'ఒక వ్యక్తి ఎంత ఎత్తు ఎదిగినా (అభివృద్ధి చెందినా) వచ్చిన దారిని మర్చిపోకూడదు' అంటారు. దీనికి చక్కని ఉదాహరణ ఎన్వీడియా కో-ఫౌండర్ అండ్ సీఈఓ 'జెన్సన్ హువాంగ్'. ప్రస్తుతం ప్రపంచంలోనే 13వ ధనవంతుడుగా ఉన్న ఈయన ఒకప్పుడు టేబుల్స్ క్లీన్ చేసారు, గిన్నెలు కడిగారు, టాయిలెట్లను కూడా శుభ్రం చేసినట్లు తానే స్వయంగా పలు సందర్భాల్లో చెప్పుకున్నారు.
జెన్సన్ హువాంగ్.. గత కొన్ని రోజులక్రితం స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో విద్యార్థులతో మాట్లాడుతూ తానూ గతంలో చేసిన పనులను గురించి వివరించారు. నేను చాలా టాయిలెట్లను శుభ్రం చేసాను, మీ అందరి కంటే ఎక్కువ టాయిలెట్లను నేను శుభ్రం చేసానని చెప్పారు. మీరు అసాధారణమైన పనులు చేయాలనుకుంటే, అది సులభం కాదని కూడా ఆయన వెల్లడించారు.
హువాంగ్ ప్రపంచంలోని అతిపెద్ద చిప్‌మేకింగ్ కంపెనీకి చీఫ్‌గా ఉన్నప్పటికీ.. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. కంపెనీలో పనిచేసే ఉద్యోగుల దగ్గర కూడా చాలా వినయంగా ఉంటారు. ఇదే ఆయన విజయానికి రహస్యమని పలువురు సన్నిహితులు చెబుతారు.
Comments
Please login to add a commentAdd a comment