
గ్లోబల టాప్ చిప్‌మేకర్ ఎన్‌విడియాలో భారీ వేతనంతో ఉద్యోగం
హైదరాబాదీ కుర్రోడు బంపర్ ఆఫర్ కొట్టేశాడు. ప్రపంచ ప్రఖ్యాత చిప్ తయారీ సంస్థ ఎన్‌విడియాలో భారీ వార్షిక వేతనంతో ఉద్యోగం సంపాదించాడు. ఒకటీ రెండు కాదు ఏకంగా 3 కోట్ల రూపాయలం ప్యాకేజీతో ఉద్యోగాన్ని సంపాదించాడు. హైదరాబాద్(Hyderabad)లోని ఎల్బీనగర్ చిత్రా లేఅవుట్‌కు చెందిన గుడె సాయి దివేశ్ చౌదరి (Gude Sai Divesh Chowdary) కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. చిప్‌మేకర్ ఎన్‌విడియాలో ఉద్యోగం సాధించిన సాయిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. పట్టుదలకు, మారుపేరుగా నిలిచి, ఆత్మవిశ్వాసంతో ఉన్నత చదువు చదివిన సాయి దివేశ్ తనలాంటి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు.
దివేశ్ తండ్రి కృష్ణ మోహన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. తల్లి రమాదేవి పబ్లిక్ స్కూల్‌లో టీచర్‌గా పదేళ్ల పాటు పనిచేశారు. చిన్నప్పటినుంచీ చదువులో అద్భుత ప్రతిభ కనబరిచేవాడు సాయి దివేశ్. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు హైదరాబాద్‌లోని రమాదేవి పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నాడు.ఇంటర్‌లో అత్యుత్తమ స్కోర్ సాధించి, ఎన్ఐటీ కురుక్షేత్రలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఈ సమయంలోనే న్యూటానిక్స్ కంపెనీలో రూ.40లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. అయితే ఉన్నత చదువు చదవాలనే లక్ష్యంతో లాస్‌ఏంజెల్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో క్లౌడ్, ఏఐ టెక్నాలజీలో ఎంఎస్ పూర్తి చేశాడు. ఎన్విడియా కంపెనీలో డెవలప్‌మెంట్ ఇంజీనీర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కేవలం చదువు మాత్రమే కాదు క్రీడలు, పలు పోటీ పరీక్షల్లో ఎపుడూ ముందుండేడట. అత్యాధునిక టెక్నాలజీల్లో నైపుణ్యం పొందిన దివేశ్, ప్రస్తుతం ఏఐ ఆధారిత యాప్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాడు. విశేషమైన ప్రతిభతో, ప్రపంచ టెక్నాలజీ రంగంలో దివేశ్ సత్తా చాటుకోవాలంటూ నెటిజన్లు శుభాకాంక్షలందించారు.
కాగా 2025లో టాప్ ఏఐ చిప్ తయారీ కంపెనీల్లో టాప్‌లో ఉందీ కంపెనీ 530.7 బిలియన్ల డాలర్ల మార్కెట్ క్యాప్‌తోప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీగా అవతరించింది ఎన్‌విడియా. ఇది A100 ,H100 వంటి శక్తివంతమైన GPUలకు ప్రసిద్ధి చెందింది. ఏఐ సృష్టిస్తున్న విప్తవాన్ని దృష్టిలో ఉంచుకుని వీటిని రూపొందించింది. వివిధ అప్లికేషన్‌లలో AI మోడళ్లకు శిక్షణ ఇవ్వడం , అమలు చేయడం కోసం వీటిని వినియోగిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment