beggar
-
మిలియనీర్లకు మించి అదిరిపోయే విందు : సోషల్‌మీడియాలో సందడే సందడి!
ప్రతిరోజూ ఇంటర్నెట్లో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వింతగా, మరికొన్నిఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా పాకిస్తాన్‌లోని ఒక బిచ్చగాడి కుటుంబం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ భారీ విందు ఇవ్వడం సోషల్ మీడియాలో విశేషంగా మారింది. స్టోరీ ఏంటంటే..దేవాలయాల వద్ద, వివిధ కూడళ్ల వద్ద బిచ్చమెత్తుకునే బిచ్చగాళ్లకు సంబంధించిన కథనాలు గతంలో చాలానే విన్నాం. చేసే వృత్తి భిక్షాటన అయినా, ఖరీదైన ఆస్తులు, ఇల్లు కలిగి ఉండటం తెలుసు. కానీ స్వయంగా బిచ్చమెత్తుకుని జీవనం సాగించే ఒక కుటుంబం దాదాపు 20 వేలమందికి పసందైన విందు ఇవ్వడం లేటెస్ట్ సెన్సేషన్‌గా మారింది. అది కూడా ఇంట్లోని పెద్దావిడ చనిపోయి, 40వ రోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం విశేషంBeggars in Gujranwala reportedly spent Rs. 1 crore and 25 lacs on the post funeral ceremony of their grand mother 🤯🤯Thousands of people attended the ceremony. They also made arrangement of all kinds of meal including beef, chicken, matranjan, fruits, sweet dishes 😳😳 pic.twitter.com/Jl59Yzra56— Ali (@PhupoO_kA_betA) November 17, 202420వేల మంది అతిథులు, 2 వేల వాహనాలు గుజ్రాన్వాలాలోని రహ్వాలి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ కార్యక్రమం జరిగింది. అతిథులను వేదిక వద్దకు తరలించడానికి సుమారు 2,000 వాహనాలను కూడా ఏర్పాటు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. పంజాబ్‌లోని వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది హాజరయ్యారు. మధ్యాహ్న భోజనం కోసం, సిరి పాయె, మురబ్బా వంటి సాంప్రదాయ వంటకాలతోపాటు పలు మాంసాహార వంటకాలను వడ్డించారు. ఇందుకోసం 250 మేకలను వినియోగించినట్టు సమచారం. వీటితోపాటు మటర్ గంజ్ (స్వీట్ రైస్), అనేక తీపి వంటకాలతో అతిథుల నోరు తీపి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచారు. దీనిపై నెటిజన్లు, అటు సానుకూలంగా,ఇటూ ప్రతికూలంగానూ కామెంట్స్ చేశారు. -
ఇక నుంచి అప్పులు వీళ్లనే అడుగుదాం సార్!
-
బిచ్చగాడి ఇంట్లో ఫంక్షన్..
-
ఓటీటీలో డార్క్ కామెడీ సినిమా
కోలీవుడ్‌లో దాదా, స్టార్ వంటి సినిమాలతో పాపులర్ అయిన కవిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం బ్లడీ బెగ్గర్. దర్శకుడు శివబాలన్ ముత్తుకుమార్ తెరకెక్కించిన చిత్రం దీపావళి సందర్భంగా తమిళ్లో విడుదలైంది. అక్కడ మంచి విజయం సాధించడంతో నవంబన్ 7న తెలుగులో కూడా విడుదలైంది. దాదా సినిమాతో టాలీవుడ్లో కూడా కాస్త గుర్తింపు తెచ్చుకోవడంతో ఈ చిత్రాన్ని ఇక్కడ కూడా రిలీజ్ చేశారు. అయితే, ఈ చిత్రం తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటన వచ్చేసింది.బ్లడీ బెగ్గర్ సినిమా కోసం నిర్మాత నెల్సన్ దిలీప్‌కుమార్ రూ. 5 కోట్లకు పైగానే ఖర్చు పెట్టారు. అయితే, ఈ సినిమా కేవలం తమిళ్లోనే సుమారు రూ. 20 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీంతో ఈ చిత్రం ఓటీటీ హక్కుల్ని కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా కాస్త ఎక్కువ ధరకే కొనుగోలు చేసింది. ఈ చిత్రాన్ని నవంబరు 29 నుంచి స్ట్రీమింగ్కి తీసుకురానున్నట్లు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. తెలుగులో కూడా అదే రోజు అందుబాటులో ఉండనుంది. డార్క్ కామెడీ మూవీని చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ పేర్కొంది.కథేంటి?కళ్లు లేని కబోదిని బాబు, నడవలేని అభాగ్యుడిని బాబు.. అని మాయమాటలు చెప్పి డబ్బులు అడుక్కునే ఓ బిచ్చగాడు (కవిన్). వచ్చిన డబ్బులతో లైఫ్ జాలీగా గడిపేస్తుంటాడు. ఓ రోజు దినం భోజనాల కోసమని చాలామంది బిచ్చగాళ్లతో పాటు ఓ పెద్ద బంగ్లాకి వెళ్తాడు. భోజనాలు అన్నీ పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లిపోకుండా దొంగచాటుగా బంగ్లాలోకి వెళ్తాడు. కాసేపటివరకు బాగానే ఎంజాయ్ చేస్తాడు. కానీ ఊహించని పరిస్థితుల వల్ల లోపల ఇరుక్కుపోతాడు. ఆ తర్వాత ఏమైంది? బంగ్లా యజమానులు బిచ్చగాడిని ఎందుకు చంపాలనుకున్నారు? చివరకు బతికి బయటపడ్డాడా లేదా అనేదే స్టోరీ? -
లిప్‌లాక్ సీనా..? హీరోయిన్ ఎవరైనా సరే ఓకే చెప్తా: హీరో
బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన చాలామంది నటీనటులు ఇప్పుడు మంచి స్థాయికి చేరుకున్నారు. అలాంటి వారిలో నటుడు కవిన్ ఒకరు. లిఫ్ట్ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన ఈయన ఆ తర్వాత డాడా చిత్రంతో మంచి విజయాన్ని సాధించారు. అదేవిధంగా స్టార్ చిత్రం ఈయనకి మంచి పేరు తెచ్చి పెట్టింది. తాజాగా కవిన్ కథానాయకుడిగా నటించిన బ్లడీ బెగ్గర్ చిత్రం దీపావళి సందర్భంగా గత నెల 31వ తేదీన విడుదలై ప్రదర్శింపబడుతోంది. నవంబర్ 7న తెలుగులో కూడా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఒక భేటీలో ఏ హీరోయిన్‌తో లిప్‌లాక్ సన్నివేశంలో నటించాలని కోరుకుంటున్నారు అన్న ప్రశ్నకు అలాంటి కోరిక ఏమీ లేదని బదులిచ్చారు. అయితే కథకు అవసరమైతే ఏ నటితోనైనా లిప్‌లాక్ సన్నివేశంలో నటించడానికి సిద్ధమే అని పేర్కొన్నారు. ఇలా ఈయన చెప్పిన మాటలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కారణం కవిన్ ప్రస్తుతం మాస్క్ అనే చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత నయనతార జంటగా ఒక చిత్రం చేయనున్నారు. దీనికి కిస్ అనే టైటిల్ నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. ఇది రొమాంటిక్ లవ్ స్టోరీతో తెరకెక్కనున్న వైవిధ్య భరిత కథా చిత్రం అని సమాచారం. దీంతో ఈ చిత్రంలో నయనతార, కవిన్‌ల మధ్య లిప్‌లాక్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయా అనే ఆసక్తి ఇప్పుడు సినీ వర్గాల్లో నెలకొంది. -
డబ్బు లాక్కొని హీరోయిన్ని భయపెట్టిన బిచ్చగాడు
హైదరాబాద్ లాంటి నగరాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర బిచ్చగాళ్లు బెడద ఎక్కువే. లేదు అంటే వెళ్లిపోతారు. కానీ కొందరు మాత్రం ఇచ్చేంత వరకు ఇబ్బంది పెడుతుంటారు. కొన్నిసార్లు పెన్నులు, బుక్స్ అమ్ముతాం అని చెప్పి డబ్బులు అడుగుతుంటారు. అలాంటి ఓ బెగ్గర్ వల్ల టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ ఇబ్బంది పడింది. ఆ విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలోనూ షేర్ చేసుకుంది.తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ కాస్తంత బిజీగా ఉన్న నివేదా.. ప్రస్తుతం చెన్నైలో ఉంటోంది. తాజాగా అడయార్ జంక్షన్ దగ్గర ఆగినప్పుడు 8 ఏళ్ల పిల్లాడు డబ్బులు అడిగాడని, ఇవ్వనని చెప్పేసరికి ఓ పుస్తకం చూపించి రూ.100 అడిగాడని.. సరే కదా అని 100 తీసి ఇస్తుండగా ఏకంగా రూ.500 ఇవ్వాలని డిమాండ్ చేశాడని నివేదా చెప్పింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్)దీంతో పుస్తకం ఏమొద్దని చెప్పి 100 రూపాయలు తిరిగి తీసుకున్నానని.. అయితే ఆ బాలుడు పుస్తకాన్ని కారులో విసిరేసి తన దగ్గర డబ్బులు లాక్కొని పారిపోయాడని నివేదా పేతురాజ్ తనకు జరిగిన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. ఇలా బెదిరింపులతో భిక్షాటన చేయడం కరెక్టేనా అని ప్రశ్నించింది.మెంటల్ మదిలో, చిత్రలహరి, బ్రోచెవారెవరురా, అల వైకుంఠపురములో, రెడ్, పాగల్, బ్లడ్ మేరీ, దాస్ కా దమ్కీ తదితర సినిమాల్లో నివేదా పేతురాజ్ హీరోయిన్గా చేసింది. తమిళంలో దాదాపు ఇన్నే చిత్రాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది.(ఇదీ చదవండి: మొదటి భర్త గురించి అమలాపాల్ ఇన్‌డైరెక్ట్ కామెంట్స్) -
బిచ్చగాడిలా మారిపోయిన యంగ్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా?
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో చాలా ప్రయోగాలు చేశారు. హిట్ కొట్టడంతో పాటు ప్రేక్షకుల మనసుల్ని కూడా గెలుచుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం రొటీన్ రొట్ట కొట్టుడు కమర్షియల్ మూవీస్ ఎక్కువగా తీస్తున్నారు. కొద్దోగొప్పో పలువురు చిన్న హీరోలు ప్రయోగాలు చేస్తున్నారు గానీ పెద్దగా వర్కౌట్ కావట్లేదు. తాజాగా తమిళ యంగ్ హీరోని బిచ్చగాడు పాత్రలో పెట్టి ఏకంగా సినిమా తీసేశారు.(ఇదీ చదవండి: 'లెవల్ క్రాస్' సినిమా రివ్యూ (ఓటీటీ))తమిళ బిగ్‌బాస్ షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న కవిన్.. రీసెంట్ టైంలో 'దాదా' అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా కాస్త పరిచయమే. ఇప్పుడు ఇతడిని హీరోగా పెట్టి 'బ్లడీ బెగ్గర్' అనే మూవీ తీశారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. బిచ్చగాడు పాత్రలో కనిపించిన సీన్స్ చూసి ఆశ్చర్యపోయారు. నిజం బెగ్గర్ ఏమో అనుకునేంతలా పరకాయ ప్రవేశం చేశాడనిపించింది.దివ్యాంగుడిలా నటిస్తూ బిచ్చమెత్తుకుంటే జీవించే ఓ బెగ్గర్.. ఊహించని పరిస్థితుల్లో ఓ ఇంట్లో పెద్ద కుటుంబం మధ్యలో చిక్కుకుపోతే ఏం జరిగింది? చివరకు ఆ ఇంటినుంచి బయటపడ్డాడా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది. 'బీస్ట్', 'జైలర్' సినిమాలతో దర్శకుడిగా ఆకట్టుకున్న నెల్సన్.. ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న ఈ మూవీ రిలీజ్ కానుంది. తమిళ వెర్షన్ మాత్రమే థియేటర్లలోకి వస్తుంది. కొన్నాళ్లకు డబ్బింగ్ వెర్షన్ ఓటీటీలోకి వస్తుంది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8 ఎలిమినేషన్.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు కానీ!) -
రైల్లో యాచకుడు.. మూడు ఆటోలకు యజమాని
మధుబని: ఎవరైనా ఇష్టంగా ఒక వృత్తిలో చేరాక దానిని మానివేయడం కష్టంగా మారుతుందని అంటారు. ఇదేవిధంగా యాచనను వృత్తిగా ఎంచుకున్న ఒక వ్యక్తి మూడు ఆటోలకు ఓనర్‌గా మారాడు. బీహార్‌లోని దర్భంగా, మధుబని రైల్వే సెక్షన్లో భిక్షాటన సాగించే బంభోలా అలియస్ సూరదాస్ ఇప్పడు వార్తల్లో నిలిచాడు.సూరదాస్ 25 ఏళ్ల క్రితం రైలులో భిక్షాటన చేయడం ప్రారంభించాడు. అంధత్వం కలిగిన సూరదాస్ రైలులో పాటలు పాడుతూ యాచిస్తుంటాడు. తాను ఏ పనీ చేయలేని పరిస్థితిలో ఉన్నానని, తనకు భిక్షాటన మాత్రమే ఆసరా అని సూరదాస్ మీడియాకు తెలిపాడు. యాచనే తనకు జీవితమని పేర్కొన్నాడు.ఇప్పుడు సూరదాస్ కథ భిక్షాటనకే పరిమితం కాలేదు. ఇప్పుడు అతను మూడు ఆటోలకు యజమాని. తనకు వచ్చే ప్రతీపైసా కూడబెట్టి ఆటోలను కొనుగోలు చేసినట్లు సూరదాస్ తెలిపాడు. తన యాచనతో వచ్చిన సంపాదనతోనే కుటుంబం నడుస్తుందని, యాచనను తన ఊపిరి ఉన్నంతవరకూ కొనసాగిస్తానని తెలిపాడు. కష్టాలు ఎదురైనా మనిషి తన కలలను నెరవేర్చుకునేందుకు కృషి చేయాలని ఆయన చెబుతుంటాడు. ఇది కూడా చదవండి: కనువిందు చేస్తున్న విదేశీ వలస పక్షులు -
ఈ బిచ్చగాడు ఎంత రిచ్ అంటే.. ఏకంగా రూ.కోటి ఇన్సూరెన్స్!
పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ క్షీణిస్తోంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిలో ఉండటంతో ప్రజలు నిత్యావసరాల కోసం విపరీతమైన ధరలు చెల్లిస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం తన రుణాన్ని తీర్చడానికి విదేశాల నుంచి అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో ఆ దేశంలో ఓ బిచ్చగాడు ఉన్నాడు. అతని సంపాదన తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..పాకిస్తాన్ అంబానీగా పిలిచే ఈ సంపన్న బిచ్చగాడి చాలా మందికి తెలియకపోవచ్చు. అతని ఆస్తి రూ.కోట్లలో ఉంటుంది. తన పిల్లలను ఖరీదైన పాఠశాలలో చేర్పించడమే కాకుండా కోటి రూపాయలకు బీమా చేయించాడు. పాకిస్థాన్ కు చెందిన ఈ ధనిక బిచ్చగాడి పేరు షౌకత్ అని పాకిస్థాన్ లోని ఏఆర్వై వార్తా కేంద్రం తెలిపింది.పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ముల్తాన్ నగరంలో నివసిస్తున్నాడు ఈ రిచెస్ట్ బిచ్చగాడు. 2021 అక్టోబర్‌లో షౌకత్ బ్యాంకు ఖాతాలో 1.7 మిలియన్లు ఉన్నాయని పాకిస్తాన్ టాప్ ట్యాక్స్ కలెక్టింగ్ ఏజెన్సీ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ (ఎప్బీఆర్) నివేదించింది. ఇతను రోజుకు రూ.1000 కి తక్కువ కాకుండా అడుక్కుంటాడు. షౌకత్ పిల్లలు పాకిస్తాన్‌లోని ముల్తాన్ సిటీలోని అత్యంత ఖరీదైన పాఠశాలలో చదువుతున్నారు. ఈ సంపన్న యాచకుడు కోటి పాకిస్థానీ రూపాయలకు తన పిల్లలకు బీమా చేయించాడు. అంతేకాకుండా తన ఆర్థిక స్థితిగతులపై తరచూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతుంటాడు. -
తొలి డిజిటల్ బెగ్గర్ కన్నుమూత!
రాజు భికారీ పేరెప్పుడైనా మీరు విన్నారా? బీహార్‌లోని బెట్టియా రైల్వే స్టేషన్లో బిచ్చమెత్తుకునేవాడు ఈయన. మామూలు బిచ్చగాడైతే ఎవరూ పట్టించుకోకపోదురు కానీ... ఈయన దేశంలోనే తొలి డిజిటల్ బెగ్గర్! పాపం.. గుండెపోటుతో కాలం చేయడంతో ఈయన గురించి ఇప్పుడు అందరికీ తెలిసింది. ఏమిటబ్బా ఈ డిజిటల్ బెగ్గర్ కథ అనుకుంటున్నారా? మరి చదివేయండి.బెట్టియా రైల్వే స్టేషన్లో చాలాకాలంగా రాజు భికారీ ఓ ప్రత్యేక ఆకర్షణగా ఉండేవాడు. ఎందుకంటే.. మెడలో గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం క్యూర్ కోడ్లతో కూడిన ట్యాగ్లు వేలాడుతూండేవి. వచ్చి పోయే వారిని డబ్బులు అడుక్కునేవాడు. అయితే పేమెంట్ మాత్రం డిజిటల్ పద్ధతిలోనే చేయాలి. అంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి బిచ్చం వేయాలన్నమాట. ప్రధాని మోడీ డిజిటల్ ఇండియా స్ఫూర్తితో తానీ కొత్త తరహా భిక్షాటనకు పూనుకున్నానని బతికుండా రాజు భికారీ చెప్పుకునేవాడు.డిజిటల్ పద్ధతులు రాక ముందే.. అంటే దాదాపు 32 ఏళ్లుగా రాజు భికారీకి భిక్షాటనే జీవనోపాధి. మోడీ అంటే అభిమానం ఎక్కువ. ‘మన్ కి బాత్’ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వినేవాడట. అంతకు ముందు ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ను తన తండ్రిగా చెప్పుకునేవాడు రాజు. అప్పట్లో ఆయనకు బెట్టియా రైల్వే స్టేషన్ క్యాంటీన్ నుంచే రోజుకు రెండు పూటల ఆహారం దొరికేది కూడా.డిజిటల్ పద్ధతిలో అడుక్కోవడం మొదలుపెట్టిన తరువాత కూడా లాలూ అంటే అభిమానం పోలేదు కానీ.. మతిస్థిమితం సరిగ్గా లేకుండా పోయింది. ఆరోగ్యమూ అంతకంత క్షీణించడం మొదలైంది. చివరకు బెట్టియా రైల్వే స్టేషన్లో క్యూఆర్ కోడ్లు చూపిస్తూ అడుక్కుంటూండగానే... గుండెపోటు వచ్చింది.!! -
ఓర్నీ..! ఆఖరికి భిక్ష కూడా డిజటల్ చెల్లింపుల్లోనే..!
ఇప్పుడూ టెక్నాలజీ ఫుణ్యమా! అని అందరూ డిజిటల్ లావాదేవీల ద్వారానే ఈజీగా చెల్లింపులు చేసేస్తున్నారు. బ్యాంకుల వద్దకు వెళ్లి.. బారులు తీరి ఉండాల్సిన పనిలేకుండా పోయింది. ఎలాంటి పని అయినా ఒక్కఫోన్పేతో చకచక అయిపోతుంది. ప్రతిదీ ప్రస్తుతం డిజిటల్ చెల్లిపులే, క్యూర్ కోడ్ స్కానింగ్‌లే. ఇప్పుడు ఆ డిజిటల్ చెల్లింపుల్లోనే బిచ్చగాళ్లు భిక్ష వేయడం వచ్చేసింది. ఓ బిచ్చగాడు ఫోన్ పే క్యూర్ కోడ్‌తో భిక్ష కోరుతూ ఆకర్షించాడు. ఈ ఘటన గౌహతిలో చోటు చేసుకుంది. ఇది చూస్తే నిజంగా టెక్నాలజీకి హద్దులు లేవంటే ఇదే కథ అనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ సోమాని సోషల్ మీడియా ఎక్స్‌లో పంచుకున్నారు. అందులో ఆ వ్యక్తి మెడలో క్యూర్ కోడ్‌తో ఉన్న ఫోన్‌పేని ధరించి భిక్ష కోరుతున్నట్లు కనిపిస్తుంది. ఒక కారులోని ఇద్దరు వ్యక్తులు అతడి క్యూర్ కోడ్‌ని స్కాన్ చేసి భిక్ష వేస్తున్నట్లు కనిపిస్తుంది. అతడు తన ఫోన్‌ని చెవి దగ్గర పెట్టకుని తన ఖాతాలో డబ్బులు జమ అవ్వుతున్న సమాచారం వింటున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ మేరకు కాంగ్రెస్ నాయకుడు సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్‌లో దీన్ని మానవత్వంలో డిజిటల్ పురోగతిగా అభివర్ణించాడు. ఇది 'ఆలోచనను రేకెత్తించే క్షణం' అనే క్యాప్షన్‌తో వీడియోని ఎక్స్‌లో షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఇలా ఒక బిచ్చగాడు డిజిటల్ చెల్లింపులను ఉపయోగించడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుమునుపు బిహార్‌లో ఒక డిజటల్ బిచ్చగాడు ఇలానే మెడలో క్యూఆర్ కోడ్ ప్లకార్డ్‌తో చెల్లింపులు జరిపేలా ప్రజలకు ఆప్షన్ ఇవ్వడం కనిపించింది. అతనను ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమంలో దీన్ని గురించి వినడం ఎప్పటికీ మర్చిపోనని ఆ డిజిటల్ బిచ్చగాడు చెప్పుకొచ్చాడు కూడా. అలాగే న్యూఢిల్లీలో అయేషా శర్మ అనే 29 ఏళ్ల ట్రాన్స్విమన్ కూడా యూపీఐ పేమెంట్ యాప్‌ల ద్వారా డబ్బులను స్వీకరిస్తుంది. Stumbled upon a remarkable scene in bustling #Guwahati – a beggar seamlessly integrating digital transactions into his plea for help, using PhonePe! Technology truly knows no bounds. It's a testament to the power of technology to transcend barriers, even those of socio-economic… pic.twitter.com/7s5h5zFM5i — Gauravv Somani (@somanigaurav) March 24, 2024 (చదవండి: ఆవుని ఆస్పత్రికి తరలించడం కోసం ఏకంగా హెలికాప్టర్..!) -
అచ్చం బిచ్చగాడిలా నమ్మించి..
అతనో నటుడు.. చిన్నచిన్న వేషాలు వేస్తుంటే వచ్చే డబ్బుతో ఇల్లు గడవట్లేదు. ఎలాగా అని ఆలో చించి ఓ కొత్త వేషం వేశాడు. అది సినిమాల్లోనో, సీరి యళ్లలోనో కాదు.. బయట జనం మధ్యలో నటించడం మొదలుపెట్టాడు. ఈ వేషం సూపర్ సక్సెస్ అయింది. నెలకు ఎనిమిది లక్షల రూపాయలకుపైనే సంపాదించి పెట్టేస్తోంది. అది కూడా ఆదాయ పన్ను వంటివేమీ కట్టాల్సిన అవసరం లేని సంపాదన. మరి ఆ వేషమేంటో తెలుసా..? ‘బిచ్చగాడు’. చైనాలో ని హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన లు జింగాంగ్ కథ ఇది. అతను సుమారు పన్నెండేళ్ల కింద ఓ రోజు ‘నటన’ మొదలుపెట్టాడు. అక్కడ ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండే పర్యాటక ప్రదేశం ‘కిన్మింగ్ షాంగే గార్డెన్’ను ఎంచుకున్నాడు. ముఖానికి కాస్త మసి, చిరుగులు– అతుకులతో ఉన్న బట్టలు వేసుకుని.. ఓ చేతి లో కర్ర, మరో చేతిలో చిప్ప పట్టుకుని.. చూడగానే జాలి కలి గేలా అమాయ కపు మొహం వేసుకుని అడుక్కోవడం మొదలుపెట్టాడు. మనోడి నటనా కౌశలానికి పర్యాట కులు పడిపోయి దండిగానే డబ్బులు వేయడం మొదలుపెట్టారు. అలా నెలకు రూ.8లక్షలకుపైనే సంపాదిస్తున్నాడట. జింగాంగ్ అడుక్కోవడం మొదలుపెట్టిన కొత్తలో అతడి కుటుంబ సభ్యులు ఛీకొట్టి వదిలేసి పోయారట. కానీ బాగా డబ్బులు వెనకేశాక.. మళ్లీ అంతా తిరిగొచ్చేశారట. అంతా ‘నటన’!? -
కాలితో తన్నిన ఆఫీసర్.. యాచకుడి దుర్మరణం
సాక్షి, ఆర్మూర్: ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆగ్రహంతో యాచకుడుని తన్నడంతో టిప్పర్ కింద పడి దుర్మణం చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. సీసీ కెమెరాల ఫుటేజీలో ఈ విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. మెండోర డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్ కారులో ఆర్మూర్ వెళ్తున్న క్రమంలో మామిడిపల్లి చౌరస్తాలో సిగ్నల్ పడటంతో వాహనాన్ని నిలిపారు. అదే సమయంలో ఆర్మూర్‌లోని టీచర్స్ కాలనీకి చెందిన శివరాం(32) కారు అద్దాలను తుడిచి డబ్బులు ఇవ్వాలని కోరగా, రాజశేఖర్ లేవని బదులిచ్చారు. గ్రీన్ సిగ్నల్ పడటంతో వాహనాన్ని ముందుకు కదిలించడంతో శివరాం డబ్బుల కోసం కారును వెంబడించాడు. కోపంతో ఊగిపోయిన డీటీ రాజశేఖర్ కారు దిగి.. యాచకుడిని కాలుతో తన్నడంతో ఆ పక్క నుంచి వెళ్తున్న టిప్పర్ వెనుక టైరు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు రాజశేఖర్‌ను బాధ్యుడిగా పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఠాణాకు వచ్చి న్యాయం చేయాలని ఆందోళన చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ రవికుమార్ వెల్లడించారు. బిక్షం అడిగితే కాలితో తన్నిన డిప్యూటీ ఎమ్మార్వో.. టిప్పర్ కింద పడి యాచకుడు మృతి ఆర్మూర్ - మామిడిపల్లి చౌరస్తా వద్ద సిగ్నల్ పడిన సమయంలో డిప్యూటీ ఎమ్మార్వో రాజశేఖర్ కారు ఆగింది. శివరాం (32) అనే యాచకుడు కారు అద్దాలు తుడిచి డబ్బులు అడగగా లేవని కారు ముందుకు కదిలించాడు. శివరాం డబ్బుల… pic.twitter.com/NQIi59uLYb — Telugu Scribe (@TeluguScribe) February 24, 2024 Video Credits: Telugu Scribe -
'మిలియనీర్లుగా బిచ్చగాళ్లు'..జస్ట్ 45 రోజుల్లో ఏకంగా రూ. 2.5 లక్షలు..!
బిచ్చగాళ్లని చూడగానే జాలిపడి డబ్బులిస్తాం. అందులోనూ పుణ్యక్షేత్రాల్లోనూ, ప్రుమఖ దేవాలయాల వద్ద ఉంటే భక్తులు కచ్చితంగా డబ్బులు ఇస్తారు. భక్తిపారవశ్యంతో ఇంకాస్త ఎక్కువగానే డబ్బులు ఇస్తారు. దీన్నే బిచ్చగాళ్లు క్యాష్ చేసుకుని పిల్లా జల్లాతో సహా అక్కడకి వాలిపోయి వేర్వేరుగా డబ్బులు సంపాదించడం మొదలు పెడతున్నారు. ఒక రకరంగా చెప్పాలంటే భిక్షాటననే ఆదాయ మార్గంగా ఎంచుకుంటున్నారని చెప్పొచ్చు. అందుటోనూ పెట్టుబడి లేని వ్యాపారం. లాభమే గాని నష్టం అంటూ ఉండదు. దీంతో పలువురు వ్యక్తులు భిక్షాటనే వృత్తిగా లక్షల్లో డబ్బులు ఆర్జిస్తూ కోట్లకు పడగెత్తుతున్నారు. అందుకు సంబంధించిన సంచలన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎంతలా ఆ బిక్షగాళ్లు డబ్బులు ఆర్జిస్తున్నారో వింటే కంగుతింటారు. వామ్మో ఏంటీది..? అని నోటి మీద వేలేసుకుంటారు. అసలేం జరిగిందంటే..ఇండోర్‌లోని ఓ మహిళ భిక్షాటన ద్వారా కేవలం 45 రోజుల్లో రూ. 2.5 లక్షలు సంపాదించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈజీగా డబ్బులు సంపాదించేందుకు సులభమైన మార్గం భిక్షాటనే. దీంతో కొందరూ దీన్నే వృత్తిగా ఎంచుకుని ఇంటిల్లాపాది నెలకు లక్షలు కూడుబెడుతున్నట్లు తేలింది. సెలవు సమయాల్లో వారి ఆదాయం మూడు పువ్వులు ఆరు కాయల్లా సుఖంగా సాగిపోతుంది. అందులోని గుళ్ల వద్ద యాచిస్తుంటారు. దీంతో ఓ పక్క ఆదాయానికి ఆదాయం, మరోవైపు పైసా ఖర్చు లేకుండా ఫ్రీగా భోజనం లభించేస్తోంది. ఇక దీంతో వారి వ్యక్తిగత అవసరాల కంటూ పెద్ద ఖర్చు ఉండదు. అందువల్ల చాలామంది దీన్నే ఆదాయ మార్గంగా ఎంచుకుని డబ్బుల సంపాదిస్తున్న దిగ్బ్రాంతికర ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇందులోకి ముక్కుపచ్చలారని పిల్లలను కూడా దించి లక్షలు సంపాదిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక అధికారులు అదుపులోకి తీసుకున్న మహిళ తన సంపాదనలో ఒక లక్ష రూపాయలను తన పుట్టింట్లో ఉంచిన ఇద్దరు పిల్లల కోసం పంపిస్తుందని, ఇక రూ. 50 వేలు పిల్లల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేయగా..మిగతా డబ్బు వ్యక్తిగత అవసరాలకు ఖర్చుపెడుతున్నట్లు తెలిపారు. ఈ వృత్తిలోనే ఆమె భర్త, చెల్లి మరో ఇద్దరు పిల్లలు కొనసాగుతున్నట్లు చెప్పారు. కుటుంబం మొత్తం ఇండోర్ నుంచి ఉజ్జయినికి వెళ్లే కూడలిలో వేర్వేరు నగరాల్లో భిక్షాటన చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అధికారులు ఇండోర్ని బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చే కార్యక్రమంలో భాగాంగా తనిఖీలు చేస్తుండగా సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమె చెల్లి, బావా, మరో ఇద్దరు పిల్లలు పారిపోయారు. కొద్దిసేపటిలోనే అధికారుల బృందం వారిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. పైగా అధికారులు వద్ద ఆ మహిళ తానేమి దొంగతనం చేయడం లేదని అడుక్కుంటాను కదా అని ధర్జాగా వాదిస్తోంది. విచారణలో ఆమె 45 రోజుల్లో రూ. 2.5 లక్షల దాక సంపాదించగలనని ఒప్పుకుంది. అంటే ఏడాదికి ఆమె ఆదాయం దగ్గర దగ్గర రూ. 20 నుంచి రూ. 27 లక్షల దాక ఉంటుందని అంచనా వేశారు అధికారులు. ఇక సెలవు లేదా ఏదైన పర్వదినాల్లో వారి ఆదాయం మరింత ఎక్కువగానే ఉండొచ్చని చెప్పారు అధికారులు. అలాగే ఆమెను అదుపులో తీసుకునే టైంలోనే ఆమె వద్ద రూ. 19,200 లభించినట్లు తెలిపారు. అది కేవలం ఆమె ఏడు రోజుల్లో సంపాదించిన మొత్తం అని చెబుతున్నారు. ఇక ఆమె పిల్లలు ఉదయం నుంచి మధ్యాహ్నాం లోపల రూ. 600 దాక సంపాదిస్తారని అన్నారు. ఇక కుటుంబం మొత్తం మిలియనర్ రేంజ్లో ఉందని, వారికి ఇల్లు, స్మార్ట్ ఫోన్లు, బ్యాంక్ బాలెన్స్‌లు ఉన్నప్పటికీ నగరంలో భిక్షాటన చేస్తున్నట్లు గుర్తించామని అన్నారు. అంతేగాదు ఈ మహిళ గతేడాది కూడా ఇలాగే పట్టుబడిందని, కౌన్సిలింగ్ ఇచ్చామని అన్నారు. అయినప్పటికీ పోలీసులు కళ్లగప్పి ఇదే యాచక వృత్తిని అవలంభిస్తున్నట్లు తెలిపారు. ఇండోర్‌లో యాచకులు దాదాపు 7 వేల మంది దాక ఉన్నారు. వీరిలో 98.7% వరకు యాచన ద్వారా దండిగా డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. ఆదాయపు లెక్కల ప్రకారం.. వాస్తవానికి భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను డేటా ప్రకారం..ఏడాదికి రూ. 20 లక్షల పైన సంపాదించేవారు కొద్దిమంది మాత్రమే. దాదాపు 3.25 కోట్ల మంది పన్ను చెల్లింపుదారుల్లో కేవలం 5 లక్షల మంది వ్యక్తుల మాత్రమే 20 లక్షల రూపాయల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం కలిగి ఉన్నట్లు డేటా చూపిస్తుంది. దీన్ని బట్టి మొత్తం పన్ను చెల్లింపుదారులు సుమారుగా 1.3%గా ఉంటుంది. ఇలా యాచక వృత్తితో లక్షల్లో డబ్బులు గడించే వారే సంగతి బయటకు పొక్కుండా, గణాంకాలకు సైతం దొరక్కుండా తప్పించుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. బిచ్చగాళ్లల్లో రకాలు.. బిచ్చగాళ్లలో మూడు వర్గాలు ఉన్నారని చెబుతున్నారు అధికారులు. పెద్ద పెద్ద నగరాల్లో దాదాపు ఆరు వేల నుంచి ఏడు వేల మంది దాక భిక్షాటన చేస్తారని, అందులో పిల్లల సంఖ్యే ఏకంగా మూడువేలకు పైనే ఉన్నట్లు తెలిపారు. వారిలో ఎవ్వరూ లేని అనాధలు మొదటి వర్గం. రాష్ట్రం బయట నుంచి వచ్చి మరీ బిక్షాటన చేసేవారు రెండోవర్గం. యాచక ముఠాలో భాగమైన వారు మూడో వర్గం అని వెల్లడించారు. వారందరి దృష్టిలో యాచక వృత్తి అనేది మంచి ఆదాయ వనరు, పైగా ఎవ్వరూ తమను పట్టుకోరనే ధైర్యంతోనే ఈ యాచక వృత్తిలోకి ప్రజలు వస్తున్నట్లు తెలిపారు. దీనికి తక్షణమే అడ్డుకట్ట వేసి చర్యలు తీసుకోవాలని కౌన్సలర్ రూపాలి జైన్ చెబుతున్నారు. భిక్షాటనే సంపాదనగా భావించడం క్షమించరాని చెడు మనస్తత్వం అని అన్నారు. ఇది సమాజంలోని ఒక వర్గానికి తప్పుడు సందేశం ఇస్తుందని కూడా అన్నారు రూపాలి జైన్. (చదవండి: రియల్ ఐరన్ మ్యాన్ సూట్‌ని రూపొందించిన యూట్యూబర్! నెటిజన్లు ఫిదా) -
కోటీశ్వరుడైన ముంబై బిచ్చగాడు.. మొత్తం ఆస్తి ఎంతో తెలుసా?
హైదరాబాద్: సాధారణంగా చేయి చాచడానికే చాలా అవమానకరంగా భావిస్తూ ఉంటాం అలాంటిది భిక్షాటనను ప్రొఫెషన్ గా ఎంచుకుని అందులో కోటానుకోట్లు ఆర్జిస్తున్నాడు ముంబైకి చెందిన బిచ్చగాడు భరత్ జైన్. ఎటువంటి టాక్స్ మినహాయింపు లేకుండా నెలకు సుమారు రూ.7 కోట్లు సంపాదించే ప్రొఫెషనల్ బిచ్చగాడైన భరత్ జైన్ ఇటీవల రూ.22 కోట్లు విలువ చేసే ఒక బంగ్లాను కొనుగోలు చేశాడు. దీంతో అనుమానమొచ్చిన ఐటీ శాఖ ఆయన ఇంటిపై సోదాలు జరపగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఈ కథనాన్ని హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ తన ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. హైదరాబాద్ నగరంలో ఏ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద చూసినా కాళ్ళు చేతులూ చక్కగా ఉన్నవారు కూడా భిక్షాటన చేస్తూ కనిపిస్తుంటారు. వీరంతా బయట రాష్ట్రాలకు చెందినవారని అందరికీ తెలిసిందే. వీరి వెనుక ఏదైనా బెగ్గింగ్ మాఫియా ఉండి ఉంటుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో కమీషనర్ సీవీ ఆనంద్ గతంలో సంచలనం సృష్టించిన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు భరత్ జైన్ కథనాన్ని గుర్తుచేశారు. భరత్ జైన్ భిక్షాటనను వృత్తిగా చేసుకుని దేశవ్యాప్తంగా మాఫియాను మించిన ముష్టియా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కేవలం భిక్షాటనతోనే 8 విల్లాలు, 18 అత్యాధునిక అపార్ట్మెంట్లు, ఒక విలాసవంతమైన హోటల్, నలుగురు భార్యలతో కలిసి ఆయన నివాసముండటానికి లంకంత బంగ్లాలు రెండు సంపాదించాడు. ఇంతకాలం ఈ దందా గుట్టుగా సాగింది. కానీ ఇటీవల ముంబై విలాసవంతమైన ప్రాంతంలో రూ.22 కోట్లు విలువ చేసే ఒక బంగ్లాను కొనుగోలు చేయడంతో ఐటీ శాఖ దృష్టి భరత్ పైన పడింది. ఇక అక్కడి నుండి తీగ లాగితే డొంకంతా కదిలింది. భరత్ జైన్ కేవలం మన దేశంలోనే కాదు ఇండోనేషియా, మలేషియాల్లో కూడా తన ముష్టి సామ్రాజ్యాన్ని విస్తరించాడు. భరత్ జైన్ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ వృత్తిలోకి వచ్చినవాడు కాదు. ఐఐఎం కోల్‌కతాలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పట్టభద్రుడైన భరత్ అక్కడ ర్యాంక్ హోల్డర్ కూడా. ప్రస్తుతానికైతే ఆతడు స్థాపించిన ఈ ముష్టి సామ్రాజ్యంలో దేశవ్యాప్తంగా 18,000 మంది బిచ్చగాళ్ళు పనిచేస్తున్నారు. భరత్ వద్ద పనిచేసే బిచ్చగాళ్లకు ఒక్కొక్కరికి ధారావిలో ఉండటానికి ఇల్లు మూడు పూటలు భోజన సదుపాయాలు కూడా ఉంటాయట. ఆయన సంస్థలో పనిచేసే బిచ్చగాళ్ళ ఆర్జనలో 20% భరత్ జైన్ ఖాతాలోకి వెళుతుందట. ఇది కూడా చదవండి: బాల్యంలో మహాత్మా గాంధీని కలిసిన రాజీవ్ -
యాచకుడే దాతగా మారిన వేళ.. రూ.2 లక్షల విరాళం
మధురానగర్ (విజయవాడ సెంట్రల్): యాచకుడే దాతగా మారాడు...ఆంధ్రా షిరిడీ ముత్యాలంపాడు శ్రీషిరిడీ సాయిబాబా మందిరంలో లోక కల్యాణార్ధం చేపట్టిన కోటి రుద్రాక్ష అభిషేక, అర్చనకు రూ.2లక్షల విరాళమిచ్చాడు. ఆలయంలో 2023 మార్చి 28న తలపెట్టిన ఈ కార్యక్రమానికి యాచకుడు యాదిరెడ్డి గురువారం రూ.2 లక్షల విరాళాన్ని మందిర గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డికి అందజేశాడు. యాదిరెడ్డి గతంలో మందిరంలో గోశాల, దత్తాత్రేయస్వామివారికి వెండి ఆభరణాలు, నిత్యాన్నదానం తదితర కార్యక్రమాలకు రూ.9 లక్షలు విరాళంగా ఇచ్చాడు. -
యాచకురాలి దాతృత్వం.. అన్నదానానికి భారీగా విరాళం
యశవంతపుర(కర్ణాటక): కట్టుకున్న భర్త, కన్న కొడుకులు కాలం చేశారు. కడుపు నింపుకోవడానికి భిక్షాటనపై ఆధారపడింది. గుడులు, కూడళ్లలో భిక్షగా వచ్చిన నగదు కూడబెట్టింది. మంగళూరులోని ముల్కి దుర్గా పరమేశ్వరి ఆలయంలో అన్నదానానికి లక్ష రూపాయల విరాళం ఇచ్చింది. తన దాతృత్వాన్ని చాటుకుంది. ఆమె మరెవరో కాదు కర్ణాటక రాష్ట్రం ఉడుపికి చెందిన వృద్ధురాలు అశ్వర్థమ్మ (80). ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యాచన ద్వారా రోజు వచ్చే డబ్బులను పిగ్మీ పొదుపు ఖాతాలో కడతానని, లక్ష రూపాయలు కాగానే ఏదో ఒక ఆలయానికి ఇస్తానని చెప్పింది. కరోనా సమయంలో అయ్యప్ప మాల ధరించి శబరిమల వెళ్లి రూ.1.5 లక్షలు అందజేశానని తెలిపింది. ( లక్షల జీతం వచ్చే ఐటీ ఉద్యోగాలు వదిలేసి.. భార్యాభర్తలిద్దరూ..) -
శభాష్ పూల్పాండి.. భిక్షాటన చేస్తూ రూ.50 లక్షలు దానం!
వేలూరు(చెన్నై): భిక్షాటన చేయగా.. వచ్చిన సొమ్మును సీఎం సహాయనిధికి అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ యాచకుడు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులక కల్పనకు ఇప్పటి వరకూ ఏకంగా రూ.55.60 లక్షలను వివిధ సందర్భాల్లో పలు జిల్లాల కలెక్టర్లకు అందజేశాడు. వివరాలు.. తూత్తుకుడి జిల్లా ఆలంగెనరు ప్రాంతానికి చెందిన పూల్పాండి(72) భిక్షగాడిగా జీవిస్తున్నాడు. సోమవారం వేలూరు కలెక్టరేట్లో జరుగుతున్న గ్రీవెన్‌సెల్‌కు వచ్చా డు. తన వద్ద ఉన్న రూ. 10 వేలు నగదును ముఖ్యమంత్రి సహాయ నిధి ఇవ్వాలంటూ, శ్రీలంక తమిళులకు ఉపయోగపడేలా వాటిని ఖర్చు చేయాలని కోరుతూ కలెక్టర్ కుమరవేల్ పాండియన్‌కు అందజేశారు. అనంతరం పూల్ పాండి మాట్లాడుతూ.. తాను పష్కరకాలంగా భిక్షాటన చేస్తున్నానని, వచ్చే డబ్బుతో ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, కుర్చీలు, టేబుళ్లు కొనుగోలు చేసి ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఇలా రూ.50.60 లక్షలు విలువ చేసే వస్తువులు, సొమ్మును విరాళంగా పలు సందర్భాల్లో అందజేసినట్లు చెప్పాడు. చదవండి: Viral Video: ఆ పసికందు ప్రేమకు అంతా ఫిదా.. ఇంటర్నెట్ను కదిలిస్తున్న వీడియో చూశారా? -
ఐఏఎస్‌కు సిద్ధమవుతూ.. ‘పిచ్చి ప్రేమ’తో బిచ్చగాడిలా..
ప్రేమ.. కొందరి జీవితాల్లో ఇది మధుర జ్ఞాపకం.. మరికొందరకి ఇది మరణశాసనం. అవును.. జీవితమనే వైకుంఠపాళిలో ఆశల నిచ్చెనలతో పాటూ.. మింగేసే అనకొండలూ ఉంటాయి.. ముఖ్యంగా వలపు వలలో చిక్కి.. బయటపడలేక దుర్భర జీవితాలు అనుభవించే అభాగ్యులెందరో..ఈ లోకంలో! మనసిచ్చిన మగువ చీత్కరిస్తే.. వలచిన వనిత నిర్ధయగా వదిలేస్తే.. ఆ బతుకు నిత్యనరకం.. అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటూ.. స్వచ్ఛమైన ప్రేమకోసం పిచ్చివాడిగా మారిన ఓ యువకుడి దీనగాథకు మూడేళ్ల కాలం సాక్ష్యంగా.. నిలిచింది.. ఈ కన్నీటి వ్యథను మీరూ చదవండి..! సాక్షి ప్రతినిధి, చెన్నై: అతడు ఉన్నత విద్యావంతుడు. ఎంతో కొంత అందగాడు కూడా.. పీజీ పూర్తి చేసి ఐఏఎస్ కావాలనే కలను సాకారం చేసుకునే క్రమంలో ప్రేమలో పడ్డాడు. అయితే రెండు సార్లూ విఫలం కావడంతో.. బంగారంలాంటి ఉద్యోగాన్ని వదిలేసి రోడ్డున పడ్డాడు. మతితప్పిన స్థితిలో చెన్నై నుంచి కాలినడకన కన్యాకుమారికి చేరుకుని బిచ్చగాడిలా మారిపోయాడు. సమీప బంధువు కంట బడడంతో మూడేళ్ల దుర్భర జీవితం నుంచి బయటపడి తోబుట్టువుల చెంతకు చేరుకున్నాడు. వివరాలు.. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కన్యాకుమారిలో 35 ఏళ్ల యువకుడు ఒకరు మతితప్పిన స్థితిలో మూడేళ్లుగా సంచరిస్తున్నాడు. కన్యాకుమారి రైల్వేస్టేషన్ సమీపంలోని బ్యాంకు ఫ్లాట్‌ఫారంనే నివాసంగా చేసుకుని జీవిస్తున్నాడు. ఎప్పుడు ఇంగ్లీష్ వార్తాపత్రికలను చదువుతూ గడుపుతుంటాడు. ఆ మార్గంలో వచ్చిపోయే వారు.. ఇచ్చే ఆహార పదార్థాలను తింటూ ఆకలి తీర్చుకుంటాడు. ఇదిలా ఉండగా, తెన్‌కాశీ జిల్లా తెన్నమలై ప్రాంతానికి చెందిన మురుగన్ అనే వ్యక్తి ఈనెల 17వ తేదీన తన కుటుంబ సభ్యులతో పర్యాటక యాత్ర కోసం కన్యాకుమారికి వచ్చాడు. చినిగిపోయిన బట్టలు కట్టుకుని, ఏళ్ల తరబడి క్షవరం చేసుకోకుండా, బాగా పెరిగిపోయిన మాసిన గడ్డంతో, మానసిక వైకల్యంతో రోడ్డుపై ఉన్న యువకుడిని గమనించాడు. కొన్నేళ్లుగా కనిపించకుండా పోయిన తన సమీప బంధువేమోననే సందేహంతో గమనించాడు. నిర్ధారించుకునే క్రమంలో అతడి దగ్గరకు వెళ్లి పలుకరించాడు. మాట కలిసి.. మలుపు తిరిగి ఆ యువకుడు మొదట విముఖత చూపినా కొద్దిసేపటికి మురుగన్‌తో మాట కలిపాడు. అతడు తన ఊరు, పేరు చెప్పగానే నిర్ధారౖణెంది. వెంటనే సమీపంలో భద్రత విధుల్లో ఉన్న పోలీసుల సహాయంతో సెలూన్‌కు తీసుకెళ్లగా వారు ఆ యువకుడికి ఏపుగా పెరిగిన క్రాపు, గడ్డం కత్తిరించి గుండుకొట్టించారు. తరువాత స్నానం చేయించి కొత్త గుడ్డలు తొడిగి తెన్నమలైలోని అతడి బంధువులకు సమాచారం ఇచ్చారు. బంధువులు వచ్చి అతడు తెన్‌కాశీ జిల్లా తెన్నమలైకి చెందిన ముత్తు (35)గా గుర్తించారు. ఈ క్రమంలో ముత్తు రాజపాళయంలో బీకాం, మద్రాసు యూనివర్సిటీలో ఎంబీఏ డిగ్రీ పుచ్చుకున్న వైనం బయటపడింది. అంతేగాక చెన్నైలోని ఓ కార్యాలయంలో ఉన్నత ఉద్యోగం చేస్తూ 2018 నవంబర్ 13వ తేదీన తాను ఉంటున్న వర్కింగ్ బాయ్స్ హాస్టల్ నుంచి అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. ముత్తు బంధువులు అనేక చోట్ల వెతికినా, పోలీసులకు సమాచారం ఇచ్చినా అతడి జాడకానరాలే దు. ఈ నేపథ్యంలోనే మురుగన్ ద్వారా ముత్తు ఆచూకీ బంధువులకు తెలియగా,వారు తగిన ఆధారాలు చూపి న తరువాత పోలీసులు ముత్తును అప్పగించారు. రెండుసార్లు ప్రేమ విఫలం కావడంతోనే.. ఈ సందర్భంగా ముత్తు సోదరుడు అయ్యనార్ మీడియాతో మాట్లాడుతూ, చెన్నైలోని మద్రాసు యూనివర్సిటీలో చదివేటప్పుడు ఓ విద్యారి్థనిని, ఉద్యోగం చేసేటప్పుడు తనతోటి ఉద్యోగిని ప్రేమించాడు, అయితే ఈ రెండు ప్రేమలు విఫలం కావడంతో జీవితంపై విరక్తి చెంది 2018లో హాస్టల్ నుంచి ఎటో వెళ్లిపోయాడని ఆయన చెప్పాడు. తమ సమీప బంధువైన మురుగన్ వల్ల మూడేళ్ల తరువాత ఆచూకీ లభించిందని చెమర్చిన కళ్లతో ఆనందం వ్యక్తం చేశా డు. చెన్నై నుంచి కాలినడకనే కన్యాకుమారి వరకు చేరి రోడ్డుపై బిచ్ఛగాడిలా ఇన్నాళ్లూ గడిపాడు. ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో గతంలో ప్రత్యేక శిక్షణ కూడా పొందాడని అన్నాడు. కన్యాకుమారి పోలీ సులు ఎంతో మానవత్వంతో తన సోదరుడిని క్షేమంగా ఇంటికి చేర్చారని కృతజ్ఞతలు తెలిపాడు. -
భిక్షాటన చేసే రామకృష్ణ అనే సాధువు గుండె పోటుతో మృతి
-
కాకినాడ: యాచకుడి మృతి.. సంచుల నిండా కరెన్సీ నోట్లు
సాక్షి, కాకినాడ రూరల్: కాకినాడలో ఓ యాచకుడు హఠాన్మరణం చెందాడు. విషయం తెలిసి వెళ్లిన పోలీసులకు మైండ్‌బ్లాక్ అయ్యింది. అతను ఉంటున్న గదిలో నోట్ల సంచులు బయటపడ్డాయి. కరప మండలం వేళంగిలో ఈ ఘటన జరిగింది. బిక్షాటన చేసే సాధువు రామకృష్ణ గుండె పోటుతో మృతి చెందాడు. మృతుడి ఉంటున్న గదిలో రెండు సంచులు కనిపించాయి. వాటి నిండా నోట్ల కట్టలు.. చిల్లర నాణేలు ఉన్నాయి. రెవెన్యూ, పోలీసు అధిజారుల సమక్షంలో డబ్బులను లెక్కించారు గ్రామస్ధులు. మొత్తంగా సుమారు రూ.2 లక్షల దాకా బయటపడింది. రామకృష్ణ ఐదేళ్ల కిందట వేళంగి గ్రామానికి వచ్చాడు. జనాలకు రక్షరేకులు కడుతూ.. భిక్షాటన చేసుకుంటూ వచ్చాడు. స్థానిక చేపల మార్కెట్ సమీపంలో ఓ గదిలో ఉంటూ.. సమీపంలో సత్రంలో తింటూ ఉండేవాడు. గురువారం గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు.. తనికీ చేపట్టగా నోట్ల సంచులు బయటపడ్డాయి. ఈ నోట్ల కట్టల సంచులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
భిక్షాటనతో భార్యకు ఊహించని సర్ప్రైజ్: వీడియో వైరల్
ఓ వ్యక్తి తనకు నచ్చిన బైక్ కోసం చిల్లర డబ్బలు పోగు చేసి మరీ కొనుకున్న ఉదంతాన్ని ఇటీవల చూశాం. ఇష్టమైన వాటిని పొందడం కోసం కష్టపడి సంపాదించి అందర్నీ ఆశ్చర్యపరిచేలా ఖరీదైన వస్తువులు కొనుక్కున్న సందర్భాలూ చూశాం. అవన్నీ ఒక ఎత్తైయితే ఇక్కడొక యాచకుడు భార్య కోసం అత్యంత ఖరీదైన బైక్ కొన్నాడు. అదీ కూడా భిక్షాటన చేయగా వచ్చిన డబ్బుతో కొనడం విశేషం. వివరాల్లోకెళ్తే...మధ్యప్రదేశ్‌లోని చింద్వారాకు చెందిన సంతోష్ కుమార్ సాహు అనే యాచకుడు శారీరకంగా వికలాంగుడు. దీంతో అతను అన్నింటికీ తన భార్య మున్నిపైనే ఆధారపడుతుంటాడు. అధ్వాన్నమైన రోడ్డుపై తన ట్రై సైకిల్ని భార్య నెట్టలేక ఇబ్బందిపడుతుండటం సాహు చూస్తుంటాడు. అదీగాక ఈ సైకిల్ నెడుతుంటే వెన్ను నొప్పి వస్తుందంటూ సాహు భార్య తరుచు బాధుపడుతుండేది. దీంతో ఆమె కోసం ఎలాగైన మంచి బైక్ కొనాలని నిశ్చయించకున్నాడు. అనుకున్నదే తడవుగా గత నాలుగేళ్లుగా బస్ స్టేషన్లు, దేవాలయాలు, మసీదులలో భిక్షాటన చేసి చాలా డబ్బు సంపాదించాడు. ఈ మేరకు అతను సూమారు రూ. 90 వేలు ఖరీదు చేసే మోపెడ్‌ని కొని తన భార్యకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ జంట ఇప్పుడూ ఈ కొత్త మోపెడ్ పై సియోని, భోపాల్, ఇండోర్ వంటి ప్రాంతాలకు వెళ్లాలని తెగ ప్లాన్లు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. A beggar from Chhindwara in Madhya Pradesh bought a moped worth Rs 90,000 for his wife after she complained of backache @ndtv@ndtvindia pic.twitter.com/9srzxKrFCx — Anurag Dwary (@Anurag_Dwary) May 25, 2022 (చదవండి: ఒంటి చేత్తో క్లైంబింగ్ వాల్ని అధిరోహించిన మహిళ.. వీడియో వైరల్) -
బోయకొండ బతికొచ్చాడు.. మరి ఆ శవమెవరిది ?
భిక్షాటనకు వెళ్లిన కొడుకు ఏదో జరిగి చనిపోయాడనుకుని గుక్క పట్టి ఏడ్చారు ఆ తల్లిదండ్రులు.. యాచక వృత్తి చేసుకునే తమ వద్ద అంత్యక్రియలు జరపడానికి కూడా స్థోమత లేదనడంతో మున్సిపాలిటీ సిబ్బంది, పోలీసులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో శవాన్ని పూడ్చారు. అంత్యక్రియలు నిర్వహించిన ఆ పోలీసులను స్థానికులు ఘనంగా సన్మానించారు. ఇంతవరకు ఓకే.. సీన్ కట్ చేస్తే.. చనిపోయాడనుకున్న వ్యక్తి నేను బతికే ఉన్నా అని ప్రత్యక్షమయ్యాడు. దీంతో కంగారు పడడం పోలీసుల వంతు అయింది. మరి చనిపోయిందెవరా ! అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఇంతకీ మ్యాటర్‌ఏంటంటే.. పలమనేరు పట్టణంలో చోటుచేసుకున్న సంఘటన వివరాల్లోకి వెళ్లాల్సిందే. సాక్షి, చిత్తూరు: తల్లిదండ్రుల సమక్షంలో ఈనెల 7న అంత్యక్రియలు నిర్వహించిన పోలీసుల సాక్షిగా మృతి చెందిన వ్యక్తి తాను బతికే ఉన్నానంటూ ఇంటికి చేరిన సంఘటన ఆదివారం పలమనేరులో సంచలనం సృష్టించింది. 15 రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తి పట్టణంలో ఫిట్స్‌తో అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు ఏరియా ఆస్పత్రిలో చేర్చారు. పది రోజులుగా చికిత్స పొందుతూ ఈనెల 7న ఆస్పత్రిలో మృతిచెందాడు. దీంతో వైద్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. అనాథ శవం కావడంతో వారు మున్సిపల్ అధికారుల ద్వారా అంత్యక్రియలను ఏర్పాటు చేశారు. ఇలా ఉండగా మృతదేహాన్ని గమనించిన కొందరు గంగవరం మండలం చిన్నూరుకు చెందిన బోయకొండగా గుర్తుపట్టారు. దీంతో పోలీసులు చిన్నూరులోని బోయకొండ తల్లిదండ్రులు వెంకటరమణ, ఎల్లమ్మకు సమాచారం ఇచ్చి ఆస్పత్రి వద్దకు తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూసిన వారు తమబిడ్డేనని యాచనకు ఎక్కడో వెళ్లి చనిపోయాడని అనుకుని బోరున విలపించారు. మృతదేహాన్ని తీసుకెళ్లమంటే భిక్షాటన చేసుకునే తమకు అంత్యక్రియలు చేసేందుకు స్థోమత లేదని వాపోయారు. దీంతో పోలీసులు, స్థానిక లారీవర్కర్ యూనియన్‌తో కలసి పట్టణ సమీపంలోని వడ్డోనికుంట శ్మశానవాటికలో ఈనెల 8న అంత్యక్రియలను నిర్వహించారు. పోలీసుల సేవలపై ‘మానవత్వం చాటుకున్న పోలీసులంటూ’ జనం మెచ్చుకున్నారు. బతికే ఉన్నానంటూ వచ్చిన బోయకొండ ఇలా ఉండగా భిక్షాటనకు వెళ్లిన వెంకటరమణ కుమారుడు బోయకొండ ఆదివారం గ్రామంలో ప్రత్యక్షమయ్యాడు. తాను బయటకు వెళ్లానని కుటుంబీకులకు తెలపడంతో చనిపోయిన కొడుకు తిరిగొచ్చాడంటూ సంబరపడ్డారు. మృతిచెందిన వ్యక్తి మొహం కూడా తమ కొడుకులాగే ఉండడంతో తమ బిడ్డేననుకున్నామని చెబుతున్నారు. ఇంతకీ ఆ శవమెవరిది ? బోయకొండ బతికే ఉండడంతో తాము అంత్యక్రియలు నిర్వహించిన మృతదేహం ఎవరిదనేది ఇప్పుడు పోలీసులకు అంతుచిక్కని ప్రశ్నలా మారింది. ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలిస్తే గుర్తుతెలియని వ్యక్తిగా నమోదు అయింది. వెంకటరమణ మాట నమ్మి మృతుడెవడో తెలుసుకోకుండానే తొందర పడ్డామేమోనని పోలీసులు భావిస్తున్నారు. ఇలాఉండగా కొందరు ఆదివారం సైతం మానవత్వం చూపిన పోలీసులను సన్మానించడం కొసమెరుపు. ఈ విషయమై ఆస్పత్రి ఆర్ఎంఓ శారదను వివరణ కోరగా తాము గుర్తుతెలియని వ్యక్తి గనుకే పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. ఇదే విషయమై స్థానిక సీఐ భాస్కర్‌ను వివరణ కోరగా బోయకొండ బతికున్నప్పుడు మృతిచెందిన వ్యక్తి ఎవరో తెలియడం లేదన్నారు. దీనిపై విచారిస్తామన్నారు. -
ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడిన యాచకురాలు.. ఆమె గతం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
సాధారణంగా ఏ ఆధారం లేని వాళ్లు, పనిచేయలేని స్థితిలో ఉన్నవారు, వృద్ధులు బిక్షాటన చేసుకోవడం చూస్తుంటాం. ఈ మధ్యకాలంలో అన్నీ బాగున్నా సులభంగా డబ్బులు సంపాదించాలనే దురుద్ధేశంతో కూడా భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే గతంలో దర్జాగా బతికిన కొంతమంది అనుకోని కారణాల వల్ల ఒంటరి వారుగా మారి భిక్షాటన చేస్తూ కాలం వెళ్లదీసే పరిస్థితి వస్తుంటుంది. ఇలా ఇతరులను వేడుకుంటూ యాచించే వారి గత అనుభవాలు తెలిస్తే ఎంతో భాదేస్తుంది. తాజాగా ఓ యాచకురాలు ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడుతుండటం విని స్థానికులు షాక్‌కు గురయ్యారు. ఆమె గురించి తెలుసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: బిచ్చగాడి అంతిమయాత్రకు ఊరూ-వాడా కదిలింది! వివరాల్లోకి వెళితే.. యూపీలోని వారణాసికి చెందిన స్వాతి అనే యాచకురాలు ఇంగ్లీష్‌లో అవలీలగా మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దక్షిణ భారత్క చెందిన స్వాతికి పెళ్లయి ఓ బాబు కూడా ఉన్నాడు. తన డెలివరీ సమయంలో ఆమె కుడి కాలు, కుడి చేతికి పెరాలసిస్ వచ్చి నడవలేని స్థితికి చేరుకోడంతో తనను ఇంట్లో నుంచి గెంటేశారు. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న స్వాతి చివరకు వారణాసికి చేరుకుంది. గత మూడేళ్ల నుంచి వారణాసిలోనే భిక్షాటన చేస్తూ తన జీవితాన్ని వెళ్లదీస్తోంది. అయితే స్వాతి బాగా చదువుకుంది. తను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివింది. అందుకే ఇంగ్లీష్‌లో అంత బాగా మాట్లాడుతోంది. కాగా స్వాతి వీడియోను రికార్డు చేసిన వ్యక్తి.. తనకు మంచి ఉద్యోగం చూస్తానని హామీ కూడా ఇచ్చాడు. స్వాతి ఇంగ్లీష్‌లో మాట్లాడిన వీడియోను ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక నెటిజన్లు అయితే.. స్వాతి మాట్లాడే ఇంగ్లీష్‌కు ఫిదా అయిపోతున్నారు. -
బిచ్చగాడి అంతిమయాత్రకు ఊరూ-వాడా కదిలింది!
Karnataka Beggar Death: అంతిమ సంస్కారం.. ఇది జీవితంలో చివరి ఘట్టం. ముఖ్యమైన ఘట్టం. మన పుట్టుక ఎలా ఉంది.. మధ్యలో ఎలా బ్రతికాం అన్నది కాదు.. చివరి శ్వాస వదిలేసినప్పుడే ఆ మనిషి విలువ తెలుస్తుంది. ఇక్కడ ధనిక, బీదా అనే తేడా ఉండదు. ధనం ఉన్నవారికి కాస్త గ్రాండ్ అంతిమ వీడ్కోలు పలికితే, బీద వారు వారు స్థాయికి తగ్గట్టే ఆ తుది ఘట్టాన్ని పూర్తి చేస్తారు. మరి ఎటుకాని బిచ్చగాళ్లు మరణిస్తే వారిని మున్సిపల్ సిబ్బందే తమ వాహనంలో తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఫలానా బిచ్చగాడు చనిపోయాడంటే సాధారణంగా జనం కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ ఒక యాచికుడ్ని ఊరంతా సొంతం చేసుకుంది. అతని అంతిమయాత్రలో అడుగులో అడుగై నడిచింది. అతని అమాయకపు నవ్వును గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకుంది. అతన్ని గుండెల్లో పెట్టుకుని ఘనంగా వీడ్కోలు పలికింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని విజయనగర జిల్లాలోని హవినహడగలిలో హుచ్చబస్య అనే యాచకుడు మరణించాడు. అతని మృతిని తెలుసుకున్న హవినహడగలి జనం శోక సంద్రంలో మునిగిపోయారు. అంతేకాదు అతని అంతిమయాత్రను ఎంతో ఘనంగా చేయాలని నిర్ణయించుకుని పెద్ద ఎత్తున ఊరేగింపుగా అంతిమ యాత్ర చేశారు. ఈ అంతిమ సంస్కారంలో ప్రజలు తమకు తాముగా స్వచ్ఛందంగా పాల్గొనడం విశేషం. హుచ్చబస్య పట్టణంలో ఎన్నో ఏళ్లుగా నివశిస్తున్నాడు. దివ్యాంగుడైన అతను పట్టణంలో ప్రతి ఒక్కరికి హుచ్చబస్య గురించి బాగా సుపరిచితుడు. అందర్ని పలకలరిస్తూ కేవలం రూపాయి మాత్రమే యాచించి తీసుకునేవాడు. అంతకంటే ఎక్కువ ఇస్తే తీసుకునేవాడు కాదు. అదేంటో సాధారణంగా ఎవరైనా బిచ్చగాడు కనిపిస్తే అసహ్యించుకునే సందర్భాలే ఎక్కువ కానీ హచ్చబస్యకు రూపాయి ధర్మం చేయడం వలన మంచి జరుగుతుందని అక్కడి ప్రజల భావన.. అందుకే హచ్చబస్య కనిపిస్తే రూపాయి ఇచ్చేసేవారు అక్కడి ప్రజలు. ఇక ఆలయాల్లో లేదా స్కూళ్లలో తలదాచుకునేవాడు. అయితే, ఇటీవల అతను రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దాంతో స్థానిక ప్రజలు కన్నీరు పెట్టుకున్నారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎవరు కనిపించినా పేరుపెట్టి పిలిచి రూపాయి ధర్మం అడిగి తీసుకునేవాడట హచ్చబస్య. ఆయన్ను అక్కడ అంతా అదృష్ట బస్య అని పిలుచుకునేవారు. ఒక బిచ్చగాడు మరణంలో అశేషమైన జనాన్ని సంపాదించుకోవడం చర్చనీయాంశమైంది. -
పెద్దమనసు చాటుకున్న కేటీఆర్
సాక్షి, చాదర్‌ఘాట్: రహదారికి ఆనుకుని ఉన్న ఫుట్‌పాత్‌పైనే నవజాత శిశువుతో కలిసి ఓ యాచకురాలు ఆవాసం ఏర్పరుచుకుంది. చాదర్‌ఘాట్ రహదారి పక్కన ఆ అభాగ్యరాలి దీనస్థితిని గమనించిన ఓ నెటిజన్ వారి ఫొటో తీసి ఆమెకు తగిన సహాయం చేయాల్సిందిగా కోరుతూ కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. దీనిపై మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి తన పెద్దమనసు చాటుకున్నారు. Request @ZC_Charminar to immediately shift them to the nearest night shelter https://t.co/hrIZHxKwOK — KTR (@KTRTRS) October 7, 2021 నెటిజన్ పెట్టిన చంటిబిడ్డతో కూడిన ఫొటోను చార్మినార్ జోనల్ కమిషనర్‌కు పంపుతూ వెంటనే వారిని సమీప నైట్‌షెల్టర్‌కు తరలించాలని సూచించారు. అభాగ్యురాలి దీనస్థితిపై వెంటనే స్పందించిన కేటీఆర్‌ను పలువురు నెటిజన్లు అభినందించారు. చదవండి: (పట్టుకోవడానికి వెళ్తే పోలీసులపైకి కుక్కలు వదిలాడు) -
వైరల్: నలుగురిని కాపాడిన యాచకుడు
నందలూరు (రాజంపేట): ఈతకు వెళ్లి నీటి గుంతలో కూరుకుపోయిన ఐదుగురిలో ఒక విద్యార్థి మృతి చెందాడు. మరో నలుగురిని ఒక యాచకుడు కాపాడాడు. ఈ ఘటన చెయ్యేటి రైల్వే వంతెన వద్ద సోమవారం చోటు చేసుకుంది. చెయ్యేటి గ్రామమైన కుమ్మరపల్లె (నాగిరెడ్డిపల్లె మేజర్ పంచాయతీ పరిధి)కు చెందిన ఐదుగురు విద్యార్ధులు సరదగా ఈత కొట్టడానికి రైల్వే వంతెనకు చేరుకున్నారు. ఇసుక కోసం గోతులు తీయడంతో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఆ గుంతల్లో ఇటీవల వర్షానికి భారీగా నీరు చేరింది. ఈ గుంతల్లో ఈత కొడుతూ ఐదుగురూ లోపలకు కూరుకుపోయారు. ఒడ్డున ఉన్న స్నేహితులు కేకలు వేయడంతో గమనించిన ఒక యాచకుడు గుంతలోకి దిగి నలుగురిని బయటకు తీసుకొచ్చాడు. అయితే ఆదిత్య (16) బయటకు రాలేక మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా మృతి చెందిన విద్యార్థి తండ్రి రమేశ్ గతంలోనే చనిపోయాడు. ఒకగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లి శైలజ రోదించడం అందరినీ కలచివేసింది. -
యాచకురాలి వద్ద 2.58 లక్షలు నగదు
జమ్మూ: 65 ఏళ్ల యాచకురాలిని పునరావాస కేంద్రానికి తరలించిన తర్వాత ఆమె నివసించిన స్థలంలో ఏకంగా రూ. 2.58 లక్షల నగదు లభించిన ఘటన జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో చోటు చేసుకుంది. నగరంలోని వెటర్నరీ ఆస్పత్రి వద్ద తాత్కాలిక షెల్టర్ వద్ద ఓ వృద్ధురాలు గత 30 ఏళ్లుగా జీవిస్తోంది. ఆమెను మెరుగైన పునరావాస కేంద్రానికి తరలించాక ఆ షెల్టర్‌ను శుభ్రం చేస్తుండగా డబ్బు దొరికిందని అదనపు డిప్యూటీ కమిషనర్ సుఖ్‌దేశ్ సింగ్ సమ్యాల్ చెప్పారు. డబ్బు దాచుకున్న యాచకురాలు ఎవరో తెలియదని పేర్కొన్నారు. మున్సిపల్ కమిటీ మంగళవారం ఆ స్థలాన్ని ఖాళీ చేయిస్తుండగా.. సంచుల్లో నోట్లు, నాణేలు దొరికాయని అన్నారు. మొత్తం లెక్కించగా రూ.2,58,507 ఉన్నట్లు అధికారులు తేల్చారు. డబ్బును యాచకురాలికే చేరేలా చూస్తామని సుఖ్‌దేశ్ చెప్పారు. నిజాయతీతో వ్యవహరించిన మున్సిపల్ కమిటీని అభినందించారు -
సంపదలో పేదవాడు.. గుణంలో ధనవంతుడు
-
20 ఏళ్లుగా భిక్షాటన.. లక్షలకు పైగా విరాళం
‘ఆయన ఎవరినీ చేయి చాచి అడగడు. కమండలం చేతబట్టి గుడి వద్ద కూర్చుంటాడు. గుడికొచ్చిన భక్తులు తమకు తోచినంత వేస్తారు. ఇలా కూడబెట్టిన సొమ్మును తిరిగి దేవుళ్లూ, దేవాలయాలకే విరాళంగా ఇచ్చేస్తున్నాడు’ అని సాయిబాబా మందిరం కోశాధికారి సత్యశ్రీహరి ‘సాక్షి’తో చెప్పారు. కోట్లు ఉండీ ఏం లాభం...ఇచ్చే మనసుండాలే కానీ...ఉన్న దాంట్లోనే పదిమందికీ ఉపయోగపడే విధంగా దానధర్మాలు చేసే వారే ఉత్తమోత్తములు. అటువంటి వారి కోవలేకే వస్తారు యడ్ల యాదిరెడ్డి. ఆయన చేసేది భిక్షాటనే అయినా...సర్వసంగ పరిత్యాగి అయిన ఆయనకు వాటితో పనేముంది...ఏదో రెండు పూటలా నాలుగువేళ్లు నోట్లోకెళితే చాలు గదా...అందుకే ఈ చేత్తో పుచ్చుకున్న దానాన్ని...ఆ చేత్తో తిరిగిచ్చేస్తూ గొప్ప మనసున్న దానకర్ణుడనిపించుకుంటున్నాడు. సాక్షి, అమరావతి బ్యూరో: ఆయన దేవాలయాల్లో జరిగే అన్నదానాలకు విరాళాలిస్తాడు. లక్షలు వెచ్చించి ఆలయాల్లో దేవుళ్లకు కిరీటాలు పెట్టిస్తాడు. గోశాల నిర్మాణానికి నిధులిస్తాడు.ఇదంతా చూసి ఆయన గొప్ప శ్రీమంతుడు అనుకుంటున్నారా...కాదు.. ఆయన ఆలయం ముందు సాధువు. ఆలయాల వద్ద నలుగురూ వేసిన డబ్బు పైసా పైసా కూడబెట్టి ఆ సొమ్మును తిరిగి దేవుళ్లకే ఇచ్చేస్తుంటాడు. ప్రస్తుతం విజయవాడ నగరంలో ఉంటున్న ఆయన పేరు యడ్ల యాదిరెడ్డి. స్వగ్రామం తెలంగాణలోని నల్గొండ జిల్లా చింతపల్లి. దేవుళ్లకు దాత అయిన యాదిరెడ్డి కథాకమామీషు ఇదీ..! పదేళ్ల వయసులోనే... తల్లిదండ్రులు లేని యాదిరెడ్డి పదేళ్ల వయసులోనే రైలెక్కి విజయవాడ వచ్చేశాడు. నలభై ఏళ్ల పాటు బెజవాడ రైల్వేస్టేషన్ కేంద్రంగా రిక్షా తొక్కాడు. ప్లాట్‌ఫారాలపై నిద్రించాడు. బ్రహ్మచారిగా ఉండిపోయిన యాదిరెడ్డి ఒంట్లో ఓపిక నశించాక అనారోగ్యం పాలై ఇరవై ఏళ్ల క్రితం భిక్షాటన బాట పట్టాడు. తొలుత విజయవాడ ముత్యాలంపాడు కోదండరామ ఆలయం వద్ద బిచ్చమెత్తేవాడు. ఆ తర్వాత సమీపంలోని షిర్డీ సాయిబాబా మందిరానికి మకాం మార్చాడు. తనకు తిండి, బట్ట కూడా ఆలయం వారే సమకూర్చుతుండటంతో భక్తులిచ్చిన సొమ్మంతా బ్యాంకులో దాచుకునేవాడు. కొన్నాళ్లకు అనారోగ్యం పాలై బతకడం కష్టమని వైద్యులు చెప్పగా, బతికి బట్టకడితే తాను రోజూ యాచన చేసే సాయిబాబా గుడికి రూ.లక్ష ఇస్తానని మొక్కుకున్నాడు. ప్రాణాపాయం తప్పడంతో తాను దాచుకున్న సొమ్ము ఆలయం నిర్వాహకులకు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. బిచ్చమెత్తుకునే యాదిరెడ్డి.. ఆలయానికి రూ.లక్ష ఇస్తానంటే వారు నమ్మలేదు. అన్నట్టుగానే రూ.లక్ష ఇవ్వడంతో వారంతా అవాక్కయ్యారు. ఆ సొమ్ముతో ఆలయ ప్రాÆగణంలో దత్తాత్రేయ విగ్రహం ఏర్పాటు చేశారు. దత్తాత్రేయుడి తొడుగులకు రూ.20 వేలు, బాబా ఆలయంలో అన్నదానానికి మరో రూ.20 సమకూర్చాడు. సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమికి లక్షా ఎనిమిది వేల కొబ్బరికాయలతో అభిషేకం నిర్వహించే సందర్భంగా యాదిరెడ్డి ఒక్కో కొబ్బరికాయకు రూపాయి చొప్పున రూ.లక్షా 8 వేలను ఇచ్చాడు. ఈ ఆలయానికి సమీపంలోనే గోశాల నిర్మాణానికి మరో రూ.3 లక్షలు విరాళమిచ్చాడు. ఆ గోశాలకు దాతగా యాదిరెడ్డి పేరు పెట్టారు. కోదండ ఆలయ నిర్వాహకుల కోరిక మేరకు రూ.లక్షన్నర వెచ్చించి సీతారాములు, లక్ష్మణుడు, హనుమంతులకు వెండి కిరీటాలు చేయించాడు. తనకు కనకదుర్గమ్మే బెజవాడలో భిక్ష పెట్టిందన్న భావనతో శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి రూ.లక్షా 116లు విరాళంగా ఇచ్చాడు. ఇలా యాదిరెడ్డి ఇప్పటివరకు సుమారు రూ.8 లక్షలకు పైగా దేవుళ్లు, దేవాలయాలకు విరాళంగా సమకూర్చాడు. నాద్వారా భగవంతునికిస్తున్నారు.. భక్తులు భగవంతునికి నా ద్వారా డబ్బులిస్తున్నారన్నది నా భావన. అదంతా భక్తుల గొప్పదనం. నాకు తిండీ, బట్ట అన్నీ ఆలయ నిర్వాహకులు, భక్తులు సమకూరుస్తున్నారు. నాకింకేమి కావాలి? నాకు భిక్షగా వచ్చేదంతా తిరిగి భగవంతునికే ఇచ్చేస్తున్నా. నేను మరణించే ముందు నా దగ్గరున్నదంతా దేవుడికే ఇచ్చేస్తా. –యడ్ల యాదిరెడ్డి, యాచకుడు. -
వృత్తి భిక్షాటన.. సంపాదన రూ.2.04 లక్షలు
సాక్షి, కర్నూలు : డోన్ పట్టణంలోని కొండపేట బీసీ హాస్టల్ పక్కన ఉన్న మసీదు వద్ద భిక్షాటన చేసే శ్రీను అనే వ్యక్తి వద్ద రూ.2,04,459 నగదు లభించింది. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రీను అనే వృద్ధుడు మూడేళ్ల నుంచి డోన్‌లో భిక్షాటన చేస్తున్నాడు. స్థానికుల కోరిక మేరకు అతనికి సపర్యలు చేసేందుకు ద్రోణాచలం సేవా సమితి సభ్యులు సోమవారం ఉపక్రమించగా అతని వద్దనున్న 14 చొక్కాల్లోని ప్లాస్టిక్ కవర్లలో మడత వేసి ఉంచిన రూ.2.04 లక్షల విలువైన నోట్లను గుర్తించారు. మహబూబ్‌నగర్ పోలీసుల సహాయంతో శ్రీను చిరునామా తెలుసుకునేందుకు డోన్ పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు ద్రోణాచలం సేవా సమితి సభ్యుడు ఆలా మధు తెలిపారు. (ఆంధ్రజ్యోతి వాహనం సీజ్ ) -
మనసున్న బిచ్చగాడు
చెన్నై,తిరువొత్తియూరు: బిచ్చమెత్తిగా వచ్చిన నగదును ఓ వృద్ధుడు కరోనా నివారణకు సాయంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడు. శివగంగై సమీపంలోని అళగిచ్చి పట్టికి చెందిన ముత్తుకరుప్పన్ (87) పదేళ్లుగా శివగంగై శివాలయం ఎదుట బిచ్చమెత్తుకునేవాడు. ఇడయమేలూరు మాయాండి సిద్ధర్ ఆలయంలో ఆశ్రయం పొందుతున్నాడు. కరోనా వైరస్‌తో వలస కూలీల అవస్థలు, ప్రజల కష్టాలను గమనించాడు. ఇన్నేళ్లు తనకు అండగా నిలిచిన ప్రజలకు ఏదైనా చేయాలని తపించాడు. తాను దాచుకున్న రూ.5 వేల నగదును కరోనా నివారణ సాయంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. గురువారం శివగంగై తహసీల్దార్ మైలావతిని కలిసి నగదు అందజేశాడు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని నిరూపించాడు. -
లాక్డౌన్ లవ్: యాచకురాలితో ప్రేమ, ఆపై
కాన్పూర్: కరోనాను ఎదిరించి మరీ కొందరు పెళ్లి చేసుకుంటున్నారు. అందులో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన జంట కూడా ఉంది. కానీ వీరి పెళ్లి ఆన్లైన్లో జరగలేదు. అలా అని కుటుంబసభ్యులు, బంధుగణాల మధ్యనూ జరగలేదు. అతి సాదాసీదాగా జరిగింది. వాళ్లు ఒకరినొకరిని ఇష్టపడ్డారు. కానీ వారి జంటను వరుడి తరుపు కుటుంబసభ్యులు ఇష్టపడలేదు. కారణం ఆమె ఓ యాచకురాలు. వివరాల్లోకి వెళ్తే.. యూపీకి చెందిన నీలమ్.. ఓ యాచకురాలు. ఎవరైనా కనికరించి కాస్త చిల్లర వేస్తే తప్ప కడుపు నిండేది కాదు. అలాంటిది లాక్డౌన్ వల్ల ఆమె పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. పస్తులతోనే కాలం వెళ్లదీస్తోంది. అనిల్ ఓ డ్రైవర్. కటిక పేదలకు లాక్డౌన్ మోసుకొచ్చిన కష్టాలను కళ్లారా చూసి చలించిపోయాడు. వారికి పట్టెడన్నం పెట్టి కడుపు నింపుతున్నాడు. (కేసు వెనక్కి తీసుకోలేదని.. కొట్టి చంపారు) భిక్ష వదిలి పెళ్లి దిశగా అడుగులు.. అలా ఓ రోజు ఆహారం పంచిపెడుతుండగా కాన్పూర్‌లోని కకాడియో క్రాసింగ్ దగ్గర ఫుట్‌పాత్ మీద అడుక్కుంటున్న నీలమ్‌ను చూశాడు. అందరితోపాటు ఆమెకూ ఆహారం పంపిణీ చేశాడు. ఆమెతో మాట కలిపి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అలా మొదలైన స్నేహం ప్రేమ వరకూ వెళ్లింది. దీంతో ఆమెను యాచక వృత్తి వదులుకోవాలని కోరాడు. అందుకు ఆమె నిండుమనసుతో అంగీకరించడంతో స్థానిక బుద్ధాశ్రమంలో సామాజిక కార్యకర్తల మధ్య వివాహం చేసుకున్నాడు. ఈ విషయం గురించి నీలమ్ మాట్లాడుతూ.. "నా తండ్రి కొన్నేళ్ల క్రితమే మరణించగా తల్లి కొంతకాలం క్రితం కాలం చేసింది. ఈ సమయంలో అండగా ఉండాల్సిన అన్నావదినలు ఇంటి నుంచి వెళ్లగొట్టారు. దీంతో దిక్కుతోచని స్థితిలో పొట్ట నింపుకునేందుకు రోడ్ల వెంబడి యాచించడం మొదలు పెట్టాను. లాక్డౌన్ వల్ల జీవితం మరింత అగమ్యగోచరంగా మారిన స్థితిలో అనిల్ కనిపించి, నా జీవితంలో వెలుగులు నింపాడు" అని చెప్పుకొచ్చింది. (గోల్డీ కల్యాణం) -
రూ. 8లక్షల విరాళం ఇచ్చిన బిచ్చగాడు
విజయవాడ: చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఏ గుడి ముందు అయిన కూడా బిచ్చగాళ్లు ఉంటారు. ఎక్కువగా బయటే ఉండే బిచ్చగాళ్లు లోపలకు వెళ్లే సందర్బాలు అరుదు. ఇక ఆ బిచ్చగాళ్లు హుండీలో డబ్బులు వేయడం మరీ అరుదు. కానీ నల్లగొండ జిల్లాకు చెందిన యాదిరెడ్డి అనే 75 సంవత్సరాల వ్యక్తి ఏ గుడి ముందు అయితే బిచ్చం ఎత్తుకున్నాడో ఆ గుడికి భారీ విరాళం ఇచ్చి అందరిని ఆశ్చర్యపర్చారు. విజయవాడలోని ముత్యాలంపాడులో ఉన్న సాయిబాబా ఆలయానికి కొన్నేళ్లలో 8 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. నిజానికి అతను ఒకప్పుడు రిక్షా లాగుతూ బతికేవాడు. మోకాలి చిప్పలు అరిగిపోయి, రిక్షా తొక్కలేని పరిస్థితి రావడంతో గుడుల ముందు భిక్షమెత్తుకోవడం మొదలుపెట్టాడు. విజయవాడలో ఆలయాల ముందు కూర్చుని బిచ్చమెత్తుకుంటాడు. అలా రోజూ వచ్చే డబ్బులన్నీ పోగేస్తూ.. మళ్లీ గుడులకే విరాళంగా ఇస్తున్నారు. మొదట్లో తాను లక్ష రూపాయలను గుడికి విరాళంగా ఇచ్చానని యాదిరెడ్డి చెప్పారు. కాలం గడుస్తున్న కొద్దీ తన ఆరోగ్యం దెబ్బతింటోందని, తనకు వచ్చిన డబ్బంతా గుడికే ఇచ్చేస్తున్నానని తెలిపారు. తాను గుడికి డబ్బులివ్వడం మొదలుపెట్టినప్పటి నుంచి అక్కడికి వచ్చే భక్తుల్లో తనకు గుర్తింపు వచ్చిందని.. తనకు వచ్చే డబ్బులు మరింతగా పెరిగాయని యాదిరెడ్డి వెల్లడించారు. ఒక్క సాయిబాబా గుడికే కాకుండా మరికొన్ని ఆలయాలకు కూడా తాను డబ్బులు విరాళంగా ఇచ్చానని చెప్పారు. తన జీవితమంతా దేవుడి సన్నిధిలోనే గడిపేస్తానంటూ యాదిరెడ్డి చెప్పుకొచ్చారు. -
అతను బిచ్చగాడు కాదు.. ఇంజనీర్
పూరి : పూరిలోని జగన్నాథ ఆలయం వద్ద సుమారు 51 ఏళ్ల వయసున్న ఒక బిచ్చగానికి , రిక్షావాడికి చిన్నపాటి గొడవ జరిగింది. అంతటితో ఆగకుండా వారిద్దరు రక్తాలు వచ్చేలా కొట్టుకున్నారు. రోడ్డు మీద వెళ్లేవారు చూస్తూ ఉన్నారే తప్ప ఒక్కరు కూడా ఆపడానికి ప్రయత్నించలేదు. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేసి వారిద్దరిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఇద్దరి మధ్య గొడవకు కారణాన్ని ఫిర్యాదు రూపంలో రాయమని పోలీసులు ఇద్దరిని అడిగారు. రిక్షా అతడికి చదువు రాకపోవడంతో ఫిర్యాదును సరిగా రాయలేకపోయాడు. కానీ విచిత్రంగా పక్కనే ఉన్న బిచ్చగాడు మాత్రం ఫిర్యాదును ఇంగ్లీష్‌లో రాయడంతో ఆశ్చర్యపోవడం పోలీసులు వంతైంది. అందులోనూ ఆ బిచ్చగాడు రాసిన ఫిర్యాదులో ఒక్క తప్పు కూడా లేకపోవడం విశేషం. దీంతో బిచ్చగాడి గురించి పోలీసులు ఆరా తీయగా అతని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి. అతను బిచ్చగాడు కాదని... ఒక ఇంజనీర్ అని తెలిసింది. వినడానికి అచ్చం సినిమా కథను తలపిస్తున్నా.. ఇది అక్షరాల నిజం. ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన గిరిజా శంకర్ మిశ్రా .. తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. అనాథ ఆశ్రమంలో పెరగుతూ మిశ్రా కష్టపడి బీఎస్సీ గ్రూప్‌లో డిగ్రీ చదివాడు. ఆ తర్వాత ముంబయి వెళ్లి కొన్ని రోజులు ఉద్యోగం చేశాడు. తర్వాత సీపెట్ నుంచి ప్లాస్టిక్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసి హైదరాబాద్‌లోని మిల్టన్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేశాడు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ చేస్తున్న ఉద్యోగాన్ని, హైదరాబాద్‌ను వదిలి ఒడిశాలోని పూరికి తిరిగి వచ్చి జగన్నాథ ఆలయం దగ్గర బిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నాడని పోలీసులు పేర్కొన్నారు. ఇదే విషయమై గిరిజా శంకర్ మిశ్రాను అడడగా.. ' ఈ విషయం గురించి నేను ఏమి మాట్లాడలేను. నేను బిచ్చగాడిగా మారడానికి నాకు కొన్ని సొంత కారణాలు ఉన్నాయి. నేను ఇంజనీర్‌గా పని చేసిన మాట నిజమే.. కానీ నాపై అధికారులతో విభేదాలు వచ్చి అక్కడి నుంచి బయటకు వచ్చి ఇలా బిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నానని' తెలిపాడు. అయితే ఎలాంటి కేసు నమోదు చేయొద్దని మిశ్రా పోలీసులను అభ్యర్థించడంతో వారు అందుకు అంగీకరించి ఇద్దరిని వదిలిపెట్టారు. మిశ్రా తన ఉద్యోగాన్ని వదిలేసి బిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నా.. రోజు రాత్రిళ్లు మాత్రం వీధి దీపాల కింద వార్తా పత్రికలను క్రమం తప్పకుండా చదువుతాడని తెలిసింది. -
బిచ్చగత్తెను కాల్చేశారు...
బ్రెజిల్‌లోని రీయో డీ జెనిరో నగరంలో పట్టపగలు ఓ ఘోరం జరిగి పోయింది. ఇల్లూ వాకిలి లేక రోడ్డు మీద భిక్షమెత్తుకునే 31 ఏళ్ల జిల్దా హెన్రిక్ డాస్ సంతోష్ లియోనార్దో ‘ఆకలవుతోంది. 25 సెంట్లు ఇవ్వండి ప్లీజ్..బన్ను కొనుక్కుంటా!’ అంటూ ఓ బాటసారి వెనకాల పడింది. ఆమె వైపు చూడకుండానే ఆ బాటసారి ‘చీ పో!’ అంటూ ఓ సారి కసురుకున్నాడు. ఆమె వినిపించుకోకుండా ఆయన పక్కకు వచ్చి మళ్లీ చేయి చాపడంతో చిర్రెత్తి పోయిన అతగాడు బొడ్డు లోనుంచి రివాల్వర్ తీసి నేరుగా ఆమెను కాల్చాడు. స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లే లోగానే ఆమె ప్రాణం పోయింది. అంతకు నాలుగు గంటల ముందే ఆ ప్రాంతంలోనే నలుగురు భిక్షగాళ్లు విష ప్రయాగానికి మరణించారు. ఆ నేపథ్యంలో బిచ్చగత్తెను కాల్చేశారన్న వార్త సంచలనం సృష్టించింది. ఏడుగురు పురుషులు, ఒక యువతి ఉన్న బృందం ఓ మద్యం బాటిల్‌ను రోడ్డు ఫుట్‌పాత్‌పై ఉన్న భిక్షగాళ్లకు ఇచ్చి పోయారట. అందులోని మద్యాన్ని తాగిన ఎనిమిది మంది భిక్షగాళ్లు తీవ్రంగా అస్వస్థులయ్యారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించగా నలుగురు చనిపోగా, మరో నలుగురు ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నారు. డ్రగ్ మాఫియా ఆ మద్యం బాటిల్‌ను ఇచ్చిందా? మరెవరైనా బిచ్చగాళ్ల నిర్మూలనకు ఇలా చంపుతున్నారా ? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇక బిచ్చగత్తెను హత్యచేసిన బాటసారిని సీసీ కెమేరాల ద్వారా 39 ఏళ్ల అడెర్బాల్ రామోస్ డీ కాస్ట్రోగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ రోడ్డు మీద భిక్షగాళ్ల బెడద ఎక్కువగా ఉందని, తాను ఆ రోడ్డు మీద వెళ్లినప్పుడల్లా వేధిస్తుంటారని, ఆ రోజు సొంతంగా ఓ హోటల్‌ను ఏర్పాటు చేయడం కోసం డబ్బును తీసుకెళుతుంటే ఆమె వెంట పడటంతో డబ్బెక్కడ దోచుకుపోతుందోనన్న భయంతో కాల్పులు జరిపానని అతడు వాదిస్తున్నారు. సీసీ టీవీ కెమేరాలోని దృశ్యాలను చూస్తే అడెర్బాల్ వాదన తప్పని తెలుస్తోంది. గత శనివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు ఆన్లైన్లో వైరల్ అవుతోంది. -
ఆర్టీసీ కార్మికులకు యాచకురాలి సాయం
సాక్షి, మిర్యాలగూడ: ఆమె ఓ యాచకురాలు.. మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్‌లో 30 ఏళ్లుగా భిక్షాటన చేస్తోంది. ఆర్టీసీ కార్మికులంతా ఆ యాచకురాలికి సుపరిచితులు. కాగా 43 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండటంతో పాటు చాలా మంది కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కార్మికులకు సాయం చేయాలనే ఉద్దేశంతో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం లావూడి తండాకు చెందిన సైదమ్మ తాను భిక్షాటన చేసి పోగేసిన రూ.4 వేల 43లను వారికి అందించింది. ఆదివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో సమ్మెలో భాగంగా కార్మికులు దీక్ష చేపట్టిన టెంటు వద్దకు వెళ్లి ఆర్టీసీ నల్లగొండ జేఏసీ కన్వీనర్ శ్రీనివాస్‌కు రూ.4 వేలు అందజేసింది. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. తాను 30 ఏళ్లుగా బస్టాండ్‌లో ఉంటూ యాచిస్తున్నానని.. ఆర్టీసీ కార్మికులంతా పరిచయస్తులు అని, వారి కడుపులు మాడుతుంటే తనకు ఎంతో బాధ కలిగిందని వివరించింది. వారికి సాయం చేయాలనే ఉద్దేశంతో ఆ పని చేశానని తెలిపింది. దీంతో అక్కడున్న వారు ఆమెను అభినందించారు. -
ఆ యాచకుని సంపాదన పది లక్షలు..
-
ఆ యాచకుని సంపాదన చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
రోడ్లపై, రైల్వే స్టేషన్లలో, ఇతర ప్రాంతాల్లో బిక్షాటన చేసే వారిని చూసి.. చాలా మంది చిరాకు పడుతుంటారు. కానీ వారిలో కొందరి సంపాదన చూస్తే మనం షాక్‌కు గురికావాల్సిందే. ఎందుకంటే ఇటీవలి కాలంలో కొంతమంది యాచకులు కూడా లక్షల్లో కూడబెట్టిన ఘటనలు వెలుగుచూసిన సంగతి విదితమే. తాజాగా ముంబైలో ఓ యాచకుని ఇంట్లో పది లక్షల రూపాయలు లభించాయి. అలాగే అతనికి ఆధార్‌తో పాటు పాన్‌కార్డు కూడా ఉండటం గమనార్హం. బిర్భిచంద్ ఆజాద్ అనే 82 ఏళ్ల వృద్ధుడు గోవండిలో బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే శుక్రవారం గోవండి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన రైలు అతన్ని ఢీ కొట్టింది. దీంతో ఆజాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆజాద్ వివరాల కోసం రైల్వే పోలీసులు గోవండిలో అతను నివాసం ఉంటున్న గుడిసె వద్దకు వెళ్లారు. అతని గుడిసెలోని కొన్ని పత్రాలు చూసి పోలీసులు షాక్ గురయ్యారు. ఆ గుడిసెలో భారీగా చిల్లర కూడా కనిపించింది. దాదాపు ఆరు గంటల పాటు ఆ చిల్లరను లెక్కించిన పోలీసులు.. అది మొత్తం రూ. 1.77లక్షలు ఉందని తేల్చారు. అలాగే ఆజాద్ఇంటో లభించిన పత్రాల ఆధారంగా అతనికి వివిధ బ్యాంకుల్లో రూ. 8.77 లక్షల మేర ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని గుర్తించారు. అలాగే ఆజాద్‌కు ఆధార్‌తోపాటు పాన్‌కార్డ్, సీనియర్ సిటిజన్ కార్డులు కలిగిఉన్నాడు. కాగా, ఆజాద్‌కు సంబంధించిన ఇతర వివరాలను ఆ ప్రాంతంలోని ఇతర యాచకుల వద్ద నుంచి పోలీసులు ఆరా తీశారు. ఆజాద్ కుటుంబం రాజస్తాన్‌లో నివాసం ఉంటుందని.. అతను మాత్రం ముంబైలో జీవనం సాగిస్తున్నాడని తెల్సింది. -
భిక్ష కాదు...లక్ష, కాదు కాదు మూడు లక్షలు...!!
బాప్రే....! భిక్ష...అంటే భిక్ష కాదు.. లక్ష!!. కాదు కాదు మూడు లక్షలు...!!. ఈ దృశ్యం చూస్తుంటే మీకేమనిపిస్తోంది..? ఆరుబయట హుండీ డబ్బులు లెక్కిస్తున్నట్లు లేదూ...!. కానీ ఇది ఓ యాచకుడు ‘కష్టపడి’ సంపాదించిన భిక్షను లెక్కిస్తున్న చిత్రం!. తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలోని ముక్తిలింగవారి వీధిలో అప్పల సుబ్రహ్మణ్యం (75) ఒక పాడుబడిన ఇంట్లో ఉంటున్నాడు. అయినవాళ్లు ఆదరణ లేకపోవడంతో యాచకుడిగా మారాడు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మృతి చెందాడు. కుటుంబసభ్యులు వచ్చి దహన కార్యక్రమాలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం ఇంట్లో సంచులను వెతగ్గా అందులో సుమారు రూ.3 లక్షల వరకూ ఉన్నట్లు గుర్తించారు. కాగా రాజమండ్రిలోని యాచిస్తూ జీవనం గడుపుతూ మరణించిన ఓ వృద్ధ సాధువు జోలె సంచిలో రూ. లక్షా 80 వేల నగదు లభ్యమైన విషయం తెలిసిందే. చదవండి: సాధువు మృతి.. సంచిలో లక్షా 80 వేలు! -
బిచ్చగాడి ఆకలి ఎవరు గుర్తిస్తారు!
అది కలకత్తాలో ఉండే ఒక అనాథాలయం. ఒక చిన్న సందులో పశువులశాలలాగా ఉన్నది. తూర్పుదిక్కు నుండి కొద్దిగా వెలుతురు వ్యాపిస్తున్నది. కన్నీటిలాగా మంచు వర్షిస్తుంది. విపరీతమైన చలి. అనాథాలయంలో చీకటి వ్యాపించి ఉన్నది. పూరిల్లు. పైన కప్పిన గడ్డి అక్కడక్కడ లేచిపోయి ఉన్నది. చుట్టూ తడికలు. నేలంతా చెమ్మ. ఆ నేల మీద చినిగిపోయిన చాపలు. ఆ చాపల మీద కొంతమంది మనుష్యులతో బాటు, కొన్ని కుక్కలు పడుకొని ఉన్నవి. ఆ సందు నిండా పడి ఉన్న కోడిగుడ్ల పై పొట్టూ, ఎంగిలి విస్తళ్లూ, నాకి పారేసిన ఎముకలు, తాగిపారేయడం వల్ల బద్దలైన సారాయి సీసాలు అన్నీ ఆ సందులోని ఇళ్లలో రాత్రిల్లు ఎలాంటి బీభత్సాలు జరుగుతుంటాయో తెలియజేస్తూ ఉన్నవి. ఆ సందులో నివసించేవారంతా వేశ్యలు. పాపం! వాళ్లు తెల్లవార్లూ మేల్కొని, ప్రియులనే జంతువులు దయతలిచి వదిలిపెట్టి వెళ్ళిన తరువాత తెల్లవారుజామున మురికి బట్టలతో ముఖాలు కప్పుకొని నిద్రపోతున్నారు. శరీరాలను అమ్ముకొని వారు అర్జించిన డబ్బు వాళ్ల తలగడల క్రింద ఉన్నది. రూపాయలూ, చిల్లరానూ. రూపాయలు తక్కువ, చిల్లర ఎక్కువ. ఎందువల్లనంటే వారి శరీరాల విలువ అంతతక్కువ. రాత్రిపూట ఉండే శాంతి, నిశ్శబ్దం...ఎంతో సంగీతమయంగానూ, కావ్యమయంగానూ ఉంటుంది. కాని వారి గార్ధభ సంగీతం, పిచ్చి ఆలాపనలు, వెర్రినవ్వులు శాంతిమయవాతావరణాన్ని కూడా అశాంతంగా చేస్తూ ఉంటాయి. చౌరంగీలో అంతా ధనవంతులు ఉంటారు. చౌరంగీకి, ఈ సందుకూ భేదం ఏమిటంటే అక్కడ ‘పాపం’ అనేది ఐశ్వర్యం చాటున దాగి ఉంటుంది. ఇక్కడ నగ్నరూపంలో తాండవం చేస్తూ ఉంటుంది. అక్కడ పాపం అందమైన దుస్తుల్లోనూ, సుందరంగా ఉండే ఇళ్ళల్లోనూ చేరి ‘నాగరికత’ అనే పేరును సంపాదిస్తుంది. ఇక్కడ అనాగికత ‘విశృంఖలత్వం’ అనే పేరుతో వ్యహరించబడుతుంది. ఆ పాపనగరంలో ఆ పశువుశాల–అనా«థాలయం. తెల్లవారింది. ఒక్క దున్నపోతులబండి వచ్చి ఆ శాల ముందు ఆగింది. బండివాడు కంబళి కప్పుకొని చలికి గడగడ వణుకుతున్నాడు. బండిలో నుండి ఇంకొకడు దిగి అనాథాలయం తాళం తీశాడు. అతని పేరు చౌదరీ. ఆ అనాథాలయం యజమాని అతనే. అతని చేతిలో గేదెచర్మంతో తయారుచేయబడిన కొరడా ఒకటి ఉన్నది. తలుపు చప్పుడుకు లేచి లోపలివాళ్లు కొంతమంది ఆవలించారు. కొంతమంది లేచి నిలబడ్డారు. అంతా గుడ్డివాళ్ళు. తొందరలో ఒకడికొకడు తగిలి కిందపడ్డారు. అదృష్టదేవత ఇంటితలుపుల్లాగా వాళ్ళ కళ్ళు మూయబడి ఉన్నవి. కొంతమంది కళ్లు తెరవబడే ఉన్నా పాపం! వారికి ఏమీ కనబడేది కాదు. ఎవరి కళ్ళ వంక చూసినా కన్నీళ్లకు మాత్రం ఏమీ కొదవలేదు. ఆ గుడ్డివాళ్ళలో మొగవాళ్ళూ ఉన్నారు, ఆడవాళ్ళూ ఉన్నారు. పిల్లలు ఉన్నారు. ముసలివాళ్ళూ ఉన్నారు. రాత్రి ఏడుగంటలకు ఆ దున్నపోతులబండి అందరినీ పోగుజేసుకొని ఎక్కించుకొని వస్తుంది. అందరూ బండిదిగి ఆ పశువులశాలలో తమ చాపల మీదకు చేరుతారు. హోటళ్లలో మధ్యాహ్నం మిగిలిపోయిన అన్నం, కూరలు అన్నీ ఆ అనాథాలయం యజమాని కొనితెస్తాడు. హోటళ్లలో భోజనం చేసి పారేసిన ఎంగిలి కూడును కూడా హోటల్ యజమానులు అనాథాలయానికి అమ్మి సొమ్ము చేసుకుంటూ ఉంటారు. గుడ్డివాళ్లు ఆ మల్లల్లో పెట్టిన కూడు తింటారు. మధ్యమధ్య కుక్కలు కూడా ఆ గుడ్డివాళ్లతో పాటు మల్లల్లోనే మూతులు పెట్టి ఆ అన్నం తింటూ ఉంటవి. కుక్కలు అన్నం తింటున్నవని వాళ్లకు తెలిసేది కాదు. అధవా చప్పుడును బట్టి తెలిసినా అవి ఎంత నెట్టినా పోయేవికాదు. వాళ్లు నెట్టలేకపోయేవారు. వాళ్లకు ఆ కుక్కలు తప్ప నా అన్నవాళ్ళు ఇంకెవళ్ళున్నారు? అవిగూడా కోపగించి పారిపోతే వారి జీవితానికి తోడెవరు? భోజనాలు పూర్తి అయిన తరువాత అందరూ చాపల మీద నిద్రబోయేవాళ్లు. జోలెలు తలక్రిందబెట్టుకొని బొంతలూ, కంబళ్లూ కప్పుకొనేవాళ్లు. ఒకరినొకరు స్పర్శ చేత గుర్తించుకొనేవాళ్లు. పిల్లలు, ముసలి వాళ్ళూ ఒక వైపునా, నవయవ్వనంలో ఉన్న ఆడవాళ్ళు మొగవాళ్ళూ ఇంకొక వైపున పడుకునేవాళ్ళు. మధ్య కుక్కలు పడుకొనేవి. పడుచుతనానికీ, ముసలితనానికీ మధ్య ఈ కుక్కల పంక్తి పెద్దగోడలాగా అడ్డు ఉండేది. రాత్రిపూట ఒక్కొక్కప్పుడు ఒక ప్రపంచంలో ఉండేవాళ్లు ఇంకొక ప్రపంచంలోకి పోవాలని ప్రయత్నం చేస్తే కుక్కలు అరచి గోల చేసేవి. అప్పుడప్పుడు అలికిడికి లేచి కుక్కలు ఆ మానవ సంఘాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఉండేవి. తెల్లవారంగానే దున్నపోతులబండి తయారు. అనాథాలయం యజమాని గుడ్డివాళ్ళందర్నీ మేల్కొలిపేవాడు. రేకుతలుపు తెరిచేవాడు. జోలెలు చేతికి తగిలించుకొని త్రుళ్ళిపడుతూ బయటకు వచ్చే గుడ్డివాళ్ళనే లెక్కపెట్టుకునేవాడు. అప్పుడప్పుడు ఇద్దరు ముగ్గురు ఇంకా నిద్రపోతూనే ఉంటే అలాంటి సమయంలో యజమాని లోపలికిపోయి, లేచి దున్నపోతుల బండి ఎక్కేదాకా చేతిలో ఉన్న చర్మపు కొరడాతో వాళ్ళను చావగొట్టేవాడు. చచ్చిపోయిన జంతువు చర్మం బతికి ఉన్న మనుష్యుని చర్మంతో కలిసి కలుగజేసే బాధకు అంత పడుచుదనంలో ఉన్నా, పాపం! ఆ నవ యువకులు భోరుమని ఏడ్చేవాళ్లు. దున్నపోతలుబండి బయలుదేరి అందరినీ వాళ్ళవాళ్ళ స్థానాల్లోకి చేరిస్తే గుడ్డివాళ్లంతా బజారు మూలల్లో కూర్చొని ఆకాశం వైపుకు తలలెత్తి ‘‘బిచ్చం వెయ్యండి బాబూ!’’ అంటూ చెవులు చిల్లులుపడేటట్లు అరిచేవాళ్ళు. ఒకడు ‘‘నాలుగు రోజుల నుండి అన్నం లేదు బాబూ!’’ అంటే ఇంకొకడు ‘‘ఐదు రోజుల నుండి ఆకలికి పిల్లలు చచ్చిపోతున్నారు’’ అని అరిచేవాడు. ఒకడు పాపపుణ్యాలను గురించి ఉపన్యాసం ఇస్తుంటే ఇంకొకడు ‘‘ఈ తనువు శాశ్వతం కాదు’’ అని వేదాంతం బోధిస్తూ ఉండేవాడు. బిచ్చగాళ్లు దాతల సానుభూతిని సంపాదించడానికి రకరకాల వేషాలు వేసేవాళ్లు. బిచ్చగాళ్ళు సరిగా బిచ్చం అడుగుతున్నారో లేదో ఎప్పటికప్పుడు యజమానికి నివేదించడానికి కొంతమంది సి.ఐ.డీలు నియమింపబడి ఉండేవారు. సరిగా అరవలేదని సి.ఐ.డీ రిపోర్టు పోయిందంటే ఆనాడు ఆ బిచ్చగాడికి ఆ ఎంగిలి కూడా గూడా దొరికేది గాదు! పైపెచ్చు ఆ చర్మపు కొరడా తాండవమాడేది. రాత్రి దున్నపోతులబండి మళ్ళీ శాలకు చేరేది. శాలకు చేరడంతోనే బిచ్చగాళ్లు సంపాదించిన డబ్బంతా యజమానికి అప్పగించాలి. గుడ్డి బిచ్చగాళ్లకు రాత్రిళ్లూ, పగళ్లూ అన్నీ సమానంగానే ఉండేవి. పాసి పోయిన ఎంగిలి కూడు, ఎండిపోయిన రొట్టె ముక్కలు, కొరడా దెబ్బలు తప్ప వాళ్లకు ప్రపంచం ఏమున్నది? ఒకరోజు రాత్రి గుడ్డివాళ్ళకు అన్నం వడ్డించే సమయంలో కుక్కలెందుకో మొరగడం ఆరంభించినవి. బిచ్చగాళ్ళు ‘‘ఏదో కొత్తప్రాణి వచ్చింది’’ అనుకొన్నారు. వడ్డించేవాణ్ని అడిగారు. రధియ అనే పిల్ల వచ్చిందనీ, చాలా అందంగా ఉన్నదనీ, బహుశా దాని రూపాన్ని చూసే చాలామంది బిచ్చం వేస్తారని వడ్డించేవాడు జవాబు చెప్పాడు. గుడ్డివాళ్ళంతా సానుభూతి సూచకంగా కుక్కలు మొరిగే వైపుకు చూశారు. కాని, నందు మాత్రం వంచిన తల ఎత్తకుండా మల్లలో ఉన్న కూరముక్కలు తింటూ ఉండిపోయాడు. నందు ఒక రసాయనద్రవ్యాలు తయారుచేసే కార్ఖానాలో పనిచేస్తూ ఉండేవాడు. ఒకరోజున అతని చేతిలో నుండి ఒక సీసా కిందపడి బద్దలైపోయింది. ఆ సీసాలోని మందుచుక్కలు రెండు మూడు చింది అతని కళ్ళలో పడ్డవి. కళ్ళు రెండూ ఇక కనబడలేదు. ఆనాటి నుంచి అతనికి ప్రపంచం అంధకారం అయిపోయింది. గుడ్డివాణ్ణి కార్ఖానా యజమానులు నౌకరుగా అట్టిపెట్టుకుంటారా? నౌకరీ పోయింది. కొన్ని నెలల పాటు తిండిలేక ఉపవాసాలు చేస్తూ కలకత్తాలో నానాబాధలు పడ్డాడు. చివరకు ఈ అనాథాలయంలో చేరాడు. సంవత్సరం నుండి అతనికి ఇదే జీవితం, అయినా అతనిలోని వేడిరక్తం ఆ వేడిరక్తంలోని అగ్ని మాత్రం అతన్ని వదిలిపెట్టలేదు. అందరూ పడుకొన్నారు. ఎముకలు కొరికే చలి. నందు బొంతను బిడాయించి కప్పుకొన్నాడు. అతనికెందుకో ఆనాడు నిద్రపట్టలేదు. ఇంతలో తన బొంతను ఎవరో లాక్కుంటూ ఉన్నట్లు అతనికి తోచింది. కుక్క అనుకున్నాడు. కుక్కను నెడదామని చెయ్యి పక్కకు చాచాడు. చెయ్యి కుక్క మీద కాదు, ఎవరిదో శరీరం మీద పడింది. ఆ శరీరం ఎందుకో ఆ కొత్తగా వచ్చిని రధియాదని అతనికి అనిపించింది. ‘‘రధియా!’’ ‘‘ఆ! నువ్వెవరు?’’ ‘‘నా పేరు నందూ. బొంత ఎందుకులాగావు? చలిగా ఉన్నదా?’’ ‘‘నా దగ్గర కప్పుకొనేంటందుకు ఏమీలేదు. కాళ్ళు చల్లబడిపోతున్నాయి. పొరపాటు చేశాను’’ నందూ లేచి తన బొంతను రధియాకు కప్పాడు. తాను అలాగే కూర్చున్నాడు. తన పూర్వజీవితం అతనికి జ్ఞాపకం వచ్చింది. రంగునూ, వెలుతురునూ చూడగలిగేవాడు. రంగు, సంగీతం, ప్రకాశం...ఈ మూడింటి సంయోగం వల్ల సౌందర్యం ఉత్పన్నమవుతుంది. ఆ సౌందర్యాన్ని మానవుడు కళ్ల ద్వారా చూసి ఆనందిస్తాడు. కాని ఇప్పుడు అతను శబ్దం ద్వారానే సౌందర్యాన్ని తెలుసుకోవాలి. రధియా కంఠధ్వని మీద ఆధారపడి ఆమె సౌందర్యాన్ని తన మనస్సులో చిత్రించుకోవడం ఆరంభించాడు. అతనిలో పడుచుతనపు ఎన్నో ఊహలు రేగినవి. ప్రతీరాత్రీ వాళ్లిద్దరూ ఒక్కచోటికే చేరుకునేవారు. మెల్లగా ఒకరొకరి పదధ్వనినీ, స్పర్శనూ గుర్తించుకొన్నారు. రధియ ఆగమనంతో నందు జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించినట్లయింది. అంతకుమందు అతని దృష్టిలో ప్రపంచమంతా మమతావిహీనం, వజ్రకఠోరం. ఒకనాడు అతనికి రధియ జీవిత వృత్తాంతం గూడా తెలిసింది. ఆ వృత్తాంతాన్ని తన జీవితపు లోతుల్లో దాచిపెట్టుకున్నాడు. ఆ లోతుల్లోకి తిరిగి చూడవలెనన్నా, ఆ విషయాలను తన స్మృతిపథంలోకి తెచ్చుకోవాలనుకొన్నా భయభ్రాంతుడై పోయేవాడు. రధియ, నందూ లిద్దరూ ఒకే బొంతలో నిద్రపోవడం ఆరంభించారు. వాళ్లకు బొంత చాలకపోయినా చలి వేసేది కాదు. ఒకనాటి రాత్రి రధియ నందూకు తన కథ వినిపించింది. ఆమె తండ్రి ఏదో కంపెనీలో గుమస్తా పనిచేసేవాడు. ముసలివాడు. ఆమె తల్లి రోగిష్టిమనిషి. రధియ వాళ్లకు ఒక్కతే కూతురు, పుట్టుగుడ్డి. కంపెనీ దివాలా తీయడంతో తండ్రి నౌకరీ పోయింది. నిరుద్యోగం–ముసలితనం. రెండు మూడు నెలల్లో ఇంట్లో ఉన్న సామానంతా బజారుకు చేరింది. ఏమి చేయాలో ఎవరికీ బోధపడని సమయం. సరిగ్గా ఆ సమయంలోనే రధియాకు వరసకు పిన్ని అవుతుంది. ఒకామె రోజూ ఆ ఇంటికి రావడం, పోవడం సాగించింది. ఆ పిన్ని అంటే రధియ ఎందుకో భయపడుతూ ఉండేది. ఆమె రోజూ వచ్చి రధియ తల్లి చెవి కొరుకుతూ ఉండేది, అప్పుడప్పుడు ముసలివాడుగూడా ఆ ఆలోచనలో చేరడం ఆరంభించాడు. మొదట్లో పిన్ని చెప్పిన మాటలు విని మండిపడ్డాడు. కాని, తరువాత తరువాత మెత్తబడ్డాడు. ఆ రహస్యాలోచన ఎందుకో, దేనిని గురించో రధియాకు బోధపడేది కాదు. ఆమెకు ఏ విషయమూ తెలియనిచ్చేవారు కాదు. ఆమె హృదయం దడదడలాడడం ఆరంభించింది. తరువాత జరిగిన ఘటననను గురించి చెప్పవలసి వచ్చినప్పుడు రధియ మాట్లాడలేకపోయింది. ఒకరోజున పిన్నీ, రధియ తల్లీ, ఇద్దరే రధియాను స్నానం చేయించి శృంగారించారు. జడ వేస్తూ తల్లి బొటబొటా కన్నీరు కార్చింది. ఆమె ఏడుపుకు కారణం రధియాకు బోధపడలేదు. రధియాకు కొన్ని పాటలు వచ్చు. ఆ పాటల్లో ఆమె వివాహమనీ, ప్రియతముడనీ, యవ్వనమనీ, ప్రేమ అని కొన్ని మాటలు విని ఉన్నది. తనకు వివాహం కానున్నదేమోననుకొన్నది. ప్రియతముడు? ఏ జాతి పశువో? ప్రేమ? అది ఏ రోగమో? ఇవన్నీ ఆలోచించడం వల్ల ఆమె మనస్సుకు కొంత బాధ కలిగింది. శృంగారించడం పూర్తయిన తరువాత పిన్ని రధియాను ఒక రిక్షా మీద కూర్చోబెట్టుకొని బయలుదేరింది. తల్లిదండ్రులిద్దరూ ‘‘అమ్మా! భయపడబోకు. రేపు ఉదయమే పిన్ని నిన్ను ఇక్కడికి తీసుకొని వస్తుంది’’ అని ధైర్యం చెప్పారు. పిన్ని దారి పొడుగునా ధైర్యం చెప్పుతూనే ఉంది. పిన్ని రధియాను ఒక ఇంటికి చేర్చింది. ఎవరో ఆమెకు తెగ తాగించి ఏవేవో మాటలు చెప్పారు. ఆ మాటలకు అర్ధం ఆమెకు చాలాసేపయిన తరువాత బోధపడింది. పిన్ని చెప్పినట్లు చేస్తే తమ దరిద్రం పోతుందనీ, తల్లిదండ్రులు సుఖంగా జీవితం గడపగలరనీ, చెప్పిన మాటలు ఆమెకు బోధపడినవి, తనవల్ల తల్లిదండ్రులకు సుఖం కలిగితే మహదానందం అనుకొన్నది. రాత్రి తొమ్మిది, పదిగంటలైంది. రధియ ఒక గదిలో మెత్తని పక్క మీద కూర్చొని ఎవరికోసమో నిరీక్షిస్తుంది. ఎవరో తలుపుతట్టారు. పిన్ని తలుపు తీసింది. ఆ వ్యక్తి లోపలికి వచ్చాడు. పిన్ని తలుపు వేసి లోపల రధియ దగ్గరకు వచ్చింది. ఆవ్యక్తి కూడా రధియ దగ్గరకు వచ్చి పరుపు మీద కూర్చున్నాడు. తన రెండు కఠోరహస్తాలతో రధియ గడ్డం పట్టుకొని ఆమె వివర్ణమైన ముఖాన్ని పైకెత్తాడు. ఈమధ్యలోనే పిన్ని అతనితో వివాదపడింది. దానికి ఫలితంగా ఘల్లని రూపాయలు మోగినవి. పిన్ని ఆ రూపాయలను రధియ పమిటచెంగుకు మూటగట్టి రధియాను బుజ్జగించి మెల్లగా లేచి గది బయటకు వెళ్ళిపోయింది. తలుపు బయట గడియ వేసింది. రెండు హస్తాలు రధియను చుట్టుముట్టినవి. –ఇదేనా ప్రేమ! దుర్గంధమయమైన నోరు ఆమె పెదవుల్ని ముద్దుగొన్నది. ఆమె బుగ్గలకూ. దవడలకూ ముళ్ళలాంటి వెంట్రుకలు గుచ్చుకొన్నవి, దుర్వాసనకు ఆమె ముక్కు బద్దలైపోయింది. రధియ జీవితం అంధకారమయమైపోయింది. అలా రెండు సంవత్సరాలు గడిచాయి. రోజూ ఆమె శరీరం అమ్మబడుతూ ఉండేది, ఇవాళ ఈ బజార్లో, రేపు ఆ బజార్లో–తక్కిన కథంతా అనవసరం. తిరిగి తిరిగి ఆమె చివరకు ఈ అనాథాలయంలో చేరింది. ఒకరోజు రాత్రి రధియ అనాథాలయానికి రాలేదు. నందూ ద్వారం వంక ముఖం పెట్టి రధియ పదధ్వని కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. మల్లలో ఉన్న అన్నం కొద్దిగా నంజాడు. ఎక్కువ భాగం మల్లలో మూతిబెట్టి, కుక్క తినేసింది. అతడది గమనించనేలేదు. రాత్రి ఒంటిగంట, రెండు గూడా అయింది. మిగతా అంధులూ, కుక్కలు అందరూ నిద్రపోయారు. నందు మాత్రం అలానే కూర్చొన్నాడు. రధియ రాలేదు. లేచి ఎవరిదో శరీరం తడిమి చూశాడు. ఉహు... రధియ కాదు. మళ్ళీ తనచోటికి చేరుకున్నాడు. పడుకొన్నాడు. నిద్ర రాలేదు. ఇంతవరకూ అతని నయనపధమే శూన్యం. ఈనాటి నుంచి అతని జీవితపధం కూడా శూన్యమే. తెల్లవారింది. చౌదరీ లోపలికి వచ్చాడు. ‘‘రధియ పారిపోయిందా? రాత్రి రాలేదు’’ అని నందు చౌదరీని ప్రశ్నించాడు. చౌదరీ నవ్వాడు. కొరడా ఫెళ్ళున మోగించాడు, నందు ‘‘అబ్బా’’ అన్నాడు. ‘‘నీకు అది తగదురా. దాన్ని రాయ్ హీరాచంద్కు ఐదువందలకు అమ్మేశాను’’ అంటూ ఉల్లాసంలో చౌదరీ నందూకు నాలుగు కొరడా దెబ్బలంటించాడు. నందూ నేల మీద కూలబడ్డాడు. కొరడా దెబ్బలబాధ సహించలేక లేచి దున్నపోతుల బండి ఎక్కాడు. తను రోజూ బిచ్చమడిగే చోటుకి చేరాడు. మనుష్యునిలో ఆత్మ అనేది ఉంటుందని ఎవరో చెపితే విని ఉన్నాడు. కాని, అతనికది ఎప్పుడూ అనుభవంలోకి రాలేదు. కాని, రధియాతో పరిచయం కలిగిన తరువాత అతని జీవితంలో అతనికేదో కొత్త అనుభవం కలిగింది. ఆ రధియ ఏది? రాయ్హీరాచంద్కు బలి అయిపోయింది. ప్రపంచమంతా అతనికి అంధకారబంధురమైపోయింది. ఆరోజూ నందూ ఎవ్వరిని బిచ్చమడగలేదు. రోజూ వాడి అరుపు వినలేక బాధపడే పక్కనున్న దుకాణదార్లందరూ ఆరోజు వాణ్ణి చూసి ఆశ్చర్యపడ్డారు. ఏడింటికి దున్నపోతులబండి వచ్చింది. నందు దానిలో ఎక్కి కూర్చున్నాడు. బండి అనాథాలయానికి చేరింది. చౌదురి అందరి దగ్గరా డబ్బులు వసూలు చేస్తూ నందూను కూడా అడిగాడు. నందు ఒక అణా తీసి చౌదరి చేతిలో పెట్టాడు. మిగతా డబ్బులు ఇవ్వవేమిరా వెధవా? అని గద్దించాడు చౌదరి. నందు జవాబు చెప్పలేదు. కొట్టి జోలె లాక్కొని పరిశీలించాడు చౌదరి. డబ్బులు లేవు. తరువాత... ఆకలిమంట, కొరడా దెబ్బల వల్ల నందుకు ఆనాటి రాత్రి నిద్ర పట్టలేదు. తరువాత రెండు రోజుల వరకూ అలాగే జరిగింది. అణా కంటే నందూకు ఎక్కువ దొరకలేదు. బిచ్చగాడు అరిస్తేగాని దాతలు కూడా బిచ్చం వెయ్యరు. మౌనంగా ఉండే బిచ్చగాణ్ణి చూస్తే బిచ్చం వేయడానికి దాతకు కూడా చేతులు రావు. నందు బండబారిపోయినాడు. నాలుగో రోజున కూడా అలాగే జరిగితే చౌదరి నానా దెబ్బలు కొట్టి అతన్ని ఆ పశువులశాలలో నుండి వెళ్లగొట్టేశాడు. వేసికాలం. అర్ధరాత్రి సమయం. ఎక్కడికి పోవాలో నందుకూ తెలియలేదు. ఆకలి మండిపోతున్నది. కాళ్ళు తేలిపోతున్నవి. సర్క్యులర్ రోడ్డు ఫుట్‌పాత్ దగ్గరకు వచ్చాడు. ఇక ముందుకు పోలేకపోయినాడు. ఆకలి! ఆకలి!! ఆకలి!! భగవంతుడు ఈ నరకంలో అతన్ని జన్మింపచేశాడు. కార్ఖానాలో కళ్ళు పోయినవి. కొరడాతో బాది వెళ్ళగొట్టాడు అంధాలయపు యజమాని, ఎండిన రొట్టెలు–పోయిన కళ్లూ సమాజం అతనికి ప్రసాదించిన వరప్రసాదం. అంతే, చివరకు అతని జీవితమరుభూమిలో ఒక చిన్న సెలయేటిధార ప్రవహించి వస్తే ఒక సేఠ్ దాన్ని కూడా ఎండిపోయేట్లు చేశాడు. ఆకలి, చీకటి! చీకటి? ఆకలి!! పైన నక్షత్రాలు మానవుని పరిస్థితిని చూసి మౌనభాషలో తమలో తాము విచారపడుతున్నావి. అలసి సొలసి ఆ ఫుట్‌పాత్ మీద నందు నిద్రపోయాడు. అతనిబోటి అభాగ్యులు ఆ స్థలంలో ఇంకా చాలామంది పడుకొన్నారు. అకస్మాత్తుగా ఫుట్‌పాత్ మీద నిద్రపోయేవాళ్ళంతా లేచి అటూ ఇటూ అరుస్తూ పరుగెత్తుతున్నారు. నందుకు నిద్ర మెళకువ వచ్చింది. వాళ్ళ అరుపుతో పాటు లాఠీదెబ్బల ధ్వనీ కూడా నందుకు వినబడింది. అతని మీద కూడా మూడు లాఠీదెబ్బలు పడిన తరువాతగాని విషయం అతనికి బోధపడలేదు. పోలీసుల లాఠీలు–కాలదండాలులాగా ఉన్నవి. మనుష్యుని చేతిలో ఉన్న ఒక ప్రాణం లేని కర్రముక్క ఎముకల్ని విరగ్గొడుతూ, మాంసంలోకి జోరబడుతూ, మానవరక్తాన్ని కాల్వల క్రింద ప్రవహింపజేస్తూ ఉన్నది. బిచ్చగాళ్ళు, కూలీలు, బీదవారు అయితే మాత్రం వాళ్లు ఫుట్‌పాత్ మీద ఎందుకు నిద్రపోవాలి? అద్దెలిచ్చి ఇళ్ళల్లో ఉండలేనివారికి ప్రపంచంలో జీవించడానికి హక్కేమున్నది? ఆరోడ్డు పక్కన ఉన్న పెద్దపెద్ద భవనాలు ఈ దరిద్రుల్ని చూసి నవ్వుతున్నవి. ఈ కూలీలే, ఈ బీదవారే–ఆ భవనాలను నిర్మించింది. ఆ భవనాల గోడల్లో ఉన్న ప్రతి ఇటుక ముక్కా, ఈ దరిద్రుల, ఈ కష్టజీవుల స్వేదంలో, రక్తంలో స్నానం చేసినదే. ఈ ఫుట్‌పాత్‌నూ, ఈ ఇళ్ళనూ, ఈ రోడ్డునూ, ఈ ప్రపంచాన్ని సృష్టించిందెవరు? కాని ఆ దరిద్రులకు ఆ కష్టజీవులకు ఇల్లు లేదు. వాకిలి లేదు. ఆశ్రయం లేదు. సహాయం లేదు. దొరికినవాళ్లను బాదుకుంటూ ఫుట్‌పాత్ మీద నిద్రపోయే అభాగ్యుల్ని వెదుక్కుంటూ పోలీసుల గుంపు తుపానులాగా ముందుకుసాగిపోయింది. నందు స్మృతి లేకుండా నేలమీద పడి ఉన్నాడు. లాఠీప్రహారానికి తలబ్రద్దలైపోయింది. రక్తం ప్రవాహంగా కారి కింద ఉన్న కన్నీటితో కలిసిపోతున్నది. సరిగ్గా ఆ సమయంలోనే అతనికి ఎదురుగా ఉన్న భవనంలో నుండి సంగీతస్రవంతి బయలుదేరి తూర్పుదిక్కాంతను మేల్కొల్ప ప్రయత్నిస్తున్నది. ఆ సంగీతం పాడుతున్నదెవరు? నందు హృదయస్పందనం ఆగినట్లయిపోయింది. ఆ సంగీతాన్ని వినడం కోసం నందు తన ఆత్మను వెదకి బయటకు తీశాడు. కాని ఆ సంగీతం పాడబడుతూ ఉన్న సభ ఎవరిది? ఎవరి సమక్షంలో ఆ సంగీతం? మధ్యమధ్య సిగ్గులేని వికటాట్టహాసాలు...అదే సేట్ హీరాచంద్ గృహమని నందు తెలుసుకున్నాడు. అతని కళ్లు మూతలు పడినవి. ఉర్దూ మూలం : డా.సయ్యద్ అఖ్తర్ హుస్సేన్ తెలుగు: వేమూరి ఆంజనేయశర్మ -
ఇది కథ కాదు..బిచ్చగాడి ముసుగులో
సాక్షి, లక్నో: బిచ్చగాళ్ల రూపంలో పొంచి వున్న అరాచకవాదుల గురించి సినిమాల్లో చూశాం. కథల్లో విన్నాం. కానీ ఉత్తరప్రదేశ్‌లో తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఉదంతం కథ కాదు. కఠోర వాస్తవం. గురువారం సాయంత్రం లక్నో, మున్షిపులియా ప్రాంతంలో విజయ్ బద్రి అలియాస్ బంగాలీ (55)ని అరెస్ట్ చేయడంతో బెగ్గర్ ర్యాకెట్ గుట్టు రట్టయింది. బిచ్చగాడుగా యాచకవృత్తి ముసుగులో తిరుగుతూ మైనర్లను హింసించి భయపెట్టి దొంగతనాలకు పాల్పడటం, ముఖ్యంగా మైనర్ అమ్మాయిలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపడం ఇతగాడి మోడస్ ఓపరాండీ. అయితే ఎంతటి నేరగాడికైనా పతనం తప్పదు. గట్టు రట్టు కాక తప్పదు కదా. విజయ్ కబంధ హస్తాలనుంచి తప్పించుకున్న బాధితులు (ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు) తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులకు చిక్కారు. బారాబంకి వెళ్లే రైలులో బాద్షా నగర్ రైల్వే స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పిఎఫ్) సిబ్బందిని ప్రశ్నించినప్పుడు.. తమ గోడు వెళ్లబోసుకుంటూ కన్నీటి సంద్రాలే అయ్యారు. తమ మాస్టర్ అసాంఘిక కార్యకలాపాల గుట్టు విప్పారు. 15,16,14 సంవత్సారాల పిల్లలతో రైల్వే ప్లాట్‌ఫాంలలో దొంగతనాలకు ఉసిగొల్పుతాడు..అంతేకాదు మత్తుమందు ఇచ్చి పిల్లల శరీరాలపై గాయం చేసి, ఆ రక్తాన్ని తన వికలాంగ కాలి బ్యాండేజిపై పూసుకొని సానుభూతి పొందేవాడు. పిల్లలు చోరీ చేసిన మొబైల్ ఫోన్లు, వాలెట్లు, ఇ-రిక్షా బ్యాటరీలు, ఇతర వస్తువులను అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. దీనికి ప్రతిగా పిల్లలకు దక్కేది మాత్రం. రోజుకి రూ.100, పేవ్మెంట్ల మీద నిద్ర. తప్పించుకునే ఉద్దేశంతో ఎలాగోలా రూ.70 దాచుకున్నామని బాధిత పిల్లలు చెప్పారు. గతంలో చాలాసార్లు పారిపోవడానికి ప్రయత్నించి, దొరికిపోయి దెబ్బలుతిన్నామని విలపించారు. తమతోపాటు మరో పది మంది అతని చెరలో ఉన్నట్టు చెప్పారు. వీరి ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు అతగాడి ఆటకట్టించారు. విజయ్‌ని మున్షిపులియాలో అరెస్ట్ చేశామని కిడ్నాప్, పిల్లల అక్రమ రవాణా, దోపిడీ కేసులు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. దీని వెనక పెద్ద రాకెట్ ఉన్నట్టు అనుమానిస్తున్న అధికారులు, ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరో ముగ్గురితో కలిసి ఈ రాకెట్టును నడుపుతున్నట్లు నిందితుడు విజయ్ ఒప్పుకున్నాడని పోలీసు అధికారులు ఎం.కె.ఖాన్, రాజ్దేవ్ మిశ్రా తెలిపారు. రక్షించిన నలుగురు బాధిత మైనర్లను లక్నోలోని చైల్డ్‌లైన్‌కు అప్పగించి, ఛైల్డ్ వెల్ఫేర్ కోర్టు ముందు హాజరుపరిచామని కమిటీ సభ్యులు సంగీత శర్మ చెప్పారు. వారి తల్లిదండ్రులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. బెంగాల్‌కు చెందిన విజయ్ బద్రి ఒక ప్రమాదంలో కాలు కోల్పోయాడు. అనంతరం బిక్షాటన ద్వారా పొట్ట పోసుకునేవాడు. క్రమంగా మురికివాడల్లోని పిల్లలే టార్గెట్‌గా పథకం వేశాడు. బట్టలు, బువ్వ, డబ్బు పేరుతో వారిని మభ్యపెట్టి తనవైపు తిప్పుకునేవాడు. అలా వారిని వ్యభిచారం, ఇతర నేరాలకు ఉపయోగించుకోవడం ప్రారంభించాడు. -
మట్టితో మాణిక్యం
అతడొక బిచ్చగాడు. మతిస్థిమితం కూడా లేకుండా తిరుగుతాడు. అతడి పేరు మాత్రం రాజు అని ఆ చుట్టుపక్కల వాళ్లు అనుకుంటున్నారు. పది రోజుల క్రితం అటుగా వెళ్తున్న కొందరు అక్కడ జరుగుతున్న ఓ సంఘటన చూసి ఆశ్చర్యంగా నిలబడిపోయారు. జరుగుతున్నదంతా వారి వీడియోలలో బంధించారు. రాజుగా పిలవబడుతున్న ఆ బిచ్చగాడు ఎర్రమట్టి, బురద మట్టిని మట్టిగా కాకుండా, వాటర్ కలర్స్‌గా భావించాడు. గడ్డిని కుంచెగా మలిచాడు. గోడను క్యాన్వాస్గా భావించాడు.అంతే అంతటి మతి స్థిమితం లేని ఆ వ్యక్తి మెదడులో ఏం ఆలోచన బయలుదేరిందో ఏమో కానీ, అందమైన పెయింటింగ్ వేయడం ప్రారంభించాడు. పది నిమిషాలలో అద్భుతమైన పెద్ద పెయింటింగ్ సిద్ధమైపోయింది. విచిత్రమేమిటంటే తనొక చిత్రకారుడినని తనకు తెలియదు. అదే తెలిసి ఉంటే ఎం. ఎఫ్. హుస్సేన్ అంతటి వాడు అయి ఉండేవాడేమోనని ఆయన చిత్రాలను చూస్తున్నవారు భావిస్తున్నారు. అతడు పేజ్ త్రీ వ్యక్తి కూడా కాదు. కేవలం మట్టిమనిషి మాత్రమే. మట్టిలో మాణిక్యం దొరుకుతుందో లేదో తెలియదు కానీ, మట్టితో మాణిక్యాలను తయారుచేస్తున్నాడు ఈ బిచ్చ చిత్రకారుడు. – వైజయంతి -
మీరు బాగుండాలి
పూర్వం కాశీలో ఓ బిచ్చగాడు ఉండేవాడు. అతను చేతులు చాచి అయ్యా అమ్మా అంటూ అడుక్కునేవాడు. అది అతని అలవాటైపోయింది. ఓమారు కాశీకి ఓ జ్ఞాని వచ్చారు. ఆయనను కలిసిన బిచ్చగాడు ‘అయ్యా, నా జీవితం మార్చుకోవడానికి ఏదైనా మార్గముంటే చెప్పండి’ అని ఎంతో వినయంగా అడిగాడు.అతని మాటలు విన్న జ్ఞాని ‘‘సరే, ఇక రేపటి నుంచి ఎవరిని కలిసినా డబ్బులు ఇవ్వమని అడుక్కోకు. దానికి బదులు మీరు బాగుండాలి అని దీవించడం మొదలుపెట్టు..’’ అన్నారు.బిచ్చగాడికి ఆయన మాటలపై నమ్మకం లేదు. అయినా తానడిగితే కదా జ్ఞాని తనకా సలహా ఇచ్చారు.. కనుక ఓ రాయి విసురుదాం అన్నట్టుగా ఆయన చెప్పినట్లే ఎవరిని కలిసినా ‘మీరు బాగుండాలి’ అని మనసారా దీవించడం మొదలుపెట్టాడు. ప్రారంభంలో ఆ దీవెనలనుంచి పెద్దగా ఫలితమేమీ కనిపించలేదు. అయితే రోజులు గడిచే కొద్దీ అతని మాటలు బాగా ఫలించాయి. కొద్ది కాలానికే అతనికి అడక్కుండానే డబ్బులూ వచ్చాయి. కొందరైతే తమ ఇంట శుభకార్యం ఏదైనా చెయ్యదలచుకున్నప్పుడు అతని వద్దకు వచ్చి దీవెనలు అడిగి మరీ పుచ్చుకునేవారు. ఇంకేముంది ఇతని దీవెన గురించి ఊరు ఊరంతా వ్యాపించింది. అంతేకాదు, ఇరుగుపొరుగు ప్రాంతాల నుంచి కూడా ఎందరెందరో వచ్చి అతని ఆశీస్సులు పొందేవారు. అందుకు బదులుగా అతని ఆకలి తీర్చేవారు. అవసరమైన వస్త్రాలు కూడా కొనిచ్చారు. ఉండటానికి ఓ ఇల్లు ఏర్పాటు చేసారు.ఒట్టి రెండు మంచి మాటలు అదే పనిగా చెప్పడంతో అతని జీవితమే మారిపోయింది. ఓ మంచి అలవాటు జీవితాన్ని మార్చేస్తుందన్న నిజాన్ని కూడా గ్రహించాడు. ఇందుకు ఈ బిచ్చగాడే నిలువెత్తు ఉదాహరణ. – యామిజాల జగదీశ్ -
ఆలయ అభివృద్ధికి విరాళమిచ్చిన యాచకుడు
చీపురుపల్లి: వృత్తి యాచన.. దాతృత్వంలో మాత్రం ఉన్నతం. ప్రస్తుత సమాజంలో ఎంతో మంది వద్ద రూ.కోట్లు ఉండొచ్చు కానీ.. దాతృత్వంలో వారు నిరుపేదలే. విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని శివాలయం వద్ద ఉన్న చేబ్రోలు కామరాజు అనే యాచకుడు మాత్రం దాతృత్వంలో నంబర్ వన్ అనిపించుకుంటున్నాడు. యాచన ద్వారా సంపాదించుకున్న ఒక్కో రూపాయినీ పొదుపు చేసి నీలకంఠేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి అందజేస్తున్నాడు. భక్తులు ప్రదక్షిణ చేసుకునే సమయంలో ఎండ, వాన సమస్యలు ఎదురుకాకుండా షెల్టర్లు ఏర్పాటు చేసేందుకు మంగళవారం రూ.60 వేలు అందజేశాడు. ఇలా మూడు, నాలుగు పర్యాయాలు దాదాపు రూ.3 లక్షల వరకు గుడికి సమర్పించుకున్నాడు. గతంలో ఆలయ పరిసరాల్లో షెల్టర్ల ఏర్పాటుకు రూ.1.2 లక్షలు, రూ.70 వేలు రెండు దఫాలుగా అందజేసాడు. 20 ఏళ్లుగా అక్కడే యాచన శ్రీకాకుళం జిల్లాలోని ఒప్పంగి గ్రామానికి చెందిన కామరాజు రెండు దశాబ్దాల క్రితమే చీపురుపల్లి వచ్చేశాడు. ఇక్కడి ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయం వద్ద రోజూ యాచన చేస్తాడు. ఆలయం ఎదురుగా ఉన్న చిన్న పూరిగుడిసెలో నివసిస్తాడు. అలా బిచ్చమెత్తుకుని సంపాదించిన మొత్తాన్ని శివాలయం అభివృద్ధికే వెచ్చిస్తానని చెబుతున్నాడు. -
కి‘లేడి’ దొంగ : పగలు భిక్షాటన.. రాత్రి దొంగతనం
సాక్షి, కృష్ణాజిల్లా : పగలు భిక్షాటన చేస్తూ రెక్కీ నిర్వహించి.. రాత్రిపూట దొంగతనాలకు పాల్పడుతున్న కి‘లేడి’ దొంగ ఆట కట్టించారు మచిలీపట్నం పోలీసులు. వివరాలు.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన పసుపేలేటి లలిత గత కొన్నాళ్లుగా మచిలీపట్నంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంది. ఈ నేపథ్యంలో పగటి పూట భిక్షాటన ముసుగులో రెక్కీ నిర్వహించి.. రాత్రుళ్లు దొంగతనాలకు పాల్పడుతుండేది. ఈ క్రమంలో శనివారం పోలీసులకు చిక్కింది. లలితను అదుపులోకి తీసుకున్న మచిలీపట్నం రూరల్ పోలీసులు ఆమె వద్ద నుంచి దాదాపు 19 తులాల బంగారం.. 86 తులాల వెండితో పాటు రూ. 5 లక్షల విలువచేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసులో లలితతో పాటు మరికొందరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం లలిత మీద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు మచిలీపట్నం డీఎస్పీ మెహబూబా షా తెలిపారు. -
ఒక్క ఫోటో.. ఎంత పని చేసింది
జైపూర్: సోషల్ మీడియాలో ఫేక్ కథనాల నిర్మూలనపై చర్చ విస్తృతంగా సాగుతున్న వేళ.. రాజస్థాన్‌లో జరిగిన ఓ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఒళ్లో అందమైన చంటి బిడ్డను పట్టుకున్న ఓ బిచ్చగత్తె ఫోటో రెండు వారాల నుంచి వైరల్ అయ్యింది. దీంతో ఆమె పిల్లలను ఎత్తుకుపోయే మహిళ అన్న ప్రచారం విస్తృతంగా సాగింది. అయితే ఎట్టకేలకు ఓ ఎన్నారై మహిళ చొరవతో అదంతా ఉత్తదేనని తేలింది. వివరాల్లోకి వెళ్తే... జోధ్‌పూర్‌లోని శనీశ్వరుడి గుడి వెలుపల ఓ మహిళ బిక్షమెత్తుకుంటోంది. ఆమె పక్కింట్లో ఉండే మహిళ చెత్త ఎరుకుని జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఓ రోజు సదరు మహిళ తన బిడ్డను గుడి వద్ద ఉన్న మహిళకు అప్పగించి బయటకు వెళ్లింది. ఇంతలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. బిడ్డ అందంగా ఉండటం.. పైగా డైపర్ వేసి ఉండటంతో సదరు బిక్షగత్తెను పిల్లలను అపహరించే బాపతంటూ సోషల్ మీడియాలో ప్రచారం పెద్ద ఎత్తున్న జరిగింది. ఇదిలా ఉండగా రోహిణి షా అనే మహిళ జోధ్‌పూర్ పోలీసులకు ఆ కథనాన్ని ట్యాగ్ చేయటంతో వారు వెంటనే అప్రమత్తమయ్యారు. చివరకు ఆ మహిళను, బిడ్డ తల్లిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అసలు విషయం వెలుగు చూసింది. ఈ వ్యవహారాన్ని సునిశితంగా పరిశీలించి త్వరగా తేల్చేసిన పోలీసులను జోధ్‌పూర్ డీసీపీ అమన్ సింగ్ అభిందనందించారు. ఆలస్యం అయ్యి ఉంటే ఆ మహిళ పరిస్థితి ఏమైయ్యేదోనని పలువురు కామెంట్లు చేస్తున్నారు. thanks for the concern of all, the child,his mother and the baby sitter(in the snap) have been traced within hours of we being informed this afternoon. The mother & other lady are friends,one being a beggar and other a rag picker. pic.twitter.com/1hA7acvC1j — DCPJODHPUREAST (@DCP_JODHPUREAST) 30 July 2018 -
యాచకుడి విరాళం రూ.లక్ష
మధురానగర్ (విజయవాడ సెంట్రల్): విజయవా డ ముత్యాలంపాడులోని షిర్డీసాయిబాబా మంది రానికి ఓ యాచకుడు భా రీగా విరాళం ఇచ్చాడు. సాయిబాబా సమాధి చెంది వంద ఏళ్లు పూర్తవు తున్న సందర్బంగా షిర్డీ సాయిబాబా మందిరం లో ఈనెల 26వ తేదీన నిర్వహించ నున్న లక్ష నారికేళ జలాభిషేకంకు యాచకుడు యడ్ల యాది రెడ్డి రూ.1,08,000 విరాళంగా అందజేశాడు. మందిర గౌరవాధ్యక్షుడు గౌతంరెడ్డి మాట్లా డుతూ.. యాదిరెడ్డి ఇప్పటికే ఆలయంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి వెండి ఆభరణాలు చేయించటమే కాకుండా నిత్య అన్నదానానికి రూ.లక్ష విరాళం అందజేసినట్లు గుర్తు చేశారు. యాదిరెడ్డి మాట్లాడుతూ.. తనకు భక్తులు వేసిన ప్రతీ రూపాయిని భద్రపరచి.. దేవాలయంలో సేవలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విరాళంగా ఇస్తున్నట్టు తెలిపారు. -
యాచకుడు కాదు.. కోటీశ్వరుడు!
టీ.నగర్(చెన్నై): మతిస్థిమితం కోల్పోయిన ఓ వ్యాపారవేత్త ఆధార్ కార్డు సాయంతో కుటుంబ సభ్యుల్ని కలుసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది. యూపీలోని రాల్పూర్‌లో డిసెంబర్ 13న భిక్షాటన చేసుకుంటున్న ఓ యాచకుడ్ని గుర్తించిన స్వామి భాస్కర్ స్వరూప్‌జీ అతడికి ఆశ్రయం కల్పించి ఆహారం అందజేశారు. తొలుత జుత్తు కత్తిరించి సదరు యాచకుడికి స్నానం చేయించబోగా అతనివద్ద ఆధార్ కార్డుతో పాటు రూ.1.06 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలు, లాకర్ తాళం బయటపడ్డాయి. ముత్తయ్య నాడార్ పేరుతో ఉన్న ఆధార్ సాయంతో ఆయన కుటుంబ సభ్యుల్ని స్వరూప్‌జీ సంప్రదించారు. దీంతో నాడార్ తమిళనాడులోని తిరునెల్వేలిలో పెద్ద వ్యాపారవేత్తని తేలింది. సమాచారం అందుకున్న నాడార్ కుమార్తె గీత ఆయన్ను తీసుకెళ్లేందుకు రాల్పూర్‌కు చేరుకున్నారు. ఆరు నెలల క్రితం రైల్లో వెళ్తుండగా నాడార్ తప్పిపోయినట్లు గీత తెలిపారు. బలవంతంగా డ్రగ్స్ ఎక్కించడంతో ఆయన మతిస్థిమితం కోల్పోయారన్నారు. తన తండ్రికి ఆశ్రయం కల్పించినందుకు స్వామి భాస్కర్‌కు గీత కృతజ్ఞతలు తెలిపారు. -
భిక్షమేస్తేనే వదిలేస్తా
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగడ మండలం తిరుమలగిరి బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర.. అక్కడ భిక్షాటన చేసే వ్యక్తి జాతరకు వచ్చిన వారిని ధర్మం చేయమని కాలు పట్టుకుని వదలకుండా చెమటలు పట్టించాడు. జాతరకు వచ్చిన ఓ యువకుడి కాలు పట్టుకుని వదలకుండా డబ్బులు ఇవ్వమని పట్టుబట్టాడు. సదరు యువకుడు డబ్బులు ఇచ్చేవరకు వదలలేదు. ప్రశాంతంగా దైవ దర్శనం కోసం వస్తే.. ఈ భిక్షగాళ్ల గోల భరించలేకపోతున్నామని భక్తులు వాపోతున్నారు. జాతరకు వచ్చిన భక్తులతో భిక్షగాడు చేసిన ఈ తతంగం అంతా ’సాక్షి’ క్లిక్ మనిపించింది. ఫొటోగ్రాఫర్: గుర్రం సంపత్ గౌడ్ -
కాలం కలిసిరాక.. బిచ్చగాడిలా...
-
నడిరోడ్డుపై యాచకురాలు ప్రసవం
– కవల పిల్లల జననం - కర్నూలులో ఘటన - ఆలస్యంగా వెలుగులోకి.. కర్నూలు (హాస్పిటల్): కర్నూలు నగరంలోని రాజ్‌విహార్ సెంటర్ వద్ద భిక్షాటన చేసుకుని జీవించే ఓ మహిళ అదే ప్రాంతంలోని రహదారిపై ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె అనాథగా జీవిస్తుండటం, అప్పటికే ఓ కూతురు ఉండటం, తాజాగా జన్మించిన కవలలు బరువు తక్కువగా ఉండటంతో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆమెను, పిల్లలను శిశుగృహకు తరలించారు. కర్నూలు నగరంలోని బంగారుపేట ప్రాంతానికి చెందినదిగా భావిస్తున్న జానకి కొంత కాలంగా రాజ్‌విహార్ సెంటర్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమెతో పాటు రెండేళ్ల వయస్సున్న కూతురు కూడా ఉంది. కూతురును చూపించి భిక్షాటన చేస్తోందంటూ గతంలో ఫిర్యాదు రావడంతో ఆమెను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అయినా ఆమె వృత్తిని మానుకోలేదు. ఇదే సమయంలో ఆమె గర్భం దాల్చి ఐదురోజుల క్రితం రాజ్‌విహార్ సెంటర్లోనే నడిరోడ్డుపై మగ కవల పిల్లలకు జన్మనిచ్చింది. గురువారం ఆమె రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉండటం, పిల్లలు అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండో పట్టణ పోలీసులు ఆమె పరిస్థితి గురించి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ(ఐసీడీఎస్) అధికారి జుబేదాబేగంకు సమాచారమిచ్చారు. దీంతో ఐసీడీఎస్ అర్బన్ సీడీపీవో వరలక్ష్మి, ఐసీపీఎస్ డీసీపీవో శారద, సోషల్ వర్కర్ నరసింహులు, అవుట్‌రీచ్ వర్కర్ రాజు వెళ్లి నడిరోడ్డుపై ఉన్న బాలింత జానకి, ఆమె పిల్లలను సి.క్యాంపులోని శిశుగృహకు తరలించారు. అనంతరం బరువు తక్కువగా ఉన్న కవల పిల్లలను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల విభాగంలో చేర్పించారు. కాగా.. తనకు సంబంధించిన వివరాలను తెలిపేందుకు జానకి నిరాకరిస్తోంది. తనకు ఎవ్వరూ లేరని, తనను వదిలిపెట్టండని అధికారులను ప్రాధేయపడుతోంది. -
బా.బ్బా.బ్బాబు!
►గ్రేటర్లో నీరుగారిన ‘బెగ్గర్ ఫ్రీ’ పథకం ►నగరంలో దాదాపు 20 వేల మంది సంచారం ►వీరి సంపాదన ఏటా రూ. 270 కోట్లు ►పలు సర్వేల్లో ఆసక్తికర అంశాలు నగరాన్ని ‘బెగ్గర్ ఫ్రీ’గా చేయాలన్న జీహెచ్ఎంసీ ఆశయానికి గండి పడింది. ఏడాదిగా ఎంత ప్రయత్నించినా సిటీలో యాచకుల సంఖ్య తగ్గలేదు. ఇప్పటికీ ఎక్కడ పడితే అక్కడ బిచ్చగాళ్లు కనబడుతూనే ఉన్నారు. గతేడాది ‘బెగ్గర్ ఫ్రీ సిటీ’ ప్రణాళికలో భాగంగా దాదాపు 500 మంది యాచకులను గుర్తించారు. వీరిని పునరావాస కేంద్రాలకు తరలించారు. కానీ ఫలితం శూన్యం. సిటీలో ఇప్పటికీ 20 వేల మంది యాచకులు ఉన్నట్లు... వీరు ఏటా రూ.270 కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు కొన్ని సంస్థల సర్వేల్లో తేలింది. – సాక్షి, సిటీబ్యూరో సిటీబ్యూరో: విశ్వనగరంగా ఎదుగుతోన్న హైదరాబాద్ నగరాన్ని ‘బెగ్గర్ ఫ్రీ సిటీ’గా మార్చేందుకు గత సంవత్సరం జూన్‌లో జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. కానీ..ఏడాది గడిచినా బెగ్గర్ ఫ్రీ సిటీగా మారలేదు. ఎక్కడ పడితే అక్కడ బిచ్చగాళ్లు కనబడుతూనే ఉన్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖలు, పోలీసు విభాగంతో కలిసి గత సంవత్సరం దాదాపు 500 మంది యాచకులను గుర్తించారు. వీరందరినీ పునరావాస కేంద్రాలకు పంపించి, వారిలో పనిచేయగలిగిన వారికి పనులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దాదాపు 200 మందిని గత సంవత్సరం నవంబర్ వరకు రెండు, మూడు దశల్లో నగర శివార్లలోని అమ్మానాన్న అనాథాశ్రమానికి తరలించారు. ఈ చర్యలతో సిగ్నళ్ల వద్ద బిక్షాటన దాదాపు తగ్గింది. అధికారులు వచ్చి ఆశ్రమాలకు తరలిస్తారని భయపడి చాలామంది కొంతకాలం వరకు సిగ్నల్ లైట్ల వద్దకు రాలేదు. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. దాంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఇళ్లకు వెళ్లిన వందమందే కాక అంతకు ఎన్నో రెట్ల మంది పెరిగిపోయారు. ట్రాఫిక్ సిగ్నళ్లతోపాటు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రార్థనాస్థలాలు, తదితర ప్రాంతాల్లో వీరు కనిపిస్తున్నారు. వీరిలో పసిబిడ్డల నుంచి వృద్ధుల వరకు ఉన్నారు. పసికందులను చంకలో ఉంచుకొని యాచన చేయడం ఎక్కువ లాభసాటిగా కనిపిస్తుండటంతో ఇలాంటి మహిళలూ ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ఈమేరకు కామన్ఫోరం, ఫ్యూచర్ లీడింగ్ మిషన్, యూత్‌ఫర్ సేవ, ఇందిరా ప్రియదర్శిని రూరల్ ఏరియా డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ, ఫెడరేషన్ ఆఫ్ ఎన్జీవోస్ ఫర్ బెగ్గర్ ఫ్రీ సొసైటీలోని వివిధ సంస్థలు నగరంలోని యాచకులపై నిర్వహించిన సర్వేల సగటు వివరాల్లో పలు ఆసక్తికర అంశాలున్నాయి. యాచన వృత్తిలో 20 వేలమంది.. వివిధ సంస్థల సర్వేల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 20 వేల మంది ఈ పనుల్లో ఉన్నారు. వీరిలో దాదాపు 90 శాతం మందికి పనిచేయగలిగే శక్తిసామరŠాధ్యలున్నా యాచక వృత్తినే ఆశ్రయించారు. ఏటా రూ. 270 కోట్లు .. గ్రేటర్‌లోని యాచకులు సంపాదిస్తున్నది రోజుకు దాదాపు రూ.75 లక్షలు. ఈ లెక్కన నెలకు వీరు రూ.22.50 కోట్లు. సంవత్సరానికి లెక్కిస్తే దాదాపు రూ.270 కోట్లు ఆర్జిస్తున్నారు. పనితీరు ఇలా.. వ్యవస్థీకృతంగా ఉన్న ఈ వృత్తిలో దళారులకు కొదవ లేదు. అలాంటి వారు దాదాపు 200 మంది ఉన్నట్లు అంచనా. అంధులు, అంగవికలురను తమ వ్యాపారానికి ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. నగరం, రాష్ట్ర ప్రజలకంటే బిహార్, మధ్యప్రదేశ్‌లతో సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లు ఈ బిచ్చగాళ్లలో ఎక్కువగా ఉన్నారు. కొందరు పార్ట్‌టైమ్ పనిగా దీన్ని చేస్తుండగా, పండుగల వంటి సందర్భాల్లో మాత్రమే ఈ పని చేసేవారు గణనీయంగానే ఉన్నారు. వ్యసనాలు అధికం.. ఈ వృత్తిలోని వారికి లేని వ్యసనాలు లేవు, మద్యం, మత్తుపదార్థాలు, అక్రమ సంబంధాలు వంటివి ఉన్నాయి. దినవారీ సంపాదనలో దాదాపు సగం సొమ్ము ఇందుకోసమే ఖర్చు చేసేవారు ఎక్కువగా ఉన్నారు. ఈ ఊబిలో బందీలుగా ఉన్న బాలలు రోజుకు సగటున రూ. 500 వరకు సంపాదిస్తుండగా, కొందరు మహిళలు పగలు అడుక్కుంటూ, రాత్రివేళ సెక్స్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. వీరిలో 90 శాతం మంది పునరావాసం కల్పిస్తామన్నా, ఆశ్రమాలు/ అనాథ శరణాలయాల్లో చేరుస్తామన్నా ముందుకు రావడం లేదు. -
బిచ్చగాడు.. రూ.లక్ష దానం ఇచ్చాడు
-
ఆదరించిన ఆలయానికి అండగా
⇒ ఆదరించిన ఆలయానికి.. ఓ యాచకుడు రూ.1.2 లక్షల విరాళం ⇒ భక్తుల సౌకర్యార్థం షెడ్ల నిర్మాణానికి నిర్ణయం చీపురుపల్లి: ఆది భిక్షువు ఆలయం చెంతనే అరవై ఏళ్లుగాయాచన చేస్తూ జీవిస్తున్నాడు. తాను దాచుకున్న దానిలో రూ.1.2 లక్షలు ఇప్పుడు ఆ నీలకంఠుడి భక్తుల సౌకర్యానికే విరాళవిుచ్చాడు. ఆ యాచకుని పేరు చేబోలు కామరాజు. విజయనగరంజిల్లా చీపురుపల్లి పట్టణంలోని శ్రీ ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయమే అతని చిరునామా. ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయ ఆవరణలో షెల్టర్లు, షెడ్లు నిర్మించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. షెడ్లు లేక భక్తులు ఎండలో నిలబడాల్సి వస్తోందని గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. కమిటీ నిర్ణయం తెలుసుకున్నకామరాజు వాటి నిర్మాణానికి అవసరమయ్యే రూ.1.2 లక్షలు తాను ఇస్తానని చెప్పాడు. ఇప్పటికే బ్యాంకు నుంచి రూ. 60 వేలు తీసుకొచ్చి కమిటీ పెద్దలు, దేవాదాయశాఖ అధికారులకు అందజేశాడు. అంత డబ్బు ఒకేసారి ఇవ్వడానికి బ్యాంకు అధికారులు నిరాకరించడంతో మరో రెండు రోజుల్లో మొత్తం సొమ్ము సమకూరుస్తానని చెప్పాడు. షెల్టర్లు పూర్తయ్యాక రూ.10 వేల ఖర్చుతో భక్తులకు అన్నదానం కూడా చేస్తానని తెలిపాడు. ఆరు దశాబ్దాల క్రితమే చీపురుపల్లికి.. కామరాజుది శ్రీకాకుళం జిల్లాలోని ఒప్పంగి గ్రామం. అతనికి20 ఏళ్ల వయసులో వివాహం కాగా.. కొంతకాలానికి భార్యమృతి చెందింది. మిగిలిన కుటుంబ సభ్యులు అతన్ని ఆదరిం^èlలేదు. దీంతో ఒంటరిగా అరవైఏళ్ల క్రితం చీపురుపల్లికివచ్చి శివాలయమే తన స్థిరనివాసంగా నిర్ణయించుకున్నాడు.ఆలయం ఎదుట చిన్న గుడారం వేసుకుని అక్కడే ఉంటూయాచన సాగిస్తున్నాడు. -
దేవుడికి వెండి కిరీటాలు సమర్పించిన బిచ్చగాడు
-
బెగ్గర్ లుక్‌లో బాలీవుడ్ బ్యూటీ
ప్రస్తుతం బాలీవుడ్ లో ఫుల్ ఫాంలో ఉన్న హీరోయిన్ ఎవరంటే వెంటనే గుర్తోచ్చే పేరు దీపికా పదుకొనే. అందం అభినయంతో పాటు అదృష్టం కూడా బాగా ఉన్న ఈ బ్యూటి హాలీవుడ్ బాలీవుడ్ లను దున్నేస్తోంది. ముఖ్యంగా పీరియాడిక్ స్టోరీస్ తో పాటు వెస్ట్రర్న్ లుక్స్ లోనూ వావ్ అనిపిస్తోంది. ఇలాంటి బ్యూటి ఒక్కసారిగా అడుక్కునే అమ్మాయిలా కనిపిస్తే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ ఫోటోలు ఈ అందాల రాశి అభిమానులకు నిద్రపట్టనివ్వటంలేదు. ఇప్పటి వరకు గ్లామరస్ లుక్ లో కనిపించిన దీపికా ఒక్కసారిగా డీగ్లామర్ లుక్ లో అది కూడా అడుక్కునే అమ్మాయిగా కనిపించే సరికి షాక్ అవుతున్నారు. సినిమా వివరాలు పూర్తిగా వెళ్లడించకపోయినా.. ఇరానియన్ దర్శకుడు మజిద్ మజిదీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం దీపిక ఇలా తయ్యారయ్యిందట. మరి సినిమాలో కొన్ని సీన్స్ వరకే ఇలా ఉంటుందా..? లేక సినిమా ఇలాగే కనిపిస్తుందా..? అన్న విషయం తెలియలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. -
రోడ్డు ప్రమాదంలో యాచకుడు మృతి
అనంతపురం సెంట్రల్ : నగరంలో మొదటిరోడ్డు శివారులో జీరో క్రాసింగ్‌వద్ద ఆదివారం రాత్రి రోడ్డు పక్కన పడుకున్న యాచకుని తలపై గుర్తు తెలియని వాహనం ఎక్కిపోవడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఆశ్రయ అనాథాశ్రమం నిర్వాహకులు కృష్ణారెడ్డి ద్వారా యాచకునికి అంత్యక్రియలు జరిపించారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
భిక్షమెత్తుకుంటున్న అన్నదాత
రామాయంపేట: కరువు కాటుకు మెదక్ జిల్లాలో ఓ రైతు యాచకుడిగా మారాడు. తనకున్న కొద్దిపాటి భూమిలో వేసిన పంట ఎండిపోవడంతో వీధిన పడ్డాడు. కూలీ పనులు చేయడానికి వయస్సుతోపాటు ఆరోగ్యం సహకరించకపోవడంతో అర్ధాకలితో అలమటిస్తున్నాడు. తన భార్యను పోషించుకునేందుకు యాచక వృత్తిని చేపడుతున్నాడు. చేగుంట మండలం నార్సింగి వడ్డెర కాలనీకి చెందిన వడ్డె దుర్గయ్య, మల్లవ్వ దంపతులు. వీరికి ఐదుగురు కొడుకులు, నలుగురు కూతుళ్లు. రోడ్డు ప్రమాదం, అనారోగ్యం కారణాలతో ఓ కూతురు, ముగ్గురు కొడుకులు మరణించారు. మిగతా అందరి వివాహాలు కాగా.. వృద్ధులైన తల్లిదండ్రులను వదిలి ఎవరికి వారు వేరుగా ఉంటున్నారు. తనకున్న ఎకరం భూమిలో దుర్గయ్య వరినాటు వేయగా, వర్షాభావంతో పంట ఎండిపోరుుంది. దీనికితోడు ఆయన భార్య మల్లవ్వ పక్షవాతానికిగురై మంచానికే పరిమితమైంది. బండలు కొట్టడానికి వెళ్లిన దుర్గయ్య కాలు విరిగింది. దీంతో ఏ పని చేసుకోలేని పరిస్థితిలో మంచం పట్టిన భార్యను పోషించుకోవడానికి దుర్గయ్య యాచకుడిగా మారాడు. 68 ఏళ్లు ఉన్న దుర్గయ్యకు పింఛన్ వస్తుండగా ఆ డబ్బులు తనకు, తన భార్య మందులకు ఏ మాత్రం సరిపోవడంలేదు. దీంతో బతుకు దెరువుకోసం బిచ్చమెత్తుకుంటున్నాడు. సిగ్గిడిసి బిచ్చెం ఎత్తుకుంటున్న.. రెండు నెల్ల నుంచి పింఛను వస్తలేదు. తినేతందుకు ఏం లేదు. మా ముసల్ది పచ్చవాతంతో మంచం పట్టింది. బిచ్చమెత్తుకోవాలంటే బాధ అనిపిస్తున్నా.. మేం బతికెందుకు? ఇంత తిండికోసం సిగ్గిడిసి బిచ్చెం ఎత్తుకుంటున్న. 12 కిలోల రేషన్ బియ్యం సరిపోతలె. - వడ్డె దుర్గయ్య, నార్సింగి -
బిచ్చగాడిగా ప్రత్యక్షమైన బాబా!
సాక్షి, చెన్నై: తమిళనాడులోని నామక్కల్ జిల్లా కుమార పాళయం ఎంజీయార్ నగర్ కు చెందిన మురుగేషన్ శిరిడీ సాయిబాబా వీరభక్తుడు. మెకానిక్ షాప్ నడుపుకొనే మురుగేషన్ కు కొద్దికాలంగా బాబా కలలోకి వచ్చి 'నేను మళ్లీ రాబోతున్నా'అని చెప్పేవాడు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం.. మాసిన గడ్డం, చిరిగిన దుస్తులు, భుజానికి జోలెతో ఓ పెద్దాయన హఠాత్తుగా మురుగేషన్ దుకాణం ముందు ప్రత్యక్షం అయ్యాడు. అతణ్ని చూసి 'బాబా ప్రత్యక్షమయ్యారు.. బాబా వచ్చేశారు' అని కేకలు పెడుతూ చుట్టుపక్కల జనాలను పిలిచాడు. మురుగేషన్ బాబా భక్తుడనే విషయం తెలుసుకాబట్టి ప్రజలు కూడా ఆయన చెప్పినట్లు ఆ పెద్దాయననే బాబా అని నమ్మారు. ఆయనను పక్కనే ఉన్న ఆలయంలోకి తీసుకెళ్లి భక్తిశ్రద్ధలతో పూజించారు. కాళ్లుకడిగి, ఆ నీళ్లను తలపై చల్లుకున్నారు. ఈ విషయంలో మీడియా సైతం ఉత్సాహాన్ని ప్రదర్శించింది. తన కలలోకి వస్తున్న బాబా ఆయనే అంటూ మురుగేషన్ మీడియాతో చెప్పాడు. అంతే, సమీపంలోని ప్రాంతాల నుంచి జనం తండోపతండాలుగా బాబాను దర్శించుకునేందుకు వచ్చారు. కానుకల రూపంలో బాబాకు దాదాపు రూ.40 వేలు ముట్టజెప్పారు. కాగా, పక్క ఊళ్ల నుంచి వచ్చినవారిలో కొందరు సదరు బాబాను ఎక్కడో చూసినట్లు తమలోతాము చర్చించుకుని చివరికి ఒక అభిప్రాయానికి వచ్చారు. అసలా పెద్దాయన బాబా కానేకాదు.. బిచ్చగాడు! కుమార పాళయం బస్టాండ్ పరిసరాల్లో కొన్నేళ్లుగా భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నాడని నిర్ధారించుకున్న తర్వాత ప్రజల భక్తి కాస్తా ఆగ్రహంగా మారింది. ముసలాయనను చెడామడా తిట్టి, మెడపట్టి ఆలయం నుంచి బయటికి గెంటేశారు. కానుకగా ఇచ్చిన రూ.40 వేలను తిరిగి లాక్కున్నారు. ఈ గందరగోళాన్ని చూసి మురుగేషన్ అవాక్కయ్యాడు. జనం ఎక్కడ తన మీద విరుచుకుపడతారో అనే భయంతో పత్తా లేకుండా పోయాడు. -
బిచ్చగాడని అన్నం పెడ్తె బ్యాగు కొట్టేశాడు
చిలకలగూడ: ఆకలితో అల్లాడుతుందని దయతో ఇంట్లోకి పిలిచి అన్నం పెడితే తృప్తిగా భోజనం చేసిన తర్వాత అదే ఇంట్లో బ్యాగును ఎత్తుకెళ్లిన సంఘటన చిలకలగూడ ఠాణా పరిధిలోని మెట్టుగూడ ఆలుగడ్డబావిలో మంగళవారం చోటు చేసుకుంది. ఆలుగడ్డబావికి చెందిన బీ.సోలమన్, దీనారాణిలు భార్యాభర్తలు. సోలమన్ చిరువ్యాపారి. మంగళవారం ఓ గర్భిణి, వికలాంగుడైన భర్త, ఇద్దరు చిన్నారులతో కలిసి భిక్షాటన చేస్తూ వీధిలోకి వచ్చారు. చిన్నారులు ఆకలితో ఏడుస్తుండడాన్ని గమనించిన దీనారాణి వారిని ఇంట్లోని అరుగుపై కూర్చోబెట్టి భోజనం పెట్టింది. భోజనం చేసిన తర్వాత వారు క్షణాల్లో అక్కడి నుంచి అదృశ్యమయ్యారు. కొద్దిసేపటి తర్వాత చూడగా ఇంట్లోని హ్యాండ్ బ్యాగ్ కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫూటేజీని పరిశీలిస్తున్నారు. -
బిచ్చగాడు.. ద మిలియనీర్..
ఇతడి పేరు పప్పూ కుమార్.. పట్నాలో బిచ్చమెత్తుకుని జీవిస్తుంటాడు.. మరి ఈ టైటిల్‌కు ఇతడికి ఏం సంబంధమనేగా మీ డౌటు. ఉంది.. పప్పూ కుమార్‌కున్న స్థిరాస్తి విలువ రూ.1.25 కోట్లు! అంతేకాదు.. అతడి బ్యాంకు ఖాతాల్లో రూ.5 లక్షలు ఎప్పుడూ మూలుగుతునే ఉంటుంది! ఇంతేనా.. రోజూ షాపుల చుట్టూ తిరుగుతూ తాను బిచ్చం అడుక్కునే వ్యాపారులకే రూ.10 లక్షల దాకా అప్పులిచ్చాడు!! రెగ్యులర్‌గా బిచ్చంతోపాటు వడ్డీ కూడా వసూలు చేసుకెళ్తూ ఉంటాడు. మీకో విషయం తెలుసా? పప్పూ యాదవ్ బీటెక్ చదివి ఇంజనీర్ కావాలనుకున్నాడు.. మరి బిచ్చగాడిలా ఎలా మారాడు.. తెలుసుకోవాలంటే.. ఓసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాల్సిందే.. పప్పూ యాదవ్ చిన్నప్పుడూ అందరిలాగే స్కూల్‌కు వెళ్లాడు. ఇంటర్ కూడా పాసయ్యాడు. గణితమంటే మక్కువ ఎక్కువ. అన్నిటికన్నా అందులోనే అతడికి 72 మార్కులు వచ్చాయి. ఇంజనీర్ కావాలనుకున్నాడు. కానీ ఓ ప్రమాదం అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. పాక్షికంగా పక్షవాతం వచ్చింది. ఆ తర్వాత తండ్రి చనిపోయాడు. ఇంట్లో వాళ్లు పప్పూను పట్టించుకోవడం మానేశారు. చివరికి గతిలేక పట్నా రైల్వేస్టేషన్లో అడుక్కోవడం మొదలుపెట్టాడు.. ఏడేళ్లు గడిచాయి.. 2015 సంవత్సరం.. ఓ రోజున.. రైల్వే పోలీసులు స్టేషన్లో బిచ్చగాళ్లను తరిమేయడం మొదలుపెట్టారు.. పప్పూ కుమార్ కదల్లేదు. భీష్మించుకుని కూర్చున్నాడు.. పోలీసులకు డౌట్ వచ్చింది. ఆరా తీశారు.. అసలు విషయం బయటపడింది.. రూపాయి రూపాయి దాచి.. అతడు ఒక్కోటి 2వేల చదరపు అడుగుల విస్తీర్ణమున్న రెండు ప్లాట్లు కొన్నాడు.. అతడికున్న 4 బ్యాంకు ఖాతాలు.. వడ్డీలకు అప్పులిస్తున్న విషయం బయటపడింది.. ఇంత డబ్బుంది కదా.. మామూ లు జీవితం జీవించమని చెప్పారు.. పప్పూ వినలేదు.. బిచ్చమెత్తుకోవడం మానలేదు. పోనీ.. ఆ పక్షవాతానికి చికిత్స చేయించుకోవచ్చు కదా అని చెబితే.. నేను చికిత్స చేయించుకుంటే.. ఇక నాకు బిచ్చమెవరు వేస్తారు అని ఎదురు ప్రశ్నించాడట. -
బెగ్గర్‌గా మారి.. రోడ్డుపక్కన సింగర్ పాటలు!
నగర జీవితమంటేనే ఉరుకులు, పరుగులతో గజిబిజీగా సాగిపోతుంటుంది. తమ చుట్టుపక్కల పరిసరాల్లో ఏం జరుగుతుందో ఆగి చూసి.. తెలుసుకొనే తీరిక ఇప్పుడు ఎవరికీ లేదు. ఎవరి పనుల్లో వారు మునుగుతూ వేగంగా సాగిపోవడమే జీవిత పరమార్థంగా మారిపోయింది. మన పరిసరాల్లో ఓ అద్భుతం జరుగుతున్నా.. ఓ అద్భుతమైన స్వరం గొంతెత్తి పాడుతున్నా.. ఆగి విని ఆస్వాదించే ఓపిక నగర జనానికి లేకపోయింది. అంతా కాలమహిమ! ఇదే విషయం తాజాగా ఓ ప్రఖ్యాత సినీ గాయకుడి విషయంలోనూ రుజువైంది. బాలీవుడ్ మధుర గాయకుడు సోను నిగమ్ ఇటీవల బిచ్చగాడి అవతారంలో ముంబైలో ప్రత్యక్షమయ్యాడు. నిత్యం రద్దీగా ఉండే ఓ కార్నర్లో రోడ్డుపక్కన హార్మోనియం పెట్టుకొని జీవిత సత్యాలను గానం చేస్తుండగా.. సోనును ఎవరు గుర్తించలేదు సరికదా! మొదట్లో ఎవరు ఒక రెండు సెకన్లు ఆగి ఆయన గాన మాధుర్యాన్ని ఆస్వాదించే ప్రయత్నించలేదు. మెల్లమెల్లగా ఒకరిద్దరు మూగి ఆయన గాన గాంధర్వాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టారు. కొందరు సంగీతప్రియులు ఆయన మధుర గానాన్ని తమ ఫోన్లలో రికార్డు చేసుకున్నారు. కొందరు డబ్బులు ఇచ్చారు. ఓ యువకుడు ముందుకొచ్చి 'నువ్వు ఏమైనా తిన్నావని' బెగ్గర్ వేషంలో ఉన్న సోను నిగమ్ ను అడిగాడు. సోను చేతిలో 12 రూపాయలు పెట్టి మౌనంగా వెనుదిరిగాడు. 'బీయింగ్ ఇండియన్' యుట్యూబ్ చానెల్‌తో కలిసి సోను నిగమ్ ఈ సామాజిక ప్రయోగాన్ని (సోషల్ ఎక్స్పెరిమెంట్) చేశారు. చివరివరకు తాను ఎవరిననే విషయాన్ని చెప్పకుండా ఆయన తన గానాన్ని కొనసాగించారు. దేశంలో ప్రముఖ సంగీత స్వరమైన సోను నిగమ్ గొంతును ఎవరు గుర్తుపట్టకపోవడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. -
బిచ్చగాడి వద్ద రూ.48 లక్షలు!
మొన్న పశ్చిమ బెంగాల్ వలసజీవికి రూ. కోటి లభించడం, నిన్న అనంతపురం జిల్లాకు చెందిన యాచకుడికి రూ.65 లక్షల లాటరీ తగలటం, ఇటీవలే దుబాయ్ లో ఓ అడుక్కునే వ్యక్తి దగ్గర భారీగా నగదు దొరకటం.. ఇవన్నీ చూస్తే 'దరిద్రుడు ఏ రేవుకి వెళ్ళిన ముళ్ల చేపే దొరుతుంది'.. అనే పాత సామెతను రివైస్ చేసుకోవాల్సిన అవసరం వచ్చినట్లు అనిపించడంలేదూ! ఇతర దేశాల సంగతి పక్కనపెడితే చట్టాలు కఠినంగా అమలయ్యే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో బెగ్గింగ్ నేరమని, ప్రధాన వీధులు, ప్రర్థనా స్థలాల్లో ఎవరైనా అడుక్కున్నట్లు కనిపిస్తే పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుంటారని తెలిసిందే. అయితే నిఘా కళ్లుగప్పి ఇంకా ఎంతోమంది యాచకత్వాన్ని కొనసాగిస్తునే ఉన్నారట యూఏఈ ప్రధాన నగరం దుబాయ్ లో. అలాంటి వాళ్లను పట్టుకునేందుకు పోలీస్ శాఖతో కలిసి దుబాయ్ మున్సిపల్ శాఖ ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నది. అలా ఇప్పటివరకు మొత్తం 59 మంది యాచకులు పట్టుబడ్డారు. వాళ్ల వివరాలు, వస్తువులను పరిశీలించిన అధికారులు ఒక యాచకుడిదగ్గరున్న సొమ్మును చూసి వాపోయారు. 'మేం పట్టుకున్న యాచకుల్లో ఒకరి దగ్గర 270,000 దినార్లు(మన కరెన్సీలో దాదాపు రూ.48 లక్షలు) లభించాయి. ఇది చాలా పెద్ద మొత్తం. స్వల్పకాలిక వీసా, వర్కింగ్ లేదా బిజినెస్ వీసాల మీద దుబాయ్ కి వచ్చే కొందరు ఇక్కడ యాచకవృత్తిలోకి దిగుతున్నారు. దుబాయ్ లో అడుక్కునేవాళ్ల సంపాదన రోజుకు రమారమి 9,000 దినార్లు ఉంటుంది. అంటే బెగ్గర్లు గంటన్నరలో 1500 దినార్లు కూడబెడతారనమాట' అంటూ దుబాయ్ లో యాచకుల సంపాదన వివరాలను వెల్లడించారు మున్సిపల్ అధికారి ఫైజల్ అల్ బదియావి. గతేడాది రంజాన్ పండుగ నాడు మసీదుల ముందు అడుక్కుంటున్న 197 మంది యాచకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వచ్చే రంజాన్ పండుగలోగా నగరంలో యాచకులు లేకుండా చేయాలన్నది తమ లక్ష్యమని ఫైజల్ చెబుతున్నారు. బెగ్గర్లతో దేశ ప్రతిష్ట దిగజారుతుందని, ఉగ్రవాద కార్యకలాపాలకు కూడా సాకుగా మారిందని అందుకే ఆ వృత్తిని యూఏఈ నిషేధించిందంటున్నారు ఫైజల్. -
అదృష్టమంటే ఈ అనంతపురం యాచకుడిదే!
'చక్రవర్తికి, వీధి బిచ్చగాడికి బంధువు అవుతానని అందీ మనీ మనీ..' అని మనీ కోసం మనిషి పడే పాట్లను వివరిస్తూ రాశాడో సినీకవి. మనీ చుట్టూ మనుషులు, మనుషుల మధ్య మనీ గాఢంగా పెనవేసుకుపోయిన ఈ కాలంలో అప్పనంగా డబ్బు సంపాదించడం తేలిక కాకపోయినప్పటికీ అదృష్టం తోడుంటే అదికూడా సాధ్యమే అనిపిస్తుంది. అనంతపురం జిల్లాకు చెందిన పొన్నయ్యది అలాంటి అదృష్టమే. బతకడం కోసం బెగ్గర్(యాచకుడి)గా మారిన అతనికి భారీ మొత్తం లాటరీలో బహుమతిగా దక్కింది. అది కూడా కేరళలో! పొన్నయ్య ప్రస్తుత నివాసం కేరళ, తమిళనాడు సరిహద్దుల్లోని వెల్లరాడ ప్రాంతంలో ఉంటున్నాడు. ఒక కాలు లేని అతను బిచ్చమెత్తుకుని బతుకీడుస్తున్నాడు. కూడబెట్టిన సొమ్ములో కొంత అనంతపురంలో ఉంటోన్న భార్యకు పంపుతాడు. మిగిలిన దానితో లాటరీ టికెట్లు కొంటాడు. రెండు రోజుల కిందట పోలీసులు వచ్చి పొన్నయ్యను స్టేషన్ కు తీసుకెళ్లారు. పోలీసులతోపాటే వచ్చిన ఓ వ్యక్తి స్టేషన్ కు వెళ్లిన తర్వాత అసలు విషయం చెప్పాడు. 'పొన్నయ్య.. నీకు లాటరీలో రూ.65 లక్షల బహుమతి వచ్చింది' అని. ఆ వ్యక్తి.. పొన్నయ్యకు లాటరీ టికెట్ అమ్మినాయన! కేరళలో ప్రభుత్వ అనుమతితో లాటరీలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి సందర్భంలో పోలీసుల ప్రమేయం ఉంటుంది కాబట్టి బహుమతి వచ్చినవాళ్లను బురిడీ కొట్టించడం అంత తేలికకాదు. అమౌంట్ కాస్త ఎక్కువ కాబట్టి పొన్నయ్య వాళ్లింటికి కబురు పెట్టారు పోలీసులు. పొన్నయ్య వాళ్ల నాన్న, అన్నయ్యలు నిన్నే అనంతపురం నుంచి కేరళకు వెళ్లారు. పొన్నయ్య అంగీకారంతో సదరు డబ్బును వాళ్లకు ఇచ్చేశారు పోలీసలు. ఈ డబ్బులతో తన పిల్లల చదువులు, ఇల్లాలి కష్టాలు గట్టెక్కుతాయని భావిస్తున్నాడు పొన్నయ్య. మొదట్లో భవన నిర్మాణ కూలీ అయిన పొన్నయ్య పని ప్రదేశంలో కిందపడి కాలు పోగొట్టుకున్నాడు. అప్పట్నుంచి పనికి వెళ్లలేకి బిక్షగాడిగా మారి ఇంటిని నెట్టుకొస్తున్నాడు. ఏపీలో బతుకు మరీ భారంగా మారడంతో కేరళకు వలస వెళ్లి అక్కడా వృత్తిని కొనసాగించాడు. ఇంత డబ్బొచ్చింది కదా, ఇక హ్యాపీగా ఇంటికి వెళతాడేమో అనుకుంటే.. 'అలా కాదు, అక్కడే ఉండి అదే వృత్తిని కొనసాగిస్తా'అని చెబుతున్నాడు పొన్నయ్య! -
'బంగారు రింగులొస్తాయని ఊహించలేదు'
గాంధీనగర్: పెద్ద మనసుండాలిగానీ పేద పిల్లలకు ఎవరైనా సాయం చేయవచ్చు. గుజరాత్‌లోని మెహసానా గ్రామానికి చెందిన ఖీంజీభాయ్ ప్రజాపతి అనే వృద్ధుడికి అలాంటి పెద్ద మనుసుంది. గ్రామంలోని పేద కుటుంబాలకు చెందిన బాలికల్లో చదువును ప్రోత్సహించేందుకు ఆ తాత ప్రతి ఏటా పాఠ్య పుస్తకాలను లేదా యూనిఫామ్స్‌ను దానం చేస్తున్నారు. గత పదేళ్లుగా ఆయన చేస్తున్న సాయం ఇదే. ఈసారి కూడా తాత పుస్తకాలు లేదా స్కూలు దుస్తులు తీసుకొస్తారని మంగళవారం నాడు పేద విద్యార్థులైన బాలికలు తమ ఇళ్ల ముందు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూశారు. కళ్లు కూడా సరిగ్గా కనపడని ఆ తాత రెండు ఊత కర్రల సాయంతో కుంటుకుంటూ వారి వద్దకు వచ్చారు. తాత భుజానున్న సంచిలో బరువైన వస్తువులేవీ కనిపించక పోవడంతో పిల్లలంతా నిరుత్సాహపడ్డారు. దగ్గరికి వచ్చిన తాత పిల్లల మొఖాలను ఆప్యాయంగా నిమిరుతూ ‘ఈసారి మీకు కొత్త బహుమతులు తీసుకొచ్చాను’ అంటూ వాటిని చూపించగానే పిల్లలు ఎక్కడలేని ఆనందంతో తాత చుట్టు గంతులేశారు. ఆ పిల్లల తల్లులు కూడా తాతా ఉదారస్వభావానికి చలించి పోయారు. రెక్కాడితేగాని డొక్కాడని తమ బతుకుల్లో పిల్లలకు బంగారు రింగులొస్తాయని ఏనాడు ఊహించలేదంటూ కుముద్ లుహారియా అనే ఓ తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. ఈసారి తాత పిల్లలకు చిన్నసైజు బంగారు చెవి పోగులను తీసుకొచ్చారు. ఒక్కోదానికి 13వందల రూపాయలు ఖర్చు పెట్టారు. తాత లక్ష్యం గురించి తెల్సిన స్థానిక నగల దుకాణం యజమాని దీపక్ షా నగలపై మూడు వేల రూపాయలను తగ్గించారు. ఇంతకు తాత డబ్బున్న ధనరాజు కాదు. భిక్షాటనపై బతికే ఒంటరి జీవి. గ్రామంలోని గుళ్లూ గోపురాలే ఆయన ఆదాయ వనరులు. గత పదేళ్లలో పేద పిల్లల పుస్తకాలు, బడి బట్టల కోసం ఆయన 80 వేల రూపాయలకు పైగా ఖర్చు పెట్టారు. తమ గ్రామంలో ఆడ పిల్లలు, ముఖ్యంగా పేదింటి పిల్లలు చదువులో బాగా వెనకబడ్డారని, వారు బాగా చదువుకొని తమ కాళ్లపై తాము నిలబడాలనేదే తన తాపత్రయమని ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ముందు తాత వ్యాఖ్యానించారు. ఆడ పిల్లల చదువుకోసమే తాను ఎక్కువ గంటలు భిక్షాటన చేస్తున్నానని, జీవించి ఉన్నంతకాలం తన లక్ష్యం ఇదేనంటూ ఆ తాత మీడియా ముందు నుంచి బిరబిర నడుచుకుంటూ భిక్షాటనకు బయల్దేరి వెళ్లారు. -
దుబాయ్ షేక్ తో పెళ్లి అని చెప్పి...
హైదరాబాద్: ఓ మహిళా బ్రోకర్ ఘరానా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుబాయ్ లోని ఒమన్ నగరానికి చెందిన గొప్ప ధనవంతుడితో పెళ్లి అని చెప్పి నమ్మించి ఓ బిచ్చగాడికి కట్టబెట్టిన కిలాడీ సాజిద్ బేగంను హైదరాబాద్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం... వరుడు అరబ్ షేక్ అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి నగరంలోని ఓ ముస్లిం కుటుంబాన్ని సాజిదా బేగం నమ్మించింది. పెళ్లి తరువాత అమ్మాయికి మంచి ఉద్యోగం కూడా అతనే చూస్తాడంటూ అరచేతిలో స్వర్గం చూపించింది. ఆమె మాటలను నమ్మి గత ఆగస్టులో తమ కూతురు(28)కి ముస్లిం సాంప్రదాయం ప్రకారం నిఖా జరిపించారు. కోటి ఆశలతో కూతుర్ని ఒమన్ కు పంపించారు. తీరా అక్కడి వెళ్లాక తను పెళ్లి చేసుకుంది ఓ బిచ్చగాడినని తెలుసుకుని నివ్వెర పోయిందా యువతి. జరిగిన మోసాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో సాజిద్ బేగం మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితురాలి తండ్రి గత నవంబరులో సాజిద్ బేగంపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. కేసు విచారణలో భాగంగా సాజిద్ బేగం ను అదుపులోకి తీసుకున్నామని దక్షిణమధ్య పోలీసులు తెలిపారు. బాధిత యువతిని ఇండియాకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. -
బిచ్చగాడే కానీ... రిచ్గాడు!
ఫొటోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు భరత్ జైన్. వయసు 49 ఏళ్లు. ముంబై వీధుల్లో తిరుగుతూ యాచన సాగిస్తుంటాడు. వృత్తిలో ఇతగాడిది దాదాపు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. ఓస్..! యాచకుడేనా అని తీసిపారేయకండి. ఇతగాడి ఆస్తి వివరాలు, ఆదాయ వివరాలు తెలుసుకుంటే, మీ కళ్లు తిరగడం ఖాయం. ముంబైలోని పరేల్ ప్రాంతంలో ఇతగాడికి రెండు ఫ్లాట్లు ఉన్నాయి. సర్కారు లెక్కల ప్రకారం వాటి విలువ రూ.80 లక్షలు. మార్కెట్ విలువ దానికి రెట్టింపు కంటే ఎక్కువే ఉంటుంది. ఈ రెండు ఫ్లాట్లపైనా అద్దె వస్తోంది. ఇవి కాకుండా, ఒక షాపును కూడా జ్యూస్ సెంటర్‌కు అద్దెకు ఇచ్చేశాడు. రోజూ ఏడెనిమిది గంటల సేపు రద్దీ కూడళ్లలో తిరుగుతూ యాచిస్తూ ఉంటాడు. యాచన ద్వారా ఇతగాడికి రోజుకు కనీసం రెండు నుంచి మూడువేల రూపాయల వరకు కలెక్షన్ ఉంటుంది. ఇతగాడి కుటుంబం ముంబైలోనే వేరేచోట చిన్నపాటి అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఇతగాడి కుటుంబంలోని మిగిలిన సభ్యులందరూ స్కూళ్లకు నోట్‌బుక్స్, స్టడీ మెటీరియల్ సరఫరా చేసే వ్యాపారం సాగిస్తుంటే, ఇతగాడు మాత్రం ఇప్పటికీ తాను మొదటి నుంచి నమ్ముకున్న యాచననే కొనసాగిస్తుండటం విశేషం. -
బెగ్గర్ల కోసం ఒక బ్యాంక్!
బెగ్గర్ల కోసం, బెగ్గర్ల చేత, బెగ్గర్లతో నిర్వహింపబడుతున్న బ్యాంక్ అది! పేరు ‘మంగళ బ్యాంక్’. బీహార్‌లోని గయలో ఉంటుంది. బహుశా ముష్టెత్తుకొనే వాళ్ల కోసం ఏర్పడిన తొలి బ్యాంక్ ఇదే కావొచ్చు. భిక్షాటన చేసి బిచ్చగాళ్లు సంపాదించుకునే మొత్తంతో ఈ బ్యాంక్‌ను నడుపుతున్నారు. దీనికి ఒక మేనేజర్, ట్రెజరర్, డెరైక్టర్లు ఉన్నారు. వీరందరూ కూడా భిక్షగాళ్లే. ప్రత్యేకంగా ఆఫీసు లేదు కానీ.. మాంఝీఅనే ఒక బిచ్చగాడి ఇంటి నుంచి ఈ బ్యాంక్ ఆపరేట్ అవుతూ ఉంటుంది. గయలో ‘మా మంగళగౌరీ మందిర్’ అని ఒక ప్రముఖ దేవాలయం ఉంది. భక్తుల తాకిడి బాగా ఉంటే ఆ ప్రాంతంలో చాలా మంది యాచకులు ఉంటారు. అనునిత్యం రద్దీగా ఉంటే ఆ ఆలయ ప్రాంగణంలో దానం చేస్తే పుణ్యం వస్తుందనే నమ్మకం ఉండటంతో వీళ్లకు బాగానే గిట్టుబాటు అవుతోంది. ఈ నేపథ్యంలో ఏడాది కిందట యాచకులంతా ఒక సొసైటీగా ఏర్పడి బ్యాంక్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో మొత్తం 40 మంది ఖాతాదారులున్నారు. వీరిలో ప్రతి ఒక్కరూ వారానికి 20 రూపాయలు చొప్పున కట్టాలి. దీంతో వారానికి దాదాపు ఎనిమిదివందల రూపాయల నిధి ఏర్పడుతుంది. అంటే నెలకు 3,200 రూపాయలు. ఇలా ఏడాదిగా నడుస్తున్న బ్యాక్ టర్నోవర్ దాదాపు 40 వేల రూపాయలకు చేరింది. ఈ డబ్బును ఖాతాదారులకు అప్పుగా ఇస్తారు. కనీసం ఎనిమిది వేల రూపాయల వరకూ రుణపరిమితి ఉంటుంది. అత్యవసరాల సమయాల్లోనే అప్పు ఇస్తారు. నెల వరకూ ఎలాంటి వడ్డీ ఉండదు. రెండో నెల నుంచి తక్కువ పర్సెంట్లోనే వడ్డీ పడుతుంది. కొన్ని టర్మ్‌లలో లోన్‌ను తీర్చేయాల్సి ఉంటుంది. దీని వల్ల తమకు చాలా ఉపయోగం కనిపిస్తోందని.. అత్యవసర సమయాల్లో ఈ బ్యాంక్ నుంచి లోన్ తీసుకొన్న యాచకులు చెబుతున్నారు. యాచకులే అయినా వీరి సంఘటిత శక్తి బాగానే ఉందనుకోవాల్సి వస్తోంది. వీరు ఇలాగే ఆ బ్యాంక్ టర్నోవర్‌ను భారీ స్థాయిలో అభివృద్ధి చేసి.. ప్రపంచానికి కొత్త ఆర్థిక పాఠాలు చెబుతారేమో చూడాలి! -
గుర్తుతెలియని యాచకుని మృతి
సంగెం (వరంగల్): అనారోగ్యంతో గుర్తుతెలియని యాచకుడు మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం ఎలుగూరు రంగంపేటలో బుధవారం జరిగింది. వివరాలు.. రైల్వే స్టేషన్లో అనారోగ్యంతో గుర్తు తెలియని యాచకుడు (65) మృతి చెందినట్లు వరంగల్ జీఆర్పీ సీఐ రవికుమార్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని మృత దేహాన్ని ఎంజీఎం మార్చురీ తరలించినట్లు ఆయన చెప్పారు. ఇంకా వివరాలు తెలియ రావాల్సి ఉంది. -
ఆ బిచ్చగాడు కోటీశ్వరుడు!
రియాద్: సౌదీ అరేబియాలో అడుక్కోవటం నిషేధం. అయితే అక్కడ అక్రమంగా ఉండటమే కాకుండా.. అరబ్ జాతీయుడైన ఓ వ్యక్తి భార్యా, ముగ్గురు పిల్లలతో కలిసి భిక్షమెత్తుకుంటూ సైతం పోలీసుల కంటపడ్డాడు. ఇంకేం.. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. జస్ట్ ఫార్మాలిటీస్ కోసమని.. విచారించడంతో పాటు సోదాలు చేసేందుకని అతడి ఇంటికి వెళ్లారు. తీరా అతడి ఇంటిని చూస్తేనే పోలీసులకు కళ్లు తిరిగిపోయాయి. విలాసవంతమైన అపార్టుమెంట్‌తో పాటు ఖరీదైన కారు కూడా ఉండటం చూసి విస్తుపోయారు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి సోదాలు చేయడంతో ఏకంగా రూ.1.80 కోట్ల విలువైన 12 లక్షల సౌదీ రియాల్స్ దొరకడంతో మరింత ఆశ్చర్యపోయారు. వీటితో పాటు ఓ గల్ఫ్ దేశంలో పెట్టుబడి పెట్టేందుకు అతడు ఇన్వెస్టర్ లెసైన్సు కూడా పొందడం చూసి ఔరా! అనుకున్నారు. చివరికి.. చట్టవ్యతిరేకంగా దేశంలో ఉండటంతోపాటు చట్ట వ్యతిరేకంగా అడుక్కున్న నేరానికిగాను కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని ఈ మేరకు ‘సౌదీ గెజిట్’ ఓ కథనంలో పేర్కొంది. అయితే ఆ కోటీశ్వర బిచ్చగాడు ఏ దేశానికి చెందినవాడు, వివరాలేంటి? అన్నది మాత్రం పోలీసులు వెల్లడించలేదు. -
ఏం షాకిచ్చాడో!
బిచ్చగాడు: అమ్మా... బిచ్చం వేయండమ్మా... సూర్యకాంతం: చేతులు ఖాళీ లేవు... బిచ్చగాడు: అలా అనకండమ్మా... ఒక్కసారి వెయ్యండి. మళ్లీ మూడు నెలల దాకా కనిపించను. సూర్యకాంతం: అదేంటి... ఎక్కడికి పోతావ్? బిచ్చగాడు: ఎండాకాలం వస్తోంది కదమ్మా... ఈ మూడు నెలలూ కొడెకైనాల్ వెళ్లి అడుక్కుంటా! పీడకల పంకజం: ఈ మధ్య బాగా పీడకలలు వస్తున్నాయి డాక్టర్! డాక్టర్: అంటే ఎలాంటి కలలు వస్తున్నాయి? పంకజం: నేను వంట చేస్తున్నట్టు, మావారు ‘ఏమే, వంటయ్యిందా’ అని కేకలు పెడుతున్నట్టు వస్తున్నాయి! -
నాడు ధర్మకర్త..నేడు యాచకుడు..
బాసర, న్యూస్‌లైన్ : ఆయన అమ్మవారి భక్తుడు.. ఆమె దర్శనం లేనిదే పచ్చి నీళ్లయినా ముట్టడు.. ఆయనతోపాటు తన కుటుంబం సరస్వతీ సేవలోనే తరించింది.. ఆలయ ధర్మకర్త అయ్యాడు.. దేవాలయ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేశాడు.. ఆలయ ఖ్యాతిని నలుదిశలా వ్యాపింప జేశాడు.. నయాపైసా కూడా ఆశించలేదు.. చివరకు విధి వక్రీకరించి అందరిని పోగొట్టుకున్నాడు.. ఉన్నవారి నిరాదరణకు గురయ్యాడు.. బాసర ఆలయం వద్ద భిక్షాటన చేస్తున్నాడు.. అతడే బాసరకు చెందిన లక్ష్మణ్! బాసరకు చెందిన లక్ష్మణ్ రెండు దశాబ్దాల క్రితం బాసర సరస్వతీ ఆలయ ధర్మకర్తగా పనిచేశారు. మాజీ ఎమ్మెల్యే గడ్డెన్న ఆలయ చైర్మన్‌గా ఉన్నకాలంలో లక్ష్మణ్‌తోపాటు మరో 12 మంది సభ్యులతో ధర్మకర్తల మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండున్నరేళ్లు ఆలయ ధర్మకర్తగా పనిచేశాడు. ఆయన హయాంలో రెండంతస్తుల ధర్మశాల, ఒక అతిథి గృహం ఏర్పాటు చేశారు. మంచినీటి సౌకర్యం కూడా కల్పించారు. మూడు నెలలకోసారి సమావేశం ఏర్పాటు చేసి భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చూసేవారు. శివరాత్రి, అమ్మవారి నవరాత్రోత్సలు, జన్మదినోత్సవాలను ఆయనే దగ్గరుండి చేయించేవారు. పదవీ ఉన్నప్పుడు నయాపైసా ఆశించకుండా ఆలయ అభివృద్ధికి పాటుపడ్డాడు. కాలక్రమేణ బాసరలో మార్పులు వచ్చాయి. ఆయన పదవీ కాలం కూడా ముగిసింది. అదే ఆలయం వద్ద భిక్షాటన పదవీ పోయిన కొన్నేళ్లకు లక్ష్మణ్ భార్య లక్ష్మి అకాల మరణం చెందింది. వీరి ఇద్దరు కొడుకులు పెద్ద విశ్వనాథ్, నగేశ్‌లతో కొన్ని రోజులు లక్ష్మణ్ ఉన్నాడు. పెద్దకొడుకు కూడా అనారోగ్యంతో చనిపోయాడు. అతని భార్య ఇద్దరు పిల్లను తీసుకుని వారి పుట్టింటికి వెళ్లింది. ఇక చిన్న కుమారుడికి పిల్లలు లేకపోవడం తండ్రిని పట్టించుకోకపోవడంతో ఆలయ అధికారులను లక్ష్మణ్ పనిఇప్పించాలని అడిగారు. ఆలయ అధికారులు మూడేళ్ల క్రితం వరకు రూ.3వేల జీతంతో ఎన్‌ఎంఆర్‌గా పనిచేశాడు. ఆరోగ్యం క్షీణించడం, పనిచేసే స్థోమత లేకపోవడంతో ఎన్ఎంఆర్ నుంచి అధికారులు తొలగించారు. ఎటూపోయే దారిలేక ఆలయం వద్దే భిక్షాటన చేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. ఎవరైనా భిక్షవేస్తే తిన్నట్లు లేకపోతే కడుపుమాడినట్టే. నెలకు రూ.500 ఇవ్వండి.. : లక్ష్మణ్ నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు. ప్రభుత్వం పింఛన్ రూ.200 ఇస్తుంది. ఇవి సరిపోవడం లేదు. మందులకే డబ్బులు అవుతున్నాయి. పనిచేయలేని స్థితిలో ఉండటంతో భిక్షాటన చేస్తున్నా. ఆలయ అధికారులు స్పందించి నెలకు రూ.500 ఇస్తే బాగుంటుంది. -
హైదరాబాద్ వీధుల్లో భిక్షగత్తెగా విద్యాబాలన్
విద్యాబాలన్.. ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోయే అద్భుతమైన నటీమణి. తన నిజజీవితంలో అచ్చమైన భారతనారిలా ఉండిపోయే విద్య.. సినిమాల విషయంలోకి వచ్చేసరికి మాత్రం పాత్ర ఎలా ఉంటే అలా మారిపోతుంది. ఘన్‌చక్కర్ సినిమాలో ఆమె బ్రహ్మాండమైన సల్వార్-కుర్తీలలో మెరిసిపోయింది. దాంతోపాటు పాశ్చాత్య దుస్తులు కూడా వేసుకుని ఫ్యాషన్‌కు కొత్త అర్థం చెప్పింది. కానీ అలాంటి విద్య... హైదరాబాద్ రోడ్ల మీద భిక్షం ఎత్తుకుంటోందంటే మీరు నమ్మగలరా? కానీ ఇది నూటికి నూరుపాళ్లు నిజం. బాలీవుడ్ నటి విద్యాబాలన్ హైదరాబాద్ నగరంలో రోడ్ల మీద భిక్షాటన చేస్తోంది. సినిమా ఆఫర్లు ఏమీ చేతిలో లేక.. ఉన్న ఆస్తులన్నీ కరిగిపోయి, సొంతూళ్లో అయితే గుర్తుపడతారేమోనని ఇక్కడికొచ్చిందని అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్లే. తాజాగా తాను నటిస్తున్న 'బాబీ జాసూస్' అనే సినిమా కోసం ఆమె ఈ కొత్త అవతారంలోకి దిగింది. హైదరాబాద్‌లోని ఓ రైల్వే స్టేషన్ బయట భిక్షగత్తె వేషం వేసుకుని నిజంగానే డబ్బులు అడుక్కునే అమ్మాయిలా కనిపించింది. బోర్న్ ఫ్రీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు నిర్మాతలు దియా మీర్జా, సాహిల్ సంఘా. ఈ సినిమా గురించి దియామీర్జా తన ట్విట్టర్ ద్వారా విద్యాబాలన్ కొత్త అవతారాన్ని బయటపెట్టింది. ఈ సినిమా 2014 మధ్యలో ఎప్పుడో విడుదల అవుతుందని భావిస్తున్నారు.