
గ్లోబల్ చిప్ తయారీ దిగ్గజం ఎన్‌విడియాతో దేశీ ఐటీ దిగ్గజాలు విప్రో, టెక్ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్ చేతులు కలిపాయి. వివిధ పరిశ్రమలకు ఏఐ ఆధారిత విభిన్న సొల్యూషన్లు అందించే బాటలో ఎన్‌విడియాతో విడిగా భాగస్వామ్యాలకు తెరతీస్తున్నాయి. చిప్ తయారీ దిగ్గజం ప్రస్తుతం కాలిఫోర్నియాలో నిర్వహిస్తున్న జీపీయూ టెక్నాలజీ వార్షిక సదస్సు(జీటీసీ)లో భాగంగా దేశీ ఐటీ కంపెనీలు ఎన్‌విడియా టెక్నాలజీల ఆధారంగా అందిస్తున్న సేవలను ప్రదర్శిస్తున్నాయి.
ఈ సందర్భంగా ఎన్‌విడియా ఏఐ సాఫ్ట్‌వేర్ ఆధారిత అటానమస్ ఫార్మాకోవిజిలెన్స్(పీవీ) సొల్యూషన్లు టెక్ మహీంద్రా విడుదల చేసింది. వీటిని ఔషధ భద్రత నిర్వహణలో వినియోగిస్తారు. తద్వారా వేగవంత, కచ్చితమైన పీవీ ప్రాసెస్‌కు వీలుంటుంది. ఎన్‌విడియా ఏఐ ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ సహాయంతో విప్రో కొత్తతరహా ఏజెంటిక్ ఏఐ సర్వీసులను ప్రవేశపెట్టింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు తమ ప్రత్యేక ఇన్‌ఫ్రా, డేటా, వర్క్‌ఫోర్స్, బిజినెస్ నెట్‌వర్క్స్‌ను పటిష్టపరచుకోవడంతోపాటు ఏఐ సామర్థ్యాలను అభివృద్ధి, అమలు చేసేందుకు వీలుంటుంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్ తదితర రంగాలలో పౌర సేవలను భారీగా మెరుగుపరచేందుకు విప్రో ఎకోసిస్టమ్ వినియోగపడనుంది.
ఇదీ చదవండి: ఫెడ్ వడ్డీ రేట్లు యథాతథం
ఎన్‌విడియా జెట్‌సన్ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకోవడం ద్వారా ఏఐ ఆధారిత రైల్వే ట్రాక్ తనిఖీ సొల్యూషన్ ట్రాక్‌ఈఐను ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్ విడుదల చేసింది. తద్వారా రియల్ టైమ్ లోపాల గుర్తింపు, నిర్వహణలో మద్దతు తదితర ప్రపంచవ్యాప్త రైల్వే నెట్‌వర్క్‌ల భద్రతను పెంచేందుకు సహాయపడనుంది. ఎన్‌విడియా జీటీసీ 2025ను ఈ నెల 17–21 మధ్య కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లో నిర్వహిస్తోంది. ఏఐలో తాజా ఆధునికతలను ప్రదర్శించేందుకు సదస్సు ఉపపయోగపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment