Sadhu Beggar Died In Kakinada: 2 Currency Bags Found In Beggar Room, Details Inside - Sakshi
Sakshi News home page

Money Bags In Beggar Room: యాచకుడి మృతి.. సంచుల నిండా నోట్లు చూసి మైండ్‌ బ్లాక్‌

Jun 3 2022 10:37 AM | Updated on Jun 3 2022 3:27 PM

Kakinada: Currency Bags Found At Sadhu Beggar Room - Sakshi

గుండెపోటుతో మరణించిన ఓ యాచకుడి ఇంటికి వెళ్లిన పోలీసులను మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. 

సాక్షి, కాకినాడ రూరల్:  కాకినాడలో ఓ యాచకుడు హఠాన్మరణం చెందాడు. విషయం తెలిసి వెళ్లిన పోలీసులకు మైండ్‌బ్లాక్‌  అయ్యింది. అతను ఉంటున్న గదిలో నోట్ల సంచులు బయటపడ్డాయి. కరప మండలం వేళంగిలో ఈ ఘటన జరిగింది. 

బిక్షాటన చేసే సాధువు రామకృష్ణ గుండె పోటుతో మృతి చెందాడు.  మృతుడి ఉంటున్న గదిలో రెండు సంచులు కనిపించాయి. వాటి నిండా నోట్ల కట్టలు.. చిల్లర నాణేలు ఉన్నాయి. రెవెన్యూ, పోలీసు అధిజారుల సమక్షంలో డబ్బులను లెక్కించారు గ్రామస్ధులు. మొత్తంగా సుమారు రూ.2 లక్షల దాకా బయటపడింది.  

రామకృష్ణ ఐదేళ్ల కిందట వేళంగి గ్రామానికి వచ్చాడు. జనాలకు రక్షరేకులు కడుతూ.. భిక్షాటన చేసుకుంటూ వచ్చాడు. స్థానిక చేపల మార్కెట్‌ సమీపంలో ఓ గదిలో ఉంటూ.. సమీపంలో సత్రంలో తింటూ ఉండేవాడు. గురువారం గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు.. తనికీ చేపట్టగా నోట్ల సంచులు బయటపడ్డాయి. ఈ నోట్ల కట్టల సంచులను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement