
ఫ్యాన్సీ నెంబర్లకు మార్కెట్లో డిమాండ్
అంతర్జాతీయ నాణేలు, కరెన్సీ నోట్ల ప్రదర్శన ప్రారంభం
చార్మినార్ ఆర్టీఏ ఫ్యాన్సీ నెంబర్ల మాదిరిగానే.. కరెన్సీ నోట్ల ఫ్యాన్సీ నెంబర్లకూ ప్రజల్లో క్రేజ్ ఉంది. కేవలం క్రేజ్ మాత్రమే కాదు.. ప్రత్యేకంగా ఉన్న ఫ్యాన్సీ నెంబర్లకు గణనీయమైన ఆఫర్లు.. రేట్లు ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో వీటికి ఖరీదు ఎక్కువ. పాతబస్తీ మొఘల్‌పురాలోని ఉర్దూఘర్‌లో అంతర్జాతీయ పురాతన నాణేలు, కరెన్సీ ఎగ్జిబిషన్ సోమవారం ప్రారంభమైంది.
పది లక్షల నోట్లలో ఒకటి, రెండు ఫ్యాన్సీ నోట్లు ఉంటాయని.. ఇవి అరుదుగా లభిస్తుండడంతో మార్కెట్లో డిమాండ్ ఉందన్నారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే 000786, 786786 నెంబర్లతో పాటు 444444, 666666 నెంబర్లకు భారీ డిమాండ్ ఉందన్నారు. వీటి ఖరీదు వేలల్లో ఉందని, ఏపీజే అబ్దుల్ కలాం ఆజాద్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు కొనసాగే ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 23 వరకూ కొనసాగనుందని తెలిపారు. తమ వద్ద పురాతన నాణేలు, కరెన్సీని ఎగ్జిబిషన్‌లో విక్రయించవచ్చని.. అదే విధంగా ఖరీదు చేయవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు.
నోరూరించే.. మ్యాడ్ ఓవర్ డోనట్స్
డోనట్స్ ప్రియులకు 24 రకాల ఎగ్‌లెస్ డోనట్స్ అందుబాటులోకి వచ్చాయి. సోమవారం కొత్తగూడలోని శరత్‌సిటీ క్యాపిటల్ మాల్‌లో మ్యాడ్ ఓవర్ డోనట్స్ స్టోర్‌ను ఆ సంస్థ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, సీఈఓ తారక్ భట్టాచార్య ప్రారంభించారు. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన డోనట్లలో మ్యాడ్ ఓవర్ డోనట్స్ (ఎంఓడీ) ఒకటి. బబుల్‌టీ, బ్రైనీలు, బైట్స్‌తో పాటు చేతితో తయారు చేసిన 24 రకాల ఎగ్‌లెస్ డోనట్‌లను రుచి చూడవచ్చు. పుట్టిన రోజులు, ప్రమోషన్‌లు, స్నేహితుల కలయికకు ఎంఓడీ వేదిక కానుంది. సర్కిల్ ఆఫ్ హ్యాపీనెస్‌లో చేరడానికి ఆహ్వానిస్తున్నట్లు తారక్ భట్టాచార్య ప్రకటించారు.