Nvidia
-
గర్ల్‌ఫ్రెండ్‌కు మాటిచ్చి! ‘సీఈవో’గానే మనువాడి..
ఎన్వీడియా సీఈఓ 'జెన్సన్ హువాంగ్' గురించి దాదాపు అందరికీ తెలుసు. అయితే ఈయన ఇటీవల హాంగ్ కాంగ్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. చదువుకునే రోజుల్లో తన భార్య 'లోరీ హువాంగ్'ను ఎలా ఆకట్టుకున్నారనే విషయాలను వెల్లడించారు.జెన్సన్ హువాంగ్ ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీలో మొదటిసారి లోరీని కలుసుకున్నప్పుడు ఆమెను ఆకట్టుకోవడానికి.. ఆమె వద్దకు వెళ్లి, మీరు నా హోంవర్క్ చూడాలనుకుంటున్నారా?.. అని అడిగినట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రతి ఆదివారం నాతో కలిసి హోంవర్క్ చేస్తే.. తప్పకుండా మంచి ర్యాంక్ తెచ్చుకుంటారు, అని వాగ్దానం చేశారు. నిజానికి అప్పుడు హువాంగ్ వయస్సు కేవలం 17, లోరీ వయస్సు 19 సంవత్సరాలు.జెన్సన్ హువాంగ్ మాటలు విన్న లోరీ.. అతన్ని తెలివైనవాడిగా భావించిందని, ఆ తరువాత ఇద్దరూ కలిసి హోంవర్క్ చేసుకునే వాళ్లమని పేర్కొన్నారు. ఆ తరువాత కొన్ని రోజులకు.. నేను 30 ఏళ్ల వయసుకే సీఈఓ అవుతానని జెన్సన్ చెప్పినట్లు వెల్లడించారు. చెప్పినట్లుగానే సీఈఓ అయ్యాను, దీంతో లోరీకి నమ్మకం కుదిరింది.సీఈఓ అయిన తరువాత ఐదేళ్లకు లోరిని పెళ్లి చేసుకున్నట్లు జెన్సన్ తెలిపారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కూతురు మాడిసన్ (ఎన్విడియాలో మార్కెటింగ్ డైరెక్టర్), కుమారుడు స్పెన్సర్ (ఎన్విడియాలో సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్). ప్రస్తుతం జెన్సన్ హువాంగ్ నికర విలువ రూ. 9 లక్షల కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది. -
ఎన్విడియాతో రిలయన్స్ జట్టు
ముంబై: అమెరికన్ టెక్ దిగ్గజం ఎన్విడియా, దేశీ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా చేతులు కలిపాయి. భారత్‌లో కృత్రిమ మేధ (ఏఐ) కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల కల్పన, ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయడంపై కసరత్తు చేయనున్నాయి. రిలయన్స్‌కి చెందిన కొత్త డేటా సెంటర్లో ఎన్విడియాకి చెందిన బ్లాక్వెల్ ఏఐ చిప్‌లను వినియోగించనున్నారు. ఎన్విడియా ఏఐ సమిట్‌లో పాల్గొన్న సందర్భంగా కంపెనీ సీఈవో జెన్సెన్ హువాంగ్, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఈ విషయాలు వెల్లడించారు. భాగస్వామ్యం కింద రూపొందించే అప్లికేషన్లను రిలయన్స్ .. భారత్‌లోని వినియోగదార్లకు కూడా అందించే అవకాశం ఉందని హువాంగ్ తెలిపారు. అయితే, ఈ భాగస్వామ్యానికి సంబంధించి పెట్టుబడులు, నెలకొల్పబోయే మౌలిక సదుపాయాల సామర్థ్యాలు మొదలైన వివరాలను వెల్లడించలేదు. ‘చిప్‌ల డిజైనింగ్‌లో భారత్‌కి ఇప్పటికే ప్రపంచ స్థాయి నైపుణ్యాలు ఉన్నాయి. ఎన్విడియా చిప్‌లను హైదరాబాద్, బెంగళూరు, పుణెలో డిజైన్ చేస్తున్నారు. ఎన్విడియాలో మూడో వంతు ఉద్యోగులు ఇక్కడే ఉన్నారు‘ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు సాఫ్ట్వేర్ సేవలతో ప్రపంచానికి ఐటీ బ్యాక్ ఆఫీస్‌గా పేరొందిన భారత్ ఇకపై అవే నైపుణ్యాలను ఉపయోగించి ఏఐ ఎగుమతి దేశంగా ఎదగవచ్చని చెప్పారు. 2024లో భారత కంప్యూటింగ్ సామర్థ్యాలు 20 రెట్లు వృద్ధి చెందుతాయని, త్వరలోనే ప్రభావవంతమైన ఏఐ సొల్యూషన్స్‌ను ఎగుమతి చేస్తుందన్నారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల్లో రెండో స్థానంలో ఉన్న ఎన్విడియాకు .. భారత్‌లో హైదరాబాద్ సహా ఆరు నగరాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. భారీ ఇంటెలిజెన్స్ మార్కెట్‌గా భారత్: అంబానీ భారత్ ప్రస్తుతం కొత్త తరం ఇంటెలిజెన్స్ సాంకేతికత ముంగిట్లో ఉందని, రాబోయే రోజుల్లో వినూత్న ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుందని ముకేశ్ అంబానీ చెప్పారు. ‘అతిపెద్ద ఇంటెలిజెన్స్ మార్కెట్లలో ఒకటిగా భారత్ ఎదుగుతుంది. మనకు ఆ సత్తా ఉంది. ప్రపంచానికి కేవలం సీఈవోలనే కాదు ఏఐ సరీ్వసులను కూడా ఎగుమతి చేసే దేశంగా భారత్ ఎదుగుతుంది‘ అని అంబానీ వ్యాఖ్యానించారు. దేశీయంగా పటిష్టమైన ఏఐ ఇన్ఫ్రా ఉంటే స్థానికంగా సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ మార్కెట్లో భారత్ కీలక దేశంగా మారగలదని ఆయన చెప్పారు. అమెరికా, చైనాలతో పాటు భారత్‌లో అత్యుత్తమ డిజిటల్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని అంబానీ చెప్పారు. డేటాను అత్యంత చౌకగా అందిస్తూ సంచలనం సృష్టించినట్లుగానే ఇంటెలిజెన్స్ విషయంలోనూ గొప్ప విజయాలతో ప్రపంచాన్ని భారత్ ఆశ్చర్యపర్చగలదని ఆయన పేర్కొన్నారు.ఇన్ఫీ, టీసీఎస్‌లతో కూడా.. భారత మార్కెట్లో కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా టెక్ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, విప్రోలతో చేతులు కలుపుతున్నట్లు హువాంగ్ తెలిపారు. ఎన్విడియా ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ ప్లాట్‌ఫాం ఆధారిత ఏఐ సొల్యూషన్స్‌ను వినియోగించుకోవడంలో క్లయింట్లకు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో తోడ్పడనున్నాయి. అలాగే ఇండస్ 2.0 అనే ఏఐ నమూనాను అభివృద్ధి చేసేందుకు ఎన్విడియా మోడల్‌ను టెక్ మహీంద్రా ఉపయోగించనుంది. అటు టాటా కమ్యూనికేషన్స్, యోటా డేటా సర్వీసెస్ వంటి సంస్థలకు ఎన్విడియా తమ హాపర్ ఏఐ చిప్‌లను సరఫరా చేయనుంది. -
ఎన్వీడియా ఏఐ చిప్.. దిగ్గజ కంపెనీలపై ప్రభావం
నేడు దిగ్గజ కంపెనీలు చాలా వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగిస్తున్నాయి. ఈ జాబితాలో ఎన్వీడియా కూడా ఉంది. సంస్థ ఏఐ ద్వారా చిప్‌లను తయారు చేయడం ప్రారంభించింది. దీంతో ప్రారంభంలో ఉత్పత్తి కొంత తక్కువగా ఉండొచ్చని, సరఫరాలలో కొంత ఆలస్యం అవ్వొచ్చని సమాచారం.ఎన్వీడియా చిప్‌ల తయారీ ఆలస్యం.. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి వాటిపైన పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. కంపెనీ తన ఫ్లాగ్షిప్ గ్రేస్ హాప్పర్ AI సూపర్‌చిప్‌ను అనుసరించి మార్చిలో.. తన బ్లాక్వెల్ ఏఐ చిప్‌లను ఆవిష్కరించింది. ఇది ఉత్పత్తిని వేగవంతం చేస్తుందని సమాచారం. ఆ తరువాత సరఫరా వేగవంతం అవుతుంది.మార్కెట్లో హాప్పర్ డిమాండ్ ఎక్కువగా ఉంది, కాబట్టి ఉత్పత్తిని వేగవంతం చేయడానికి సంస్థ శ్రమిస్తోంది. అయితే ఈ వారం మైక్రోసాఫ్ట్, మరొక ప్రధాన క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్‌కు చిప్‌ల సరఫరా ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఎన్వీడియా తెలిపింది. -
నేను చాలా టాయిలెట్లను శుభ్రం చేశాను: ఎన్వీడియా సీఈఓ
'ఒక వ్యక్తి ఎంత ఎత్తు ఎదిగినా (అభివృద్ధి చెందినా) వచ్చిన దారిని మర్చిపోకూడదు' అంటారు. దీనికి చక్కని ఉదాహరణ ఎన్వీడియా కో-ఫౌండర్ అండ్ సీఈఓ 'జెన్సన్ హువాంగ్'. ప్రస్తుతం ప్రపంచంలోనే 13వ ధనవంతుడుగా ఉన్న ఈయన ఒకప్పుడు టేబుల్స్ క్లీన్ చేసారు, గిన్నెలు కడిగారు, టాయిలెట్లను కూడా శుభ్రం చేసినట్లు తానే స్వయంగా పలు సందర్భాల్లో చెప్పుకున్నారు.జెన్సన్ హువాంగ్.. గత కొన్ని రోజులక్రితం స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో విద్యార్థులతో మాట్లాడుతూ తానూ గతంలో చేసిన పనులను గురించి వివరించారు. నేను చాలా టాయిలెట్లను శుభ్రం చేసాను, మీ అందరి కంటే ఎక్కువ టాయిలెట్లను నేను శుభ్రం చేసానని చెప్పారు. మీరు అసాధారణమైన పనులు చేయాలనుకుంటే, అది సులభం కాదని కూడా ఆయన వెల్లడించారు.హువాంగ్ ప్రపంచంలోని అతిపెద్ద చిప్‌మేకింగ్ కంపెనీకి చీఫ్‌గా ఉన్నప్పటికీ.. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. కంపెనీలో పనిచేసే ఉద్యోగుల దగ్గర కూడా చాలా వినయంగా ఉంటారు. ఇదే ఆయన విజయానికి రహస్యమని పలువురు సన్నిహితులు చెబుతారు. -
ఎన్విడియా సీఈఓ నోట.. తోటమాలి నేర్పిన పాఠం
మనిషి జీవితంలో ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉండాలి. తీక్షణంగా పరిశీలిస్తే.. ప్రకృతి కూడా మనకు ఎన్నెన్నో జీవిత సత్యాలను చెబుతుంది. నేడు ఉన్నత శిఖరాలను అధిరోహించి.. జీవితంలో ఎంతోమందికి ఆదర్శమైన వారు కూడా తమకంటే ఉన్నతులు లేదా తమకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారి దగ్గర నుంచి కొన్ని పాఠాలను నేర్చుకుని ఉంటారు. ఇటీవల ఎన్వీడియా సీఈఓ 'జెన్సన్ హువాంగ్' (Jensen Huang) ఓ తోటమాలి నుంచి తాను నేర్చుకున్న జీవిత పాఠాన్ని వెల్లడించారు.జెన్సన్ హువాంగ్ గత వారం కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై, అక్కడ ప్రసంగిస్తూ.. జపాన్‌లోని క్యోటోలో తాను సిల్వర్ టెంపుల్ సందర్శించడానికి వెళ్లినట్లు పేర్కొన్నారు. అక్కడ ఎక్కువ ఎండగా ఉంది, ఆ ఎండలో కూడా ఓ తోటమాలి అక్కడ పనిచేస్తూ కనిపించారు. ఆయన దగ్గరకు వెళ్లి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాను, ఆయన ఇక్కడ పిచ్చి మొక్కలు తొలగిస్తున్నాను. ఈ తోటకు 25 సంవత్సరాలుగా తోటమాలిగా పని చేస్తున్నాను అని ఆయన చెప్పినట్లు వెల్లడించారు.తోట పెద్దదిగా ఉంది పని చేయడానికి సాధ్యమవుతుందా అని నేను అడిగినప్పుడు.. ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పనులను సమయం కేటాయిస్తాను అని పేర్కొన్నట్లు జెన్సన్ చెప్పారు. ఆ తోటమాలి చెప్పిన మాటలు జీవితంలో విలువైన పాఠాలను నేర్పినట్లు చెప్పుకొచ్చారు.మనకు జీవితంలో ఎన్నెన్నో పనులు, వాటికి ఎన్నెన్నో ఆటంకాలు. అవన్నింటిని చూసి భయపడవకూడదు, అన్నీ చేయాల్సిన అవసరమూ లేదు. నీకు జీవితంలో ఏదైతే ముఖ్యమైందో, దేనికైతే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందో దానికి సమయాన్ని కేటాయించు. సమయం మిగిలి ఉంటే మిగిలిన పనులు చెయ్యి. తప్పకుండా సక్సెస్ సాధిస్తావన్నని ఆ తోటమాలి మాటలకు అర్థమని స్పష్టంగా తెలుస్తోంది. -
యాపిల్ ను దాటేసిన ఎన్విడియా..
-
ఎన్విడియా సరికొత్త రికార్డ్.. మైక్రోసాఫ్ట్ తరువాత..
ఎన్విడియా కంపెనీ యాపిల్‌ను అధిగమించింది.. మైక్రోసాఫ్ట్ తర్వాత రెండవ అత్యంత విలువైన పబ్లిక్ కంపెనీగా మారింది. బుధవారం నాటికి షేర్స్ 5 శాతం పెరగటం వల్ల కంపెనీ విలువ 3.004 ట్రిలియన్ డాలర్లకు చేరింది. మార్కెట్ ముగిసే నాటికి యాపిల్ (2.99 ట్రిలియన్ డాలర్స్) కంపెనీ విలువ కంటే ఎన్విడియా విలువ పెరిగింది.మైక్రోసాఫ్ట్ విలువ 3.15 ట్రిలియన్స్. దీంతో ప్రపంచంలో అత్యంత విలువైన రెండో కంపెనీగా ఎన్విడియా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 2002 చివరి వరకు ఎన్విడియా యాపిల్ కంటే విలువైన కంపెనీ. అయితే యాపిల్ కంపెనీ ఎప్పుడైతే మొదటి ఐఫోన్ విడుదల చేసిందో.. ఆ తరువాత ఎన్విడియాను అధిగమించింది.ఎన్విడియా సంస్థ యాపిల్ కంపెనీకి అధిగమించిన సందర్భంగా కంపెనీ సీఈఓ జెన్సన్ హువాంగ్ మాట్లాడుతూ.. ఏఐ యాక్సిలరేటర్లను ప్రతి సంవత్సరం అప్‌గ్రేడ్ చేయాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. బుధవారం నాటికి బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం జెన్సన్ హువాంగ్ సంపద 5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెరిగి ఏకంగా 107.4 బిలియన్లకు చేరింది.