
సాక్షి, కర్నూలు : డోన్ పట్టణంలోని కొండపేట బీసీ హాస్టల్ పక్కన ఉన్న మసీదు వద్ద భిక్షాటన చేసే శ్రీను అనే వ్యక్తి వద్ద రూ.2,04,459 నగదు లభించింది. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రీను అనే వృద్ధుడు మూడేళ్ల నుంచి డోన్‌లో భిక్షాటన చేస్తున్నాడు. స్థానికుల కోరిక మేరకు అతనికి సపర్యలు చేసేందుకు ద్రోణాచలం సేవా సమితి సభ్యులు సోమవారం ఉపక్రమించగా అతని వద్దనున్న 14 చొక్కాల్లోని ప్లాస్టిక్ కవర్లలో మడత వేసి ఉంచిన రూ.2.04 లక్షల విలువైన నోట్లను గుర్తించారు. మహబూబ్‌నగర్ పోలీసుల సహాయంతో శ్రీను చిరునామా తెలుసుకునేందుకు డోన్ పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు ద్రోణాచలం సేవా సమితి సభ్యుడు ఆలా మధు తెలిపారు. (ఆంధ్రజ్యోతి వాహనం సీజ్ )