానికి చేరుకున్నారు. అదే రోజు భర్తకు అన్నం వడ్డించి పక్కనే ఉన్న అంగడికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన మాధవి తిరిగి రాలేదు. అప్పటి నుంచి బంధువుల ఊళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో మంగళవారం ఆమె భర్త కొత్తరాయుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: (ఓ వైపు చదువు, మరో వైపు ప్రేమ.. భరించలేక..) -
దొంగల చేతికి తాళాలు ఇవ్వడం అంటే ఇదేనేమో..
డోన్ టౌన్: దొంగల చేతికి తాళాలు ఇవ్వడం అంటే ఇదేనేమో.. ఏటీఎంలో డబ్బు పెట్టిన అధికారులు, ఆ తర్వాత మిషన్ తాళాలు కూడా అక్కడే మరచిపోయారు. ఈ సంఘటన డోన్‌లో చోటు చేసుకుంది. ఇటీవల పట్టణంలో ఎస్బీఐ ఏటీఎంను దొంగలు కొల్లగొట్టిన ఘటన సంచలనం సృష్టించింది. తాజాగా మరో సంఘటన చర్చనీయాంశంగా మారింది. స్థానిక రాజ్ థియేటర్ సమీపంలోని సిండికేట్ బ్యాంక్ అధికారులు సోమవారం మధ్యాహ్నం డాక్టర్ పోచా ప్రభాకర్‌రెడ్డి క్లినిక్ ఎదురుగా ఉన్న సిండికేట్ ఏటీఎంలో డబ్బులు పెట్టి తాళాలు వేశారు. అయితే మిషన్‌కు సంబంధించిన తాళాలు అక్కడే మరచిపోయారు. డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు వచ్చిన ఓ వ్యక్తి తాళాలు గుర్తించి బ్యాంక్ అధికారులకు అప్పగించారు. ఒక వేళ దొంగల చేతికి తాళాలు చిక్కి ఉంటే మరో చోరీ జరిగి ఉండేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇవీ చదవండి: ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు ఎచ్చెర్ల టీడీపీ ‘కళా’విహీనం..! -
గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంలు తెరిచి.. రూ.65 లక్షలు ఊడ్చేశాడు
డోన్ టౌన్: కర్నూలు జిల్లా డోన్ పట్టణ నడిబొడ్డున గల ఏటీఎం సెంటర్లో ఆదివారం అర్ధరాత్రి దాటాక ఓ దొంగ భారీ చోరీకి పాల్పడ్డాడు. అక్కడ ఉన్న రెండు ఏటీఎం మెషిన్లను గ్యాస్ కట్టర్ సహాయంతో తెరిచి రూ.65,44,900ను అపహరించుకుపోయాడు. స్థానిక శారద కాన్వెంట్ సమీపంలోని స్టేట్ బ్యాంక్ ఏటీఎం కేంద్రానికి రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉన్న రెండు మెషిన్లలో శుక్రవారం బ్యాంక్ అధికారులు రూ.80 లక్షల నగదు ఉంచారు. ఆదివారం రాత్రి వరకు రూ.14,55,100 నగదును వినియోగదారులు విత్ డ్రా చేసుకోగా.. మిగిలిన రూ.65,44,900ను దుండగుడు అపహరించాడు. మంకీ క్యాప్ ధరించి.. ఆపై టోపీ పెట్టాడు ఆదివారం రాత్రి 2.50 గంటల సమయంలో మంకీ క్యాప్, దానిపై మరో టోపీ ధరించిన గుర్తు తెలియని వ్యక్తి ఏటీఎం కేంద్రం ముందు బయట వైపున ఉన్న సీసీ కెమెరా ధ్వంసం చేసి పక్కనే ఉన్న డ్రైనేజీలో పడేశాడు. తన వెంట తెచ్చుకున్న చిన్న గ్యాస్ కట్టర్, ఐరన్ రాడ్డు, వాటర్ బాటిల్ సాయంతో రెండు ఏటీఎంలను లాఘవంగా తెరిచాడు. గ్యాస్ కట్టర్ వినియోగించే సమయంలో నోట్లు కాలిపోకుండా నీళ్లు పోస్తూ పని ముగించినట్టు లోపల ఉన్న మరో సీసీ కెమెరాలో రికార్డయింది. సోమవారం ఉదయం ఏటీఎం కేంద్రం బయట సీసీ కెమెరా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చోరీ విషయం వెలుగు చూసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు వర్షం పడటంతో ఆ దారిలో ఎవరూ వెళ్లకపోవడం కూడా ఆగంతకుడికి అనుకూలించింది. సీఐ మల్లికార్జున, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, జిల్లా క్రైం విభాగపు డీఎస్పీ శ్రీనివాస్ ఏటీఎం కేంద్రానికి చేరుకుని పరిశీలించారు. కర్నూలు నుంచి డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ నిపుణులు వచ్చి ఆధారాలు సేకరించారు. బ్యాంక్ అకౌంట్స్ డిప్యూటీ మేనేజర్ బి.ప్రాన్సిస్ రుబిరో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. చోరీకి పాల్పడిన వ్యక్తి పాత నేరస్తుడా లేక ఏటీఎం మెషిన్ల తయారీ, మెకానిజంలో నైపుణ్యం గల వ్యక్తా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. దొంగను గుర్తించేందుకు పట్టణంలో అన్నివైపులా గల సీసీ కెమెరాల్లోని ఫుటేజీని పరిశీలిస్తున్నారు. -
వృత్తి భిక్షాటన.. సంపాదన రూ.2.04 లక్షలు
సాక్షి, కర్నూలు : డోన్ పట్టణంలోని కొండపేట బీసీ హాస్టల్ పక్కన ఉన్న మసీదు వద్ద భిక్షాటన చేసే శ్రీను అనే వ్యక్తి వద్ద రూ.2,04,459 నగదు లభించింది. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రీను అనే వృద్ధుడు మూడేళ్ల నుంచి డోన్‌లో భిక్షాటన చేస్తున్నాడు. స్థానికుల కోరిక మేరకు అతనికి సపర్యలు చేసేందుకు ద్రోణాచలం సేవా సమితి సభ్యులు సోమవారం ఉపక్రమించగా అతని వద్దనున్న 14 చొక్కాల్లోని ప్లాస్టిక్ కవర్లలో మడత వేసి ఉంచిన రూ.2.04 లక్షల విలువైన నోట్లను గుర్తించారు. మహబూబ్‌నగర్ పోలీసుల సహాయంతో శ్రీను చిరునామా తెలుసుకునేందుకు డోన్ పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు ద్రోణాచలం సేవా సమితి సభ్యుడు ఆలా మధు తెలిపారు. (ఆంధ్రజ్యోతి వాహనం సీజ్ ) -
తిట్టుకున్న ‘తమ్ముళ్లు’
కర్నూలు, డోన్: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన తర్వాత మొదటిసారిగా శుక్రవారం ఏర్పాటుచేసిన టీడీపీ డోన్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో గందరగోళం చోటుచేసుకుంది. ఇటీవల వెలుగుచూసిన నకిలీ మద్యం తయారీ కేసులో టీడీపీ నేతల ప్రమేయముందని పోలీసుల విచారణలో వెల్లడికావడంతో శుక్రవారం జరిగిన సమావేశం పట్ల పార్టీ కార్యకర్తలు ఆసక్తి కనబరిచారు. మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగానే సభావేదిక ఏర్పాటులో లోటుపాట్లపై రాష్ట్ర గొర్రెల పెంపకందారుల ఫెడరేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్.. కార్యక్రమ నిర్వాహకులు, పార్టీ పట్టణ అధ్యక్షుడు కోట్రికె ఫణిరాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ఇరువురి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. చేతకాకపోతే కార్యక్రమాల నిర్వహణ నుంచి తప్పుకోవాలని నాగేశ్వరరావ్ అనగా.. చేతకాని వాళ్లే ఎక్కువ మాట్లాడతారని ఫణిరాజ్ దీటుగా సమాధానమిచ్చినట్లు తెలిసింది. ధర్మవరం సుబ్బారెడ్డి వర్సెస్ పెద్ద కేశవయ్య గౌడ్ .. గత ఎన్నికల్లో పార్టీ ఓటమిపై డోన్ మాజీ సర్పంచ్ పెద్ద కేశవయ్య గౌడ్ మాట్లాడుతుండగా.. ఏపీఐఐసీ మాజీ డైరెక్టర్ ధర్మవరం సుబ్బారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మొన్న జరిగిన ప్రభుత్వాసుపత్రి భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఎలా పాల్గొంటావని ధర్మవరం సుబ్బారెడ్డి ఆగ్రహంతో కేశవయ్య గౌడ్ వైపు దూసుకువెళ్లి ప్రశ్నించారు. దీనికి కేశవయ్య గౌడ్ తీవ్ర అభ్యంతరం తెలుపుతూ టీడీపీలో ఉండి కూడా నీ మాదిరి ద్వంద్వ ప్రమాణాలు పాటించనని ఎత్తిపొడిచారు. దీంతో ఒక్కసారిగా సమావేశం రసాభాసాగా మారింది. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ కలుగచేసుకొని ఇరువర్గాలకు నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. నకిలీ మద్యం వ్యవహారంలో స్పష్టత ఇస్తారని ఆశించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలకు సమావేశం తీవ్ర నిరాశ కలిగించింది. పార్టీ ఓడిన తర్వాత కూడా టీడీపీ అగ్ర నాయకులు ఆత్మ విమర్శ చేసుకోకుండా పరస్పరం నిందించుకోవడం, వ్యక్తిగత దూషణలకు దిగడం చూసి కార్యకర్తలు నివ్వెరపోయారు. ఇలాంటి వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో సమైక్యంగా నిలబడి పార్టీని ఎలా గెలిపించగలరనే సందేహాన్ని టీడీపీ కార్యకర్తలు బాహాటంగావ్యక్తపరుస్తున్నారు. -
అమ్మ ఎక్కడుంది నాన్నా?!
సాక్షి, కర్నూలు : అమ్మతోటే వారి లోకం..ఏ అవసరమొచ్చినా తల్లినే అడిగేవారు.. ఆకలేసినా..ఆపదొచ్చినా..అమ్మ ఉందనే ధైర్యం వారిలో ఉండేది. తండ్రి మద్యానికి బానిసై ఇంటిని పట్టించుకునే వాడు కాదు.. తల్లే పిల్లల ఆలనాపాలనా చూస్తుండేది. అయితే మద్యం పెట్టిన చిచ్చు ఆ ఇంట్లో ఇల్లాలిని బలితీసుకుంది. నలుగురు పిల్లలను దిక్కులేని వారిని చేసింది. ‘‘నాన్నా..అమ్మ ఎక్కడుంది’’ అంటూ చిన్నారులు రోదిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. వివరాలు ఇవీ.. డోన్ పట్టణం ఎన్టీఆర్ నగర్‌కు చెందిన ఈరన్నకు సమీపంలోని అబ్బిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన వరలక్ష్మికి 2004లో వివాహమైంది. ఈరన్న గతంలో గౌండా పని చేసుకుని జీవనం సాగించేవాడు. ప్రస్తుతం సెంట్రింగ్ పనికి సంబంధించిన రేకులు బాడుగకు ఇస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య వరలక్ష్మి(30) ఇళ్లకు పెయింటింగ్ వేసే పనికి వెళ్లేది. వీరికి కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అన్యోన్యంగా సాగుతున్న వీరి కాపురంలో మద్యం చిచ్చుపెట్టింది. సరదాగా ప్రారంభమైన మద్యం అలవాటుకు ఈరన్న క్రమంగా బానిసయ్యాడు. చీకటి పడగానే పని నుంచి ఇంటికి వచ్చే భర్త తాగి రావడం భార్య వరలక్ష్మికి నచ్చలేదు. మద్యం మానాలని పలుమార్లు చెప్పి చూసింది. మద్యం వల్ల కలిగే అనర్థాలు, చుట్టుపక్కల జరిగిన ఘటనల గురించి భర్తకు చెప్పేది. రోజూ మద్యం మానతానని చెప్పి తిరిగి తాగి రావడంతో వరలక్ష్మికి విసుగు పుట్టింది. ఈ విషయమై ఆదివారం రాత్రి భర్తతో గొడవ పడింది. ఈ క్రమంలో ఇరువురి మధ్యా వాగ్వాదం తీవ్రస్థాయికి చేరడంతో చేయి చేసుకున్నాడు. దీంతో వరలక్ష్మి మనస్తాపానికి గురై సోమవారం ఉదయం భర్త ఇంట్లో లేని సమయంలో టీలో పేల నివారణకు ఉపయోగించే మందును కలిపి ముందుగా పిల్లలకు ఇచ్చింది. ఆ తర్వాత తానూ తాగింది. కాసేపటికి భర్త ఇంటికి వచ్చి నోట్లో నురగలు కక్కుతున్న వారిని గమనించి వెంటనే చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వరలక్ష్మి కొద్దిసేపటికే మృతిచెందింది. పిల్లలు ఇందు(12), ఉమాదేవి(10), ఉదయ్‌కుమార్(6), ఐశ్వర్య(4)చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. వీధిలో ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నా, ఆత్మహత్యాయత్నం చేసినా ఎందుకిలా చేశారంటూ ధైర్యం చెప్పే తన భార్య ఇంత పని చేస్తుందనుకోలేదని భర్త ఈరన్న కన్నీరుమున్నీరయ్యాడు. కాగా తల్లి మరణ విషయం తెలియక అమ్మ ఎక్కడుందని పిల్లలు అడుగుతుండటం చూసి పలువురు కంట తడిపెట్టారు. డోన్ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిణి శంషాద్ బేగం డోన్‌లోని మృతురాలి ఇంటి వద్దకు చేరుకొని ఇరుగు పొరుగును విచారించారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు వారి వారి పరిధుల్లోని ప్రజల జీవన పరిస్థితులను గమనిస్తూ ఉండాలని సూచించారు. -
విషం కలిపిన కాఫీ పిల్లలకు ఇచ్చి.. తల్లీ అఘాయిత్యం
సాక్షి, కర్నూలు: జిల్లా డోన్‌లో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. డోన్ తారకరామ నగర్‌కు చెందిన వరలక్ష్మీ అనే మహిళ.. విషం కలిపిన కాఫీని తన నలుగురు పిల్లలకు ఇచ్చి.. ఆ తర్వాత తాను కూడా తాగింది. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా.. నలుగురు పిల్లలు అస్వస్థకు గురయ్యారు. బాధితులకు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం : మంత్రి బుగ్గన
సాక్షి, ప్యాపిలి/డోన్: తాము టీడీపీ నేతల మాదిరి మోసం చేసే వాళ్లం కాదని.. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి సారిగా ఆదివారం ఆయన ప్యాపిలి పట్టణానికి వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం స్థానిక కొత్త బస్టాండ్ ఎదురుగా నిర్వహించిన సభలో బుగ్గన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కులమతాలకు, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు పాదర్శకంగా ప్రభుత్వ పథకాలను అమలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రతి పనికీ సర్‌చార్జ్ వసూలు చేశారన్నారు. కందులు, శనగలు కొనుగోలులో రైతుల నుంచి ఖాళీ సంచులు కూడా వదిలిపెట్టలేదన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లులను సైతం భోంచేసిన ఘనత టీడీపీ నాయకులకే దక్కిందన్నారు. అధికారులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ప్యాపిలి బహిరంగ సభకు హాజరైన ప్రజలు ఈ పరిస్థితులను చూసి నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలను పూర్తిగా ప్రక్షాళన చేశామన్నారు. నీతి, నిజాయతీతో కూడిన పాలన అందించాలన్న తపనతో నియోజకవర్గంలోని అన్ని కార్యాలయాల్లో చిత్తశుద్ధి కలిగిన అధికారులను నియమించామన్నారు. కేకే (కోట్ల, కేఈ కుటుంబాల)ల పాలనలో డోన్ నియోజకవర్గం ఈ 50 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేకపోయిందన్నారు. అభివృద్ధి అంటే ఏమిటో ఈ ఐదేళ్లలో చేసి చూపుతామన్నారు. కార్యక్రమంలో ప్యాపిలి, డోన్ జెట్పీటీసీ సభ్యులు దిలీప్ చక్రవర్తి, శ్రీరాములు, మండల నాయకులు బోరెడ్డి శ్రీరామిరెడ్డి, రాజా నారాయణమూర్తి, గౌసియాబేగం, వెంకటేశ్వరరెడ్డి, బోరా మల్లికార్జునరెడ్డి, బషీర్, శ్రీనివాసరెడ్డి, సీమ సుధాకర్ రెడ్డి, జంగం చంద్రశేఖర్, కమతం భాస్కర్ రెడ్డి, బోరెడ్డి పుల్లారెడ్డి, సోమశేఖర్, రామచంద్రారెడ్డి, కొండయ్య, ఎస్కే వలి, జలదుర్గం రసూల్, రమేశ్ రెడ్డి, ఇమాముద్దీన్, రమేశ్‌రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నీటి సమస్యను గాలికొదిలారు గత పాలకులు డోన్ పట్టణంలో నీటి సమస్యను గాలికి వదిలేశారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన మండి పడ్డారు. మున్సిపల్ కమిషనర్ కేఎల్ఎన్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం డోన్‌లో మునిసిపాలిటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ పాలకవర్గం మంచినీటి పంపిణీ వ్యవస్థపై నిర్లక్ష్యం వహించిందన్నారు. భవిష్యత్తులో మంచినీటి సమస్య తలెత్తకుండా అన్ని రకాల చర్యలను తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. డోన్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో కొత్త బోర్లు వేయాలని, పాత బోర్లకు మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను ఏర్పాటు చేయాలని మంత్రికి వైఎస్సార్సీపీ నాయకులు కోట్రికె పద్మజ, చిన్నకేశవయ్య గౌడ్, కోట్ల హరిశ్చంద్రారెడ్డి విన్నవించారు. సమీక్షలో మాజీ జడ్పీటీసీ సభ్యులు శ్రీరాములు, మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం ఎస్ఈ శ్రీనివాస రెడ్డి, ఈఈ రామ్మోహన్ రెడ్డి, డీఈ నాగభూషణం పాల్గొన్నారు. -
గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు
డోన్ రూరల్ : గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని డిఎస్పీ ఖాదబాషా అన్నారు. మండల పరిధిలోని కోట్లవారిపల్లి, ఎర్రగుంట్ల గ్రామాల్లో సోమవారం ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలను భయభ్రాంతుకు గురిచేస్తే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తేలేదన్నారు. ముఖ్యంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పుడిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. మట్కా, పేకాట, మద్యం వంటి వాటికి గ్రామ ప్రజలు దూరంగా ఉండాలన్నారు. గొడవలు సృష్టిస్తే రౌడీ షీట్ ఓపెన్ చేసి గ్రామ బహిష్కరణ చేస్తామని చెప్పారు. గ్రామాలల్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. హోటల్, దుకాణాల వారు తప్పకుండా సీసీ కెమెరాలు పెట్టాలని సూచించారు. రూరల్ సీఐ సుధాకర్‌రెడ్డి, రూరల్ ఎస్ఐ.మధుసుధన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
ప్రియురాలే హంతకురాలు
సాక్షి, డోన్(కర్నూల్) : ప్రియుడి హత్య కేసులో ప్రియురాలితో పాటు మరో ఇద్దరిని డోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ కంబగిరి రాముడు తెలిపిన వివరాలు..మండలంలోని ఉంగరానిగుండ్ల గ్రామానికి చెందిన ఖాజావలి అలియాస్ కుంటోడు (38), కృష్ణగిరి మండలం కటారుకొండకు చెందిన బలిజ అనసూయమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకొని డోన్ పట్టణంలోని వైఎస్సార్ నగర్లో కాపురం ఉండేవాడు. అనసూయమ్మ ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తుండేది. ఇంటికి వచ్చిన అమ్మాయిలను ఖాజావలి మద్యం తాగి వేధిస్తుండటం, డబ్బుల కోసం తరచూ గొడవ పడి కొడుతుండటంతో ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకుంది. ఈ క్రమంలో స్థానికులు కమ్మరి సురేంద్రమోహన్, షేక్ ముక్తియార్ అలీతో కలిసి హత్యకు పథకం రచించింది. ఇందులో భాగంగా గత నెల 12న రాత్రి 10 గంటలకు మద్యం తాగేందుకని ఖాజావలిని సురేంద్రమోహన్, షేక్ ముక్తియార్ అలీ బయటకు తీసుకెళ్లారు. పూటుగా మద్యం తాపి బండరాళ్లతో తలపై మోది హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని రైల్వేట్రాక్ వద్దకు ఈడ్చుకెళ్లి ట్రాక్‌పై పడేశారు. మరుసటి రోజు ఉదయం సమాచారం అందుకున్న హతుని సోదరుడు హుసేన్‌అలీ ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం అర్బన్ స్టేషన్‌కు బదిలీ చేయడంతో పది రోజుల క్రితం సురేంద్రమోహన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కూపీ లాగగా అసలు విషయం బయటపడింది. ముగ్గురిని సోమవారం అరెస్ట్ చేసి డోన్ కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించారని సీఐ తెలిపారు. -
భర్త పొమ్మన్నాడు.. న్యాయం జరిగే వరకూ కదలనూ
సాక్షి, డోన్(కర్నూలు) : అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్త.. ఇష్టం లేదని చెప్పడంతో భార్య ఆయన ఇంటి ఎదుట బైఠాయించింది. తనకు న్యాయం జరిగేవరకు ఇక్కడి నుంచి కదలనని భీష్మించింది. బాధితురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక రాష్ట్రం రాయచూరుకు చెందిన రాజు, వరలక్ష్మి బాయి దంపతుల కుమార్తె ఉమామహేశ్వరిని ఏడాది క్రితం డోన్‌లోని పాతపేటకు చెందిన నారాయణ,దేవిబాయ్ కుమారుడైన వీరేష్‌కుమార్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. వివాహం సందర్భంగా రూ.2లక్షల నగదుతో పాటు రూ.20తులాల బంగారం కట్న కానుకల కింద అందజేశారు. ఆరు నెలలు సవ్యంగా సాగిని వీరి సంసారంలో విభేదాలు చోటు చేసుకున్నాయి. దీంతో భార్య ఉమామహేశ్వరిని భర్త వీరేష్‌కుమార్ అరునెలల కిందట పుట్టినింట్లో వదిలొచ్చాడు. కాపురానికి తీసుకువెళ్లేందుకు రాకపోవడంతో పాటు, నీతో సంసారం చేసేందుకు తనకు ఇష్టం లేదని భర్త తెగేసి చెప్పడంతో ఉమామహేశ్వరి తన తల్లిదండ్రులతో పాటు బంధువులను తీసుకొని డోన్‌కు వచ్చింది. అయితే ఆమె ఇంట్లోకి వెళ్లగానే భర్తతో పాటు అత్తామామలు దుస్తులను పారవేసి ఉమామహేశ్వరిని బయటికి గెంటేశారు. దీంతో ఆమె భర్త ఇంటి ముందు బైఠాయించింది. తనకు న్యాయం జరిగి ఇంట్లోకి రానించేంత వరకు కదలని స్పష్టం చేసింది. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో సీఐ కంబగిరి రాముడు రెండు కుటుంబాలను స్టేషన్‌కు పిలిపించారు. -
వృద్ధుడు కాదు.. కామాంధుడు
సాక్షి, డోన్(కర్నూల్) : పట్టణంలోని స్థానిక త్రివర్ణ కాలనీకి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు రాందాస్ శుక్రవారం ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి యత్నించాడు. పట్టణ ఎస్ఐ సునీల్‌కుమార్ తెలిపిన వివరాలు.. త్రివర్ణ కాలనీకి చెందిన ఏడు, ఎనిమిదేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ ఉండగా, అదే కాలనీకి చెందిన రైల్వే రిటైర్డ్ ఎంప్లాయ్ రాందాస్ తినుబండారాలు ఇచ్చి మచ్చిక చేసుకున్నాడు. కాసేపటికి మాయమాటలు చెప్పి పక్కనే నూతనంగా నిర్మిస్తున్న రైల్వే క్వార్టర్స్‌లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించగా చిన్నారులు కేకలు వేయడంతో స్థానికుడు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు అక్కడికి చేరుకునేలోపే నిందితుడు పరారయ్యాడు. చిన్నారుల తల్లిదడ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడు రాందాస్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
డోన్ ప్రచార సభలో వైఎస్ విజయమ్మ
-
వైఎస్సార్ లేని లోటు జగన్ తీరుస్తాడు
డోన్: ‘కష్టకాలంలో ఉన్న ఈ రాష్ట్రానికి వైఎస్ రాజశేఖరరెడ్డి లేని లోటును జగన్ తీరుస్తాడు. ఒక్క అవకాశమివ్వండి’ అని ప్రజలకు వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రమంతటా అరాచక పాలన నడిచిందని దుయ్యబట్టారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. యువతకు ఉపాధి కరువైందని.. గిట్టుబాటు ధరల్లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించాలని.. చంద్రబాబు అబద్ధపు హామీలకు మళ్లీ మోసపోవద్దని ప్రజలకు సూచించారు. తన తండ్రిలా సంక్షేమ పాలన అందించేందుకు జగన్ తపనపడుతున్నాడని.. వైఎస్సార్సీపీ అభ్యర్థులను అత్యధిక మోజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం కర్నూలు జిల్లా డోన్, ఆళ్లగడ్డలో విజయమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె ఏం మాట్లాడారంటే.. జగన్ సోనియాకే భయపడలేదు.. కేసులకు భయపడి కేసీఆర్, మోదీతో జగన్ కలిశాడంటూ చంద్రబాబు విషప్రచారం చేస్తున్నాడు. జగన్ అలా భయపడే వ్యక్తి కాదు. సోనియాగాంధీనే ఎదిరించి నిలిచిన వాడు.. ఈరోజు కేసులకు భయపడతాడా? చంద్రబాబు ఓటమి భయంతో ఇష్టారీతిన దుష్ప్రచారం చేస్తున్నాడు. వైఎస్సార్సీపీది ఎప్పుడూ ఒంటరి పోరే. జగన్‌కు పొత్తు ఏదైనా ఉందంటే అది ప్రజలతోనే. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి కూడా రాజకీయ విలువలు కాపాడేందుకు జగన్ పయత్నిస్తున్నాడు. ఇతర పార్టీల నుంచి ఎన్నికైన వారు తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే.. వైఎస్సార్సీపీలో చేర్చుకున్నాడు. కానీ చంద్రబాబుకు ఇలాంటి లువలున్నాయా? ఆయనకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చేసింది. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్సార్సీపీని గెలిపించండి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకుందాం. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరి కోసం జగన్ ఉన్నాడు.. కాంగ్రెస్, టీడీపీ కలిసి జగన్‌పై అక్రమ కేసులు బనాయించాయి. సీబీఐ, ఈడీలతో దాడులు చేయించి.. ఆస్తులు అటాచ్ చేయించాయి. రకరకాలుగా వేధించారు. అయినా కూడా జగన్ ఎప్పుడూ తన బాధను మీకు చెప్పుకోలేదు. పైగా ప్రజలకు వచ్చిన ప్రతి సమస్యపైనా ఉద్యమించాడు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా దీక్షలు, ధర్నాలు చేశాడు. రోజుల తరబడి కడుపు మాడ్చుకుని ప్రజల కోసం పోరాడాడు. పాదయాత్రలో జగన్ మీ కష్టాలు, బాధలన్నీ చూశాడు. ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ‘నేను ఉన్నాను..’ అని భరోసా ఇస్తున్నాడు. చంద్రబాబు మాత్రం ప్రజలకు ఏమీ చేయకుండా.. ఎప్పుడూ మాపై విమర్శలు చేస్తూనే ఉన్నాడు. జగన్‌ను జైల్లో పెట్టినప్పుడు మా కుటుంబం వెంట నిలిచిన ప్రజల కోసం నేను, షర్మిలమ్మ బయటకు వచ్చాం. మమ్మల్ని నమ్మి వచ్చిన 18 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ కోసం బయటకు వచ్చాం. ఈరోజు కూడా ప్రజలంతా మా కుటుంబమనుకొనే బయటకు వచ్చాం. మా ప్రతి కష్టంలోనూ అండగా ఉన్న ప్రజల కోసం మనం నిలబడాలని జగన్‌కు ఎప్పుడూ చెబుతూ ఉంటా. జగన్ కూడా నా భర్తలా మాట ఇస్తే తప్పడు. ఏ మాట ఇచ్చినా అది తప్పక నెరవేరుస్తాడు. వైఎస్సార్ లేని లోటును జగన్ తీరుస్తాడు. పన్నులు పెంచని పాలన వైఎస్సార్‌ది.. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తుకు తెచ్చుకోండి. ఈ ఐదేళ్లలో ఏం జరిగిందో ఆలోచించండి. చంద్రబాబు అబద్ధపు హామీలు, మోసాలతో అందర్నీ మోసం చేశాడు. ఈరోజు ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోంది. విలువలకు, విశ్వసనీయతకు పట్టం కట్టాలని విజ్ఞప్తి చేస్తున్నా. వైఎస్సార్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించారు. రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారు. పేదలు సైతం కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాలని ఆరోగ్య శ్రీ ప్రవేశపెట్టారు. 108తో లక్షలాది మంది ప్రాణాలు నిలబెట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టి ఎంతోమందిని ఉన్నత చదువులు చదివించారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా ఆయనదే. 71 లక్షల మందికి పింఛన్ ఇచ్చారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించారు. పన్నులు గానీ, చార్జీలు గానీ ఒక్క పైసా కూడా పెంచకుండా పాలన అందించారు. ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని చూపించి మాత్రమే ఆయన 2009లో మళ్లీ ఓటు అడిగారు. కులాల మధ్య చిచ్చు పెట్టే దుర్మార్గుడు చంద్రబాబు.. బీసీలకు న్యాయం జరిగిందంటే అది ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో మాత్రమే. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకునే దుర్మార్గుడు చంద్రబాబు. బీసీలను ఘోరంగా మోసం చేశాడు. బీసీ సబ్‌ప్లాన్ నిధులన్నీ దుర్వినియోగం చేశాడు. బీసీలను ఓటర్లుగా మాత్రమే చూస్తున్నాడు. ఈ ఐదేళ్లలో ఒక్క మేలు కూడా చేయలేదు. పైగా బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారంటూ లేఖలు రాశాడు. ఈ విషయాన్ని జస్టిస్ ఈశ్వరయ్య చెప్పారు. మైనార్టీలను కూడా చంద్రబాబు దగా చేశాడు. తమ సమస్యలు చెప్పుకునేందుకు గుంటూరు వెళ్లిన ముస్లింలను అరెస్టు చేయించి జైల్లో పెట్టించాడు. ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. చంద్రబాబు అధికారం కోసం ఏమైనా చేస్తాడు. ఎంతకైనా దిగజారుతాడు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. వైఎస్సార్‌లా బీసీలకు మేలు చేసేందుకు జగన్ కూడా శాయశక్తులా కృషి చేస్తున్నాడు. పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్లపై ప్రైవేటు బిల్లు పెట్టాడు. వైఎస్సార్సీపీ తప్ప ఈ పని ఏ ఒక్క పార్టీ కూడా చేయలేకపోయింది. అలాగే పదవుల్లో కూడా బీసీలకు జగన్ పెద్దపీట వేశాడు. -
డబ్బులు ఇస్తారు.. తన్ని మరీ వెనక్కు తీసుకుంటారు
సాక్షి ప్రతినిధి, కర్నూలు : ‘ఎన్నికల్లో ఖర్చు పెట్టమంటూ ఇప్పుడు పిలిచి మర్యాదగానే డబ్బిస్తారు. తర్వాతే అసలు కథ ఉంటుంది. ఓట్లు వేయించలేదని, ఒకవేళ గెలిచినా ఆధిక్యం తగ్గిందని కారణాలు చెబుతూ వెనక్కు ఇవ్వమంటారు. లేదంటే తన్ని మరీ తీసుకుంటారు. అసలెందుకు ఈ గొడవ? తీసుకోకుండా ఉంటే పోలా?’ ఇదీ ప్రస్తుతం కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలోని టీడీపీ ద్వితీయ శ్రేణి నేతల మనోగతం. దీనికి వారు గతంలో తమకు ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. ఇంతకూ అసలు విషయమేమంటే... ఎన్నికల్లో పంపిణీకి డోన్ అధికార పార్టీ నేత డబ్బు ఇస్తా రమ్మని క్యాడర్‌ను పిలుస్తున్నారు. కానీ, నాయకుల నుంచి మాత్రం స్పందన లేదు. కొందరు తీసుకునేందుకే జంకుతుంటే... ఇంకొందరు మా కొద్దు మీ నగదు అంటూ తిరస్కరిస్తున్నారు. మరింకొందరైతే అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ‘మేం నగదు తీసుకెళ్లి జనానికి ఇచ్చినా వారంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. ఓట్లు పడేది కూడా కష్టమేనని తెలుస్తోంది. ఫలితం తేడా వస్తే మా నేత మాకిచ్చిన నగదు వెనక్కు తెమ్మంటాడు. మేం ఆస్తులు అమ్మాల్సి వస్తుంది’ అని టీడీపీ నేతలు వాపోతున్నారు. మరోవైపు పార్టీ మారాలని భావిస్తున్న కింది స్థాయి వారిని డోన్ నేత ఇంటికి పిలిపించి మరీ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ‘ముందుగా ఇన్ని రోజులు మాతో చేయించుకున్న పనులకు సమానమైన మొత్తాన్ని తిరిగిచ్చి వెళ్లిపోండి’ అని హెచ్చరిస్తున్నారు. ఇవీ ఉదాహరణలు డోన్‌లో గతంలో కేఈ ప్రభాకర్ పోటీ చేసిన సమయంలో డబ్బు పంపిణీ బాధ్యతను ప్రధానంగా ఆయన అన్న కేఈ కృష్ణమూర్తి కుమారుడు, టీడీపీ ప్రస్తుత అభ్యర్థి కేఈ ప్రతాప్ పర్యవేక్షించేవారు. కోట్ల విజయభాస్కరరెడ్డి రాజీనామాతో 1996లో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. ప్రభాకర్ పోటీ చేయగా కోట్ల కంటే 7 వేల ఓట్లు తక్కువగా 32 వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. దీంతో ప్యాపిలి మాజీ మండలాధ్యక్షుడు ఆర్ఈ కృష్ణమూర్తి వద్ద నుంచి కేఈ ప్రతాప్ డబ్బు వెనక్కి లాగేసుకున్నారు. కృష్ణగిరి మండలం (అప్పట్లో డోన్ నియోజకవర్గంలో ఉంది)లోని ఓ మాజీ సర్పంచ్ వద్ద సైతం ఇలాగే బెదిరించి మరీ గుంజేసుకున్నారు. 2014 ఎన్నికల్లో కేఈ ప్రతాప్ ఓడినప్పుడూ ఇచ్చిన డబ్బును తనకు ఓటు వేయలేదని బెదిరించి మరీ వెనక్కు తీసేసుకున్నారని చెప్పుకొంటారు. అనుకున్న మేర ఓట్లు వేయించలేదని పెద్దపూజర్ల సర్పంచ్ వద్ద నుంచి బలవంతంగా వసూలు చేశారు. తాజాగా ఆవులదొడ్డిలో ఒక నాయకుడు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ‘మా ప్రభుత్వంలో చేయించుకున్న పనులకు సమానమైన నగదు ఇచ్చిన తర్వాతే నువ్వు పార్టీ మారు’ అని ఆయనపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. -
కేఈ, కోట్ల కుటుంబాల మధ్య సీట్ల ఫైట్
సాక్షి, కర్నూలు: ఏపీలో ఎన్నికలకు మరో వారంలో నామినేషన్ల ప్రక్రియ మొదలు కానున్న నేపథ్యంలో టీడీపీలో విభేదాలు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నాయి. పలు జిల్లాలో సీట్ల కేటాయింపుపై అసంతృప్త జ్వాలలు ఎగసిపడుతున్నాయి. కర్నూలు జిల్లాలో టీడీపీ సీట్ల కేటాయింపు విషయంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి కుటుంబాల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. డోన్ సీటు తమకే కేటాయించాలని కోట్ల సుజాతమ్మ పట్టుబట్టారు. దీంతో ఆ సీటుపై తమకే కేటాయిస్తారనే ధీమాతో ఉన్న కేఈ కుటుంబం తీవ్ర అసహనానికి గురవుతోంది.(కేఈ కుటుంబానికి రెండు సీట్లు) దీంతో కర్నూలులో కేఈ కుటుంబ ఆధిపత్యానికి గండికొట్టే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టుగా వార్తలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేఈ ప్రతాప్ హుటాహుటిన అమరావతికి బయలుదేరారు. చంద్రబాబు బీసీలను తొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ కేఈ వర్గీయుల్లో కలవరం మొదలైంది. కాగా, కేంద్ర మాజీ మంత్రి అయిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. -
డోన్‌లో భారీ చోరీ
డోన్ రూరల్ : పట్టణంలోని ఓనెరో పాఠశాల వద్ద ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. బాధితుల వివరాల మేరకు.. స్థానిక ఓనెరో పాఠశాల సమీపంలో లక్ష్మిదేవి అనే మహిళ కుమారుడు మనోహర్‌రెడ్డి కుటుంబంతో కలిసి ఉంటోంది. మంగళవారం సాయంత్రం పనిపై కుటుంబ సభ్యులంతా హైదరాబాద్ వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు అదే రోజు రాత్రి ప్రధాన ద్వారం తాళం ధ్వంసం చేసి ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లోఉన్న రెండు బీరువాను పగులగొట్టి అందులో ఉన్న దాదాపు 30 తులాల బంగారు ఆభరణాలు, రూ.3 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. బుధవారం రాత్రి చుట్టుపక్కల వారు గమనించి లక్ష్మిదేవి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారు గురువారం ఉదయం వచ్చి పరిశీలించగా చోరీ జరిగినట్లు గుర్తించారు. దీంతో వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ రాజగోపాల్‌నాయుడు, ఎస్ఐ శ్రీనివాసులు ఘటనస్థలికి చేరుకుని బాధితులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఆధారాలు దొరక్కుండా.. దొంగలు పక్కా ప్రణాళిక ప్రకారమే చోరీకి తెగబడినట్లు తెలుస్తోంది. ఎలాంటి ఆధారాలు దొరకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఘటనస్థలాన్ని బట్టి తెలుస్తోంది. అయితే చోరీ చేసేందుకు తీసుకొచ్చిన పికాసి, ఒక రాడ్డు, ఒక కట్టె, పండ్ల స్పానర్ను ఘటన స్థలంలోనే వదిలివెళ్లారు. సీసీకెమెరాల ఫుటేజీ దొరకకుండా ఉండేందుకు ఏకంగా హార్డ్‌డిస్క్‌నే ఎత్తుకెళ్లారు. పోలీసులు కర్నూలు నుంచి క్లూస్ టీంను రంగంలోకి దింపి వేలిముద్రలు సేకరించారు. భయం గుప్పిట్లో ప్రజలు... పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ ఏడాది కొండపేటకు చెందిన మంగళి ప్రసాద్ ఇంట్లో 15 తులాల బంగారు, రూ.70 వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. అలాగే ఏప్రిల్ 1న ఇందిరానగర్‌కాలనీలో ఉపాధ్యాయుడు గోపాల్‌శర్మ ఇంట్లో 60 తులాల బంగారు, రూ.7 లక్షల నగదు చోరీకి గురైంది. అలాగే స్థానిక గాందీ సర్కిల్లో ఉన్న శివ జ్యువెలర్స్‌లో 30 తులాల బంగారు కేజీ వెండిని ఎత్తుకెళ్లారు. రైల్వే ఉద్యోగి ఇంట్లో కూడా 8 తులాల బంగారును దొంగలించారు. చోరీలు జరిగిన సమయంలో విచారణ పేరుతో హడావుడి చేయడం తప్ప పోలీసులు ఏం చేయడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. దొంగతనాల కేసుల్లో ఒక్కదానిలో కూడా పురోగతి లేకపోవడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. -
నరేంద్రమోడీ దిష్టిబొమ్మ దహనం
డోన్ : విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకుండా, రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వడంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ సీపీఐ కార్యకర్తలు శుక్రవారం ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. సీపీఐ కార్యాలయం నుంచి పార్టీ నియోజకవర్గపు కార్యదర్శి రంగనాయుడు ఆధ్వర్యంలో ప్రదర్శనగా వచ్చిన కార్యకర్తలు అమ్మా హోటల్ వద్ద గుత్తి రహాదారి పై ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. పార్టీ పట్టణ కార్యదర్శి నక్కిశ్రీకాంత్, నాయకులు నాగరాజు, నారాయణ, పులిశేఖర్, శివన్న, రంగన్న, నక్కిబాలమ్మ పాల్గొన్నారు. ప్రధానికి పిండ ప్రదానం రాష్ట్ర విభజన హామీలను ప్రధాని నరేంద్రమోడీ నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు శుక్రవారం వినూత్న నిరసన తెలిపారు. ప్రధాని చిత్రపటానికి పిండ ప్రదానం చేశారు. మండలంలోని అబ్బిరెడ్డిపల్లె చెరువు వద్ద ఎస్ఎఫ్ఐ జిల్లా తూర్పు విభాగం అధ్యక్షులు శివశంకర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ ఇకనైనా బీజేపీ ప్రభుత్వం విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. -
కన్నతండ్రిని కత్తులతో నరికిన కొడుకులు
సాక్షి, కర్నూలు(డోన్): తల్లిని కొట్టారన్న కోపంతో తండ్రిని కుమారులే హతమార్చారు. ఈ సంఘటన సోమవారం రాత్రి డోన్ పట్టణంలోని గుత్తి రోడ్డులో గల అమ్మా హోటల్ ఎదుట చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని చిగురుమాను పేట ప్రాంతానికి చెందిన కృపానందం (45)కు పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉండేవి. అలాగే భార్యను తరచూ వేధించేవాడు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం భార్యను కొట్టాడు. ఇందుకు అతని కుమారులైన రౌడీషీటర్లు చిన్నకాంతు, పెద్దకాంతు, నాగన్న ఆగ్రహించారు. అమ్మా హోటల్ ఎదుట ఉన్న కృపానందంను చుర కత్తులతో విచక్షణారహితంగా నరికారు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆటోడ్రైవర్లు చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ప్రభుత్వాసుపత్రికి చేరుకొని ఘటన గురించి కృపానందంను అడిగి తెలుసుకొన్నారు. తన భార్యను కొట్టినందుకు కుమారులే కత్తులతో దాడిచేశారని అతను ఫిర్యాదు చేశాడు. ప్రాథమిక చికిత్స అనంతరం అతన్ని మెరుగైన వైద్యచికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. హత్యకు గురైన కృపానందం -
కన్న తండ్రిని కిరాతకంగా చంపిన కొడుకులు
-
గుండెపోటుతో వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి
డోన్ రూరల్ : వైఎస్సార్సీపీ ముఖ్య కార్యకర్త క్రిష్ణమూర్తి ఆచారి (40) శనివారం రాత్రి 8 గంటల సమయంలో గుండెపోటుతో మృతిచెందారు. క్రిష్ణగిరి మండలం కటారుకొండ గ్రామానికి చెందిన క్రిష్ణమూర్తి ఆచారి డోన్ పట్టణంలో ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈయనకు భార్య సునితతోపాటు ఇద్దరు కుమారులున్నారు. కంగాటి శ్రీదేవి పరమార్శ క్రిష్ణమూర్తి ఆచారి మరణవార్త తెలుసుకున్న వెంటనే వైఎస్సార్సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జ్ కంగాటి శ్రీదేవి హుటాహుటిన ప్రజా వైద్యశాలకు వెళ్లి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మృతుని భార్య సునీతను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. కంగాటి శ్రీదేవి వెంట పార్టీ పత్తికొండ నియోజకవర్గపు నాయకులు మాదవరావ్, వెంకటేశ్వర్లు ఉన్నారు. -
వైఎస్సార్సీపీ శ్రేణులను వేధిస్తే..ఊరుకునేది లేదు
డోన్ : అవినీతి మయమైన టీడీపీ పాలనను వచ్చే ఎన్నికల్లో ఓటుతో అంతం చేద్దామని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మండలంలోని దొర్రపల్లె గ్రామంలో బుధవారం రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనను తిరిగి రాష్ట్రంలో తెచ్చుకునేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేసిందని.. నాలుగేళ్లలో అవినీతి, దౌర్జన్యం పెరిగిపోయిందని విమర్శించారు. ప్రతి పథకంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తలదూర్చి దండుకుంటున్నారని ఆరోపించారు. రేషన్‌కార్డులు, పింఛన్ల మంజూరు, గృహనిర్మాణ పనుల్లో మామూళ్ల కోసం పేదలను పట్టిపీడిస్తున్నారన్నారు. రైతుల కందుల కొనుగోళ్లలో సైతం కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారని విమర్శించారు. వంకలు, వాగులు, నదుల్లో ఇసుకను తోడేస్తున్నారని చెప్పారు. వైఎస్సార్సీపీ శ్రేణులను వేధిస్తే సహించను అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తే సహించనన్నారు. తన సహనానికి ఒక హద్దు ఉంటుందనే విషయాన్ని గ్రహించాలన్నారు. కార్యక్రమంలో పార్టీనాయకులు దేవేంద్ర, రాజేంద్రప్రసాద్, తిప్పన్న, చంద్ర, రంగడు, శ్రీను, సెంట్రింగ్ శ్రీను, వెంకటేశ్వర్లు, హరిశ్చంద్ర ఎరుకలి ప్రసాద్, సీతారామయ్య, కోటేశ్వరరావ్, శ్రీనివాసులు, సుధాకర్, లక్ష్మన్న, పెద్దబూసి, రమణ, రాముడు పాల్గొన్నారు. అంతకు ముందు పార్టీ గ్రామ నాయకులు చిరంజీవి, వెంకటేశ్వర్లు, ఆనంద్, రాజబాబు, ప్రకాశం, రాంబాబు, దశరథరాముడు, కిరణ్ కుమార్, కల్యాణ్, రాజశేఖర్, రాజు, గోపాల్, శంకర్, రఘు, రాము, రాజేష్, దేవేంద్రల ఆధ్వర్యంలో యువకులు బుగ్గనకు ఘన స్వాగతం పలికారు. -
బస్తీమే సవాల్!
డోన్ : నియోజకవర్గంలో టీడీపీ నాయకులు కొనసాగిస్తున్న దోపిడీ, అవినీతి పనులపై పీఏసీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన ఆరోపణలు ముమ్మాటికి వాస్తవమని జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములు అన్నారు. పార్టీ నాయకులు కోట్రికె హరికిషన్, దినేశ్‌గౌడ్, పోస్ట్రుపసాద్, ఆర్ఈ రాజవర్ధన్, ఓబులాపురం మదన్‌తో కలిసి ఎమ్మెల్యే స్వగృహంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు సిద్ధమని టీడీపీ నాయకులకు సవాల్ విసిరారు. వ్యాపారుల ముక్కుపిండి అక్రమంగా వసూళ్లు చేయలేదని టీడీపీ నాయకులు దేవుడి ఎదుట ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా.? అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే బాధి తుల గోడు విని మాట్లాడితే పసలేని పత్రికా ప్రకటనలు ఇవ్వడం సిగ్గుచేటని టీడీపీ నాయకులపై మండిపడ్డారు. టికెట్ రాదనే భయం... టీడీపీ నాయకుల అవినీతి చిట్టా ఆ పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లినందున వచ్చే ఎన్నికల్లో వారి నాయకుడికే ఎమ్మెల్యే టికెట్ దక్కదనే భయం పట్టుకుందని శ్రీరాములు అన్నారు. టీడీపీ నాయకుల గుండాయిజం, రౌడీయిజం, అవినీతి, అక్రమాల గురించి నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. గురువింద గింజలు... అవినీతి, అక్రమాల ఊబిలో కూరుకుపోయిన టీడీపీ నాయకులకు దిక్కుతోచడం లేదని శ్రీరాములు ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే బుగ్గన రీజినబుల్ మైనింగ్ వ్యాపారం చేయడంలో రాష్ట్రంలోనే పేరుగాంచిన సంగతిని టీడీపీ నాయకులు తెలుసుకోవాలన్నారు. ఎమ్మెల్యేపై వారు చేసిన ఆరోపణలు గురువింద గింజలు సామేతను గుర్తుకు తెస్తోందని ఎద్దేవా చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నాయకులు చేస్తున్న అవినీతి అక్రమాలపై ప్రజల సమక్షంలో బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. సమావేశంలో పార్టీ నాయకులు రాజశేఖర్, మహేంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
నారాయణరెడ్డి హత్య కేసులో కేఈ కుటుంబానికి షాక్
-
నారాయణ రెడ్డి హత్య కేసులో సంచలన తీర్పు
సాక్షి, కర్నూలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ ఇన్ఛార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి షాక్ తగిలింది. ఈ కేసులో డిప్యూటీ సీఎం కుమారుడు శ్యామ్ బాబుతో సహా మరో ఇద్దరిని నిందితులుగా చేర్చి, అరెస్ట్ చేయాలని డోన్ న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. కాగా తన భర్త హత్య కేసు విచారణలో అన్యాయం జరిగిందంటూ చెరుకులపాడు నారాయణరెడ్డి భార్య కంగాటి శ్రీదేవి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. (చెరుకులపాడు నారాయణరెడ్డి గత ఏడాది మే 22న దారుణ హత్యకు గురైన విషయం విదితమే) తన భర్త నారాయణరెడ్డితో పాటు మరో వ్యక్తిని అతి కిరాతకంగా హత్యచేసిన శ్యాంబాబు అనుచరులు అటు తరువాత పోలీసులపై ఒత్తిడి తెచ్చి చార్జీషీట్లో పేర్లు తొలగించుకోవడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం చేస్తూ... నిందితులుగా కేఈ శ్యాంబాబుతో పాటు ఆస్పరి జెడ్పీటీసీ కప్పెట్రాల బొజ్జమ్మ, అప్పటి వెల్దుర్తి ఎస్ఐ నాగతులసీ ప్రసాద్‌లను తన భర్త హత్యకేసులో ముద్దాయిలుగా చేర్చాలని పేర్కొంటూ కర్నూలు జిల్లా డోన్ కోర్టులో శ్రీదేవి ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యామ్ బాబు, బొజ్జమ్మ, వెల్దుర్తి ఎస్ఐ నాగప్రసాద్‌లను నిందితులుగా చేర్చాలని సూచించింది. -
డోన్‌లో ఘర్షణ.. యాసిడ్ తాగిన చిరువ్యాపారి!
సాక్షి, కర్నూలు: డోన్‌లో చిరువ్యాపారల మధ్య ఆదివారం ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణ చినికిచినికి ఓ వ్యాపారి మృతికి కారణమైంది. వివరాలివి.. తోటి వ్యాపారులతో గొడవ నేపథ్యంలో వరదరాజులు అనే చిరువ్యాపారి రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. అయితే, అతనికి రక్షణ కల్పించాల్సిన పోలీసులే.. అడ్డం తిరిగి చితకబాదినట్టు తెలుస్తోంది. దీంతో మనస్తాపం చెందిన వరదరాజులు యాసిడ్ తాగి.. ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. -
ప్లాన్ గీశాడు.. గుంత తవ్వి పెట్టాడు !
సాక్షి, డోన్(కర్నూల్): ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైన రమిజాబీ కేసులో పలు విషయాలు వెలుగు చూశాయి. నిందితుడు షేక్ రషీద్ అలియాస్ సిద్దు ముందస్తు ప్రణాళికతో హత్య చేసినట్లు తెలిసింది. పోలీసులు అదివారం ఆ యువకుడిని అరెస్టు చేసి ఘటన ప్రదేశానికి తీసుకెళ్లి విచారించారు. హత్యకు వినియోగించిన పరికరాలను వెలికి తీయించారు. వారు తెలిపిన వివరాల మేరకు.. తమ వస్త్ర దుకాణంలో పనిచేసే రమిజాబీని ప్రేమిస్తున్నానని నమ్మించి రషీద్ గర్భం చేశాడు. తర్వాత ఆమెను వదిలించుకునేందుకు చంపాలని ప్లాన్ గీశాడు. వారం ముందుగానే ఎర్రగుంట్ల సమీపంలోని అటవీ ప్రాంతంలో పూడ్చేందుకు గుంత తవ్వి పెట్టాడు. తర్వాత గడ్డపార, చలిక చెట్ల మధ్యన ఓ గుంతలో దాచిపెట్టాడు. తర్వాత ప్రణాళికలో భాగంగా నంద్యాల పట్టణంలో కాపురం పెడదామని నమ్మించి గత నెల 20న డోన్ నుంచి బయలుదేరారు. మార్గమధ్యలో ఎర్రగుంట్ల వద్ద దిగారు. కొద్దిసేపు మాట్లాడుకొని వెళ్తామంటూ ముందుగానే ఏర్పాటు చేసుకున్న గోతి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ రమిజాబీని చున్నీతో గొంతు బిగించి చంపేసి అందులో పూడ్చిపెట్టాడు. గుర్తుపట్టకుండా ఉండేందుకే... ఆమె ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకు చంపేసి కాల్చివేసినట్లు పోలీసుల ఎదుట రషీదు అంగీకరించాడు. రమిజాబీ 8నెలల గర్భిణి కావడంతో భవిష్యత్తులో తనకు ఇబ్బందులు తప్పవని నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా ఆమె గర్భంలో ఆడ మృతశిశువు ఉన్నట్లు పోస్టుమార్టంలో బయటపడినట్లు తెలిసింది. -
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
డోన్: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక నుంచి ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వస్తున్న క్రమంలో గ్యాస్ లోడుతో వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. డోన్ రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున గ్యాస్‌లోడుతో వెళ్తున్న లారీని ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. లారీలో ఉన్న సిలిండర్లన్ని చెల్లాచెదురుగా కింద పడటంతో అవి పేలే అవకాశం ఉందని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. -
డోన్‌తో విడదీయరాని బంధం
డోన్: పత్తికొండ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్చార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డి ఆదివారం పెళ్లికి వెళ్లి తిరిగివస్తుండగా రాజకీయ ప్రత్యర్ధులు దారికాచి దారుణంగా హత్య చేశారు. ఈ హత్యపట్ల డోన్ నియోజక వర్గంలోని ఆయన సహచరులు, మిత్రులు, బంధువర్గంతో పాటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డికి బంధువు. అంతేకాక చెరుకులపాడు నారాయణ రెడ్డి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డికు ప్రియ శిష్యునిగా పేరుగాంచారు. గత ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల మూలంగా కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డితో విభేదించి వైఎస్ఆర్సీపీలో చేరారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పత్తికొండ నుంచి డిప్యూటీ సీఎం కేఈ క్రిష్ణమూర్తి పై పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం పత్తికొండ వైఎస్ఆర్సీపీ ఇన్చార్జ్గా ఉన్నారు. నారాయణ రెడ్డి పత్తికొండ, డోన్ నియోజకవర్గ ప్రజలతో, ముఖ్యనాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. డోన్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు, ముఖ్యనాయకల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు నారాయణ రెడ్డి తప్పక హాజరౌతుంటారు. ఈ ప్రాంతం ప్రజలు, ముఖ్యనాయకులను పేరుపేరునా పలకరిస్తూ అందరి అప్యాయత, అనురాగాలను పొందారు. డోన్‌తో విడదీయరాని బంధం: నారాయణ రెడ్డి ప్రాధమిక విధ్య అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1982 వరకు చదివారు. తరువాత తన తండ్రి శివారెడ్డి హత్యానంతరం ఉన్నత చదువులు కొనసాగించ లేక తండ్రి రాజకీయ వారసునిగా మారారు. ప్యాపిలి మండలం, బూరుగల గ్రామానికి చెందిన సత్యకంబగిరి రెడ్డి కుమార్తె శ్రీదేవితో నారాయణరెడ్డికి వివాహాం జరిగింది. డోన్ మండలం ఎద్దుపెంట గ్రామానికి చెందిన ఎల్లారెడ్డి కుమారుడు ప్రస్తుతం ఉపాధ్యాయులు వేంకటేశ్వర రెడ్డికి తన చెల్లెలు విజయలక్ష్మిని ఇచ్చి వివాహాం జరిపించారు. గ్రామ గ్రామాన రాజకీయ పరిచయాలతో పాటు వ్యక్తిగతంగా కూడా ప్రజలతో బంధం ఏర్పరుచుకున్న నారాయణ రెడ్డి హత్యకు గురయ్యారని తెలిసి ఈ ప్రాంతం ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. నారాయణ రెడ్డి హత్య వార్త తెలిసిన వెంటనే వేలాది మంది ప్రజలు సంఘటనా స్థలానికి, కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలివెళ్లారు. -
కేశన్న గౌడ్ అరెస్టు
డోన్ టౌన్: డోన్ మున్సిపల్ కార్యాలయం వద్ద వేలం పాటల సందర్భంగా గత శుక్రవారం వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడి చేసిన కేసులో టీడీపీకీ చెందిన డోన్ మున్సిపల్ వైస్‌చైర్మన్ కేశన్నగౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం రిలయన్స్ డాబా వద్ద ఉన్న అతనితోపాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ శ్రీనివాసులు గౌడ్ తెలిపారు. దాడి కేసులో కేశన్న గౌడ్‌తో పాటు 20 మంది నిందితులుండగా ఇప్పటి వరకు 16 మందిని అరెస్టు చేశామన్నారు. మిగిలిన నలుగురి కోసం గాలిస్తున్నామన్నారు. కేశన్నగౌడ్‌తో పాటు జగదీశ్, మద్దిలేటి, మహేష్‌గౌడ్, నాగార్జున, రూపక్ కుమార్, శ్రీనివాసరెడ్డిని మీడియా ఎదుట హాజరుపరిచారు. అనారోగ్య కారణాలతో కేశన్నగౌడ్‌ను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి పోలిసులు తరలించారు. -
బీసీలపై దాడులపై కేఈ మౌనం వీడాలి
-
పోలీసుల పక్షపాతం
- టీడీపీ వర్గీయుల ఆగడాలను నియంత్రించడంలో విఫలం - అక్రమ కేసులతో ప్రతిపక్ష నేతలపై వేధింపులా - పోలీసుల తీరుపై పీఏసీ చైర్మన్ బుగ్గన ఆగ్రహం డోన్ టౌన్: శాంతిభద్రత పరిరక్షణలో పోలీసులు పక్షపాతం చూపుతున్నారని పీఏసీ చైర్మన్ , స్థానిక శాసన సభ్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకుల దాడులకు నిరసనగా ఆయన కార్యకర్తలతో «ఆదివారం డీఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ మేరకు భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు డీఎస్పీ కార్యాలయానికి చేరుకోగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ధర్నా నిర్ణయాన్ని విరమించి డోన్ డీఎస్పీ బాబాఫకృద్దీన్, సీఐ శ్రీనివాసులు గౌడ్, ఎస్ఐలు శ్రీనివాసులుతో పట్టణంలో శాంతి భద్రతల పరిస్థితిపై చర్చించారు. టీడీపీ నాయకుల ఆగడాలు, పోలీసుల తీరును డీఎస్పీ దృష్టికి తెచ్చారు. మాఫీయా సామ్రాజ్యమా... లారీ సుంకాల పేరుతో లారీ యజమానులు, డ్రైవర్లపై దాడులు చేస్తూ ప్రతిరోజు 20వేల రూపాయలను అక్రమంగా వసూళు చేస్తున్నారని ఇది మున్సిపల్ నిబంధనలకు విరుద్ధమని డీఎస్పీ దృష్టికి తెచ్చారు. ఎక్కడపడితే అక్కడ మద్యం బెల్టుషాపులను అక్రమంగా ఏర్పాటు చేసినా ఎక్సైజ్ పోలీసులు కళ్లు మూసుకున్నారన్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, ప్రధాన కూడళ్లలో ఆడవాళ్లు, అమాయాకులపై అధికార పార్టీ నాయకుల అనుచరులు అఘాయిత్యాలు, అరాచకాలు చేస్తున్నా అదుపు చేయడంలో విఫలమయ్యారని పిర్యాదు చేశారు. అక్రమ కేసుల్లో డోన్దే అగ్రస్థానం ఒక పథకం ప్రకారం ప్రతిపక్ష పార్టీ నాయకులపై, సామాన్య ప్రజానీకంపై అధికారపార్టీ నాయకులు తప్పుడు ఫిర్యాదులు చేసిన వెంటనే పోలీసులు అక్రమ కేసులు బనాయించడం రివాజుగా మారిందన్నారు. శుక్రవారం ఏకపక్షదాడుల అనంతరం చావుబతుకుల మధ్య ఉన్న వారిపై కూడా ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయించడం ఎంత వరకు సమంజమని ఫిర్యాదు చేశారు. నిందితులకు మాత్రం రక్షణ కల్పించి పోలీసుల వాహనంలో ఇంటి వద్ద వదిలేయడం సిగ్గు చేటన్నారు. దురదృష్టకరమైన సంఘటన డోన్ పట్టణంలో జరుగుతున్న వరుస సంఘటనలపై పీఏసీ చైర్మన్ బుగ్గన అడిగిన ప్రశ్నలకు డీఎస్పీ బాబాఫకృద్దీన్ సమాధానమిస్తూ శుక్రవారం సంఘటన తమనెంతో బాదించిందన్నారు. ఈ కేసులో కొందరు నిందితులను ఇప్పటికే అరెస్టు చేశామని మిగిలిన వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో జరిగిన సంఘటనలను తమకు అపాదించవద్దని కోరుతూ ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా తమ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. అనంతరం బుగ్గన వైఎస్ఆర్సీపీ తరపున నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. -
బీసీలపై దాడులపై కేఈ మౌనం వీడాలి
డోన్ టౌన్: డోన్ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి అనుచరులు చేస్తున్న అరాచకాలపై ఆయన మౌనం వీడాలని పీఏసీ చైర్మన్ బుగ్గన డిమాండ్ చేశారు. ఆదివారం తన స్వగృహంలో బుగ్గన డోన్ జెడ్పీటీసీ శ్రీరాములుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ వేలాల సందర్భంగా శుక్రవారం టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వారు బీసీలు కాదా అని కేఈని నిలదీశారు. బీసీలకు పెద్దదిక్కుగా చెప్పుకుంటున్న కేఈ బీసీలపై జరుగుతున్న దాడులను ఖండించకపోవడం దారుణమన్నారు. అధికారపార్టీ ముసుగులో కొందరు పట్టణంలోని ప్రధానమైన వనరులను కొల్లగొడుతున్నా అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారన్నారు. ఆర్యవైశ్యులకు చెందిన విలువైన స్థలాలను కబ్జాచేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఏకపక్షంగా టెండర్లను దక్కించుకునేందుకే అధికార పార్టీ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా కేఈ కృష్ణమూర్తి తమ అనుచరులను అదుపులో పెట్టుకోవాలని, లేకుంటే ఏదో ఒక రోజు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
'టీడీపీ గుండాలను కఠినంగా శిక్షించాలి'
-
పోస్టు ప్రసాద్ పరిస్థితి విషమం
– హైదరాబాద్‌కు తరలింపు కర్నూలు: టీడీపీ వర్గీయుల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్సీపీ నాయకుడు పోస్టు ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. శుక్రవారం దాడి జరిగిన వెంటనే అతడిని కర్నూలు గౌరి గోపాల్ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యుల సూచన మేరకు శనివారం ఉదయం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో డోన్‌లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పోస్టుప్రసాద్తో పాటు గాయపడిన వైఎస్ఆర్సీపీ నాయకులు నాయకులు ఓబులాపురం గొల్ల మదన్, గొల్ల సుధాకర్, గొల్ల రమణ, పాతపేటకు చెందిన లాల్బాషాలు ప్రస్తుతం కర్నూల్లోని అమృత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కర్నూలు చికిత్స పొందుతున్న సమయంలో పోస్టు ప్రసాద్‌ను పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తదితరులు పరామర్శించారు. -
20 మందిపై హత్యాయత్నం కేసు నమోదు
డోన్ టౌన్: వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడి కేసులో మున్సిపల్ వైస్‌చైర్మన్ కేశన్నగౌడ్‌తో పాటు 19మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. శనివారం రాత్రి తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వేలంపాటకు అడ్డుపడుతున్నారనే కారణంతో వైఎస్ఆర్సీసీ వర్గీయులు పోస్టుప్రసాద్, గొల్లరమణ, మదన్, సుధాకర్, లాల్బాషాలపై కత్తులు, ఇనుపరాడ్లతో దాడిచేసి హత్యాహత్యానికి పాల్పడ్డారనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. కేశన్నగౌడ్, చక్రపాణిగౌడ్, టైలర్ చంద్ర, జగదీశ్, మద్దిలేటి, సుదర్శన్, రూపక్, వినోద్, పవన్, ఉమాయిన్, శ్రీకాంత్, నాగార్జున , హరినాథ్‌రెడ్డి , చిన్నకాంత్, పెద్దకాంత్, బుజ్జనగారి రమణ, షేక్ లాల్బాషాతో పాటు మరో ముగ్గురుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు. అందరిపై రౌడీ షీట్ నమోదు ఈ దాడికి పాల్పడిన 20 మందిపై రౌడీషీట్ నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. డోన్ డీఎస్పీ బాబాఫకృద్దీన్ ఆదేశాల మేరకు సీఐ శ్రీనివాసులు గౌడ్ పర్యవేక్షణలో ఈ కేసులో ఇప్పటి వరకు ఏడుగురిని నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపామన్నారు. మిగిలిన 17మందిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలపై కూడా.. దాడి ఘటనలో వైఎస్ఆర్సీపీ నాయకులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుప్రసాద్, గొల్ల మదన్, సుధాకర్, ఫరీ«ద్, కోట్రికె హరి తనను కులం పేరుతో దూషించారని టీడీపీకి చెందిన చిన్నకాంత్ ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు చేశామన్నారు. -
పోలీసుల వలయంలో డోన్
- టీడీపీ వర్గీయుల దౌర్జన్యకాండ నేపథ్యంలో భారీ బందోబస్తు - క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమం డోన్ టౌన్: డోన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం టీడీపీ వర్గీయులు సాగించిన దౌర్జన్యకాండ నేపథ్యంలో శనివారం నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. మున్సిపల్ వేలాల సందర్భంగా టీడీపీ నాయకులు చర్చల పేరుతో వైఎస్ఆర్సీపీ నాయకులను బయటకు పిలిచి కత్తులు, ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేయగా ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రముఖుల ఇళ్లు, ప్రధాన కూడళ్లు, మున్సిపల్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. డోన్ డీఎస్పీ బాబాఫకృద్దీన్ ఆదేశాల మేరకు సీఐ శ్రీనివాసులు గౌడ్, ఎస్ఐలు శ్రీనివాసులు, జయశేఖర్, రామసుబ్బయ్యలతో పాటు పలువురు ఎస్ఐలు బందోబస్త్‌ను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కాగా టీడీపీ దౌర్జన్యకాండను కళ్లారా చూసిన పాతపేట వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. ఏ క్షణాన ఏమి జరుగుతుందేమోనని భయాందోళన చెందుతున్నారు. -
'టీడీపీ గుండాలను కఠినంగా శిక్షించాలి'
కర్నూలు: డోన్‌లో టీడీపీ గుండాల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రసాద్ ఆరోగ్యం విషమంగా ఉంది. దీంతో మెరుగైన చికిత్స కోసం ప్రసాద్‌ను హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. కర్నూలు ఆసుపత్రిలో కార్యకర్తలను ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరామర్శించారు. దాడికి పాల్పడిన తెలుగుదేశం పార్టీ గుండాలను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. మున్సిపల్ మార్కెట్ వేలంలో పాల్గొనేందుకు వచ్చిన వైఎస్ఆర్సీపీ వర్గీయులపై శుక్రవారం టీడీపీ నేతలు కత్తులు, ఇనుపరాడ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. -
పోస్టు ప్రసాద్ పరిస్థితి విషమం
- మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): డోన్ మున్సిపల్ వేలాల విషయంలో టీడీపీ గూండాల దాడిలో గాయపడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్థానిక గౌరి గోపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పాశవిక దాడిలో పోస్టు ప్రసాద్, ఓబులాపురం సురేష్, సుధాకర్, మదన్, రమణ, లాల్బాషాలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరికి మొదట డోన్ ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్సను అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ సరైన చికిత్స అందకపోవడంతో బంధువులు, కుటుంబ సభ్యులు గౌరి గోపాల్, అమృత ప్రయివేట్ ఆసుపత్రులకు తీసుకెళ్లారు. గౌరి గోపాల్లో చికిత్స పొందుతున్న పోస్టు ప్రసాద్ ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయనకు వెంటిలేటర్‌పై అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. మిగిలిన ఐదుగురు అమృత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పథకం ప్రకారమే దాడి : గౌరు వెంకటరరెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు టీడీపీ నేతలు పక్కా పథకం ప్రకారమే తమ పార్టీ కార్యకర్తలపై అత్యంత పాశవికంగా దాడి చేశారు. కత్తులు, రాడ్లు, పట్టుడు కర్రలతో స్థానికులను భయాందోళనలకు గురి చేయడం చూస్తే అధికార పార్టీ అండదండలతోనే చెలరేగిన విషయం స్పష్టంగా తెలుస్తోంది. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. బాధిత కుటుంబాలకు పార్టీ అన్నివిధాల అండగా నిలుస్తుంది. దాడి జరిగిన తర్వాత కూడా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం దారుణమైన విషయం. -
ఏడుగురు అరెస్టు
డోన్ టౌన్ : మున్సిపల్ వేలం పాటల సందర్భంగా శుక్రవారం ఉదయం వైఎస్ఆర్సీపీ నాయకులపై జరిగిన దాడి ఘటనలో 7గురిని అరెస్టు చేసినట్లు శుక్రవారం రాత్రి ఏఎస్పీ రవిప్రకాశ్ తెలిపారు. సీఐ కార్యాలయంలో విలేకరుల ఎదుట నిందితులను హాజరుపరిచిన అనంతరం ఆయన డోన్ డీఎస్పీ బాబాఫకృద్దీన్తో కలిసి మాట్లాడారు. పోస్టుప్రసాద్, రమణ, సుధాకర్, లాల్‌బాషా, మదన్లపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనతో సంబందం ఉన్న కొండపేట, చిగురుమానుపేటలకు చెందిన 7గురిని గుర్తించామన్నారు. నిందితులు చిన్నకాంత్ అలియాస్ శ్రీకాంత్, పెద్దకాంత్ అలియాస్ చంద్రకాంత్, దూదేకుల హుమయూన్, షేక్‌లాల్ బాషా, బుడ్డన్నగారి రమణ, గాజుల శ్రీకాంత్, పల్లెగాని చక్రపాణిగౌడ్లను దొరపల్లె బ్రిడ్జ్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వీరిని డోన్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ చిన్నికృష్ణ ఎదుట హాజరుపరుస్తామన్నారు. ఘటనలో సుమారు 20 మంది పాల్గొన్నారని ఏఎస్పీ తెలిపారు. మున్సిపల్ వేలం పాటలో తమకు పోటీగా వేలం పాడేందుకు ధరావత్తు సొమ్ము చెల్లించారనే ఆగ్రహంతోనే నిందితులు ఈ దాడికి పాల్పడ్డారన్నారు. -
కర్నూలులో అధికారపార్టీ నేతల దౌర్జన్యం
-
రైలు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు
► 20 రోజులుగా అక్రమంగా నిర్బంధించిన డోన్ రైల్వే ఔట్‌పోస్ట్ పోలీసులు ► చిత్రహింసలు తాళలేక తప్పించుకుని పారిపోయిన బాధితుడు ► రైలు కిందపడి రెండు కాళ్లు కోల్పోయిన తమిళనాడు యువకుడు ► తప్పించుకుని పారిపోతూ గాయపడ్డాడని రైల్వే పోలీసుల వివరణ డోన్ టౌన్ : రైల్వే ఔట్‌పోస్టు పోలీసులు 20 రోజులుగా అక్రమంగా నిర్భందించి పోలీసులు పెడుతున్న చిత్రహింసలు తాళలేక బుధవారం ఉదయం స్టేషన్ నుంచి పారిపోతూ ప్రమాదవశాత్తు రైలు కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన యువకుడి ఉదంతం డోన్ రైల్వేస్టేషన్లో బుధవారం జరిగింది. ఈ ప్రమాదంలో అతడు రెండు కాళ్లు కోల్పోయి, రైలు పట్టాలపై తల్లడిల్లిన తీరుచూసి ప్రయాణీకులు కన్నీరు పెట్టారు. ప్రత్యక్ష సాక్షులు అందించిన సమాచారం మేరకు తమిళనాడు రాష్ట్రం, తిరుచ్చీకి చెందిన ముడియంటి కుమార్ (35) అనే యువకుడిని రైళ్లలో జరిగిన దొంగతనాల గురించి విచారించేందుకు 20రోజుల క్రితం ఔట్‌పోస్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే అతడి నుంచి పోలీసులు ఎలాంటి సమాచారం రాబట్టలేకపోయారు. తన విషయంలో పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తుండడంతో.. ఆ యువకుడు బుధవారం ఉదయం స్టేషన్ నుంచి రైలు పట్టాలపై పరుగులు తీశాడు. అదే సమయంలో గుంతకల్లు నుంచి విజయవాడ వైపు వెళుతున్న గూడ్స్ బండి ఆ యువకుడిని ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన ఆ యువకుడు సుమారు 20 నిమిషాలు పాటు పట్టాలపైనే ఆర్తనాదాలు చేశాడు. తమ బండారం బయటపడుతుందనే ఉద్దేశంతో రైల్వే ఔట్‌పోస్టు పోలీసులు గాయపడిని ఆ యువకుడిని హుటాహూటీన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు అక్కడి నుంచి కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చేతులకు బేడీలు వేశారా..? రైల్వే ఔట్‌పోస్టు నుంచి పారిపోయే సందర్భంలో అనుమానితుడైన ముడియంటి కుమార్ చేతులకు బేడీలు వేసినట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఔట్ పోస్టు పోలీసులు అక్కడికి చేరుకుని చేతికున్న బేడీలను తొలగించి అతడిని ఆసుపత్రికి తరలించినట్లు కొందరు ప్రయాణీకులు తెలిపారు. మంగళవారం రాత్రి స్థానిక రైల్వేస్టేషన్లో ల్యాప్‌టాప్ పట్టుకుని అనుమానాస్పదంగా తిరుగుతున్న కుమార్‌ను అదుపులోకి తీసుకున్నామని ఎస్ఐ సుబ్బారావు తెలిపారు. బుధవారం ఉదయం అతడిని కోర్టులో హాజరుపరిచేందుకు స్టేషన్ నుంచి బయటకు తీసుకోస్తుంటే తప్పించుకుని ప్రమాదానికి గురయ్యాడని వివరించారు. దొంగతనాల కేసులో విచారించేందుకు అతడిని నిర్భందించినట్లు వచ్చిన వార్తలు వాస్తవం కాదన్నారు. -
పోలీసుల నుండి తప్పించుకోబోయి..
-
కొత్త రెవెన్యూ డివిజన్లుగా డోన్, ఆత్మకూరు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో మరో రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కాబోనున్నాయి. కొన్నేళ్లుగా జిల్లాలో కొత్త డివిజన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉన్నా కార్యరూపం దాల్చలేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఎట్టకేలకు కొత్త రెవెన్యూ డివిజన్లకు మార్గదర్శకాలు విడుదల చేసింది. జిల్లాలోని డోన్, ఆత్మకూరులు కేంద్రాలుగా డివిజన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం జిల్లాలో మూడు డివిజన్లు ఉన్నాయి. కొత్తవాటితో వీటి సంఖ్య ఐదుకు పెరగనుంది. కొత్త రెవెన్యూ డివిజన్లలో ఏఏ నియోజకవర్గాలను చేర్చాలి, ప్రస్తుత డివిజన్లలో ఏఏ నియోజక వర్గాలు ఉన్నాయి తదితర వివరాలు పంపాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. ఇప్పటి వరకు ఒక నియోజకవర్గంలో కొన్ని మండలాలు ఒక నియోజకవర్గంలో ఉంటే మరికొన్ని మండలాలు మరో డివిజన్లో ఉన్నాయి. వీటిని సవరిస్తూ కొత్త డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. -
విద్యార్థి దుర్మరణం
డోన్ టౌన్: పట్టణంలోని శ్రీరాముల దేవాయలం సమీపంలోని కర్నూలు రైల్వే గేటు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి దుర్మరణం చెందాడు. స్థానిక సీపర్స్ కాలనీకి చెందిన హమాలీ శ్రీనివాసులు, లక్ష్మీదేవి కుమారుడు విష్ణువర్ధన్ (13) పాతపేటలోని జెడ్పీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం సైకిల్‌పై బయటకు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో విష్ణువర్ధన్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మతి చెందాడు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని రక్తపు మడుగులోని కుమారుడిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. డోన్ ఎస్ఐ సుబ్రమణ్యంరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రై వర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
'నిరూపిస్తే ఆ భూమి నీకే రాసిస్తా'
- డిప్యూటీ సీఎం కేఈకి పీఏసీ చైర్మన్ బుగ్గన సవాల్ - హంద్రీనీవా భూసేకరణలో బీనామీ పేర్లతో కేఈ కుటుంబీకులు రూ.కోట్లు స్వాహా డోన్ టౌన్: తన కుటుంబీకుల పేరుతో తొమ్మిది వందల ఎకరాల భూములు ఉన్నట్లు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆరోపణలు చేయడంపై పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డోన్ ఆర్ఈ రవికుమార్ స్వగృహంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ తనపై చేసిన ఆరోపణలను కేఈ నిరూపిస్తే 899 ఎకరాల భూమిని ఆయనకే రాయించి ఒక ఎకరం మాత్రమే కేఈకి గుర్తుగా ఉంచుకుంటానని ఎద్దేవా చేశారు. వాస్తవంగా చెర్లోపల్లిలో తన పేరుపై ఎకరా భూమి ఉండగా కేఈలాంటి వ్యక్తులు అబద్దాలు, అభూత కల్పనలతో ప్రచారం చేయడం తగదన్నారు. బినామీ పేర్లతో ప్రజాధనాన్ని బొక్కేయడంలో కేఈ కుటుంబీకులుకు మించిన వారు జిల్లాలో లేరన్నారు. ఓర్వకల్లు సెజ్ ప్రాంతంలో, కంబాలపాడు హంద్రీనీవా భూసేకరణలో ప్రభుత్వ భూములకు బీనామీ పేర్లతో పట్టాలు సృష్టించి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దిగమింగారని ఆరోపించారు. కేఈ కుటుంబీకులు అభివృద్ధి పనులకు ఏనాడు సెంటు స్థలం ఇవ్వలేదన్నారు. వంద ఏళ్ల చరిత్ర ఉన్న తన సొంత భూమికి భూసేకరణ చట్టప్రకారం నష్ట పరిహారం కోరానే తప్ప, అభివృద్ధి పనులను ఏనాడు అడ్డుకోలేదన్నారు. చెర్లోపల్లిలోని ఎకరా భూమికి తానే యజమానినని, భూమిపై తనకు సర్వహక్కులు ఉన్నాయని బుగ్గన ప్రకటించారు. కేఈ ఇంటిలో రోడ్డు వెడల్పంటూ అడుగు స్థలం దౌర్జన్యంగా ఆక్రమిస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. తనకు నోటీసు ఇవ్వకుండా అధికారమదంతో పోలీసులను అడ్డుపెట్టుకొని స్థలాన్ని ఆక్రమిస్తే కోర్టుకు వెళ్లడం తప్ప తనకు మరో మార్గం కనపడలేదన్నారు. అడిగితే ఉచితంగా ఇచ్చేవాడిని: అభివృద్ధి పనులకు తాను వ్యతిరేకమని కేఈ ప్రచారం చేయడంపై బుగ్గన మండిపడ్డారు. నష్టపరిహారం చెల్లించి చట్టప్రకారం భూమిని తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను తానే స్వయంగా కోరిన విషయాన్ని బుగ్గన గుర్తుచేశారు. సామరస్యంగా తనను అడిగినట్లయితే ఎకరం భూమిని ఉచితంగా ఇచ్చేవాడినని తెలిపారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పుల్లారెడ్డి, వెంకోబరావ్, రాజవర్దన్, దినేష్‌గౌడ్, మల్లెంపల్లి రామచంద్రుడు,పెద్దిరెడ్డి, కోట్రికే హరికిషన్, రాజశేఖర్‌రెడ్డి, గజేంద్ర, కటిక వేణు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
కర్నూలు: లారీ, కారు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా డోన్ సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గాజులదిన్నె వాటర్ ప్రాజెక్ట్‌ను పరిశీలించనున్న వైఎస్ జగన్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. డోన్ నియోజకవర్గంలోని కృష్ణగిరి సమీపంలోని గాజులదిన్నె వాటర్ ప్రాజెక్ట్ పంప్‌హౌస్‌ను ఆయన ఈరోజు మధ్యాహ్నం పరిశీలించనున్నారు. అనంతరం గత ఫిబ్రవరి 19న వెల్దుర్తి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్యాపిలి ఎంపీటీసీ సభ్యురాలు బోరెడ్డి శ్రీలత ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారన్నారు. సాయంత్రం 5 గంటలకు పార్టీ నేత చేరుకులపాడు లక్ష్మీనారాయణరెడ్డి ఆధ్వర్యంలో పత్తికొండలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో పాల్గొంటారు. -
ఏసీబీ వలలో రెవెన్యూ సిబ్బంది
డోన్‌టౌన్: డోన్‌లో సోమవారం లంచం తీసుకుంటూ డిప్యూటీ తహశీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ), వీఆర్వో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ మహబూబ్‌బాషా తెలిపిన మేరకు..డోన్ మండలం నక్కలవాగుపల్లె గ్రామ డీలర్ చంద్రశేఖర్‌రెడ్డి రేషన్ దుకాణాన్ని 20 రోజుల క్రితం ఆర్ఐ రాజేశ్వరి, వీఆర్వో రాజు తనిఖీ చేశారు. ఇందుకు సంబంధించి వ్యతిరేకంగా నివేదిక ఇవ్వకుండా ఉండాలంటే రూ.20 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొదటి దఫాగా డీలర్ రూ.5 వేలు చెల్లించాడు. ఆ తర్వాత డిప్యూటీ తహశీల్దార్ జయంతికి కూడా రూ.15 వేలు ఇవ్వాలని, లేదంటే లెసైన్స్ రద్దు చేయిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. విసిగిపోయిన డీలర్ చంద్రశేఖరరెడ్డి తన సోదరుడు రమణారెడ్డితో కలసి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు సోమవారం డీలర్ నుంచి రూ.12 వేలు లంచం తీసుకుంటుండగా డీటీ, ఆర్ఐ, వీఆర్వోలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఊహించని పరిణామంతో కంగుతిన్న ఆర్ఐ రాజేశ్వరి తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. లంచం తీసుకున్నట్లుగా నిర్ధారించిన రంగు నీళ్ల సీసాను అధికారుల కళ్లెదుటే ధ్వంసం చేసి కార్యాలయంలోని మరో వాకిట్లో పరారయ్యేందుకు యత్నించగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో సీఐలు ప్రసాద్‌రావు, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. కాగా.. పౌరసరఫరాల శాఖ గోదాములో సరుకుల రవాణాపై ఏసీబీ అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. ఇందులో కూడా భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఏసీబీ అధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. -
కొడుకుతో కలిసి భర్తపై దాడి చేసిన భార్య
కర్నూలు : కర్నూలు జిల్లా డోన్ తారక రామనగర్‌లో దారుణం జరిగింది. కొడుకుతో కలిసి కట్టుకున్న భర్తపై దాడి చేసిందో భార్య. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా నివాసం ఉంటున్న కాశింను సోమవారం తెల్లవారుజామున అతని భార్య, కుమారుడు వేట కొడవలితో దాడి చేశారు. కుటుంబ కలహాల కారణంగానే వారు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. కాశిం భార్య మగ్భూల్ బీ, కుమారుడు మహబూబ్ భాషను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తండ్రి మద్యం సేవించి రోజు వేధిస్తున్నాడని, వాటిని భరించలేకే దాడి చేసినట్లు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
మైనింగ్ వ్యాపారం యథేచ్ఛగా...
డోన్: డోన్ ప్రాంతంలో అక్రమ మైనింగ్ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. దీనిని అడ్డు కట్ట వేయడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. అక్కడక్కడ చెక్‌పోస్టులున్నా పేరుకుమాత్రమే అన్నట్లుగా కొనసాగుతున్నాయి. ఏడాది క్రిందట కలెక్టర్ స్వయంగా తనిఖీ చేసి డోన్పట్టణ సమీపంలోని కోట్లవారిపల్లెవద్ద, వెల్దుర్తి మండలం రామళ్లకోటవద్ద, బేతంచర్ల వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటుచేశారు. ఈ చెక్‌పోస్టులలో ఏడీఎంజీ అధికారులతో పాటు, పారెస్టు, రెవెన్యూ అధికారులు తనిఖీ చేయాలి. అయితే, చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు కానీ, అక్కడ ఏడీఎంజీ కార్యాలయ సిబ్బంది తప్ప ఎవరూ ఉండటంలేదు. ఒక వేళ వీరు పట్టుకుంటే మామూళ్లు ఇచ్చి అక్రమార్కులు యథేచ్ఛగా మైనింగ్‌ను తరలిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. డోన్, బేతంచర్ల ప్రాంతం నుంచి ఐరన్‌ఓర్ ముడి ఖనిజం ప్రతిరోజు లారీల్లో బళ్లారి, తాడిపత్రి, కర్నూలు ప్రాంతాలకు తరలివెల్లుతోంది. ఈ దందా జీరో వ్యాపారంతో సాగుతోంది. బేతంచర్ల మండలంలోని ముసలాయిచెరువు, ఎన్.రంగాపురం, గూటుపల్లి, తవిసికొండ, ఉసేనాపురం, నాగమల్లకుంట, ముద్దవరం, డోన్ మండలంలోని చిన్నమల్కాపురం, కన్నపుకుంట, కమలాపురం ప్రాంతాలనుంచి అక్రమంగా వెలికి తీసిన ఐరన్‌ఓర్‌ను తరలిస్తున్నారు. చిన్నమల్కాపురం, గూటుపల్లి ప్రాంతాల్లో అటవీ ప్రాంతం, పట్టాభుమూల్లో వెలికి తీసిన ఇనుపఖనిజాన్ని రాత్రికి రాత్రి డోన్‌మీదుగా హద్దులు దాటిస్తున్నా రు. ఈ అక్రమార్కులకు డోన్, బేతంచర్ల, ప్యాపిలి పోలీసుల సహకాారం పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. తూతూ మంత్రంగా తనిఖీలు: కోట్లవారిపల్లె వద్ద ఏర్పాటుచేసిన చెక్‌పోస్టు తూతూ మంత్రంగా కొనసాగుతోంది. బేతంచర్ల, కొచ్చెర్వు, జలదుర్గం ప్రాంతం నుంచి వచ్చే లారీలను తనిఖీలు చేస్తూ పర్మిట్లను పరిశీలించాలి. అయితే, ఈ తనిఖీలు ఏడీఎంజీ కార్యాలయం నుంచి వచ్చిన ఇద్దరు సాధారణ సిబ్బంది, తలారీ మాత్రమే నిర్వహిస్తున్నారు. వీరు ఉదయం, సాయంత్రం మాత్రమే తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో రాత్రిపూట యథేచ్ఛగా అక్రమ రవాణా జరుగుతోంది. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన మైనింగ్ అధికారులు కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. సిబ్బంది కొరత ఉంది మైనింగ్‌ను అక్రమంగా తరలించకుండా పలుచోట్ల చెక్‌పోస్టులు ఉన్నాయి. అయితే, సిబ్బంది కొరత కారణంగా వాటిలో పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించలేని పరిస్థితి. చెక్‌పోస్టుల వద్ద పర్మనెంట్‌గా గేట్లు ఏర్పాట్లు చేయాలనుకుంటున్నాం. రెవెన్యూ, సేల్‌ట్యాక్స్ సిబ్బందిని అక్కడ ఏర్పాటు చేస్తే మరింత కట్టుదిట్టం చేయవచ్చు. - చారీ, ఏడీ మైన్స్ -
విజయవంతం వైఎస్ విజయమ్మ పర్యటన సక్సెస్
సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రచారం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. జిల్లాలో నాలుగు రోజుల పాటు సాగిన పర్యటన విజయవంతమైంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 20న అనంతపురం జిల్లా నుంచి నేరుగా బనగానపల్లెకు చేరుకున్న విజయమ్మ ఆళ్లగడ్డ, నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు, డోన్, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోని మున్సిపాలిటీల్లో పర్యటించారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి వస్తున్నారని తెలుసుకున్న ఆయా గ్రామాల ప్రజలు ప్రధాన రహదారుల వెంట బారులు తీరారు. అడుగడుగున పూల వర్షం కురిపించి అభిమానం చాటుకున్నారు. బహిరంగ సభలకు జనం పోటెత్తారు. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేలను గెలుపొందించడం ద్వారా వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోగలిగితే వైఎస్ సువర్ణయుగం మళ్లీ చూడగలమన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ సంక్షేమ పాలనను.. చంద్రబాబు, కిరణ్‌ల ప్రజా వ్యతిరేక పాలనను కళ్లకు కట్టినట్లు వివరించడం ప్రజలను ఆలోచింపజేసింది. రాష్ట్రాన్ని ముక్కలు చేయడంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు తీసుకున్న నిర్ణయంపై విరుచుకుపడ్డారు. రానున్న ఎన్నికల్లో ఈ మూడు పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మొత్తంగా విజయమ్మ పర్యటన ప్రత్యర్థి పార్టీల నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. ఆమె ప్రసంగాలు తాజా మాజీ ఎమ్మెల్యేలకు ముచ్చెమటలు పట్టించగా.. ఆయా ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల గెలుపు నల్లేరు మీద నడకేననే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రచారం చేపట్టిన పలు మున్సిపాలిటీల్లో ప్రధానమైన నాయకులు పార్టీలో చేరడం శ్రేణులకు మరింత బలాన్నిస్తోంది. చివరి రోజు నాలుగు మున్సిపాలిటీల్లో ప్రచారం వైఎస్ విజయమ్మ చివరి రోజు ఆదివారం డోన్, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోని మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె ప్రచారానికి ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రోడ్‌షోలకు విశేష స్పందన లభించింది. డోన్ పట్టణంలో బహిరంగ సభకు ఇసుకేస్తే రాలనంత జనం పాల్గొన్నారు. గూడూరులో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మణిగాంధీ, ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో సభకు పల్లెల నుంచి ప్రజలు పోటెత్తారు. ఎమ్మిగనూరు, ఆదోనిలోనూ రోడ్‌షోలు, బహిరంగ సభల్లో విజయమ్మ ప్రసంగం ఆకట్టుకుంది. కార్యక్రమంలో పార్టీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బుట్టా రేణుక, జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, కొత్తకోట ప్రకాష్‌రెడ్డి.. డోన్, కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు బుగ్గన రాజేంధ్రనాథ్‌రెడ్డి, మణిగాంధీ, కోట్ల హరిచక్రపాణిరెడ్డి, మంత్రాలయం నాయకుడు వై.ప్రదీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం ముగించుకున్న విజయమ్మ హైదరాబాద్‌కు బయలుదేరారు -
హైవేపై లారీ దగ్ధం
డోన్‌టౌన్, న్యూస్‌లైన్ : గ్రానైట్ క్వారీ నుంచి రాళ్లను తరలిస్తున్న ఓ లారీని ఆదివారం అర్ధరాత్రి జాతీయ రహదారిపై తగులబెట్టిన ఘటన డోన్‌లో కలకలం రే పింది. ఆదోని క్వారీ నుంచి కృష్ణగిరి, చనుగొండ్ల, ఇందిరాంపల్లెలో ఉన్న గ్రానైట్ క్వారీల నుంచి నిత్యం టన్నుల కొద్ది గ్రానైట్ తరలిపోతోంది. అయితే వీటి రవాణా విషయంలో ఆధిపత్యం చాటుకోవడం కోసం టీడీపీ నాయకుడు కేశన్న, తాడిపత్రికి చెందిన ట్రాన్స్‌పోర్టు యజమాని మధ్య వివాదపడుతున్నారు. ఇద్దరి మధ్య నెలకొన్న వివాదాగ్నికి ఆదివారం రాత్రి లారీ బుగ్గిగా మారింది. ఓబులాపురం మిట్ట వద్ద ఎమ్మార్పీఎస్ నాయకులు బొలెరో క్యాబ్‌లో వచ్చి లారీని అడ్డుకున్నట్లు డ్రైవర్ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. సెల్ఫోన్లను లాక్కోవడంతోపాటు టైర్లలో గాలితీశారన్నారు. చితకబాదడడంతో పారిపోయినట్లు తెలిపాడు. అనంతరం డీజిల్ట్యాంకును పగులగొట్టి లారీకి నిప్పు పెట్టారని ఆరోపించాడు. అయితే గ్రానైట్ తరలిస్తుంటే అడ్డుకుని చెక్ పోస్టు అధికారి వెంకటయ్య, మీడియాకు సమాచారం అందించాము తప్పితే మిగతా విషయాలు తమకు తెలియవని ఎమ్మార్పీఎస్ నాయకులు గంధం శ్రీనివాసు, మరికొందరు తెలిపారు. యాజమాన్యమే ఈ పని చేసి నింద తమపై మోపుతోందని ఆరోపించారు. లారీని ఎవరు తగులబెట్టారనే విషయంపై స్పష్టత రాలేదు. ఇందుకు సంబంధించి లారీ యజమాని సుబ్బారావు ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకుడు టీ.ఈ. కేశన్నగౌడ్, ఉంగరానిగుండ్ల సర్పంచ్ రాముడు, ఎమ్మార్పీఎస్ నాయకుడు గంధం శ్రీనివాస్, క్యాబ్ డ్రైవర్ బాషా, ఈడిగె గోపాలు, సుధాకర్, ముజాఫర్, రంగన్న, మరొకరిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. -
పోలీసుల అదుపులో కిడ్నాపర్లు
డోన్‌టౌన్, న్యూస్‌లైన్ : ఓ యువకున్ని ఎత్తుకెళ్లి రూ. 15 లక్షలు డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులను ముప్పుతిప్పలు పెడుతున్న ఓ ముఠాను శుక్రవారం డోన్ పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నాపర్ల చెర నుంచి ఆ యువకునికి విముక్తి కల్పించి తండ్రికి అప్పగించారు. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని దొరపల్లెకు చెందిన ఎల్లప్ప కుమారుడు మధు హైదరాబాద్‌లో చిరువ్యాపారం చేసుకుంటూ గత నెల 20వతేదీన కిడ్నాప్‌కు గురయ్యాడు. అదే సమయంలో అతని వెంట ఉన్న మరో బాలుడు జంగాల నాగరాజు తప్పించుకున్నాడు. మధును ఎత్తుకెళ్లిన కిడ్నాపర్లు రూ. 15లక్షలు ఇస్తే వదిలిపెడతామని ఫోన్ చేసి బెదిరిస్తుండడంతో తండ్రి ఎల్లప్ప, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు మొదలెట్టిన పోలీసులు డబ్బులు డిమాండ్ చేసేందుకు కిడ్నాపర్లు వాడిన సెల్‌ఫోన్ నెంబర్ల ఆధారంగా కేసును చేధించారు. డోన్‌కు చెందిన జంగాల ఇప్పి నాగశెట్టి, జంగాల ఈర్లపల్లి చంద్రయ్య, దేవనకొండ మండలం పి.కోటకొండకు చెందిన బోయ పంపన్న, బోయ గడివేముల వెంకటేష్, బోయ కోలంట్ల రామాంజనేయులు, బోయ గిడ్డయ్య, కమ్మరికౌలుట్లయ్య దొరపల్లె క్రాస్‌రోడ్డు వద్ద 44వ నెంబర్జాతీయ రహదారిపై సఫారీ వాహనంలో సంచరిస్తుండగా అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్న సీఐ డేగలప్రభాకర్, ఎస్ఐలు మోహన్‌రెడ్డి, సతీష్, సిబ్బందిని అభినందించారు.